రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ | TDP MLAs takes on Rayapati Sambasiva rao | Sakshi
Sakshi News home page

రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్

Published Sat, Jan 9 2016 8:35 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్ - Sakshi

రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్

విశాఖపట్నం:  తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు.

గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు.  భువనేశ్వర్ కేంద్రంగా సౌత్‌సెంట్రల్, ఈస్ట్‌కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు.  
 
విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి
పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement