gana babu
-
ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం
సాక్షి,విశాఖపట్నం : ప్రభుత్వ విప్ గణబాబుకు అవమానం జరిగింది. ప్రధాని మోదీ పర్యటన రివ్యూ మీటింగ్‌లో గణబాబుకు గౌరవం దక్కలేదు. గణబాబుకు బదులుగా మంత్రి నారా లోకేష్ తొడల్లుడు ఎంపీ భరత్‌కు అందలం ఎక్కించారు. విప్ గణబాబు కుర్చీలో ఎంపీ భరత్‌కు అవకాశం కల్పించారు. సాధారణ ఎమ్మెల్యేలా గణబాబును అధికారులు ట్రీట్ చేశారు. దీంతో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని గణబాబు అసహనం వ్యక్తం చేశారు. -
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు...
నా పేరు గణ.. నా అరాచకాలేంటో.. పదేళ్లలో చూసే ఉంటారు. ఈ ఎన్నికల్లో మీరు సపోర్ట్ చేయకపోతే నా గూండాయిజం మళ్లీ చూస్తారు. నా వెంట లేకపోతే మీ అంతు చూస్తా.. ఖబడ్దార్.. ఈ డైలాగ్‌లు ఏదో యాక్షన్ సినిమాలో వీధి రౌడీ చెప్పిన మాటలు కాదు.. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు రెండు పర్యాయాలు గుణవంతుడని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అక్రమాల గణబాబు హెచ్చరికలు. ఓటమి భయంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాగైతే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారో.. అదే తానుముక్కైన గణబాబు కూడా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రచారం పేరుతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గణబాబు వస్తున్నాడంటే వ్యాపారులు బెదిరిపోతున్నారు. చిన్న చిన్న దుకాణదారులు హడలిపోతున్నారు. బడా బంగారు వ్యాపారులు భయపడుతున్నారు. ఆర్పీ లు ఆందోళన చెందుతున్నారు. రోడ్డుపై తోపుడు బళ్లు వ్యాపారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరు కనిపించినా.. నవ్వుతూ పలకరిస్తూ.. ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్‌కుమార్ ఓటర్లను అభ్యర్థిస్తుంటే.. టీడీపీ అభ్యర్థి గణబాబు మాత్రం బెదిరింపు రాజకీయాలతో బెదరగొడుతున్నారు.బెదిరింపులకు నాలుగు బ్యాచ్‌లు ఎన్నికల్లో తనకు సహకరించకపోతే భవిష్యత్‌లో సమస్యలు తప్పవని గణబాబు.. నియోజకవర్గంలోని వ్యాపారస్తులు, వ్యాపార సంస్థల యజమానులను బెదిరిస్తున్నారని కొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారులను బెదిరించేందుకు గణబాబు తన అనుచరులను నాలుగు బ్యాచ్‌లుగా విభజించి.. వస్త్ర వ్యాపారుల ను ఒక బ్యాచ్, బంగారు వ్యాపారులను మరో బ్యాచ్, కిరాణా దుకాణాలవైపు ఇంకో బ్యాచ్, మిగిలిన వాటిని కవర్ చేస్తూ మరో బ్యాచ్ పశ్చిమ నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి. ఆయా వర్తక సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను గణబాబు రప్పించుకొని వేలు చూపిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వ్యక్తి గెలిస్తే నియోజకవర్గాన్ని గూండాల చేతిలో పెట్టేటట్లుగా ఉన్నారంటూ వ్యాపారులు హడలిపోతున్నారు.ఫిర్యాదులు చేస్తామని ఆర్పీలకు బెదిరింపు స్వయం సహాయక బృందాల్లో కీలకంగా వ్యవహరించే రిసోర్స్ పర్సన్స్(ఆర్పీ) ఏ ఒక్క పార్టీకి కొమ్ముకాయకుండా వ్యవహరిస్తున్నారు. అయితే.. వీరిపైనా గణబాబు బెదిరింపుల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవలే కొందరు ఆర్పీలను మభ్యపెట్టేందుకు కాసులపేర్లను బహూకరించారు. ఆర్పీలు తీసుకోమని చెప్పడంతో వారందర్నీ బెదిరించారు. దీంతో ఒకరిద్దరు గణబాబు గూండాయిజానికి భయపడి తీసుకున్నారు. మిగిలిన వారు మాత్రం తాము ఏ పార్టీకి సపోర్ట్ చేయమనీ.. స్వయం సహాయక బృందాల అభివృద్ధి కోసమే తమని ప్రభుత్వాలు నియమించాయని కరాఖండిగా చెప్పడంతో గణబాబు అహం దెబ్బతింది.దీంతో తనకు సహకరించని ఆర్పీలపై గణబాబు వర్గం ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదులు చేయడం ప్రారంభించింది. గతంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోల్ని సంపాదించి.. ఆ ఫొటోలతో బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని కొందరు ఆర్పీలు వాపోతున్నారు. పాత ఫొటోల ద్వారా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముందుగా ఆర్పీలకు ఆ ఫొటోలు చూపించి.. మీరు తన తరఫున ప్రచారం చేయకపోతే.. ఈ ఫొటోలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాననీ.. అప్పుడు మీ ఉద్యోగాలు ఊడిపోతాయంటూ గణబాబు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గణబాబు బ్లాక్ మెయిల్ రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయి. దిగజారుడు బెదిరింపులతో చిల్లర రాజకీయాలు చేస్తున్న గణబాబు అరాచకాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమవుతున్నారు. -
లోకేష్‌ను ఎమ్మెల్యే గణబాబు హైజాక్ చేశారు
విశాఖపట్నం: నారా లోకేష్‌ను పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు హైజాక్ చేశారని టీడీపీ విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ ఆరోపించారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన శంఖారావం సభ ప్రాంగణానికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పిన్నమనేని కల్యాణ మండపం వద్దే ఆయన ఉండిపోయారు. లోకేష్‌కు ఎక్కడ నిజాలు తెలిసిపోతాయోనని.. గణబాబు మొత్తం షెడ్యూల్‌ను మార్చేశారన్నారు. బస్సులో నాయకులతో మాట్లాడం, బూత్ కన్వీనర్లకు దిశా నిర్దేశం లేకుండా వేదిక వద్దకు నేరుగా లోకేష్‌ను తీసుకువెళ్లారని ప్రసాద్ ఆరోపించారు. టీడీపీలో జీవిత కాల బహిష్కరణకు గురైన నాయకుడి విగ్రహాన్ని లోకేష్ ఆవిష్కరించేలా పన్నాగం పన్నారన్నారు. శంఖారావం సభలకు స్పందన కరువు జగదాంబ: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదివారం నగరంలో నిర్వహించిన శంఖారావం సభలకు ప్రజల నుంచి స్పందన కరువైంది. విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గాల్లో ఈ సభలు నిర్వహించేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయగా.. ప్రజలు మాత్రం ముఖం చాటేశారు. జనాలు లేకపోవడంతో ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభ ఆలస్యంగా మొదలైంది. జనాలను తరలించడానికి తెలుగుదేశం నాయకులు నానా పాట్లు పడ్డారు. అయినప్పటికీ జనం వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. వచ్చిన కొద్ది మంది లోకేష్ రొటీన్ ప్రసంగంతో విసుగు చెందారు. ఆయన మాట్లాడుతుండగానే.. సభ నుంచి మెల్లగా జారుకున్నారు. ఆయా సభల్లో లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేశారు. -
‘కోటి’ సాయంపై సర్వత్రా హర్షం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తణుకు: విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించిన తీరు, ప్రకటించిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు తోంది. మృతుల కుటుంబాలకు రూ.కోటి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, స్వల్ప అస్వస్థతతో రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొంది వెళ్లే వారికి రూ.లక్ష, ఆస్పత్రిలో చేరగానే ఉపశమనం పొంది డిశ్చార్జ్ అయిన వారికి రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం ప్రకటించడాన్ని అన్ని వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. అంతేగాక గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లోని మొత్తం 15,000 మందికీ రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించడాన్ని అందరూ కొనియాడుతున్నారు. ‘బాధితులు నయాపైసా కూడా వైద్య ఖర్చులు భరించాల్సిన పనిలేదు. డిశ్చార్జ్ అయి వెళ్లేప్పుడు ఈ నష్టపరిహారం కూడా ఇచ్చి పంపాలని కలెక్టర్‌ను ఆదేశిస్తున్నాం’ అని సీఎం జగన్ ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు, వామపక్షాలతో పాటు అందరూ అభినందిస్తున్నారు. గంటల వ్యవధిలోనే.. ► నష్టపరిహారం ప్రకటించే విషయంలో ప్రభుత్వాలు రకరకాల ఆలోచనలతో జాప్యం చేయడం రివాజుగా వస్తోంది. ► ప్రయివేటు కర్మాగారాల్లో జరిగే ప్రమా దాల విషయంలో ఇది మరీ ఎక్కువ. ► సీఎం వైఎస్ జగన్ దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే విశాఖపట్నం చేరుకుని బాధితులను పరామర్శించి, అక్కడే సమీక్ష నిర్వహించి నష్ట పరిహారాన్ని ప్రకటించారు. ► ఎక్కడైనా ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే అధిక నష్ట పరిహారం ప్రకటించాలని ప్రతిపక్షాలు, వామపక్షాలు డిమాండ్ చేయడం రివాజు. ► విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన బాధితుల విషయంలో అలాంటి డిమాండ్ ఏ ఒక్కరి నుంచీ రాకముందే ఊహించనంత భారీ నష్ట పరిహారాన్ని సీఎం ప్రకటించారు. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా.. రాష్ట్రంలో, దేశంలో ఎన్నో భారీ విపత్తులు చూశాం. కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ, ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిహారం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు రూ.కోటి, చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని వారికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించడం ఇంతవరకు ఎక్కడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు, తీసుకున్న చర్యలు అద్భుతం. – విష్ణుకుమార్‌రాజు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉపశమనం కలిగిస్తుంది బాధితులకు సీఎం ప్రకటించిన పరిహారం ఉపశ మనం కలి గిస్తుం ది. అసలు ఇలాం టి ప్రమాదం మరోసారి జరగ కుండా కంపెనీని నివాస ప్రాంతాల మధ్య నుంచి తరలించాలి. – గణబాబు, ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ నియోజకవర్గం మేం ఊహించిన దాని కన్నా 4 రెట్లు ఎక్కువ మేం ఊహించిన దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ సా యాన్ని ప్రక టించిన సీఎం వైఎస్ జగన్ అభినందనీ యులు. బాధితు లను, బాధిత గ్రామాల ప్రజలకు కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించి ఆదుకున్న తీరు ప్రశంసనీయం. – నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి బాధితులను ఆదుకున్నతీరు ప్రశంసనీయం బాధితులకు నష్టపరిహారాన్ని ప్రకటించి సీఎం వైఎస్ జగన్ వారిని ఆదుకున్న తీరు హర్షణీయం. ఆ పరిశ్రమను అక్కడి నుంచి తరలిం చడంతో పాటు.. ఈ దుర్ఘటనపై న్యాయవిచారణ జరిపించాలి. ఈ ఘటనకు ఎల్జీ కంపెనీ బాధ్యత వహించాలి. – కె.రామకృష్ణ, పి.మధు, వామపక్ష నేతలు -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ పిజివి ఆర్ నాయుడు (గణబాబు)
-
రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్
విశాఖపట్నం: తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు. గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా సౌత్‌సెంట్రల్, ఈస్ట్‌కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు.