
ఏపీ కోసం అడిగింది నేనొక్కడినే: వెంకయ్య
విశాఖపట్నం: ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో డబ్బు ప్రభావం ఎక్కువైందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీకి ఏం కావాలో పార్లమెంట్‌లో అడిగిన వ్యక్తిని నేనొక్కడినే.. విభజన అంశాలపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏం చేశారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినందునే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాం. విశాఖకు త్వరలోనే రైల్వేజోన్ వస్తుంది. టీడీపీ, బీజేపీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని’ అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.