
నేను చేస్తున్న పూజల కారణంగానే...
విశాఖపట్నం: తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికించిన హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం జరగకపోవడానికి తాను చేస్తున్న ఈశ్వర పూజలే కారణమని వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈశ్వరుడిని ఆయన నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు.