పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్ | T. Subbarami Reddy Slams Daggubati Purandeswari | Sakshi
Sakshi News home page

పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్

Published Sun, Mar 9 2014 8:47 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్ - Sakshi

పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్

మల్కాపురం: కాంగ్రెస్ పార్టీ దయతో ఎనిమిది సంవత్సరాలు కేంద్రమంత్రిగా పనిచేసి, ఇప్పుడు పార్టీని వీడిన దగ్గుబాటి పురందేశ్వరి విశ్వాసం లేనిమనిషి అని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీలో చేరి పురందేశ్వరి విశాఖ ప్రజలను అవమానించారన్నారు. ఇక్కడి ప్రజలకు ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో పురందేశ్వరి బీజేపీ ఆ పార్టీలో చేరారు. తాను బేషరతుగా బీజేపీలో చేరానని, పార్టీ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement