Sadananda Gouda
-
‘సీపెట్’ ప్రారంభించిన సీఎం జగన్
-
సుపరిపాలనే ధ్యేయం
సాక్షి, కల్వకుర్తి రూరల్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని కేంద్ర న్యా యశాఖ మంత్రి సదానందగౌడ అన్నారు. గత ఎ న్నికల్లో ఇచ్చిన హామీలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని గుర్తుచేశారు. ప్రజలంతా మో దీ పాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆదివారం పట్టణంలోని జూనియర్ కళాశాల మై దానంలో బీజెవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నవయువభేరి బహిరంగ సభకు ఆయన ముఖ్యఅ తిథిగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ముందస్తు ఎన్నికల పేరుతో సీఎం కేసీఆర్ అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని, వరుసగా ఎన్నికలు జరపకుండా దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధానిమోదీ భావించారని ఆయన వెల్లడించారు. బీజేపీకి అండగా నిలవండి అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు పెద్ద తేడా లేదని, ప్రజలను మోసగించడంలో దొందూ దొందేనని విమర్శించారు. నలభై ఎనిమిది గంటల్లో ఫలితాలను తారుమారు చేస్తామని కాంగ్రెస్, టీఆర్ఎస్ భ్రమపడుతున్నాయని ఎద్దేవా చేశారు. బిర్యానీ, బీర్లకు లొంగిపోకుండా కమలానికి ఓటేసి కష్టాలు లేకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్త్రంలో కాందాన్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. వాడుపోతే వీడు, వీడుపోతే వాడు అనే విధానానికి రాష్ట్రంలో బీజేపీ అడ్డుకట్టవేయబోతుందన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో ఉన్నవారంతా ఒకరికొకరు బంధుత్వం ఉన్నవారేనని తెలిపారు. బీజేవైఎం కార్యకర్తల భారీ బైక్‌ర్యాలీ బీజేవైఎం నవయువభేరి బహిరంగ సభ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణ సమీపంలోని కళ్యాణ్‌నగర్ నుంచి ర్యాలీని కేంద్రమంత్రి సదానందగౌడ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, తల్లోజు ఆచారి ప్రారంభించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు భారీసంఖ్యలో వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ హైదరాబాద్ చౌరస్తా నుంచి పాలమూరు చౌరస్తా మీదుగా కళాశాల మైదానానికి చేరింది. ఒక్కసారి ఆశీర్వదించండి రాబోయే ఎన్నికల్లో ఒక్కసారి ఆశీర్వదించి అవకాశం ఇస్తే ప్రజలకు అన్ని విధాలుగా సేవ చేసి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.ఆచారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో ఉద్విగ్నభరిత, ఉర్రూతలూగించే విధంగా మాట్లాడటంతో పాటు ఒక్కసారి ఆలోచించాలని ఆచారి ఓటర్లకు కోరారు. 35ఏళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. 25ఏళ్ల క్రితం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధన కోసం ఎడ్లబండి యాత్ర చేయడంతో పాటు ప్రాజెక్టు పూర్తి కోసం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టి ప్రాజెక్టుల పూర్తికోసం ఉద్యమించానన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని సాధించడంలోనూ ఉద్యమించానని వివరించారు. ఒక్క అవకాశం ఇస్తే ప్రజాసమస్యల పరిష్కారం కోసం వారికి అండగా ఉంటానని స్పష్టంచేశారు. కార్యకర్తలు ఆచారి మాట్లాడుతుండగా హర్షధ్వానాలు వ్యక్తంచేశారు. -
నమ్మక ద్రోహి కేసీఆర్..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కల్వకుర్తి: తెలంగాణ ప్రజ ల పట్ల కేసీఆర్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని, నాలుగున్నరేళ్ల పాలనలో ఆయన చేసిన అనైతిక పనులకు సమాధానం చెప్పాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో బీజేపీ సమరభేరి, నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నవయువ భేరి బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఎవరి ప్రయోజనాల కోసమో కేసీఆర్ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగాలని అందరూ చర్చిస్తున్న సమయంలో కేసీఆర్ ముందస్తుకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీ, పార్లమెంటుకు వేర్వేరుగా ఎన్నికలు జరగడంతో అభివృద్ధి కుంటుపడటంతో పాటు, ఎన్నికల వ్యయం కూడా పెరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో ప్రజల తో మమేకమైన కేసీఆర్, ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన తర్వాత మంత్రులతో పాటు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితతో పాటు ఒవైసీ సోదరులకు మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నారని దుయ్యబట్టారు. సచివాలయంలో కూర్చుని పాలన సాగించాల్సిన సీఎం ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారన్నారు. ఆత్మబలిదానాలతో సాధించిన తెలంగాణ కేసీఆర్ కుర్చీ కోసమా అని ప్రశ్నించారు. బీజేపీని ఆశీర్వదించండి.. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో అధికార మార్పిడిని కోరుకుంటున్నారని, బీజేపీని ఆశీర్వదిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని సదానందగౌడ పిలుపునిచ్చారు. మోదీకి దేశ ప్రధానిగా అవకాశం ఇస్తే నాలుగున్నరేళ్లలో భారత్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలన్నదే మోదీ అభిమతమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేయడంలో దొందూ దొందేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి మురళీధర్‌రావు విమర్శించారు. ఆ పార్టీలను ప్రజలు నమ్మకూడదని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో జరిగిన సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి అలాగే కల్వకుర్తి సభలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లోజు ఆచారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం.. ఈశాన్య రాష్ట్రాల్లోని త్రిపుర మాదిరిగానే వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కల్వకుర్తి సభలో సదానందగౌడ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా ప్రధాని మోదీ పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికల పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ అభివృద్ధికి అడ్డుకట్ట వేశారని విమర్శించారు. ప్రధాన మంత్రిగా మోదీ బాధ్యతలు స్వీకరించే నాటికి భారతదేశం అవినీతిలో కూరుకుపోయి ప్రపంచ దేశాల్లో తన కీర్తిని కోల్పోయిందన్నారు. నాలుగున్నరేళ్లుగా ఎలాంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు తావు లేకుండా పరిపాలన సాగించి దేశకీర్తి పతాకాలను రెపరెపలాడించారని కొనియాడారు. -
'కేసీఆర్‌పై ఆ వ్యాఖ్యలు సరికావు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు సరికావని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. చట్టప్రకారం హైకోర్టు విభజన చేయాలని కోరడం తప్పా? అని ప్రశ్నించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హైకోర్టు విభజన పూర్తైన తర్వాతే న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో కేంద్రం కావాలనే హైకోర్టు విభజనను ఆలస్యం చేస్తుందని ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. -
నా చేతులు కట్టేసి ఉన్నాయి
- ఏపీకి ప్రత్యేక హైకోర్టుపై కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ - కోర్టులో వివాదం తేలేదాకా ఏమీ చేయలేం - ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హైకోర్టు విషయంలో తన చేతులు కట్టేసి ఉన్నాయని, హైకోర్టు ఏర్పాటును కేంద్రం కీలకాంశంగా పరిగణిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ పేర్కొన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు ఏమీ చేయలేనన్నారు. ఆదివారం నల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో కలసి విలేకరులతో మాట్లాడారు. హైకోర్టుకు స్థలం, వసతులు, నిధులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాక ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటుకు ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిం చాల్సి ఉంటుందన్నారు. భూమి, ఇతర సదుపాయాలు కల్పించే బాధ్యత ఏపీ సీఎందేనని హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేశారు. ఈ అంశంపై చర్యలకు గతంలో ఏపీ సీఎం, గవర్నర్‌కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఏపీ సీఎం నుంచి సమాధానం రాలేదన్నారు. ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని, కొత్త హైకోర్టును ఏపీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని విభజన చట్టంలో ఉందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రశ్నించగా.. కేంద్రం కట్టుబడి ఉందన్నారు. -
కార్పొరేట్ బాట వద్దు
- న్యాయ విద్యార్థులకు కేంద్ర మంత్రి సదానంద గౌడ హితవు - దేశ న్యాయవ్యవస్థ మేధావులను కోల్పోతోంది - న్యాయ కళాశాలలు మెరుగుపడాల్సి ఉంది - న్యాయశాస్త్రంలో పరిశోధనలు జరపాలని సూచన - ఘనంగా నల్సార్ వర్సిటీ 13వ స్నాతకోత్సవం సాక్షి, హైదరాబాద్: న్యాయవాద విద్య పూర్తయిన తర్వాత కార్పొరేట్ ప్రపంచంలో చేరేందుకు విదేశాలకు తరలివెళ్లడం మేధోవలస లాంటిదేనని కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అభిప్రాయపడ్డారు. దీంతో దేశ న్యాయవ్యవస్థ ప్రతిభావంతులైన భావితరం న్యాయవాదులను కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ప్రతిష్టాత్మక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలేతో కలసి సదానంద గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవిద్యలో ప్రావీణ్యం పొందిన విశ్వవిద్యాలయ విద్యార్థులు కోర్టుల్లో కక్షిదారుల తరఫు వాదనలు వినిపిస్తే న్యాయవ్యవస్థకు ఎంతో మేలు చేసినట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాల కృషి ఫలితంగా న్యాయ విద్యకు, న్యాయ విద్యార్థులకు ఐఐటీ, ఐఐఎం స్థాయి గుర్తింపు లభించిందన్నారు. దేశంలోని ఇతర న్యాయ కళాశాలల పరిస్థితి ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. ఎంతో నైపుణ్యం ఉన్న నల్సార్ విద్యార్థులు విదేశాలకు తరలివెళ్లడం బాధాకరమని పేర్కొన్నారు. న్యాయ విద్యలో సమూల మార్పులకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. న్యాయ శాస్త్రంలోని అన్ని విభాగాల్లో న్యాయ విశ్వవిద్యాలయాలు పరిశోధనలు జరపాలని, కాలానుగుణంగా చట్టాల్లో మార్పులు సూచించే విధంగా పరిశోధనలు ఉండాలని సూచించారు. వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా మాట్లాడుతూ.. నల్సార్‌లో చదివేందుకు విద్యార్థులకు ఆర్థిక స్థోమత అడ్డుకాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహకారం పొందేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొదటి సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను 80 నుంచి 120కు పెంచామని తెలిపారు. విద్యార్థులకు ‘బంగారు’ పంట.. స్నాతకోత్సవంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. ఓ విద్యార్థిని ఏకంగా 10 బంగారు పతకాలు సాధించింది. మరో విద్యార్థిని 8 గోల్డ్ మెడల్స్, ఇంకో విద్యార్థిని 7 గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకున్నారు. బీఏ, ఎల్ఎల్బీ విద్యార్థిని అంజలీ రావత్ 10 గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకోగా, రూపాలి ఫ్రాన్సిస్ సామ్యూల్ 8, సాన్య సమంతాని 7, తాన్య అగర్వాల్ 4 గోల్డ్ మెడల్స్ సాధించారు. నందితా హక్సర్‌కు డాక్టరేట్.. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది నందితా హక్సర్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టపరమైన న్యాయం అందించలేని స్థితిలో దేశ న్యాయ వ్యవస్థ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ప్రజాస్వామిక దేశంగా ఉంచేందుకు, నిజై మెన ప్రజాస్వామిక విలువలను నెలకొల్ప డానికే మానవహక్కుల కార్యకర్తలు కృషి చేస్తున్నారని, పోరాడుతున్నారని పేర్కొన్నారు. నాగాలాండ్ ప్రజలపై సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం పేరుతో ఆర్మీ అకృత్యాలు, నిర్బంధాలపై 1987 నుంచి న్యాయపోరాటం చేస్తున్నా, ఇప్పటి వరకు న్యాయ స్థానాలు తీర్పులను వెలువరించలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లో ఆర్మీ జవాన్ల ముందు ఓ గర్భిణి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, 10 ఏళ్ల కిందే విచారణ పూర్తయినా తీర్పు మాత్రం రాలేదని, ఆ ఆడబిడ్డ వయస్సు ఇప్పుడు 24 ఏళ్లు అని ఆ అమానవీయ ఘటనను గుర్తుచేసుకున్నారు. -
హైకోర్టుపై సభలో సదానంద ప్రకటన
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టుపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేశారు. హైకోర్టు విభజనకు భవనాలు, క్వార్టర్స్ కావాలని, మౌలిక వసతులు సంబంధిత రాష్ట్రమే కల్పించాలన్నారు. ఏపీలో ప్రత్యేక హైకోర్టు కోసం స్థలాన్వేషణ జరుగుతుందన్నారు. ఉమ్మడి హైకోర్టుతో సంప్రదింపులు జరిపాకే నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు నిర్ణయం తీసుకుంటే కేంద్రం నోటిఫికేషన్ ఇస్తుందని, హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు విభజనపై ప్రస్తుతం ఓ పిల్ దాఖలైందని, మే 1న హైకోర్టు ఇచ్చిన తీర్పులో...హైకోర్టు ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని ఆదేశించగా, తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసిందని సదానంద అన్నారు. ఆ పిటిషన్‌పై ఆగస్టు 14న తదుపరి విచారణ జరగనుందని, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని సదానంద తెలిపారు. కాగా మంత్రి సదానంద గౌడ ప్రకటనపై టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. మంత్రి ప్రకటనలో కొత్తదనమేమీ లేదని, ప్రత్యేక హైకోర్టు కోసం అన్ని సమకూరుస్తామని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ హైకోర్టు విభజన జరగకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. -
హైకోర్టు విభజనలో మరో ట్విస్ట్
హైకోర్టు విభజన అంశం మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు తెలంగాణలోనే ఉన్నందున ఏపీ ప్రభుత్వమే మరోచోట హైకోర్టు నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని సోమవారం ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు చేయాలని, ఈ మేరకు అనువైన స్థలాన్ని ఎంచుకోవాలని సూచిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ రాసిన లేఖ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది. కొత్త హైకోర్టు ఏర్పాటుపై తీసుకుంటున్న చర్యలపై గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
హైకోర్టు విభజన చేపట్టాలి: ఎంపీ వినోద్
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టును వెంటనే విభజించాలని కరీంనగర్ ఎంపీ వినోద్ కోరారు. ఈమేరకు ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడకు ఓ లేఖ రాశారు. హైకోర్టు విభజన ప్రక్రియ ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి చొరవ చూపాలన్నారు. హైకోర్టు విభజన చేపట్టక పోవటం వల్ల రెండు రాష్ట్రాలకు అనేక సమస్యలు వస్తాయన్నారు. -
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్ తగులుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడి వివాదం మరవక ముందే మరో కేంద్రమంత్రి కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై రేప్ కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలో కార్తీక్ గౌడ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సదానంద గౌడ కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమేనని తేల్చిపారేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి...తన పని తాము చేసుకు పోతున్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌పై ఆరోపణల వ్యవహారం రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతగా ఉన్న పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. కాగా మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు కేంద్ర మంత్రులు తమ సుపుత్రుల ద్వారా ప్రముఖంగా వార్తల్లోకి నిలవటం విశేషం. -
కమిటీలతో కాలయాపన చేస్తారా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని తక్షణమే సరిచేయాలని రైల్వే మంత్రి సదానందగౌడను రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి డి మాండ్ చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్‌పై లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ మొదట తనను గెలిపించి సభలోకి పంపిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాజంపేట పార్లమెంట్ స్థానం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రైల్వే బడ్జెట్లో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను పూర్తిచేయడానికి సరిపడా నిధులు కేటాయించకుండా.. సమన్వయ కమిటీని ఏర్పాటుచేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. సమన్వయ కమిటీని నియమించడమంటే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయకుండా నాన్చడమేనన్నారు. తగినన్ని నిధులు కేటాయించి రైలుమార్గాలను పూర్తిచేయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వివరించారు. బెంగళూరు-కడప రైలుమార్గానికి కేవలం రూ.30 కోట్లే కేటాయించడం దారుణమన్నారు. 2015 నాటికే పూర్తికావాల్సిన ఆ రైలుమార్గం, నిధులు ఇలానే కేటాయిస్తూ పోతే రెండు దశాబ్దాలకు కూడా పూర్తి కాదన్నారు. కడప-బెంగళూరు రైలుమార్గానికి భారీ ఎత్తున నిధులు కేటాయించి.. యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి నుంచి మదనపల్లె, గుత్తి మీదుగా హైదరాబాద్‌కు రోజూ నడిచేలా ఎక్స్‌ప్రెస్ రైలు మంజూరు చేయాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా నందలూరు లోకోషెడ్‌ను తక్షణమే ప్రారంభించాలని కోరారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. రోజూ వేలాదిగా భక్తులు వచ్చి వెళ్లే తిరుపతి రైల్వేస్టేషన్లో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు సౌకర్యాలను తక్షణమే కల్పించాలని డిమాండ్ చేశారు. -
రైల్వే బడ్జెట్ నజరానా: రెండు రాష్ట్రాలకూ మొండిచేయి
తెలుగింటికో కమిటీ ప్రస్తుతం అమల్లో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులపై కమిటీ వేశాం.. ఆ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్న రైల్వే మంత్రి సదానంద గౌడ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు.. ఏపీకి ఏసీ డైలీ ఎక్స్‌ప్రెస్ రెండు రాష్ట్రాలకు మూడు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు మిగిలిన అంశాల్లో కనిపించని మన రాష్ట్రాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ మొండిచేయి చూపారు. ఒకట్రెండు మెరుపులు మినహా రైల్వే బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. కొన్ని కొత్త రైళ్లు ఇచ్చారు తప్పితే, మౌలిక వసతులకు సంబంధించి కొత్తగా లబ్ధి కనిపించలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రూ. 20,860 కోట్ల అంచనా వ్యయంతో 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు జరిపిన తరువాత వారి అవసరాలనుబట్టి పూర్తిచేసేందుకు యత్నిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 18 కొత్త రైల్వే మార్గాలకు సర్వే పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందినవి ఒక్కటీ లేదు. అలాగే డబ్లింగ్, గేజ్ మార్పిడి పనుల్లోనూ చోటు దక్కలేదు. రైళ్ల పొడిగింపులోనూ మన సర్వీసులేవీ లేవు. దేశవ్యాప్తంగా ఐదు జనసాధారణ్ రైళ్లు ప్రవేశపెట్టినా వాటిలోనూ అంతే. తీర్థయాత్రల కోసం ప్రవేశపెడుతున్న ప్రత్యేక రైళ్లలోనూ మన ప్రస్తావనే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల వినతులకు మోక్షం లభించలేదు. ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట ప్రత్యేక డివిజన్ ప్రతిపాదనలను రైల్వే మంత్రి పట్టించుకోలేదు. రెండు మూడేళ్ల క్రితం ప్రారంభించిన సర్వే పనులకు కూడా ఐదారు లక్షలు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అలాగే స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాల ప్రస్తావనే లేదు. దేశ రాజధానిని కలుపుతూ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఏసీ ఎక్స్‌ప్రెస్ కేటాయింపు మాత్రమే ఊరట కలిగించే అంశం. జనసాధారణ్ రైళ్లే కాదు.. ప్యాసింజర్, మెమూ, డెమూ రైళ్లలో రెండు రాష్ట్రాలకూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. రైళ్ల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులూ ఒక్కటీ లేవు. -
డాలర్ ట్రాక్‌పై మోడీ రైలు...
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే ఆపరేషన్ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవు దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 60 వేల కోట్లతో బుల్లెట్ రైలు రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ పద్ధతిలోనే {పతి ఆరు నెలలకూ రైలు చార్జీల సవరణ! ఆధునీకరణే ‘సదానందం’ మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగం గంటకు 200 కి.మీ. వరకు పెంపు కొత్తగా 58 రైళ్లు, మరో 11 రైళ్ల ప్రయాణ దూరం పొడిగింపు ఇక టికెటింగ్ ఈజీ.. కొత్త తరం ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటు రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్.. ప్రధాన స్టేషన్లలో స్థానిక ఫుడ్ కోర్టులు కొత్తగా 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం ప్రతి రైల్వే బడ్జెట్లోనూ... చార్జీలు పెరుగుతాయా? పెరగవా? అని ఎదురుచూడటం సగటు భారతీయుడి సైకాలజీ. ఈసారి ఎవ్వరికీ అలా ఎదురుచూసే చాన్సివ్వకుండా 15 రోజుల ముందే మోడీ సర్కారు భారీగా వడ్డించేసింది. ఇక బడ్జెట్లో స్పీడంతా బుల్లెట్ రైళ్లదే. కానీ వాటికి దేశీ ఇంధనం సరిపోదని రైల్వే మంత్రి ముందే చెప్పారు. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపేశారు. వీటికితోడు దేశీ కార్పొరేట్లకూ ద్వారాలు తెరిచారు. బుల్లెట్ వేగం, అందమైన స్టేషన్లు, అద్భుతమైన సౌకర్యాలు, మొబైల్‌తోనే మొత్తం ప్రయాణం, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టు... అంటూ అరచేతిలో ఆవిష్కరించిన స్వర్గానికి ఇం‘ధన’మైతే ఇప్పుడు లేదు. పెండింగ్‌లో ఎన్నో ప్రాజెక్టులున్నాయంటూ కొత్తవాటికి నో చెప్పిన రైల్వే మంత్రి... కేటాయింపులు మాత్రం గత ప్రభుత్వాల తీరులోనే విదిలించారు. ఇక ఆంధ్రప్రదేశ్... తెలంగాణ. రాష్ట్రాలు రెండయినా రాత మాత్రం మారలేదు. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పక్కనబెట్టేశారు. మరి ఈ డాలర్ డ్రీమ్స్ సాకారమవుతాయా? వేచి చూస్తేనే తెలిసేది!!