visakha railway zone
-
రైల్వే జోన్ పై కేంద్రందే కిరికిరి
-
విశాఖ రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్
అనకాపల్లి: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంటే.. ‘ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు..’ అని చెప్పి నగదు తీసుకున్న రోజులను చంద్రబాబు మరిచిపోయినా... జనం ఇంకా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్న రోజులను గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామని ఎంపీ సత్యవతి చెప్పారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదని, చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఉత్తరాం«ధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలిసిన పాపానపోలేదన్నారు. వారు ఈ విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
AP: రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి
సాక్షి, అమరావతి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా.. అధికారంలోకి వచ్చాకైనా తన విధానం ఒకటేనని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటి చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు పరమావధి అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు సత్వర పూర్తి, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేశారు. అధికారంలోకి వచ్చాక ఢిల్లీ వెళ్లినప్పుడల్లా.. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా కల్పించాలని.. పోలవరాన్ని సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని.. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నడిపించాలని.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలనే తదితర అంశాల గురించి సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు, రేపటి విశాఖ పర్యటనలో ఆయా అంశాల గురించి మరోసారి విజ్ఞప్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ప్రత్యేక హోదాపై ఒకే మాట.. విభజన నేపథ్యంలో ఐదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారు. పార్లమెంటు ద్వారా హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్చూచిలా నిలుస్తుందని ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అప్పట్లో స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కానీ.. నాటి సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారు. దాంతో పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగిస్తూ.. ప్రత్యేక హోదా స్థానంలో ఆర్థిక సహాయాన్ని 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక హోదా కంటే కేంద్రం ప్రకటించిన సహాయంతోనే రాష్ట్రానికి అధికంగా ప్రయోజనం కలుగుతుందని అప్పట్లో సీఎంగా చంద్రబాబు ప్రశంసించారు. శాసనసభలో ప్రధాని మోదీ, నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని అభినందిస్తూ తీర్మానం చేశారు. ఆర్థిక సహాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఒనగూరదని.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం రూపురేఖలు మారుతాయని ప్రజలకు వివరిస్తూ వైఎస్ జగన్ ఉద్యమించారు. తద్వారా ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆఖండ విజయం సాధించాక.. సీఎం హోదాలో సీఎం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లిన తొలిసారే ప్రత్యేక హోదాపై తన విధానాన్ని కుండబద్ధలు కొట్టారు. కేంద్రంలో పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఢిల్లీకి వచ్చినప్పుడల్లా లేదా రాష్ట్రానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా కల్పించాలని వి/æ్ఞప్తి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. అదే బాటలో పయనిస్తున్నారు. ప్రణాళికాయుతంగా పోలవరం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం ఏటీఎంగా మార్చుకున్నారని అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేశారు. ప్రణాళికా రాహిత్యంతో కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పనులు చేపట్టడం వల్ల అస్తవ్యస్తంగా మారిన పోలవరాన్ని గాడిలో పెట్టి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇచ్చి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహరించాలని కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. అడ్‌హక్‌గా రూ.పది వేల కోట్లు ఇచ్చి పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహరించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలో ప్రధాని మోదీకి ఇదే అంశాన్ని మరోసారి గుర్తు చేసి.. పోలవరంను సత్వరమే పూర్తి చేయడానికి సహకరించాలని కోరనున్నారు. విశాఖ ఉక్కుపై ఉడుం పట్టు విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకుని, ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో విశాఖ ఉక్కు పరిశ్రమను నడిపించేందుకు ఉక్కు గనులను కేటాయించడం.. రుణాలను పునర్ వ్యవస్థీకరించడం.. మిగులుగా ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని ప్లాటింగ్ చేసి అమ్మడం.. రెండేళ్ల గడువు ఇవ్వడం తదితర ప్రత్యామ్నాయ మార్గాలను ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ సూచించారు. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమానికి వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటించింది. అటు రాజ్యసభలో.. ఇటు లోక్‌సభలో కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ పోరాటం చేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ 120 మంది ఎంపీల సంతకాలను సేకరించి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రాన్ని సమర్పించింది. ఈ వినతిపత్రంపై సంతకాలు చేసేందుకు టీడీపీ ఎంపీలు నిరాకరించడం ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా తమది రెండు నాల్కల ధోరణే అని చాటి చెప్పారు. విశాఖపట్నంకు వస్తున్న ప్రధాని మోదీకి మరోసారి ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే నడపాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. -
చిరకాల స్వప్నం, నెరవేరే సమయం.. 12న విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే సమయం వచ్చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటుకానున్న దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు శంకుస్థాపన ముహూర్తం కుదిరింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మూడోసారి విశాఖలో పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఆయన రైల్వేజోన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం నవంబర్ 11న విశాఖకు ఆయన రానున్నారని అధికారిక వర్గాల సమాచారం. ఈ పర్యటనలో రూ.వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారంతో పాటు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. ఇందులో భాగంగా.. నవంబర్ 11న ఆయన విశాఖ చేరుకుని ప్రధానితో కలిసి ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11న ప్రధానికి సీఎం స్వాగతం వచ్చేనెల 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకోనున్న ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి ప్రధాని, ముఖ్యమంత్రి చేరుకుంటారు. కాసేపు ఈఎన్సీ అధికారులతో రక్షణ రంగంపై చర్చించి రాత్రి అక్కడే బసచేస్తారు. 12వ తేదీ ఉదయం ఏయూ గ్రౌండ్స్‌కి చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ఈ వేదిక నుంచే పలు కీలక కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుడతారు. అనంతరం మ.2 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని.. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయల్దేరుతారు. ఇక ప్రధాని మోదీ విశాఖలో ప్రారంభించే ప్రాజెక్టుల వివరాలివీ.. ► దక్షిణ కోస్తా రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ, సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. సుమారు రూ.120 కోట్లతో జోన్ ప్రధాన కార్యాలయం నిర్మిస్తారు. డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని వైర్లెస్ కాలనీలో ఈ హెడ్‌క్వార్టర్స్ నిర్మిస్తారు. ► విశాఖ శివారు వడ్లపూడిలో రైల్వే అనుబంధ సంస్థ ఆర్వీఎన్ఎల్ రూ.260 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యాగన్ వర్క్‌షాప్‌ను జాతికి అంకితం చేస్తారు. ఇక్కడ నెలకు 200 వ్యాగన్లను పూర్తిస్థాయిలో ఓవర్ హాలింగ్ చేసేలా నిర్మించారు. ► రైల్వే ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) నేతృత్వంలో రూ.446 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని, సీఎం శంకుస్థాపన చేస్తారు. ► సుమారు రూ.26 వేల కోట్లతో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) చేపట్టిన రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుని కూడా వారిద్దరూ ప్రారంభిస్తారు. ► గంభీరంలో రూ.445 కోట్లతో మొదటి విడతలో నిర్మించిన ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్‌నూ ప్రారంభిస్తారు. దీంతోపాటు రూ.380 కోట్లతో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికీ వారు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు రైల్వే, ఇతర కేంద్ర సంస్థలకు సంబంధించిన పలు శంకుస్థాపనలను ప్రధాని చేస్తారు. ► ఆ తర్వాత ప్రధాని మోదీ, సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. కలెక్టర్ డా.మల్లికార్జున నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పర్యవేక్షిస్తోంది. -
పట్టాలు తప్పి పిచ్చి రాతలు!
► విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై పచ్చ పత్రికలు పట్టాలు తప్పాయి. విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన అజెండాలో అసలు రైల్వే జోన్ అంశమే లేదు. అజెండాలో లేని అంశాన్ని చర్చించినట్లుగా, రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసినట్లు ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని తప్పుడు రాతలు రాశాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లాలన్నది వాటి పన్నాగం. దీనిపై వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి దీటుగా స్పందించారు. రైల్వే జోన్ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని, వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతిని మాకు రాసిస్తారా? అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ.. రైల్వే జోన్ కచ్చితంగా ఏర్పాటవుతుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని.. కొన్ని పత్రికలు సృష్టిస్తున్న వదంతులు నమ్మవద్దన్నారు. రైల్వే జోన్ రాకుంటే రాజీనామా చేస్తా సాక్షి, అమరావతి: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ నూటికి నూరు శాతం వచ్చి తీరుతుందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచురించాయని ధ్వజమెత్తారు. విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. రైల్వే జోన్ వస్తే రామోజీరావు, రాధాకృష్ణ వారి పత్రికలను మాకు అప్పగిస్తారా? అని సవాల్ చేశారు. ఒకవేళ రైల్వే జోన్ రాకుంటే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్ముతూ కుల ప్రాతిపదికన ముందుకెళ్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను ప్రజలెవరూ విశ్వసించరని చెప్పారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తలు అవాస్తవం అని తేలితే రామోజీ, రాధాకృష్ణ బహిరంగ క్షమాపణలు చెబుతారా? అని నిలదీశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ► విశాఖ కేంద్రంగా రాష్ట్రానికి రైల్వే జోన్ రావట్లేదని, అది కలగా మిగిలిపోతుందని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ కథనాలను ప్రచురించాయి. రైల్వే మంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కలిసినప్పుడు అతి త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆయన స్వయంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ► ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రైల్వే జోన్ రాదని ఊహల్లో బతుకుతూ వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వారి పత్రికల్లో అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. కేంద్రం నిర్వహించిన సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని తేలితే వారిద్దరూ బహిరంగంగా క్షమాపణలు చెబుతారా? ► పునర్విభజన చట్టంలో రైల్వేజోన్‌కు సంబంధించి చాలా స్పష్టంగా ఉంది. రాజధాని ఎక్కడైతే ఉందో ఆ రాజధానిని కొవ్వూరు మీదుగా తెలంగాణ ప్రాంతాలతో కలిసే విధంగా రైల్వే లైన్ నిర్మించి హైదరాబాద్‌తో అనుసంధానించాలనే అంశంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రం వాటా సొమ్ము ఇవ్వాలనేది కేంద్ర ప్రతిపాదన. పునర్విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి కొవ్వూరు మీదుగా రైల్వే లైన్ ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు కనెక్ట్ చేయాలని, ఆ మొత్తం నిధులను కేంద్రమే భరించాలనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. దీనికి సంబంధించిన చర్చ వచ్చింది. అంతేకానీ విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించిన చర్చ జరగలేదు. ► విశాఖ రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది. రైల్వే జోన్ కోసం వైఎస్సార్సీపీ ఎన్నో పోరాటాలు చేసింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నూటికి నూరుశాతం విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. రామోజీ, రాధాకృష్ణ అవాస్తవాలను ప్రచురిస్తూ కులాభిమానంతో స్థాయిని దిగజార్చుకోవద్దు. -
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
-
విశాఖ రైల్వే జోన్ పట్టాలెక్కేనా!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, విభజన చట్టంలోని హామీ అయిన విశాఖపట్నం రైల్వేజోన్ పట్టాలెక్కుతుందా!?.. లేదా మరోసారి నిరాశను మిగులుస్తూ కేంద్రం వెయిటింగ్ లిస్టులో పెడుతుందా!?.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మంగళవారం ప్రవేశపెట్టనున్న 2022–23 వార్షిక బడ్జెట్‌పైనే యావత్ రాష్ట్రం దృష్టిసారించింది. నిజానికి దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అలాగే.. రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల్లో న్యాయం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పట్టాలెక్కుతుందా.. అటకెక్కిస్తారా! విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో కూడా దీని ఏర్పాటు గురించి హామీ ఇచ్చినప్పటికీ 2018 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు అంటే 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. మరోవైపు.. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధంచేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. కానీ, గత రెండు బడ్జెట్లలోనూ రైల్వేజోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. ప్రభుత్వం అనుమతిస్తే దక్షిణా కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి ఏడాదిలో పూర్తిచేసేందుకు రైల్వేబోర్డు సిద్ధంగా ఉంది. కానీ, జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వమే రాజకీయంగా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. రైల్వేజోన్‌పై కేంద్రం స్పష్టతనివ్వాలని రాష్ట్రం కోరుకుంటోంది. కేంద్రం ఇప్పుడు ప్రకటిస్తే ఏడాదిలో కొత్త జోన్ ఏర్పాటు సాధ్యపడుతుంది. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకుంటే ఇక రైల్వేజోన్ అంశం అటకెక్కినట్లేనని కూడా నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: Parliament Budget Session 2022) డివిజన్లపై మరింత స్పష్టత అవసరం విశాఖపట్నం రైల్వే జోన్‌తోపాటు దాని పరిధిలోని డివిజన్ల ఏర్పాటులోనూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. 2019లో కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం.. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఏపీ, ఒడిశాలలో విస్తరించి ఉన్న వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంది. వాల్తేర్ డివిజన్‌ను రెండుగా విభజిస్తారు. ఒడిశాలోని ప్రాంతాలతో రాయగడ కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఏర్పాటుచేసి తూర్పు కోస్తా రైల్వేజోన్‌లో ఉంటుంది. అలాగే, ఏపీలోని ప్రాంతాలను విజయవాడ కేంద్రంగా ఉన్న రైల్వే డివిజన్లో కలుపుతారు. దీనిపై ఉత్తరాంధ్రలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. వాల్తేరు డివిజన్‌లేని రైల్వేజోన్‌తో ప్రయోజనంలేదని స్పష్టంచేశారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖపట్నం రైల్వేజోన్ మాత్రమే కావాలని స్పష్టంచేస్తున్నారు. అంతగా కావాలంటే విజయవాడ, గుంటూరులలో ఉన్న రైల్వే డివిజన్లను ఏకంచేసి ఓ డివిజన్ చేయొచ్చని నిపుణులు సూచించారు. దాంతో ఏపీ పరిధిలో మూడు రైల్వే డివిజన్లే ఉంటాయని చెప్పారు. ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రైల్వే జోన్‌తోపాటు బడ్జెట్లో రాష్ట్రం ఆశిస్తున్నవి.. ► కర్నూలు జిల్లా డోన్ కేంద్రంగా రైల్వే కోచ్‌ల సెకండరీ మెయింటెనెన్స్ లోకోషెడ్ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అందుకు 100 ఎకరాలు కేటాయిస్తామని కూడా చెప్పింది. దాంతో రాయలసీమ ప్రాంతంలో రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేయొచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. ► రాష్ట్రానికి కనీసం రెండు కొత్త రైళ్లు కేటాయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశాఖపట్నం–బెంగళూరు, తిరుపతి–వారణాసి సూపర్‌ఫాస్ట్ రైళ్లు ప్రవేశపెట్టాలని కోరింది.ఇక విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ వేయాల్సి ఉంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం నుంచి తిరుపతికి పగటిపూట నడిచే రైళ్లు కూడా వేయాలని ప్రతిపాదించారు. ► విజయవాడ–ఖరగ్‌పూర్ ప్రత్యేక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటుచేస్తామని గత బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. కానీ, ఇంతవరకు పట్టించుకోలేదు. ఆ కారిడార్ కోసం ప్రత్యేకంగా లైన్ నిర్మించే అంశంపై మంగళవారం బడ్జెట్లో స్పష్టతఇవ్వాలని కోరుకుంటోంది. ► మచిలీపట్నం–భీమవరం–నిడదవోలు డబ్లింగ్ పనులు, విజయవాడ–గూడూరు మూడో లైన్ పూర్తి కోసం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాల్సి ఉంది. ► రాష్ట్రంలో ఆర్వోబీలు నిర్మాణం సందిగ్ధంలో పడింది. గుజరాత్ తమ వాటా నిధులు మంజూరు చేయనప్పటికీ ఆ రాష్ట్రంలో ఆర్వోబీలను పూర్తిచేశారు. రాష్ట్ర విభజన, కరోనా పరిస్థితులతో రాబడి కోల్పోయిన ఏపీలో మాత్రం రాష్ట్ర వాటా నిధులతో ముడిపెడుతూ పనులు నిలిపివేయడంపై వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధుల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని రైల్వేశాఖ గుర్తించాలని వారు సెప్టెంబర్ సమావేశంలో కోరారు. -
‘హోదా’, విశాఖ రైల్వేజోన్‌పై స్థాయీ సంఘం పట్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం పట్టుబట్టింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యంపై వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సవివర ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఇంకా రైల్వే శాఖ పరిశీలనలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. తీసుకున్న చర్యలపై కమిటీకి నివేదిక అందజేయాలని సూచించింది. అలాగే, రాష్ట్ర విభజన సమయంలో రాజధాని కోల్పోయిన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్లకు తగ్గకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ చర్య సమగ్ర అభివృద్ధికి, వాణిజ్యం, ఎగుమతుల్లో ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది. ‘ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల విస్తరణ’ శీర్షికన రూపొందించిన 164వ నివేదికను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ వి.విజయసాయిరెడ్డి శనివారం వర్చువల్ సమావేశం ద్వారా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు సమర్పించారు. కొత్తగా ఏర్పాటైన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయింపులు పెంచడాన్ని కమిటీ ప్రశంసించింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల స్థాపనకు, ఆర్థికాభివృద్ధికి, ఎగుమతుల పెంపునకు దోహదపడుతుందని పేర్కొంది. ఇదే తరహాలో ఇతర కొత్త రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లకు కూడా తగిన పరిహారం చెల్లించాలని కమిటీ అభిప్రాయపడుతూ.. రాష్ట్రాల విభజన కారణంగా రాజధానులు కోల్పోయిన ఈ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేసింది. విశాఖ జోన్ ఇంకా పరిశీలనలోనా? విశాఖ జోన్‌కు ఇప్పటికే ఆమోదం లభించిందని, డీపీఆర్ ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని, కొత్త జోన్ కార్యాచరణకు కాలపరిమితిని నిర్ణయించలేమని ఆ శాఖ నుంచి సమాచారం వచ్చిందని కమిటీ తెలిపింది. ‘భారతీయ రైల్వేలలో 5వ అత్యధిక ఆదాయాన్ని అందించే డివిజన్ అయిన వాల్తేరు డివిజన్ రద్దుకు కారణాలు అడిగితే విశాఖలో జోనల్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు అవుతున్నందున పరిపాలన ప్రాతిపదికన మాత్రమే విశాఖలో డివి జన్ కేంద్రాన్ని తీసివేశామని రైల్వే శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్ కొనసాగింపు రోజువారీ కార్యకలాపాలలో గానీ, ఈ ప్రాంత దీర్ఘకాలిక రైల్వే అభివృద్ధిలో ఎటువంటి విలువను జోడించదని ఆ శాఖ తెలిపింది. వాల్తేరు డివిజన్‌ను పొరుగున ఉన్న విజయవాడ డివిజన్లో విలీనం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించడం వల్ల వ్యవస్థ సజావుగా సాగుతుందని తెలిపింది. కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నప్పుడు, డివిజన్ కార్యాలయం మినహా విశాఖ కేంద్రంగా ఉన్న ప్రస్తుత రైల్వే వ్యవస్థ చాలా వరకు అలాగే ఉంటుందని, వాల్తేరు డివిజనల్ ఆఫీస్‌తో సహా విశాఖలో ప్రస్తుతం ఉన్న రైల్వే సిబ్బందిలో ఎక్కువ మంది విశాఖలోనే సాధ్యమైనంత వరకు అక్కడే ఉంటారని కమిటీకి సమాచారం అందించింది. పరిపాలనా, కార్యాచరణ అవసరాలతో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు కమిటీకి తెలిపింది’ అని స్టాండింగ్ కమిటీ పేర్కొంది. వాల్తేరు డివిజన్‌ను ముక్కలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామంది. వాల్తేరు డివిజన్‌ను కుదించే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని స్టాండింగ్ కమిటీ రైల్వే మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. మిరప ఎగుమతులకు శీతల గిడ్డంగులు.. గుంటూరు నుంచి ప్రతినెలా 1.80 లక్షల టన్నుల మిరప పంట ఎగుమతి అవుతుందని, వీటికి సాధారణ గిడ్డంగులు కాకుండా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖతో సమన్వయం చేసుకుని గుంటూరు జిల్లాలో తగిన సంఖ్యలో శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని వాణిజ్య శాఖకు కమిటీ సిఫారసు చేసింది. -
బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ మిస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మిస్ అయ్యిందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లు–2021పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొంది ఏడేళ్లయినా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాకారం కాలేదు. వాల్తేరు డివిజన్‌ను కలుపుతూ రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాలను కేంద్ర జల సంఘం రూ.55,656 కోట్లుగా సిఫారసు చేసింది. కానీ కేంద్రం గత ఏడాదిగా దీనిపై చర్య తీసుకోలేదు. విశాఖలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, నిఫ్ట్, ఏపీలో టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ హామీలు కూడా నెరవేరలేదు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ.. కాఫీ ప్లాంటేషన్ పనులను ఉపాధి హామీ పథకం (నరేగా) పనుల నుంచి తొలగించింది. అరకు, పాడేరు కాఫీ పంటలకు ప్రసిద్ధి. నరేగా నుంచి కాఫీ ప్లాంటేషన్ పనులు తొలగిస్తే గిరిజనులకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది? ఎకరాకు రూ.15 వేల చొప్పున వారు నష్టపోతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.120 కోట్ల మేర జీఎస్టీ చెల్లిస్తోంది. ప్రసాదం తయారీ, కాటేజీల అద్దెకు కూడా జీఎస్టీ, సర్వీస్ చార్జ్ వసూలు చేయడం సమర్థనీయం కాదు. హిందువులకు టార్చ్‌బేరర్‌ను అని చెప్పుకునే బీజేపీ వీటిని జీఎస్టీ నుంచి ఎందుకు మినహాయించలేదు?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. చర్చ అనంతరం ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. టీటీడీ సేవలను జీఎస్టీ నుంచి మినహాయించే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
‘విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించండి’
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచి త్వరతగతిన కార్యకలాపాలు ప్రారంభిచవలసిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి. విజయ సాయిరెడ్డి సోమవారం రాజ్యసభ జీరో అవర్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరచిన హామీలలో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కాగా అందుకు అనుగుణంగానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి గత ఏడాది ఫిబ్రవరి 27న అధికారికంగా ప్రకటించారు. విశాఖపట్నంలో టీడీపీకి మరో షాక్ కానీ.. ఈ ప్రకటన వెలువడి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభం కాలేదని తెలిపారు. కొత్త రైల్వే జోన్ వలన అనేక పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు రైలు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతోపాటు, సరుకుల రవాణా ద్వారా ఆర్థికంగా రాష్ట్రానికి ఊతమిచ్చినట్లుతుందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమైతే.. ఏటా 13 వేల కోట్ల రూపాయల ఆదాయంతో ఇది దేశంలోనే అత్యంత లాభదాయక రైల్వే జోన్ అవుతుందని చెప్పారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం వంటి పోర్టులకు సేవలందించడం ద్వారా ఈ రైల్వే జోన్ అత్యధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని తెలిపారు. రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరలో కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా ఆయన కేంద్ర రైల్యే మంత్రికి విజ్ఞప్తి చేశారు. -
విశాఖ రైల్వే జోన్‌పై ఊగిసలాట
విశాఖ రైల్వే జోన్.. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ఒక ముఖద్వారం.. ఉత్తరాంధ్రుల ఐదు దశాబ్దాల పోరాటాల కల.. రాష్ట్ర విభజన హామీల నుంచి విశాఖకు దక్కిన హక్కు.. ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే కొత్త రాజధానికి స్వర్ణాభరణం. అయితే విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగి ఏడాది గడిచినా ఎందుకో పట్టాలు ఎక్కలేదు. 2019 ఫిబ్రవరి 27న అప్పటి రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఏపీలోని గుంతకల్లు, గుంటూరు డివిజన్లు పూర్తిగా, విజయవాడ, వాల్తేర్ డివిజన్లలో కొంత భాగం కలిపి విశాఖ కేంద్రంగా కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌ను ప్రకటించారు. అంతేకాకుండా జోన్ ప్రక్రియను 11 నెలల్లో పూర్తి చేస్తామంటూ మార్చి 8న ఢిల్లీలో మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కొత్త జోన్ ప్రక్రియ కోసం ఓఎస్డీగా ధనంజయులుని నియమించి, దానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించాలని ఆయన్ని ఆదేశించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో కొత్త జోన్ పరిధిలోకి ఏమేమి వస్తాయనేది నివేదిక తయారు చేశారు. డివిజన్లు, కొత్త జోన్ సరిహద్దులు, ఆస్తులు, రైళ్ల వివరాలు, కొత్త కార్యాలయాల ఏర్పాటు, అవసరమైన అధికారులు, సిబ్బంది, మౌలిక వసతులు తదితర వివరాలన్నింటితో నివేదికను గత ఆగస్టులో రైల్వే బోర్డుకు ఓఎస్డీ సమర్పించడం జరిగింది. మొత్తం 3,496 కి.మీ. మేర రైల్వే మార్గాలు, 5,437 కి. మీ. మేర రైల్వే లైన్లు దీని పరిధిలోకి తీసుకొస్తున్నారు. అయితే వాస్తవానికి జోన్ ప్రకటన వెలువడినప్పుడే నెలల వ్యవధిలో విభజన ప్రక్రియ మొదలవుతుం దని అందరూ భావించారు. కానీ ఏడాది కాలం ముగిసినా.. ఉత్తరాంధ్రుల కల ఇంకా నిజం కాలేదు. మరో వైపు అధికాదాయం వచ్చే వాల్తేర్ డివిజన్‌ను రెండుగా చీల్చి వాల్తేర్ రైల్వే జంక్షన్‌ను విజయవాడ డివిజన్లలో చేర్చాలని, పుష్కలమైన మైనింగ్ వనరులద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తున్న కొత్తవలస– కిరండల్ లైన్‌ను ఒడిశాలో ఉన్న రాయగడ జంక్షన్‌తో కలిపి, దాన్ని రాయగడ డివిజన్‌గా చేయటానికి, రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ఉద్యమ కారులు, వాల్తేర్ రైల్వే ఉద్యోగులు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో విశాఖ వాసి ఒకాయన విశాఖ రైల్వే జోన్ వివరాలు కోరుతూ రైల్వే బోర్డుకు ఆర్టీఐ కింద సమాచారం కోరారు. ప్రస్తుతం డీపీఆర్ ఇంకా పరిశీలనలో ఉందని బోర్డు నుంచి వచ్చిన సమాధానం. వాస్తవానికి డీపీఆర్ పరిశీలనలో.. రైల్వే బోర్డుకు పంపిన నివేదికను అందులోని డైరెక్టర్లు పరిశీలించి అభ్యంతరాలు, సూచనలు ఉంటే తెలియజేస్తారు. ఇదంతా పూర్తయ్యాక బోర్డు నుంచి రైల్వే మంత్రికి పంపిస్తారు. ఆయన ఆమోదించిన తర్వాత, ఏ తేదీ నుంచి కొత్త జోన్ అమల్లోకి వస్తుందనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తేదీ నుంచి దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. కొత్త జోన్ అమల్లోకి వచ్చిన తర్వాత జనరల్ మేనేజర్ సహా, ఇతర ఉన్నతాధికారులు, వివిధ విభాగాలకు అవసరమైన కార్యాలయాల నిర్మాణం, క్వార్టర్ల నిర్మాణం తదితరాలు అన్నీ పూర్తి చేసేందుకు కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు. అందుకు దాదాపు రూ. 200 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయని రైల్వే అధికారుల అంచనా. కానీ 2020–21 కేంద్ర బడ్జెట్లో మాత్రం దక్షిణ కోస్తా జోన్‌తో పాటు, రాయగడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త డివిజన్‌కు కలిపి కేవలం రూ. 3 కోట్లు మాత్రమే కేటాయించడంలో పలు అనుమానాలకు తావిస్తోంది. దేశంలో రైల్వేల పరంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఏపీకి ఆ స్థాయికి తగ్గట్టుగా కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దేశంలో అత్యధిక ఆదాయం తెచ్చి పెట్టే వాల్తేర్ డివిజన్ కేంద్రం కూడా ఏపీ లోనే ఉంది. దీనికి తోడు ఏపీలో సహజసిద్ధమైన వనరులు, సౌకర్యాలు ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రంలో కొత్త రైళ్ల కూత ఎందుకు వినిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. యాతం వీరాస్వామి వ్యాసకర్త రచయిత, విశ్లేషకులు మొబైల్ : 95816 76918 -
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు రూ. 4,666 కోట్లు
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో రూ.4,666 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు నిధుల కేటాయింపుల్ని బుధవారం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం వరకు ప్రైవేటు రైళ్లు నడుపుతామని చెప్పారు. రెండు కీలక డబ్లింగ్ ప్రాజెక్టులు ఏపీలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు గతేడాది కేటాయింపులు రూ.2,442 కోట్లు మాత్రమే. ఈ ఏడాది రూ.4,666 కోట్లు కేటాయించారు. అయితే, కొత్త లైన్లకు నిధులేవీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రూ.5,380 కోట్ల అంచనాతో కొత్తగా రెండు డబ్లింగ్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ధర్మవరం–పాకాల–కాట్పాడి (290 కిలోమీటర్లు) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,900 కోట్లు, గుంటూరు–బీబీనగర్ (248 కిలోమీటర్లు) డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.2,480 కోట్లు కేటాయించారు. - నడికుడి–శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్‌కు ఇప్పటివరకు రూ.1,114 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన రూ.1,198 కోట్లతో ఈ రైలు మార్గం పూర్తవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. - కోటిపల్లి–నర్సాపూర్ కొత్త రైలు మార్గానికి రూ.551 కోట్లు కేటాయించారు. దీంతో ఈ పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. - మంగళగిరి–అమరావతి కొత్త లైన్ మార్గానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు. - కడప–బెంగుళూరు కొత్త రైలు మార్గానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. అలాగే గూడూరు–దుగరాజపట్నం రైల్వే లైన్‌కు కూడా నిధులు కేటాయించలేదు. - విజయవాడ–గుడివాడ–మచిలీపట్నం–భీమవరం–నర్సాపురం–నిడదవోలు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ఈ ఏడాది పూర్తి కానున్నాయి. బడ్జెట్లో రూ.1,158 కోట్లు కేటాయించారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతానికి విశాఖపట్నంతో అనుసంధానం పెంచడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. - గుంటూరు–గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.294 కోట్లు కేటాయించారు. - గుత్తి–ధర్మవరం డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ.135 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ప్రాజెక్టు పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. - విజయవాడ–గూడూరు మూడో లైన్ (ట్రిప్లింగ్) పనులకు రూ.664 కోట్లు కేటాయించారు. 2022 నాటికి ఈ పనుల్ని పూర్తి చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. ఆ మేరకు కేటాయింపులు లేకపోవడం గమనార్హం. - విజయవాడ–కాజీపేట ట్రిప్లింగ్ పనులకు రూ.404 కోట్లు కేటాయించారు. - విజయవాడ, రేణిగుంట, గుత్తి బైపాస్ మార్గాలకు రూ.122 కోట్లకు పైగా కేటాయించారు. కర్నూలు మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ ఫ్యాక్టరీకి రూ.30 కోట్లు, తిరుపతి రైల్వే స్టేషన్ రెండో ప్రవేశ ద్వారం అభివృద్ధికి రూ.6 కోట్లు, తిరుచానూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ.11 కోట్లు కేటాయించారు. - ధర్మవరం–పాకాల, నంద్యాల–యర్రగుంట్ల, డోన్–మన్మాడ్ రైలు మార్గాల విద్యుదీకరణకు వరుసగా రూ.25 కోట్లు, రూ.18 కోట్లు, రూ.50 కోట్లు కేటాయించారు. -
జంట నగరాల నుంచి 11 ప్రైవేట్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : జంటనగరాల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే ఈ రైళ్లు ప్రయాణికులకు సేవలందజేయనున్నాయి. మరోవైపు ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు మధ్య తేజాస్ రైలు ప్రవేశపెట్టనున్నారు. చర్లపల్లి టర్మినల్ విస్తరణకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయించగా, ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.40 కోట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన ఘట్కేసర్-యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కేంద్రం ఈ బడ్జెట్లో కేవలం రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం. మొత్తంగా గత నాలుగైదేళ్లుగా కొనసాగుతున్న ప్రాజెక్టులకు కొంతమేరకు నిధులు కేటాయించడం మినహా ఈ సారి ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రతిపాదించలేదు. (కిసాన్ రైలు) ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్ రైళ్లు... ఎయిర్‌లైన్స్ తరహాలో ప్రైవేట్‌రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ట్రాక్‌ల ఏర్పాటు, మరమ్మతులు, నిర్వహణ, రైళ్ల భద్రత,లొకోపైలెట్లు, గార్డులు, సిబ్బంది వంటివి మాత్రమే రైల్వే పరిధిలో ఉంటాయి. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, ఆన్‌బోర్డు సేవలు,రైళ్ల పరిశుభ్రత, వైఫై సేవలు వంటివి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తాయి. ఎయిర్‌లైన్స్ పలు ప్రాంతాలకు ఫ్లైట్ సర్వీసులను నడుపుతున్నట్లుగానే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేట్ రైళ్లు నడువనున్నాయి. టిక్కెట్ల రిజర్వేషన్లు ఆన్లైన్ పరిధిలో ఉంటాయి. రిజర్వేషన్ కేంద్రాల నిర్వహణ పై ఇంకా స్పష్టత రాలేదని జీఎం చెప్పారు. దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేట్ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారమన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరం నుంచి వివిధ మార్గాల్లో ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. చర్లపల్లి టర్మినల్ నుంచి ఈ రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-వారణాసి, చర్లపల్లి-పన్వేల్, లింగంపల్లి-తిరుపతి,సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి-చెన్నై, చర్లపల్లి- షాలిమార్, విజయవాడ-విశాఖ, తిరుపతి-విశాఖ, తదితర ప్రాంతాల మధ్య ప్రైవేట్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. (బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!) అలాగే ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో లింగంపల్లి-గుంటూరు, ఔరంగాబాద్-పన్వేల్ మధ్య తేజాస్ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్లలో కొన్ని డైలీ ఎక్స్‌ప్రెస్‌లుగాను, మరి కొన్ని వారానికి రెండు సార్లు చొప్పున తిరుగుతాయి. కొన్ని రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు గా నడుపుతారు.ఈ రైళ్ల కోసం త్వరలో ఓపెన్ టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే దశలవారీగా వీటిని పట్టాలెక్కేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. 11 రూట్లలో ప్రైవేట్ రైళ్లు చర్లపల్లి-వారణాసి లింగంపల్లి-తిరుపతి చర్లపల్లి-పర్వేలి విజయవాడ-విశాఖపట్టణం చర్లపల్లి-శాలిమార్ ఔరంగబాద్-పన్వెలి సికింద్రాబాద్-గౌహతి చర్లపల్లి-చెన్నయ్ గుంటూరు-లింగంపల్లి ఈ రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే అవకాశం గుంటూరు-లింగంపల్లి ఔరంగబాద్-పన్వెలి చర్లపల్లి-శ్రీకాకుళం -
మన స్టేషన్లో రైలు ఆగలేదు..
సాక్షి, అమరావతి: ఈ బడ్జెట్లో ఏపీ మీదుగా వెళ్లే కొత్త రైళ్ల కూతలేవీ వినిపించలేదు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్‌కు నిధులూ కేటాయించలేదు. ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఏపీకి దక్కలేదు. ఇప్పటికే విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఈ బడ్జెట్లో రైల్వేలపరంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తే, తీరని అన్యాయమే జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతేడాది పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్ల కేటాయింపు గతేడాది (2019 ఫిబ్రవరి) ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రకటించకున్నా.. ఈ నిధుల్ని ఆ తర్వాత కేటాయించారు. సాధారణంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాక దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారన్న వివరాలపై రైల్వే బోర్డు సమాచారమిస్తుంది. ప్రతిసారీలానే ఈ దఫా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజులకు కేటాయింపుల సమాచారాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటనలో.. ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికిగాను అన్ని ప్రాంతాలను కలిపేలా తేజస్ రైళ్లు, రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి వివరాలపై సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ పరిపుష్టికి సంబంధించి అంశాలుంటాయని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. -
బడ్జెట్ రైలు ఆగేనా?
సాక్షి, అమరావతి: పార్లమెంట్లో నేడు రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా కేంద్రం కరుణిస్తేనే పలు కీలక ప్రాజెక్టులు పట్టాలెక్కే అవకాశం ఉంది. దక్షిణ మధ్య రైల్వేలో అధిక శాతం ఆదాయం ఏపీ నుంచే లభిస్తున్నా ఆ మేరకు న్యాయం జరగడం లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా నిధులు, విధులు తేలక అయోమయం నెలకొంది. రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులన్నీ కాస్ట్ షేరింగ్ విధానంలో మంజూరయ్యాయి. రాష్ట్రం తన వాటాగా భూ సేకరణ జరిపి భూమిని అప్పగిస్తే రైల్వే శాఖ నిధులు మంజూరు చేసి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ అంచనా వ్యయం పెరగకముందే నిధులు కేటాయించి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. కోటిపల్లి–నరసాపురం, కడప–బెంగళూరు, డబ్లింగ్ ప్రాజెక్టులు, మూడో లైన్ల పూర్తికి కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సిందే. ఇక 2012, 2013లోనే మంజూరైన భద్రాచలం–కొవ్వూరు, కొండపల్లి–కొత్తగూడెం ప్రాజెక్టులు పూర్తి కావాలంటే నిధులు అత్యవసరం. పట్టాలెక్కని ప్రతిపాదనలు! స్టేషన్ రీ డెవలప్మెంట్ కింద తిరుపతి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, గుంతకల్ స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ గతంలో అంగీకరించింది. విజయవాడను శాటిలైట్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని ఏన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనలున్నాయి. గతంలో గుంతకల్ డివిజన్లో చంద్రగిరి, గుంటూరు డివిజన్లో న్యూ గుంటూరు, ఫిరంగిపురం, విజయవాడ డివిజన్లో రామవరప్పాడు స్టేషన్లను మహిళా స్టేషన్లుగా ప్రకటించారు. మొత్తం మహిళా సిబ్బంది ఈ స్టేషన్లలో విధులు నిర్వహించేలా రైల్వే శాఖ ఆదేశాలిచ్చింది. వీటిని అభివృద్ధి చేయాల్సి ఉంది. కొత్త రైల్వే లైన్లపై కరుణించేనా? నరసరావుపేట–మచిలీపట్నం, కంభం–ఒంగోలు, చిత్తూరు–కుప్పం వయా పలమనేరు, ఓబులవారిపల్లె–వాయల్పాడు రైల్వే లైన్ల సర్వేపై బోర్డు ఏమీ తేల్చడం లేదు. మచిలీపట్నం–బాపట్ల కనెక్టివిటీ కోసం సర్వే చేసి అంచనా వ్యయం రూ.793 కోట్లుగా తేల్చినా నివేదికను పక్కన పెట్టారు. ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలు.. విజయవాడ–దువ్వాడ మధ్య 335 కి.మీ. మేర మూడో లైన్‌ను నిర్మించాలి. విశాఖకు కనెక్టివిటీ పెంచేందుకు 2015–16లోనే రూ.3,873 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించారు. ఈ బడ్జెట్లో మూడో లైన్‌కు నిధులు కేటాయించాలని కోరుతున్నారు. తేజాస్ తరహాలో తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్–విశాఖ మధ్య ప్రైవేట్ రైళ్ల ప్రతిపాదనలున్నాయి. -
జోన్, పెండింగ్ ప్రాజెక్టులపై రైల్వే మంత్రిని కలుస్తాం
-
రైల్వేజోన్‌పై అభ్యంతరాలను అనుమానించాలి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు అభ్యంతరాలు లేవనెత్తడాన్ని అనుమానించాల్సి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కేవలం రాజకీయ కారణాలతోనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా? అని నిలదీశారు. గత ఐదేళ్లలో రైల్వే సాధించిన ప్రగతిపై పీయూష్ గోయల్ శుక్రవారం ఢిల్లీలో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రైల్వేజోన్ ఏర్పాటుపై ఉన్న అభ్యంతరాల గురించి మీడియా ప్రశ్నించగా మంత్రి స్పందిస్తూ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రం గా మండిపడ్డారు. ‘‘చంద్రబాబు కేవలం రాజకీయ కారణాలతోనే రైల్వే జోన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా? ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదా? దీనిపై ఆయన్నే ప్రశ్నించాల్సిన అవసరముంది. రైల్వే జోన్ ఏర్పాటు ప్రకటనకు ముందు నాకు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంపై అనుమానించాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రజాసంక్షేమం పట్టదు కాబట్టి జోన్ ఏర్పాటుపై ఆయన అయిష్టంగానే ఉంటారు’’అని కేంద్రమంత్రి అన్నారు. -
చంద్రబాబుపై ఐవైఆర్ ధ్వజం
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా దీన్ని స్వాగతించాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు హోదా ఇవ్వాలంటూ జిమ్మికులు చేస్తున్నారని విమర్శించారు. -
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్
-
రైల్వే జోన్ వల్ల కలిగే ప్రయోజనాలివే..!
