Railway-budget-2014
-
మెరుపులు... విరుపులు
పాతబాణీలోనే... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు సరైన నిర్ణయాలు లేవు. ధరల నియంత్రణ ఆశయంతో నిధులను కేటాయించినప్పటికీ సంచలనాత్మక మార్పులేవీ లేవు. సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు కేటాయించటం ద్వారా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వటం హర్షణీయం. ఆహార ఉత్పత్తులను ప్రోత్సహించటం ద్వారా దేశాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు నడిపేందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. సిగరెట్స్, ఖైనీలు, గుట్కాలపై పన్నులను అధిక మొత్తంలో పెంచటం మంచిది. ఆదాయపు పన్ను పరిమితిని 2లక్షలనుంచి 2.50 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 3 లక్షలకు పెంచితే బాగుండేది. పవర్ సెక్టార్‌పై పన్ను మినహాయింపు మరో పదేళ్ల పాటు పెంచటం కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు అనుకూలం. గంగానది ప్రక్షాళనకు రూ.2వేల కోట్లు కేటాయించారు. ఈ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడే అవకాశం ఉంది. - ఈ.ఆర్ .సోమయాజులు (రాంజీ ), ప్రముఖ చార్డెట్ అకౌంటెంట్ రక్షణ రంగంలో ఎఫ్‌డీఐ శాతం పెంచడమా...? రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు భవిష్యత్‌లో నష్టం కలుగుతుంది. ఈ రంగంలో పెట్టుబడుల శాతం 49 వరకు పెంచి కేంద్రం తప్పుచేస్తోంది. - గంగుల మదన్మోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, బొబ్బిలి మన రాష్ట్రానికి ప్రాధాన్యమేదీ? రాష్ట్ర విభజనతో కనీసం రాజధాని కూడా లేకుండా పోయిన మన రాష్ట్రానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. లోటుబడ్జెట్‌తో ఉన్నామని చెప్పుకుంటున్న రాష్ట్ర పాలకులు ఏమీ చేయలేకపోయారు. - జరజాపు సూరిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాలూరు పట్టణ కన్వీనర్, సాలూరు కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన బడ్జెట్ సంపన్నులకు మేలు చేసేదిగా ఉంది. పేదలకు మేలుకు బదులుగా కీడు కలిగించేదిగా ఉంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు తగ్గితే అవి వాడేది డబ్బున్నవారు కాబట్టి వారికే అది ఉపయోగపడేలా ఉంది. - మజ్జి వెంకటేష్, పట్టణాధ్యక్షులు వైఎస్సార్ సీపీ, పార్వతీపురం మోడీ సర్కారు పేదలదన్నారు... మోడీ సర్కారు పేదల సర్కారని ఊదరగొట్టారు. మరి పేదలకు ఈ బడ్జెట్ ఒరిగిందేమీ లేదు. పేదలు ఉపయోగించే పలు వస్తువులపై సుంకం పెంచడం, ధరలు పెంచడం చేసింది. ఉపాధి, ఉద్యోగాలు కల్పించి వలసలు ఆపే పరిస్థితి లేదు. - జి.ఉదయభాను, వైఎస్సార్ సీపీ నాయకులు, పార్వతీపురం ఏదీ గిరిజన యూనివర్శిటీ ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ మంజూరు చేస్తామన్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు కూడా విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ కేంద్ర బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజనకు పచ్చజెండా ఊపి, తనవంతు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పిన బీజేపీ బడ్జెట్లో చిన్నచూపే చూపింది. - వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్, సాలూరు రైతుల మాటేంటి...? ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదు. రైతుల రుణమాఫీకి మనకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. చంద్రబాబుకు మోడీ ఎలాంటి సహాయం చేసినట్లు కనిపించలేదు బడ్జెట్లో. రాష్ట్ర నిర్మాణానికి నిధులేవీ..? వేమిరెడ్డి లక్ష్మునాయుడు, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, బొబ్బిలి మోడీ సర్కారు రాష్ట్ర పునర్నిర్మాణానికి నిధులు కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశ పట్టింది. చంద్రబాబునాయుడు మోడీకి మంచి మిత్రుడేమో...? నిధులు మోడీ ఎందుకు విదల్చలేదో...? దీని వల్ల మన రాష్ట్రానికి ఇబ్బందే కదా.. ఈ బడ్జెట్ ఊహించినంత బాగోలేదు. - గోర్జ వెంకటమ్మ, ఎంపీపీ, బొబ్బిలి -
రైల్వే బడ్జెట్ వల్ల ఉపయోగం శూన్యం
విజయనగరం ఫూల్‌బాగ్ : రైల్వే బడ్జెట్ వల్ల రాష్ట్రానికి గాని జిల్లాకు గాని ఒరిగిందేమీ లేదని అఖిల భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎ. జగన్మోహనరావు అన్నారు. బడ్జెట్‌కు నిరసనగా బుధవారం సాయంత్రం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించి ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేలో దేశ వ్యాప్తంగా 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 4 వేల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామనడం అన్యాయమన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పిన మోడీ పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విజయవాడ, తదితర ప్రాంతాలకు నేరుగా ఒక్క ట్రైన్ కూడా లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి నిత్యం కూలీలు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, వారిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం నుంచి ట్రైన్ వేయాలని పలుమార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నా రు. ప్రతి ఆరు నెలలకొకసారి రైల్వే చార్జీలు పెం చేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలపై భారం పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైల్వే శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు త్రినాథ్, శ్రీరామ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.గణేష్, సరేష్, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రకు మొండిచేయి విజయనగరం ఫూల్‌బాగ్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. స్థానిక బాలగంగాధరరావు భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బడ్జెట్ వల్ల ప్రజలపై భారం పడిందన్నారు. కనీసం జిల్లా నుంచి ఒక్క రైలు కూడా కొత్తగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ దేశ, విదేశాల్లోని పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని విమర్శించారు. రైళ్లు నడిపే విభాగం మినహా మిగతా విభాగాలన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇది ఎంతమత్రం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉందని, దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఉత్తరాంధ్రకు ఎటువంటి ప్రాజెక్టులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. వీక్లీ ట్రైన్స్ (నాగావళి, బిలాస్పూర్, సమత, యశ్వంత్‌పూర్, తిరుపతి)ను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. -
ఆశల పల్లకిలో...
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో నేడు ప్రవేశపెట్టనున్న మోడీ సర్కార్ మొట్టమొదటి బడ్జెట్‌పై నగరవాసులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఈ సాధారణ బడ్జెట్లో రాజధానికి కేటాయింపులు పదిశాతం పెరుగుతాయని భావిస్తున్నారు. కరెంటు సమస్య పరిష్కారం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని, దీంతో విద్యుత్ చార్జీలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. నీటిసరఫరా సమస్యపై కూడా కేంద్రం దృష్టి సారిస్తుందని చెప్పుకొంటున్నారు. ఇక నగరంలో మరో ప్రధాన సమస్య అయిన యమునా నది పునరుద్ధరణకు మోడీ సర్కార్ తప్పకుండా ప్రాధాన్యత ఇస్తుందని ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించవచ్చని కూడా అంటున్నారు. యమునా నదిని పునరుద్ధరించాలంటే యమనా నదిలోకి విడుదల చేసే మురుగు నీటిని శుద్ధి చేయవలసి ఉంటుంది కనుక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల కోసం, సీవేజ్ సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుందని, దీనిపై మోడీ ప్రభుత్వం తప్పకుండా దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 40 శాతం మాత్రమే మురుగునీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు నగరంలో ఉన్నాయి. బడ్జెట్ తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడవచ్చని చెబుతున్నారు. చారిత్రక కట్టడాల సుందరీకరణ కూడా ప్రాధాన్యమైన అంశమే కావడంతో ఇందుకోసం కనీసం 20 కోట్ల రూపాయలనైనా కేటాయిస్తారని చెబుతున్నారు. ఢిలీ, ఎన్సీఆర్ల మధ్య రవాణా సదుపాయాల కోసం కూడా ఆశించినస్థాయిలోనే నిధులను జైట్లీ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు కూడా కేటాయింపులు పెంచవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీ ప్రాజెక్టు కోసం 1,259 కోట్లు, పోలీస్ స్టేషన్లు, గృహవసతి, కార్యాలయ భవనాల కోసం 1,790 కోట్ల రూపాయలు కేటాయించాలని ఢిల్లీ పోలీసులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. 1 కోటీ 70 లక్షల జనాభా గల ఢిల్లీలో పోలీసు బలగాలను పెంచాలని, ఇందుకోసం కొత్త నియామకాలు జరపాలని, శిక్షణ కోసం అధిక నిధులు కేటాయించాలని కూడా ఢిల్లీ పోలీసులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో ఢిల్లీ పోలీసుల డిమాండ్లు కొంతమేరైనా నెరవేరే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మోడీ సర్కార్ బడ్జెట్‌పై నగరవాసుల అంచనాలు భారీగానే ఉన్నా అరుణ్ జైట్లీ ఏమేరకు కరుణిస్తారో చూడాలి. -
‘అనుబంధం’లోనైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ: రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా, అసంతృప్తిగా ఉందన్నారు. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణలోని 29 పెండింగు ప్రాజెక్టుల విషయంలో కమిటీ నిర్ణయం తర్వాత అనుబంధ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖను కోరారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. -
రైల్వే బడ్జెట్ 2014-15 పై ప్రత్యేక చర్చ
-
కలల లోకాన్నైతే సృష్టించారు కానీ..
-
రైల్వే బడ్జెట్లో తెలుగు వారికి మొండి చెయ్యే!
-
ఊరించి.. ఉసూరుమనిపించారు
- రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన సదానందగౌడ - కడప-బెంగళూరు రైలు మార్గానికి ఒక్క పైసా విదల్చని దుస్థితి - జిల్లాలో రైల్వేజోన్, డివిజన్ ఏర్పాటుపై నోరుమెదపని గౌడ - తిరుపతికి ఒక్క కొత్త సర్వీసును కూడా మంజూరు చేయలేదు - అన్యాయంపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడంపై ప్రజాగ్రహం సాక్షి ప్రతినిధి, తిరుపతి : రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ జిల్లా ప్రజానీకాన్ని ఊరించి ఉసూరుమనిపించారు. జిల్లా సమగ్రాభివృద్ధికి ఊపిరిలూదే బెంగుళూరు-కడప, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాల కు ఒక్క పైసా నిధులను కూడా కేటాయించలే దు. చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కనిపించలేదు. రైలు మార్గాల మా ట దేవుడెరుగు.. కనీసం కొత్త రైలు సర్వీసులను కూడా జిల్లాకు మంజూరు చేయలేదు. రైల్వే బడ్జెట్ చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో ఈ ఏడాది జిల్లాకు అన్యాయం జరిగినా ఏ ఒక్క టీడీపీ ప్రజాప్రతినిధి కూడా నోరుమెదపకపోవడంపై జనం నివ్వెరపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి రైల్వే బడ్జెట్‌ను మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరాక ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో ఈ ఏడాది రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లాకు రైల్వే బడ్జెట్లో పెద్దపీట వేస్తారని ప్రగల్భాలు పలికారు. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప రైలు మార్గాలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేస్తారని చెప్పుకొచ్చారు. చిత్తూరు నుంచి పలమనేరు మీదుగా కుప్పం వరకూ కొత్త రైలుమార్గం నిర్మాణానికి సైతం రైల్వేశాఖ ఆమోదముద్ర వేస్తుందని బీరాలు పలికారు. ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైలు సర్వీసులు మంజూరు చేస్తారని స్పష్టీకరించారు. చంద్రబాబు చెప్పిన వాటిల్లో ఒక్కటి కూడా మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో ప్రకటించలేదు. పూర్తయ్యేదెన్నడో.. కడప-మదనపల్లె-బెంగళూరు రైలుమార్గాన్ని 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ మంజూరు చేసింది. రూ.రెండు వేల కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును రైల్వే, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు 2009-10 బడ్జెట్లో రైల్వేశాఖ రూ.40 కోట్లు కేటాయించింది. అప్పట్లో వైఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.40 కోట్లను కేటాయించడంతో రూ.80 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2010-11 బడ్జెట్లో రూ.56 కోట్లు, 2011-12 బడ్జెట్లో రూ.60 కోట్లను రైల్వేశాఖ కేటాయించింది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయలేదు. 259 కి.మీల పొడవున ఈ రైలుమార్గం నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం 21 కి.మీ. పొడవున చేపట్టిన రైలు మార్గం పనులు కూడా నిలిచిపోయాయి. 2013-14 బడ్జెట్లో గానీ.. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోగానీ ఈ రైలు మార్గానికి ఒక్క పైసా నిధులను కేటాయించలేదు. ఇప్పుడు మంత్రి సదానందగౌడ కూడా ఈ రైలుమార్గానికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. ఒప్పందం ప్రకారం ఈ రైలుమార్గం 2015 నాటికి పూర్తికావాలి. నిధుల కేటాయింపు ఇలానే ఉంటే.. ఈ రైలుమార్గం పూర్తికావాలంటే కనీసం రెండున్నర దశాబ్దాలు పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గాన్ని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాలని 2009-10 బడ్జెట్లో నిర్ణయించాయి. రూ.1314 కోట్ల వ్యయంతో 309 కి.మీ. ల పొడవున ఈ రైలుమార్గం నిర్మించడానికి ప్రణాళిక రూపొం దించారు. ఈ రైలు మార్గానికి 2013-14 బడ్జెట్లో కేవలం రూ.కోటి మాత్రమే కేటాయించారు. ఆ నిధులు సర్వేకు కూడా సరి పోవు. ఈ ఏడాది బడ్జెట్లో ఆ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ రైలుమార్గం మరుగునపడినట్లే లెక్క!! చంద్రబాబు వల్లెవేసిన చిత్తూరు-పలమనేరు-కుప్పం రైలుమార్గం ఊసే బడ్జెట్లో కన్పించకపోవడం గమనార్హం. కొత్త రైళ్లు ఏవీ..? రైలుమార్గానికి నిధుల విషయంలోనే కాదు.. కనీసం కొత్త రైల్వే సర్వీసులను మంజూరు చేయడంలోనూ మంత్రి సదానందగౌడ జిల్లాకు తీరని అన్యాయం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి నుంచి దేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు కొత్త రైళ్లను మంజూరు చేస్తారనే భావనను సదానందగౌడ తుంచేశారు. తిరుపతి-వారణాసి, తిరుపతి-షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాగితాలకే పరిమితమయ్యాయి.రేణిగుంటలోని కోచ్ రిపేర్ వర్క్ షాప్ సామర్థ్యాన్ని విస్తరించడంపై కూడా రైల్వే బడ్జెట్లో స్పష్టత లేదు. జిల్లాకే కాదు.. రాష్ట్రానికి అదే రీతిలో అన్యాయం జరిగింది. ఇంత అన్యాయం జరిగినా సీఎం చంద్రబాబుగానీ.. టీడీపీ ప్రజాప్రతినిధులుగానీ నోరుమెదపకపోవడం గమనార్హం. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూశానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు చేతులెత్తేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్‌డీఐల చాటున ప్రైవేటీకరణ రైల్వే మంత్రి సదానందగౌడ రైల్వేల్లో ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తున్న ట్లు చెప్పడం వెనుక రైల్వే ప్రైవేటీకరణ దాగి ఉంది. అయితే రైల్వే ఆపరేషనల్ విభాగంలో ఎఫ్‌డీఐలను మినహాయిస్తున్నట్లు చెప్పి నా రైల్వే ప్రైవేటీకరణకు ఇది శ్రీకారం చుట్టినట్టే. ఈ అంశాన్ని ఉపసంహరించుకోకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేస్తాం. - కుప్పాల గిరిధర్‌కుమార్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ సీఎం సొంత జిల్లా అంటే లెక్కలేదా..? రైల్వే బడ్జెట్లో చేసిన కేటాయింపులు చూస్తే సీఎం జిల్లా అంటే కేంద్రానికి లెక్క లేనట్లుంది. కనీసం తిరుపతి, చిత్తూరును పరిగణనలోకి కూడా తీసుకోకుండా బడ్జెట్ ప్రకటన చేయడాన్ని సీఎం కూడా సీరియస్‌గా భావించి మార్పులు చేయించాలి. సీఆర్ఎస్ అభివృద్ధి ఊసే ఎత్తకపోవడం బాధాకరం. - కారుమంచి రాజు, జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రైల్వే ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం పెండింగ్ ప్రాజెక్ట్‌లకు కమిటీ నాన్చుడుకే.. విభజన జరిగాక ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లపై ప్రత్యేక కమిటీని వేస్తున్నట్లు చెప్పడం నాన్చుడు ధోరణికే అని సామాన్యునికి కూడా అర్థమయింది. నిధులు, కొత్త రైళ్ల కేటాయింపులో తిరుపతికి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. దీన్ని రాష్ట్ర ఎంపీలు తీవ్రంగా పరిగణించాలి. - సుదర్శన్ రాజు, రైల్వే మజ్దూర్ యూనియన్ సెక్రటరీ దేశ సమగ్రత అంటే ఇదేనా? ఎన్నికలకు ముందు దేశ సమగ్రత అంటూ గొప్పలు చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో రైల్వే మంత్రి ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు రిక్తహస్తం చూప్పారు. ఇదేనా సమగ్రత అంటే? రాయలసీమకు రైల్వే జోనల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారనుకుంటే మొండిచేయి చూపారు. పీపీపీ విధానంతో ఉద్యోగులను సాగనంపడానికే ప్రాధాన్యం ఇచ్చారు. - గుండ్లూరు వెంకటరమణ, కాంగ్రెస్ జిల్లా నాయకుడు కొత్త సీసాలో పాత సారా.. బీజేపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్లే ఉంది. గతంలో రైల్వే ఉద్యోగుల కోసం కనీసం కొద్దోగొప్పో కొన్ని పథకాలైనా ప్రకటించారు. ఈ సారి అది కూడా లేకపోగా, గుంతకల్ డివిజన్‌కే బీజేపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. - కే.కళాధర్, గుంతకల్ డివిజన్ ఆర్ఎంయూ కార్యదర్శి మహిళా రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి రైల్వేలో మహిళా ప్రయాణికుల రక్షణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశగా భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేస్తామన్న ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లను తక్షణం నియమించాలి. - ఎన్.విజయలక్ష్మి, టీడీపీ మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రబాబు ఇప్పుడేం చెబుతారు కాంగ్రెస్ హయాంలో నేను రైల్వే ప్యాసింజర్స్ అమినిటీస్ కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఉన్నప్పుడే తిరుపతికి డబుల్ డెక్కర్ రైలును మంజూరు చేయించా. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు, సొంత జిల్లాకు రైల్వేలో ప్రాధాన్యం ఇప్పించుకోకపోవడంపై ప్రజలకు ఇప్పుడేం చెబుతారు? ఇది రాష్ట్ర ప్రజలకు అవమానం. - మబ్బు దేవనారాయణ రెడ్డి, మాజీ రైల్వే పీఏసీ సభ్యుడు అరచేతిలో వైకుంఠం చూపింది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి, ఇప్పుడు ప్రతి అంశంలో మోసం చేస్తోంది. ధరల బాదుడుకు బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎన్నికల అనంతరం బీజేపీ అసలు రంగు బయట పడుతోంది. - బట్టు రామారావు,ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా అధికార ప్రతినిధి చేతగానితనం చంద్రబాబు ప్రభుత్వం చేతగానితనానికి ఇదే నిదర్శనం. రైల్వే బడ్జెట్ రూపకల్పన సమయంలో చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేసింది. అప్పట్లో ప్రతి పాదనలు పంపకుండా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మూడురోజుల ముందు హడావుడిగా ప్రతిపాదనలు పంపింది. నెల రోజుల ముందే వైఎస్సార్సీపీ ఎంపీలు రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రతిపాదనలు ఇచ్చాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం మేల్కొని ఉంటే రాష్ట్రానికి.. మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. కొత్త రైలు మార్గాల నిర్మాణానికి సమన్వయ కమిటీని నియమించడం కేవలం కాలయాపన చేయడం కోసమే. ఇంత అన్యాయం జరిగినా టీడీపీ ప్రజాప్రతినిధులు నోరుమెదకపోవడంలో ఆంతర్యమేమిటో..? - పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట ఇదెక్కడి చోద్యం..? రైల్వే బడ్జెట్లో రాష్ట్రంతోపాటూ జిల్లాకు న్యాయం చేయాలని నెల కిత్రం వైఎస్సార్సీపీ ఎంపీలు అందరూ కలిసి మంత్రి సదానందగౌడ, ఆ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందించాం. న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశాం. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం స్పందించి ఉంటే.. రాష్ట్రానికి, మన జిల్లాకు ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఇప్పుడైనా చంద్రబాబు స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. చంద్రబాబు బీరాలు పలకడానికి తప్ప దేనికీ పనికిరాడన్నది మరోసారి స్పష్టమైంది. శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గానికి నిధులు, రేణిగుంట సీఆర్ఎస్ విస్తరణ, తిరుపతి నుంచి ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంజూరు చేసే వరకూ మడమ తిప్పకుండా పోరాటం చేస్తాం. - వరప్రసాద్, ఎంపీ, తిరుపతి -
ఏపీ, తెలంగాణలకు అన్యాయం: వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుక, కొత్తపల్లి గీతలతో కలిసి మేకపాటి రాజమోహనరెడ్డి పార్లమెంటు వెలుపల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తున్నామని, కమిటీ వేసి చర్చించి చేస్తామని రైల్వే మంత్రి చెప్పారు. ఆ కమిటీ ఏమిటో, ఎప్పుడు వేస్తారో..! ఈ ప్రాజెక్టుల్లో వేటిని ఎప్పుడు, ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం’’ అని అన్నారు. ‘‘విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రో కనెక్టివిటీ, విశాఖకు మెట్రో రైలు ప్రస్తావన లేదు. అనేక ఏళ్ల కిందట మంజూరై, బడ్జెట్లో ఆమోదం పొంది అమలుకు నోచుకోని ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి.నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, ఎర్రగుంట్ల-నంద్యాల, కర్నూలు-మంత్రాలయం సహా చాలా ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి ప్రస్తావనే లేదు’’ అని విమర్శించారు. -
కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీకి స్థలం అందాలి: శ్రీవాస్తవ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించిన వెంటనే కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంగళవారం రైల్ నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత బడ్జెట్ వాస్తవికతకు అనుగుణంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం రూ.5 కోట్లు కేటాయించారని చెప్పారు. నిధుల కేటాయింపు పెద్దగా సమస్య కాదని, ఫ్యాక్టరీకీ కావలసిన స్థలమే ముఖ్యమని పేర్కొన్నారు. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 125 ఎకరాల భూమిని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ తాను మాట్లాడానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకే కాకుండా రాష్ర్టంలో ఎక్కడైనా రైల్వేల అభివృద్ధికి భూములను కేటాయించడంతో పాటు, అవసరమైన నిధులు, సహాయ సహకారాలను అందజేసేందుకు సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
ఒడిశా ఒత్తిడితోనే జోన్ గల్లంతు!
సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు దాదాపు ఖాయమైనా, దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో లేకపోవడానికి ఒడిశా ప్రభుత్వం ఒత్తిడే కారణమని తెలిసింది. వాల్తేరు డివిజన్లో భాగంగా ఉన్న విశాఖపట్నం ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంది. ఇక్కడ కొత్త జోన్ ఏర్పాటు చేస్తే ఒడిశా ప్రాంతాలను వాల్తేరు డివిజన్‌ను నుంచి వేరుచేసి, తెలుగు ప్రాంతాలను మాత్రమే అందులో కొనసాగిస్తారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ డివిజన్ లేకపోతే ఆ జోన్‌కు ఆదాయం దారుణంగా పడిపోయి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రధాని నరేం ద్ర మోడీని కలిసి ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరినట్టు సమాచారం. వాల్తేరు డివిజన్‌ను వేరే చేస్తే నార్త్ కోస్ట్ జోన్ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని ఆయన ప్రధానికి చెప్పినట్లు తెలిసింది. -
ఈ రైలూ ఎల్లిపోయె..!
శ్రీకాకుళం సిటీ:బడ్జెట్ రైలులో శ్రీకాకు ళం జిల్లాకు బెర్త్ దొరకలేదు.. ఆసలు ఆ రైలు జిల్లాలో ఎక్కడా ఆగనే లేదు. గత కొన్నేళ్లుగా జిల్లావాసులకు ఇదే అనుభవం ఎదురవుతున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఏదేదో చేసేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు చేసిన ఆర్భాటంతో ఈసారి ఎంతోకొంత మేలు జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఈ ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లా ప్రజల అవసరాలు తీర్చే ఒక్క లైను గానీ, ఒక్క రైలుగానీ.. చివరికి బెర్తుల కోటా పెంపు, అదనపు హాల్టులు చిన్నపాటి కోర్కెలను సైతం తీర్చేందుకు రైల్వే మంత్రి ప్రయత్నించలేదు. ఈ బడ్జెట్లో జిల్లాకు కొంత సంబంధం ఉన్న అంశం ఒక్కటే కనిపించింది. అదే కొత్తగా ప్రతిపాదించిన విశాఖ-పరదీప్ వీక్లీ రైలు. జిల్లా మీదుగా ఇది ప్రయాణించినా వీక్లీ ఎక్స్‌ప్రెస్ అయినందున జిల్లాలో హాల్టులు ఉంటాయో లేదో తెలియదు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే వంటి కీలక రవాణా వ్యవస్థల్లో మరింత మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రాజెక్టులు అత్యావశ్యకం. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికం గా అభివృద్ధి చెందే అవకా శం కూడా ఉం టుంది. అయి తే రైల్వే మం త్రి ఈ విష యం పట్టించుకోలేదు. మన జిల్లా, రాష్ట్ర ప్రజాప్రతినిధుల నిర్లిప్తత కూడా ఈ నిర్లక్ష్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెరవేరని డిమాండ్లు రైల్వేల పరంగా జిల్లా నుంచి ఎన్నో డిమాండ్లు.. మరెన్నో ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న మత్య్సకారులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్తుంటారు. అలాగే ఒడిశా సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంతాల నుంచి రాయ్‌పూర్, భిలాయ్, తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. జిల్లా నుంచి ఈ ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. శ్రీకాకుళం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-పలాస ఈఎంయు ఇచ్ఛాపురం వరకు పొడిగింపు, పలాస-రాయగడ రైళ్లు వేయాలన్న డిమాండ్ ఉంది. కోణార్క్, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైళ్లకు నౌపడ జంక్షన్లో హాల్ట్ ఇవ్వాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇక జిల్లా మీదుగా నడుస్తున్న షిర్డీ-హౌరా, చెన్నై- షాలీమార్, తిరుపతి- సంత్రగచ్చి, చెన్నై- గువహతి, విశాఖ-దిఘా, విల్లుపురం-ఖరగ్‌పూర్, పాండిచ్చేరి- హౌరా, రామేశ్వరం-భువనేశ్వర్, హౌరామైసూర్ తదితర 9 రైళ్ల కు ఎక్కడా హాల్ట్‌లు లేవు. ఈ రైళ్లను ఆమదాలవలస, పలాసల్లో నిలపాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన గుణుపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోలేదు. కలగానే రాజాం లైను పారిశ్రామిక పట్టణంగా పేరున్న రాజాంకు ప్రధాన రైల్వేలైనుతో కలిపేలా.. పొందూరు నుంచి రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలిపోతోంది. 2011-12 బడ్జెట్లో ఈ లైను ఏర్పాటుపై సర్వే చేస్తామని ప్రస్తావించారు. అయితే ఇంతవరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు సరికదా.. కొత్త బడ్జెట్లో ఆ ఊసే లేదు. ఈ లైను నిర్మిస్తే శ్రీకాకుళం, విజ యనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం స్టేష న్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామని గత బడ్జెట్లో ప్రకటిం చినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రత్యేక కమిటీయే తారకమంత్రమా? రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెండింగు ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పి రైల్వే మంత్రి చేతులు దులుపుకొన్నారు. అన్నింటికీ అదే తారక మంత్రం అన్న ట్లు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయా లు తీసుకుంటామని తేల్చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు మేలు చేకూర్చే విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు, కొత్త రైళ్లు, ఇతర ప్రాజెక్టుల మంజూరీలన్నీ ఆ కమిటీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడ్డాయన్నది స్పష్టమైపోయింది. మొండి చెయ్యి చూపారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే మంత్రి అసంతృప్తి మిగిల్చారు. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల విషయంలోనూ మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తామని నమ్మబలి కి, ఇప్పుడు మోసం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, విశాఖ, శ్రీకాకుళం ఎంపీలు ఈ విషయంలో విఫలమయ్యారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు పలు రైల్వే ప్రాజెక్టుల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. -ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ -
మారనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు!
సాక్షి, హైదరాబాద్: అందరికీ సుపరిచితమైన... సికింద్రాబాద్- ఢిల్లీ మధ్య నడిచే ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’ పేరు మారనుంది. రైల్వే బడ్జెట్లో విజయవాడ- ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టనున్న రైలును ‘ఏపీ ఎక్స్‌ప్రెస్’గా పేర్కొన్నారు. రాష్ట్రాలు విడిపోయిన నేపథ్యంలో ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరును ఆంధ్రప్రదేశ్‌కే ఇచ్చారు. ఇక సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు ఏ పేరు పెడతారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో ఇప్పటికే రెండు రైళ్లు నడుస్తున్నాయి. కాబట్టి మరో కొత్త పేరు ఏదైనా పెడతారా? లేక తెలంగాణ, కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లలో ఒక పేరును సికింద్రాబాద్- ఢిల్లీ రైలుకు బదలాయిస్తారనే ఆనేది వేచిచూడాలి. -
రెడ్ సిగ్నల్..!
కడప అర్బన్/వైవీయూ : ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో వైఎస్ఆర్ జిల్లా రైల్వే ప్రాజెక్టులకు రెడ్‌సిగ్నల్ పడింది. జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పలు రైల్వేలైన్లు, ప్రాజెక్టులపై రైల్వే మంత్రి సదానందగౌడ ఎటువంటి కనికరం చూపలేదు. బ్రిటీష్ పాలకుల హయాంలో ఏర్పాటు చేసిన రైలు మార్గాలు మినహా జిల్లాకు మరో రైలు మార్గం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటూ చెప్పకనే చెప్పారు. నందలూరులో రైల్వేపరిశ్రమను తీసుకువస్తామని గతంలో పలుమార్లు చెప్పినా ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేసిన దాఖలాలు కనపించడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సామాన్యుడికి మేలుచేస్తాడని అందలం ఎక్కిస్తే ఓవైపు చార్జీల మోత మోగిస్తూ మరోవైపు ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్తరైలు ఇవ్వకపోవడంతో పాటు ప్రారంభమైన మార్గాలను విస్మరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కడప- బెంగుళూరు మార్గం.. కడప జిల్లా ప్రజల చిరకాలం వాంఛ అయిన కడప-బెంగుళూరు నగరాల మధ్య రైల్వేలైను ఏర్పాటు చేసేందుకు గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ. 1784 కోట్లతో అంచనాలు వేశారు. 2010లో కడపను సందర్శించిన రైల్వేశాఖ సహాయమంత్రి మునియప్ప సైతం ఈ మార్గాన్ని 5 సంవత్సరాల్లో పూర్తిచేస్తామని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించి నాలుగు సంవత్సరాలు పైగా కావస్తున్నా ఎటువంటి పురోగతి లేదు. కేవలం కడప -పెండ్లిమర్రి మధ్య 23 కిలోమీటర్ల మేర మాత్రమే రైల్వేలైను ఎర్త్పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వేలైను పనుల పట్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వ సమానభాగస్వామ్యంతో నిర్మించడానికి సిద్ధం చేశారు. 2009-10 సంవత్సరానికి రూ. 1 కోటి, 2010-11 సంవత్సరానికి రూ. 58 కోట్లు (29+29), 2011-12 సంవత్సరానికి రూ. 100 కోట్లు (50+50), 2012-13 సంవత్సరానికి రూ. 38 కోట్లు, 2013-14 సంవత్సరానికి రూ. 70 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. మొ త్తం మీద రూ. 230 కోట్లు నిధులు మాత్రమే విడుదల కావడం గమనార్హం. తాజాగా విడుదలైన ఈ బడ్జెట్లో ఎటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. అటకెక్కిన సర్వేలు... ప్రొద్దుటూరు-కంభం మధ్య 130కిలోమీటర్ల మేర రూ. 800 కోట్లతో రైలు మార్గానికి సర్వేలు చేశారు. గత బడ్జెట్లో అనుమతి లభించినా ఈ సారి నిధులు కేటాయించకపోవడంతో సర్వేదశలోనే నిలిచిపోనుంది. అదే విధంగా భాకరాపేట-గిద్దలూరు మధ్య రైల్వేమార్గం సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా నిర్మించేందుకు సర్వేచేపట్టిన సర్వేలకు సైతం నిధులు లేకపోవడంతో ముందుకువెళ్లే అవకాశం లేకపోయింది. చెదిరిన కల.. రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి కొత్తరైల్వేజోన్తో పాటు మెట్రోరైళ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం పునర్విభజన బిల్లులోని ఏ అంశాన్ని పట్టించుకోకపోవడం దారుణం. ఏపీ రైల్వే అభివృద్ధికి కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించడం పట్ల కమిటీలు అంటే విసిగిపోయిన సీమాంధ్రులు విశ్వసించడం లేదు. వారానికి ఒక్కరోజు వచ్చే రైళ్లను కూడా డైలీరైళ్లుగా మార్చకపోవడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊసేలేని ఓబులవారిపల్లె - కృష్ణపట్నం మార్గం.. ఓడల అనుసంధానానికి నిధులు విడుదల చేసిన మంత్రి ఓబులవారిపల్లె-కృష్ణపట్నం పోర్టు మార్గానికి పైసా కూడా విదల్చలేదు. వీటి మధ్య 113 కిలోమీటర్ల రైలుమార్గానికి రూ.930 కోట్లు అంచనావేశారు. దీనికోసం 2012-13లో రూ. 6 కోట్లు, 2013-14లో రూ. 96.9 కోట్లు విడుదల చేశారు. అయితే కేవలం 10 కిలోమీటర్ల ఎర్త్‌వర్క్ మాత్రమే జరగడం గమనార్హం. ఈ మార్గం సిద్ధమైతే నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లేందుకు మార్గం దగ్గరవుతుంది. కాగా కృష్ణపట్నంపోర్టు ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేసిన కేంద్రం ఓబులవారిపల్లె-కృష్ణపట్నం మార్గానికి నిధులు ఇవ్వకపోవడం శోచనీయం. ఈ మార్గానికి అధిక నిధులు ఇవ్వాల్సి ఉన్నా దీని ఊసే లేకపోవడం విచారకరం. -
రైల్వే బడ్జెట్‌పై.. నేతల అభిప్రాయాలు
ఇది పీపీపీ బడ్జెట్: వినోద్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం లో అంతా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) అన్న పదమే ఉందని, ఇది రైల్వే బడ్జెట్ అన డం కన్నా పీపీపీ బడ్జెట్ అంటే బాగుంటుందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఎద్దేవా చేశారు. ఈ విధానం గతంలోనూ విజయవంతమైన దాఖలాలు లేవన్నారు. పార్లమెంట్ సమావేశం అనంతరం విజ య్చౌక్లో మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజల సమస్యలు, రైల్వే సమస్యలు పరిష్కారంపై ఎలాంటి ప్రస్తావన లేకుండా రైల్వే బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి కమిటీ వేయడాన్ని వినోద్ తప్పుపట్టారు. రైల్వే బడ్జెట్ నిరాశపర్చింది: ఎంపీ కవిత రైల్వే బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపర్చిందని టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు రాష్ట్రాల్లో ఇచ్చే కొత్త ప్రాజెక్టులు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేటాయిస్తే సమంజసంగా ఉంటుందని, అయితే చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాత ప్రాజెక్టులను సైతం కమిటీ నివేదిక వరకు ఆగాలనడం బాధాకరమన్నారు. రెండింటికీ మొండిచెయ్యే: గుత్తా మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ స్వాతంత్య్ర చరిత్రలోనే చెత్తదిగా కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ బడ్జెట్లో మెండిచెయ్యి దక్కిందన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబు రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఏం ఒత్తిడి తెచ్చారు. మసిపూసి మారేడుకాయ చేయలేదు: కిషన్‌రెడ్డి ‘‘రైల్వే బడ్జెట్ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉంది. ఏ రాష్ట్రాన్నీ చిన్నచూపు చూడకుండా అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. గత ప్రభుత్వం లాగా మసిపూసి మారేడుగాయ చేయకుండా ప్రజలకు భద్రతతో కూడిన బడ్జెట్‌ను సిద్ధం చేయటం అభినందనీయం. 14 వేల మంది రైల్వే పోలీసుల నియామకం, 4 వేల మంది మహిళా పోలీసుల ఏర్పాటు లాంటివి దీనికి నిదర్శనం. ప్రజలంతా ఈ బడ్జెట్‌ను స్వాగతిస్తారని ఆశి స్తున్నా. అమలు చేయలేని హామీలివ్వటం కం టే... చేయదగ్గ పనులనే ప్రస్తావించటం మంచి చర్య. తెలంగాణకు రెండు సెమీ బుల్లెట్ రైళ్లను కేటాయించటం సంతోషకరం’ సాధారణ బడ్జెట్ చూశాక స్పందిస్తాం: యనమల కేంద్ర సాధారణ బడ్జెట్‌ను కూడా చూశాక తమ స్పందన తెలియచేస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రైల్వే బడ్జెట్‌పై వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బడ్జెట్‌ను రైల్వే మంత్రి చదువుతున్నప్పుడు విన్నామే తప్ప అందులో ఏమేమున్నాయో పూర్తిగా చూడలేదన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ, తెలంగాణకు సంబంధించి 29 ప్రాజెక్టులున్నాయని, వాటిపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారన్నారు. జనాకర్షణకు స్వస్తి: జేపీ జనాకర్షణ సంస్కృతికి స్వస్తి చెప్పి రవాణాలో మెరుగైన మౌలిక వసతులకు పునాది వేసేందుకు రైల్వే బడ్జెట్ ద్వారా కేంద్రం చేసిన ప్రయత్నాలు అభినందనీయమని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం దశాబ్దాకాలం పాటు అనుసరించిన తాత్కాలిక ధోరణులను విడిచిపెట్టి, ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యానికి, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ రైల్వే మంత్రి వ్యవహరించడం స్వాగతించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఆశించినట్లు లేదు: బీజేపీ ఏపీ శాఖ రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించే తీరున రైల్వే బడ్జెట్ లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు పి. విష్ణుకుమార్‌రాజు ‘సాక్షి’తో అన్నారు. బడ్జెట్ గురించి తాము ఊహిం చింది ఒకటి, జరిగింది మరొకటి అని చెప్పారు. విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేసే ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఆశించామని.. అలాం టి ప్రకటన లేకుండా పోయిందన్నారు. బడ్జెట్లో కొత్త జోను ప్రకటించకపోయినా ఇందుకు సంబంధించి రైల్వే మంత్రి త్వరలోనే ప్రకటన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తీవ్ర నిరాశ మిగిల్చింది: వామపక్షాలు కేంద్ర రైల్వే బడ్జెట్ తీవ్ర నిరాశ మిగి ల్చిందని సీపీఐ, సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణ వైపే పరుగులు తీస్తున్నట్టు కని పించిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని భావిం చినా నిరాశే మిగిలిందని చెప్పారు. విజయవాడ-న్యూఢిల్లీ మధ్య రైలు మినహా రాష్ట్రానికి బడ్జెట్లో దక్కిందేమీ లేదన్నారు. -
ఆశలు అడియాసలే..!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బడ్జెట్ రైలు పరుగులు తీసింది. కానీ తెలంగాణవైపు మళ్లకుండా వెళ్లిపోయింది. ఆశలపై నీళ్లు చల్లుతూ.. అంచనాలను తలకిందులు చేస్తూ .. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం వెక్కిరించింది. లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్‌తో రైల్వేలు మురిపించినా.. తెలంగాణకు దక్కింది మాత్రం కొన్ని వందల కోట్లే! మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ైరె ల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రకటించినవి నాలుగు రైళ్లు కాగా.. అవన్నీ వారానికోసారే(ఒక్కటి మాత్రం రెండు సార్లు) ప్రయాణికులను పలకరిస్తాయి. రెండు రైళ్లు రాష్ర్టం నుంచే ప్రారంభమవుతుండగా.. మరో రెండు మాత్రం ఈ ప్రాంతం మీదుగా వెళతాయి. తాజా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది ఇంతే! గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల కాలంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుండగా.. తాజాగా మోడీ ప్రభుత్వం అంతకంటే చిన్నచూపే చూశారు. రైల్వేల ఆర్థిక స్థితి సరిగా లేదని, పదేళ్లుగా ప్రకటించిన పథకాలకు సరిపడా నిధులు లేనందున కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేమని వారం క్రితమే ఆయన కుండబద్దలు కొట్టినా.. అంతకుమించిన రీతిలో తెలంగాణ ను నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకున్నా.. ఇప్పటికే మొదలైన పనులకు నిధుల కేటాయింపు. కీలక మార్గాల్లో డబ్లింగ్ పనుల పూర్తి, కొత్త రైళ్లు, ఉన్నవాటి నిడివి పొడగింపు తదితరాల విషయంలో రాష్ర్ట ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆది నుంచీ రైల్వే మార్గాల విషయంలో బాగా వెనకబడి ఉన్నందున.. కొత్త రాష్ర్టంగా ఏర్పడినందున ప్రోత్సాహకరంగా నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇవ్వకుండా.. పాతవాటినే పూర్తి చేయాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరారు. కానీ రైల్వే మంత్రి సదానంద గౌడ ఇవేవీ పట్టించుకోలేదు. ప్రాజెక్టులు సరే... రైళ్లేవి? గత బడ్జెట్లో 11, అంతకుముందు 15, ఆపైయేడు 17.. ఇలా దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు వచ్చాయి. వాటిని చూసే ప్రజలు పెదవి విరిచారు. అలాంటిది ఈసారి ఆ స్థాయిలో కూడా కొత్త రైళ్లను కేటాయించలేదు. కేవలం నాలుగు ైరె ళ్లను మాత్రమే ప్రకటించారు. ఒకటి హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్. ఇది వారానికి ఒక్కసారే తిరుగుతుంది. ప్రీమియం రైలు కావడంతో దీని టికెట్ రేట్లు పేలిపోతాయి. వెరసి ఇది ఫ్రీక్వెన్సీ, టికెట్ ధరల పరంగా ఏమాత్రం అనుకూలం కాదు. కాజీపేట-ముంబై మధ్య మరో రైలును ప్రకటించారు. అది కూడా వారానికి ఒక్క రోజే నడుస్తుంది. ఇవి కాకుండా తెలంగాణ మీదుగా వెళ్లేవి మరో రెండున్నాయి. వారానికోరోజు నడిచే జైపూర్-మధురై ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌తో పాటు వారానికి రెండు రోజులు నడిచే అహ్మదాబాద్-చెన్నై (వయా వసాయ్ రోడ్డు) ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రం ప్రకటించింది. ఇవి కూడా ప్రజలకు అంతగా ఉపయోగపడేవి కావు. సెమీ బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లేదెన్నడు? హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను ఆధునీకరించి.. హైస్పీడ్ సెమీ బుల్లెట్ రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇందుకు లైన్ల పటుత్వాన్ని బాగా మెరుగుపరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్లో ఇందుకు ప్రతిపాదించింది కేవలం రూ. 100 కోట్లు. అర్థం కాని కమిటీ.. అంతుచిక్కని ఆలోచన! ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనను కమిటీకి అప్పగిస్తామనడం గందరగోళంగా ఉంది. ఆ కమిటీ ఏంటో, దానికి పెండింగు ప్రాజెక్టుల బాధ్యత ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటో అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల ఏర్పాటును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో గతంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీలలో 29 పెండింగ్ (పనులు కొనసాగుతున్నవి) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఈ ప్రాజెక్టుల విషయం తేల్చే బాధ్యతను ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగిస్తున్నామని, అందులో రైల్వే అధికారులతోపాటు రెండు రాష్ట్రాల అధికారులుంటారని, తాను స్వయంగా వారితో చర్చిస్తానని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. విభజన సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఐదుగురు రైల్వే అధికారులు తప్ప ఇరు రాష్ట్రాల ప్రతినిధులు లేరు. మరి మంత్రి చెప్పేది అదే కమిటీనా, వేరే కమిటీనా అన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ఎంఎంటీఎస్ది నత్తనడకే! ఎంఎంటీఎ స్ రెండో దశకు ఈసారి కూడా మొండిచేయే ఎదురైంది. స్మార్ట్ సిటీ ఫార్ములాను కేంద్రం సిద్ధం చేసి న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశించారు. కానీ కేవలం రూ. 20 కోట్లతోనే కేంద్రం సరిపెట్టింది. దీంతో రైల్వే శాఖ ఇప్పటివరకు కేటాయించిన నిధుల మొత్తం రూ. 40 కోట్లకు చేరుకోగా రాష్ట్రప్రభుత్వం వాటాగా రూ. 80 కోట్లు ఇచ్చింది. రైల్వే నుంచి రూ. 60 కోట్లు వస్తే పనులు వేగిరమయ్యేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల కంటే అందంగా తీర్చిదిద్దాలంటూ ఇటీవల స్వయంగా ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో... సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రాజెక్టుకు నిధులు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ బడ్జెట్లో దాని ఊసే లేదు. -
రైల్వే బడ్జెట్.. అన్నింటికీ కలిపి రూ.473.28 కోట్లే..
కొత్త లైన్లు, డబ్లింగ్, గేజ్ మార్పిడి.. తదితర పనుల కోసం ప్రణాళికా వ్యయం కింద సుమారు రూ. 473.28 కోట్లు మాత్రమే కేటాయించారు. అందులో స్వర్ణ చతుర్భుజి, పోర్టుల అనుసంధానం ప్రాజెక్టుల అమలుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) అయిన రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అమలు చేస్తున్న ప్రాజెక్టులనూ చూపించారు. ఆర్వీఎన్ఎల్ నిధులు సమకూర్చుకోవడంలో రైల్వే శాఖ అన్ని రకాలుగా సహకరిస్తుంది. కానీ ప్రాజెక్టుల వారీగా నేరుగా నిధులు కేటాయించదు. ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో పనుల కోసం రైల్వే కేటాయించిన నిధులు సుమారు రూ.152.28 కోట్లే. 142 కిలోమీటర్ల పొడవైన కంభం-ప్రొద్దుటూరు కొత్త లైన్‌కు కేవలం రూ. 10 లక్షలు కేటాయించారు. మరీ కంటితుడుపు కేటాయింపులకు ఇదో ఉదాహరణ. మరికొన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి.. * కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సొంత మండలం వెంకటాచలం మీదు గా కృష్ణపట్నం వరకు కొత్త రైల్వే లైన్ (ఆర్వీఎన్ఎల్ ప్రాజెక్టు)కు బడ్జెట్లో రూ. 208 కోట్లు కేటాయించారు. ఓబుళవారిపల్లె - వెంకటాచలం మీదుగా కృష్ణపట్నం పోర్టు వరకు ఈ లైన్ నిర్మిస్తారు. * కడప - బెంగళూరు రైల్వే లైన్ (255.4 కిలోమీటర్లు)లో పెండ్లిమర్రి వరకు నిర్మాణం పూర్తయింది. ఇందుకు రూ.210 కోట్లు ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఈసారి బడ్జెట్లో కేవలం రూ.30 కోట్లు కేటాయించారు. రాయలసీమలో సరకు రవాణాకు, ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టును అప్రాధాన్య కోటాలో వేశారు. * కదిరి- పుట్టపర్తి, కాకినాడ - నిజాంపట్నం ఓడరేవు క్తొత రైల్వే మార్గాలకు నిధుల కేటాయింపులు లేవు. * కొండపల్లి - కొత్తగూడెం రైల్వే లైన్ నిర్మాణానికి రూ.611 కోట్లు అవసరమైతే రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. * 2006లో ఆమోదముద్ర వేసిన జగ్గయ్యపేట - మల్లెలచెరువు లైను నిర్మాణానికి రూ.60 కోట్లే కేటాయించారు. ఇంకా రూ.100 కోట్లు అవసరం. * కొవ్వూరు- భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 912 కోట్లు అవసరం కాగా రూ.10 కోట్లు కేటాయించారు. * గూడూరు-దుగరాజపట్నం రైల్వే లైను (41.55కిలోమీటర్లు)కు రూ. 272 కోట్లు అవసరం కాగా రూ. 5 కోట్లతో సరిపెట్టారు * నంద్యాల -ఎర్రగుంట్ల మార్గానికి (126 కిలోమీటర్లు) రూ.80 కోట్లు ఇచ్చారు. * కాకినాడ - పిఠాపురం లైనుకు (21.5 కిలోమీటర్లు) రూ.కోటి ఇచ్చారు. * కోటిపల్లి - నర్సాపూర్ మార్గానికి (57.21 కి.మీ) రూ.10 కోట్లు. * నడికుడి - శ్రీకాళహస్తి లైనుకు (309 కిలోమీటర్లు) రూ.10 కోట్లు ఇచ్చారు. * విజయవాడ- గుడివాడ- మచిలీపట్నం- భీమవరం- నర్సాపురం- నిడదవోలు లైను డబ్లింగ్, విద్యుదీకరణకు రూ.712 కోట్లు అవసరమైతే గత బడ్జెట్లో రూ 40 కోట్లు కేటాయించగా, ఈసారి రూపాయీ కేటాయించలేదు. * గూడూరు-రేణిగుంట-తిరుపతి (92.34 కిలోమీటర్లు) డబ్లింగ్‌కు రూ.5 కోట్లు ఇచ్చారు. * ఆర్వీఎన్ఎల్ చేపట్టే గుత్తి-రేణిగుంట డబ్లింగ్‌కు రూ.4.18 కోట్లు, వెంకటాచలం - కృష్ణపట్నం డబ్లింగ్‌కు రూ.15 కోట్లు, గుంటూరు - తెనాలి డబ్లింగ్‌కు రూ.58 కోట్లు, విజయవాడ- గుడివాడ- భీమవరం డబ్లింగ్‌కు రూ.20 కోట్లు, గుంతకల్-రాయచూర్ డబ్లింగ్‌కు రూ.20 కోట్లు కేటాయించారు. * గుంటూరు - గుంతకల్ - కల్లూరు మార్గం గేజ్ మార్పిడికి (76 కిలోమీటర్లు) రూ.7 కోట్లు కేటాయించారు. * బీబీ నగర్ - గుడివాడ డబ్లింగ్, విద్యుదీకరణ, తిరుపతి-కాట్పాడి డబ్లింగ్, పాకాల - ధర్మవరం విద్యుదీకరణ పనులకు మోక్షం కలగలేదు. * గూడూరు - విజయవాడ మధ్య మూడో లైను, మంత్రాలయం రోడ్ - కర్నూలు, బిట్రగుంట - దొనకొండ, పిడుగురాళ్ల - నర్సరావుపేట, మార్కాపురం రోడ్డు - శ్రీశైలం, బాపట్ల - నిజాంపట్నం - రేపల్లె, గిద్దలూరు - బాకర్‌పూర్, నంద్యాల - ఆత్మకూరు, మచిలీపట్నం - రేపల్లె, విశాఖ - భద్రాచలం కొత్త రైల్వే లైన్లకు, గుంటూరు - గుంతకల్, తెనాలి - రేపల్లె డబ్లింగ్, విద్యుదీకరణ పనుల సర్వేలకు ఈ బడ్జెట్లో చోటు దక్కలేదు. -
మరోసారీ!
పాలమూరు జిల్లాకు మరోసారి అన్యాయం జరిగింది. రైల్వే బడ్జెట్లో జిల్లా ప్రస్తావనే లేకుండా పోయింది. కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు... పాతవాటి గురించి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంపీల ప్రతిపాదనల్లో కొన్నింటినైనా కేటాయిస్తారనుకున్న జిల్లావాసుల ఆశలు అడియాశలే అయ్యాయి. సాక్షి, మహబూబ్‌నగర్ : రైల్వే బడ్జెట్... ఎప్పటిలాగే పాలమూరుకు పాత కథే మిగిల్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానందగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో జిల్లాకు కొత్త రైళ్లు వస్తాయని, డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపుతారని అంతా భావించారు. కానీ, ఎప్పటిలాగే ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. కీలకమైన గద్వాల- రాయిచూర్ మార్గానికి ఒక్క రైలూ కేటాయించలేదు. కేవలం డెమో రైలుతోనే నెట్టుకొస్తోంది. జిల్లాకు గతంలో ప్రకటించిన రైళ్ల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. గద్వాల - మాచర్ల వయా వనపర్తి మీదుగా వెళ్లాల్సిన రైల్వేలైన్‌పై జిల్లావాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, వాటి గురించి కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలక్‌నుమా- మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపలేదు. దీంతో రైల్ క్రాసింగ్ ఇబ్బందులు తప్పేట్లు లేదు. జిల్లా గుండా సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు జరుపుతున్న డబుల్ డెక్కర్ రైలు ఇటీవల కాలంలో నిలిచిపోయింది. ఈ రైలు పునరుద్ధరణ పైనా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. రాయిచూర్- గద్వాల మధ్య రైల్వేట్రాక్ అంతా సిద్ధమైనందున కొత్త రైళ్లు కేటాయిస్తారని భావించిన వారికి భంగపాటే ఎదురైంది. గద్వాల మీదుగా చెన్నై- షిరిడీ మధ్య రైళ్ల రాకపోకలు కొనసాగిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీపై కూడా స్పష్టత ఇవ్వలేదు. గద్వాల్ రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న 110 ఎకరాల స్థలంలో రైల్వే డ్రైవింగ్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం కాస్త అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. ఏళ్లు గడుస్తున్నా దానికి మోక్షం లభించడంలేదు. రైళ్ల రాకపోకల వల్ల తరచూ రహదారిపై ఉన్న గేట్ పడుతుండడంతో జడ్చర్ల వాసులను తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. ఎంపీ పంపిన ప్రతిపాదనల్లో కూడా ఆర్వోబీని ప్రముఖంగా ప్రస్తావించడంతో ఈ సారైనా స్థానం దక్కుతుందని ఆశపడ్డారు. కానీ, దానికి కూడా బడ్జెట్లో స్థానం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. గుడ్డిలో మెల్లగా మహబూబ్‌నగర్- మునీరాబాద్ రైల్వే లైన్‌కు మాత్రం ఈ సారి కచ్చితంగా 160 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. 50 రైల్వేగేట్ల వద్ద భద్రతకు చర్యలు దేశవ్యాప్తంగా కాపాలా లేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇది జిల్లాకు కొంత ఊరట కలిగించనుంది. ఇది అమలైతే జిల్లాలోని 50 కాపలాలేని రైల్వేగేట్ల వద్ద భద్రత పెరగనుంది. దీంతో కొంతవరకు ప్రమాదాలను అరికట్టగలిగే అవకాశం ఉంది. -
రైల్వే బడ్జెట్లో.. ఏపీపై కరుణ ఏది?
► రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి ► కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు ► పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రాజెక్టులకూ దిక్కులేదు ► ప్రత్యేక జోన్, మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు ► రాష్ట్రంలో ప్రారంభమయ్యే రైళ్లు మూడే..వీటిలో రెండు పాతవే.. ► రాష్ట్రం మీదగా 6 కొత్త రైళ్లు ► కొత్త లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ఇతరత్రా పనులకు ఇచ్చింది సుమారు రూ.473.28 కోట్లే.. సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్లో మళ్లీ మొండిచేయే మిగిలింది. రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. మంగళవారం పార్లమెంటులో కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో నామమాత్రంగానే నిధులు విదిలించారు. చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టూ రాష్ట్రానికి రాలేదు. కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకూ బడ్జెట్లో చోటు దక్కలేదు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం జరి గిన ఆరు నెలల్లోగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు, తూర్పు కోస్తా జోన్‌లోని వాల్తేరు డివిజన్‌తో కలిపి కొత్త జోన్ ఏర్పాటు ప్రకటన బడ్జెట్లో ఉంటుందని ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. విశాఖ లేదా విజయవాడ కేంద్రంగా ఈ జోన్ ఏర్పాటు చేస్తామని నేతలు ప్రకటనలు గుప్పించినా, బడ్జెట్లో నిరాశే మిగిలింది. రాష్ట్ర విభజన బిల్లు లో పేర్కొన్న విజయవాడ - గుంటూరు - తెనాలి మెట్రో రైల్ ఏర్పాటుపై అపాయింటెడ్ డే (జూన్ 2) నుంచి ఆరు నెలల్లో సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి వుంది. బడ్జెట్లో ఈ ప్రస్తావనే లేదు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కూడా నేతల ప్రకటనలకే పరిమితమైంది.తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తామని గతంలో అనేక సార్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్ నెరవేరగలదని అందరూ భావించారు. డివిజన్ ఏర్పాటు అంశం బడ్జెట్లో ప్రస్తావించాల్సిన అవసరం లేదనీ, కమిటీ నివేదిక వచ్చాక ఏర్పాటవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఎ క్లాస్ రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి చేసిన ప్రకటన వల్ల రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విశాఖలో వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటునూ కేంద్రం విస్మరించింది. గుంతకల్లులో రూ.100 కోట్లతో విద్యుత్ లోకో షెడ్ నిర్మింప్రతిపాదనకు కూడా ఆమోద ముద్ర పడలేదు. పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీతో సరి.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్న హామీ కూడా మంత్రి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ ఏర్పాటు ప్రకటనతో సరిపెట్టారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రూ. 20,680 కోట్ల విలువైన 29 ప్రాజెక్టులు ఉన్నాయని, వీటికి నిధుల కేటాయింపుపై నివేదిక ఇవ్వడానికి రైల్వే, ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కమిటీ నివేదికను అనుసరించి ఇరు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఈ ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు. పాత రైళ్లే కొత్తవిగా.. రాష్ట్రం నుంచి 3 రైళ్లు కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బడ్జెట్లో చూపించారు. వాస్తవానికి వీటిలో విజయవాడ - న్యూఢిల్లీ మధ్య రోజూ నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొత్త రైలు. విశాఖపట్నం - చెన్నై మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేస్తున్నట్లు బడ్జెట్లో చెప్పారు. అయితే, ఈ రైలు ఇప్పటికే విశాఖ - చెన్నైల మధ్య ప్రత్యేక రైలుగా నడుస్తోంది. దానినే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. పారదీప్ - విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ కూడా ఇటువంటిదే. ఇప్పటికే పారదీప్ - శ్రీకాకుళంల మధ్య నడుస్తున్న రైలును విశాఖపట్నం వరకు పొడిగించి, కొత్త రైలు మంజూరు చేసినట్లు చూపించారు. మరో 6 రైళ్లు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణించేవి ఉన్నాయి. హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైలు, షాలిమార్ - చెన్నై ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్, జైపూర్ - మధురై, కమాఖ్య - బెంగళూరు ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌లు, అహ్మదాబాద్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ (బైవీక్లీ), టాటానగర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లు రాష్ట్రం మీదుగా వెళ్తాయి. ఇవి మినహా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలు బడ్జెట్లో ఒక్కటీ కనిపించలేదు. విజయవాడ నుంచి ముంబై, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక రైళ్లు, తిరుపతి- షిరిడి రైలు ఊసే లేదు. -
రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్
రైళ్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించే దిశగా కేంద్రం పలు చర్యలు ప్రకటించింది. ఇందులోభాగంగా తినడానికి సిద్ధంగా ఉన్న(రెడీ టు ఈట్) ఆహార పదార్థాలను రైళ్లలో అందించనున్నట్లు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ పార్లమెంట్లో వెల్లడించారు. నాణ్యత, భిన్నత్వం కోసం రైళ్లలో ‘రెడీ టు ఈట్’ ఆహార ఉత్పత్తులను దశలవారీగా ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇక రైళ్లలో కేటరింగ్ సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు మరో సంస్థతో తనిఖీలు(థర్డ్ పార్టీ ఆడిట్) నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ ఆధ్వర్యంలో ఈ తనిఖీ వ్యవస్థను రూపొందించనున్నట్లు ప్రతిపాదించారు. ఇందులోభాగంగా ఐవీఆర్ఎస్ విధానంలో ఆహార నాణ్యతపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే పద్ధతిని త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. శుభ్రత, రుచి విషయంలో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసినపక్షంలో సదరు విక్రయదారుపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టును రద్దు చేస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రధాన రైల్వే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎక్కడికక్కడ స్థానిక రుచులను అందించనున్నట్లు, ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరించే సౌకర్యం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా న్యూఢిల్లీ-అమృత్సర్, న్యూఢిల్లీ-జమ్మూతావి సెక్షన్లలో ఈ సేవలను త్వరలోనేఅమలు చేయనున్నట్లు ప్రకటించారు. -
సదానందది ‘సంపన్నుల రైలు’
రైల్వే బడ్జెట్‌పై విపక్షాల ధ్వజం కేంద్రం అవమానించింది.. రగిలిపోతున్నా: మమత న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అసంబద్ధమైన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఇది నిరుపయోగమైన రైల్వే బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించగా సరుకు రవాణా ద్వారా భారీ ఆదాయం సమకూర్చే ఒడిశాకు ఒరిగింది ఏదీ లేదని బిజూ జనతాదళ్ ఆక్రోశించింది. గతంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల పట్ల ఆదరణ చూపుతామన్న మోడీ సర్కారు హామీని నిలబెట్టుకోలేదని దుయ్యబట్టింది. దేశంలోని చాలా ప్రాంతాలను విస్మరించి నాలుగైదు నగరాల మధ్యనే ప్రాజెక్టులను పరిమితం చేశారని జేడీయూ తప్పుబట్టింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గిస్తారని భావించినా ఆ ఊసే లేదని బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైకు కొంత ఊరట తప్పితే మరాఠ్వాడా, విదర్భ, కొంకణ్ ప్రాంతాలను పట్టించుకోలేదని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ చెప్పారు. రైల్వే శాఖ మాజీ మంత్రులు లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ, పి.కె.బన్సల్, మల్లికార్జున ఖర్గే తాజా బడ్జెట్‌పై పెదవి విరిచారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పార్లమెంట్లో ఉండుంటే ఏం చేసేదాన్నో తనకే తెలియదని మమత రౌద్ర రూపం దాల్చారు. మోడీ సర్కారు బెంగాల్‌ను నిర్లక్ష్యం చేసిందని తిట్టిపోశారు. మరోవైపు దేశ రాజధానిలో కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ నివాసం వద్ద ఆందోళనకు దిగి ఆయన ఇంటికి ఉన్న నామ ఫలకాన్ని తొలగించారు. మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారీ పోకడలో నడుస్తూ రైల్వేల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి అధిర్ రంజన్ చౌధురి ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో పేర్కొన్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ యూపీఏ విధానాలను విమర్శించటమే పనిగా పెట్టుకున్నారని తప్పుబట్టారు. సదానంద గౌడ ఇంటి వద్ద కాంగ్రెస్ నిరసన రైల్వేలో ప్రైవేటీకరణకు దారులు తెరవొద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళవారం రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఢిల్లీ త్యాగరాజ్ మార్గ-1లోని ఆయన ఇంటి ఎదుట సాయంత్రం ఆందోళన నిర్వహించారు. సదానంద గౌడ ఇంటి గేటు వద్ద ఆయన పేరుతో ఉన్న నామ ఫలకాన్ని తొలగించి కాళ్లతో తొక్కారు. రైల్వే మంత్రి కారు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సదానందగౌడ, ప్రధాని నరేంద్రమోడీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల పెంచిన రైల్వే చార్జీలను తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెనక్కి నెట్టారు. అయితే తమ కార్యకర్తలను వెంటనే మందలించినట్లు అర్విందర్ సింగ్ లవ్లీ తెలిపారు. బడ్జెట్లో ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రతిపాదనను కంటితుడుపు చర్యగా అభివర్ణించారు. -
ముందే ప్రింటైపోయింది
న్యూఢిల్లీ: రాజ్యసభలో రైల్వే బడ్జెట్ సమర్పణ సందర్భంగా మంగళవారం సభలో గందరగోళం తలెత్తింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ సమావేశమయ్యాక రైల్వేమంత్రి సదానందగౌడ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుండగా.. కాంగ్రెస్ నేత మధుసూదన్‌మిస్త్రీ అడ్డుపడ్డారు. చేతిలో ఒక దినపత్రికను పట్టుకుని ముందుకు వస్తూ రైల్వే బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించకముందే ఆ ప్రసంగం ఒక పత్రికలో ప్రచురితమైందని.. ఇది సభా హక్కుల ఉల్లంఘనేనని అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆయనకు మద్దతుగా సీపీఎం సభ్యులు కూడా లేచినిల్చుని మాట్లాడారు. అయితే.. ఈ అంశంపై నోటీసు ఇవ్వవచ్చని, లేదంటే బడ్జెట్‌పై చర్చకు కేటాయించిన సమయంలో లేవనెత్తవచ్చని డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యుడు మిస్త్రీ ఆందోళనను కొనసాగిస్తుండగా.. గందరగోళం మధ్యే రైల్వేమంత్రి బడ్జెట్‌ను సమర్పించారు. అనంతరం సభను డిప్యూటీ చైర్మన్ బుధవారానికి వాయిదావేశారు. -
రైల్వే బడ్జెట్ లో జిల్లాకు మళ్లీ మొండిచేయే..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: కొత్తగా ప్రాజెక్టులు దక్కకపోగా మళ్లీ టికెట్ చార్జీల పెంపు ఉండవచ్చంటూ రైల్వే మంత్రి సదానంద గౌడ చేసిన ప్రకటన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిల్లాకు సంబంధించిన కొత్త రైల్వే లైనులు, రైళ్ల స్టాపింగ్‌లు, కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి హామీ లభించలేదు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రాకు పూర్తి అన్యాయం ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం జరిగిందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఎప్పటి నుంచో ఈ ప్రాంతానికి రావాల్సిన నడికుడి - కాళహస్తి రైల్వేలైన్ ప్రస్తావన చేయకపోవడం బాధాకరమన్నారు. కడప - ఎర్రగుంట్ల రైల్వేలైన్‌తో పాటు ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే మంత్రిలా బడ్జెట్ రూపొందించారని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. విజయవాడ - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ మినహా ఏ రైళ్లు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులో ప్రస్తావించిన అంశాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఆ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. విశాఖపట్నం మెట్రోరైలు, విజయవాడ - తెనాలి - గుంటూరుకు మెట్రోరైలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే రాజధాని నుంచి హైదరాబాద్‌కు రాపిడ్ ఎక్స్‌ప్రెస్‌లైన్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ అంశాలను కనీసం బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇంత ఘోరమైన రైల్వే బడ్జెట్‌ను చూడలేదని చెప్పారు. రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని, రైల్వే మంత్రి సదానంద గౌడ పూర్తి నిరాశ మిగిల్చారన్నారు. తాము రైల్వే మంత్రిని నెలరోజుల క్రితమే కలిసి ఈ ప్రాంతానికి కావాల్సిన ప్రతిపాదనలను వివరించినట్లు చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. మళ్లీ అన్యాయమే: కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి రైల్వే బడ్జెట్లో మళ్లీ జిల్లాకు అన్యాయమే జరిగింది. శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే ప్రాజెక్టుకుగానీ, దొనకొండ- ఒంగోలు రైల్వే లైన్‌కు సంబంధించి ఆశించిన ప్రయోజనమేమీ లేదు. జిల్లా నుంచి సరుకు రవాణా ద్వారా అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నా వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. రైళ్లల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఎక్కుతున్నా అదనపు రైళ్లు ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం బుల్లెట్ రైళ్ల పేరుతో ధనవంతులకు సౌకర్యం కల్పించడం తప్ప పేదల గురించి పట్టించుకోవడం మానేశారు. రైల్వే బడ్జెట్ భేషుగ్గా ఉంది: తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ భేషుగ్గా ఉంది. పారదర్శకతకు, అభివృద్ధికి పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యం. రైల్వేల అభివృద్ధి పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు, యశ్వంతపూర్ - గుంటూరు డైలీ ప్యాసింజర్ రైలు, విశాఖ-చెన్నై వీక్లీ, సికింద్రాబాద్- చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ కొత్త రైళ్ల ఏర్పాటు శుభసూచకం. మహిళా ప్రయాణికులకు అధిక భద్రత, డబ్లింగ్-ట్రిప్లింగ్, కొత్త రైళ్లకు అధిక ప్రాధాన్యత. గ్రామీణ ప్రజల సౌకర్యార్థం పోస్టాఫీసుల ద్వారా కూడా రైలు టికెట్ల విక్రయాలు చేపట్టడం వంటి వాటివల్ల బడ్జెట్ సంతృప్తిగా ఉంది. జనరంజక బడ్జెట్: బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరశింహారావు రైల్వే బడ్జెట్ జనరంజకంగా ఉంది. ఒక వైపు ఆదాయం వంద రూపాయలు వస్తుంటే అందులో 90 రూపాయలు వ్యయం అవుతోంది. అందువల్ల కేవలం పదిరూపాయల్లోనే అభివృద్ధి చేపట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం సాహసోపేతంగా కొత్త ట్రాక్‌ల నిర్మాణానికి పూనుకోవడం ద్వారా సరుకు రవాణాను వేగవంతం చే సి తద్వారా రైల్వే సేవలను మరింత అభివృద్ధి చేయబోతోంది. -
మళ్లీ నిరాశపరిచిన రైల్వే బడ్జెట్
రైల్వే బడ్జెట్లో జిల్లాకు ఎప్పటిలాగే నిరాశే ఎదురైంది. 2014-15 బడ్జెట్‌ను పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే మంత్రి సదానంద గౌడ జిల్లా వాసులను నిరాశపరిచారు. ఏళ్ల నాటి పెండింగ్‌లో ఉన్న సమస్యలకు మోక్షం కలగలేదు. గత ఏడాది బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక్క రైలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకోగా, అదే బాటలో పయనించిన ప్రస్తుత మోడీసర్కారు ఒకే ఒక్క వీక్లీ రైలుతో సరిపెట్టేసింది. జిల్లా వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా కేటాయించేందుకు ఎంపీలు ఇచ్చిన ప్రతిపాదన విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు. ప్రైవేటీకరణే ధ్యేయంగా ప్రతి అంశాన్ని ముడిపెడుతూ ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రత్యేక కార్యాచరణకు దిగారు. పాత వాటి ఊసులేదు... కొత్తవాటికి గ్రీన్ సిగ్నల్ లేదు. ఒక్క వీక్లీ రైలుతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదు. విజయనగరం టౌన్ : కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా జిల్లాలో ఉన్న సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉండిపోయాయి. లాభార్జనే ధ్యేయంగా రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. పారదీప్ నుంచి విశాఖ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్ రైలును మాత్రం వారంలో ఒకరోజు వచ్చేలా ఏర్పాటుచేశారు. ఇది తప్ప జిల్లాకు ఉపయోగపడే మరో అంశం ఏదీ బడ్జెట్లో లేదు. అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో సీనియర్ సిటిజన్లకు బ్యాటరీ కార్లు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణికులకు అలర్ట్ వేకప్ కాల్స్ సదుపాయం, అన్ని రైళ్లల్లో ఇంటర్నెట్ వైఫే సౌకర్యం, పార్కింగ్ కమ్ ఫ్లాట్ ఫామ్ టికెట్లను ఒకే దాంట్లో ఇవ్వడం, ప్రయాణికులకు పోస్టల్, నెట్ తదితర వాటి ద్వారా అన్నిరకాల రైల్వే సౌకర్యాలు కల్పించడం చేశారు. అయితే చాలా ఏళ్ల నుంచి జిల్లా ఎంపీలు యత్నిస్తున్నా అంశాలలో ఏ ఒక్కటీ సాఫల్యం కాలేదు. గత బడ్జెట్లో కూడా విశాఖ -గుణుపూరు పాసింజర్ రైలు తప్పితే మనకేదీ దక్కలేదు. పట్టాలెక్కని హామీలివే.... ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో విశాఖను ప్రత్యేక జోన్‌గా చేయాలన్న ఆశ అడియాశగానే మిగిలింది. విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు ప్రత్యేక రైల్వే లైను, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ ఊసేలేదు. విజయనగరం రైల్వే స్టేషన్లో అవుట్ పేషెంట్ విభాగం, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరవన్నీ గతంలో పేర్కొన్నవే. అయితే వీటిలో దేనికీ ప్రత్యేకించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక ఏళ్ల నాటి డిమాండ్లైన పలాస-విశాఖ రైలు, సాధారణ బోగీలతో విశాఖ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్‌ను నడపాలన్నది అలాగే ఉండిపోయింది. సుమారు రూ.కోటీ 55 లక్షలతో విజయనగరంలో నిర్మించిన రైల్వే మామిడి యార్డ్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు డిమాండ్ నెరవేరలేదు. ఇక రూ.10 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూరుస్తున్న గూడ్స్ షెడ్ అభివృద్ధి కూడా ఏళ్ల నాటి డిమాండ్ జాబితాలో చేరిపోయింది. ‘లోకో మోటివ్ షెడ్(రైలు బయలుదేరు ప్రదేశం)’పరిస్థితి కూడా ఒక డిమాండ్‌గానే మిగిలిపోయింది. విజయనగరం రైల్వే స్టేషన్లో 5వ ప్లాట్‌ఫామ్ నుంచి చివరి ప్లాట్‌ఫామ్ వరకు ఫుట్ఓవర్ బ్రిడ్జిను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఈ బ్రిడ్జి పనులు పిల్లర్ల స్థాయితో అర్ధాంతరంగా ఆగిపోయాయి. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం విజయనగరం రైల్వేస్టేషన్లో చివరి వరకూ షెల్టర్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఆ పనులు కూడా నెరవేరలేదు. విజయగనం పట్టణంలో వీటీ అగ్రహారం బీసీ కాలనీ వద్ద రైల్వే గేట్ ఏర్పాటుచేయాలన్న వినతులను పట్టించుకోలేదు. -
లాయర్ గౌడ తొలిసారి బడ్జెట్
ప్రవేశపెట్టిన బీజేపీ నేత సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తమ పార్టీకి చెందిన నేతకు రైల్వే శాఖను కట్టబెట్టింది. ఆ హోదాలో డి.వి.సదానందగౌడ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక రాష్ర్టం మందెకొట్ల గ్రామం దేవరగుండా కుటుంబంలో జన్మించారు. ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ క్రీయాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన జీవితం కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి స్థాయికి ఎదిగింది. 1994లో తొలిసారి ఎన్నికల్లో పోటీ. పుత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం. పుట్టింది: 19, మార్చి 1953 సుల్యా, దక్షిణ కర్ణాటక తల్లిదండ్రులు: కమల, వెంకప్పగౌడ భార్య పేరు దత్తే.. కుమారుడు కార్తీక్. చిన్న కుమారుడు కౌషిక్.. మెడిసిన్ చదువుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అద్భుతం, విప్లవాత్మకం. భద్రత, పరిశుభ్రత, వేగానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా రైల్వేలను తిరిగి గాడిన పెడుతుంది. బడ్జెట్లో సృజనాత్మక ఆలోచనలున్నాయి. రైల్వే మంత్రి సదానందదే ఈ ఘనత. - రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి -
రైలు రాలే!
నిజామాబాద్ అర్బన్: రైల్వే బడ్జెట్లో జిల్లాకు నిరాశ త ప్పలేదు. నిధులు, రైళ్లు ఏ మాత్రం కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో జిల్లాకు రైల్వే బడ్జెట్లో మంచి ప్రాధాన్యం లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఈ ప్రాంతంపై రైల్వే మంత్రి ఏ మాత్రం కనికరించలేదు. ఉన్నవాటికే నిధులు కేటాయించ లేదు. కొత్త పథకాల ఊసే లేకుండా పోయింది. నానాటికి రై ల్వే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా, అందుకు అనుగుణంగా రైల్వే సేవలు, సౌకర్యలు విస్తరిస్తాయని భావించినవారికి అసంతృప్తే మిగిలింది. హామీల ప్రస్తావనేదీ! ఇంతకు ముందు ప్రకటించిన హామీల అమలు విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావించే లేదు. జిల్లాలో ఆర్మూర్, ఆదిలాబాద్ వరకు కొత్త రైల్వేలైన్ వేయడానికి గతంలో కేంద్రం అనుమతి ఇచ్చింది. నిజామాబాద్-పెద్దపల్లి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. బోధన్-బీదర్ రైలు మార్గం గురించి ఆ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డిలను ఆదర్శ రైల్వేస్టేషన్లుగా మారుస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు గడిచింది. వీటిలో ఏ ఒక్కదానిపైనా రైల్వే మంత్రి స్పందించలే దు. ఒక్క కొత్త రైలు కూడా జిల్లాకు కేటాయించలేదు. మహారాష్ట్రను ఆనుకొని ఉన్న ఈ జిల్లా వ్యా పారపరంగా వేరువేరు ప్రాంతాలకు మంచి ప్రయాణమార్గంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని రైల్వే సౌకర్యాలను పెంచవల్సిన అవసరం ఉంది. అయినా, గతంలోలాగే ఈసారి కూడా కొత్త పాసింజర్ రైళ్ల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోలేదు. గత ఏడాది ప్రవేశ పెట్టిన రైల్వేబడ్జెట్ ప్రస్తుత బడ్జెట్ కంటే మేలు. పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ 2014 వరకు పూర్తి చేస్తామని కేంద్రం ప్రకటించినా, ఈ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో నిధులు భారీగా వచ్చే అవకాశం ఉందని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కాని వీటికి కేటాయింపు జరగలేదు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వేప్రాజెక్టులను కేంద్రం పట్టించుకోకపోవడం నిరుత్సాహపరిచింది. ఆధునికీకరణ పనులు, నిధుల కేటా యింపు , రైళ్ల పొడగింపు, కొత్త రైళ్ల ఏర్పాటులో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చే అవసరం ఎం తైన ఉంది. కాని వీటిని రైల్వే బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. ఢిల్లీలో మకాం వేసినా నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కె.కవిత, బీబీ పాటిల్ రైల్వే బడ్జెట్లో జిల్లాకు సౌకర్యాలు, నిధులు కేటాయించాలని ఢిల్లీలో రైల్వే అధికారులను, మం త్రులను కలిసి విన్నవించారు. దాదాపు 15 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి శ్రమించారు. అయినా, రై ల్వేబడ్జెట్‌లో మాత్రం ఏమాత్రం ప్రాధాన్యం లభించలేదు. వీరి విన్నపాలను కేంద్రం పట్టించుకోలేదు. కనీసం నిధులు, రైళ్లను కూడా కేటాయించలేదు. ఉత్త ర తెలంగాణ జిల్లాలన్నింటికీ నిరాశే మిగిలింది. -
వెయిటింగ్ నిల్.. వేగంగా టికెట్
పాసింజర్ టికెట్ వ్యవస్థలో సమూల మార్పులు 1. ‘నెక్స్ట్ జనరేషన్ ఈ-టికెటింగ్’గా రిజర్వేషన్ వ్యవస్థ.. నిమిషానికి 7,200 టికెట్లు 2. నెట్ ద్వారా ప్లాట్‌ఫాం, అన్రిజర్వ్డ్ టికెట్లు.. ఒకేసారి పార్కింగ్, ప్లాట్‌ఫాం టికెట్లు 3. ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులు 4. రైలొచ్చే ముందు ప్రయాణికులకు వేకప్ కాల్ న్యూఢిల్లీ: రైల్వే టికెట్లు మరింత సులభంగా, వేగంగా ప్రయాణికులకు లభించేలా బుకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తేనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ చెప్పారు. మంగళవారం ఆయన పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో టికెట్ బుకింగ్ వ్యవస్థ మరింత సమర్ధంగా, వేగంగా, ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా పలు ప్రతిపాదనలు చేశారు. పాసింజర్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను నెక్ట్స్ జనరేషన్ ఈ-టికెటింగ్ వ్యవస్థగా రూపుదిద్దనున్నారు. ప్రస్తుతం నిమిషానికి 2,000 టికెట్లు ఇస్తున్నారు. దీనిని నిమిషానికి 7,200 టికెట్ల సామర్థ్యానికి పెంచనున్నారు. ఒకేసారి 1.20 లక్షల యూజర్లు ఈ-టికెటింగ్‌ను ఉపయోగించుకొనేలా అత్యాధునికంగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా.. మొబైల్ ఫోన్లు, పోస్టాఫీసుల ద్వారా టికెట్లు ఇచ్చే విధానాన్ని మరింత ప్రాచుర్యంలోకి తేనున్నారు. ఇప్పటివరకు స్టేషన్లలోనే లభించే ప్లాట్‌ఫాం, అన్రిజర్వ్డ్ టికెట్లను ఇక మీదట ఇంటర్నెట్ ద్వారా పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా.. ప్రయాణికుల సౌకర్యార్థం ఒకేచోట పార్కింగ్, ప్లాట్‌ఫాం కాంబో టికెట్లను కూడా జారీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసేలా టికెట్ల జారీ యంత్రాల వద్ద దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామన్నారు. పేపర్‌లెస్ రైల్వే కార్యాలయాలు ఐటీ పరిజ్ఞానంతో వచ్చే ఐదేళ్లలో రైల్వే కార్యాలయాలను పేపర్‌లెస్ ఆఫీసులుగా రూపుదిద్దనున్నట్లు గౌడ చెప్పారు. ఎ1, ఎ2 స్టేషన్లు, ఎంపిక చేసిన మరికొన్ని స్టేషన్లలో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. ఇవే కాకుండా.. రైళ్ల రాకపోకలను తెలుసుకొనేందుకు, రైలు బయల్దేరే సమయానికి ముందుగా ప్రయాణికులకు ఫోన్ ద్వారా వేకప్కాల్తో అప్రమత్తం చేసేందుకు, ప్రయాణంలో ప్రయాణికులు దిగవలసిన ప్రాంతం వచ్చినట్లుగా సమాచారాన్ని ఇచ్చేందుకు, స్టేషన్ల సమాచారాన్ని తెలుసుకొనేందుకు, కంప్యూటరైజ్డ్ పార్సిల్ వ్యవస్థను విస్తరించేందుకు కూడా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. స్టేషన్లలో డిజిటల్ రిజర్వేషన్ చార్ట్‌లను కూడా ఉంచేలా చర్యలు చేపట్టనున్నట్లు గౌడ చెప్పారు. పీపీపీ పద్ధతిలో అన్ని టికెట్ కౌంటర్లలో ద్వంద్వ విధానంలో చార్జీలను తెలిపే వ్యవస్థను విస్తరిస్తామనితెలిపారు. రైల్వేల ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు వాటిని డిజిటైజేషన్ చేస్తామని చెప్పారు. బొగ్గు రవాణా లైన్ల నిర్మాణం వేగవంతం విద్యుత్ కేంద్రాలకు బొగ్గును త్వరగా రవాణా చేసేందుకు మూడు కీలక రైల్వే మార్గాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని కేంద్రం తెలిపింది. తోరి-శివపూర్-కతౌతియా (జార్ఖండ్), జార్సుగూడ-బార్పల్లి, సర్దేగా(ఒడిశా), భూప్‌దేవ్‌పూర్-రాయ్‌గఢ్- మాండ్ (ఛత్తీస్‌గఢ్) లైన్ల నిర్మాణం ద్వారా రవాణా అయ్యే బొగ్గు మొత్తం 10 కోట్లటన్నులకు చేరుకుంటుందని రైల్వే మంత్రి సదానంద గౌడ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 7,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ లైన్ల నిర్మాణం ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. విద్యుత్ ప్లాంట్లు ఇంధన కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి వీటి నిర్మాణంపై స్పందించారు. ట్విట్టర్లో 40 వేల ఫాలోవర్లు! రైల్వే మంత్రి సోమవారం ప్రారంభించిన ట్విట్టర్ ఖాతాకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ట్విట్టర్లో రైల్వే శాఖ హ్యాండిల్(ఖాతా) ఃఖ్చజీకజీఐఛీజ్చీకు ఒక్కరోజులోనే సుమారు 40 వేల మంది చేరువయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్‌ల ద్వారా ప్రజలకు తాజా సమాచారం అందజేస్తామని రైల్వే శాఖ తెలిపింది. -
3లైన్లకు రూ.48 కోట్లే.. ప్చ్..!
బడ్జెట్ రైలు ఈ ఏడాది కూడా జిల్లాలో ఆగలేదు. కొత్త రైళ్లు వస్తాయని, నిజామాబాద్ లైన్ పూర్తవుతుందని, రాజధానికి రైలు సౌకర్యం కలుగుతుందని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మూడు లైన్లకు కేవలం రూ.48 కోట్లు ఈ బడ్జెట్లో మంజూరయ్యాయి. ఈ నిధులతో పాత ప్రాజెక్టులు అంగుళం ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి, కరీంనగర్ : దశాబ్దాల క్రితం మంజూరైన రైల్వే లైన్ల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులో జిల్లాకు ప్రతీసారి అన్యాయమే జరుగుతోంది. ఈసారీ అదే జరిగింది. ముందు చెప్పినట్టే.. ఎలాం టి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని రైల్వే మంత్రి మూడు పాత ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించి మమ అనిపించారు. కేటాయించిన నిధులతో ఏ ప్రాజెక్టు కూడా కనీసం 5 శాతం పూర్తికాని పరిస్థితి. పైగా అవసరాన్ని బట్టి చార్జీల మోత తప్పదని లోక్‌సభలో మంత్రి స్పష్టం చేయడంతో సమయం, సందర్భం లేకుండా రైలు చార్జీలు పెంచి ప్రయాణికులపై భారం పడనుంది. కేటాయింపులివీ... కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణంపై సర్వే కోసం రూ.10 కోట్లు కేటాయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన ఈ లైన్ నిర్మాణమైతే కరీంనగర్ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రైలు సౌకర్యం ఏర్పడుతుంది. గత ఆర్థిక బడ్జెట్లో అప్పటి ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈసారి రూ.10 కోట్లే కేటాయించడంతో సర్వే పనులైనా జరుగుతాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. రామగుండం-మణుగూరు రైల్వేలైన్‌కు రూ.3 కోట్లు కేటాయించారు. 1982లోనే.. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్న అన్ని బొగ్గు గనుల మీదుగా రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి, చెల్పూరు (ఘన్పూర్), గోవిందరావుపేట (ములుగు), మణుగూరు వరకు రూ.650 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసింది. ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోగా ఈసారి రూ.3 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు ఇటీవల రూ.10వేల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దపల్లి-నిజామాబాద్ లైన్‌కు ఈసారి రూ.35 కోట్లు కేటాయించారు. ఈసారైనా రైలు ఇందూరుకు చేరుతుందని ఆశించిన జిల్లా ప్రజలకు ఈ బడ్జెట్ కేటాయింపుతో నిరాశే మిగిలింది. రెండేళ్ల క్రితమే అప్పటి రైల్వేమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేలైన్‌ను ఆ ఏడాది పూర్తికానున్న లైన్ల జాబితాలో చేర్చినా ఇప్పటికీ పూర్తికాలేదు. పెద్దపల్లి వయా కరీంనగర్, జగిత్యాల నుంచి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ వరకు లైన్ పూర్తిగా కాగా, మోర్తాడ్ నుంచి నిజామాబాద్ వరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ రూ.35 కోట్లతో లైన్ ఎంతదూరం వెళ్తుందో మంత్రికే తెలియాలి. జిల్లావాసులకు రైల్వే కనెక్టివిటీ మెరుగుపడేలా కరీంనగర్-హైదరాబాద్, కరీంనగర్-హసన్‌పర్తి వరకు కొత్త లైన్ వేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గతంలో పలుమార్లు సమర్పించిన ప్రతిపాదనలను మోడీ సర్కార్ బుట్టదాఖలు చేసింది. పలు స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్ విషయంలోనూ రైల్వేమంత్రి జిల్లావాసులను నిరాశపరిచారు. రామగుండం రైల్వేస్టేషన్లో.. చెన్నయ్ నుంచి ఢిల్లీ వెళ్లే గరీబ్థ్ ్రసూపర్ఫాస్ట్, నవ్‌జీవన్, జైపూర్, స్వర్ణజయంతి, పెద్దపల్లిలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే ఏపీ సూపర్‌ఫాస్ట్ రైళ్ల నిలుపుదల విజ్ఞప్తులను పెడచెవినపెట్టారు. కమిటీ పేరిట లింకు కేటాయించిన ఈ అరకొర నిధులు కూడా ఖర్చు చేయకుండా కేంద్రం మెలిక పెట్టింది. సమైక్యంగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయాయని.. రెండుప్రాంతాల్లో మొత్తం 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్న మంత్రి వీటిపూర్తి కోసం రూ.26,680 కోట్లు అవసరమున్నట్లు అంచనా వేశారు. ఈ రెండు ప్రాంతాల్లో రైల్వే అభివృద్ధికి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ఇచ్చే నివేదిక తర్వాత నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో జిల్లాకు ఇప్పుడు ప్రకటించిన నిధులైనా వస్తాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేలో ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులతో కలిపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ (పీపీపీ) వ్యవస్థ ఏర్పాటు ఆలోచనలో ఉన్నట్లు మంత్రి ప్రకటించడంపైనా ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవస్థతో రైల్వే ఏమాత్రం అభివృద్ధి చెందే ప్రసక్తే లేదని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ అన్నారు. గతంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వాలు వెనుకడుగు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాకు రైల్వే నిధుల కేటాయింపు కేవలం కంటితుడుపు చర్యగా ఉన్నాయన్నారు. -
‘సదా’ నిరాశే
కొత్తగూడెం : జిల్లా ప్రజల ఆశలపై రైల్వే బడ్జెట్ నీళ్లు చల్లింది. ఈ దఫా ఎలాగైనా జిల్లాలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని, కొత్త ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం తో పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశించిన జిల్లా వాసులకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2012లో మంజూరైన కొవ్వూరు లైన్‌తోపాటు, సింగరేణి బొగ్గు ఉత్పత్తికి కీలకమైన సత్తుపల్లి లైన్‌కు క్లియరెన్స్ వస్తుందని ఆశ పడినప్పటికీ.. నిరాశే మిగిలింది. జిల్లాలో సింగరేణి గనులతో పేరెన్నిక కలిగిన కొత్తగూడెం కేంద్రంగా రైల్వే విస్తరణ చేయాల్సి ఉంది. అయితే సుమారు ఆరు దశాబ్దాలుగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)-కొవ్వూరు లైన్‌కు ఈ బడ్జెట్లో అసలు నిధులే కేటాయించకపోవడం గమనార్హం. 2012లో ఈ లైన్‌కు మంజూరు లభించినా.. నాటి నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. ఈ లైన్ ఏర్పాటయితే సుమారు 100 గిరిజన గ్రామాలకు రైలు సౌకర్యం కలుగుతుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లేందుకు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే 140 కిలోమీటర్ల మేర దూరం తగ్గే అవకాశాలున్నాయి. ఇన్ని అవకాశాలున్న ఈ లైన్‌కు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత లైన్లకు మాత్రమే పర్యవేక్షణ కమిటీ వేసిన సదానంద బడ్జెట్ అందరినీ నైరాశ్యంలోకి నెట్టివేసింది. సింగరేణికి తప్పని తిప్పలు.. పర్యావరణశాఖ ఆదేశాల మేరకు భవిష్యత్‌లో సింగరేణి సంస్థ చేపట్టే నూతన ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును రైలు మార్గం ద్వారానే తరలించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీపీ, కిష్టాపురం ఓసీపీలలో ఉత్పత్తి చేసే బొగ్గు రవాణాకు కొత్తగూడెం - సత్తుపల్లి రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయాలని సింగరేణి సంస్థ ముందుకొచ్చింది. ఈ లైన్‌కు అయ్యే ఖర్చులను పూర్తిగా భరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ లైన్ ఫైనల్ సర్వే కూడా పూర్తయింది. అయితే ప్రస్తుత బడ్జెట్లో కొత్తగూడెం - సత్తుపల్లి లైన్‌కు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో సత్తుపల్లిలోని కొత్త ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గును ఎలా సరఫరా చేయాలనే విషయంపై సింగరేణి సందిగ ్ధంలో పడింది. ఉద్యోగులకూ ఊరట లేదు.. జిల్లాలో మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 1500 మంది వరకు రైల్వే ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు 7వ పే రివిజన్ కమిటీ కోసం ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమైనా తమ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 7వ పే రివిజన్‌కు అనుమతి ఇస్తుందని భావించిన ఉద్యోగులకు ఈ బడ్జెట్లోనూ నిరాశే ఎదురైంది. -
దారి మళ్లిన ‘గౌడ’ బండి
గుంతకల్లు టౌన్ : రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ ‘రైలు’ దారి మళ్లింది. సంస్కరణలకు పెద్దపీట వేస్తామని గొప్పలు చెప్పిన మోడీ సర్కారు.. ఏడాదికి రూ.1100 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌పై సవతి ప్రేమ చూపింది. మంగళవారం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్‌కు ఒక్క కొత్త రైలూ రాలేదు. కొత్త ప్రాజెక్ట్ ఊసూ లేదు. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుదీకరణ పనులు, కొత్త రైలు మార్గాలు, డబ్లింగ్, అండర్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారే కానీ వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో స్పష్టంగా చెప్పలేకపోయారు. రాష్ట్ర విభజన బిల్లులో రైల్వే జోన్ ఏర్పాటు హామీ ఉన్నా దాని ఊసే ఎత్తలేదు. కొత్తగా వచ్చే రైల్వే జోన్‌కు సౌత్ఈస్ట్ కోస్ట్ జోన్ రైల్వేగా నామకరణం చేయబోతున్నట్లు రైల్వే అధికారిక వర్గాలు తెలిపాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లోని విశాఖపట్నంను కలుపుకుని రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని భావించినా ఉసూరుమనిపించారు. కమిటీతో కాలయాపన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 29 ప్రాజెక్టులను రానున్న పదేళ్లలో పూర్తి చేసేందుకు కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సదానంద ప్రకటించారు. అయితే కమిటీ నివేదిక వచ్చేదెన్నడు? పనులు పూర్తి చేసేదెన్నడు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గుంతకల్లు రైల్వే డివిజన్‌కు గతంలో మంజూరైన డబ్లింగ్, విద్యుదీకరణ, రైలు మార్గాల ఏర్పాటుకు దాదాపు 4 వేల కోట్ల రూపాయలు అవసరం ఉండగా ప్రభుత్వం ప్రతియేటా అరకొర నిధులు విదిలిస్తోంది. ఫలితంగా పెండింగ్ ప్రాజెక్టులు పడకేస్తున్నాయి. ప్రతిపాదనలకే పరిమితమా? గుంతకల్లు డివిజన్లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలన్న ప్రజల డిమాండ్ మేరకు డివిజన్ స్థాయి రైల్వే అధికారులు రైల్వేమంత్రిత్వ శాఖకు ప్రతి యేటా ప్రతిపాదనలు పంపుతున్నా వాటిని పట్టించుకునే వారు కరువయ్యారు. ఉదయం వేళల్లో పుట్టపర్తి-హైదరాబాద్‌తో పాటు తిరుపతి-షిర్డీ, పుట్టపర్తి-షిర్డీ రైళ్లను ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ ఉంది. పెండేకల్లు బైపాస్, గుత్తి మీదుగా వెళ్తున్న కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, తుంగభ ద్ర ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడపాలన్న డిమాండ్ ఉంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజధాని గుంటూరు లేదా విజయవాడల మధ్య ఏర్పాటు చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంతి, అమరావతి, రెండు ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయని, భవిష్యత్తులో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనంగా రైళ్లు ఏర్పాటుకు గౌడ బడ్జెట్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందేమోనని భావించినా నిరాశే ఎదురయ్యింది. ఆశాజనకంగా లేదు రైల్వే బడ్జెట్ వల్ల అటు ప్రయాణికులు, ఇటు రైల్వే కార్మిక వర్గాలకు ఎటువంటి ప్రయోజనం లేదు. డివిజన్ మీదుగా కనీసం ఒక్క కొత్త రైలు కానీ, కొత్త ప్రాజెక్టు గానీ మంజూరు చేయకపోవడం అన్యాయం. అందరూ ఆశించినట్లు గుంతకల్లు రైల్వే జోన్ గురించి ప్రస్తావించకపోవడం మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడమే. కనీసం పెండేకల్లు బైపాస్ మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లను గుంతకల్లు మీదుగా నడిపేందుకు గ్రీన్‌సిగ్నల్ కూడా ఇవ్వలేదు. - కళాధర్, మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి కొత్త రైళ్లు, ప్రాజెక్టుల ఊసెత్తకపోవడం భాధాకరం రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో కొత్త రైళ్లు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం భాధాకరం. రైల్వే ఉద్యోగుల స్టాఫ్ బెనిఫిట్ ఫండ్‌ను రూ.500 నుండి 800 వరకు పెంచుతామని, రైల్వే కార్మికుల పిల్లల కోసం కాలేజిలు, ఒక విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఉద్యోగ వర్గాలకు కొంత ఊరట కలిగించిందే. అది మినహాయించి డివిజన్‌కు ఒరిగిందేమీ లేదు. - శ్రీనివాసులు, ఎంప్లాయిస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా నిర్మిస్తామని రూ.6 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు కేవలం రూ.2 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేయడంతో నిర్మాణ పనులు పునాదులకే పరిమితం అయ్యాయి. ట్రాక్షన్ షెడ్ నిర్మాణానికి రూ.80 కోట్లు అవసరముండగా ఇప్పటి వరకు కేవలం రూ.15 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. గుంటూరు-గుంతకల్లు, డోన్-ధర్మవరం వయా గుత్తి, గుంతకల్లు-హొస్పేట డబ్లింగ్ పనులు, కడప-బెంగుళూరు, నడికుడి-శ్రీకాళహస్తి, కదిరి-పుట్టపర్తి మధ్య రైల్వేలైన్ ఏర్పాటు కోసం మంజూరైన నిధుల్లో అరకొర విడుదల చేయడంతో ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదు. శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికై నిత్యం లక్షలాది మంది భక్తాదులతో రద్దీగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ ఆదర్శ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దుతామని గతంలో చేసిన వాగ్దానాలన్నీ బుట్టదాఖలయ్యాయి. ప్రయాణికుల రద్దీ, రైళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆ దిశగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. -
మనకూ బుల్లెట్ రైల్
భారతీయుల కల సాకారం చేస్తాం రైల్వే బడ్జెట్లో కేంద్రం ప్రకటన ► ముంబై-అహ్మదాబాద్ సెక్టార్లో అమలు ► దాదాపు రూ. 60 వేల కోట్ల ఖర్చు! ► 9 రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్ ► రైళ్ల వేగం గంటకు 160-200 కిలోమీటర్ల వరకు పెంపు న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలును పరుగులు పెట్టిం చేందుకు ఎన్డీయే సర్కారు సంకల్పించింది. ముందుగా ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో దాదాపు రూ. 60వేల కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు తన తొలి రైల్వే బడ్జెట్లో ప్రకటించింది. అంతేకాదు, అన్ని మెట్రోలు, ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైల్ నెట్వర్క్(వజ్ర చతుర్భుజి నెట్వర్క్)ను నిర్మించాలని కూడా బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మంగళవారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా రైల్వే మంత్రి సదానంద గౌడ ఈ వివరాలు వెల్లడించారు. ఈ కారిడార్ విషయంలో తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుగా రూ. వంద కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో బుల్లెట్ రైలు పరుగులు తీయాలన్న భారతీయులందరి చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా భారతీయ రైల్వేలు అడుగులేస్తున్నాయని ఆయన లోక్‌సభలో వ్యాఖ్యానిం చారు. ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. వీటిలో ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-చండీగఢ్, ముంబై-అహ్మదాబాద్ రూట్లు ఉన్నాయి. అలాగే ఢిల్లీ-కాన్పూర్, నాగ్‌పూర్-బిలాస్పూర్, మైసూర్-బెంగళూరు, చెన్నై, ముంబై-గోవా, చెన్నై-హైదరాబాద్, నాగ్‌పూర్-సికింద్రాబాద్ సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వరకు పెంచనున్నట్లు రైల్వే మంత్రి వెల్లడించారు. ఇందుకోసం ప్రస్తుత నెట్‌వర్క్‌ను ఆధునీకరించాల్సి ఉంటుందని, అలాగే బుల్లెట్ రైలు కోసం సరికొత్త మౌ లిక వసతులు అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 58 కొత్త రైళ్లొస్తున్నాయ్! న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తొలి రైల్వే బడ్జెట్ 58 కొత్త రైళ్లను మోసుకొచ్చింది. మంగళవారం రైల్వేమంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో 58 కొత్త రైళ్లను ప్రతిపాదించారు. వీటిలో ఐదు జణ్ సాధారణ రైళ్లతోపాటు మరో ఐదు ప్రీమియం రైళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 8 ప్యాసింజర్ రైళ్లు, రెండు మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(మెమూ) సర్వీసులు, 5 డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) సర్వీసులు ఉన్నాయి. అలాగే మరో 11 ైరె ళ్ల గమ్యస్థానాలను పొడిగించారు. అలాగే కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి చార్ధామ్ పుణ్యక్షేత్రాలను కలుపుతూ ఓ కొత్త లైన్‌తో సహా 18 లైన్ల సర్వేను చేపట్టనున్నట్టు మంత్రి వెల్లడించారు. జైపూర్ -కోట, చందన ఫోర్ట్-నాగ్భిర్, మంగళూర్-ఉల్లాల్-సూరత్కల్, రేవారి-మహేందర్గఢ్ల మధ్య డబ్లింగ్ కోసం సర్వేలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జన్ సాధారణ్ రైళ్లు.. 5 1.. అహ్మదాబాద్-దర్భంగా (వయా సూరత్), 2. జైనగర్-ముంబై, 3. ముంబై-గోరఖ్‌పూర్, 4. సహర్సా-ఆనందవిహార్ (వయా మోతీహారీ), 5. సహర్సా-అమృత్సర్ ప్రీమియం రైళ్లు.. 5 1. ముంబై సెంట్రల్-న్యూఢిల్లీ (ఏసీ), 2. షాలిమార్-చెన్నై (ఏసీ), 3. సికింద్రాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ (ఏసీ), 4. జైపూర్-మదురై, 5. కామాఖ్య-బెంగళూరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 6 1. విజయవాడ-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (రోజూ), 2. లోకమాన్యతిలక్ టెర్మినల్(ముంబై)-లక్నో (వారానికోరోజు), 3. నాగపూర్-పుణే (వారానికోరోజు), 4. నాగపూర్-అమృత్సర్ (వారానికోరోజు), 5. నహర్లాగూన్-న్యూఢిల్లీ (వారానికోరోజు), 6. నిజాముద్దీన్-పుణే (వారానికోరోజు) ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 27 1. అహ్మదాబాద్-పాట్నా (వారానికోరోజు), 2. అహ్మదాబాద్-చెన్నై (వారానికి 2 రోజులు), 3. బెంగళూరు-మంగళూరు (రోజూ), 4. బెంగళూరు-షిమోగా (వారానికి 2 రోజులు), 5. బాంద్రా-జైపూర్ (వారానికోరోజు), 6. బీదర్-ముంబై (వారానికోరోజు), 7. ఛాప్రా-లక్నో (వారానికి మూడురోజులు), 8. ఫిరోజ్‌పూర్-చండీగఢ్ (వారానికి 6 రోజులు), 9. గౌహతి-నహర్లాగూన్ (రోజూ), 10. గౌహతి-ముర్కాంగ్సెలెక్ (రోజూ), 11. గోరఖ్‌పూర్-ఆనందవిహార్ (వారానికోరోజు), 12. హాపా-బిలాస్పూర్ (వారానికోరోజు), 13. హుజూర్సాహెబ్ నాందేడ్-బికనీర్ (వారానికోరోజు), 14. ఇండోర్-జమ్మూతావి (వారానికోరోజు), 15. కామాఖ్య-కత్రా (వారానికోరోజు), 16. కాన్పూర్-జమ్మూతావి (వారానికి రెండురోజులు), 17. లోకమాన్యతిలక్ టెర్మినల్ ముంబై-ఆజంగఢ్ ((వారానికోరోజు), 18. ముంబై-కాజీపేట (వారానికోరోజు) వయా బలార్షా, 19. ముంబై-పాటియాలా (వారానికోరోజు), 20. న్యూఢిల్లీ-భటిండా శతాబ్ది (వారానికోరోజు), 21. న్యూఢిల్లీ-వారణాసి (రోజూ), 22. పారాదీప్-హౌరా (వారానికోరోజు), 23. పారాదీప్-విశాఖపట్నం (వారానికోరోజు), 24. రాజ్‌కోట్-రేవా (వారానికోరోజు), 25. రామ్‌నగర్-ఆగ్రా (వారానికోరోజు), 26. టాటానగర్-బయ్యప్పనహళ్లి బెంగళూరు (వారానికోరోజు), 27. విశాఖపట్నం-చెన్నై (వారానికోరోజు) ప్యాసింజర్ రైళ్లు (రోజూ).. 8 1. బికనీర్-రేవారీ , 2. ధార్వాడ్-దండేలీ, 3. గోరఖ్‌పూర్-నౌతాన్వా, 4. గౌహతి-మెందీపత్తర్, 5. హాతియా-రూర్కెలా, 6. బిందూర్-కాసరగోద్, 7. రంగపారా నార్త్-రంగియా, 8. యశ్వంత్‌పూర్-తుంకూర్ మెమూ రైళ్లు.. 2 1. బెంగళూరు-రామనగరం (వారానికి ఆరురోజులు), 2. పల్వాల్-ఢిల్లీ-అలీగఢ్ డెమూ రైళ్లు.. 5 1. బెంగళూరు-నీల్‌మంగళ (రోజూ), 2. ఛాప్రా-మాండ్వాదీ (వారానికి ఆరురోజులు), 3. బారాముల్లా-బనిహాల్ (రోజూ), 4. సంబల్పూర్-రూర్కెలా (వారానికి ఆరురోజులు), 5. యశ్వంత్‌పూర్-హోసూర్ (వారానికి ఆరురోజులు) పాలు, పళ్లు, కూరగాయలకోసం ప్రత్యేక రైళ్లు న్యూఢిల్లీ: ఆహారపదార్థాల రవాణాకు ప్రత్యేక రైళ్లను నడపాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశాన్నంటుతున్న ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పాల రవాణాకు మిల్క్ ట్యాంకర్లు, కూరగాయలు, పళ్ల రవాణాకు ప్రత్యేక సదుపాయాలు కల్పిం చాలని భావిస్తున్నట్లు సదానంద గౌడ తెలిపారు. ఆయన మంగళవారం పార్లమెంటులో రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ... దేశంలోని పది ప్రాంతాల్లో సెంట్రల్ రైల్‌సైడ్ వేర్‌హౌస్ కార్పొరేషన్ (సీఆర్డబ్యూసీ) భాగస్వామ్యంతో పళ్లు, కూరగాయల రవాణాకు శీతలీకరణ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. తొలి దశలో వాత్వా, విశాఖపట్నం, బడగర, చెరియనాడ్, భివాండీ రోడ్, అజారా, నవ్లూర్, కాలంబోలి, సనంద్లలో ఈ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అక్కడినుంచి పంపిణీని సీఆర్‌డబ్ల్యూసీ పర్యవేక్షిస్తుందన్నారు. దీనివల్ల కూరగాయలు వృథాకాకుండా నివారించడంతోపాటు రైతులకు సరసమైన ధరలు లభిస్తాయని తెలిపారు. జాతీయ పాల అభివృద్ధి సంస్థ, అమూల్ సంస్థతో కలిసి పాల రవాణాకు ప్రత్యేక ట్యాంకర్లను నడుపుతామన్నారు. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాల ధరల పెరుగుదల వల్ల మే నెలలో ద్రవ్యోల్బణం 6.01కు చేరినట్లు తెలిపారు. ధరల నియంత్రణకోసం బీజేపీ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. రూ.11,790 కోట్ల రుణాల సేకరణ న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15)లో పెట్టుబడి వ్యయం కోసం రూ.11,790 కోట్ల మేరకు మార్కెట్ రుణాలను సేకరించనుంది. తన కంపెనీలైన ఇండియన్ రైల్వే స్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ), రైల్వేస్ వికాస్ నిగం లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) ద్వారా ఈ రుణాలు చేయనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఈ మొత్తా న్ని రూ.13,800 కోట్లుగా పేర్కొనడం తెలిసిందే. అయితే అంతర్గత వనరులను పెంపొందించుకుంటున్నందున ఆ మేర రుణాలను తగ్గించుకోవాలని ప్రతిపాదించినట్టు మంత్రి తెలి పారు. తాజా ప్రణాళికను అనుసరించి.. గూడ్స్ వ్యాగన్లు, ప్రా జెక్టుల్లో పెట్టుబడుల కోసం ఐఆర్ఎఫ్సీ ద్వారా రూ.11,500 కోట్ల రుణాలను సేకరిస్తారు. ఆర్వీఎన్ఎల్ ద్వారా రూ.290 కోట్లను, పీపీపీ రూపేణా రూ.6,005 కోట్లను సమీకరిస్తారు. యాత్రా స్పెషల్స్ న్యూఢిల్లీ: దేశీయ టూరిజాన్ని అభివృద్ధి పరిచే లక్ష్యంతో ప్రముఖ తీర్థయాత్రా స్థలాలను కలుపుతూ పలు టూరిస్టు రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. ఇప్పటికే దేవీ సర్క్యూట్, జ్యోతిర్లింగ సర్క్యూట్, జైన్ సర్క్యూట్ లాంటి వాటిని రైల్వే శాఖ గుర్తించిందన్నారు. వీటితోబాటు క్రిస్టియన్, ముస్లిం/సుఫి, సిక్, బుద్ధిస్ట్ సర్క్యూట్లే కాకుండా ప్రఖ్యాత ఆలయాల సర్క్యూట్లలలో కూడా రైళ్లు ప్రవేశపెడతామన్నారు. ఈశాన్య ప్రాంతాల్లో ఎకో-టూరిజం, ఎడ్యుకేషన్ టూరిజం కూడా చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని యాత్రా స్థలాలను కలుపుతూ గడగ్, పండరీపూర్ మధ్య.. రామేశ్వరం నుంచి చెన్నై, బెంగళూరు, అయోధ్య, వారణాసిల మీదుగా హరిద్వార్ వరకూ మరో టూరిస్టు రైలు నడుపుతామన్నారు. మహిళా భద్రతకు భరోసా న్యూఢిల్లీ: రైళ్లలో అన్ని తరగతుల బోగీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, వారికి ప్రత్యేక సూచనలు కూడా చేస్తున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. వారి భద్రతకు మరిన్ని అదనపు చర్యలు కూడా తీసుకుంటామన్నారు. స్టేషన్లలో భద్రత పెంచేందుకు 1,700 మంది రైల్వే భద్రతా దళ (ఆర్పీఫ్) కానిస్టేబుళ్లను రిక్రూట్ చేసుకున్నామని, త్వరలోనే వారిని విధుల్లోకి పంపుతామని చెప్పారు. మరో 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించాలని ప్రతిపాదించామని, వీరిని మహిళల బోగీలకు రక్షణగా పంపుతామని పేర్కొన్నారు. రైళ్లకు రక్షణ గా వెళ్లే ఆర్పీఎఫ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు అందజేస్తామని, ప్రయాణికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని సంప్రదించవచ్చని అన్నారు. భద్రతకు సంబంధించిన హెల్ప్‌లైన్‌ను విస్తరిస్తామని, స్టేషన్ల చుట్టూ ప్రహరీల నిర్మాణాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టేందుకు మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. రైల్వే వర్సిటీ ఏర్పాటుపై పరిశీలన న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన అంశాల అధ్యయనం లక్ష్యంగా రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాంకేతిక పరిజ్ఞాన అంశాలు, సాంకేతికేతర అంశాల అధ్యయనంకోసం ఈ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. సిబ్బందిలో నైపుణ్యాల మెరుగుదలకోసం ప్రణాళికలు రూపొందించినట్టు బడ్జెట్ సమర్పణ సందర్బంగా రైల్వే మంత్రి చెప్పారు. రైల్వేలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాఠ్యాంశాలను గ్రాడ్యుయేషన్ స్థాయిలో ప్రవేశపెట్టేందుకు సాంకేతిక విద్యా సంస్థలతో రైల్వేశాఖ అవగాహన కుదుర్చుకుంటుందన్నారు. కింది స్థాయి సిబ్బందిచేత స్వల్పకాలిక కోర్సులను అధ్యయనం చేయిస్తామన్నారు. హై స్పీడ్, భారీ స్థాయి సరుకు రవాణా తదితర కార్యకలాపాలపై సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తగ్గిన ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు న్యూఢిల్లీ: అధిక ఆదాయం కోసం ఎయిర్ కండీషన్డ్ బోగీల ప్రయాణి కులపై కన్నేసిన రైల్వేకు చేదువార్త. గత ఏడాదితో పోలిస్తే ఏసీ మొదటి తరగతి, ఏసీ త్రీటైర్ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఏసీ ఫస్ట్‌క్లాస్‌లో 33.1 లక్షల ప్రయాణించగా, 2013-14 లో 26.1 లక్షల మంది మాత్రమే వెళ్లారు. 2012-13లో ఏసీ త్రీటైర్ బోగీల్లో 7 కోట్ల మందికిపైగా ప్రయాణించగా, 2013-14లో 6.87 కోట్ల మంది ప్రయాణించారు. అయితే ఏసీ చైర్‌కార్ తరగతి ప్రయాణికుల సంఖ్య మాత్రం కాస్త పెరిగింది. ఈ తరగతిలో గత ఏడాది 2.21 కోట్ల మంది వెళ్లగా 2013-14లో 2.51 కోట్ల మంది వెళ్లారు. ఏసీ స్లీపర్(ఏసీ టూటైర్) ప్రయాణికుల సంఖ్య కూడా 2.23 కోట్ల నుంచి 2.25 కోట్లకు పెరిగింది. తాజా బడ్జెట్ ప్రకారం.. ఏడాది ఏసీ ఫస్ట్‌క్లాస్‌లో 38.6 లక్షల మంది ప్రయాణిస్తారని ప్రభుత్వ అంచనా. బుల్లి.. బుల్లి రైళ్లు... టాయ్ ట్రైన్లు అంటే.. బొమ్మ రైళ్లనుకునేరు. ప్రముఖ చారిత్రక రైల్వే లైన్లపై నడిచే చిన్న రైళ్లే.. టాయ్ ట్రైన్లు. ప్రధానంగా పర్వత ప్రాంతాల మీదుగా సాగే ఈ రైళ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. గమ్యస్థానాలు చేరడానికి దాదాపు ఎనిమిది గంటలసమయం కూడా పడుతుంటుంది. అయినప్పటికీ ప్రయాణం మాత్రం ఎందో ఆహ్లాదకరంగా ఉంటుంది. కారణం.. వీటిలో బోగీలు మామూలు రైళ్ల మాదిరిగా కాకుండా.. రెండువైపులా కొండకోనల అందాలను తిలకించడానికి, పిల్లగాలులను ఆస్వాదించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో ప్రముఖమైనవి.. డార్జిలింగ్ హిమాలయన్ రైలు తూర్పు హిమాలయాల నుంచి డార్జిలింగ్‌లోని తేయాకు తోటల వరకు ప్రయాణిస్తుంది. 1881లో మొదలైన ఈ రైలే.. భారత్‌లో మొట్టమొదటి టాయ్ ట్రైను. కల్కా-సిమ్లా రైలు బ్రిటిష్ పాలకులు 1903లో తమ వేసవి రాజధాని సిమ్లాకు వెళ్లడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 100 సొరంగ మార్గాలు, దేవదార్ అడవులు, పర్వత ప్రాంతాల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. మాథేరన్ రైలు 1907లో దీన్ని ప్రారంభించారు. సైకిళ్లు సహా వాహనాలకు ప్రవేశం లేని మాథేరన్ (మహారాష్ట్ర) కొండ ప్రాంతాల్లో పచ్చని అందాల నడుమ ప్రయాణిస్తుంది. కొండపైకి వెళ్లడానికి దాదాపు 2.30 గంటల సమయం పడుతుంది. ఊటీ నీలగిరి రైలు తమిళనాడులోని ఊటీ సోయగాలతో మనల్ని పరవశింపజేస్తూ సాగుతుంది ఈ రైల్లో ప్రయాణం. ఇది 1899లో ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఇది. గంటకు 10 కిలోమీటర్లు మాత్రమే వెళుతుంది. కంగర వ్యాలీ రైలు ఇది పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి సుందరమైన జోగీందర్ నగర్ లోయ వరకు నడుస్తుంది. హిమాలయా ఉప ప్రాంతాల్లో 163 కిలోమీటర్ల పాటు సాగుతుంది దీని ప్రయాణం. 1929లో దీన్ని ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో ముఖ్యాంశాలు ♦ 2014-15లో రూ.1,64,374 కోట్ల ఆదాయం అంచనా. ఖర్చును రూ.1,49,176 కోట్లకు కుదించారు. ♦ గతంలో లేనంత ఎక్కువగా రూ.65,455 కోట్ల ప్రణాళికా వ్యయం. ♦ మొత్తం 58 కొత్త రైళ్లు. వీటిలో ఐదు జన్ సందర్శన్, ఐదు ప్రీమియం, ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నారుు. 11 రైళ్ల పొడగింపు. ♦ {పయూణికుల చార్జీలను, సరుకు రవాణా చార్జీలను పెంచలేదు. ♦ త్వరలో హైస్పీడ్ నెట్‌వర్క్‌తో పాటు పట్టాల పైకి బుల్లెట్ రైళ్లు. ♦ ముంబరుు-అహ్మదాబాద్ సెక్టార్లో బుల్లెట్ రైలు. ♦ హైస్పీడ్ రైళ్ల కోసం వజ్ర చతుర్భుజి. ఈ ప్రాజెక్టు కోసం రూ.9 వేల కోట్లు అవసరం. రూ.100 కోట్ల కేటారుుంపు. ♦ తొమ్మిది సెక్టార్లలోని ఎంపిక చేసిన మార్గాల్లో రైళ్ల స్పీడ్‌ను గంటకు 160 నుంచి 200 కిలోమీటర్లకు పెంచే యోచన. ♦ ఆన్లైన్లో ఫ్లాట్‌ఫామ్‌తో పాటు అన్ రిజర్వ్డ్ టికెట్లు. స్టేషన్ల వద్ద పార్కింగ్‌కు, ప్లాట్‌ఫామ్‌కు కలిపి కోంబో టికెట్లు ♦ అన్ని స్టేషన్లలో ప్రయూణికుల విశ్రాంతి గది సౌకర్యం. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రధాన స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు. రైలు సమయంపై ప్రయూణికులను అప్రమత్తం చేసేందుకు ఎస్మెమ్మెస్. ♦ భద్రత పెంపు కోసం 17 వేల మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల భర్తీ. మహిళల బోగీల్లో భద్రత కోసం 4 వేల మంది మహిళా కానిస్టేబుళ్ల నియూమకం. రైళ్లలోని ఆర్పీఎఫ్ బృందాలకు మొబైల్ ఫోన్లు. ♦ {పధాన రైళ్లు, సబర్బన్ బోగీలకు తలుపులు ఆటోమేటిక్‌గా మూసుకునే వ్యవస్థ ఏర్పాటు ♦ సాంకేతిక, సాంకేతికేతర సబ్జెక్టులకు రైల్ విశ్వవిద్యాలయం. ♦ విమానాశ్రయూన్ని తలపించేలా, అలాంటి అనుభూతిని కలిగించేలా అంతర్జాతీయ స్థారుుకి టాప్ 10 స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ. ♦ స్టేషన్ల నిర్వహణకు మూల నిధి ఏర్పాటు. స్టేషన్లు, రైళ్లలో ఆర్వో తాగునీరు. ప్రధాన స్టేషన్లకు సౌర విద్యుత్ సౌకర్యం. ♦ రైలు ప్రయూణికులకు మరింత మెరుగైన ఆహారం. ప్రముఖ కంపెనీలకు చెందిన వండి తినడానికి సిద్ధంగా ఉన్న భోజనం అందజేత. నాణ్యత లోపిస్తే సంబంధితులపై చర్యలు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్. ♦ శుభ్రత కోసం ఉద్దేశించిన బడ్జెట్ 40% పెంపు. స్టేషన్లలో శుభ్రతను పర్యవేక్షించేందుకు సీసీటీవీల వినియోగం. మూడో పార్టీ ♦ రిజర్వేషన్ విధానం పునర్వ్యవస్థీకరణ. మొబైల్ ఫోన్లు, పోస్ట్ ఆఫీసుల ద్వారా టికెట్ బుకింగ్‌కు మరింత ప్రచారం. ♦ ఇ-టికెటింగ్ విధానంలో నిమిషానికి 7,200 టికెట్ల జారీ. ఏకకాలంలో 1,20,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం. ప్రస్తుతం నిమిషానికి 2 వేల టికెట్లే జారీ. ♦ కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ఆఫీస్ ఆన్ వీల్స్, వై-ఫై, వర్క్ స్టేషన్ సదుపాయూలు. ♦ ఒక్కో ప్రయూణికుడిపై ఒక కిలోమీటర్‌కు వాటిల్లుతున్న నష్టం 10 పైసల (2000-01) నుంచి 23 పైసలకు (2012-13) పెరుగుదల. ♦ సంపాదించిన రూపారుులో 94 పైసల ఖర్చు. కేవలం 6 పైసలే మిగులు. ప్రస్తుత ప్రాజెక్టుల కోసం వచ్చే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసర ం. ఐదేళ్లలో కాగితాలు లేని రైల్వే కార్యాలయూలు. ♦ స్వామి వివేకానంద బోధనల కోసం ప్రత్యేక రైలు ఆఫీస్ ఆన్ వీల్స్ రైళ్లలో ప్రయాణించే వాణిజ్యవేత్తల సౌకర్యార్థం ‘ఆఫీస్ ఆన్ వీల్స్’ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. ఎంపిక చేసిన కొన్ని రైళ్లలో వర్క్స్టేషన్లను ఏర్పాటు చేస్తామనీ, వీటిని వినియోగించుకునే వారు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందనీ చెప్పారు. అన్ని ఏ1, ఏ తరగతి స్టేషన్లతో పాటు కొన్ని రైళ్లలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తామని వివరించారు. -
స్వీటు ఆశిస్తే.. నోటిపై జెల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఢిల్లీలో పాలకులు మారినా, జిల్లాలో ప్రజా ప్రతినిధులు మారినా..కథ మారలేదు. ఈ గడ్డ అభివృద్ధికి దోహదపడే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి మళ్లీ నిరాశ తప్పలేదు. మంగళవారం సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కూడా పాతపంథాలోనే జిల్లావాసుల ఆశలకు పూచికపుల్ల విలువనివ్వలేదు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసే ప్రతి నేతా రైల్వే ప్రాజెక్టులను సాధిస్తామని ఎన్నికల్లో..‘బొగ్గు ఇంజన్ కూత’లా బిగ్గరగా వాగ్దానం చేస్తుంటారు. తీరా ఎన్నికయ్యాక.. తమ హయాంలో ప్రవేశపెట్టే ఏ రైల్వేబడ్జెట్లోనూ జిల్లావాసుల కలలు సాకారమయ్యేందుకు కించిత్తు కృషి చేయకుండానే పదవీకాలం ముగించేస్తున్నారు. యూపీఏ-2 సర్కారు పోయి, ఎన్డీయే ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది. జిల్లా నుంచి ముగ్గురు ఎంపీలుగా ఆ కూటమిలో భాగస్వామియైన తెలుగుదేశం వారే ఎన్నికయ్యారు. అయినా రైల్వే బడ్జెట్ షరామామూలుగానే జిల్లావాసుల ఆశలను.. తాయిలం కోసం ఎదురు చూసిన పిల్లల నోటిపై గుద్దినట్టు.. చిత్తు చేసింది. పెండింగ్‌లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించ లేకపోయిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల అనంతరం జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తారని వారు మండిపడుతున్నారు. వారూ వీరూ.. ఒకటే తీరు సార్వత్రిక ఎన్నికల ముందు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించి సాధిస్తామన్న ముగ్గురు ఎంపీలు తోట నరసింహం, మురళీమోహన్, పండుల రవీంద్రబాబు ఏమీ సాధించలేక చేతులెత్తేశారు. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు మొండిచేయి చూపడంతోనే వారి వైఫల్యం తేటతెల్లమైంది. తొలి ప్రాధాన్యం పిఠాపురం-కాకినాడ మెయిన్ రైల్వేలైన్ అని కాకినాడ ఎంపీ తోట ఎన్నికల సందర్భంగా పలు చోట్ల చెప్పారు. ఇదివరకు ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎంఎం పళ్లంరాజు ఒకసారి మెయిన్ లైన్ వద్దని, మరోసారి అవసరమని పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశారే తప్ప ప్రాజెక్టు సాధించలేకపోయారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్ సాధనే తన లక్ష్యమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు ఎన్నికల్లో జనాన్ని నమ్మించారు. ఇదివరకు ఇదే ప్రాజెక్టు కోసం గంభీరోపన్యాసాలు చేసిన అప్పటి ఎంపీ హర్షకుమార్ కూడా ఇదే రకంగా ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఇప్పుడు రవీంద్రబాబు కూడా నిధుల సాధనలో విఫలమయ్యారు. దక్షిణ మధ్య రైల్వేకు రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్న జిల్లా పట్ల ఈసారి రైల్వేబడ్జెట్‌లో కూడా వివక్షనే చూపడంపై జిల్లావాసులు, మేధావి వర్గ ప్రతినిధులు నిప్పులు చెరుగుతున్నారు. గత దశాబ్దంగా యూపీఎ- 1, 2 సర్కార్ల హయాంలో ఏటా రైల్వే బడ్జెట్లలో మొండిచేయే ఎదురైంది. గత ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్‌లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. ఎన్డీఏ సర్కారైనా జిల్లాకు సముచిత ప్రాతినిధ్యం ఇస్తుందని ఆశిస్తే..‘దొందూ దొందే’ అన్నట్టు యూపీఏలాగే జిల్లాకు జెల్ల కొట్టింది. అన్ని డిమాండ్లపైనా చిన్నచూపే.. జిల్లా కేంద్రం కాకినాడను మెయిన్‌లైన్‌కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల సాకారం కావాలంటే కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్ల అంచనాతో కూడిన ఈ ప్రాజెక్టు ఈసారి కూడా పట్టాలెక్కలేదు. ఆ దిశగా లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ ఎంపీ తోట చేసిన ప్రయత్నం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి కృషితో 2000లో పునాదిరాయి పడిన కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌కి ఈసారి కదలిక ఉంటుందని కోనసీమ వాసులు ఆశించగా ఈ బడ్జెట్లోనూ వెక్కిరింతే మిగిలింది. 55 కిలోమీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం ఏటా పెరుగుతూ ఇప్పుడు రూ.1100 కోట్లకు చేరింది. భూ సేకరణ పూర్తయిన ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. నిర్మాణవ్యయంలో 25 శాతం ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. ఈ రెండు ప్రధాన డిమాండ్లతో పాటు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపిన కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేను సైతం ఈ బడ్జెట్లో గాలికొదిలేశారు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, పుదుచ్చేరి వరకు సర్కార్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు డిమాండ్లు కాగితాలకే పరిమితమయ్యాయి. చెన్నై నుంచి విశాఖకు వారానికి ఒకసారి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన రైలు జిల్లా మీదుగా వెళ్లడం మినహా సదానందగౌడ బడ్జెట్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదు. -
జిల్లాలో ఆగని ‘గౌడ’ రైలు
కర్నూలు (రాజ్‌విహార్) : ఈ సారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చినా.. రైల్వే మంత్రిత్వ శాఖను దక్కించుకోలేకపోయింది. రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి రాయితీలు సాధించలేకపోయింది. కర్నూలు జిల్లా ప్రజలకు ఎప్పటిలాగే నిరాశే మిగిలింది. ఎన్నో ఆశల నడుమ ఊరించిన ఎన్డీఏ తొలి రైల్వే బడ్జెట్ ఊహలకు అందనిరీతిలో ఉసూరుమనిపించింది. రైల్వే మంత్రి సదానందగౌడ మంగళవారం ప్రకటించిన ఈ బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. కొత్త ప్రాజెక్టుల ఊసు అసలు లేకపోగా.. పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావనే ఎత్తలేదు. గత రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వర్క్‌షాపు నిర్మాణానికి నిధులు మంజూరు చేయలేదు. దశాబ్దాల కాలంగా డిమాండ్‌లో ఉన్న కర్నూలు- మంత్రాలయం రైలు మార్గానికి పట్టిన గ్రహణం వీడలేదు. జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల పురోగతికి రూ.2 వేల కోట్లు కావాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న 29 ప్రధాన ప్రాజెక్టుల స్థితి గతులను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయడం తప్ప బడ్జెట్‌తో ఏమీ ఒరగలేదని చెప్పవచ్చు. ప్రతిపాదనలకు రెడ్ సిగ్నల్.. కర్నూలులో రైల్వే మిడ్‌లైఫ్ రీహామిటిటేషన్ వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు 2013 బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. రెండు మూడు సార్లు నగర శివారులోని పంచలింగాల వద్ద స్థల పరిశీలన చేసినా సేకరణ జరగలేదు. దీనికి రూ. 250 కోట్లు కావాలని అధికారులు అంటున్నా ఈ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దూపాడు వద్ద ట్రైన్ మెయింటెనెన్స్ (నిర్వహణ) షెడ్ ఏర్పాటు చేస్తామని నాటి మంత్రి కోట్ల చెప్పారు. దీనికి రూ.2 కోట్లు కావాల్సి ఉన్నా ఎలాంటి కేటాయింపుల్లేవు. మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన కొత్త లైను కోసం గతంలో మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు సర్వే పనులకు గ్రీన్ లభించింది. రెండు సార్లు సర్వే చేసి నిధులు దుర్వినియోగపర్చారు తప్ప ఎలాంటి పనులు చేపట్టలేదు. ఈసారి కూడా ఆ లైను ఊసేలేదు. ఎర్రగుంట్ల-నంద్యాల లైను పెండింగ్ పనుల ప్రస్తావన లేదు. గుంటూరు - గుంతకల్లు మధ్య 400 కిలోమీటర్ల వరకు సర్వే పనులు పూర్తయినా పురోగతి మాటేలేదు. సిటీగా మారిన కర్నూలు స్టేషన్ ఆధునికీకరణకు నిధుల్లేవు. హొస్పేట - మంత్రాలయం - కర్నూలు - శ్రీశైలం మీదుగా గుంటూరు రైల్వే లైన్‌ను కలుపుతూ కొత్త రైలు, డోన్ నుంచి కర్నూలు, గద్వాల, రాయచూరు మీదుగా ముంబైకి రైలు నడపాలనే డిమాండ్‌కు మోక్షం లభించలేదు. కాచిగూడ - బెంగళూరు వరకు గరీబ్థ్‌క్రు, విజయవాడ నుంచి నంద్యాల, డోన్, కర్నూలు హైదరాబాద్ మీదుగా రాజ్‌కోట్ వరకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో నిర్మించవచ్చనే ప్రచారం జరుగుతోంది. అదే జిల్లా కేంద్రం కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఒక్క రైలు కూడా అందుబాటులో లేదు. అయితే గుంటూరు వరకు రెండు రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. విజయవాడ వరకు కనీసం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉన్నా ప్రస్తావన లేదు. చెన్నై - హైదరాబాద్ మధ్య హై స్పీడు ఎక్స్‌ప్రెస్ రైలు నడుపుతామని ప్రకటించినా.. ఏ మార్గాన నడుపుతారో స్పష్టం చేయలేదు. బెంగళూరు నుంచి కాచిగూడకు ప్యాసింజరు రైలు ప్రకటించినా కర్నూలు మీదుగా వస్తుందో లేదో తెలియదు. -
‘సదా’ నిరాశ
సాక్షి, మంచిర్యాల : నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఎప్పటిలాగే జిల్లావాసులకు నిరాశ మిగిల్చింది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ప్రజల కలలకు గండిపడింది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును హై స్పీడు రైలుగా మారుస్తామన్న నిర్ణయం తప్ప మరేదీ జిల్లాకు దక్కలేదు. పెండిం గ్ ప్రాజెక్టులు, నూతన రైల్వేలైన్ల ప్రతి పాదనలపై ఇరు రాష్ట్రాల కోసం వేసిన కమిటీయే ఫైనల్ అని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. దీంతో జిల్లాలోని ప్రతిపాదిత ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, స్టేషన్ల నవీకరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్-నిర్మల్, ఆదిలాబాద్-మంచిర్యాల్ వయా ఉట్నూర్ రైల్వే లైన్ల సర్వేపై ఉమ్మడి కమిటీ తరువాతే స్పష్టత రానుంది. దీంతోపాటు ఎంపీలు గొడం నగేశ్, బాల్క సుమన్‌ల ప్రతిపాదనలు బుట్టదాఖలే అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్- ఆదిలాబాద్ ఇంటర్సిటీ కేటాయింపు, ఖాజీపేట్-బల్లార్ష రూటులోని పలు రైళ్ల బోగీలకు ఏసీ బోగీలు అమర్చేందుకు స్పష్టత రాలేదు. సికింద్రబాద్ నుంచి హజ్రత్ నిజామొద్దీన్(న్యూఢిల్లీ)ల మధ్య ప్రీమియం రైలు ఏర్పాటు అంశం జిల్లావాసులకు ఊరట కలిగించేదే అయినప్పటికి, జిల్లాలోని ఏయే స్టేషన్లలో ఈ రైలుకు నిలుపుదల(హాల్ట్) ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.ప్రధాన రైల్వే స్టేషన్లలో సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నప్పటికి జిల్లాలో ఆ సౌలభ్యం పొందగల స్టేషన్లు ఏవి లేవు. ఖాజీపేట-కాగజ్‌నగర్‌ల మధ్య మరిన్ని రైళ్లు, మరిన్ని బోగీలు ఉంటాయనే ఆశతో రైల్వే బడ్జెట్ కోసం ఎదురు చూసిన జిల్లా వాసులకు మోడీ మార్కు బడ్జెట్ రుచించలేదు. ఎంపీలు విన్నవించినా.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం కాబట్టి నిధులు కేటాయిస్తారని భావించినప్పటికి సదానంద గౌడ నిరాశే మిగిల్చారు. ఆదిలాబాద్-గడ్చందూర్ రైలు సర్వే విషయంలోనూ మొండిచేయి చూపారు. మంచిర్యాల, బాసర రైల్వే స్టేషన్లలో ఔట్ పేషెంట్ డిస్పెన్సరీ ఏర్పాటుపై నిరాశే మిగిల్చారు. జిల్లాలో విశాలంగా విస్తరించి ఉన్న తూర్పు, పశ్చిమ ప్రాంతాలను అనుసంధానించేందుకు ఆదిలాబాద్-మంచిర్యాల వయా ఉట్నూరు రైలు లైను ఏర్పాటుతో, జిల్లాలోని ప్రజలకు రవాణా మార్గం సుగమమం అయ్యేది. దీనిపై బడ్జెట్లో ప్రస్తావించక పోవడంపై జిల్లా వాసులు నిరాశ చెందుతున్నారు. భాగ్యనగర్, సింగరేణి, రామగిరి, తెలంగాణ రైళ్లలో ఏసీ కోచ్‌లతోపాటు, అదనపు బోగీల ప్రస్తావనే బడ్జెట్లో లేదు. ఈ విషయమై కేంద్ర రైల్వే మంత్రికి పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ వినతి పత్రం సమర్పించినప్పటికి ఫలితం లేదు. నవజీవన్, దర్బాంగ, జీటీ ఎక్స్‌ప్రెస్‌లను బెల్లంపల్లిలో హాల్ట్ చేయాలనే డిమాండును పట్టించుకోలేదు. ఆదిలాబాద్-సికింద్రాబాద్ రైల్వే లైను సర్వే కోసం ప్రతి బడ్జెట్‌లోను ఆశగా ఎదురు చూస్తున్న పశ్చిమ జిల్లా ప్రజలకు ఈసారి యథావిధిగా నిరాశే మిగల్చడం గమనార్హం. సింగిల్ లైన్ వల్ల అవస్థలు ఎదురవుతున్న హైదరాబాద్-ఆదిలాబాద్ డబ్లింగ్ పనులకు నిధుల కేటాయింపు లేనే లేదు. ఈ విషయమై ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్ కేంద్ర మంత్రికి విన్నవించినా ఫలితం శూన్యం. ఈ సారైనా నిధులు విడుదల చేస్తే, ఈ లైను పనుల్లో పురోగతి ఉంటుందని భావించిన వారి ఆశలు అడియాశలయ్యాయి. -
రైల్వే బడ్జెట్ నజరానా: రెండు రాష్ట్రాలకూ మొండిచేయి
తెలుగింటికో కమిటీ ప్రస్తుతం అమల్లో ఉన్న 29 రైల్వే ప్రాజెక్టులపై కమిటీ వేశాం.. ఆ నివేదిక వచ్చాక చర్యలు చేపడతామన్న రైల్వే మంత్రి సదానంద గౌడ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు.. ఏపీకి ఏసీ డైలీ ఎక్స్‌ప్రెస్ రెండు రాష్ట్రాలకు మూడు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు మిగిలిన అంశాల్లో కనిపించని మన రాష్ట్రాలు సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే మంత్రి సదానంద గౌడ మొండిచేయి చూపారు. ఒకట్రెండు మెరుపులు మినహా రైల్వే బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. కొన్ని కొత్త రైళ్లు ఇచ్చారు తప్పితే, మౌలిక వసతులకు సంబంధించి కొత్తగా లబ్ధి కనిపించలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు చేపడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. రెండు రాష్ట్రాల్లో రూ. 20,860 కోట్ల అంచనా వ్యయంతో 29 ప్రాజెక్టులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని, రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశాలు జరిపిన తరువాత వారి అవసరాలనుబట్టి పూర్తిచేసేందుకు యత్నిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 18 కొత్త రైల్వే మార్గాలకు సర్వే పనులు చేపడతామని ప్రకటించినప్పటికీ, వాటిలో రెండు రాష్ట్రాలకు చెందినవి ఒక్కటీ లేదు. అలాగే డబ్లింగ్, గేజ్ మార్పిడి పనుల్లోనూ చోటు దక్కలేదు. రైళ్ల పొడిగింపులోనూ మన సర్వీసులేవీ లేవు. దేశవ్యాప్తంగా ఐదు జనసాధారణ్ రైళ్లు ప్రవేశపెట్టినా వాటిలోనూ అంతే. తీర్థయాత్రల కోసం ప్రవేశపెడుతున్న ప్రత్యేక రైళ్లలోనూ మన ప్రస్తావనే లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీల వినతులకు మోక్షం లభించలేదు. ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట ప్రత్యేక డివిజన్ ప్రతిపాదనలను రైల్వే మంత్రి పట్టించుకోలేదు. రెండు మూడేళ్ల క్రితం ప్రారంభించిన సర్వే పనులకు కూడా ఐదారు లక్షలు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. అలాగే స్టేషన్ల ఆధునీకరణ తదితర అంశాల ప్రస్తావనే లేదు. దేశ రాజధానిని కలుపుతూ తెలంగాణకు ఒక ప్రీమియం రైలు, ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఏసీ ఎక్స్‌ప్రెస్ కేటాయింపు మాత్రమే ఊరట కలిగించే అంశం. జనసాధారణ్ రైళ్లే కాదు.. ప్యాసింజర్, మెమూ, డెమూ రైళ్లలో రెండు రాష్ట్రాలకూ ఒక్కటి కూడా ఇవ్వలేదు. రైళ్ల పొడిగింపు, కొత్త లైన్లు, డబ్లింగ్ పనులూ ఒక్కటీ లేవు. -
ఇలాగైతే.. అంతా హైఫై..
ఆఫీసు పనిమీద ముంబై వెళుతున్నారు.. జస్ట్ మీ మొబైల్ ఫోన్‌తోనే టికెట్ బుక్ చేసుకున్నారు.. స్టేషన్‌కు వెళ్లగానే పూర్తి పరిశుభ్రంగా ఉన్న ఆవరణ మీకు స్వాగతం పలికింది.. మెట్లెక్కే శ్రమ ఏమాత్రం లేకుండా ‘ఎస్కలేటర్’పై నుంచుని కావాల్సిన ప్లాట్‌ఫాంపైకి వెళ్లారు.. రైలుకు ఇంకా సమయం ఉండడంతో అక్కడే ఉన్న ‘ఫుడ్ కోర్ట్’కు వెళ్లి పిజ్జా తిన్నారు.. తర్వాత ‘రెస్ట్ రూమ్’కెళ్లి హాయిగా కూర్చున్నారు.. అక్కడే మీ ల్యాప్‌టాప్ తీసి స్టేషన్లో ఏర్పాటు చేసిన ఉచిత వైఫై ఇంటర్నెట్కు అనుసంధానమై పనిచేసుకుంటున్నారు.. ఇంతలో రైలు రాబోతోందని మీ ఫోన్‌కు కాల్ వచ్చింది.. లేచివెళ్లి రెలైక్కారు.. మీ సీట్లో కూర్చుని రైల్లోనూ ఏర్పాటు చేసిన వైఫైతో ఇంటర్నెట్లో విహరించారు.. ఆకలైతే చిన్న ఎస్సెమ్మెస్‌తో మీక్కావాల్సిన దానికి ఆర్డరిచ్చారు.. వచ్చే స్టేషన్లోనే రుచిగా, శుచిగా ఉన్న భోజనం మీ వద్దకు వచ్చేసింది.. ఈ లోగా టీసీకి మీ మొబైల్‌కు వచ్చిన ‘టికెట్ సందేశా’న్ని చూపించేశారు.. తర్వాత మీ వద్దకు వచ్చిన ‘హౌస్ కీపింగ్’ సిబ్బందితో మ్యాగజైన్, మంచినీళ్లు తెప్పించుకున్నారు.. కాసేపటికి నిద్రపోయారు.. మీరు దిగాల్సిన స్టేషన్ రావడానికి కొద్ది నిమిషాల ముందు ‘మీ స్టేషన్ రాబోతోంద’ంటూ ఫోన్‌కాల్ వచ్చింది.. లేచి బ్యాగ్ సర్దుకోగానే స్టేషన్ వచ్చేసింది.. రైలుదిగి ముందుగానే బుక్ చేసుకున్న వీఐపీ రెస్ట్రూమ్కు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.. అక్కడే కాస్త రెడీ అయ్యి వచ్చిన పనిమీద నగరంలోకి వెళ్లారు. - రైల్వే మంత్రి బడ్జెట్లో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవ రూపం దాల్చితే.. త్వరలో అందుబాటులోకి వచ్చే సౌకర్యాలివి! ఇంతేకాదు.. కాయిన్ వేసి ప్లాట్‌ఫాం టికెట్ తీసుకునేలా వెండింగ్ యంత్రాలు.. పోస్టాఫీసుల్లో రైలు టికెట్లు.. ఇంటర్నెట్లో ప్లాట్‌ఫాం, అన్ రిజర్వుడ్ టికెట్లు, ‘రెస్ట్ రూమ్’ను బుక్ చేసుకునే అవకాశం.. ఏ రైలు ఏ సమయంలో ఎక్కడ ప్రయాణిస్తోందో తెలుసుకునే ఏర్పాట్లు.. స్టేషన్లు, రైళ్లలో మినరల్ వాటర్ అందించే ఏర్పాట్లు.. బయో టాయిలెట్లు.. విస్తృతంగా సీసీ కెమెరాలు.. వంటి సౌకర్యాలెన్నో అందుబాటులోకి రానున్నాయి. ప్రగతికారకం, మార్గదర్శకం ఈ రైల్వే బడ్జెట్ ప్రగతికారకం, మార్గదర్శకం. పారదర్శకమైన, సంస్థాగతంగా రైల్వేను బలోపేతం చేయగలిగిన బడ్జెట్‌ను సదానంద గౌడ ప్రవేశపెట్టారు. సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగేలా తక్కువ సమయంలోనే రైల్వేకు మంచి దిశానిర్దేశం చేశారు. సాధారణ ప్రజలకు ఉత్తమ సేవలు అందించేలా, వేగవంతమైన అభివృద్ధితోపాటు భద్రత కల్పించేలా రైల్వే బడ్జెట్ ఉంది. - నరేంద్ర మోడీ, ప్రధాని 6 నెలలకోసారి చార్జీల సవరణ ప్రయాణ చార్జీలను ప్రతి ఆరునెలలకూ సవరించేందుకు ఇంధన ధరల సర్దుబాటు అంశాన్ని (ఎఫ్‌ఏసీని) ప్రాతిపదికగా తీసుకునే ప్రక్రియను కొనసాగిస్తాం. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే టారిఫ్ అథారిటీ ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నాం. బుల్లెట్ రైళ్లపై ఒక సర్వే నివేదిక అందింది. మరో నివేదిక వచ్చే నెలాఖరుకు రావచ్చు. నివేదిక అందగానే నిర్ణయం తీసుకుంటాం. రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంలో ప్రైవేటు పెట్టుబడిదారుల ప్రమేయంపై పెట్టుబడిదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. - విలేకరులతో రైల్వే మంత్రి సదానందగౌడ నిజాయతీ గల బడ్జెట్ ఇది రైల్వే బడ్జెట్ వాస్తవాలను ప్రతిబింబించేదిగా ఉన్న ఒక నిజాయితీ కలిగిన బడ్జెట్. గడిచిన కొన్నేళ్లుగా నిర్వహణ లోపం వల్ల భారత రైల్వే కష్టాల పాలయింది. త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తిచేయాలన్న కేంద్రం కొత్త ఆలోచనను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. జనార్షక, అవాస్తవిక బడ్జెట్ల కంటే హేతుబద్ధమైన నిర్వహణే మేలు చేస్తుంది. - వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి -
ఇక హైస్పీడ్‌లో రైల్వేల అభివృద్ధి..!
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్ అభివృద్ధిని ప్రేరేపించేదిగా ఉందని వాణిజ్య, పారిశ్రామిక రంగాలు వ్యాఖ్యానించాయి. ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ఆకర్షణపై దృష్టిపెట్టడంతో మౌలిక సౌకర్యాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపాయి. ‘భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కావలసిన నిధుల్లో భారీ మొత్తాన్ని పీపీపీ మార్గం ద్వారా సమీకరిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను మేం స్వాగతిస్తున్నాం. ఈ ప్రతిపాదనతో నిధుల కొరతను అధిగమించవచ్చు. రైల్వేల ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు...’ అని ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ్ బిర్లా తెలిపారు. పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సరకు రవాణా టెర్మినళ్లను, లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతామని రైల్వే మంత్రి సదానంద గౌడ రైల్వే బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. హైస్పీడ్ రైళ్లతో సహా భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టులకు నిధులను ప్రధానంగా పీపీపీలోనే సమకూరుస్తామని చెప్పారు. ఎఫ్‌డీఐ అనుమతిపై హర్షం... మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల్లో ఎఫ్‌డీఐని అనుమతించే యోచన హర్షణీయమని అల్స్టోమ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా ఎండీ భరత్ సల్హోత్రా అన్నారు. అరకొర నిధులతో సతమతమవుతున్న భారతీయ రైల్వేలకు ఈ నిర్ణయంతో పుష్కల ఆర్థిక వనరులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశీయ రైల్వే రంగంలో ప్రపంచ స్థాయి మౌలిక సౌకర్యాలను త్వరగా ఏర్పాటు చేసేందుకు ఎఫ్‌డీఐలు దోహదపడతాయని అన్నారు. బడ్జెట్లో చేసిన ప్రకటనలు రైల్వే మౌలిక సౌకర్యాల మెరుగుకు, ఉపాధి అవకాశాల కల్పనకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపురియా పేర్కొన్నారు. ‘ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచారు. అధికార దాహంతో కూడిన పథకాలేవీ లేవు. మార్కెట్లు ఇంతకంటే ఏం ఎక్కువ ఆశించాయి?...’ అని మహింద్రా అండ్ మహింద్రా సీఎండీ ఆనంద్ మహింద్రా ట్వీట్ చేశారు. పెట్టుబడుల ప్రవాహం... పీపీపీ పద్ధతిని పాటించడం వల్ల ప్రైవేటు, విదేశీ పెట్టుబడులు భారీగా తరలివస్తాయని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ చెప్పారు. మోడీ సారథ్యంలోని ప్రభుత్వానికి అత్యంత విశ్వసనీయత ఉందని అన్నారు. కీలక నిర్ణయాల్లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రక్రియతో రైల్వే రంగం నిజమైన జీవన రేఖగా ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు. పీపీపీ పద్ధతిలో రేవులను అనుసంధానిస్తామనీ, ప్రైవేట్ పార్టీల ద్వారా పార్శిల్ వ్యాన్లు, ర్యాకులను సమీకరిస్తామనీ కూడా రైల్వే మంత్రి వెల్లడించారు. రైల్వేల సామర్థ్యం మెరుగుపడితే రవాణా వ్యయం తగ్గుతుందనీ, తద్వారా ఎగుమతిదారులకు మేలు జరుగుతుందనీ ఈఈపీసీ ఇండియా చైర్మన్ అనుపమ్ షా తెలిపారు. ఉట్టిపడిన వాస్తవికత... కీలకమైన రైల్వే రంగంలో మౌలిక సౌకర్యాలను, సామర్థ్యాన్నీ పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను రైల్వే బడ్జెట్లో విస్పష్టంగా ప్రకటించారని సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ ఎస్.శ్రీరామ్ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడంపై సీఐఐ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. వాస్తవిక దృక్పథంతో కూడిన బడ్జెట్‌ను మంత్రి సమర్పించారని సీఐఐ అధ్యక్ష పదవికి ఎన్నికైన సుమీత్ మజుందార్ చెప్పారు. ప్రైవేట్ ఇన్వెస్టర్లను ఆకర్షించేవిగా ప్రాజెక్టులను రూపొందిస్తే పీపీపీ, ఎఫ్‌డీఐ మార్గాల్లో నిధులు సమకూరుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరు కొత్త రైళ్లను మంజూరు చేయడంపై సీఐఐ చైర్మన్ (ఆంధ్ర, తెలంగాణ) సురేశ్ చిట్టూరి సంతోషం వ్యక్తంచేశారు. ఉక్కు వినియోగం పెరుగుతుంది.. రైల్వే ట్రాకుల డబ్లింగ్, ట్రిప్లింగ్, స్టేషన్ల ఆధునీకరణ, మీటర్ గేజ్ పట్టాలను బ్రాడ్‌గేజ్‌గా మార్చడం వంటి చర్యలతో ఉక్కు వినియోగం పెరగనుందని సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ, ఐటీ, వివిధ ప్రాజెక్టుల అమలుపై బడ్జెట్లో దృష్టి సారించారనీ, దేశీయ రైల్వేల పనితీరు మెరుగుకు దోహదపడుతుందనీ భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) అధ్యక్షుడు ఎం.రఫీక్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. గేజ్ మార్పిడి, కొత్త పట్టాల ఏర్పాటుతో రైల్వేల సామర్థ్యం పెరుగుతుందని ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండీ వినీత్ అగర్వాల్ చెప్పారు. -
డాలర్ ట్రాక్‌పై మోడీ రైలు...
విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే ఆపరేషన్ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవు దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం అహ్మదాబాద్-ముంబై మధ్య రూ. 60 వేల కోట్లతో బుల్లెట్ రైలు రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ పద్ధతిలోనే {పతి ఆరు నెలలకూ రైలు చార్జీల సవరణ! ఆధునీకరణే ‘సదానందం’ మెట్రో నగరాలను కలుపుతూ హైస్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగం గంటకు 200 కి.మీ. వరకు పెంపు కొత్తగా 58 రైళ్లు, మరో 11 రైళ్ల ప్రయాణ దూరం పొడిగింపు ఇక టికెటింగ్ ఈజీ.. కొత్త తరం ఈ-టికెటింగ్ రిజర్వేషన్ వ్యవస్థ ఏర్పాటు రైళ్లలో రెడీ టు ఈట్ మీల్స్.. ప్రధాన స్టేషన్లలో స్థానిక ఫుడ్ కోర్టులు కొత్తగా 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల నియామకం ప్రతి రైల్వే బడ్జెట్లోనూ... చార్జీలు పెరుగుతాయా? పెరగవా? అని ఎదురుచూడటం సగటు భారతీయుడి సైకాలజీ. ఈసారి ఎవ్వరికీ అలా ఎదురుచూసే చాన్సివ్వకుండా 15 రోజుల ముందే మోడీ సర్కారు భారీగా వడ్డించేసింది. ఇక బడ్జెట్లో స్పీడంతా బుల్లెట్ రైళ్లదే. కానీ వాటికి దేశీ ఇంధనం సరిపోదని రైల్వే మంత్రి ముందే చెప్పారు. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపేశారు. వీటికితోడు దేశీ కార్పొరేట్లకూ ద్వారాలు తెరిచారు. బుల్లెట్ వేగం, అందమైన స్టేషన్లు, అద్భుతమైన సౌకర్యాలు, మొబైల్‌తోనే మొత్తం ప్రయాణం, వజ్ర చతుర్భుజి ప్రాజెక్టు... అంటూ అరచేతిలో ఆవిష్కరించిన స్వర్గానికి ఇం‘ధన’మైతే ఇప్పుడు లేదు. పెండింగ్‌లో ఎన్నో ప్రాజెక్టులున్నాయంటూ కొత్తవాటికి నో చెప్పిన రైల్వే మంత్రి... కేటాయింపులు మాత్రం గత ప్రభుత్వాల తీరులోనే విదిలించారు. ఇక ఆంధ్రప్రదేశ్... తెలంగాణ. రాష్ట్రాలు రెండయినా రాత మాత్రం మారలేదు. ఆఖరికి రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పక్కనబెట్టేశారు. మరి ఈ డాలర్ డ్రీమ్స్ సాకారమవుతాయా? వేచి చూస్తేనే తెలిసేది!! -
ద లాల్ సిగ్నల్
నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటితమయ్యాక తొలిసారి స్టాక్ మార్కెట్లు కంగుతిన్నాయ్. లోక్‌సభలో సదానంద గౌడ ప్రకటించిన రైల్వే బడ్జెట్ నిరాశను మిగల్చడంతో ఇన్వెస్టర్లలో ఉన్నట్టుండి భయాలు వ్యాపించాయ్. మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ మంత్రి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఇన్వెస్టర్లు ప్రసంగం మొదట్లోనే నిరుత్సాహానికి లోనయ్యారు. దేశీయ రైల్వే వ్యవస్థ ఎదుర్కొంటున్న నిధులలేమిని నొక్కిచెప్పిన మంత్రి ప్రసంగం చివర్లో ఇందుకు పలు మార్గాలను ప్రకటించినప్పటికీ మార్కెట్లకు రుచించలేదు. ప్రధానంగా ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లనూ ప్రతిపాదించకపోగా, ఇప్పటికే పలు సమస్యలతో కుదేలైన ప్రాజెక్ట్‌లను ఎలా పూర్తిచేసేదీ స్పష్టం చేయకపోవడం ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. మరోవైపు మార్కెట్‌ను ఉత్సాహపర్చే పెద్ద ప్రకటనలూ లేకపోవడం సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి వార్షిక సాధారణ బడ్జెట్ సైతం ఇదే రీతిలో ఉండొచ్చునన్న ఆందోళనలు పెరిగాయి. దీంతో అన్నివైపుల నుంచీ అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ ఒక దశలో 610 పాయింట్లు దిగజారింది. నిజానికి తొలుత 90 పాయింట్ల వరకూ లాభపడి కొత్త గరిష్టం 26,190ను తాకింది. అయితే రైల్వే బడ్జెట్ వెలువడ్డాక పతనబాట పట్టి 25,495 వద్ద కనిష్టాన్ని చేరింది. చివరికి 518 పాయింట్లు కోల్పోయి 25,582 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం ఇదే బాటలో 7,809 వద్ద కొత్త రికార్డును అందుకున్నప్పటికీ ఇంట్రాడేలో ఆ స్థాయి నుంచి 7,596కు పడిపోయింది. ట్రేడింగ్ ముగిసేసరికి నికరంగా 164 పాయింట్లు పోగొట్టుకుని 7,623 వద్ద నిలిచింది. ఇంతక్రితం మార్కెట్లు 2013 సెప్టెంబర్ 3న మాత్రమే ఈ స్థాయిలో పతనమయ్యాయి. అప్పట్లో సెన్సెక్స్ 651, నిఫ్టీ 299 పాయింట్లు చొప్పున దిగజారాయి. బ్లూచిప్స్ బోర్లా సెన్సెక్స్, నిఫ్టీలో భాగమైన సన్ ఫార్మా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ మాత్రమే అదికూడా నామమాత్రంగా లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక దిగ్గజాలు భెల్, ఎన్టీపీసీ, టాటా పవర్, కోల్ ఇండియా, ఎల్అండ్టీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, సెసాస్టెరిలైట్, ఆర్ఐఎల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలా 8-2% మధ్య పతనమయ్యాయి. రియల్టీ నేలచూపులు రియల్టీ షేర్లు కోల్టేపాటిల్, యూనిటెక్, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, హెచ్‌డీఐఎల్, ఫీనిక్స్ మిల్, శోభా, గోద్రెజ్ ప్రాపర్టీస్, డీబీ, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 13-4.5% మధ్య కుప్పకూలాయి. విద్యుత్ షాక్ విద్యుత్ రంగ షేర్లు అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జేపీ పవర్, సీఈఎస్సీ, ఏబీబీ, సీమెన్స్, రిలయన్స్ పవర్, ఎన్‌హెచ్‌పీసీ 8 శాతం స్థాయిలో నీరసించాయి. బీఎస్ఈ-500 విలవిల ట్రేడైన షేర్లలో ఏకంగా 2,234 తిరోగమిస్తే, కేవలం 770 లాభపడ్డాయి. బీఎస్ఈ-500లో జిందాల్ స్టెయిన్లెస్, హెచ్ఎంటీ, ఉత్తమ్ గాల్వా, జేపీ అసోసియేట్స్, ఇండియా సిమెంట్స్, గుజరాత్ గ్యాస్, ఐఎఫ్సీఐ, ధనలక్ష్మీ బ్యాంక్, మహీంద్రా సీఐఈ, ఎంఎంటీసీ, ఎంటీఎన్ఎల్, టీబీజెడ్, సిండికేట్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్‌సీఎల్ ఇన్ఫో, ఎస్కార్ట్స్, జైన్ ఇరిగేషన్ 13-8% మధ్య దిగజారాయి. ఎఫ్ఐఐల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) రూ. 423 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 400 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. -
డాలర్ డ్రీమ్స్
రైలు పాతదే.. కలలు కొత్తవి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన భారతీయ రైల్వే నిర్వహణ విభాగంలో మాత్రం ఎఫ్‌డీఐలు ఉండవు దేశీయ ప్రైవేటు పెట్టుబడులకూ మోడీ సర్కారు ఆహ్వానం సదానందగౌడ రైల్వే బడ్జెట్లో ప్రయాణికులకే పెద్దపీట న్యూఢిల్లీ: నెల రోజుల కిందటే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు.. రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. రైల్వే మౌలిక వసతులకు ఎఫ్‌డీఐలను ఆహ్వానిస్తామని, స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులకూ అనుమతిస్తామని స్పష్టంచేసింది. కీలక ప్రాజెక్టుల్లో ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యాన్నీ (పీపీపీని) పెంచుతామని తొలి రైల్వే బడ్జెట్లో ప్రకటించింది. రైల్వేమంత్రి సదానందగౌడ తన తొలి రైల్వే బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. రికార్డు స్థాయిలో రూ.1,64,374 కోట్లతో రూపొందించిన రైల్వే బడ్జెట్లో.. ఊహించినట్లే ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచటానికి, రైల్వేల ఆధునీకరణకు ప్రాధాన్యమిచ్చారు. కానీ.. ప్రజాకర్షక ప్రకటనలేవీ చేయలేదు. ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని అహ్మదాబాద్ - మహారాష్ట్రలోని ముంబై మధ్య ఒక బుల్లెట్ రైలు, ప్రధాన మెట్రో నగరాలను కలుపుతూ హై స్పీడ్ వజ్ర చతుర్భుజి రైల్వే వ్యవస్థ, తొమ్మిది సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్ల వరకూ పెంచటం, దేశవ్యాప్తంగా 58 కొత్త రైళ్లు ప్రవేశపెట్టటం, మరో 11 రైళ్ల ప్రయాణదూరం పొడిగింపు. ఇవీ ఈ బడ్జెట్లోని ముఖ్యాంశాలు. పక్షం రోజుల కిందటే భారీగా రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలను వడ్డించిన నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఎలాంటి చార్జీలపెంపూ లేదు. అయితే ప్రతి ఆరు నెలలకొకసారి అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా రైలు చార్జీలను సమీక్షించి సవరించాలని గతంలో పార్లమెంటు నిర్ణయించిందని, దానిని కొనసాగిస్తామని రైల్వేమంత్రి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 12:10 గంటలకు తొలుత లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన సదానందగౌడ.. తను ప్రతిపాదించిన బుల్లెట్ రైలు, హైస్పీడ్ రైలు తరహాలోనే వేగంగా ప్రసంగాన్ని చదువుతూ పోయారు. రైల్వేలోకి ఎఫ్‌డీఐ, ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తామని గౌడ ప్రకటించినపుడు.. ఇది అంబానీలు, అదానీల బడ్జెట్ అంటూ విపక్షాలు నిరసించాయి. ప్రాజెక్టులన్నీ పెండింగే... రైల్వే రంగం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురయిందని, ప్రజాకర్షణ మోజులో పడి రైల్వేను తీవ్ర నిధుల కొరతలోకి నెట్టివేశారని గత ప్రభుత్వాలపై గౌడ విమర్శలు ఎక్కుపెట్టారు. సభలో చప్పట్ల కోసం, ఓట్ల కోసం ఎప్పటికప్పుడు ఎన్నో కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూ వచ్చారని.. కానీ నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్టులేవీ సకాలంలో పూర్తికావటం లేదని ఎండగట్టారు. గత 30 ఏళ్లలో రూ.1,57,883 కోట్ల వ్యయం కాగల 676 కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తే.. ఇప్పటికి 317 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పూర్తిచేయటానికి ఇప్పుడు రూ.1,82,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అలాగే గత పదేళ్లలో రూ. 60,000 కోట్ల విలువైన 99 కొత్త రైల్వే లైన్లకు అనుమతులివ్వగా.. అందులో ఇప్పటివరకూ పూర్తయింది ఒక్కటేనని చెప్పారు. కిలోమీటరుకు 23 పైసలు నష్టం ప్రయాణ చార్జీలను చాలా కాలంగా సవరించకుండా వదిలివేశారని.. దీనివల్ల 2012-13 నాటికి ఒకో ప్రయాణికుడిపై కిలోమీటరుకు 23 పైసల నష్టంవస్తోందని మంత్రి చెప్పారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి సరుకు రవాణా చార్జీలను పెంచేయటంతో రవాణాదారులు దూరమవుతున్నారని.. సరుకు రవాణాలో రైల్వేల వాటా గత 30 ఏళ్లలో క్రమంగా తగ్గిపోతూ వస్తోందన్నారు. అందుకే కఠినమైనప్పటికీ చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత నెల 25వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన చార్జీల పెంపుతో రూ. 8,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందన్నారు. అయితే.. వజ్ర చతుర్భుజి వ్యవస్థను పూర్తిచేయటానికి రూ.9 లక్షల కోట్లకన్నా ఎక్కువ నిధులు అవసరమవుతాయన్నారు. ఒక్క బుల్లెట్ రైలును ప్రవేశపెట్టటానికి రూ. 60,000 కోట్లు ఖర్చవుతుందన్నారు. అందుకే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషించానని తెలియజేశారు. రికార్డు స్థాయి రైల్వే ప్రణాళిక... 2014-15లో రూ.1,64,374 కోట్ల రాబడిని అంచనా వేశారు. దీన్లో సరుకు రవాణా ఆదాయం రూ.1,05,770 కోట్లు, ప్రయాణ చార్జీల ఆదాయం రూ. 44,645 కోట్లు. దీన్లో రూ.1,49,176 కోట్లు అంచనా వ్యయంకాగా.. సాధారణ నిర్వహణ వ్యయం 1,12,649 కోట్లు. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా రూ. 15,078 కోట్లు ఎక్కువ. ఇంధన ధరలు పెరగటం, సిబ్బంది వ్యయం పెరగటం వల్ల నిర్వహణా వ్యయం పెరిగనట్లు గౌడ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రూ. 65,445 కోట్ల ప్రణాళికా వ్యయాన్ని ప్రకటించారు. ఇందులో రూ. 30,000 కోట్లకు పైగా బడ్జెటరీ మద్దతుగా కేంద్రం అందిస్తుంది. మార్కెట్ అప్పుల ద్వారా రూ. 11,790 కోట్లు, అంతర్గత వనరులు రూ. 15,350 కోట్లు, పీపీపీల ద్వారా 6,005 కోట్లు సమీకరిస్తారు. బడ్జెట్లో పెన్షన్ చెల్లింపుల కోసం రూ. 28,850 కోట్లు, డివిడెండ్ చెల్లింపుల కోసం రూ. 9,135 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైల్వే ఆర్జిస్తున్న ప్రతి రూపాయిలో 94 పైసలను రైల్వే కోసమే వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వేల్లోకి విదేశీ పెట్టుబడులు... రైల్వే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థికంగా బలంగా ఉన్నాయని, వీటి నుంచి అదనపు నిధులను రైల్వే ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లోకి పెట్టుబడులుగా తెచ్చేందుకు ఒక పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైన నిధుల కోసం రైల్వేలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించేందుకు కేంద్ర కేబినెట్ అనుమతి కోరుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టుల్లో అత్యధిక భాగం పీపీపీ (ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యం) పద్ధతిలో చేపడతామన్నారు. భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరమైన హైస్పీడ్ రైళ్లకు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామన్నారు. రాబడి తగ్గింది.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల రవాణా వసూళ్లు రూ. 1,39,558 కోట్లుగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఇది సవరించిన అంచనాలకన్నా రూ. 942 కోట్లు తక్కువ. మరోవైపు సాధారణ నిర్వహణ వ్యయం రూ. 97,571 కోట్లకు చేరిందని.. ఇది సవరించిన అంచనా కన్నా రూ. 511 కోట్లు ఎక్కువని వివరించారు. అలాగే.. పెన్షన్ చెల్లింపులు కూడా పెంచాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన రూ. 7,943 కోట్లు మిగులు.. వాస్తవానికి రూ. 3,783 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఇక ప్రణాళికా వ్యయం కూడా సవరించిన అంచనాలు రూ. 59,359 కోట్ల కన్నా తగ్గిపోయిందని.. పీపీపీ లక్ష్యాలు వాస్తవరూపం దాల్చకపోవటమే దీనికి కారణమని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత, సేవలకు ప్రాధాన్యం ప్రధాన రైల్వేస్టేషన్లలో ఫుట్-ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు; వికలాంగులు, వృద్ధుల కోసం బ్యాటరీలతో నడిచే చక్రాల కుర్చీలు; రైళ్లలో వై-ఫై, కంప్యూటర్లతో వర్క్ స్టేషన్ల ఏర్పాటు, రైళ్లలో పరిశుభ్రమైన ఆహారం సరఫరా, రైల్వేస్టేషన్లలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, ఈ-టికెట్ బుకింగ్ సౌకర్యాల విస్తరణ వంటి చర్యలను రైల్వే మంత్రి ప్రకటించారు. స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు, ఆర్వో తాగునీటి యూనిట్ల ఏర్పాటు, రైళ్లలో బయో టాయిలెట్లు, పారిశుద్ధ్య సిబ్బంది మరిన్ని రైళ్లకు విస్తరణ వంటి చర్యలు చేపడతామన్నారు. వీటన్నిటిలో పీపీపీ పద్ధతిని అనుసరించటంతో పాటు ఎన్జీఓలు, సామాజిక సంస్థలు, కార్పొరేట్ సంస్థలను భాగస్వాములను చేస్తామన్నారు. భద్రతకోసం దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్‌ల పునరుద్ధరణ, కాపలా లేని లెవల్ క్రాసింగ్‌ల తొలగింపు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణాల కోసం రూ. 40,000 కోట్లు అవసరమవుతాయని మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్లో వీటికి 1,785 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా తలుపులు మూసుకునే బోగీలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే.. 4,000 మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమిస్తామని, మహిళా బోగీల్లో వీరితో భద్రత కల్పిస్తామని చెప్పారు. రైలు టూరిజం, రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం పునర్వ్యవస్థీకరణ, రైల్వే ఉద్యోగుల సంక్షేమం తదితర అంశాలపై పలు చర్యలను బడ్జెట్లో ప్రకటించారు. సిబ్బంది సంక్షేమ నిధి, రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేపడతామన్నారు. హైస్పీడ్ వజ్ర చతుర్భుజి ప్రాజెక్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. అలాగే.. తొమ్మిది ఎంపిక చేసిన సెక్టార్లలో రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకూ పెంచుతామన్నారు. -
ఉభయ రాష్ట్రాలకూ నిరాశే!
అడిగే నాథుడు లేక అయిదేళ్లుగా రాష్ట్రానికి ఏ ప్రాజెక్టునూ ఇవ్వ కుండా రైల్వే బడ్జెట్లను కానిచ్చేస్తున్న యూపీఏ ప్రభుత్వ సంప్రదా యాన్నే ఎన్డీయే సర్కారు కూడా కొనసాగించదల్చుకున్నట్టుంది. కాక పోతే, ఈసారి విభజన సాకుతో ఆ పనిచేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై ఒక కమిటీ వేశామని, ఆ నివేదికొచ్చాక ఒరగబెడతామన్న హామీ తప్ప ఈ బడ్జెట్లో అటు తెలంగాణకైనా, ఇటు ఆంధ్రప్రదేశ్‌కైనా దక్కిందేమీ లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు ఇచ్చారు. ఇది సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ తరహాలోనే విజయవాడ - న్యూఢిల్లీ మధ్య ఉంటుంది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ను ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించాలో, లేదో అర్థం కాని పరిస్థితి. ఆ రైలు విజయవాడలో బయలుదేరిన గంటకల్లా తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి వరంగల్ చేరాక దాని ప్రయాణమంతా ఏపీ ఎక్స్‌ప్రెస్ దోవనే వెళ్తుంది. ఏతా వాతా బయలుదేరే స్టేషన్ తప్ప మిగిలిన ప్రయాణమంతా తెలం గాణ ప్రాంతంలోనే ఉంటుంది. సీమాంధ్రకు మేలు చేద్దామన్న సంకల్పం ఉంటే, ఆ ప్రాంతంలోని జిల్లాలకు ప్రయోజనం చేకూ రుద్దా మనుకుంటే దాన్ని విశాఖ-న్యూఢిల్లీ మధ్య నడిపాల్సింది. రైల్వే బడ్జెట్‌కు రూపకల్పన చేసేటపుడు రాష్ట్రాలను సంప్రదించే సంప్ర దాయం ఉంటే ఇలాంటి లోపాలు సరిదిద్దే అవకాశం ఉంటుంది. కానీ, అటు కేంద్రానికీ ఈ ఆలోచన ఉండదు. ఇటు రాష్ట్ర ప్రభు త్వాలూ పట్టించుకోవు. అందువల్లే కాబోలు... ప్రకటించిన 18 కొత్త రైలు మార్గాల సర్వేల్లో ఉభయ రాష్ట్రాలకూ ఒక్కటీ లేదు. రైళ్ల పొడిగింపులోగానీ, డబ్లింగ్, గేజ్ మార్పిడి వంటి పనుల్లోగానీ, తీర్థ యాత్రల రైళ్లలోగానీ రెండు రాష్ట్రాలకూ ఇచ్చిందేమీ లేదు. మొత్తానికి ఎంపీలు ఇచ్చిన వినతులన్నీ ఎప్పటిలా బుట్టదాఖలా అయినట్టే కనిపిస్తున్నది. మన దక్షిణ మధ్య రైల్వే లాభాలు గడించే రైల్వే జోన్లలో అగ్రభాగాన ఉన్నా అందుకు తగినట్టుగా ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు, రైళ్లు రావడంలేదు. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నది. పదమూ డేళ్లక్రితం అనుమతి లభించిన కోటిపల్లి-నర్సాపురం రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. 1999లో అనుమతి వచ్చిన కాకి నాడ-పిఠాపురం లైను పరిస్థితీ అలాగే ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు మంజూరైన నిజామా బాద్ - పెద్దపల్లి మార్గం ఇప్పటికీ పూర్తికాలేదు. ఇక కాజీపేట వ్యాగన్ల తయారీ పరిశ్రమదీ అదే స్థితి. ఒకపక్క ఆంధ్రప్రదేశ్, తెలం గాణలకు ఇంత అన్యాయం చేసిన రైల్వే బడ్జెట్ మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్రపై ఎక్కడలేని ప్రేమనూ ప్రదర్శించింది. రైల్వేల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అంగీకరిస్తే భద్ర త విషయమై రాజీపడినట్టే అవుతుందని కేంద్ర హోంశాఖ అభ్యం తరపెట్టినట్టు వార్తలొచ్చాయి. అందువల్ల రైల్వేలకు సంబం ధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి రంగానికి మాత్రమే ఎఫ్‌డీఐలను పరిమితం చేస్తామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించారు. అలాగే, పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింత విస్తృతపరుస్తామ న్నారు. రైల్వేల్లో సంస్కరణలకు గత ప్రభుత్వం అంకురార్పణ చేస్తే ఎన్డీయే ప్రభుత్వం దాన్ని మరింత ముందుకు తీసుకుపోదల్చుకు న్నట్టు ఈ ప్రతిపాదనలను గమనిస్తే అర్థమవుతుంది. రూ. 9 లక్షల కోట్లు అవసరంకాగల బృహత్తర ప్రాజెక్టు వజ్ర చతుర్భుజిని చేప ట్టబోతున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కింద మెట్రో నగరా లన్నిటికీ బులెట్ రైళ్లు నడుపుతారు. ముందుగా ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య దీన్ని ప్రారంభిస్తారు. తొలుత ప్రారంభ మయ్యే బుల్లెట్ రైలు కోసమే రూ. 60,000 కోట్లు వ్యయమవు తాయి. ఇంత ఖర్చయ్యే ఈ బుల్లెట్ రైలుకు ప్రధాని స్వస్థలాన్ని ఎంచుకోవడం కూడా రైల్వే శాఖ సంప్రదాయానికి అనుగుణంగానే ఉంది. గతంలో రైల్వే మంత్రులుగా ఉన్నవారంతా తమ రాష్ట్రాలకు ముఖ్యమైన ప్రాజెక్టులను, రైళ్లను సమకూర్చుకున్నారు. ఆ సంగతలా ఉంచి ఈ ఆరున్నర దశాబ్దాల్లో మన పాలకులు నిర్మించిన కొత్త రైలు మార్గం 11,000 కిలోమీటర్లు మించలేదు. ప్రతి బడ్జెట్లోనూ కొత్త రైల్వే లైన్లకు సర్వేలు చేస్తామని ప్రకటించడమే తప్ప చేసినవాటి అతీగతీ ఏమైందో తెలియదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు 5,000 కిలోమీటర్ల మేర 36 కొత్త రైలు మార్గాల కోసం సర్వే చేయించారు. వాటిలో 9 మినహా అన్నీ పూర్త య్యాయని చెప్పారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకూ ఒక్కటంటే ఒక్క కొత్త రైలు మార్గం రాలేదు. చాలాచోట్ల కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు ప్రమాదాలకు నిలయమవుతున్నాయి. అలాగే, నాసిరకం ట్రాక్‌లు రైలు ప్రయాణమంటేనే హడలెత్తిస్తున్నాయి. వీటిగురించి శ్రద్ధ పెడ తామని చెప్పడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట ప్రణాళికేమీ బడ్జెట్లో లేదు. మోడీ సర్కారు ముందు ఇలాంటివాటి సంగతి చూసి బులెట్ రైలు వంటి ప్రతిపాదనలు సిద్ధంచేస్తే బాగుండేది. ఇక బడ్జెట్‌కు కొన్ని రోజుల ముందే రూ. 8,000 కోట్ల మేర ప్రయాణి కుల చార్జీలను పెంచారు గనుక బడ్జెట్లో దాని జోలికెళ్లలేదు. అయితే, గత ఫిబ్రవరినాటికి ప్రయాణికుల తరలింపులో రైల్వేలకు రూ. 30,000 కోట్ల నష్టం వచ్చిందని రైల్వే మంత్రి చెబుతున్నారు. కనుక మరో బడ్జెట్ వచ్చే లోపల చార్జీలు పెరగబోవన్న భరోసా ఏమీ లేదు. మొత్తానికి సంస్కరణలంటూనే పాత వాసనలు వదులు కోని రైల్వే బడ్జెట్ తెలుగు రాష్ట్రాలు రెండింటికీ నిరాశనే మిగిల్చింది. -
మళ్లీ మొండిచేయి
సంగడిగుంట (గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్‌కు మొండి చెయ్యి చూపించింది. కొత్త ప్రభుత్వం నుంచి అదనపు రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన, నిధులు రాబడతామని నేతలు ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోలేదు. విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రకటించిన రైలు వల్ల గుంటూరు జిల్లాకు కొత్తగా ఒనగూరిందేమీ లేదు. ఢిల్లీకి ఇప్పటికే చాలా రైళ్లు విజయవాడ మీదుగా నడుస్తున్నాయి. నూతన బడ్జెట్లో గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రత్యేక కేటాయింపులు లేవు, కొత్త రైళ్లు లేవు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పెండింగ్‌లో ఉన్న 29 పనులకు రూ. 20 వేల కోట్లను ప్రకటించినా ఆ నిధుల్లో గుంటూరు డివిజన్‌కు ఎంత మొత్తం కేటాయించిందీ స్పష్టత లేదు. ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలను కేంద్ర రైల్వేశాఖ అసలు పరిగణలోకి తీసుకున్నట్లు లేదు.దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు ప్రకటించిన తొమ్మిది రైళ్లలో కేవలం ఒకే ఒక్క రైలును తిరుపతికి కేటాయించారు. అది గుంటూరు మీదుగా వెళుతుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. నిరాశే మిగిలింది.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బడ్జెట్లో గుంటూరు డివిజన్‌కు వరాల జల్లు కురుస్తుందని ఆశించాం. కానీ నిరాశే మిగిలింది. నమ్ముకున్న ప్రజాప్రతినిధులు ముందస్తు ప్రయత్నాలు చేయని విషయం స్పష్టం అవుతోంది. బడ్జెట్ ముందు రోజు హడావుడి చేయడంవల్ల ఉపయోగం ఉండదనే విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇకనైనా బడ్జెట్ తయారీకి నెల రోజులకు ముందే ప్రతిపాదనలు పంపాలి. - ఎ. అశోక్ కుమార్, గుంటూరు కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా గుంటూరు రైల్వే డివిజన్‌కు ప్రత్యేకంగా ఏ విధమైన ప్రాజెక్టులూ ప్రకటించకుండానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుని మోసపోయాం. ప్రజాప్రతినిధులు హామీలు ఆచరణకు నోచుకోలేదు. - కె. గోవిందరెడ్డి, గుంటూరు -
నిధుల ఊసే లేదు
కర్ణాటకకు చెందిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ యూపీఏ తరహాలో తమిళనాడు మీద సవతి తల్లి ప్రేమ చూపించారు. దక్షిణాది జిల్లాలకు పూర్తిగా హ్యాండిచ్చిన సదానంద, చెన్నై నుంచి ఇతర రాష్ట్రాలకు మాత్రం ఐదు రైళ్లను కంటి తుడుపు చర్యగా ప్రకటించారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధుల ఊసే లేని దృష్ట్యా, తమిళనాట రైల్వే బడ్జెట్‌కు వ్యతిరేకంగా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చెన్నై:రాష్ట్రంలోని పెండింగ్, అమల్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సుమారు పది వేల కోట్ల మేరకు నిధులు అవసరం. కొన్నేళ్ల క్రితం చేపట్టిన పనులు నత్తనడకన సాగుతుండడంతో ఏటా అంచనా వ్యయం పెరుగుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూపీఏ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించింది. ప్రస్తుతం అధికారం మారడంతో రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ప్రజలు భావించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంతో సామరస్య పూర్వంగా మెలిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసక్తి చూపినా కేంద్రం వైఖరి మాత్రం మారలేదు. హ్యాండిచ్చిన సదానంద: తమిళనాడులో అనేక రైల్వే ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ప్రధానంగా చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు, దక్షిణాది జిల్లాలోని పలు ప్రధాన నగరాల్ని కలుపుతూ కొత్త రైళ్ల సేవలకు ప్రతిపాదనలున్నారుు. అయితే, తమిళనాడుకు సదానంద హ్యాండిచ్చారు. చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలు కూడా ప్రకటించ లేదు. ఇటీవల డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్ చేసిన విజ్ఞప్తుల్ని సైతం సదానంద ఖాతరు చేయలేదు. అమల్లో ఉన్న పనులకు కనీసం నిధుల కేటాయింపు కూడా చేయలేదు. దీంతో ఆ పనులు పూర్తవడానికి మరెన్ని నెలలు పట్టనుందోనని ప్రశ్నార్థకంగా మారుతోంది. నిరాశే : విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్, మార్గాల్లో జరుగుతున్న పనులకు నిధుల ఊసెత్తక పోవడం గమనార్హం. అలాగే, చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటన వెలువడుతుందని ఎదురు చూసిన వాళ్లకు చివరకు మిగిలింది నిరాశే. అయితే, మౌళిక వసతుల కల్పం, రైల్వే ప్రయాణికుల భద్రత, మహిళా భద్రత ప్రకటనలు మాత్రం స్వాగతిస్తున్నారు. కంటి తుడుపు చర్య : తమిళనాడు ప్రజలకు హ్యాండిచ్చిన సదానంద గౌడ కంటి తుడుపు చర్యగా కొన్ని రైళ్లను ప్రకటించారు. ఇవన్నీ చెన్నై నుంచి బయలు దేరే రైళ్లే. దక్షిణాదిలోని మదురై, తిరునల్వేలి, కన్యాకుమారి, తిరుచ్చి నగరాలకు మిగిలింది నిరాశే. అరుుతే చెన్నై - హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు సేవలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సావల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఐదు రైళ్లు : పార్లమెంట్లో ప్రకటించిన రైల్వే బడ్జెట్ మేరకు ఐదు రైళ్ల వివరాలు. మదురై - జైపూర్ (వారంతాపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు రైలు సేవ),- చెన్నై - విశాఖ (వారంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత). సర్వత్రా విమర్శ : ఈ బడ్జెట్‌ను తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తమిళ ప్రజల్ని పూర్తిగా విస్మరించారని పీఎంకే ఎంపీ అన్భుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రైళ్లను తన సొంత రాష్ట్రానికి మంత్రి తరలించుకున్నారని సీపీఎం ఎంపీ రంగరాజన్ మండిపడ్డారు. తమిళ ప్రజలకు మొండి చేయి మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పాటనే మళ్లీ మళ్లీ పాడినట్టు, చివరకు తమిళ ప్రజల నెత్తిన టోపీ పెట్టారని కాంగ్రెస్ ఎంపీ సుదర్శన నాచ్చియప్పన్ పేర్కొన్నారు. తమిళుల ఆశల్ని, విజ్ఞప్తులపై మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లిందని మండి పడ్డారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ సైతం రైల్వే బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. ఆహ్వానం : సీఎం జయలలిత మాత్రం రైల్వే బడ్జెట్‌ను ఆహ్వానించారు. భవిష్యత్తును కాంక్షిస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టుందన్నారు. స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్ల సేవలు, మహిళలకు భద్రత, రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రకటనలు సంతృప్తినిచ్చాయన్నారు. ముంబె తర్వాత బుల్లెట్ రైలు సేవల ప్రాధాన్యతలో తమిళనాడుకు అవకాశం కల్పిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రకటించినవి మదురై - జైపూర్ (వారాంతపు ప్రీమియర్ ఎక్స్‌ప్రెస్), చెన్నై - షాలిమార్ (ప్రీమియర్ ఏసీ ఎక్స్‌ప్రెస్), చెన్నై - అహ్మదాబాద్ (వారంలో రెండు రోజులు), చెన్నై - విశాఖ (వారాంతపు రైలు), హోసూరు - యశ్వంత్ పూర్ రైలు. చెన్నై - హైదరాబాద్ (బుల్లెట్ రైలుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ). వేలాంకన్ని, మేల్ మరువత్తుర్లకు ఉత్సవాల సమయంలో ప్రత్యేక రైళ్లను నడుపుతామన్న హామీని మాత్రం ఇచ్చారు. ఆశించినవి చెన్నై నుంచి దక్షిణాది జిల్లాలకు కనీసం ఒక్క రైలైనా వస్తుందని ఆశించారు. విల్లుపురం - దిండుగల్ మధ్య రెండో మార్గం పనులకు, పళని - పొల్లాచ్చి మార్గం పనులకు, మదురై - కన్యాకుమారి రెండో మార్గం, మదురై - బోడి నాయకనూర్, తెన్కాశి - పునలూర్ మార్గాల పనులకు నిధులివ్వలేదు. చెన్నై సెంట్రల్, ఎగ్మూర్‌లకు ప్రత్యామ్నాయంగా తాంబరం, రాయపురం స్టేషన్ల కొత్త టెర్మినల్ ప్రకటిస్తారని ఆశించినా జరగలేదు. -
ఈ సారీ ఆగలేదు!
తాండూరు: ఈ సారి కూడా తాండూరు వాసులకు నిరాశే మిగిలింది. మంగళవారం రైల్వే మంత్రి సదానందగౌడ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో తాండూరుకు కొత్త హాల్టింగ్ గానీ, పొడగింపునకు గానీ అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై మోడీ సర్కారు దృష్టి సారిస్తుందని ఆశపడిన ప్రయాణికులకు భంగపాటు తప్పలేదు. తాండూరు మీదుగా నడిచే రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని స్థానిక వ్యాపారులు, ప్రజలు ఏళ్లుగా కోరుతున్నారు. ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఎదురుచూశారు. కర్ణాటకలోని చిత్తాపూర్ చిన్న రైల్వేస్టేషన్. ఇక్కడ గరీభ్థ్ ్రఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉంది. ఈ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు రైల్వేకు రూ.50వేల వరకు టిక్కెట్ విక్రయంపై ఆదాయం వస్తుంది. రోజుకు సుమారు 1500 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ సేడంలో ఆగుతుంది. ఇక్కడ రోజుకు 2500 ప్రయాణికులు రాకపోకలు సాగి స్తారు. సుమారు రూ.లక్ష ఆదాయం వస్తుంది. కానీ ఈ రెండు రైల్వేస్టేషన్ల కన్నా తాండూరు పెద్దది. రోజుకు సుమారు ఐదు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు రోజుకు రూ.రెండు లక్షల ఆదాయం వస్తుంది. మోడీ సర్కారు ఈ బడ్జెట్లో గరీభ్థ్,్ర రాజధాని ఎక్స్‌ప్రెస్‌లకు తాండూరులో హాల్టింగ్ ఇస్తుందని ప్రయాణికుల ఆశించారు. కానీ నిరాశే మిగిలింది. ఇక ఉదయం పది గంటలకు తాండూరు నుంచి హైదరాబాద్‌కు ‘హుస్సేన్‌సాగర్’ రైలు ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లడానికి సాయంత్రం నాలుగు గంటల వరకు రైలు లేదు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల మధ్య హైదరాబాద్ వెళ్లడానికి వికారాబాద్ వరకు నడుస్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని ఇక్కడి ప్రయాణికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ రైలు పొడిగింపునకు, పద్మావతి ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్‌కు రైల్వే బడ్జెట్లో అవకాశం దక్కపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను నిరాశపరిచింది. వేల కోట్లు ఖర్చుపెట్టి బుల్లెట్ రైలును నడపడం వల్ల కొందరికే ప్రయోజనం కలుగుతుంది తప్పా.. మధ్య తరగతికి ఏం ప్రయోజనమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బీదర్ -ముంబయ్ ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నట్టు రైల్వే మంత్రి ప్రకటించినా.. అది రూట్లో నడుస్తుందన్న దానిపై స్పష్టత లేదు. -
‘తెలుగు’ రైలు కూతేది!
సాక్షి ముంబై: ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైల్వే శాఖ మంత్రి సదానంద్ గౌడ ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్ ముంబైలోని తెలుగు ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ బడ్జెట్లో ఎన్డీఏ ప్రభుత్వం ముంబై-కాజీపేట(వరంగల్) వయా బల్లార్షా వారానికి ఒకసారి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. దీంతో ముఖ్యంగా తెలంగాణకు చెందిన అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దీంతోపాటు అహ్మద్‌బాద్-చెన్నై వయా వసాయి రోడ్డు మీదుగా వారానికి రెండు సార్లు కొత్త రైలును ప్రకటించారు. ఈ రైలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం మీదుగా వెళ్లనుంది. రాష్ట్రంలోని తెలుగు ప్రజలకు ఈ రెండు రైళ్లు మినహా బడ్జెట్లో పెద్దగా ఒరిగిందేమీలేదని చెప్పవచ్చు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న తొలిసారి బడ్జెట్‌పై ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నివసించే తెలుగు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు రైల్వేబడ్జెట్‌పై నెలకొన్న ఉత్కంఠతకు మంగళవారం కేంద్ర రైల్వేశాఖ మంత్రి తెరదింపారు. నిజామాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంతకల్ వైపు కొత్త రైలు లేదా కనీసం పొడగింపు తదితరాలేమైనా ఉంటాయని అందరూ భావించారు. అయితే కేవలం తెలంగాణ ప్రాంతానికి ఒక రైలు మాత్రమే ప్రకటించి తెలుగువారిని తీవ్ర నిరాశకు గురిచేశారు. పాత డిమాండ్‌కు మోక్షం...! బల్లార్షా లేదా కాజీపేట మీదుగా రైలును నడపాలని అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. కాని ఈ మార్గం అనుకూలంగా లేకపోవడం, సెంట్రల్, సౌత్ సెంట్రల్ రైల్వేల పరిధులు తదితరాల దృష్ట్యా ఈ డిమాండ్ ఇన్నేళ్లుగా తెరపైకి రాలేదు. కాని సెంట్రల్ రైల్వేపరిధి బల్లార్షా తర్వాత చిన్న రైల్వేస్టేషన్ మానిక్‌ఘర్ వరకు ఉండగా సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిధి కాగజ్‌నగర్ వరకు ఉంది. అయితే సెంట్రల్, సౌత్ సెంట్రల్రైల్వే పరిధిల కారణంగా ఈ బోగీని బల్లార్షా రైల్వేస్టేషన్ వరకే పరిమితం చేశారు. అదే విధంగా ముంబై-నాగపూర్ రైలును గోండియా వరకు పొడగించారు. ప్రస్తుతం బల్లార్షా వరకు సుమారు మూడు బోగీలను సేవాగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌తో వర్దా రైల్వేస్టేషన్లో జోడిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ బల్లార్షా నుంచి ముంబై వెళ్లే ఈ బోగీల్లో సుమారు ఆరు టికెట్లు సిర్పూర్కాగజ్నగర్కు కోటా ఉంది. అయితే ఈ బోగీలను కనీసం మంచిర్యాల వరకు పొడగించాలని లేదా మంచిర్యాల నుంచి వయా కాజీపేట మీదుగా కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కనీసం ఒక బోగీ జోడించాలన్న డిమాండ్లు స్థానికులు చేసేవారు. కాని మార్గాలు వేర్వేరుగా ఉండడంతో పెద్దగా ఎవరూ వీరి డిమాండ్లపై శ్రద్ధ చూపలేదు. కాని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మార్గంపై కొత్త రైలును ప్రకటించడంతో సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి తదితర ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కొత్తమార్గాలు... రాష్ట్రంలో కొత్త మార్గాల సర్వేలు చేయనున్నట్టు కూడా ఈ రైల్వేబడ్జెట్‌లో ప్రకటించారు. ముఖ్యంగా వీటిలో ఔరంగాబాద్-చాలిస్గావ్, షోలాపూర్ తుల్జాపూర్లున్నాయి. అదేవిధంగా డబ్లింగ్, మూడవ, నాల్గవ ట్రాక్‌ల పనులకు కూడా ప్రాధాన్యమిచ్చారు. వీటిలో కసారా-ఇగత్పురి, కర్జత్-లోనవాలాల మధ్య నాల్గవ ట్రాక్, భూసవల్-బడ్నేరా-వర్దా, భూసవల్-ఇటరసీల మధ్య మూడవ ట్రాక్‌ల నిర్మాణాలున్నాయి. రాష్ర్టం మీదుగా వెళ్లే కొత్త రైళ్లు ఇవే.. జనసాధారణ్ రైళ్లు .. ముంబై-జయంగర్ ముంబై-గోరఖ్‌పూర్ ప్రీమియం రైళ్లు: ముంబెసైంట్రల్ - న్యూఢిల్లీ ఏసీ రైళ్లు: లోకమాన్యతిలక్ టెర్మినస్ (కుర్లా)-లక్నో (వీక్లీ) నాగ పూర్-పుణే (వారానికి ఒకసారి) పుణే-నిజాముద్దీన్ (వారానికి ఒకసారి) నాగపూర్-అమృతసర్ (వారానికి ఒకసారి) ఎక్స్‌ప్రెస్ రైళ్లు: ముంబై-కాజీపేట వయా మంచిర్యాల (వీక్లీ) ముంబై-పలితనా (వారానికి ఒకసారి) ముంబై-బీదర్ (వీక్లీ) కుర్లా-ముంబై)-అజమ్గడ్ (వీక్లీ) బాంద్రా-జైపూర్ వయా నగ్డా, కోట (వీక్లీ) అహ్మదాబాద్-చెన్నై వయా వసాయిరోడ్డు (వారానికి రెండు సార్లు) -
మాటపై నిలబడేనా?
సాక్షి, న్యూఢిల్లీ:నగరవాసులకు శుభవార్త. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యుత్ చార్జీలను 30 శాతం మేర తగ్గించే అవకాశముందని అంటున్నారు. ఢిల్లీలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తామని శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగగా అవతరించినప్పటికీ తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మెజారిటీ లేకపోయిన్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ... విద్యుత్‌చార్జీలను 50 శాతం తగ్గించింది. అయితే ఈ సబ్సిడీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులకుమునుపే గద్దె దిగడంతో ఆప్ ప్రకటించిన తగ్గింపు మూడు నెలల ముచ్చటే అయింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతోపాటు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది, ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించి, తద్వారా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామనే పేరు తెచ్చుకోవాలని బీజేపీ యోచిస్తోంది. ఇందులోభాగంగానే రానున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించవచ్చని ఆశిస్తున్నారు. విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గించడం కోసం రూ. 600 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని అరుణ్ జైట్లీ యోచిస్తున్నారని అంటున్నారు. 200 యూనిట్లు, 400 యూనిట్లు స్లాబ్లకు చార్జీలను 30 శాతం తగ్గించాలని కేంద్రం యోచిస్తోందని చెబుతున్నారు. ఢిల్లీలో విద్యుత్ సబ్సిడీని మళ్లీ ప్రవేశపెట్టడం కోసం రూ. 600 కోట్లను కేటాయించాలనే ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఢిల్లీ ఆర్థిక విభాగం పంపిన ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిం చాల్సి ఉంది. -
బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్!
-
సంస్కరణల కూత
-
రైల్వే బడ్జెట్ మార్కెట్లను నష్టాల్లో పడేసింది
-
రైల్వే బడ్జెట్ : కూతెవరికి.. కోతెవరికి?!
-
తెలుగు రాష్ట్రాలకు 5 కొత్త రైళ్లు
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు 2014-15 రైల్వే బడ్జెట్లో 5 కొత్త రైళ్లను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రకటించారు. రెండు రైళ్ల వేగం పెంచినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 29 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 20 వేల 680 కోట్ల రూపాయల కేటాయించారు. పోర్టుల కనెక్టివిటీకి 4వేల కోట్ల రూపాయలు కేటాయించగా, ఆంధ్రప్రదేశ్ రేవులకు మాత్రం మొండిచేయి చూపారు. 5 జన సాధారణ్ రైళ్లు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్కటీ దక్కలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కొత్త రైళ్లు: 1.విజయవాడ - న్యూఢిల్లీ డైలీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్ 2.సికింద్రాబాద్ - నిజాముద్దీన్ మధ్య ప్రీమియం ఏసీ రైలు 3.ముంబై - కాజీపేట వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా బల్లార్షా 4.విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ 5.పారాదీప్- విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ వేగం పెంచిన రైళ్లు 1.నాగపూర్-సికింద్రాబాద్ సెమీ బుల్లెట్ రైలు 2.చెన్నై - హైదరాబాద్ మధ్య సెమీ బుల్లెట్ రైలు -
సదానంద గౌడ కేంద్ర మంత్రా ? రాష్ట్ర మంత్రా ?
-
ఈసారీ తెలు'గోడు' వినలేదు!!
-
రైలు దారి మార్చుకుంటోంది....
న్యూఢిల్లీ : కూ చిక్ చిక్ అంటు వచ్చిన ఎన్డీయే రైలు బండి దారి మార్చుకుంటోంది. విదేశీ పెట్టుబడులకు రైల్వేశాఖ తలుపులు తెరుస్తోంది. రైల్వేలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. పీపీపీల పేరు (ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం)తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ రైల్వేల్లో ఎఫ్‌డీఐలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ పద్దతిలో పనులు చేపడతామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ ఆత్మ వంటిదన్న సదానంద గౌడ 62 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సార్లు వినిపించిన పదం పీపీపీ. దేశం మొత్తంలో చాలా రంగాలు ప్రైవేటీకరణ చేతికి అప్పగించినాఇప్పటి వరకు రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను ధైర్యంగా ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ రైల్వే శాఖలో కూడా ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తే ఇక దేశం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా మోడీ సర్కార్ రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శిస్తున్నాయి. నిజానికి కి ప్రధాని మోడీ ఎఫ్‌డిఐలకు ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ లో కాత్రా-ఉధంపూర్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వే సంస్థ అభివద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈ చర్యలు తప్పవని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. -
'బాధలు చెప్పుకొచ్చిన రైల్వే మంత్రి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాలకు కూడా రైల్వే బడ్జెట్లో ఎటువంటి స్పష్టమైన హామీ లభించలేదని వైఎస్ఆర్సీపీ సలహాదారు డి.ఎ.సోమయాజులు చెప్పారు. రైల్వే మంత్రి సదానంద గౌడ తన ప్రసంగంలో కేవలం బాధలే చెప్పుకొచ్చారన్నారు. ప్రజలకేం చేస్తారో చెప్పలేదని, రైల్వేబడ్జెట్ పూర్తి నిరాశ కల్గించిందని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన బిల్లులో ప్రస్తావించిన అంశాలెక్కడా బడ్జెట్లో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేట్ భాగస్వామ్యమంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని సోమయాజులు ప్రశ్నించారు. -
పోలవరం ఆర్డినెన్స్‌పై లోక్‌సభలో రగడ
-
'కమిటీ వేశారు... వివరాలు చెప్పలేదు'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్న వాగ్దానాలేవి రైల్వే బడ్జెట్లో లేకపోవడం దురదృష్టకరమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. విశాఖపట్టణంకు మెట్రో రైలు ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై కమిటీ వేశారని, ఆ కమిటీ వివరాలు తెలపలేదని అన్నారు. ఏపీలో ఆదాయం ఎక్కువగా ఉన్నా ప్రాజెక్టుల విషయంలో శీతకన్ను వేశారని విమర్శించారు. రైల్వే బడ్జెట్ తమను నిరాశ పరిచిందని తెలిపారు. ఎవరు అధికారంలో ఉంటే వారిదే బడ్జెట్ అన్నట్టు ఉందని మేకపాటి వ్యాఖ్యానించారు. రైల్వే మంత్రి ఒక రాష్ట్రానికే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారని ఖమ్మం ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
' ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఉంది'
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌పై మళ్లీ నిరాశే. నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన తొలి రైల్వేబడ్జెట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు అంతంత మాత్రం ప్రాధాన్యమే దక్కింది. మన ఎంపీలు ఎన్ని విజ్క్షప్తులు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఉంది రైళ్ల కేటాయింపు. రైల్వే మంత్రి సదానంద గౌడ...తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రెండు హైస్పీడ్, ఒకటి ప్రీమియం, ఒకటి ఏసీ, రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లును కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 20 వేల 600 కోట్లకు పైగా పెండింగ్ ప్రాజెక్టులున్నాయని తెలిపిన మంత్రి వీటి అమలుకు మాత్రం కమిటీతో సరిపెట్టారు. -
చంద్రబాబు ఏం సాధించారు: వీహెచ్
న్యూఢిల్లీ : ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి, రెండు రైళ్లు మినహా ... తెలుగు ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కొత్తగా పుట్టిన నవ్యాంధ్రప్రదేశ్‌కు కూడా సదానంద బడ్జెట్ నిరాశను మిగిల్చిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు. మరో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో రైల్వే ప్రైవేటీకరణే లక్ష్యంగా మోడీ సర్కార్ రైల్వే బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. సదానందగౌడ్ రైల్వే లెక్కలు... ఇరు రాష్ట్ర ప్రజలకు మొండిచేయి చూపించాయని మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉండి చంద్రబాబు ఎలాంటి ప్రయోజనాలు రాబట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. -
బెంగాల్ కు భంగపాటు: మమత
కోల్‌కతా: రైల్వే బడ్జెట్ లో తమ రాష్ట్రానికి మొండిచేయి చూపారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం చేతిలో బెంగాల్ కు భంగపాటు ఎదురైందని ఆమె వ్యాఖ్యానించారు. ఇటువంటి అవమానం బెంగాల్ ప్రజలకు ఇంతకుముందెఎన్నడూ జరగలేదని ఈ మాజీ రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ రైల్వే మంత్రిగా ఉండగా సొంత రాష్ట్రానికి ఎక్కువ రైళ్లు వేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. -
2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం లోక్ సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు: * సేప్టీ, సెక్యూరిటీ, స్పీడ్ కు ప్రాధాన్యత * కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ రైల్వేలైన్ల అనుసంధానం * దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వేలు అత్యంత కీలకం * భారతీయ రైల్వే ముందు ఎన్నో సవాళ్లు * రోజుకు 2కోట్ల 30లక్షలమందిని గమ్యానికి చేరుస్తోంది * భద్రత, సౌకర్యాలపై రాజీ పడేది లేదు * హైస్పీడ్ నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం * గత సంవత్సరం 99 కొత్త లైన్లకు అనుమతిస్తే ఒక్కటే పూర్తి * 359 ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. * ప్రతిపాదిత ప్రాజెక్టుల పూర్తికి 5 లక్షల కోట్లు అవసరం * రైల్వేల అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు చాలా అవసరం * కొత్త రైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి చాలా విజ్ఞాపనలు వచ్చాయి * ఆదాయంలో ప్రతి రూపాయికి 94 పైసలు ఖర్చు పెడుతున్నాం * 12,500 రైళ్లలో సురక్షిత ప్రయాణం అందిస్తున్నాం * ఏడాదిలోగా రైల్వే వ్యవస్థను గాడిలో పెడతాం * సరకు రవాణాలో ప్రపంచంలో అగ్రగామి కావటమే లక్ష్యం * రైల్వే సామాజిక బాధ్యత మరవలేదు * 30ఏళ్ల నుంచి సగంలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు నాలుగు ఉన్నాయి * భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మలాంటిది * ప్రజలపై భారం వేయకుండా ప్రత్యామ్నాయ ఆదాయంపై దృష్టి * రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం * ప్రాజెక్టుల ఆమోదం పైనే తప్ప పూర్తిపైన దృష్టి కొరవడింది * సరుకు రవాణాలో కొంత తగ్గుదల *58 కొత్త రైళ్లు, 11 రైళ్ల పొడిగింపు *5 జన సాధారణ్ రైళ్లు, మరో ఐదు ప్రీమియం రైళ్లు *ఆరు ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 27 ఎక్స్‌ప్రెస్ రైళ్లు *8 ప్యాసింజర్ రైళ్లు, రెండు డెము సర్వీసులు *ఏపీ, తెలంగాణకు దక్కని జనసాధారణ్ *సికింద్రాబాద్ - నిజాముద్దిన్ మధ్య ప్రీమియం ఏసీ రైలు *విజయవాడ - న్యూఢిల్లీ డైలీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైల్ *ముంబై - కాజీ పేట వీక్లీ ఎక్స్‌ప్రెస్ వయా బల్లార్షా *పారాదీప్ - విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ *విశాఖ - చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ *తొమ్మిది రూట్లలో రైళ్ల స్పీడు పెంపు *ముంబై - అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ ట్రైన్ *ఇక ఆన్లైన్లో కూడా ఫ్లాట్‌ఫాం టికెట్ *రైళ్లలో అందుబాటులో రెడీ టూ ఈట్ ఫుడ్ *ఏపీ, తెలంగాణకు కమిటీతో సరిపెట్టిన సదానంద గౌడ *రెండు రాష్ట్రాల్లో 29 పెండింగ్ ప్రాజెక్టులు, విలువ రూ.20608 కోట్లు *లక్షా 20వేల మంది లాగిన్ సామర్థ్యం తట్టుకునే విధంగా ఐఆర్సీటీసీ *ఐఆర్సీటీసీ వెబ్సెట్లో నిమిషానికి 7200 టికెట్లు జారీ చేసే సామర్థ్యం *అన్ని మేజర్ స్టేషన్లలో వైఫై సౌకర్యం ఏర్పాటు *గమ్యం చేరుకోబోయే ముందు ప్రయాణీకులకు అలర్ట్ వేకప్ కాల్స్ *రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు, ఇంజినీరింగ్ స్టూడెంట్లకు ఇంటర్న్‌షిప్ *మహిళా కోచ్‌ల్లో భద్రతా ఏర్పాట్లు, కొత్తగా 4వేల మహిళా కానిస్టేబుళ్లు *రైల్వే భద్రతకు దేశవ్యాప్తంగా 17000మంది ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు *రోడ్ అండర్, రోడ్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటుకు రూ.1785 కోట్లు *కాపలా లేని 11563 రైల్వే క్రాసింగ్‌ల వద్ద రక్షణ ఏర్పాట్లు *హైస్పీడ్ రైల్ కారిడార్‌కు రూ.వంద కోట్లు *ఈశాన్య రైల్వే కారిడార్ అభివృద్ధికి రూ.5116కోట్లు *పోర్టుల కనెక్టివిటీకి రూ. 4వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రేవులకు మొండిచేయి *30ఏళ్లుగా 676 ప్రాజెక్టుల ప్రతిపాదన, పెండింగ్‌లోనే 359 ప్రాజెక్టులు *మొబైల్ ఫోన్ ద్వారా టికెట్ బుకింగ్ ఏర్పాటు *మేజర్ స్టేషన్లలో మరిన్ని కాయిన్ ఆపరేట్ టికెట్ మెషీన్లు *ఇక పార్కింగ్‌కు ప్లాట్‌ఫాంకు కాంబో టికెట్లు *ఆన్లైన్లోనే కోరుకున్న సీటు, కోచ్, బెర్తు రిజర్వు చేసుకునే అవకాశం *దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక కనెక్టివిటీ రైళ్లు *దేవీ, జ్యోతిర్లింగ, జైన్, క్రిస్టియన్, ముస్లిం, సిక్ సర్క్యూట్ల ఏర్పాటు *కర్ణాటక, మహారాష్ట్రల్లోని పర్యాటక ప్రాంతాలను కవర్ చేసే ప్రత్యేక రైలు *బెంగళూరు, చెన్నై, అయోధ్య, వారణాసి, హరిద్వార్‌లలో పర్యాటక రైలు *స్వామి వివేకానంద బోధనలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక రైలు *అన్ని స్టేషన్లలో భోజన సౌకర్యం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణీకుల ఫీడ్‌బ్యాక్ *ఎలాంటి భోజనం కావాలో ఎస్ఎంఎస్ ద్వారా కోరుకునే సౌకర్యం *50 మేజర్ స్టేషన్లలో కాంట్రాక్టు పారిశుద్ధ్య నిర్వహణ *సిసి టీవీల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలన *ఏ ప్లాట్‌ఫాంకైనా వెళ్లేలా వృద్ధులకు బ్యాటరీ ఆపరేటేడ్ కార్ల సౌకర్యం *వచ్చే ఐదేళ్లలో అన్ని రైల్వే కార్యాలయాల్లో పేపర్ లెస్ నిర్వహణ *ఏ1, ఏ క్యాటగిరీ స్టేషన్లతో పాటు కొన్ని రైళ్లలో వైఫే సౌకర్యం *రైల్వే వెబ్సైట్లలో ఏ రైలు ఎక్కడున్నది తెలుసుకునే వీలు *ముందొచ్చే స్టేషన్ పేరును ప్రయాణీకులకు తెలిపే ఏర్పాటు *రైల్వేల ఆస్తులు, భూములను జీఐఎస్ మ్యాపింగ్ గుర్తింపు *రైల్వేల మౌలిక సదుపాయాలకు విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం *నిధుల పెంపునకు పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రయత్నాలు -
రైల్వే పార్సిళ్లకూ డోర్ డెలివరీ
గతంలో ఎన్నడూ లేని విధంగా డోర్ డెలివరీ విధానాన్ని రైల్వేశాఖ చేపట్టబోతోంది. ఇన్నాళ్లూ ఏదైనా పార్సిల్ బుక్ చేసుకోవాల్సి వస్తే, ఒక స్టేషన్లో బుక్ చేసి, గమ్యస్థానం వద్ద కూడా మనమే స్టేషన్‌కు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక అలా అవసరం లేకుండా.. బుక్ చేసిన సరుకులను రైల్వే వర్గాలే నేరుగా ఇంటి వద్దకు డెలివరీ అందించే విధానాన్ని సదానంద గౌడ తన కొత్త బడ్జెట్లో ప్రకటించారు. ఇది ఒకరకంగా విప్లవాత్మకమైన మార్పే. అలాగే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న సరుకు రవాణాలో కేవలం 30 శాతం మాత్రమే రైలు మార్గంలో వెళ్తోందని, ఈ వాటాను గణనీయంగా పెచుకోడానికి ప్రత్యేకంగా సరికొత్త డిజైన్లలో పార్సిల్ వ్యాన్లు తీసుకొచ్చి, వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తామని కూడా ఆయన చెప్పారు. ఇంకా, ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్లను ఏర్పాటుచేసి, ఆ మార్గాల్లో సరుకులు మాత్రమే రవాణా అయ్యేలా చేస్తామని, దానివల్ల సరుకు రవాణాకు పట్టే సమయం గణనీయంగా తగ్గుతుందని గౌడ తెలిపారు. భద్రతకు పెద్దపీట వేస్తామని, రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల రక్షణ కోసం కొత్తగా 4వేల మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించి, వారికి సెల్ఫోన్లు కూడా అందజేస్తామని ఆయన అన్నారు. వీటి సాయంతో ప్రయాణికులు ఏ కోచ్ నుంచి అయినా వారిని సంప్రదించొచ్చని వివరించారు. ప్రయాణికుల సౌకర్యాలు ఎఫ్‌ఓబీలు, ఎస్కలేటర్లను ప్రధాన స్టేషన్లలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుచేస్తామని, అన్ని స్టేషన్లలో ప్రైవేటు మార్గాల ద్వారా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు పెడతాం. వీటివల్ల వృద్ధులు, వికలాంగులు ఏ ప్లాట్ ఫారాల మీదకైనా వెళ్లగలరని గౌడ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని.. ఇక మీదట ప్రయాణికులు ఒక రైలును గానీ, బోగీని గానీ, బెర్తును గానీ దేన్నయినా బుక్ చేసుకోవచ్చని సభ్యుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఎస్ఎంఎస్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఆహారం నాణ్యత, పరిశుభ్రత పెంచేందుకు రెడీ టు ఈట్ మీల్స్‌ను ప్రవేశపెడతామని దీనివల్ల కేటరింగ్ నాణ్యత పెరుగుతుందని రైల్వే మంత్రి చెప్పారు. దీని నాణ్యతపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తామని, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల నుంచి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తీసుకుంటామని అన్నారు. నాణ్యత లేకపోతే అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారి లైసెన్సు సైతం రద్దు చేస్తామని అన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామని.. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని వివరించారు. -
విశ్వాసం కల్పించే బడ్జెట్: మోడీ
న్యూఢిల్లీ: దేశాభివృద్ధి పట్ల విశ్వాసం కల్పించేవిధంగా రైల్వే బడ్జెట్ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. పారదర్శకత, సంస్థాగత సామర్థ్యం పెంచేవిధంగా రైల్వే బడ్జెట్ రూపొందించారని అన్నారు. తక్కువ సమయంలో దిశానిర్దేశం చేసే బడ్జెట్ ఇదని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారని తెలిపారు. టెక్నాలజీని సామర్థవంతంగా వినియోగించుకునేలా రైల్వే బడ్జెట్ ఉండడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దేశాభివృద్ధిలో రైల్వే శాఖ కీలక భూమిక పోషిస్తోందని చెప్పారు. రైల్వే వ్యవస్థపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. -
'తెలంగాణకు, ఏపీకి న్యాయం జరగలేదు'
హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పెదవి విరిచారు. ఎన్డీఏ రైల్వే బడ్జెట్ రైల్వేశాఖను ప్రైవేటీకరణ చేసే విధంగా ఉందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్‌కు గానీ ఎలాంటి న్యాయం జరగలేదని గుత్తా వ్యాఖ్యానించారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌కు జోనల్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తేలేదని ఆయన అన్నారు. ఎన్డీయే మిత్రపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల కోసం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాకపోవటం విడ్డూరంగా ఉందని గుత్తా ఎద్దేవా చేశారు. -
2014-15 రైల్వే బడ్జెట్ హైలెట్స్
-
విశ్వాసం కల్పించే బడ్జెట్: మోడీ
-
ఆన్లైన్లో ప్లాట్‌ఫామ్, పార్కింగ్ టికెట్లు
హైదరాబాద్ : ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం ప్రయాణికులు భారీ క్యూలో నిలబడే ఇబ్బందులు తప్పనున్నాయి. ప్లాట్‌ఫామ్ టికెట్ల కోసం కౌంటర్ల వద్ద భారీగా జనం క్యూ కట్టడం చూస్తూ వుంటాం. ఈ సమస్యను చెక్ పెట్టేలా ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్ కొనుగోలు చేసుకునే రైల్వే శాఖ వెసులుబాటు కల్పించింది. రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం రైల్వే బడ్జెట్ ప్రసంగంలో ఈవిషయాన్ని వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్ టికెట్‌తో పాటు పార్కింగ్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. -
ప్రయాణికుల సౌకర్యాలకు, భద్రతకు పెద్దపీట
న్యూఢిల్లీ: భద్రత, శుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ 2014-15 రైల్వే బడ్జెట్ ను రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టారు. భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, ఇందుకు రూ.11719 కోట్లు వెచ్చించనున్నామని చెప్పారు. 4 వేల మంది మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించి అన్ని తరగతుల్లోనూ ప్రయాణించే మహిళల భద్రతను పరిరక్షిస్తామన్నారు. వీరికి మొబైల్ ఫోన్లు కూడా ఇస్తామని, వాటి ద్వారా ప్రయాణికులు ఏ కోచ్ నుంచి అయినా వారిని సంప్రదించే అవకాశం ఉంటుందని వివరించారు. ఎఫ్‌ఓబీలు, ఎస్కలేటర్లను ప్రధాన స్టేషన్లలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని స్టేషన్లలో ప్రైవేటు మార్గాల ద్వారా బ్యాటరీ ఆపరేటెడ్ కార్లు పెడతామని వీటివల్ల వృద్ధులు, వికలాంగులు ఏ ప్లాట్ ఫారాల మీదకైనా వెళ్తారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రయాణికుల సౌకర్యాల్లో భాగస్వాములను చేస్తామన్నారు. కొన్ని రైళ్లలో వర్క్ స్టేషన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడతామన్నారు. ఆహారం నాణ్యత, పరిశుభ్రత పెంచేందుకు రెడీ టు ఈట్ మీల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి తెలిపారు. ఆహార నాణ్యతపై థర్డ్ పార్టీ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రయాణికుల నుంచి ఆహార నాణ్యతపై అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. నాణ్యత లేకపోతే అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని తెలిపారు. రైళ్లు, స్టేషన్లలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 50 ప్రధాన స్టేషన్లలో పారిశుధ్యాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు. సీసీ టీవీల ద్వారా కూడా స్టేషన్లలో పరిశుభ్రతను పరిశీలిస్తాం. బయో టాయిలెట్లను చాలావరకు రైళ్లలో పెడతామన్నారు. మెకనైజ్డ్ లాండ్రీలను ఏసీ కోచీల కోసం ఏర్పాటుచేస్తామన్నారు. ఆర్ఓ తాగునీటి ప్లాంట్లను స్వచ్ఛంద సంస్థల సాయంతో రైళ్లు, స్టేషన్లలో ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
'వచ్చే ఐదేళ్లలో పేపర్‌లెస్ రైల్వే కార్యాలయాలు'
న్యూఢిల్లీ: రైల్వేలో పారదర్శకతను పెంచేందుకు అన్ని విభాగాలను కంప్యూటరీకరించనున్నట్టు రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఐటీ విప్లవం జీవితంలోని అన్ని రంగాలకూ వ్యాపించిందని, దీన్ని తాము కూడా అందిపుచ్చుకుంటామన్నారు. రాబోయే ఐదేళ్లలో రైల్వే శాఖలో మొత్తం పేపర్‌లెస్ కార్యాలయాలు ఉంటాయని పేర్కొన్నారు. టికెట్ కౌంటర్లన్నింటిలో డ్యూయల్ డిస్ప్లే ఛార్జీ ఇండికేటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే డిజిటల్ రిజర్వేషన్ చార్టులను కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కొన్ని స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తామన్నారు. -
ఇక రైలు తలుపులు మూసుకుపోతాయి!
న్యూఢిల్లీ: తలుపులు వాటంతట అవే మూసుకుపోయే సౌకర్యం రైళ్లలో అందుబాటులోకి రానుంది. బుల్లెట్, హైస్పీడ్ రైళ్లలో అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం మన రైళ్లలోనూ రానుంది. ఈ మేరకు 2014-15 రైల్వే బడ్జెట్ లో ప్రతిపాదించారు. ప్రధాన రైళ్లు, సబర్బన్ మార్గాల్లో రైలు బయల్దేరే ముందే తలుపులు మూసుకుపోయేలా వ్యవస్థ ఏర్పాటుచేస్తామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. స్టేషన్ వచ్చినప్పుడు వాటంతట అవే తలుపులు తెరుకుంటాయి. సమయాన్ని ఆదా చేసేందుకు ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని చెప్పారు. -
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సదానందగౌడ
-
మనకో నాలుగు కొత్త రైళ్లు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డిమాండ్లు, వినతుల మేరకు జనసాధారణ్, ప్రీమియం రైళ్లను ప్రవేశపెడతామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. 5 జనసాధారణ, 5 ప్రీమియం, 6 ఏసీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 20 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇంకా మెము, డెము రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్ల వివరాలను ఆయన చదువుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు విపరీతంగా నినాదాలు చేస్తుండటంతో బీజేపీ సభ్యులు కూడా వారికి పోటీగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ వివాదం నడుమే సదానంద గౌడ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఆ వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. సదానంద గౌడ ప్రకటించినవాటిలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ వెళ్లే రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్-నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ విజయవాడ- న్యూఢిల్లీ ఏసీ ఎక్స్‌ప్రెస్ పారాదీప్- విశాఖపట్నం వీక్లీ ఎక్స్‌ప్రెస్ విశాఖ -చెన్నై వీక్లీ ఎక్స్‌ప్రెస్ -
'త్వరలో ఆంధ్ర, తెలంగాణ ప్రాజెక్టులపై చర్యలు'
న్యూఢిల్లీ: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొనసాగుతున్న 29 ప్రాజెక్టులపై ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలతో సమావేశమై ఆ ప్రాజెక్టులను చేపడతామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే అధికారులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో చేపడుతున్న ప్రాజెక్టులకు గత సంవత్సరం కంటే ఎక్కువగా కేటాయిస్తామని ఆయన అన్నారు. ఇది గత సంవత్సరం కంటే 57 శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, అమూల్ సాయంతో ప్రత్యేకంగా పాల రవాణా బోగీలను రూపొందిస్తామని, అంతేకాకుండా సౌర విద్యుత్తును అత్యధికంగా ఉపయోగించుకునేలా చూస్తామన్నారు. రైల్వే ఆస్తులపై పీపీపీ పద్ధతిలో సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేయడానికి సుముఖంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఆలస్యం వల్ల రైల్వేశాఖకు చాలా నష్టాలు వస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. వీటిని అధిగమించడానికి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. -
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు
న్యూఢిల్లీ: ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇపుడున్న రైళ్లకు కూడా హైస్పీడుకు పెంచుతామన్నారు. దీనివల్ల ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు వస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో వీటిని ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే ఉన్న, కొత్తగా రాబోతున్న ఓడరేవులకు అనుసంధానంగా మరిన్ని రైలు మార్గాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైతే పీపీపీ పద్ధతిలో నిధులు సేకరిస్తామని చెప్పారు. బొగ్గు ఎక్కువగా లభించే ప్రాంతాలను కూడా రైల్వే పరిధిలోకి తెస్తామన్నారు. దీనివల్ల విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు త్వరగా అందుతుందని చెప్పారు. -
నిమిషానికి 7200 రైల్వే టికెట్లు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునీకరించనున్నామని రైల్వే మంత్రి సదానంద గౌడ తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ రిజర్వేషన్ పద్ధతిని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. దీనివల్ల నిమిషానికి 7200 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లక్షమంది లాగిన్ అయినా సమస్యరాని విధంగా దీన్ని అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. ఇక నుంచి రైలు, కోచ్, బెర్త్.. ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని చెప్పారు. రిటర్న్ జర్నీతో బుక్ చేసుకునేవారికి ఆటోమేటిగ్గా చార్జీ తగ్గేలా ఏర్పాటుచేస్తామన్నారు. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వై-పై సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని స్టేషన్లలో రిటైరింగ్ రూంలను ఆన్ లైన్ లో బుక్ చేసుకునేలా విస్తరిస్తామన్నారు. ప్రధాన స్టేషన్లలో ఫుడ్ కోర్టులు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, స్మార్ట్ ఫోన్ల ద్వారా వీటికి ఆర్డర్ చేయచ్చని తెలిపారు. పార్కింగ్ కమ్ ప్లాట్ఫారం టికెట్లను ప్రవేశపెడతామని, దీనివల్ల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. -
మందు చేదుగానే ఉంటుంది గానీ...
న్యూఢిల్లీ: రైల్వే శాఖలో చాలా సంస్కరణలు చేపట్టాల్సి ఉందని, ఇది కష్టమే అయినా.. తప్పనిసరిగా చేపట్టాలని రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ అన్నారు. 2014-15 రైల్వే బడ్జెట్ ను మంగళవారం లోక్‌సభలో ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సంస్కరణల గురించి మాట్లాడుతూ... ''మందు చేదుగానే ఉంటుంది గానీ, చివరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది''. కేవలం ప్రయాణికుల ఛార్జీలను పెండచం మాత్రమే నిధుల సేకరణకు మార్గం కాదన్నారు. ప్రత్యామ్నాయ వనరులను కూడా అన్వేషించాలని అభిలషించారు. రైల్వే మౌలిక సదుపాయాలు, ప్రైవేటు రంగానికి పెద్దపీట వేయడం, స్వదేశీ, విదేశీ నిధులను తేవడం.. ఇవన్నీ తమ ముందున్న మార్గాలని చెప్పారు. రైల్వే ఆపరేషన్లు మినహా మిగిలిన రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లను తేవడానికి కేబినేట్ ఆమోదం కోరామన్నారు. పీపీపీ మార్గంలో కూడా కొన్ని పనులను చేపడతామన్నారు. హైస్పీడ్ రైలు లాంటి వాటికోసం దీన్ని ఉపయోగిస్తామని సదానంద గౌడ తెలిపారు. -
సేఫ్టీ, స్పీడ్, సెక్యూరిటీ
న్యూఢిల్లీ: రైల్వే మంత్రి సదానంద గౌడ లోక్‌సభలో రైల్వే బడ్జెట్ 2014-15 ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'అన్ని వర్గాలు, ప్రాంతాలకు రైల్వేలు సేవలు అందిస్తున్నాయి. కోల్‌కతాలో వీధుల మీద నడిచేవారి నుంచి నెల రోజులే అయ్యింది. నాకు అనేక సూచనలు వచ్చాయి. ఎంపీలు, ప్రభుత్వంలో సహచరులు, రాష్ట్రాలు, అన్ని వర్గాలప్రజలు ఈ విషయంలో సలహాలు ఇచ్చారు. రైల్వేలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ తమదైన పరిష్కారాలు సూచించారు. వారి ఆశలు నెరవేర్చేందుకు నా బాధ్యతలను నెరవేర్చే ప్రయత్నిస్తాను. ఆర్య చాణక్యుడిని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ... ''ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాం చ హితే హితమ్ నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు ప్రియంహితమ్.. అంటే, ప్రజల సుఖమే తన సుఖము, ప్రజాహితమే తన హితము. తనకు, ప్రజకు వేరు హితము లేదు'' అని చెప్పారు. 23 మిలియన్ల ప్రయాణికులను మన రైల్వే గమ్యాలకు చేరుస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 7,400 గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. కేవలం 30 శాతం సరుకులనే రైల్వేలు రవాణా చేస్తున్నాయి. రక్షణకు సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా రవాణా చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ చాలామంది రైళ్లలో అడుగుపెట్టలేకపోతున్నారని, చాలా ప్రాంతాలు రైళ్ల కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తున్నాయని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... * సామాజిక బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నాం. * దేశంలో 1.16 లక్షల కిలోమీటర్ల పట్టాలున్నాయి. * 13 లక్షల మంది ఉద్యోగులున్నారు. * భద్రత కూడా మాకు చాలా ముఖ్యం. * మొత్తం ఖర్చులే 94 శాతం అవుతున్నాయి. * మాకు వచ్చే ప్రతి రూపాయిలో 94 పైసలు ఖర్చుపెడుతుండగా కేవలం 6 పైసలు మాత్రమే మిగులుతున్నాయి. * ప్రయాణికుల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, భద్రత.. అన్నీ మాకు ప్రాధాన్యాంశాలే. * ప్రయాణికుల ఛార్జీలు చాలా తక్కువగా ఉంటున్నాయి. నష్టాలను పూడ్చేందుకు రవాణా ఛార్జీలను వరుసగా పెంచుకుంటూ వస్తున్నాం. * సేఫ్టీ, స్పీడ్, సెక్యూరిటీ.. ఈ మూడూ మా ప్రాధాన్యాలు * 1.57 లక్షల కోట్ల విలువైన 676 ప్రాజెక్టులను గత సంవత్సరం వరకు మనం చేపట్టాం. * గత పదేళ్లలో 99 ప్రాజెక్టులను చేపట్టగా వాటిలో ఒక్కటి మాత్రమే పూర్తయింది. * చాలా ప్రాజెక్టులు గత 30 ఏళ్లుగా కొనసా..గుతూనే ఉన్నాయి. ఎక్కువ ప్రాజెక్టులు ఒకేసారి చేపడితే ఇలాగే అవుతుంది. * గత పదేళ్లలో కొత్త రైలు మార్గాలు వేయడానికి, ఉన్న సింగిల్ లైన్లను డబ్లింగ్ చేయడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు. * రైల్వే శాఖకు విపరీతంగా నిధుల కొరత ఉండటంతో కమర్షియల్ వయబులిటీ, సామాజిక బాధ్యత మధ్య సమన్వయం చేసుకోలేక గత పదేళ్లుగా చతికిలపడ్డారు. * గత ప్రభుత్వ విధానాల వల్ల రైల్వేశాఖ నష్టాల్లో కూరుకుపోయింది. ప్రాజెక్టులయితే ప్రకటిస్తున్నాం గానీ, పూర్తి చేయలేకపోతున్నాం. * 359 పెండింగ్ ప్రాజెక్టుల కోసం రూ.1.82 లక్షల కోట్లు కావాలి. * ఈ ఆర్థిక సంవత్సరంలో 1,64,374 కోట్లు ఆదాయం వస్తుందని భావించి, 1,49,176 కోట్ల వ్యయం ప్రతిపాదిస్తున్నాం. * ఇటీవల రైల్వే ఛార్జీలను పెంచడం వల్ల 8వేల కోట్ల ఆదాయం వస్తోంది * భద్రతకు పెద్దపీట వేస్తున్నాం. ఇందుకు రూ. 11719 కోట్లు వెచ్చిస్తున్నాం * ప్రస్తుత సంవత్సరంలోనే పూర్తయ్యే ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయిస్తాం * భద్రత, శుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలు, సామర్థ్యం పెంచడం * కొన్ని స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తాం * డోర్ టు డోర్ డెలివరీని కూడా త్వరలోనే భారతీయ రైల్వే చేపడుతుంది. * రిటర్న్ జర్నీతో బుక్ చేసుకునేవారికి ఆటోమేటిగ్గా చార్జీ తగ్గేలా ఏర్పాటుచేస్తాం * పార్సిల్ సర్వీసు విషయంలో సరికొత్తడిజైన్లతో పార్సిల్ వ్యాన్లు తయారుచేయించి, వాటిని అందరికీ అందుబాటులోకి తెస్తాం -
ఫేస్బుక్, ట్విట్టర్లో చేరిన రైల్వేశాఖ
ప్రధాని నరేంద్రమోడీ బాటలో.. మరికొన్ని గంటల్లో రైల్వేబడ్జెట్ ప్రవేశపెడతామనగా.. రైల్వేశాఖ కూడా ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. ఫేస్బుక్, ట్విట్టర్లలో అధికారికంగా అకౌంట్లు తెరిచింది. దేశవాసులకు తమశాఖకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుగా సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోడానికి ఈ ఏర్పాటుచేసుకుంది. వాస్తవానికి గత కొన్నాళ్లుగా అన్ని శాఖలూ చురుగ్గా ఫేస్బుక్, ట్విట్టర్లలోకి వస్తుండగా, రైల్వేశాఖ మాత్రం వెనకబడింది. రైలు ప్రయాణికుల్లో అత్యధికులకు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. జూన్ నెలలో టికెట్ల ధరలు పెంచినప్పుడు ప్రయాణికులు ఫేస్బుక్, ట్విట్టర్లలో కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇక రైల్వే శాఖకు ప్రత్యేకంగా ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలు ఉండాలని రైల్వే మంత్రి సదానంద గౌడ భావించారు. అనుకున్నదే తడవుగా సోమవారం రాత్రే ఈ పేజీలను ప్రారంభించారు. దీనివల్ల తమ శాఖ ప్రజల వద్దకు వెళ్లడం మరింత సులువు అవుతుందని ఆయన అన్నారు. ఈ రెండు సోషల్ మీడియాలతో పాటు యూట్యూబ్‌లోకి కూడా రైల్వే శాఖ ప్రవేశించింది. మంగళవారం నుంచి అన్ని సోషల్ మీడియాలలోను రైల్వేలకు సంబంధించిన సమాచారాన్ని చూడొచ్చని గౌడ తెలిపారు. రైల్వే బడ్జెట్ వినాలనుకునేవారు 022-4501555 నెంబరుకు ఫోన్ చేయొచ్చని, దాంతోపాటు ఇప్పటివరకు ఉన్న రైల్వే విచారణ నెంబరు 139ను కూడా ఉచితం చేశామని ఆయన చెప్పారు. -
మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే బడ్జెట్
న్యూఢిల్లీ : కేంద్ర రైల్వేశాఖమంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్డీయే సర్కార్ కొలువైన తర్వాత తొలిసారి ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సదానంద గౌడ రైల్వే బడ్జెట్ పత్రాలతో పార్లమెంట్‌కు బయల్దేరారు. కాగా రైల్వే బడ్జెట్లో బుల్లెట్ రైళ్లను ప్రకటించబోతున్నట్లు అంతకు ముందు సదానంద గౌడ్ తెలిపారు. రైల్వేలను ప్రజాహితంగా మార్చాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మా రాష్ట్రానికి ఈ రైళ్లివ్వరూ!!