న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ....కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని వారు సురేష్ ప్రభుకు ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆ భేటీ అనంతరం మేకపాటి రాజమోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తే ఏపీకి నష్టమని ఆయన పేర్కొన్నారు.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పి.మిథున్రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసుకు భయపడి కేంద్రంతో చంద్రబాబు రాజీ పడుతున్నారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి బాబు మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్పై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విభజన హామీలు అమలు కాకపోతే ప్రజాస్వామ్యానికి విలువేంటి అని కేంద్రప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
'ఏపీకి రైల్వేజోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి'
Published Fri, May 6 2016 3:41 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM
Advertisement
Advertisement