Hud hud Cyclone
-
ఉప్పెనలా ముప్పు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని 35 కోట్ల మంది రానున్న 30 ఏళ్లలో ముంపు ముప్పు ఎదుర్కోనున్నారని అమెరికా వాతావరణ సంస్థ క్లైమెట్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన.. 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన మన రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పెను తుపాన్లు మహా విధ్వంసం సృష్టించడానికి కారణం భూతాపం పెరగటమేనని నేషనల్ క్లైమెట్ సెంటర్ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాతావరణం వేడెక్కి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, ఫలితంగా తీరం భారీగా కోతకు గురవుతోందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సంభవించే తుపాన్లలో గాలి వేగం పెరుగుతుందని, వరద ఉధృతి తీవ్రత అధికమవుతుందని ఈపీసీసీ (ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్) నివేదికలో వెల్లడించింది. రక్షణ చర్యలు లేకపోవడం వల్లే.. 1876 అక్టోబర్ 8న సంభవించిన తుపాను 150 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖపట్నంపై విరుచుకుపడినట్లు 1907 విశాఖ జిల్లా గెజిట్ స్పష్టం చేస్తోంది. అప్పట్లో తీర ప్రాంతంలో మడ అడవులు, తాటి తోపులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు. 2014లో విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుపాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సహజ రక్షణ కవచాలైన మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తేలింది. ఒక్క విశాఖ తీరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీరమంతటా రక్షణ చర్యలు కొరవడ్డాయి. పదేళ్ల కాలంలో పరిస్థితి మరీ దిగజారింది. సముద్ర అలల తాకిడి పెరిగినప్పుడు వచ్చే నీరు నిల్వ ఉండే ప్రాంతాలు (బ్యాక్ వాటర్ ల్యాండ్స్) పూర్తిగా కనుమరుగయ్యాయి. పదేళ్లుగా అభివృద్ధి, పరిశ్రమల పేరిట వాటిని ధ్వంసం చేశారు. అడ్డగోలుగా ఆక్రమించారు. 70 శాతం జనాభా తీర ప్రాంతాల్లోనే.. సముద్ర తీరం నుంచి 20 కి.మీ. భూభాగం పరిధిలో 70 శాతం జనాభా నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం అంచున ఉన్నారు. తుపానుల సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం బెంగాల్, బంగ్లాదేశ్ (10–13 మీటర్లు) తరువాత మన రాష్ట్రంలోనే (5–7 మీటర్లు) ఎక్కువ. ప్రమాదపు అంచున.. తీరానికి 300 మీటర్ల కంటే తక్కువ దూరంలో.. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలివీ. శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు, బారువ, పితాలి, మీలా గంగువాడ, పల్లిసారధి నువ్వలరేవు, దేవునల్తాడ, నందిగం, కళింగపట్నం, ఇప్పిలి, కొవ్వాడ, చింతపల్లి బందరువానిపేట. విజయనగరం జిల్లాలో కోనాడ, భోగాపురం సమీప ప్రాంతాలు. విశాఖ జిల్లాలో చిననాగమయ్యపాలెం, పెద్ద నాగమయ్యపాలెం, భీమిలి, విశాఖ నగరం ఏరాడ, అప్పికొండ, గంగవరం, పూడిమడక, రేవు పోలవరం, పెద్దతీనర్ల, పెంటకోట, రాజానగరం, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం. తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడ, గొల్ల ముసలయ్యపేట, కాకినాడ, కోరింగ, తాళ్లరేవు, మట్లపాలెం, పటవల, గోదావరి లంకలు, భైరవపాలెం, గాడిమొగ, పల్లంకుర్రు, సూరసేన యానాం, ఓడలరేవు, అంతర్వేదిపాలెం. పశ్చిమగోదావరి జిల్లాలో పేరుపాలెం, పోదు, ఇంటేరు, లంక గ్రామాలు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మంగినపూడి, హంసలదీవి, కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతాలు. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లాలో చీరాల, పెద్దగంజాం, కనుపర్తి, పాదర్తి, నెల్లూరు జిల్లాలో కొత్తపట్నం, ఈతముక్కల, రామయ్యపట్నం. 2014లో హుద్‌హుద్ తుపాను బీభత్సంతో విశాఖలో దెబ్బతిన్న రహదారి (ఫైల్) విధ్వంసక తుపాన్లు - దేశంలో వందేళ్ల తుపాన్ల చరిత్రను చూస్తే అతి భీకర తుపాన్లు 40 ఏళ్ల నుంచే ఎక్కువయ్యాయి. - 40 ఏళ్లలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు 23 తుపాన్లు విధ్వంసం సృష్టించాయి. - 1977 నవంబర్ 19న 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. - 1984 నవంబర్ 14న శ్రీహరికోట వద్ద 220 కిలోమీటర్ల వేగంతో పెను తుపాను తీరాన్ని దాటింది. - 1990 మే 9న మరో తుపాను 230 కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. - 1996 నవంబర్ 6న సంభవించిన తుపాను 210 కిలోమీటర్ల వాయు వేగంతో కోనసీమపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది. - 2013 అక్టోబర్ 12న పైలీన్ పెను తుపాను 220 కిలోమీటర్ల గాలి వేగంతో దక్షిణ, ఒడిశా, ఉత్తర కోస్తాను తాకింది. - 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను 260 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖ మహా నగరం, ఉత్తర కోస్తాలో విధ్వంసం సృష్టించింది. మడ అడవుల్ని పునరుద్ధరించాలి ప్రపంచ వ్యాప్తంగా యూకే, ఫ్రాన్స్, కెనడా, ఐర్లాండ్ దేశాలతో పాటు 1,175 నగరాలు వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమెట్ ఎమర్జెన్సీ) ప్రకటించాయి. రానున్న విపత్తులను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన మడ అడవులను పునరుద్ధరించుకోవాలి. – జేవీ రత్నం, పర్యావరణవేత్త కాలుష్యం, భూతాపం తగ్గించాలి చమురు, గ్యాస్ వెలికితీత వల్ల భూమి లోనికి దిగబడి సముద్ర మట్టం పెరుగుతోంది. అంతులేని కాలుష్యం వల్ల వేడి పెరుగుతోంది. ఈ పరిస్థితి అనర్థదాయకం. కాలుష్యం, భూతాపం తగ్గించడమే శరణ్యం. – ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, పర్యావరణ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ.78 కోట్లతో షెల్టర్ బెల్ట్‌లు సముద్ర తీర ప్రాంత రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ఐసీజెడ్‌ఎం) కింద రూ.78 కోట్లతో మడ అడవుల పెంపకం, షెల్టర్ జోన్ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టాం. – ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
హుద్‌హుద్ ఇళ్ల రహస్యం
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, పీఎంఎవై–హెచ్ఎఫ్ఎ– ఏహెచ్‌పీ ఆధ్వర్యంలో హుదూద్ ఇళ్ల గృహ సముదాయ నిర్మాణం చేపట్టారు. పలాస నియోజకవర్గ పరిధిలో రెండు చోట్ల నిర్మాణం తలపెట్టారు. వజ్రపుకొత్తూరు మండలం బెండికొండపై 198 ఇళ్లు నిర్మాణం చేపట్టగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సూదికొండ– పారిశ్రామికవాడల మద్యలో నిర్మాణాన్ని తలపెట్టారు. వాస్తవానికి హుద్‌హుద్ తుఫాన్లో చిక్కుకున్న మత్స్యకార కుటుంబాలకు చెందిన బాధితులకు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. సముద్రతీర ప్రాంతంలో నివసిస్తున్న వారికి నిర్మించాల్సి ఉండగా అప్పటి పలాస ఎమ్మె ల్యే గౌతుశ్యామసుందర శివాజీ తన సొంత ఆలోచనలతో గ్రామీణ ప్రజలకు ఎకనామం పెట్టి పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి లోని సూదికొండ పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ డీపట్టా భూములను గుర్తించి ఆదరాబాదరాగా నిర్మాణాలు చేపట్టారు. స్థానికంగా సమస్యలపై అవగాహన లేమితో ఇంజనీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆమోదంతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మించిన వాటికి హుద్‌హుద్ పేరిట కాకుండా ఎన్టీఆర్ ప్రత్యేక పట్టణ గహ నిర్మాణ పథకం పేరుతో 192 ఇళ్లు జీప్లస్1 పద్ధతిలో చేపట్టారు. మొత్తం గృహ నిర్మాణాల విలువ రూ.9.216 కోట్లు పైగా ప్రభుత్వ నిధులను వినియోగించినట్లు ప్రకటనలు జారీచేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోను ఇంతే నిధులు వెచ్చించారు. వీటిని కాకినాడకు చెందిన డీ.జీ.బి కనస్ట్రక్షన్ ప్రై వేటు లిమిటెడ్ పేరుతో కంట్రాక్టర్‌కు అప్పగించారు. పూర్తిగా ప్రజల డబ్బుతో కట్టిన ఈ నిర్మాణాలు తుఫాన్ బాధితులకు తప్ప అందరికీ అందాయంటే అతిశయోక్తి కాదు. కేటాయింపులో గందరగోళం అయితే ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయి. కౌన్సిలర్‌కు ఐదు ఇళ్లు చొప్పున మొత్తం 25వార్డులకు చెంది న ఇళ్లు అమ్ముకున్నారనే ప్రచారం జోరుగా సాగింది. మొత్తం 192 ఇళ్లకు అప్పటి ఎమ్మెల్యే శివాజీ లిస్టు ప్రకటించగా పూర్తిగా అందులో పెద్దలకే ఇళ్లు ఉన్నాయని పత్రికలు కోడై కూయడంతో లిస్టు వెనక్కు తెప్పించి అనర్హులను తొలగించారు. అయితే సుమారు 70కుపైగా పేర్లను మాత్రమే కేటాయించా రని మిగిలిన వారిని తొలగించారని అప్పట్లో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వారు కూడా పదివేల రూపాయలు డీడీ తీయాల్సి ఉన్నప్పటికీ తీయకుండా వారికి ఎలా కేటాయిం చారన్నది అనుమానంగా ఉంది. స్కెచ్ ఫెయిల్ టెక్కలి: టెక్కలిలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. సుమారు 192 ఇళ్ల నిర్మాణానికి 2016 సంవత్సరంలో అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా కంకరబందలో ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వైపు నిర్మాణాలు జరుగుతుండగా మరో వైపు లబ్ధిదారుల ఎంపిక విషయంలో టీడీపీ కార్యకర్తలు వేసిన పక్కా స్కెచ్ ఫెయిలైంది. ఒక వైపు నిర్మాణాలు పూర్తి కాకపోవడం, మరో వైపు ఎన్నికలు సమీపించి ప్రభుత్వం మారడంతో టీడీపీ కార్యకర్తల ఆశలు అడియాసలుగా మారాయి. ప్రస్తుతానికి జీప్లస్ త్రీ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నాణ్యత లోపం సోంపేట: సోంపేట మండలానికి 2015లో 128 హుద్‌హుద్ ఇళ్లు మంజూరయ్యాయి. అప్పట్లోనే లబ్ధిదారులను గుర్తించారు. కానీ నిర్మాణాలను మాత్రం నాసిరకంగా చేపట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 జూలైలో అప్పటి ఎమ్మె ల్యే బెందాళం అశోక్ హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.128 ఇళ్లకు 80 ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు రాగా మిగతా 48 ఇళ్ల నిర్మాణం ప్రారంభంలోనే ఉంది. అయితే లబ్ధి దారుల ఎంపికలో భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అక్రమాల కేటాయింపులు అక్రమాల కేటాయింపులు సెగెళ్ల చిట్టెమ్మ.. ఈవిడ మూడేళ్ల క్రితం మరణించింది. అయితే ఈమె పేరుమీద ఆమె కుమారుడికి హుద్‌హుద్ కాలనీలో ఇల్లు కేటాయించారు. లబ్బ సూర్యకుమారి మహాలక్ష్మినగర్ కాలనీ టీడీపీ ఇన్చార్జిగా ఉన్న సిరిపురపు భాస్కరరావుకు బంధువు. ఈమెకు కూడా ఇంటిని కేటాయించారు. సీర చిట్టెమ్మకు సొంతిల్లు ఉంది. అయినా హుద్‌హుద్ ఇంటిని కేటాయించారు. భైరి సంతోష్‌కుమార్‌కు కూడా ఇంటిని ఇచ్చారు. భైరి సంతోష్‌కుమార్, నడిమింటి రాధలు ఒకే కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ వారికి రెండు ఇళ్లను కేటాయించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ సోదరునికి కూడా ఓ ఇంటిని మంజూరు చేసేశారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అప్పట్లో శ్రీకాకుళంలో ప్రతి వార్డుకు ఓ ఇంటిని కేటాయిస్తూ టీడీపీ నాయకులు చెప్పినవారికే ఇళ్లను కట్టబెట్టారు. కాశీబుగ్గలో హుద్‌హుద్ ఇళ్లు ఇలా 194 ఇళ్లను టీడీపీ కేడర్‌కు ఎన్నికల ముందు పంచిపెట్టేశారు. కాలనీ నిర్మించి మూడేళ్లు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక జాబితాను గోప్యంగా ఉంచారు. ‘సాక్షి’ ఈ జాబితాను వెలుగులోకి తేవడంతో లబ్ధిదా రుల జాబితాను ఉన్నతాధికారులతో ఆమోదింపజేసేందుకు అప్పటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో ఉన్నతాధికారిని సైతం బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని రప్పించుకొని ఆమోదముద్ర వేయించారు. హుద్‌హుద్ ఇళ్ల కేటాయింపుల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తెలుగుదేశం జిల్లా పార్టీ సమావేశంలో పలువురు పార్టీ నాయకులే బహిరంగంగా ఆరోపించి ఆధారాలను సైతం నాయకులు అందజేశారు. అయినా ఫలితం లేకపోయింది. పనులు కాకుండానే ఫలహారం! వజ్రపుకొత్తూరు: హుద్ హుద్ ఇళ్లు అక్రమాలకు కేరాఫ్‌గా మారాయి. వజ్రపుకొత్తూరు మండలంలో బెండి కొండ వద్ద రూ.8.70 కోట్లతో 192 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. పనులు పూర్తి కాకుండానే అప్పటి ఎమ్మెల్యే శివాజీ ఫిబ్రవరి 9న ప్రారంభించేశారు. లబ్ధిదారుల జాబి తా కలెక్టర్‌కు పంపించగా ఆయన తిరస్కరించా రు కూడా. మంచినీళ్లపేటలో టీడీపీ నేతలకి కేటాయించిన ఐదు ఇళ్లలో ఒక ఇంటిని రూ.1.50లక్షలకు చొప్పున ఏకంగా వేలానికి పెట్టి రూ.7.50 లక్షలు వసూలు చేశారు. ఇక కొత్తపేట పంచాయతీలో మండల టీడీపీ బాధ్యతలు తీసుకున్న వ్యక్తి కుటంబ సభ్యులకు కొన్ని ఇళ్లు, పక్క పంచాయతీలోని మరికొందరికి కొన్ని అమ్ముకోగా, పాతటెక్కలి పంచాయతీలో పక్కా ఇల్లు ఉన్న 10 ఎకరాల ఆసామికి హుద్ హుద్ ఇల్లు కేటాయించారు. ఇలా ఈ 192 నివాసాలను రూ.1.70 కోట్లకు అమ్మేశారు. వారి పాచికను కలెక్టర్ పారనీయకపోవడంతో గమ్మునుండిపోయారు. అయితే ఈ పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. తిత్లీ తుపానులో శిథిలమైన పైప్‌లైన్, ఇతర పనులను నేటికీ పునరుద్ధరించలేదు. కొండకు దిగువన కట్టడంతో వరద ప్రవాహానికి ఇళ్లకు ముప్పు పొంచి ఉంది. తాగునీటి సదుపాయానికి ఓవర్ హెడ్ ట్యాంకు పనులు ఇంకా ప్రారంభించలేదు. విద్యుత్ సదుపాయం కూడా కల్పించలేదు. -
హుద్‌హుద్ సాయం.. అందని వారెందరో?
హుద్‌హుద్ తుపాను వచ్చి నాలుగున్నరేళ్లు పూర్తి కావచ్చినా నేటికి నిలువ నీడలేక పరాయి పంచన కాలం గడుపుతున్న వారెందరో ఉన్నారు. హుద్‌హుద్ ఇళ్ల నిర్మాణాలు నాలుగేళ్లుగా సాగుతూ..నే ఉన్నాయి. మరో వైపు తుపాన్ దెబ్బకు ధ్వంసమైన వంతెనలు, రోడ్లు నేటికి వెక్కిరిస్తూనే ఉన్నాయి. వేల కోట్లల్లో నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చినా అందిన సాయం మాత్రం అంతంత మాత్రమే. ఒక్క విశాఖ జిల్లాలోనే 1,46,799 ఇళ్లు దెబ్బ తిన్నట్టు లెక్క తేల్చిన అధికారులు 1,30,993 మందికి మాత్రమే పరిహారం అందించగలిగారు. పూర్తిగా ఇళ్లు కోల్పోయిన 15,219 మందికి ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించినా చివరకు 4483 ఇళ్లకు మాత్రమే పరిపాలనామోదం ఇచ్చారు. కానీ వాటి నిర్మాణం నేటికి పూర్తి కాని దుస్థితి నెలకొంది. పరిహారం అందని వారు వేలల్లో ఇక పంటల విషయానికి వస్తే 32,167 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతినగా 1,52,806 మందికి రూ.46.46కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాల్సి ఉండగా..1,52,225 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకా 593 మందికి రూ.30 లక్షల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. 61,618 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 1,94,038 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా 1,88,382 మందికి రూ.143.72కోట్ల పరిహారం ఇచ్చారు. ఇంకా రూ.18కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది. 2487 మంది పాడి రైతులకు రూ.19.38కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా 2264 మందికి రూ.18.63 కోట్లే ఇచ్చారు. 223 మందికి రూ.75లక్షల çపరిహారం అందనేలేదు. బోట్లు, తెప్పలు దెబ్బతిన్న మత్స్యకారులకు రూ.49.69 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.6.95కోట్లు మాత్రమే 3850 మందికి ఇవ్వగలిగారు. ఇలా దాదాపు ప్రతిశాఖలోనూ పరిహారం అందని వారు లెక్కకు మించే ఉన్నారు. తిరిగి తిరిగి వేసారి విసిగిపోయారు. నష్టం రూ.వెయ్యి కోట్లు.. ఇచ్చింది రూ.346 కోట్లు రంగాల వారీగా చూస్తే ఏపీఈపీడీసీఎల్‌కు అత్యధికంగా రూ.498.95 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత జీవీఎంసీకి రూ.66.79 కోట్లు, ఇరిగేషన్‌కు రూ.59.81 కోట్లు, విద్యా శాఖకు రూ.29.41 కోట్లు, అటవీ శాఖకు రూ.28.81 కోట్లు, ఏపీఎంఎస్‌ఐడీసీకి రూ.19.50 కోట్లు, జూపార్కుకు రూ.17.37 కోట్లు, సిటీ పోలీస్ కమిషనరేట్‌కు రూ.16.10కోట్లు, వుడాకు రూ.10.26 కోట్లు, ఆర్అండ్ బీకి రూ.9.71 కోట్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.9.18కోట్లు, కశింకోట ఆర్ఈ సీఎస్‌కు రూ.9 కోట్లు, ఏపీఎస్ఆర్టీసీకి రూ.4.54 కోట్లు ఇలా వివిధ శాఖలకు రూ.వెయ్యికోట్లకు పైగా నష్టం వాటిల్లితే ప్రభుత్వం విదిల్చింది మాత్రం రూ.346 కోట్లు మాత్రమే. పరిహారం పక్కదారి తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హుద్‌హుద్ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు. గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తుపాను బాధిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పంట నష్టపరిహారాన్ని అడ్డంగా దోచుకున్నారు. ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హుద్‌హుద్ పరిహారంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుచ్చెయ్యపేట మండలం మల్లాం గ్రామంలో ఏకంగా రూ.10.61 లక్షలు పక్క దారి పట్టినట్టుగా పక్కా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ నే తలు పేర్లు మార్చి ఒకే అకౌంట్ నంబర్లతో పరిహారాన్ని దర్జాగా కాజేశారు. గజం భూమి కూడా లేని వారికి సైతం భర్త, తండ్రి పేర్లు మార్చి పరిహారం స్వాహా చేశారు. 20 ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేరిట కూడా పరిహారం కాజేశారు. ఒక్క మల్లాం గ్రామంలోనే ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవస రం లేదు. మరో పక్క పరిహారం అందక వేలాది మంది కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. తుపాను దెబ్బకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న యంత్రాలకు కాకుండా మరో రూ.200 కోట్లు కనీస నష్టాలు వాటిల్లాయి. ఇక హెచ్‌పీసీఎల్‌కు రూ.108 కోట్ల నష్టం వాటిల్లింది. విశాఖ పోర్టు ట్రస్ట్‌కు సైతం రూ.250 కోట్ల నష్టం వాటిల్లింది. కానీ కేంద్రం నుంచి వీటిలో ఏ ఒక్క పరిశ్రమకు పైసా పరిహారం దక్కలేదు. హిందుస్థాన్ షిప్ యార్డుకు రూ.450కోట్ల నష్టం వాటిల్లగా బీమా ద్వారా వచ్చింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే. -
హుద్‌హుద్ హామీలు..నీటి మీద రాతలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై ప్రకృతి పగ బట్టినట్టుగా నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్ విలయం విశాఖ నగరాన్ని అతలాకుతలం చేయగా, నేడు తిత్లీ తుపాన్ సిక్కోలు జిల్లాను కన్నీటి సంద్రంగా మార్చింది. ఇలాంటి పెనువిపత్తులు, సంక్షోభ సమయాల్లో అభాగ్యులను ఆదుకోవాల్సిన పాలకులు కేవలం ప్రచారం కోసం పాకులాడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా తిత్లీ దెబ్బకు శ్రీకాకుళం విలవిల్లాడుతుంటే ఈ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ప్రచారయావ ఏవగింపు కలిగిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కంటే చంద్రబాబు ఒక్కడే ఉండి అంతా తానే ఉద్ధరిస్తున్నట్టుగా కలరింగ్ ఇస్తుండడం, హడావుడి చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్ బారిన పడ్డ విశాఖపట్నంలో మకాం వేసిన చంద్రబాబు అప్పట్లో ఎన్నో హామీలు గుప్పించారు. కానీ, నేటికీ ఒక్క హామీ కూడా పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు శ్రీకాకుళంలోనూ ముఖ్యమంత్రి అలాంటి హామీలే గుప్పిస్తున్నారు. ప్రచారం కోసం బాబు ప్రయాస 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాన్ సంభవించింది. మరుసటి రోజు విశాఖపట్నం చేరుకున్న సీఎం చంద్రబాబు ఐదు రోజులపాటు ఇక్కడే మకాం వేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో తిరుగుతూ నానా హంగామా చేశారు. మొత్తం కేబినెట్ మంత్రులతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సహా ఉన్నతాధికారులందరినీ విశాఖకు రప్పించి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వార్డుకో మంత్రి... సందుకో ఉన్నతాధికారి... వారు చేసిన పని తక్కువ.. పెత్తనం ఎక్కువ. సీఎం మెప్పు కోసం మంత్రులు, అధికారులు చేసిన విన్యాసాలు బాధితులను తీవ్ర ఇక్కట్ల పాల్జేశాయి. ప్రచారం కోసం రోజూ ఉదయం, సాయంత్రం సమీక్షలు.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల పేరిట సీఎం హంగామా చేయగా.. వారి వెనుక ఫైళ్లు పట్టుకుని అధికారులు పరుగులు పెట్టడంతో క్షేత్రస్థాయిలో పునరావాస చర్యల్లో పాల్గొనే సిబ్బందితోపాటు బాధితులు నరకం చూశారు. నిర్మించిన ఇల్లు అరకొరే.. హుద్‌హుద్ దెబ్బకు ఉత్తరాంధ్రలో మొత్తం 2,00,673 ఇళ్లు దెబ్బతిన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది. గాలుల తీవ్రతకు 49,363 పూరిపాకలు ఎగిరిపోయాయని లెక్కగట్టింది. దాతల సహకారంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి రూ.560 కోట్ల అంచనా వ్యయంతో 10,000 ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించింది. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి 8404 ఇళ్లు మాత్రమే మంజూరు చేసింది. నాలుగేళ్లయినా ఇప్పటి వరకు అర్బన్ ప్రాంతంలో 2,866, గ్రామీణ ప్రాంతాల్లో 978 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేయగలిగారు. ఇవన్నీ సాక్షాత్తూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలే. నేటికీ శిథిలమైన రోడ్లే హుద్‌హుద్ దెబ్బకు ఉత్తరాంధ్రలో 12,330 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి, వీటిలో ఆర్అండ్బీ రోడ్లు 3,880 కి.మీ., పంచాయతీరాజ్ రోడ్లు 2,274 కిలోమీటర్లు, గ్రామ పంచాయతీ రోడ్లు 4,831 కిలోమీటర్లు, మున్సిపల్, కార్పొరేషన్ రోడ్లు 1,345 కిలోమీటర్ల మేర దెబ్బతినగా.. రూ.6,138.56 కోట్ల నష్టం వాటిల్లింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి రూ.150.18 కోట్లతో పంచాయతీరాజ్‌లో 129 రోడ్లు, రూ.280 కోట్లతో ఆర్‌అండ్‌బీలో 20 రోడ్లు, రూ.200 కోట్లతో జీవీఎంసీలో దెబ్బతిన్న రోడ్లు వేయాలని, డ్రైనేజీలు పునర్నిర్మించాలని ప్రతిపాదించగా, నాలుగేళ్ల తర్వాత ఇప్పటికీ శిథిలమైన రహదారులే దర్శనమిస్తున్నాయి. అటకెక్కిన బీచ్ కోత నివారణ హుద్‌హుద్ సమయంలో సుమారు 100 అడుగుల మేర తీరంలోకి సముద్రం చొచ్చుకు వచ్చింది. దీంతో తీరం వెంబడి ఆర్కే బీచ్ సహా మొత్తం బీచ్‌లన్నీ కోతకు గురయ్యాయి. తీరప్రాంత పరిరక్షణ కోసం రూ.150 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో చేసిన ప్రతిపాదనలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. విద్యుత్ రంగానికి సాయం శూన్యం హుద్‌హుద్ విలయంలో అన్నింటి కంటే ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ రంగమే. ఎపీఈపీడీసీఎల్కు రూ.700.62 కోట్లు, ఎపీ ట్రాన్స్‌కోకు రూ.247.50 కోట్లు, ఆర్ఎస్సీవోకు రూ.72.78 కోట్లు, ఇతర విద్యుత్ రంగాలకు రూ.269.19 కోట్లు... మొత్తం రూ.1290.08 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. కానీ, ప్రభుత్వం అందజేసిన సాయం శూన్యం. ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టు కింద ఒక్క విశాఖ పరిధిలోనే అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ కోసం రూ.720 కోట్లతో తలపెట్టిన పనులు ఇటీవలే మొదలయ్యాయి. వీధి దీపాలకూ దిక్కులేదు విశాఖ కార్పొరేషన్‌తోపాటు ఉత్తరాంధ్ర పట్టణ ప్రాంతాల్లో హుద్‌హుద్ వల్ల 40,614 వీధి లైట్లు, పంచాయతీల్లో 2.5 లక్షల వీధి దీపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కేవలం విశాఖ నగర మాత్రమే ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేటికీ శిథిల భవనాల్లోనే పాలన హుద్‌హుద్ ధాటికి విశాఖ కలెక్టరేట్‌తో సహా వివిధ శాఖలకు చెందిన వందలాది భవనాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 53 భవనాలు, పంచాయతీరాజ్‌కు చెందిన 375, గ్రామ పంచాయతీ భవనాలు 1,108, మున్సిపల్ బిల్డింగ్స్ 24,138 ఇరిగేషన్ భవనాలు 51, ప్రాధమిక విద్యాశాఖకి చెందిన 1,667, సోషల్ వెల్పేర్‌కు చెందిన 156, బీసీ వెల్ఫేర్‌కు చెందిన 117, ట్రైబల్ వెల్ఫేర్‌కు చెందిన 455, ఇంటర్మీడియట్ కళాశాలల భవనాలు 38 దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా పైసా కూడా విదల్చలేదు. విశాఖకు ఇచ్చిన హామీలన్నీ గాలికే.. హుద్‌హుద్ తుపాన్ వల్ల విశాఖపట్నం అతలాకుతలమైపోయినా సీఎం మాత్రం నాలుగేళ్లుగా హామీలతోనే కాలం గడిపేశారు. నగరంలోని అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థతోపాటు రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో పునరుద్ధరణకు నోచుకోలేదు. 10,000 మంది ఉద్యోగులు పనిచేసేలా ఐటీ టౌన్షిప్ నిర్మిస్తామని, మెట్రో రైల్ ప్రాజెక్టు తీసుకొస్తామని, విశాఖను లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని, భీమిలి నుంచి విశాఖ పోర్టు వరకు నాలుగు లైన్ల రహదారిని నిర్మిస్తామని, రూ.44 కోట్లతో బీచ్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని, విశాఖలో బర్డ్స్ పార్కు, బొటానికల్ గార్డెన్, ఓషన్ రివర్, బీచ్ రిసార్ట్స్, సైన్స్ సిటీలు నిర్మిస్తామని, అరకు, లంబసింగిలో సమ్మర్ రిసార్ట్స్, ఇంటర్నేషన్ కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, ఇంటర్నేషనల్ హోటల్స్ వంటివి ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టుకు అదనంగా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును తీసుకొస్తామని, విశాఖలో ప్రస్తుతం రెండు పోర్టులకు అదనంగా మరో డీప్‌వాటర్ పోర్టును తీసుకొస్తామంటూ నోటికొచ్చిన హామీలన్నీ గుప్పించారు. కానీ వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చిన పాపాన పోలేదు. పరిహారం కాదు.. పరిహాసం ‘‘నేను స్వయంగా హుద్‌హుద్ తుపాన్ పీడిత ప్రాంతాల్లో పర్యటించాను. సర్వం కోల్పోయి చెల్లాచెదురై, బోరున విలపిస్తున్న బాధిత కుటుంబాలను చూసి చలించిపోయాను. పేద కుటుంబాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కట్టుబట్టులతో వీధి పాలైన కుటుంబాలను, పంటలను కోల్పోయి రోదిస్తున్న రైతన్నలను చూసి ఆవేదన చెందాను. తుపాన్ బాధితులకు అండగా నిలుస్తాం. తుపాన్ బారినపడి నష్టపోయిన వారందరినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. తుపాన్ బాధితులకు ఇచ్చే నష్ట పరిహారాన్ని భారీగా పెంచాం. వీలైనంత వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం’’ - 2014 అక్టోబర్‌లో హుద్‌హుద్ తుపాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన ఇదీ. అయితే, బాధితులకు మాత్రం ఎలాంటి ఊరట దక్కలేదు. ఉత్తరాంధ్రలో వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం కాగా, పదుల సంఖ్యలో ఎకరాల్లోని పంటలకు కూడా పరిహారం ఇప్పటికీ అందలేదని బాధిత రైతులు చెప్పారు. ఇక చనిపోయిన పశువులు, గొర్రెలు, మేకలకు గాను ప్రభుత్వం నుంచి అరకొరగా కూడా సాయం అందలేదు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఇస్తామన్న పరిహారం ఎవరి పరమైందో తెలియదు. దానికి లెక్కాపత్రం లేదు. ఇక హుద్‌హుద్ వల్ల సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ చేనేత కార్మికులు, మత్స్యకారులు సైతం ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా సాయం అందక బోరుమంటున్నారు. తిత్లీలోనూ అదే తీరు హుద్‌హుద్ మాదిరిగానే ఇప్పుడు తిత్లీ తుపాన్ సమయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి వల్ల బాధితులు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. తిత్లీ తుపాన్ ముందురోజు అమరావతిలో అర్ధరాత్రి మూడుసార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను హడావుడి పెట్టించిన చంద్రబాబు తుపాన్ తీరం దాటిన 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి నేరుగా శ్రీకాకుళం వెళ్లారు. గత మూడురోజులుగా ఆయన సాగిస్తున్న ప్రచార విన్యాసాలు అన్నీఇన్నీ కావు. బాధితులకు మాత్రం భరోసా ఇవ్వలేకపోతున్నారు. పంటలను నష్టపోయిన రైతన్నలకు ఏ మేరకు నష్టపరిహారం చెల్లిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ధ్వంసమైన పంటలు, తోటలను అధికారులు పరిశీలించిన తర్వాతే పరిహారం నిర్ణయిస్తామని చెప్పారు. ఆ పరిశీలన ఇప్పట్లో జరిగే పరిస్థితి కనిపించడం లేదు. పశువుల పాకలు, పూరిల్లు పాక్షికంగా ధ్వంసమైతే రూ.10 వేలు, పూర్తిగా దెబ్బతింటే సాధారణ గృహాలకు రూ.1.50 లక్షలు, ఎస్సీలకు రూ.2 లక్షలు, ఎస్టీలకు రూ.2.50 లక్షలిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే.. ఆ పరిహారంతో గోడలు కూడా కట్టుకోలేని పరిస్థితి. ఒక్కో ఆవు, గేదెకు రూ.10 వేలు, మేక, గొర్రెకు రూ.5 వేలు మాత్రమే పరిహారం ప్రకటించారు. కొన్ని ఆవులు, గేదెల విలువ రూ. 25 వేలకు పైగానే ఉండగా ప్రభుత్వం మాత్రం రూ.10 వేలు మాత్రమే ఇస్తామనడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. - హుద్‌హుద్ తుపాన్ తీవ్రతకు విశాఖ కలెక్టరేట్లోని ట్రెజరీ, సివిల్ సప్లయిస్ కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. కానీ, నాలుగేళ్లయినా పునరుద్ధరించలేదు. కూలేందుకు సిద్దంగా ఉన్న సీలింగ్ కిందనే 70 మంది ట్రెజరీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. - ఈ శిథిల భవనం విశాఖ జిల్లాలోని పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం. 2014లో హుద్‌హుద్ తుపాన్ ధాటికి దెబ్బతిని ఇలా తయారైంది. నాలుగేళ్లయినా ఇప్పటికీ అలాగే ఉంది. అద్దె భవనాల్లో సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ రూ.లక్షలు ఖర్చు చేస్తున్న అధికారులు ఈ భవనాన్ని మాత్రం పునరుద్ధరించడం లేదు. - విశాఖ జిల్లా అరకు మండలంలోని చిట్టంగొంది, మొదలస, పాలమానివలస పల్లెల్లోని 39 కుటుంబాల గిరిజనులు హుద్‌హుద్ విలయంలో ఇళ్లు కోల్పోయారు. వారికి నందివలస గ్రామంలో ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దాంతో ఆ గిరిపుత్రులు నందివలసకు మకాం మార్చారు. కానీ, నేటికీ ఆ ఇళ్లు పునాదుల దశ దాటకపోవడంతో తాత్కాలిక షెడ్లలోనే నివాసముంటున్నారు. -
జక్కన్న చెక్కిన చదువుల గుడి
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బృందం చేయూతనిచ్చింది. ఆ బృందం సుమారు రూ.40 లక్షల సమకూర్చగా నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం కోసం మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. హుద్‌హుద్ తుపానుకు ముందుగానే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి సమస్య కారణంగా వేరే పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుద్‌హుద్ తుపాను అనంతరం పాఠశాలల్లో భవనాలు నిర్మించాలని సంకల్పించిన సినీ దర్శకుడు రాజమౌళి... కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమకూర్చారు. ఈ భవనంలోనే వర్చువల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది. అందుకు ఎసీ సౌకర్యం కల్పించడానికి అవసరమైన సీలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. -
హుద్‌హుద్... మానని గాయం
సాక్షి, విశాఖపట్నం: సూపర్ సైక్లోన్‌లలో ఒకటిగా నిలిచిన హుద్‌హుద్ తుపాను విరుచుకుపడి నేటికి సరిగ్గా మూడేళ్లయింది. నాటి పెను తుపానుకు కకావికలమైన విశాఖపట్నం కాస్త తేరుకున్నప్పటికీ నాటి గాయాలు ఇంకా బాధితులను వెంటాడుతున్నాయి. అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు తుపాను హోరులో కలిసిపోయాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం (అక్టోబర్ 12న) హుద్‌హుద్ ఉత్తరాంధ్రపై విరుచుకుపడి బీభత్సం సృష్టించింది. 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఒక్క ఈపీడీసీఎల్‌కే రూ.499 కోట్ల నష్టం వాటిల్లింది. అమలు కాని సీఎం హామీలు అప్పట్లో విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షించి ఇంతకంటే పెద్ద తుపాన్లు సంభవించినా తట్టుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విశాఖలో ఏడాదిలోనే పక్కా ఇళ్లు, మత్స్యకారులకు మోడల్ కాలనీలు నిర్మిస్తామని ప్రకటించారు. తుపాను బారిన పడిన 2,39,781 మంది రైతులకు రూ.2,300 కోట్ల పంట నష్టం వాటిల్లిందని, ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.209 కోట్లు అవసరమని లెక్కతేల్చారు. మూడేళ్లయినా ఇప్పటికీ సబ్సీడీ సొమ్ము అందని రైతులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇంకా రూ.8 కోట్లకు పైగా రైతులకు అందాల్సి ఉంది. ఇక అప్పట్లో కకావికలమైన మత్స్యకార కుటుంబాలు నేటికీ పూర్తిగా తేరుకోలేదు. 4,441 పడవలకు నష్టం వాటిల్లింది. దాదాపు 10వేల తెప్పలు కొట్టుకుపోయాయి. మొత్తం రూ.98.99 కోట్ల నష్టం వాటిల్లింది. రూ.49.69 కోట్లు సాయం చేస్తామని చెప్పినా కేవలం రూ.6.95 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు అందింది. చెరువులు, కాల్వలు వంటి 1,020 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు 59.81 కోట్లు అవసరమని గుర్తించినా ఇప్పటికీ నిధులు విడుదల చేయలేదు. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం రూ.21వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చి కేంద్రానికి నివేదిక ఇచ్చారు. విరాళాల రూపంలో దాతలందించిన రూ.200 కోట్లకు లెక్కా పత్రం లేకుండా పోయింది. పూర్తికాని హుద్‌హుద్ ఇళ్లు ఉత్తరాంధ్రలో 4 లక్షలకుపైగా ఇళ్లు దెబ్బతినగా రూ.3,226 కోట్ల ఆస్తినష్టం వాటిల్లితే పరిహారం కింద రూ.77.51కోట్లు పంపిణీ చేశారు. తమకు పరిహారం అందలేదని ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హద్‌హుద్ పునర్నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంకు ఆర్థిక సహాయంతో చేపట్టిన ఏపీడీపీఆర్ ప్రాజెక్టు నేటికీ పట్టాలెక్కలేదు. విశాఖలో రూ.720 కోట్లతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థకు ఎట్టకేలకు ఈ నెల 9న సీఎం శంకుస్థాపన చేశారు. మిగిలిన రూ.1580 కోట్ల పనులకు టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయి. -
'అందుకే విశాఖకు పెట్టుబడులు రావడం లేదు'
-
'అందుకే విశాఖకు పెట్టుబడులు రావడం లేదు'
విశాఖపట్నం: హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని విశాఖ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్ విమర్శించారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...తుఫాను బాధితులకు ఒక్క ఇళ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. హుద్ హుద్ తుఫాను వచ్చి రెండేళ్లు గడిచినా బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించలేదని ధ్వజమెత్తారు. ఎంతో చేశామని టీడీపీ సర్కారు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. రూ. 400 కోట్లు ఖర్చుపెట్టి ఉల్లిపాయలు, పప్పులు ఇచ్చారనడం శోచనీయమన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని ప్రకటించారు. విశాఖపట్నంలో పెట్టుబడులు పెడితే తుఫానుల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని గతంలో టీడీపీ ఎంపీ అన్నారని గుర్తు చేశారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యల వల్లే విశాఖకు పెట్టుబడులు రావడం లేదని అమరనాథ్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ప్రకృతిని జయించిన వీరులా చంద్రబాబు మాట్లాడుతున్నారు హుద్ హుద్ వల్ల కలిగిన నష్టం కంటే చంద్రబాబు పబ్లిసిటీ వల్లే విశాఖకు ఎక్కువ నష్టం జరిగింది తుఫాను వల్ల లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రధానికి చంద్రబాబు చెప్పారు ఆనాడు తుఫాను బాధితులకు ప్రధాని వెయ్యి కోట్లు ప్రకటించారు కేంద్రం నుంచి రూ. 480 కోట్లు మాత్రమే నిధులు వచ్చాయని బాబు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం నిత్యవసరాల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేశామని చెప్పింది ప్రపంచస్థాయిలో సేకరించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు -
'గూడు’ కట్టుకున్న నిరాశ
ఏడాదిన్నరలో చేపట్టని గృహ నిర్మాణం లబ్ధిదారుల ఎంపికలో జాప్యం పట్టించుకునేవారు కరవు దరఖాస్తులకే పరిమితం ఎన్టీఆర్ పథకానిదీ ఇదేతీరు శ్రీకాకుళం టౌన్:జిల్లాలో 27లక్షలపైగా జనాభా నివసిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పథకం అమలు చేసినపుడు అప్పటి ధరలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదార్లకు అందజేశారు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టింది. అందులో లోపాలున్నాయంటూ టీడీపీ ప్రభుత్వం ఏడాదిపాటు కాల యాపన చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 12,500, మరమ్మతుల కింద 11వేలు, హుద్‌హుద్ పున ర్నిర్మాణం పేరిట 2,500 ఇళ్లు నిర్మాణానికి అనుమతించింది. ఇది కేవలం ఉత్తర్వులకే పరిమిత మైంది. మరో 45రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఇంతవరకు ఒక్కలబ్థిదారునికి గృహ మంజూరు పత్రాన్ని అందించలేదు -ఎన్టీఆర్ గృహనిర్మాణానికి నిబందనలు ఇవే.. ప్రభుత్వం కొత్తగా అనుమతులిచ్చిన ఎన్టీఆర్ గృహనిర్మాణాల ధర రూ.2.75లక్షలుగా నిర్ణయించింది. నియోజక వర్గంలో 1250 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని ఎంపిక బాద్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించింది. ఇంతవరకు ఏ నియోజక వర్గంనుంచి జాబితా అందలేదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఆథార్ పొందిన వారే అర్హులని ప్రకటించడంతో గతంలో ఇల్లు పొందినట్టు నమోదైన వారికి కొత్త మంజూర్లు సాధ్యం కావడం లేదు. ఆన్లైన్లో వాటిని అనుమతించడం లేదు.ఎన్టీఆర్ అప్‌గ్రేడేషన్ పథకం కింద మరమ్మతుకు 1994నుంచి 2014 మధ్య మంజూరైన ఇళ్ల మరమ్మతులు చేసుకునే వీలు కల్పించారు. ఒక్కో నియోజక వర్గంలో 1100 వంతున 10 నియోజక వర్గాల్లో లబ్థిదారుల ఎంపిక జరగాల్సిఉంది. జాబితాలు గృహనిర్మాణశాఖ వద్ద ఉన్నప్పటికి వాటిని కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో జాప్యం కొనసాగుతోంది. మూడు జన్మభూమి కార్యక్రమాల్లో 83వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ఆనలైన్ చేయకుండా వడపోత కష్టమవుతోంది. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో నష్టపోయిన కుటుంబాలకు కేటాయించిన ఇళ్లు శ్రీకాకుళంలో నిర్మాణ దశలో ఉన్నా వాటికి లబ్థిదారుల ఎంపిక మొదలు కాలేదు. మరో మూడు చోట్ల నిర్మాణం మొదలు కావాల్సిఉంది. -
ఏడాదైనా మానని గాయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సరిగ్గా ఏడాది క్రితం (అక్టోబర్ 12న) హుద్‌హుద్ పెను తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించింది. 61 మంది మృత్యువాత పడ్డారు. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 2.30 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. విద్యుత్, సమాచార వ్యవస్థ కకావికలమైంది. 87,228 కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ నగరం సహా మూడు జిల్లాల్లోని దాదాపు అన్ని గ్రామాలను అంధకారం ఆవరించింది. ఒక్క విశాఖ నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకే 10 రోజుల వరకు సమయం పట్టింది. ఇక గ్రామాలకైతే కొన్ని వారాలు, వ్యవసాయ విద్యుత్ పునరుద్ధరణకు ఆరేడు నెలలు సమయం పట్టింది. 4 లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం రూ.23,000 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. మరుసటి రోజు విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి సమీక్షలు మీద సమీక్షలు నిర్వహించారు. అందరినీ ఆదుకుంటామన్నారు. ఇంతకంటే పెద్ద తుపానులు సంభవించినా తట్టుకునేలా వ్యవస్థలను తీర్చిదిద్దుతామన్నారు. విశాఖ నగరంలో భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పక్కా ఇళ్లు, మత్స్యకారులకు మోడల్ కాలనీలు నిర్మిస్తామన్నారు. వారం రోజుల తర్వాత ‘హుద్‌హుద్ తుపానును జయించాం..’ అని చంద్రబాబు ప్రకటించారు. కానీ కంటితుడుపు చర్యలు తప్ప ఏడాది గడిచినా ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. దాతలు విరాళాలుగా అందించిన రూ.200 కోట్లలో ఒక్క రూపాయికి కూడా ప్రభుత్వం లెక్క చెప్పలేదు. అన్నదాత ఆక్రందన పట్టని ప్రభుత్వం తుపానుతో 2,39,781మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ.2,300 కోట్ల పంట నష్టం వాటిల్లింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కోసం రూ.209 కోట్లు అవసరమని ప్రభుత్వమే లెక్కగట్టింది. కానీ ఇంతవరకు కేవలం రూ. 5.20 కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకొంది. చెరువులు, కాలువలు వంటి 1,020 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు రూ.59.81 కోట్లు అవసరమని అంచనా వేశారు. నిధులు మాత్రం విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లతో రూ. 7.76 కోట్ల మేర పనులు మొదలుపెట్టినా.. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆ పనులు నిలిపివేశారు. కొత్త ఇళ్లు హుళక్కే ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులైనవారికి ప్రభుత్వం ఇంతవరకు పూర్తి పరిహారం చెల్లించలేదు. 4 లక్షలకుపైగా ఇళ్లు దెబ్బతినగా 49,366 గుడిసెలు కూలిపోయాయి. మొత్తం రూ 3,236.32 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది. పూర్తిగా కూలిపోయిన ఇంటికి రూ.50 వేలు, తీవ్రంగా దెబ్బతిన్నవాటికి రూ.15 వేలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.5 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించింది. రూ.100 కోట్లు మాత్రమే పరిహారంగా అందించి చేతులు దులుపుకుంది. తక్షణ సాయంగా ఇస్తామన్న రూ.10 వేలు కూడా కొందరికే ఇచ్చి సరిపెట్టింది. మత్స్యకార కుటుంబానికి రూ.15 వేలు ఇస్తామన్నా ఒక్కరికీ సాయం అందలేదు. ఐఏవై పథకం కింద 12 వేల ఇళ్లు, కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహకారంతో 10 వేల ఇళ్లు మాత్రమే మంజూరు చేసినా ఒక్క ఐఏవై ఇంటి నిర్మాణం కూడా చేపట్ట లేదు. కార్పొరేట్ సంస్థల నిధులతో కేవలం 2,326 ఇళ్ల నిర్మాణాన్ని ఇటీవల చేపట్టారు. ఇంకా కష్టాల కడలిలోనే... కకావికలైన మత్స్యకార కుటుంబాలు ఇంకా తేరుకోలేదు. అప్పట్లో 4,441 పడవలకు నష్టం వాటిల్లింది. దాదాపు 10 వేల తెప్పలు కొట్టుకుపోయాయి. మొత్తం రూ.98.29కోట్లు నష్టం వాటిల్లింది. పూర్తిగా దెబ్బతిన్న బోట్లకు రూ.5లక్షలు, తీవ్రంగా దెబ్బతిన్నవాటికి రూ.3 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్నవాటికి రూ.1.50 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. తెప్పలకు రూ.50 వేలు చొప్పున సహాయం అందిస్తామని తెలిపింది. కానీ పడవలకు పరిహారం కోసం కేవలం రూ.14 కోట్లు మంజూరు చేసి అందులో కూడా రూ.6.95 కోట్లే పంపిణీ చేసింది. విద్యుత్‌కు పైసా ఇవ్వలేదు సాక్షి, హైదరాబాద్: హుద్‌హుద్ నేపథ్యంలో.. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల్లో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు రూ. 10 వేల కోట్లు అవసరమని ఇంధనశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తుపాను తాకిడికి అనేక ట్రాన్స్మిషన్ టవర్లు దెబ్బతిన్నాయి. 7,567 కిలోమీటర్ల మేర హెటీ లైన్ దెబ్బతిన్నది. 8,303 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తం రూ.1,290 కోట్ల మేర నష్ట వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఇందులో ఒక్కపైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల ట్రాన్స్ఫార్మర్లు అవసరంకాగా ప్రస్తుతం 4 వేలకు మించి లేవు. విశాఖలో భూగర్భ కేబులింగ్ వ్యవస్థ, ఉత్తరాంధ్రలో విద్యుత్ సరఫరా మెరుగుకు ప్రపంచబ్యాంకు రూ. 720 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ఆదివారం చెప్పారు. వైపరీత్యాల సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.10 వేల కోట్లు అవసరమని ప్రతిపాదించినట్టు తెలిపారు. -
నేను చేస్తున్న పూజల కారణంగానే...
విశాఖపట్నం: తాను చేస్తున్న శివపూజల కారణంగానే హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం తప్పిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని ఆనందపురంలో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవన్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విశాఖ నగరాన్ని చిగురుటాకులా వణికించిన హుద్-హుద్ తుపానులో ప్రాణనష్టం జరగకపోవడానికి తాను చేస్తున్న ఈశ్వర పూజలే కారణమని వ్యాఖ్యానించారు. సుబ్బిరామిరెడ్డి శివభక్తుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈశ్వరుడిని ఆయన నిత్యం పూజిస్తూ ఉంటారు. ప్రత్యేక యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారు. -
జింకలున్నాయా...
♦ కంబాల కొండ, సీతకొండపై కానరాని సందడి ♦ హుద్‌హుద్ తుపాను తరువాత కనిపించని జాడ సాగర్‌నగర్ : విశాలమైన అటవీప్రాంతంగా పిలిచే కంబాలకొండ, సీతకొండ ప్రాంతాల్లో జింకల జాడ కానరావడం లేదు. ఒకప్పుడు వందల సంఖ్యలో జింకలు గుంపులుగా చెంగుచెంగున గెంతుతూ సందర్శకులను కనివిందు చేసేవి. పచ్చిక మేత కోసం జాతీయరహదారిపైకి వచ్చి వాహనచోదకులకు వినోదం కలిగించేవి. ఇప్పుడు ఆ గుంపులు కనిపించడం లేదు. జాతీయ రహదారిని ఆనుకుని పచ్చిక చిగుళ్లు కనిపిస్తున్నా జింకలు కానరావడం లేదు. ఆ జింకలు ఎమయ్యాయి..? అసలు అవి ఉన్నాయా..? హుద్‌హుద్ తుపాను సమయంలో మృతిచెందాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో డెయిరీఫారం నుంచి జూ పార్కు మీదుగా ఎండాడ వరకు గల జాతీయరహదారి ప్రాంతానికి పచ్చిక మేతకోసం సాయంత్రం, ఉదయం వేళల్లో జింకలు తరచూ వస్తుండేవి. మేత అనంతరం కంబాలకొండ కొలనులో నీళ్లు తాగి అడవులోకి పరుగుతీస్తుండేవి. అటవీప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చిన జింకలు జాతీయ రహదారిని దాటుతున్న సమయంలో వాహనాలు ఢీకొని పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. సీతకొండల నుంచి జూ పార్కులోకి గుంపులుగా దిగిన జింకలు అడవి దున్నలు, కనుజులకు జూ సిబ్బంది వేసిన మేతను తిని మళ్లీ కొండలెక్కేస్తుండేవి. ఇవన్నీ హుద్‌హుద్ తుపానుకు ముందు పరిస్థితి. ఉంటే.. కనిపించేవి!: కొండల్లో జింకలు ఉన్నట్లయితే ఎప్పటిలాగే కనిపించేవి..హుద్‌హుద్ తుపాన్‌కు ముందు కంబాలకొండ చుట్టూ కొన్ని చోట్ల అటవీప్రాంతం నుంచి బయటకు రాకుండా కంచె నిర్మించారు. ఆ కంచె మధ్య ఖాళీలను దారులుగా చేసుకొని జింకలు బయటకు వచ్చేస్తుండేవి. తుపాను దాటికి కంబాలకొండ చుట్టూ ఉన్న కంచె పూర్తిగా మాయమైంది. ఇనుప తీగలు దెబ్బతినడంతో కొండచుట్టూ రక్షణ కవచం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో జింకలు బయటకు రాకపోవడంతో అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నలు జంతు ప్రేమికుల్లో తలెత్తుతున్నాయి. -
జీవామృతంతో నిశ్చింత!
పోషకాహార నిపుణురాలి ‘ఇంటిపంట’ల అనుభూతులు హుద్‌హుద్ తుపాను తూర్పు తీరంలో సృష్టించిన విధ్వంసం ఏపాటితో తెలియనిది కాదు. విశాఖపట్నంలో.. మేడ మీద సేంద్రియ ఆకుకూరలు పెరుగుతున్న కుండీలు తుపాను గాలికి కొట్టుకుపోయాయి. అయినా, ఆమె నిరుత్సాహపడలేదు. మరింత పట్టుదలతో కిచెన్ గార్డెన్‌ను పునర్నిర్మించారు. పూలు, ఆకుకూరలతోపాటు ఇప్పుడు కూరగాయలు కూడా రెట్టించిన ఉత్సాహంతో సాగు చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా పోషకాహార నిపుణురాలు, ప్రవృత్తి రీత్యా సేంద్రియ ఇంటిపంటల సాగుదారు.. ఆమె పేరు పిన్నమరాజు ఉషా గజపతిరాజు (99492 11022). జీవామృతంతో నిశ్చింతగా‘ఇంటిపంట’లు పండిస్తున్నానంటున్న ఆమె అనుభూతులు .. ఆమె మాటల్లోనే.. విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని సొంత అపార్ట్మెంట్(గ్రూప్‌హౌస్)లో నివాసం ఉంటున్నాం. పోషకాహార నిపుణురాలిగా సేంద్రియ ఆకుకూరల ప్రాధాన్యత గుర్తెరిగి మేడపైన కుండీల్లో పూల మొక్కలతో పాటు ఆకుకూరలు పండిస్తున్నా. హుద్‌హుద్ తుపాను గాలికి కుండీలన్నీ కొట్టుకుపోయాయి. ఆకుకూరలు, కూరగాయలను తాజాగా తింటేనే పోషకాలు పుష్కలంగా పొందగలం. బజారులో సేంద్రియ ఆకుకూరలు ఎప్పుడో గానీ దొరకవు. దొరికినా.. వాటిని నిజంగా సేంద్రియంగా పండించారో లేదో తెలీదు. అందుకే కొన్ని ఏళ్ల నుంచి పూలతోపాటు అనేక ఆకుకూరలను కుండీల్లో మక్కువతో పండిస్తున్నా. తుపాను తర్వాత 100-120 వరకు పనికిరాని థర్మకోల్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు, సంచుల్లో ఇంటి పంటలు పెంచుతున్నా. ప్రస్తుతం మెంతికూర సహా ఐదారు రకాల ఆకుకూరలతో పాటు టమాటా, ముల్లంగి, బీన్స్, ఆనప, దోస, బీర, కాకర, మిర్చి, బెండ, ఉల్లికాడలను పెంచుతున్నా. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చి ఇంటిపంటలకు వాడుతున్నా. ఇంటిపంటల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిమితం. ఇవి మన కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు మానసికోల్లాసంతోపాటు శారీరక వ్యాయామానికి కూడా తోడ్పడతాయి. సామాజిక మాధ్యమంలో ఇంటిపంట గ్రూప్, రైతుమిత్ర గ్రూప్, బెంగళూరు టై గార్డెన్ గ్రూపులు పరిచయమయ్యాక ఎంతో నేర్చుకున్నాను. జీవామృతం పరిచయం అయిన తర్వాత కిచెన్ గార్డెన్ చాలా బాగుంది. చీడపీడలను నియంత్రించడం సులువుగా మారింది. అంతకుముందు రసాయనాలు పిచికారీ చేసినా ఫలితం ఉండేది కాదు. జీవామృతాన్ని నెలకు రెండుసార్లు స్వయంగా తయారు చేసుకుంటున్నా. దీన్ని 1:10 పాళ్లలో నీటిలో కలిపి రోజు మార్చి రోజు మొక్కలకు పోస్తున్నా.. చల్లుతున్నా. మా అమ్మాయి పైచదువులకు అమెరికా వెళ్లిన తర్వాత ఇంటిపంటలకు మరింత దగ్గరయ్యా. నా పేషెంట్లక్కూడా ఇంటిపంటల సాగు వ్యాపకాన్ని పరిచయం చేస్తున్నా. ఇద్దరు, ముగ్గురు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా.. మా కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు 100%, కూరగాయలు 50% టై గార్డెన్ ద్వారా సమకూర్చుకోవటం నాకు చాలా సంతృప్తిగా ఉంది. -
కొండంత నష్టం - చీమంత సాయం:వైఎస్ఆర్సీపీ
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను కారణంగా కొండంత నష్టం జరిగితే చీమంత సాయం చేసి గొప్పగా చెప్పుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉత్తరాంధ్రకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గిద్ది ఈశ్వరి, కళావతి, శ్రీవాణి, సర్వేశ్వరరావు, రాజన్న దొరలు ఈ రోజు శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. హుద్‌హుద్ తుపానులో నష్టపోయిన గిరిజన ప్రాంతాల రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. తుపాను వల్ల చనిపోయిన గిరిజన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ఇవ్వలేదని చెప్పారు. తుపాను వల్ల 21వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోందని, కానీ సహాయక చర్యలకు మాత్రం 244 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. -
ఆదివారం కూడా పని చేశాం: చంద్రబాబు
హైదరాబాద్: హుద్‌హుద్ తుపాను సమయంలో టీవీ దగ్గర కూర్చొని అందరం మానిటరింగ్ చేశామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆదివారం అయినా అందరం పనిచేశామన్నారు. హుద్‌హుద్ తుపాను అంశంపై ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడారు. సంక్షిప్తంగా చంద్రబాబు ప్రసంగం: తుపానుపై ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేశాం. బలవంతంగా బాధితులను పునరావాస శిబిరాలకు తరలించాం. ఏర్పాట్లన్నిటినీ నిరంతరం పర్యవేక్షించాం. ముందు రోజే విద్యుత్‌ని నిలిపివేశారు. ట్రాఫిక్ కూడా నిలిపివేశారు. కేంద్రం కూడా పరిస్థితులను సమీక్ష చేసింది. తుపాను హెచ్చరికల కేంద్రంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు హఠాత్తుగా మాకు సమాచారం వచ్చింది. మచిలీపట్నం రాడార్ నుంచి సమాచారం తెలుసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అరగంటపాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కైలాసగిరి వద్ద తుపాను తీరం దాటిందని నేవీ నుంచి సమాచారం వచ్చింది. 160 నుంచి 170 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఊహిస్తే, 220 కిలోమీటర్ల వేగంతో తుపాను వచ్చింది. ఆ రోజే నేను బయలుదేరాను. విజయవాడ చేరుకున్నాను. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నాతో మాట్లాడారు. తుపాను తీరం దాటిన రెండవ రోజే ఆయన విశాఖ వచ్చారు. ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు మేం బాధ్యతగా ప్రవర్తించాం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఉత్తరాఖండ్ వరదలు సంభవించినప్పుడు విమానాలు పెట్టి బాధితులను సురక్షితంగా తీసుకువచ్చాం. -
‘క్రికెట్ విత్ స్టార్స్’ తారల ఎంపిక
-
30న సినీ తారల ‘మేము సైతం’
తుపాన్ బాధితులకు బాసటగా సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆదివారం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో.. హైదరాబాద్, న్యూస్‌లైన్: హుద్ హుద్ తుపాన్ విలయంతో తీవ్రంగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు తెలుగు సినిమా తారలంతా కలసి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ఈ నెల 30న హైదరాబాద్‌లో ఆటపాటలతో సందడిగా సాగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో హోరెత్తనుంది. ఆ రోజు హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ‘క్రికెట్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో నటీనటులంతా కలసి క్రికెట్ ఆడనున్నారు. టోర్నమెంట్లో ఆడే నాలుగు జట్లకు నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘డ్రా’ పద్ధతి ద్వారా ఆయా టీముల్లో ఆడే తారలను గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపిక చేశారు. అనివార్య కారణాలతో నాగార్జున, ఎన్టీఆర్ రాలేకపోవడంతో... నాగార్జున టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని అఖిల్, ఎన్టీఆర్ టీమ్‌కి వైస్ కెప్టెన్ అయిన శ్రీకాంత్ వారి స్థానంలో హాజరయ్యారు. సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, కేఎల్ నారాయణ, డి.సురేశ్‌బాబు, ఎమ్మెల్ కుమార్ చౌదరి పాల్గొన్నారు. నాగార్జున టీమ్: అక్కినేని అఖిల్, కల్యాణ్‌రామ్, శర్వానంద్, నిఖిల్, నాగశౌర్య, సచిన్ జోషి, శివాజీరాజా, రాజీవ్ కనకాల, అల్లరి నరేశ్, సాయికుమార్. హీరోయిన్లు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, మధుశాలిని, సోనియా, డిషా పాండేలు ఈ టీమ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. వెంకటేశ్ టీమ్: మంచు విష్ణు, మంచు మనోజ్, నితిన్, నారా రోహిత్, సుశాంత్, నవీన్‌చంద్ర, డా.రాజశేఖర్, దాసరి అరుణ్‌కుమార్, మాదాల రవి, ఆదర్శ్. హీరోయిన్లు సమంత, లక్ష్మీ మంచు, సంజన, ప్రియా బెనర్జీ, తేజస్వినిలు ఈ టీమ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. ఎన్టీఆర్ టీమ్: శ్రీకాంత్, గోపీచంద్, నాని, సందీప్‌కిషన్, సాయిధర్మతేజ, తనీష్, ప్రిన్స్, తరుణ్, సమీర్, రఘు, తమన్. కథానాయికలు అనుష్క, దీక్షాసేథ్, నిఖిత, శుభ్ర అయ్యప్ప, అస్మితాసూద్లు ఈ టీమ్‌కి గ్లామర్ తేనున్నారు. చరణ్ టీమ్: రవితేజ, సుధీర్‌బాబు, సుమంత్, తారకరత్న, వరుణ్‌సందేశ్, వడ్డే నవీన్, ఖయ్యూం, అజయ్. కథానాయికలు కాజల్ అగర్వాల్, చార్మి, అర్చన, పూనమ్‌కౌర్, రీతూ వర్మలు ఈ టీమ్‌లో అలరించనున్నారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్
వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాదిపాటు మారటోరియం జనవరి 12 నాటికల్లా కొత్త రుణాలు మంజూరు రుణాల చెల్లింపు 5-7ఏళ్ల ల్లోపు చెల్లించేందుకు అంగీకారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక కమిటీ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్: హుద్ హుద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రలోని కోస్తా జిల్లాల్లో పంట, పరిశ్రమలకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు కొత్త రుణాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయిం చింది. తుపాను వల్ల నాలుగు జిల్లాల్లో, మొత్తం 120 మండలాలు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళంలో 38, విశాఖపట్టణంలో 43, విజయనగరంలో 34, తూర్పు గోదావరిలో ఐదు మండలాల్లో జనవరి 12 నాటికల్లా రుణాలను రీ షెడ్యూల్, కొత్త రుణాలను ఇచ్చేం దుకు బ్యాంకర్లు తమ అంగీ కారం తెలిపారు. మూడు నెల ల్లోగా బాధితులకు అందాల్సిన సహాయ, తోడ్పాటు కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రత్యేక సమావేశం తీర్మానించింది. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాది పాటు మారిటోరియం విధిస్తూ ఎస్ఎల్బీసీ నిర్ణయం తీసుకుంది. రుణాలను రైతులు 5-7 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చని పేర్కొంది. హుద్‌హుద్ తుపాను కారణంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సమావేశానికి ఎస్ఎల్బీసీ కన్వీనరు సి.దొరస్వామి అధ్యక్షత వహించారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సివిఆర్ రాజేంద్రన్ ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్ల ధ్రువీ కరించిన అన్నవారీ సర్టిఫికెట్లు పొందాలని, బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. తుఫాను బాధితుల సహాయార్థం బ్యాంకర్ల కమిటీ తరఫున రూ.2.50 కోట్లను శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుకు కలిసి అందించామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి బ్యాంకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీం చేసిన సూచనకు తాము సుముఖత వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం మాట్లాడుతూ తుఫాను నష్టంపై గ్రామాలవారీగా నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపామని, ఈ నెల 12 తర్వాత కేంద్ర బృందం పర్యటన ఉండొచ్చని తెలిపారు. తుపాను కారణంగా 3 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని ఆ సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఎస్ఎల్బీసీకి విన్నవించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఖరీఫ్ రుణాలు45 శాతం వరకు మంజూరు చేయగా, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రుణాల శాతం కేవలం 25గానే ఉందని ఆయన తెలిపారు.