
'రాజధానికి రూ.5 వేల కోట్లు అడుగుదాం'
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రతిపత్తి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ప్రాజెక్టుల గురించి ఈ భేటీలో చర్చించారు.
34 అంశాలతో కూడిన జాబితాను కేంద్రానికి పంపాలని నిర్ణయించామని సమావేశానంతరం సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఈ బడ్జెట్‌లో రూ. 5 వేల కోట్లు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడితేవాలని సూచించినట్టు చెప్పారు.