
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ తమ అభ్యర్థులను ప్రకటించింది. 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయించిన అధిష్టానం, 21 మందితో కూడిన జాబితాను ప్రకటించినట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కనమ్ రాజేంద్రన్ తెలిపారు. ‘‘తొలుత 21 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించాం. మరో నాలుగు శాసన సభ స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. ఎన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామనేది కాకుండా, ఎన్నిచోట్ల గెలిచామన్నదే ప్రధానమన్నారు.
అయితే పునలూర్ నుంచి, జిఎస్ జయలాల్ చత్తనూర్ నుంచి పోటీపడనున్నారు. కాగా, ఇకే విజయన్ నాదపురం బరిలో దిగారు. కాగా ఆయా అభ్యర్థులు తమకు కేటాయించిన స్థానాల నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇక కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 ఎన్నికలు జరుగనున్నాయన్న విషయం తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
చదవండి: కొత్త సీఎంపై వీడిన ఉత్కంఠ