‘అనుబంధం’లోనైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ: రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్‌లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా, అసంతృప్తిగా ఉందన్నారు. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
ఏపీ, తెలంగాణలోని 29 పెండింగు ప్రాజెక్టుల విషయంలో కమిటీ నిర్ణయం తర్వాత అనుబంధ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖను కోరారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.