ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఉన్నత విద్యకు వారధులు | integrated courses in higher education Bridges | Sakshi
Sakshi News home page

ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఉన్నత విద్యకు వారధులు

Published Thu, Apr 17 2014 3:32 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఉన్నత విద్యకు వారధులు - Sakshi

ఇంటిగ్రేటెడ్ కోర్సులు.. ఉన్నత విద్యకు వారధులు

 డిగ్రీ.. అది పూర్తయ్యాక పీజీ. సాధారణంగా ఈ రెండూ చదవాలంటే వేర్వేరు చోట్ల సాధ్యం! పైగా డిగ్రీ పూర్తయ్యాక పీజీలో చేరాలంటే.. ఏదైనా యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాయాలి. ఆ పరిస్థితి లేకుండా ఇంటర్ అర్హతతోనే డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ ఒకేచోట పూర్తిచేసే అవకాశాన్ని ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ కోర్సులు కల్పిస్తున్నాయి. వివిధ సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ఐఐటీలు ఇలాంటి కోర్సులను అందిస్తున్నాయి. బోధనా విధానంలోనూ, కరిక్యులం రూపకల్పనలోనూ నవ్యత ఉండే ఈ కోర్సులు యువతను ఆకట్టుకుంటున్నాయి.
 
 ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్/సైన్స్ డిగ్రీతో పాటు పీజీ చేయొచ్చు. లేదంటే లా, మేనేజ్‌మెంట్, కామర్స్ వంటి కోర్సుల్లో చేరొచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరి, ఆ తర్వాత మూడేళ్లకే మానేస్తే వారికి డిగ్రీ అందుతుంది. నాలుగేళ్లు చదివితే ఆనర్స్ డిగ్రీ, పూర్తిగా ఐదేళ్ల పాటు చదివితే పీజీ సర్టిఫికెట్ చేతికి వస్తుంది.
 
 కాకతీయ యూనివర్సిటీ- వరంగల్
  వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ.. కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ ఉత్తీర్ణులు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాసిన వారు కేయూ సెట్ రాసేందుకు అర్హులు.
     దరఖాస్తుకు చివరి తేదీ:
 రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 22, రూ.1000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26.
     రాత పరీక్షలు ప్రారంభం: మే 2 నుంచి
     వివరాలకు: www.kakatiya.ac.in
 
 
 ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
  గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ఐదేళ్ల కాల పరిమితితో నానో టెక్నాలజీలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.     ఐదేళ్ల కాల పరిమితి గల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) కోర్సును ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు. పాలిటెక్నిక్ డిప్లొమా, రెండేళ్ల ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారూ అర్హులే.
 వివరాలకు: www.acharyanagarjunauniversity.ac.in
 
 యోగి వేమన యూనివర్సిటీ
  కడపలోని యోగి వేమన యూనివర్సిటీ బయో టెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్; ఎర్త్ సెన్సైస్‌లో ఐదేళ్ల కాలపరిమితి గల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఒక్కో కోర్సులో 20 చొప్పున సీట్లు ఉన్నాయి. అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
     ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

 ఏప్రిల్ 25, 2014
     రూ.500 అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 26-మే 3, 2014
 (దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: మే 8)
     వివరాలకు:
     www.yogivemanauniversity.ac.in
 
 ఐఐటీలు- ఇంటిగ్రేటెడ్ కోర్సులు
  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లు.. ఇంజనీరింగ్ విద్య, పరిశోధనలో అత్యున్నత సంస్థలుగా వెలుగొందుతూ సాంకేతిక ప్రపంచానికి సుశిక్షితులైన మానవ వనరులను అందిస్తున్నాయి. ఇవి కూడా ఐదేళ్ల కాలపరిమితితో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐఐటీ-ఢిల్లీని తీసుకుంటే బయో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయో టెక్నాలజీ (బీటెక్+ఎంటెక్); కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (బీటెక్+ఎంటెక్); కెమికల్ ఇంజనీరింగ్(బీటెక్)+ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్(ఎంటెక్); కెమికల్ ఇంజనీరింగ్ (బీటెక్)+కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ కెమికల్ ఇం జనీరింగ్(ఎంటెక్);ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్(బీటెక్) +ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎంటెక్)కోర్సులను ఆఫర్ చేస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
 
 ఓయూ సెట్-2014
 ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు
     ఎంఎస్సీ- కెమిస్ట్రీ: ఈ కోర్సును ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
     ఎంఎస్సీ- ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఈ కోర్సును తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి.
     అర్హత: ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ గ్రూప్‌లతో ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు కోర్సులో ప్రవేశాలకు అర్హులు. అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు సరిపోతాయి. మిగిలిన వారికి కనీసం 50 శాతం మార్కులుండాలి.
     ఎంఏ- అప్లయిడ్ ఎకనామిక్స్: ఈ కోర్సును తెలంగాణ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది.
     అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది.
     ఎంబీఏ (ఐదేళ్లు): ఈ కోర్సును మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది.


     ఎంఏఎం: ఈ కోర్సును తెలంగాణ యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది.
     అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది.
     {పవేశ పరీక్ష: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 100 ప్రశ్నలకు గంటన్నర వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. వెర్బల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ డేటా అనాలసిస్, రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
     అప్లయిడ్ ఎకనామిక్స్: మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ ఎకనామిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలుంటాయి.     కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ: ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పాటు మ్యాథమెటిక్స్/ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
     ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 9, 2014.
     అపరాధ రుసుంతో చివరి తేదీ: మే 16, 2014.
     వెబ్‌సైట్: ouadmissions.com
 
 శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
  తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. డెరైక్ట్ అడ్మిషన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ విద్యార్థులకు 42:36:22 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు.
     దరఖాస్తుకు చివరి తేదీ: మే 10, 2014
     వివరాలకు: www.spm-vv.ac.in
 
 ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
  విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల కాల పరిమితి గల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల (బీటెక్+ఎంటెక్/ఎంబీఏ)ను ఆఫర్ చేస్తోంది.
 కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్; కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్‌వర్కింగ్; ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్; ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్; సివిల్, మెకానికల్, కెమికల్,ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.
     జియాలజీ, ఎకనామిక్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. అవి.. బీఎస్సీ+ఎంఎస్సీ జియాలజీ; బీఏ+ఎంఏ ఎకనామిక్స్.
     ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014
     వివరాలకు: www.andhrauniversity.edu.in
 
 సెంట్రల్ యూనివర్సిటీ- హైదరాబాద్
 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఐదేళ్ల కాలపరిమితితో వివిధ ఇంటిగ్రేటెడ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
 ఎంఎస్సీ కోర్సులు: మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజిక్స్, కెమికల్ సెన్సైస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టోమెట్రీ అండ్ విజన్ సెన్సైస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సెన్సైస్.


 హ్యుమానిటీస్ కోర్సులు: హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సెన్సైస్.
 ఎంఏ కోర్సులు: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.
 అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.  ప్రవేశాలకు ఏటా డిసెంబర్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఎంట్రన్‌‌స ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
     వెబ్‌సైట్: acad.uohyd.ac.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement