
లాయర్ గౌడ తొలిసారి బడ్జెట్
ప్రవేశపెట్టిన బీజేపీ నేత
సంపూర్ణ మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన భారతీయ జనతా పార్టీ తొలిసారిగా తమ పార్టీకి చెందిన నేతకు రైల్వే శాఖను కట్టబెట్టింది. ఆ హోదాలో డి.వి.సదానందగౌడ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. న్యాయశాస్త్ర విద్యను అభ్యసించి ప్రారంభంలో కొంతకాలం న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక రాష్ర్టం మందెకొట్ల గ్రామం దేవరగుండా కుటుంబంలో జన్మించారు. ఏబీవీపీ జనరల్ సెక్రటరీగా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తూ క్రీయాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ఆయన జీవితం కర్ణాటక ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే మంత్రి స్థాయికి ఎదిగింది. 1994లో తొలిసారి ఎన్నికల్లో పోటీ. పుత్తూర్ అసెంబ్లీ స్థానం నుంచి విజయం.
పుట్టింది: 19, మార్చి 1953
సుల్యా, దక్షిణ కర్ణాటక
తల్లిదండ్రులు: కమల, వెంకప్పగౌడ
భార్య పేరు దత్తే.. కుమారుడు కార్తీక్.
చిన్న కుమారుడు కౌషిక్.. మెడిసిన్ చదువుతుండగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ అద్భుతం, విప్లవాత్మకం. భద్రత, పరిశుభ్రత, వేగానికి ప్రాధాన్యం ఇవ్వటం ద్వారా రైల్వేలను తిరిగి గాడిన పెడుతుంది. బడ్జెట్‌లో సృజనాత్మక ఆలోచనలున్నాయి. రైల్వే మంత్రి సదానందదే ఈ ఘనత.
- రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి