T. Subbarami Reddy
-
అందరూ మహానటులే
‘‘నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుగార్లు ధ్రువతారలు. ఏ వేడుకలకు పిలిచినా వచ్చేవారు. అవార్డులు ఇస్తే తీసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు కళాకారులు పబ్లిక్‌లోకి వచ్చి అవార్డులు అందుకోవడం వల్ల తమ గౌరవం తగ్గిపోతుందన్నట్లుగా భావిస్తున్నారు. అది సరైనది కాదు. వారు ఎన్టీఆర్, ఏయన్నార్ల క్రమశిక్షణను ఫాలో కావాలని కోరుకుంటున్నాను’’ అని కళాబంధు, టీఎస్సార్ లలిత కళాపరిషత్ వ్యవస్థాపకులు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలు ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘అభినయ మయూరి’ అనే బిరుదుతో ప్రముఖ నటి జయసుధను సత్కరించనున్నారు. ఈ కార్యక్రమాల గురించి హైదారాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చాలామంది సినిమాను, కళాకారులను అపార్థం చేసుకుంటుంటారు. నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉన్న దైవశక్తి ఇంకెందులోనూ లేదు. నటీనటులు, దర్శకులు, రచయితలు, గాయకులు.. ఇలా అందరూ కలిస్తేనే మనం సినిమాను ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నేను సంతోషంగా ఉండటానికి కారణం కళాకారులను ప్రోత్సహించుకోవడమే. కళని ఒక ఈశ్వరశక్తిగా భావించే వ్యక్తిని నేను. గత ఏడాది జమునగారిని సన్మానించాం. ఈ ఏడాది ఈ నెల17న ‘అభినయ మయూరి’ బిరుదుతో జయసుధగారిని సత్కరిస్తున్నాం. దాదాపు 46ఏళ్ల సినిమా ప్రస్థానం ఉన్న ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకస్థానం ఏర్పరచుకున్నారు. మనమందరం గర్వించదగ్గ నటీమణి ఆమె. 16న ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది’’ అన్నారు. ‘‘తిరుపతి’ సినిమాలో నేను, జయసుధగారు కలిసి నటించాం. ‘జ్యోతి’ సినిమాతో ఆమెకు పెద్ద పేరు వచ్చింది. సుబ్బరామిరెడ్డిగారు జయసుధగారికి ఈ అవార్డు ఇవ్వబోతుండటం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో అవార్డు ఫంక్షన్స్‌ను కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు అవార్డులు ఇవ్వడం లేదు. నంది అవార్డుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా గుర్తించి అవార్డులను ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘సుబ్బరామిరెడ్డిగారికి కళలన్నా, కళాకారులన్నా మంచి అభిమానం. మహానటి అంటే మనమందరం ఒకరే అనుకుంటాం. కానీ అందరూ మహానటులే. లేకపోతే ఒక ఆర్టిస్టుగా ఎక్కువ కాలం నిలబడలేం. జమునగారి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. గొప్పనటి జమునగారు నన్ను మహానటి అని పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోకాలంగా కష్టపడుతున్నందుకు కళాకారులకు అవార్డులనేవి గుర్తింపు. కొన్ని అవార్డ్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అవార్డ్స్ ఇవ్వండి.. మీరే మమ్మల్ని గుర్తించకపోతే ఎలా? వేడుకలకు, ప్రారం భోత్సవాలకు, స్వచ్ఛంద సేవ, సామాజిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాం. స్వచ్ఛభారత్ అంటూ ఊడ్చుతాం. ఇలా అన్నీ చేస్తాం. మమ్మల్ని గుర్తించి అవార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇండస్ట్రీలో ఇద్దరు సోదరులు.. ఒకరు మురళీమోహన్‌గారు, మరొకరు మోహన్‌బాబుగారు. వీరితో ఎన్నో సినిమాలు చేశాను’’ అన్నారు. ‘‘ఇంతమంది కళాకారులను ప్రోత్సహిస్తూ తనకు సినిమాల పట్ల, సినిమా పరిశ్రమల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు సుబ్బరామిరెడ్డిగారు. కళాకారులను మర్చిపోకుండా గౌరవిస్తున్నారు. మురళీమోహన్‌గారు అందాల హీరో. ఆయన ఇప్పుడు తెల్ల జుత్తుతో ఉంటే మాకు నచ్చడం లేదు (నవ్వుతూ). ‘పండంటి కాపురం’ సినిమాలో నా కూతురిగా నటించారు జయసుధ. మా అమ్మాయి నటిగా ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు నటి జమున. -
‘...అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం’
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు. హైదరాబాద్ వస్తే నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామని గతంలో హెచ్చరించిన చంద్రబాబే మోదీ కాళ్లకు మొక్కారని, ఆయన దేనికైనా సమర్థుడని నారాయణస్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్‌మీడియాలో కనిపిస్తున్న ఫొటోలను నారాయణస్వామి మీడియాకు విడుదల చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దు సభలో ప్రధానమంత్రికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయకపోయినా చేసినట్లు తప్పుడు ప్రచారం సాగించడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం మామూలే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేను కూడా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కరించా. పెద్దలకు నమస్కారం చేయడం మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో భాగం. – టి.సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ సభలో విజయసాయిరెడ్డి కనిపించలేదు సభలో ఫేర్వెల్ స్పీచ్ ఇచ్చే వరకూ మేమంతా కామ్‌గా ఉంటామని, ఆ తర్వాత నిరసన కొనసాగిస్తామని తెలియజేశాం. ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. నేను ప్రధానమంత్రికి నమస్కారం పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. పెద్దవాళ్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం. అది భారతదేశ సంస్కృతి. పెద్దవాళ్లు కనిపిస్తే దగ్గరికెళ్లి నమస్కారం పెడతాం. అది సహజం, అందులో తప్పులేదు. – సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ -
ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు
భారతీయ కళలను, సంస్కృతిని ప్రోత్సహించే కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి జాతీయ స్థాయిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రాతో ఆయనది ఎనలేని బంధం. ఆ అనుబంధం తోనే యశ్ చోప్రా తనువు చాలించిన తరువాత సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ తరఫున 2013 నుంచి నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డును సినీ ప్రముఖులకు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ ఈ అవార్డును ప్రముఖ నేపథ్య గాయని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ ఆశాభోస్లేకు ఇవ్వనున్నారు. శనివారం ముంబైలో సమావేశమైన టి. సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్ జ్యూరీ సభ్యులు సర్వశ్రీ బోనీకపూర్, మాధుర్ భండార్కర్, హనీ ఇరానీ, పద్మినీ కొల్హాపురి, సుబ్బరామిరెడ్డి, ఆశాభోస్లే పేరును నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. గతంలో ఈ అవార్డును లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ, షారుక్ ఖాన్ అందుకున్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఈ అవార్డు ప్రదానోత్సవం ముంబైలో ఫిబ్రవరి 16న ఘనంగా జరుగుబోతోంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు లతామంగేష్కర్ చేతుల మీదుగా 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు -2017'ను ఆశాభోస్లే అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్, షారుక్ ఖాన్, శ్రీదేవి, జయప్రద తదితరులు పాల్గొనబోతున్నారు. 1933లో జన్మించిన ఆశాభోస్లే పదేళ్ళ వయసులోనే నేపథ్య గాయనిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. గడిచిన 75 సంవత్సరాల్లో వందల చిత్రాలలో వేలాది గీతాలను ఆలపించిన ఆశాభోస్లే రెండు సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు సంపాదించుకున్నారు. ఆమె కీర్తి కిరీటంలో 'నేషనల్ యశ్ చోప్రా మెమోరియల్ అవార్డ్' మరో మైలు రాయిగా నిలువబోతోంది. -
వైభవంగా టీయస్సార్ అవార్డుల వేడుక
ఇటు దక్షిణాది అటు ఉత్తరాది.. ఏ ప్రాంతమైతేనేమి.. కళాకారులందరూ ఒక్కటే. అయితే అందర్నీ ఒకే వేదిక మీద చూస్తే సినీప్రియులకు కలిగే ఆనందమే వేరు. శనివారం సాయంత్రం వైజాగ్‌లో జరిగిన ‘టీయస్సార్’ అవార్డుల వేడుక అలాంటి ఆనందాన్నే కలిగించింది. 2015, 2016 సంవత్సరాలకు గాను పలువురు కళాకారులకు అవార్డులు ప్రదానం చేశారు.కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. 2015లో... ♦ ఉత్తమ నటుడు: వెంకటేశ్ (గోపాల గోపాల) ♦ కథానాయకుడు: అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ నటి: శ్రియ (గోపాల గోపాల) ♦ కథానాయిక: రకుల్‌ప్రీత్ సింగ్ (బ్రూస్ లీ, పండగ చేస్కో) ♦ తొలి చిత్రకథానాయకుడు: ఆకాశ్ పూరి (ఆంధ్రాపోరి) ♦ తొలి చిత్రకథానాయిక: ప్రగ్యా జైస్వాల్ (కంచె) ♦ దర్శకుడు: గుణశేఖర్ (రుద్రమదేవి) ♦ చిత్రం: కంచె ♦ ప్రతినాయకుడు: ముఖేశ్ రుషి (శ్రీమంతుడు) ♦ సహాయ నటి : నదియ (బ్రూస్ లీ) ♦ హాస్యనటుడు: అలీ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయకుడు: దేవిశ్రీ ప్రసాద్ (సూపర్ మచ్చి... సన్నాఫ్ సత్యమూర్తి) ♦ గాయని: యామిని (మమతల తల్లి... బాహుబలి) 2016లో... ∙ఉత్తమ నటుడు: నాగార్జున (సోగ్గాడే చిన్ని నాయనా) ∙కథానాయకుడు: బాలకృష్ణ (డిక్టేటర్) ∙స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ : రామ్‌చరణ్ (ధృవ) ∙స్పెషల్ జ్యూరీ పాపులర్ ఛాయిస్: నాని (జెంటిల్మన్) ∙నటి: రకుల్‌ప్రీత్ సింగ్ (ధృవ, నాన్నకు ప్రేమతో) ∙కథానాయిక: కేథరిన్ త్రేసా (సరైనోడు) ∙తొలి చిత్రకథానాయిక: నివేదా థామస్ (జెంటిల్మన్) ∙దర్శకుడు: సురేందర్‌రెడ్డి (ధృవ) ∙చిత్రం: ఊపిరి ∙హాస్యనటుడు: బ్రహ్మానందం (బాబు బంగారం) ∙సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. తమన్ (సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు) ∙గాయకుడు : శ్రీకృష్ణ (జెంటిల్మన్) ∙గాయని: ప్రణవి (జెంటిల్మన్) ‘స్పెషల్ జ్యూరీ అవార్డు’ విజేతలు ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరో శత్రుఘ్న సిన్హా ∙మిలీనియమ్ స్టార్ అవార్డ్ – హీరోయిన్ హేమమాలిని ∙సెన్సేషనల్ స్టార్ అవార్డ్ – జాకీ ష్రాఫ్ ∙5 దశాబ్దాల స్టార్ అవార్డ్ – కృష్ణంరాజు ∙4 దశాబ్దాల స్టార్ అవార్డ్ – మోహన్‌బాబు ∙జీవిత సాఫల్య పురస్కారం – సంగీతదర్శకుడు బప్పీ లహరి ∙స్పెషల్ జ్యూరీ అవార్డ్ – రేవంత్ (ఇండియన్ ఐడల్ విన్నర్) 2015, 16 సంవత్సరాలకు గాను స్పెషల్ జూరీ అవార్డులు ∙నేషనల్ స్టార్: ప్రభాస్ (బాహుబలి) ∙బెస్ట్ ఫర్ఫార్మెన్స్: రానా (బాహుబలి) ∙మాస్ ఎంటర్టైనర్: కల్యాణ్‌రామ్ (పటాస్) ∙బెస్ట్ యాక్ట్రెస్: మంచు లక్ష్మి (దొంగాట) ∙బెస్ట్ హీరోయిన్: హెబ్బా పటేల్ (కుమారి 21ఎఫ్) ∙బెస్ట్ డైరెక్టర్: క్రిష్ (కంచె) ∙బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: మణిశర్మ (లయన్) ∙సింగర్ (మేల్): సింహ (దిమ్మ తిరిగే.. శ్రీమంతుడు) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నాగచైతన్య (ప్రేమమ్) ∙బెస్ట్ డైరెక్టర్: ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్మన్) ∙బెస్ట్ ఆల్‌రౌండర్ యాక్టర్: రాజేంద్ర ప్రసాద్ (నాన్నకు ప్రేమతో) ∙స్పెషల్ అప్రిషియేషన్ యాక్టర్: శర్వానంద్ (ఎక్స్‌ప్రెస్ రాజా) ∙స్పెషల్ అప్రిషియేషన్ హీరో: నారా రోహిత్ (జ్యో అచ్యుతానంద) ∙బెస్ట్ ప్రామిసింగ్ హీరో: విజయ్ దేవరకొండ (పెళ్ళి చూపులు) ∙బెస్ట్ ప్రోగ్రెస్సివ్ ఫిల్మ్: పెళ్ళి చూపులు ∙బెస్ట్ అప్‌కమింగ్ యాక్టర్: దీపక్ సరోజ్ (మిణుగురులు) ∙బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్: మాస్టర్ ఎన్టీఆర్ (ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ కుమారుడు – దాన వీర శూర కర్ణ) ∙బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్: దాన వీర శూర కర్ణ ∙స్పెషల్ అప్రిషియేషన్ డైరెక్టర్: బాబ్జి (రఘుపతి వెంకయ్య) ∙సింగర్ (ఫీమేల్): సమీర (తెలుసా తెలుసా... సరైనోడు) ∙బెస్ట్ యాక్టర్ (తమిళ్): మాధవన్ ∙బెస్ట్ యాక్ట్రెస్ (తమిళ్): హన్సిక ∙బెస్ట్ యాక్ట్రెస్ (కన్నడ): ప్రియమణి ∙బెస్ట్ డెబ్యూ యాక్టర్ (కన్నడ): నిఖిల్ గౌడ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): సోనాల్ చౌహన్ ∙బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ): ఊర్వశీ రౌతెల -
ప్రేక్షకుల ఆనందమే నాకు కొండంత బలం
‘‘కళలను ఎంతో అభిమానిస్తాను. కళాకారులను ప్రోత్సహించి అభినందించడం గొప్ప అదృష్టం. అందుకే ‘టీయస్సార్’ అవార్డులను స్టార్ట్ చేశాం. అవార్డు గ్రహీతల ఎంపిక విషయంలో సొంత నిర్ణయాలకు తావు లేకుండా ప్రజాభిప్రాయాన్నే అంతిమ తీర్పుగా జ్యూరీ సభ్యులు పాటించారు’’ అని ప్రముఖ పారిశ్రామికవేత్త, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. ‘టీయస్సార్’ జాతీయ అవార్డుల వేడుక ఈ నెల 8న విశాఖపట్నంలో జరగనుంది. విజేతల పేర్లు ప్రకటించేందుకు గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ –‘‘టీయస్సార్ అవార్డులు జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలవాలనేది నా కల. తెలుగువారికి జాతీయ స్థాయిలో గౌరవం లభించాలి. తెలుగువారు ఇంత పెద్ద ఫంక్షన్ చేసారే అని హిందీవాళ్లు ఆశ్చర్యపోవాలి. ఈ అవార్డుల్లో రెండు రకాలు ఉన్నాయి. ప్రేక్షకులు కొన్ని ఎంపిక చేయగా, మరికొన్ని అవార్డులను జ్యూరీ మెంబర్స్ ఎంపిక చేశారు. మంచి సినిమాల సంఖ్య పెరగడంతో ఈసారి అవార్డుల సంఖ్య పెరిగింది. ఈ ప్రోగ్రామ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఇబ్బందిపడకుండా నిమిషాల వ్యవధిలో అన్ని ఛానెల్స్‌లో ప్రసారం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సుబ్బిరామిరెడ్డికి డబ్బు ఎలా వస్తుందని కొందరు అనుకుంటారు. రాత్రికి రాత్రే నేను ధనవంతుణ్ని కాలేదు. 50 ఏళ్లకు పైగా అన్ని రంగాల్లో వ్యాపారవేత్తగా కష్టపడుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందు మనసు రావాలి, ఏకాగ్రత కుదరాలి, కృషి ఉండాలి. అప్పుడే చేయగలం. ప్రేక్షకులు ఈ ప్రోగ్రామ్ చూసి, ఎంజాయ్ చేస్తారు. వారి ఆనందమే నాకు కొండంత శక్తిని ఇస్తుంది’’ అని అన్నారు. జ్యూరీ సభ్యులు రఘురామ కృష్ణమ్రాజు, బి.గోపాల్, ఆర్.వి ప్రసాద్, పింకీరెడ్డి, విక్రమ్ పాల్గొన్నారు. -
ఈసారి విశాఖలో టీఎస్సార్–టీవీ9 అవార్డ్స్
‘‘కళాకారులను గౌరవించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలువురు అవార్డులు ఇస్తున్నారు. కానీ, ప్రజాభిప్రాయాన్ని సేకరించి, అవార్డులు ఇవ్వడం మా ‘టీఎస్సార్–టీవీ9’ అవార్డుల ప్రత్యేకత. గత ఆరేళ్లుగా పాటిస్తున్న ‘ఎస్ఎమ్ఎస్’ పోల్ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నాం’’ అన్నారు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. టీవీ9 ఛానల్‌తో కలిసి ప్రతి ఏడాది ‘టీఎస్సార్– టీవీ9’ జాతీయ అవార్డులను ఆయన అందజేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 2015, 2016 సంవత్సరాలకు గాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, పంజాబీ, హిందీ రంగాల్లో నామినేషన్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ‘‘కళాకారులంటే నాకెంతో అభిమానం. వాళ్లను సత్కరించడం ద్వారా నాకెంతో ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఈసారి విశాఖలో 50 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో అవార్డుల వేడుకను నిర్వహించాలనుకుంటున్నాం. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకున్నాం. మార్చి 8 నుంచి నెల రోజుల పాటు టీవీ9లో ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్, టెక్నీషియన్ లను అవార్డుకు ఎంపిక చేసుకునే ఎస్ఎమ్ఎస్ పోల్ జరగనుంది. ఏప్రిల్ 8న విశాఖ క్రికెట్ స్టేడియమ్లో ఈ వేడుక జరుపుతాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అవార్డ్స్ కమిటీ జ్యూరీ సభ్యులు బి. గోపాల్, పీవీపీ, రఘురామ కృష్ణంరాజు, జయసుధ, జీవిత, మీనా, పింకీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో టిఎస్ఆర్ మహా కుంభాభిషేకం
-
కాల్యాణ వైభోగమే
ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టి. సుబ్బరామిరెడ్డి మనవడు కేశవ్ (పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి తనయుడు జీవీ సంజయ్‌రెడ్డి, టీయస్సార్ తనయ పింకీరెడ్డిల కుమారుడు), తేరా చిన్నపరెడ్డి, కల్పన దంపతుల కుమార్తె వీణల వివాహం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి ప్రముఖ హీరోలు అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, మోహన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, పవన్‌కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్‌బాబు భార్య నమ్రత తదితరులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. -
వైభవంగా నలభై నట వసంతాల వేడుక
‘‘శివాజీ గణేశన్, ఆశాభోంస్లే, రాధిక, బాలమురళీకృష్ణ, జానకి , పి.సుశీల వంటి వారెందర్నో నా ఆధ్వర్యంలో సత్కరించడం ఒక ఎత్తై.. మోహన్‌బాబును సత్కరిస్తుండ డం మరో ఎత్తు. ఆయన గ్రేట్ ఆర్టిస్ట్. నాకు మంచి ఆత్మీయుడు. నటుడిగా, నిర్మాతగా కళారంగానికి సేవ చేస్తున్నాడు. విద్యాసంస్థలు స్థాపించి పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నాడు’’ అని కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. మోహన్‌బాబు నటుడిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం వైజాగ్‌లో సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ‘నలభై నట వసంతాల వేడుక’ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా టీయస్సార్ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకకు దక్షిణ, ఉత్తరాది నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. దాసరి నారాయణరావు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, శ్రీదేవి, జయప్రద, జయసుధ, అనుష్క, కాజల్ తదితరులు పాల్గొంటారు’’ అని చెప్పారు. హీరోలు విష్ణు, మనోజ్ మాట్లాడుతూ- ‘‘సుబ్బరామిరెడ్డి అంకుల్ పుట్టినరోజున నాన్నగారి వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలతో పాటు నాన్నగారితో, మాతో పాటు కలిసి నటించిన యాక్టర్స్ హాజరవుతారు’’ అని చెప్పారు. -
నేను చేస్తున్న పూజల కారణంగానే...
విశాఖపట్నం: తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికించిన హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం జరగకపోవడానికి తాను చేస్తున్న ఈశ్వర పూజలే కారణమని వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈశ్వరుడిని ఆయన నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు. -
అభిమాన తరంగం
ఘనంగా టీఎస్సార్ జన్మదిన వేడుకలు సిరిపురం: కళాకారులు, సినీరంగ ప్రముఖులు, పండితులు, విద్వాంసులు, రాజకీయ నాయకులు, అభిమానుల నడుమ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. టీఎస్సార్ లలితా కళాపరిషత్ పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకల్లో హేమాహేమీలంతా పాల్గొని టీఎస్సార్‌ను గజమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. సర్వధర్మ సమ్మేళానికి నిదర్శనంగా క్రీస్తు, సిక్కు, ముస్లిం, హిందూ మత గురువులతో కలిసి టీఎస్సార్ దండాలను ధరించి అందరూ సమానమే అంటూ తెలియచెప్పారు. వారందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా టీఎస్సార్ తల్లిదండ్రులు బాబురెడ్డి, రుక్మిణమ్మల తైలవర్ణ చిత్ర పటంతోపాటు దివంగత సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా విశాఖ ప్రజల మధ్యే పుట్టిన రోజును జరుపుకుంటున్నానని, ఈ సందర్భంగా కళాకారులను సత్కరించడం ఆనందంగా భావిస్తానన్నారు. అంతేకాదు పేదలకు సాయం చేయడంతోపాటు విశాఖ ప్రజలకు దైవాశీస్సులు కలగాలని కోరుతూ దైవారాధకుల్ని తీసుకు వస్తున్నట్లు చెప్పారు.తాను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడినైనప్పటికీ రాజకీయాలకతీతంగా సేవ చేయాలన్నదే తన సిద్ధాంతమన్నారు. రెండేళ్లలో బాలసుబ్రమణ్యం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను మనమే జరుపుకుంటామని టీఎస్సార్ తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంటారని, ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. తన సంపాదించిన దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం ఒక్క టీఎస్సార్కే దక్కుతుందన్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ పి.జె.కురియన్ మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంతో గౌరవంగా, హుందాగా టీఎస్సార్ మెలుగుతారన్నారు. 18 ఏళ్లుగా ఇద్దరం పార్లమెంట్లో మంచి మిత్రులమని, టీఎస్సార్ నాలుగోసారి కూడా రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడుతూ పుట్టిన రోజునాడు కళాకారులను సత్కరించి నిజమైన కళాబంధుగా నిలిచారన్నారు. జన్మదినంనాడు ప్రముఖ సంగీత గాయకుడు కె.జె.ఏసుదాసును విశాఖవాసుల మధ్య సన్మానించడం ఈ ప్రాంతవాసులు చేసుకున్న పుణ్యమన్నారు. శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ప్రజల మధ్య ఘనంగా పుట్టిన రోజు గడుపుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది టీఎస్సార్ తప్ప మరెవ్వరూ కాదన్నారు. హరిహరాసనం అనే పాటను వింటే చాలు టక్కున గుర్తుచ్చేది కె.జె.ఏసుదాసేనని తెలిపారు. ఎంపీ కె.వి.పి.రామచందర్‌రావు, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, మాజీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, డి.శ్రీనివాస్, మాజీ ఎంపిలు ఎంవీవీఎస్ మూర్తి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జమునారాణి, ఎల్ ఆర్ ఈశ్వరి, సినీ నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రముఖ నటి పూర్ణిమ, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి శుభాకాంక్షలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సుబ్బరామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ పంపారు. పుట్టిన రోజు సందర్భంగా ఆ లేఖలోని సారాంశాన్ని అభిమానలుందరికీ చదివి వినిపించారు. ఏసుదాస్‌కు విశ్వవిఖ్యాత సంగీతకళానిధి బిరుదు భారతదేశం గర్వించదగ్గ గాయకుడు కె.జె.ఏసుదాస్‌కు ‘విశ్వవిఖ్యాత సంగీత కళానిధి’ బిరుదును గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. స్వర్ణ బంగారు కంకణాన్ని రాజ్యసభ వైస్ చైర్మన్ కురియన్ తొడిగారు. మోన్బాబు గదను బహూకరించగా, చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం కె.జె.ఏసుదాస్ , ఎస్.పి బాలసుబ్రమణ్యం పాటలు ప్రేక్షకులను మైమరపించాయి. అంతకుముందు సాలూరి వాసూరావు బృందం పాడిన భక్తిగీతాలు ప్రేక్షకులను అలరించాయి. -
కా.పా. వ్యవహారాల కమిటీ సభ్యునిగా టీఎస్సార్
న్యూఢిల్లీ: ఉభయసభల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి నియమితులయ్యారు. కమిటీ చైర్మన్లుగా సోనియా, రాహుల్ ఉన్నారు. అదేవిధంగా మల్లికార్జున్‌ఖర్గే, కమల్‌నాథ్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, ఆనంద్‌శర్మ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, అంబికా సోని, జైరాం రమేష్ కూడా కమిటీ సభ్యులుగా నియమితులైనట్టు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. -
‘అనుబంధం’లోనైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ: రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా, అసంతృప్తిగా ఉందన్నారు. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణలోని 29 పెండింగు ప్రాజెక్టుల విషయంలో కమిటీ నిర్ణయం తర్వాత అనుబంధ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖను కోరారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. -
'రాజధానికి రూ.5 వేల కోట్లు అడుగుదాం'
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో చర్చించారు. 34 అంశాలతో కూడిన జాబితాను కేంద్రానికి పంపాలని నిర్ణయించామని సమావేశానంతరం సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ. 5 వేల కోట్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడితేవాలని సూచించినట్టు చెప్పారు. -
పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్
మల్కాపురం: కాంగ్రెస్ పార్టీ దయతో ఎనిమిది సంవత్సరాలు కేంద్రమంత్రిగా పనిచేసి, ఇప్పుడు పార్టీని వీడిన దగ్గుబాటి పురందేశ్వరి విశ్వాసం లేనిమనిషి అని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీలో చేరి పురందేశ్వరి విశాఖ ప్రజలను అవమానించారన్నారు. ఇక్కడి ప్రజలకు ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో పురందేశ్వరి బీజేపీ ఆ పార్టీలో చేరారు. తాను బేషరతుగా బీజేపీలో చేరానని, పార్టీ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని అన్నారు. -
రాజధానికి నిధులపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారు? ఎన్ని నిధులిస్తారన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాను కోరినట్లు రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినట్లుగా.. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తితోపాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఆల్ ఇండియా మెడి కల్ ఇనిస్టిట్యూట్, ఐఐటీలు, నూతన విశ్వవిద్యాలయాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు నిధులతో పాటు పార్టీపరమైన అంశాలపై దిగ్విజయ్‌తో చర్చించానన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశంపై మరో రెండు రోజుల్లో దిగ్విజయ్‌తో కలిసి ప్రధానితో చర్చించేందుకు వెళ్లనున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు పీసీసీలు ఏర్పాటు చేయాలా? ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స కోఆర్డినేటర్‌గా.. రెండు ప్రాంతాల్లో రీజనల్ కమిటీలు వేయాలా? అన్నదానిపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీకి దిగడం లేదన్నారు. అయితే, ఇప్పటికీ విశాఖ నుంచి పోటీచేస్తే తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
విశాఖ నుంచి పోటీ చేద్దామనుకున్నా: టీఎస్ఆర్
హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్టణం నుంచి పోటీ చేయాలనుకున్నానని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కాంగ్రెస్ నాయకుడు టి. సుబ్బిరామి రెడ్డి తెలిపారు. అధిష్టానం ఆదేశానుసారం రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. హైకమాండ్ తనను రాజ్యసభకు వెళ్లమందని తెలిపారు. దీంతో చివరి నిమిషంలో రాజ్యసభకు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. తెలంగాణ బిల్లుపై ఇప్పుడే ఏమీ మాట్లాడబోనని చెప్పారు. తెలంగాణ కోసం అంకితభావంతో పనిచేస్తానని టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కె. కేశవరావు హామీయిచ్చారు. రాజ్యసభ్యుడిగా ఎన్నికైన తర్వాత గన్‌పార్క్ వద్ద అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. -
పదవి ఉంటుందో, లేదో చెప్పలేను:సుబ్బిరామిరెడ్డి
విశాఖ: భవిష్యత్తును ఊహించి చెప్పడం కష్టమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. త్వరలో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలోని కేజిహెచ్ లో ధర్మసత్రాన్ని ప్రారంభించిన ఆయన తన పదవికి సంబంధించి పెదవి విప్పారు. పదవి ఉంటుందో, లేదో చెప్పలేనని తెలిపారు. రేపటి రోజులు ఎలా ఉంటాయో ఊహించలేమన్నారు. కాగా, టి.సుబ్బిరామిరెడ్డి ఒక గొప్ప మానవతావాది అని సినీ హాస్య నటుడు బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు. -
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి నెట్వర్క్: సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పార్టీ కార్యకర్తలు అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్తంగా మారింది. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో కేంద్రమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పసుపులేటి బాలరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ఇళ్లను ముట్టడిం చారు. జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వినూత్నరీతిలో నిరసనలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జోరువానలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించారు. మంత్రి నివాసం వద్ద గాజులు, పూలతో నిరసన తెలిపారు. అమలాపురం విద్యుత్‌నగర్‌లో ఎంపీ జీవీ హర్షకుమార్ క్యాంప్ కార్యాలయాన్ని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, రాష్ర్ట మహిళా విభాగం కన్వీనర్ కొల్లి నిర్మలకుమారి, సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు తదితరుల నేతృత్వంలో ముట్టడించారు. రంపచోడవరంలో రాజ్యసభ సభ్యురాలు టి.రత్నాబాయి ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ నాయకత్వంలో రాజమండ్రిలోని వై జంక్షన్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చెవిలో పువ్వులు పెట్టుకుని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఇంటిని ముట్టడించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. చిత్తూరు లో ఉన్న పూతలపట్టు ఎమ్మెల్యే రవి ఇంటిని, సురుటపల్లిలోని సత్యవేడు ఎమ్మెల్యే హేవులత, గుంటూరులో నగర కన్వీనర్ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ఇళ్లను ముట్టడించారు. బాపట్లలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి నివాసాన్ని పార్టీ పట్టణ కన్వీనర్ ధర్మారావు ఆధ్వర్యంలో ముట్టడించారు. అనంతపురంలో వైఎస్సార్సీపీ నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి ఆందోళన చేశారు. సాయుధ బలగాల రక్షణలో లగడపాటి ఇల్లు విజయవాడలో ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంటి పరిసర ప్రాంతాల్లో వందలాదిగా సాయుధ బలగాలను మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో ఇనుప కంచె వేశారు. బీఎస్ఎఫ్ రిజర్వు దళాలతో ఏసీపీ, నలుగురు సీఐలు, ఐదారుగురు ఎస్సైలు, 50 మంది వరకు కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని ముట్టడిం చేందుకు యత్నించిన నేతలను పోలీసు బలగాలు అడ్డుకున్నాయి. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎత్తిపడేసి పటమట స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సామినేని ఉదయభాను, విజయవాడ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయ కర్త పి.గౌతమ్‌రెడ్డి తదితరులున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఇంటిముందు పుష్పాలతో శాంతి ర్యాలీ చేశారు. సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర, సీతానగరంలో ఎమ్మెల్యే సవరపు జయమణి ఇళ్లను ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఇల్లు ముట్టడి సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. శ్రీకాకుళంలో మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని ముట్టడించారు. కాశీబుగ్గలో టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి ఇంటి గోడపై రాష్ట్ర ద్రోహులుగా మిగల కండి సమైక్యాంధ్రకు మద్దతు పలకండి అంటూ పోస్టర్లను అతికించారు. సీతంపేటలో పాల కొండ ఎమ్మెల్యే సుగ్రీవులు,, ఆమదాలవలసలో ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, హరిపురంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ఇళ్లను ముట్టడించారు. ఉద్యోగులకు సరుకుల పంపిణీ ఉద్యమం కారణంగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ ఉద్యోగులకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రూ.5లక్షల విలువైన సరుకులు పంపిణీ చేశారు. పుంగనూరులో 165 మంది ఆర్టీసీ కార్మికులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బియ్యం పంపిణీ చేశారు. బొబ్బిలిలో వైఎస్ఆర్సీపీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు లక్షన్నర రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను అందించారు. -
వెళ్లవయ్యా.. వెళ్లూ!
సాక్షి నెట్వర్క్: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. మంగళవారం ఆయా పార్టీల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడకనిపిస్తే అక్కడ సమైక్యవాదులు అడ్డుకున్నారు. నిరసన దీక్షా శిబిరాల వద్దకు వస్తున్న నేతలను గో బ్యాక్ అంటూ తిప్పిపంపారు. విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద నిర్వహించిన మాక్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని న్యాయవాదులు అడ్డుకున్నారు. విశాఖలో జీవీఎంసీ ఎదురుగా రిలేదీక్షలు చేపట్టిన ఉపాధ్యాయులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిని అడ్డుకోగా, ‘నేను రాజీనామా చేసేశా’.. అని చెప్పడంతో శాంతించారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో మంత్రి పితాని సత్యనారాయణను విద్యార్థి సంఘాల నేతలు ఘెురావ్ చేశారు. కొవ్వూరులో ఎమ్మెల్యే టీవీ రామారావు ఇంటిని ముట్టడించారు. మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, సంతకవిటి మండల కేంద్రంలో ప్రతిఘటన ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొలకొండ ఏలాం కూడలిలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కాన్వాయ్‌ని సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు అడ్డుకున్నారు. మంత్రి వాహనం దిగి రాగా, సీమాంధ్ర ద్రోహి అని తిట్ల వర్షం కురిపించారు. శ్రీకాకుళం ఆర్అండ్బీ బంగ్లా వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి వ్యతిరేకంగా ఉద్యమకారులు నినాదాలు చేశారు. -
విశాఖలో సుబ్బరామిరెడ్డికి చేదు అనుభవం
విశాఖ : రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డికి సోమవారం విశాఖలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సమైక్యవాదులు అడ్డుకున్నారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ సమైక్యవాదులు... సుబ్బరామిరెడ్డిని ఘొరావ్ చేశారు. మరోవైపు చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌కు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్ర కోసం మదనపల్లెలో ఏర్పాటు చేసిన లక్షగళ సమరభేరి కార్యక్రమంలో పాల్గొనేందకు వచ్చిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో నిర్వాహకులు షాజహాన్‌ను అక్కడి నుంచి పంపేసారు.