‘...అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం’ | Chandrababu Touch Modi Feet, Says Narayana Swamy | Sakshi
Sakshi News home page

‘...అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజం’

Published Wed, Mar 28 2018 9:01 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

Chandrababu Touch Modi Feet, Says Narayana Swamy - Sakshi

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న చంద్రబాబు-మోదీ ఫొటోలు

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి విమర్శించారు.  హైదరాబాద్‌ వస్తే నరేంద్ర మోదీని అరెస్టు చేయిస్తామని గతంలో హెచ్చరించిన చంద్రబాబే మోదీ కాళ్లకు మొక్కారని, ఆయన దేనికైనా సమర్థుడని నారాయణస్వామి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లకు మొక్కుతున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు. సోషల్‌మీడియాలో కనిపిస్తున్న ఫొటోలను నారాయణస్వామి మీడియాకు విడుదల చేశారు.

తప్పుడు ప్రచారం చేయొద్దు
సభలో ప్రధానమంత్రికి విజయసాయిరెడ్డి పాదాభివందనం చేయకపోయినా చేసినట్లు తప్పుడు ప్రచారం సాగించడం సరైంది కాదు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఉన్నప్పుడు నమస్కారం పెట్టడం మామూలే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేను కూడా మంగళవారం రాజ్యసభలో ప్రధాని మోదీకి నమస్కరించా. పెద్దలకు నమస్కారం చేయడం మన భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో భాగం.
– టి.సుబ్బిరామిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ

సభలో విజయసాయిరెడ్డి కనిపించలేదు
సభలో ఫేర్‌వెల్‌ స్పీచ్‌ ఇచ్చే వరకూ మేమంతా కామ్‌గా ఉంటామని, ఆ తర్వాత నిరసన కొనసాగిస్తామని తెలియజేశాం. ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎక్కడ ఉన్నారో కూడా కనిపించలేదు. నేను ప్రధానమంత్రికి నమస్కారం పెట్టానో లేదో నాకైతే గుర్తులేదు. పెద్దవాళ్లు వస్తూ పోతూ ఉన్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం. అది భారతదేశ సంస్కృతి. పెద్దవాళ్లు కనిపిస్తే దగ్గరికెళ్లి నమస్కారం పెడతాం. అది సహజం, అందులో తప్పులేదు.
– సుజనా చౌదరి, టీడీపీ ఎంపీ    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement