మాట్లాడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ
సాక్షి, కల్వకుర్తి రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని కేంద్ర న్యా యశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. గత ఎ న్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని గుర్తుచేశారు. ప్రజలంతా మో దీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆదివారం పట్టణంలోని జూనియర్ కళాశాల మై దానంలో బీజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నవయువభేరి బహిరంగ సభకు ఆయన ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ముందస్తు ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని, వరుసగా ఎన్నికలు జరపకుండా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానిమోదీ భావించారని ఆయన వెల్లడించారు.
బీజేపీకి అండగా నిలవండి
అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు పెద్ద తేడా లేదని, ప్రజలను మోసగించడంలో దొందూ దొందేనని విమర్శించారు. నలభై ఎనిమిది గంటల్లో ఫలితాలను తారుమారు చేస్తామని కాంగ్రెస్, టీఆర్‌ఎస్ భ్రమపడుతున్నాయని ఎద్దేవా చేశారు. బిర్యానీ, బీర్లకు లొంగిపోకుండా కమలానికి ఓటేసి కష్టాలు లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్త్రంలో కాందాన్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. వాడుపోతే వీడు, వీడుపోతే వాడు అనే విధానానికి రాష్ట్రంలో బీజేపీ అడ్డుకట్టవేయబోతుందన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో ఉన్నవారంతా ఒకరికొకరు బంధుత్వం ఉన్నవారేనని తెలిపారు.
బీజేవైఎం కార్యకర్తల భారీ బైక్‌ర్యాలీ
బీజేవైఎం నవయువభేరి బహిరంగ సభ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీపంలోని కళ్యాణ్‌నగర్ నుంచి ర్యాలీని కేంద్రమంత్రి సదానందగౌడ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, తల్లోజు ఆచారి ప్రారంభించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు భారీసంఖ్యలో వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ హైదరాబాద్ చౌరస్తా నుంచి పాలమూరు చౌరస్తా మీదుగా కళాశాల మైదానానికి చేరింది.
ఒక్కసారి ఆశీర్వదించండి
రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేసి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఉద్విగ్నభరిత, ఉర్రూతలూగించే విధంగా మాట్లాడటంతో పాటు ఒక్కసారి ఆలోచించాలని ఆచారి ఓటర్లకు కోరారు. 35ఏళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. 25ఏళ్ల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధన కోసం ఎడ్లబండి యాత్ర చేయడంతో పాటు ప్రాజెక్టు పూర్తి కోసం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రాజెక్టుల పూర్తికోసం ఉద్యమించానన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని సాధించడంలోనూ ఉద్యమించానని వివరించారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోసం వారికి అండగా ఉంటానని స్పష్టంచేశారు. కార్యకర్తలు ఆచారి మాట్లాడుతుండగా హర్షధ్వానాలు వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment