p mithun reddy
-
'ఏపీకి రైల్వేజోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి'
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ....కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయ్యారు. ఏపీకి రైల్వే జోన్ కేటాయించాలని వారు సురేష్ ప్రభుకు ఈసందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆ భేటీ అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తే ఏపీకి నష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పి.మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... ఓటుకు కోట్లు కేసుకు భయపడి కేంద్రంతో చంద్రబాబు రాజీ పడుతున్నారని ఆరోపించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గురించి బాబు మాట్లాడటం లేదని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ... విశాఖ రైల్వే జోన్‌పై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విభజన హామీలు అమలు కాకపోతే ప్రజాస్వామ్యానికి విలువేంటి అని కేంద్రప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. -
'ఎమ్మెల్యేలను కొనడానికే సమయం వెచ్చిస్తున్న బాబు'
కడప : గాలేరు - నగరి కాల్వ పనులకు చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం కడపలో ఆ పార్టీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అంజద్‌బాషా విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజాసేవలను విస్మరించారని మిథున్‌రెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కొనడానికి సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలకు అభివృద్ధి జరిగిందంటే అది దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్తోనే అని ఎమ్మెల్యే అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్ట్
-
'చంద్రబాబు బాగోతం దేశమంతా తెలియాలి'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు అంశంపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి.మిథున్‌రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చకు అన్ని పార్టీల మద్దతు కోరతామని తెలిపారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సాక్షిగా దొరికినా ఎందుకు చర్యలు తీసుకోలేదో పార్లమెంట్లో ప్రశ్నిస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తాము వ్యతిరేకమని వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్వవహరిస్తుందని వారు ఆరోపించారు. చంద్రబాబు బాగోతం దేశమంతా తెలియాలని ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జులై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆ పార్టీ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ లో చర్చించవలసిన అంశాలపై ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు. ఆ భేటీ అనంతరం ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి విలేకర్లతో మాట్లాడారు.