ఏడాదిన్నరలో చేపట్టని గృహ నిర్మాణం లబ్ధిదారుల ఎంపికలో జాప్యం పట్టించుకునేవారు కరవు దరఖాస్తులకే పరిమితం ఎన్టీఆర్ పథకానిదీ ఇదేతీరు
శ్రీకాకుళం టౌన్:జిల్లాలో 27లక్షలపైగా జనాభా నివసిస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం పథకం అమలు చేసినపుడు అప్పటి ధరలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పేర్లతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు లబ్ధిదార్లకు అందజేశారు. వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం భారీ ఎత్తున చేపట్టింది. అందులో లోపాలున్నాయంటూ టీడీపీ ప్రభుత్వం ఏడాదిపాటు కాల యాపన చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో 12,500, మరమ్మతుల కింద 11వేలు, హుద్‌హుద్ పున ర్నిర్మాణం పేరిట 2,500 ఇళ్లు నిర్మాణానికి అనుమతించింది. ఇది కేవలం ఉత్తర్వులకే పరిమిత మైంది. మరో 45రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఇంతవరకు ఒక్కలబ్థిదారునికి గృహ మంజూరు పత్రాన్ని అందించలేదు -ఎన్టీఆర్ గృహనిర్మాణానికి నిబందనలు ఇవే..
ప్రభుత్వం కొత్తగా అనుమతులిచ్చిన ఎన్టీఆర్ గృహనిర్మాణాల ధర రూ.2.75లక్షలుగా నిర్ణయించింది. నియోజక వర్గంలో 1250 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని ఎంపిక బాద్యతలను జన్మభూమి కమిటీలకు అప్పగించింది. ఇంతవరకు ఏ నియోజక వర్గంనుంచి జాబితా అందలేదు. తెల్లరేషన్ కార్డు కలిగి ఆథార్ పొందిన వారే అర్హులని ప్రకటించడంతో గతంలో ఇల్లు పొందినట్టు నమోదైన వారికి కొత్త మంజూర్లు సాధ్యం కావడం లేదు. ఆన్‌లైన్లో వాటిని అనుమతించడం లేదు.ఎన్టీఆర్ అప్‌గ్రేడేషన్ పథకం కింద మరమ్మతుకు 1994నుంచి 2014 మధ్య మంజూరైన ఇళ్ల మరమ్మతులు చేసుకునే వీలు కల్పించారు. ఒక్కో నియోజక వర్గంలో 1100 వంతున 10 నియోజక వర్గాల్లో లబ్థిదారుల ఎంపిక జరగాల్సిఉంది. జాబితాలు గృహనిర్మాణశాఖ వద్ద ఉన్నప్పటికి వాటిని కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో జాప్యం కొనసాగుతోంది.
మూడు జన్మభూమి కార్యక్రమాల్లో 83వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిని ఆనలైన్ చేయకుండా వడపోత కష్టమవుతోంది. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో నష్టపోయిన కుటుంబాలకు కేటాయించిన ఇళ్లు శ్రీకాకుళంలో నిర్మాణ దశలో ఉన్నా వాటికి లబ్థిదారుల ఎంపిక మొదలు కాలేదు. మరో మూడు చోట్ల నిర్మాణం మొదలు కావాల్సిఉంది.
'గూడు’ కట్టుకున్న నిరాశ
Published Sun, Feb 7 2016 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement
Advertisement