-
వైఎస్సార్సీపీ ఉద్యమాల ఫలితమే ‘రైల్వేజోన్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఇస్తున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌గోయల్ ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో ఏర్పాటవుతున్న ఈ కొత్త రైల్వే జోన్ సాధన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం ఎంతో ఉంది. కేకే లైన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు.. విశాఖ రైల్వే జోన్ కోసం ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. వైఎస్ జగన్ అలుపెరుగని పోరు హోదా, విభజన హామీల అమలు కోసం వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయక ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిపక్ష నేత.. గడిచిన నాలుగున్నరేళ్లుగా హోదా, రైల్వేజోన్ సాధన కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరు సాగిస్తూనే ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారం, హోదా కోరుతూ ప్రధాని సహా కేంద్ర మంత్రులను కలుస్తూ వచ్చారు. ప్రతి వినతిపత్రంలోనూ రైల్వే జోన్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు. విశాఖ నుంచి శ్రీకారం చుట్టిన యువభేరీలలో హోదాతో పాటు ప్రత్యేక రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకు కలిగే ప్రయోజనాలను యువతకు వివరించారు. రైల్వేలో ఉద్యోగాల కోసం పొరుగునున్న భువనేశ్వర్‌కు వెళ్తున్నారని, అక్కడ మన యువతను స్థానికేతరులుగా చూస్తున్నారని, జోన్ వస్తే మన యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని జోన్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఆ తర్వాత జై ఆంధ్రప్రదేశ్ అంటూ విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో కూడా ఉత్తరాంధ్రుల రైల్వే జోన్ కాంక్షపై గళమెత్తారు. ఎన్నో పోరాటాల ఫలితం ఇక ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన ప్రతి పిలుపునకు ఆ పార్టీ శ్రేణులు ఉద్యమ కెరటాలయ్యారు. వైఎస్ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ జిల్లా అ«ధ్యక్షుడిగా పనిచేసిన అనకాపల్లి కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ తన ప్రాణాలను సైతం లెక్కచేయక ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. 2016 ఏప్రిల్ 14న రైల్వే జోన్ సాధన కోసం అమర్నాథ్ ఆమరణ దీక్ష చేపట్టారు. ఏప్రిల్ 17న పోలీసులు దీక్షను భగ్నం చేసినా కేజీహెచ్‌లో సైతం దీక్ష కొనసాగించారు. ఏప్రిల్ 18న పార్టీ అధినేత వైఎస్ జగన్ నేరుగా కేజీహెచ్‌కు వెళ్లి అమర్నాథ్తో దీక్షను విరమింపజేశారు. ఇదే డిమాండ్‌తో అమర్నాథ్ మళ్లీ 2017 మార్చి 30వ తేదీన ఆత్మగౌరవయాత్ర పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అనకాపల్లి నుంచి భీమిలి నియోజకవర్గం తగరపువలస వరకు సుమారు 201 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర ద్వారా రైల్వేజోన్ కాంక్షను బలంగా వినిపించారు. అదే విధంగా పలుమార్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడించారు. రైల్‌రోకోలు, జాతీయ రహదారి దిగ్బంధనాలు, వంటావార్పులంటూ వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తించారు. హోదా కోసం తమ పదవులను తృణప్రాయంగా త్యజించిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా పదిరోజుల పాటు రిలే దీక్షలు చేయగా.. రోజుకో రీతిలో నిరసనలతో హోరెత్తించారు. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, కాగడాల ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, రైల్‌రోకోలు, హైవేల దిగ్బంధనాలు.. ఇలా హోదా, రైల్వే జోన్ల కోసం గర్జించారు. ఏయూ విద్యార్థి సంఘ నేతలైతే ఏకంగా ఐదు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. పాత జైలు రోడ్డులోని ఉమెన్స్ కళాశాల ఎదురుగా చేపట్టిన ఈ వంచన దీక్షలో కూడా రైల్వే జోన్ కోసం గర్జించారు. ఇలా అనేక పోరాటాల ఫలితంగానే విభజన హామీల్లో ఒకటైన రైల్వే జోన్‌ను ఎట్టకేలకు కేంద్రం ప్రకటించింది. ప్రత్యేక హోదాను కూడా సాధించగల సత్తా, సత్తువ, పోరాట స్ఫూర్తి వైఎస్సార్సీపీకి మాత్రమే ఉన్నాయని ఉత్తరాంధ్రవాసులు బలంగా నమ్ముతున్నారు. అలుపెరగని పోరాట యోధుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో హోదా కల కూడా నెరవేరుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు. పాలకుల తీరువల్లే జాప్యం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే పరమావధిగా నాలుగేళ్లకు పైగా పాలకులు వ్యవహరించిన తీరు వల్లే విశాఖ రైల్వే జోన్ రాక ఆలస్యమైంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీని స్వాగతించడంతో పాటు ‘చేయాల్సిన దానికన్నా కేంద్రం ఎక్కువే చేస్తోంద’ని చెప్పుకొచ్చిన రీతిలోనే చంద్రబాబు ఆయన కోటరీ విశాఖ రైల్వేజోన్ విషయంలోనూ వ్యవహరించింది. రాష్ట్రంలో, కేంద్ర మంత్రివర్గాల్లో నాలుగేళ్లకు పైగా అధికారాన్ని పంచుకున్న టీడీపీ, బీజేపీలు విశాఖ రైల్వేజోన్‌ను పక్కదారి పట్టించే యత్నాలు చేశాయి. రైల్వేజోన్ విశాఖలో వద్దు విజయవాడలో ఏర్పాటుచేయాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేయడం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. బీజేపీలోని బాబు అనుకూలురు ఇందుకు వంతపాడారన్న విమర్శలొచ్చాయి. -
రైల్వే జోన్‌కు గ్రీన్ సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన జరిగి దాదాపు నాలుగేళ్ల 9 నెలలు గడుస్తున్న సమయంలో ఏపీకి ఎట్టకేలకు కేంద్రం తీపి కబురు అందించింది. విశాఖ కేంద్రంగా ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. తద్వారా దేశంలో 18వ రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు రెండు రోజుల ముందు రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడటం గమనార్హం. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ బుధవారం రాత్రి రైల్వే భవన్లో రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వాల్తేరు డివిజన్‌ను రెండుగా విడగొట్టి జోన్ ‘విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చాం. కొత్త రైల్వే జోన్‌ను ‘దక్షిణ కోస్తా రైల్వే (ఎస్సీఓఆర్)’గా వ్యవహరిస్తారు. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో కలిపి ఈ రైల్వే జోన్ ఉంటుంది. వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని (ఏపీ పరిధిలోది) విజయవాడ డివిజన్లో విలీనం చేయడం ద్వారా నూతన రైల్వే జోన్ కిందికి తెస్తాం. వాల్తేరు డివిజన్లోని మిగిలిన భాగాన్ని (ఒడిశా ప్రాంతంలోది) రాయగడ కేంద్రంగా నూతన డివిజన్‌గా ఏర్పాటు చేస్తాం. అది తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉంటుంది. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ డివిజన్లతో కూడుకుని ఉంటుంది’ అని రైల్వే మంత్రి ప్రకటించారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఎప్పటిలోగా ఉనికిలోకి వస్తుందన్న మీడియా ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ ‘రైల్వే బోర్డు, రైల్వే శాఖ కలసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. తదుపరి విధానపరమైన ప్రక్రియ కొనసాగుతుంది..’ అని పేర్కొన్నారు. అది మినహా రైల్వే జోన్‌కు సంబంధించిన ఇతర ప్రశ్నలపై మంత్రి స్పందించలేదు. ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు.. దేశంలో ఇప్పటివరకు 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రైల్వే డివిజన్ల విస్తృతి, పరిమాణం, పనిభారం, అవకాశం, ట్రాఫిక్, పాలన అవసరాల అధారంగా రైల్వే జోన్లు ఏర్పాటు చేశారు. చివరిగా 2003–04లో రైల్వే జోన్లను పునర్ వ్యవస్థీకరించారు. ప్రస్తుతం ముంబై కేంద్రంగా సెంట్రల్ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా ఈస్టర్న్ రైల్వే, హజీపూర్ కేంద్రంగా ఈస్ట్ సెంట్రల్ రైల్వే, భువనేశ్వర్ కేంద్రంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే, న్యూఢిల్లీ కేంద్రంగా నార్తర్న్ రైల్వే, అలహాబాద్ కేంద్రంగా నార్త్ సెంట్రల్ రైల్వే, గోరఖ్‌పూర్ కేంద్రంగా నార్త్ ఈస్టర్న్ రైల్వే, గౌహతి కేంద్రంగా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, జైపూర్ కేంద్రంగా నార్త్ వెస్టర్న్ రైల్వే, చెన్నై కేంద్రంగా సదరన్ రైల్వే, సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే , కోల్‌కతా కేంద్రంగా సౌత్ ఈస్టర్న్ రైల్వే, బిలాస్పూర్ కేంద్రంగా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, హుబ్లీ కేంద్రంగా సౌత్ వెస్టర్న్ రైల్వే, ముంబై కేంద్రంగా వెస్టర్న్ రైల్వే, జబల్పూర్ కేంద్రంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే, కోల్‌కతా కేంద్రంగా మెట్రో రైల్వే జోన్లు పని చేస్తున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే 18వ జోన్ కానుంది. ద.మ. రైల్వేలో ఆరు డివిజన్లు... సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో 6 డివిజన్లు ఉన్నాయి. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు తాజాగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి వెళతాయి. కొత్త రైల్వే జోన్ పరిధిలో జోనల్ స్థాయి రైల్వే ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రాలు, రైల్వే పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. మోదీకి జీవీఎల్, బీజేపీ నేతల ధన్యవాదాలు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటిస్తూ ప్రధాని మోదీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రధాని విశాఖ వస్తున్న సందర్భంగా మరిచిపోని కానుక వచ్చింది. దీనివల్ల ఉద్యోగ అవకాశాలతోపాటు రైళ్ల లభ్యత కూడా సులభం కానుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు కానుంది’ అని పేర్కొన్నారు. నెహ్రూ యువ కేంద్రం జాతీయ వైస్ ఛైర్మన్ విష్ణువర్దన్‌రెడ్డి, బీజేపీ సమన్వయకర్త పి.రఘురాం బుధవారం రాత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. దశాబ్దాల కల నెరవేర్చిన మోదీ: కన్నా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడం ద్వారా ప్రధాని మోదీ దశాబ్దాల ఆంధ్రుల కలను నెరవేర్చారంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. ఎవరెంత దుష్ప్రచారం చేసినా ఏపీ అభివృధ్ధే బీజేపీ లక్ష్యమని మరోసారి నిరూపించారన్నారు. ప్రజల పోరాట ఫలితం: రఘువీరారెడ్డి విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఐదు కోట్ల మంది ప్రజల పోరాట ఫలితమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని విశాఖ పర్యటనలో ప్రజలు తీవ్ర నిరసన తెలపడానికి సిద్ధపడటంతో హడావిడిగా ఈ ప్రకటన చేశారన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే తరుణంలో రైల్వే జోన్ ప్రకటించడం వల్ల ఏం ఒరుగుతుందని ప్రశ్నించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత జోన్ పనుల బాధ్యతను తమ పార్టీ తీసుకుంటుందన్నారు. -
విశాఖ రైల్వే జోన్ : ఏంపీ హరిబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
-
రైల్వే జోన్‌పై చర్చలో రచ్చరచ్చ
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బీజేపీ ఎంపీలు, తెలుగుదేశం నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరినొకరు దూషించుకున్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై చర్చించడానికి టీడీపీ మంత్రులు కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, సుజయ్‌కృష్ణా రంగారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు మంగళవారం రాత్రి ఢిల్లీలోని పీయూష్ గోయల్ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, కంభంపాటి హరిబాబు కూడా రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు కేంద్ర మంత్రి కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకరికొకరు తారసపడడంతో అందరూ కాసేపు ముచ్చటించుకున్నారు. తాము కేంద్ర మంత్రితో రైల్వే జోన్ అంశంపై చర్చించేందుకు వెళ్తున్నామని, మీరు కూడా రండి అంటూ బీజేపీ ఎంపీ హరిబాబును టీడీపీ ఎంపీ సుజనా చౌదరి ఆహ్వానించారు. తాము కూడా ఇదే అంశంపై చర్చించేందుకు వచ్చామని హరిబాబు చెప్పారు. తర్వాత కేంద్ర మంత్రితో టీడీపీ నేతల సమావేశం సందర్భంగా బీజేపీ ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. జోనూ లేదు.. గీనూ లేదు అని వీడియో టేపులో దొరికిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు గడచిపోయాయని, విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జీవీఎల్‌ను ఎందుకు పిలిచారు? టీడీపీ ఎంపీలు అవంతి శ్రీనివాస్, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మాట్లాడిన తరువాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ఆయన రైల్వే జోన్‌పై మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆయనపై మాటల యుద్ధానికి దిగారు. అసలు జీవీఎల్‌ను ఎందుకు పిలిచారంటూ టీడీపీ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎంపీ హరిబాబు కల్పించుకుని సుజనా చౌదరి పిలిస్తేనే ఈ సమావేశానికి వచ్చామని చెప్పారు. దీనికి సుజనాచౌదరి అంగీకరించారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాగా, ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, జోన్ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని చెప్పారు. -
టైం దగ్గర పడింది.. త్వరలోనే చరమగీతం
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
ఎంపీలు ఒత్తిడి తెస్తే ‘జోన్’ ఖాయం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఎంపీలు సహకరిస్తే విశాఖ రైల్వే జోన్ త్వరగా వస్తుందని రైల్వే బోర్డు మెంబర్ జాన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేకు అధిక కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు వెయ్యి కోట్లు అవసరం ఉంటుందని, జోన్ నిర్ణయం జరిగితే ఈ బడ్జెట్లో కొంత కేటాయింపులు జరుగుతాయని వివరించారు. జోన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ విశాఖ ఎంపీలు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవడం లేదని, వారు ఒత్తిడి తెస్తే జోన్ సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎంపి హరిబాబు బోర్డు వద్ద జోన్ అంశం ప్రస్తావనకు తేలేదని, వేరే సమస్యలు తప్ప విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కోసం ఆయన కూడా మాట్లాడటం లేదని ఆయన అన్నారు. -
రైల్వేజోన్ కోసం ఆత్మార్పణ
- ఆవేదనతో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్రాణత్యాగం - జోన్ కోసం పోరాడాలని సీఎంకు లేఖ సాక్షి, విశాఖపట్నం/ పెదగంట్యాడ: విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంతో నిరుద్యోగులు ఉపాధి లేక రోడ్డున పడుతున్నారని, వారి జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన చెందుతూ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం చంద్రబాబు పేరిట లేఖ రాసి తనువు చాలించాడు. ఈనెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పెదగంట్యాడ యాతపాలేనికి చెందిన పీఎస్డీ ప్రసాద్ (32) 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు. విశాఖకు రైల్వే జోన్ వస్తే తనలాంటి వారికిఉద్యోగావకాశాలు లభిస్తాయని తరచూ స్నేహితులతో చెబుతూ ఉండేవాడు. ప్రసాద్‌కు ఉద్యోగం లేదన్న కారణంతో భార్య కూడా అతనికి దూరమైంది. ఈ నేపథ్యం లోనే విశాఖకు రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ ఇంజినీరింగ్‌లో తన క్లాస్మేట్, అనకాపల్లి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఇటీవల చేపట్టిన పాదయాత్రలోనూ ప్రసాద్ పాల్గొన్నాడు. జోన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేదన్న భావనతో విరక్తి తో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ నెల 7న నగరంలోని మర్రిపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి మరణించాడు. ఆ సమయంలో ఆయన వద్ద ఉన్న లేఖను రైల్వే పోలీసులు మాయం చేసారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. -
ఏపీ కోసం అడిగింది నేనొక్కడినే: వెంకయ్య
విశాఖపట్నం: ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీకి ఏం కావాలో పార్లమెంట్లో అడిగిన వ్యక్తిని నేనొక్కడినే.. విభజన అంశాలపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏం చేశారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినందునే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాం. విశాఖకు త్వరలోనే రైల్వేజోన్ వస్తుంది. టీడీపీ, బీజేపీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. -
రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా?
-
రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా?
విశాఖపట్నం: సీఎంగా చంద్రబాబు, గవర్నర్ గా నరసింహన్ పనికిరారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పూనుకుంటే గవర్నర్ ఏవిధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. నరసింహన్ కు గవర్నర్ పదవిలో కొనసాగే హక్కులేదని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఏవిధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రెండుమూడు పర్యాయాలు స్పీకర్ కు ఫిర్యాదు చేశామని.. న్యాయస్థానం, రాష్టప్రతిని ఆశ్రయిస్తామని తెలిపారు. చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగంపై ఆయనకు గౌరవం లేదని ధ్వజమెత్తారు. అప్రజ్వామిక చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని, మూల్యం చెల్లించుకోక తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖ రైల్వే జోన్ కోసమే తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని తెలిపారు. యాత్ర 9వ తేదీన ముగింపు సభకు వైఎస్ జగన్ హాజరవుతారని ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 30న గుడివాడ అమర్నాథ్ ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
'ఆంధ్రప్రదేశ్‌పై చాలా అంచనాలున్నాయి'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ భవిష్యత్ కోసం స్పష్టమైన ప్రణాళికలు వేస్తున్నామని, తమకు ఏపీపై ఎన్నో కోరికలున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు వెల్లడించారు. ఇందుకోసం బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చే రెండేళ్లలో ఇప్పుడున్న స్థితికంటే అనేక రెట్ల అధిక దృష్టిని కేంద్రీకరించబోతోందన్నారు. మార్చి 11 నుంచి దీనిపై కసరత్తు ప్రారంభిస్తామని తెలిపారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్ తమ రాజకీయ భవిష్యత్‌తో ముడిపడి ఉందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీకి రైల్వే జోన్‌పై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాక రైల్వే మంత్రి సురేష్‌ప్రభు ప్రకటన చేస్తారని చెప్పారు. అయితే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దేశవాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వానికి ప్రజాదరణ పెరుగుతోందని, పెద్ద నోట్ల రద్దు తర్వాత మహరాష్ట్ర, గుజరాత్, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ బీజేపీయే అధికారం చేజిక్కించుకుంటుందని దీమా వ్యక్తంచేశారు. -
పరిశీలనలో విశాఖ రైల్వే జోన్
రైల్వే బోర్డు సభ్యులు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అంశం ఇంకా తమ పరిశీలనలోనే ఉందని రైల్వే బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.శుక్రవారం తెలుగు మీడియా ప్రతినిధులతో బోర్డు సభ్యులు మాట్లాడారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై బోర్డు సభ్యులు స్పందిస్తూ.. ‘రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఏపీకి ఏం లాభం? జోన్ ఏర్పాటు వల్ల ఏపీకి ఉద్యోగాలు కానీ, ఆదాయం కానీ రాదు కదా? అని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైల్వే బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయిలో ఓ కమిటీ ఏర్పాటైందని చెప్పారు. భువనేశ్వర్ – మైసూర్, హౌరా – యత్వంత్‌పూర్ మధ్య నడిచే అంత్యోదయా రైళ్లకు ఏపీలో పలుచోట్ల హాల్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీకి రాజధాని రైలును ఎప్పుడు కేటాయిస్తారని ప్రశ్నించగా.. ‘ముందు మీ రాష్ట్ర రాజధాని నిర్మాణం పూర్తి కానివ్వండి.. తర్వాత మా రాజధాని రైలును కేటాయిస్తామ’ని సభ్యులు చమత్కరించారు. -
విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ పాదయాత్ర
