సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఇదే సమయంలో కాకినాడ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు.
కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ చేసిన హంగామాపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోర్టు విషయమై పవన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సీపీఐ నేత మధు.. కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది. రాజకీయాల కోసం పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారా?. పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు ఉన్నారు.
రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా.. స్మగ్లింగ్ డెన్‌గా చిత్రీకరించకండి. కాకినాడ ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. పోర్టు ద్వారా అక్రమ వ్యాపారాలు జరిగితే సీబీఐ విచారణ జరపండి. పోర్టు గౌరవాన్ని దెబ్బ తీయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment