డాలర్ ట్రాక్‌పై మోడీ రైలు...
-
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే
-
ఆపరేషన్ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవు
-
దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం
-
అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 60 వేల కోట్లతో బుల్లెట్ రైలు
-
రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ పద్ధతిలోనే
-
{పతి ఆరు నెలలకూ రైలు చార్జీల సవరణ!
ఆధునీకరణే ‘సదానందం’
-
మెట్రో నగరాలను కలుపుతూ
-
హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ
-
తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగం గంటకు 200 కి.మీ. వరకు పెంపు
-
కొత్తగా 58 రైళ్లు, మరో 11 రైళ్ల ప్రయాణ దూరం పొడిగింపు
-
ఇక టికెటింగ్ ఈజీ.. కొత్త తరం ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటు
-
రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్.. ప్రధాన స్టేషన్లలో స్థానిక ఫుడ్ కోర్టులు
-
కొత్తగా 4,000 మంది మహిళా ఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం
ప్రతి రైల్వే బడ్జెట్‌లోనూ... చార్జీలు పెరుగుతాయా? పెరగవా? అని ఎదురుచూడటం సగటు భారతీయుడి సైకాలజీ. ఈసారి ఎవ్వరికీ అలా ఎదురుచూసే చాన్సివ్వకుండా 15 రోజుల ముందే మోడీ సర్కారు భారీగా వడ్డించేసింది. ఇక బడ్జెట్‌లో స్పీడంతా బుల్లెట్ రైళ్లదే. కానీ వాటికి దేశీ ఇంధనం సరిపోదని రైల్వే మంత్రి ముందే చెప్పారు. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపేశారు. వీటికితోడు దేశీ కార్పొరేట్లకూ ద్వారాలు తెరిచారు.
బుల్లెట్ వేగం, అందమైన స్టేషన్లు, అద్భుతమైన సౌకర్యాలు, మొబైల్‌తోనే మొత్తం ప్రయాణం, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టు... అంటూ అరచేతిలో ఆవిష్కరించిన స్వర్గానికి ఇం‘ధన’మైతే ఇప్పుడు లేదు. పెండింగ్‌లో ఎన్నో ప్రాజెక్టులున్నాయంటూ కొత్తవాటికి నో చెప్పిన రైల్వే మంత్రి... కేటాయింపులు మాత్రం గత ప్రభుత్వాల తీరులోనే విదిలించారు. ఇక ఆంధ్రప్రదేశ్... తెలంగాణ. రాష్ట్రాలు రెండయినా రాత మాత్రం మారలేదు. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పక్కనబెట్టేశారు. మరి ఈ డాలర్ డ్రీమ్స్ సాకారమవుతాయా? వేచి చూస్తేనే తెలిసేది!!