విశాఖపట్నం : విశాఖ రైల్వేజోన్ కోసం పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్లో విశాఖ రైల్వేజోన్ ప్రకటన లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు. మార్చి 9లోగా విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొత్స డిమాండ్ చేశారు. కేంద్రం రైల్వేజోన్‌పై ప్రకటన చేయకుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో అనకాపల్లి నుంచి భీమిలీ వరకు 65 కి.మీ. పాదయాత్ర చేపడతామన్నారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల మనోభావాలను చంద్రబాబు పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ కేటాయించకున్నా సీఎం చంద్రబాబు స్వీట్లు పంచుకోవడం దారుణమన్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా టీడీపీ నేతలు కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై బాబు సర్కార్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టారని దుయ్యబెట్టారు. పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోదాపై ప్రశ్నిస్తే కమిటీ వేశామని చెప్పడం బాధాకరమని బొత్స అన్నారు. విశాఖ ఉత్సవ్ పండుగ కాదు ఒక జాతర అన్నారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్, జిల్లాకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. -
విశాఖ రైల్వేజోన్ కోసం వైఎస్సార్సీపీ పాదయాత్ర
-
'విశాఖ రైల్వేజోన్‌పై మార్గాలు అన్వేషిస్తున్నాం'
ఢిల్లీ: విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ...రైల్వేజోన్ అంశంపై నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సురేష్ ప్రభు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే రాష్ట్రాలకు రెండింతలు బడ్జెట్‌ను పెంచామన్నారు. ప్రతి రోజుకు 7.8 కిలో మీటర్ల బ్రాడ్‌గేజ్ నిర్మాణం చేస్తున్నామని.. దీన్ని 19 కి.మీ వరకు పెంచడం తమ లక్ష్యమని ఆయన తెలిపారు. -
'ఏపీకి రైల్వేజోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ....కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని వారు సురేష్ ప్రభుకు ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆ భేటీ అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తే ఏపీకి నష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పి.మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసుకు భయపడి కేంద్రంతో చంద్రబాబు రాజీ పడుతున్నారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి బాబు మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విభజన హామీలు అమలు కాకపోతే ప్రజాస్వామ్యానికి విలువేంటి అని కేంద్రప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. -
మోదీ అపాయింట్మెంట్ అడిగితే... హరిబాబు చిందులు
విశాఖపట్నం: అఖిలపక్షంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభంపాటి హరిబాబు ఆదివారం న్యూఢిల్లీలో చిందులేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయను అని కరాఖండిగా స్పష్టం చేశారు. అయినా పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినవన్నీ అమలు చేయాలని ఉందా అంటూ అఖిలపక్షంలో పాల్గొన్న ఎంపీలపై హరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదివారం పార్లమెంట్ లైబ్రరీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలకు చెందిన లోక్‌సభలో ఆ పార్టీ నేతలు అయిన ఎంపీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వస్తున్న ఎంపీ హరిబాబును ఏపీ ఎంపీలు కలిశారు. రైల్వే జోన్ వ్యవహారం ఎటు తేలకుండా ఉందని... ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు అని ఈ సందర్భంగా హరిబాబుకు ఎంపీలు గుర్తు చేశారు. దీంతో ఆయన స్పందన పైవిధంగా ఉంది. విశాఖపట్నంకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ గట్టిగా వినబడుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లాకు అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. అయినా ప్రభుత్వం నుంచి కించిత్ స్పందన కూడా లేదు. ఈ అంశంపై టీడీపీ నేతలు కూడా సరైన రీతిలో స్పందించడం లేదు. -
'ప్రాణాలు కాదు.. సాధించిన అభివృద్ధే శాశ్వతం'
విశాఖపట్నం : ఉన్నత ఆశయం కోసం దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అభినందనీయుడని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రాణాలు శాశ్వతం కాదని... సాధించిన అభివృద్దే శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ కోసం గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది.ఈ నేపథ్యంలో ఈరోజు అమర్నాథ్ను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సందర్శించారు. ఆయన తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా రైల్వే జోన్‌పై చర్చ జరుగుతోందన్నారు.ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేసిన విశాఖ ఉక్కు సాధించుకున్న నాడే రైల్వే జోన్ కూడా రావాల్సింది అని ఆయన పేర్కొన్నారు. విశాఖకు రైల్వే జోన్ అంటూ బీజేపీ వాగ్దానమే కాదు... తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం సాధించుకుందంటూ బీజేపీపై ఉమ్మారెడ్డి నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఆ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని... అలాంటప్పుడు రైల్వే జోన్‌పై ఆ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అని ప్రశ్నించారు. 2003లో 9 రైల్వే జోన్లు ప్రకటించినప్పుడు ఏ పార్టీలు లేవని... అలాగే కమిటీలు కూడా లేవన్నారు. కానీ ఇప్పుడే ఆ కమిటీలు వచ్చాయన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో గుడివాడ అమర్నాథ్కి సంఘీభావం తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశాఖకు వస్తున్నారని ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు చెప్పారు. -
రైల్వే జోన్ వస్తే రాష్ట్రానికి మేలు: బొత్స
రాజకీయ నిర్ణయం తీసుకోవాలి.. విభజన చట్టం హామీని అమలు చేయాలి రౌండ్‌టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ నేత బొత్స విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ రాష్ట్రానికి... రాష్ట్ర ప్రజలకు... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకే కాదు.. రాష్ట్రం మొత్తానికి మేలు జరుగుతుంది ఆయన అన్నారు. బుధవారం విశాఖ ఆంకోసా హాలులో రైల్వే జోన్ సాధనకు 'రైల్వే జోన్ మన హక్కు-స్ఫూర్తి విశాఖ ఉక్కు' అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మోదీ మంత్రి వర్గంలోని వెంకయ్యనాయుడు విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విభజన చట్టం లేదన్నారు.. మరి రైల్వే జోన్ చేర్చారు కదా? ఎందుకు అమలు చేయడం లేదు? పైగా రాష్ట్ర శాసనసభలోనూ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జోన్‌పై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదు. తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఆ పేరు మీకే వస్తుంది. ఆ లబ్ది మీరే పొందండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొత్స సూచించారు. గతంలో ఏర్పాటు చేసిన రైల్వే జోన్లు రాజకీయ కోణంలో చేసిన వేనవేనని ఆయన గుర్తు చేశారు. విశాఖ జోన్‌పై కూడా ఎలాంటి సాకులూ చెప్పకుండా రాజకీయ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు, టీడీపీ మంత్రులు, ఎంపీల మాట చెల్లుబాటవుతుందని, ఒత్తిడి చేసి జోన్ తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు జోన్‌పై ఇదిగో, అదిగో అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రైళ్లను అడ్డుకోవడం, ఉద్యమాలు, ఆందోళనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకముందే జోన్ ప్రకటించాలని సూచించారు. జోన్ కోసం కార్యాచరణ రూపొందించాలని కోరారు. జోన్ సాధన కోరుతూ ఈ నెల 14 నుంచి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రైల్వే జోన్ సాధనకు గిరిజనులు అండగా ఉంటారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వే జోన్ ఇచ్చి తీరాలన్నారు. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా జోన్ ఇవ్వలేదన్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాల మద్దతు కలిపి 14న విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రైల్వే జోన్ సాధనకు నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. ప్రజాస్పందన అధ్యక్షుడు, రిటైర్డు ఐఈఎస్ అధికారి సీఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల్లోపు విశాఖకు ఇస్తామన్న రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. స్థానిక ఎంపీ హరిబాబు జోన్ వస్తుందంటూ రెండేళ్లుగా మోసం చేసినందుకు ఎంపీ హరిబాబుపై అవిశ్వాసం పెట్టడానికి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. హరిబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, కర్రి సీతారామ్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీపీఐ కార్యదర్శి పైడిరాజు, లోక్‌సత్తా నేత భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియన్ జోనల్ కార్యదర్శి చలసాని గాంధీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణయాదవ్, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, పార్టీ జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, ఏయూ ప్రొఫెసర్లు బాబీవర్థన్, జాన్, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
అసెంబ్లీని బర్తరఫ్ చేసి మళ్లీ...
విశాఖపట్నం : విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. లేకుంటే ఏప్రిల్ 14వ తేదీన నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం విశాఖలోని ఎన్ఏడీ కొత్తరోడ్డులో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణ, మళ్ల విజయప్రసాద్, ధర్మాన కృష్ణదాసు, కర్రి సీతారం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నైతిక విలువలు కోల్పోయారని ఆరోపించారు. అసెంబ్లీని బర్తరఫ్ చేసి మళ్లీ ప్రజల్లోకి వచ్చి గెలవాలని డిమాండ్ చేశారు. -
'ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదు'
విశాఖపట్నం : విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 14వ తేదీన విశాఖ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని కేంద్రాన్ని హెచ్చరించారు. బుధవారం విశాఖపట్నంలో విలేకర్లతో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ... విశాఖ రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేని కేంద్రమంత్రి వెంకయ్యకు ఆంధ్రుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిచేదని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి సంస్థ ప్రస్తుతం రైతులకు రూ. 75 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెల 30వ తేదీలోగా రైతులకు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. -
విశాఖకు ఈసారైనా వచ్చేనా ?
రైల్వే జోన్‌పై సర్వత్రా ఉత్కంఠ గత ఏడాది హామీలు అరకొరగా అమలు బడ్జెట్లో వాల్తేరుకు ఏమిస్తారో? విశాఖపట్నం : తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ అతిపెద్ద ఆదాయ వనరు. రైల్వే జోన్ మొత్తమ్మీద వచ్చే అదాయంలో సగానికి పైగా ఈ డివిజన్ నుంచే వస్తోంది. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు, సరకు రవాణా ద్వారా వాల్తేరు డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. ఒక్క సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షలు తెస్తోంది. అయినా విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్‌కు కేంద్రం నుంచి స్పందన లేదు. ఏళ్ల తరబడి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన చట్టంలోనూ వాల్తేరు జోన్ ఏర్పాటు అంశాన్ని పేర్కొనడంతో 2015 రైల్వే బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించినా ఫలితం లేదు. జోనే కాదు.. గత బడ్జెట్లో ప్రకటించిన డివిజన్ అభివృద్ధి పనులకు కూడా సహకరించడం లేదు. దీంతో వాల్తేరు డివిజన్ రైల్వేకి బంగారు బాతుగుడ్డులా ఆదాయం తెచ్చిపెట్టడానికే తప్ప జోన్ ఏర్పాటుకు, అభివృద్ధికి నోచుకోవడం లేదు. టీడీపీ మద్దతునిస్తున్న బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, ఆ రెండు పార్టీల ఎంపీలే ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవలే కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు కలిశాక జోన్ వచ్చేస్తోందంటూ కేంద్రంలోని టీడీపీ మంత్రులు తెగ హడావుడి చేశారు. గురువారం ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్లోనైనా జోన్ కల సాకారం చేస్తారా? మళ్లీ మొండి చేయే చూపిస్తారా? విశాఖకు ఎలాంటి వరాలు కురిపిస్తారోనన్న ఆసక్తి ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎందుకీ వివక్ష... విశాఖపట్నం డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా చేయడానికి అవసరమైన అన్ని అర్హతలున్నాయి. కానీ విశాఖ కంటే తక్కువ వనరులు, డివిజన్లున్న ఇతర రాష్ట్రాల్లో రైల్వే జోన్లు ఏర్పాటు చేసేశారు. పైగా ఏ కమిటీలు వేయకుండానే ఆయా రాష్ట్రాల్లో జోన్లు ఏర్పాటు కాగా, విశాఖ జోన్ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ఓ కమిటీ వేసి కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఉదాహరణకు చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్, బిలాస్పూర్ డివిజన్లు ఉన్నాయి. కానీ అక్కడ బిలాస్పూర్ డివిజన్ ఇచ్చారు. తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లుండగా హైదరాబాద్ జోన్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో హుబ్లి, మైసూర్, బెంగళూరు డివిజన్లుండగా హుబ్లి డివిజన్ ఇచ్చారు. ఒడిశాలో సంబల్పూర్, ఖుర్దా డివిజన్లకు భువనేశ్వర్‌లో జోన్ ఏర్పాటు చేశారు. కానీ విశాఖకు (విశాఖ, గుంతకల్లు, గుంటూరు, విజయవాడ) నాలుగు డివిజన్లు ఉన్నా జోన్‌కు నోచుకోవడం లేదు. అర్ధశతాబ్దంగా.. విశాఖపట్నానికి జోన్ ఏర్పాటు డిమాండ్ ఈనాటిది కాదు.. దాదాపు 50 ఏళ్ల క్రితం అప్పటి లోక్‌సభ సభ్యుడు తెన్నేటి విశ్వనాథం తొలిసారిగా పార్లమెంటులో జోన్ డిమాండ్‌ను లేవనెత్తారు. అప్పట్నుంచి జోన్ కోసం ఉద్యమాలు, ఆందోళనలు చేస్తున్నా అవేమీ కేంద్రం చెవికెక్కడం లేదు. యూపీఏ ప్రభుత్వం 2013 మార్చిలో విశాఖకు రైల్వే జోన్‌పై ఓ కమిటీ వేసింది. ఆ నివేదికపై అతీగతీ లేదు. అంతేకాదు.. 2003కి ముందు దేశంలో 9 జోన్లుండేవి. అవి కాలక్రమంలో 17 జోన్లకు పెరిగాయి. కానీ వాటికేమీ కమిటీలు వేయలేదు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయంతో అవి ఏర్పడిపోయాయి. కానీ విశాఖకు జోన్ విషయానికి వచ్చేసరికి ఏటేటా ఏవేవో కారణాలతో వాయిదాలు వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 3, ముంబైలో రెండు జోన్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క జోన్ కూడా లేదు. ఆదాయం ఘనం...అభివృద్ధి శూన్యం తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా ఆదాయం ఏటా సుమారు రూ.11 వేల కోట్లు. ఇందులో దాదాపు సగం అంటే రూ.6,500 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12-14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న పోర్టు ట్రస్టు, మరొక ప్రయివేటు పోర్టు, అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్ వంటివి ఇక్కడే ఉన్నాయి. గత బడ్జెట్ హామీలదీ అదే దారి.. వడ్లపూడి వ్యాగన్ పీవోహెచ్ వర్క్‌షాపునకు రూ.213.71 కోట్లు కేటాయించారు. కానీ రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో సర్వే, డ్రాయింగ్ పనులు పూర్తి చేశారు. ట్రాక్‌ల నవీకరణకు రూ.299 కోట్లు కేటాయించినా నిధులు మంజూరు కాలేదు. వాల్తేరు డివిజన్లో అభివృద్ధి పనులకు రూ.695 కోట్లు ప్రకటించారు. కానీ అరకొర నిధులతో డీజిల్ షెడ్లు, ప్లాట్ఫారం అభివృద్ధి వంటి కొద్దిపాటి పనులు జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్లో వైఫై సదుపాయం కల్పిస్తామని ప్రకటించినా నేటికీ అమలు కాలేదు. రైళ్ల ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఆధునికీకరణ పనులకు రూ.17.78 కోట్లు 335 కిలోమీటర్ల దువ్వాడ-విజయవాడ కొత్త సర్వే లైన్‌కు 3.34 కోట్లు, దువ్వాడ-విజయవాడ లైను కొత్త పనులకు రూ.76.60 కోట్లు గత బడ్జెట్లో ప్రకటించారు. కానీ వాటికీ అరకొర నిధులే విడుదల చేశారు. ప్రధాన డిమాండ్లు/ప్రతిపాదనల్లో కొన్ని.. విశాఖను ప్రత్యేక రైల్వే జోన్‌గా ఏర్పాటు చేయాలి. విశాఖ నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రికి ఈఎంయూ రైళ్లు న డపాలి. కొత్త రాజధాని నేపథ్యంలో విశాఖపట్నం-విజయవాడకు పగలు, రాత్రి మరో నాలుగు రైళ్లు నడపాలి. విశాఖ వచ్చే రైళ్లు ఔటర్‌లోనే నిలిచిపోతున్నందున మరో రెండు ట్రాక్‌లు నిర్మించాలి. తిరుపతికి రోజూ మరిన్ని రైళ్లు నడపాలి. రిజర్వేషన్ కేంద్రాల సంఖ్యను పెంచాలి. విశాఖలో రైల్వే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి. విశాఖ-హైదరాబాద్ దురంతో వారానికి మూడుసార్లకు బదులు రోజూ నడపాలి విశాఖ-ఢిల్లీ మధ్య నడిచే రైళ్ల సమయం తగ్గించాలి. విశాఖ-తిరుపతి మధ్య గరీబ్థ్,్ర విశాఖ-వారణాశి మధ్య ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలి. అయ్యప్ప భక్తుల కోసం విశాఖ నుంచి కేరళకు ఎక్స్‌ప్రెస్ వేయాలి. విశాఖ-బెంగళూరు, విశాఖ-తిరుపతి, విశాఖ షిర్డీలకు డైలీ రైళ్లు నడపాలి. గోపాలపట్నం-విశాఖ స్టేషన్ల మధ్య మూడో లైన్ వేస్తే స్టేషనుకు వచ్చే ప్రయాణికుల నిరీక్షణ తప్పుతుంది. విశాఖ కేంద్రంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)ను ఏర్పాటు చేయాలి. విశాఖ-ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయమే ఢిల్లీ చేరేలా వేళలు మార్చాలి. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే.. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పట్టించుకోకపోవడం వల్లే విశాఖపట్నానికి ప్రత్యేక జోన్ రావడం లేదు. రైల్వే సమస్యలపై వారికి అవగాహనే కాదు.. చిత్తశుద్ధి కూడా లేదు. సీఎం చంద్రబాబు జోన్ కోసం గట్టిగా మాట్లాడడం లేదు. చాన్నాళ్లుగా జోన్ కోసం ఉద్యమిస్తున్నా ఇటీవల ఐఎఫ్ఆర్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చినప్పుడు గాని, అంతకుముందు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వచ్చిన కేంద్రమంత్రులతో గాని సీఎం, మంత్రులు, ఎంపీలు కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేదు. ప్రతిసారీ కేంద్ర ైరె ల్వే బడ్జెట్ సమయంలో ఒడిశా రాష్ట్రం అడ్డుపడుతోందంటూ తప్పించుకుంటున్నారు. వచ్చే రైల్వే బడ్జెట్లో విశాఖకు రైల్వే జోన్‌తో పాటు విశాఖ-విజయవాడల మధ్య ఉదయం, రాత్రి వేళల్లో అదనంగా రెండేసి రైళ్లు నడపాలి. కొత్తరాజధానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరగనున్నందున ఈ నిర్ణయం తీసుకోవాలి. శతాబ్ది, డబుల్ డెక్కర్ రైళ్లను విశాఖ-విజయవాడల మధ్య నడపాలి. విశాఖ నుంచి రాజమండ్రి, పలాసలకు కొత్తగా ఈఎంయూలు వేస్తే అక్కడ నుంచి వచ్చే కూరగాయలు, పండ్లు, ఇతర సరకులు చౌకగా విశాఖవాసులకు అందుతాయి. గత బడ్జెట్లో పేర్కొన్న వ్యాగన్ వర్క్‌షాపుకు నిధులు విడుదల చేయక అడుగు ముందుకు పడలేదు. -చలసాని గాంధీ, ప్రధాన కార్యదర్శి, ఈకో రైల్వే శ్రామిక్ యూనియన్ -
రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్
విశాఖపట్నం: తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు. గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా సౌత్‌సెంట్రల్, ఈస్ట్‌కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు. -
త్వరలోనే విశాఖ రైల్వే జోన్
విజయవాడ: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ లాంఛనాలన్నీ పూర్తి చేస్తోందని, త్వరలోనే ప్రకటన విడుదలవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జోన్ వచ్చిన తరువాత కొత్త రైళ్లు సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం నుంచి ప్రారంభించడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎక్కువ ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం, తిరుపతిల నుంచి బోగీలను తెచ్చి విజయవాడలో రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు కలిపి ఇక్కడ నుంచి నడపాలనే ప్రతిపాదన సరికాదని, బోగీలు రావడం ఆలస్యమైతే రైలు బయలుదేరడం ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. -
‘అనుబంధం’లోనైనా న్యాయం చేయండి
న్యూఢిల్లీ: రైల్వే అనుబంధ(సప్లిమెంటరీ) బడ్జెట్లోనైనా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని రాజ్యసభ ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ నిరాశజనకంగా, అసంతృప్తిగా ఉందన్నారు. 18 ఏళ్లు ఎంపీగా ఉన్న తాను ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణలోని 29 పెండింగు ప్రాజెక్టుల విషయంలో కమిటీ నిర్ణయం తర్వాత అనుబంధ బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యమివ్వాలని రైల్వే శాఖను కోరారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు.