
పదవి ఉంటుందో, లేదో చెప్పలేను:సుబ్బిరామిరెడ్డి
విశాఖ: భవిష్యత్తును ఊహించి చెప్పడం కష్టమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. త్వరలో తన పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నగరంలోని కేజిహెచ్ లో ధర్మసత్రాన్ని ప్రారంభించిన ఆయన తన పదవికి సంబంధించి పెదవి విప్పారు. పదవి ఉంటుందో, లేదో చెప్పలేనని తెలిపారు. రేపటి రోజులు ఎలా ఉంటాయో ఊహించలేమన్నారు. కాగా, టి.సుబ్బిరామిరెడ్డి ఒక గొప్ప మానవతావాది అని సినీ హాస్య నటుడు బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు.