bandaru satyanarayana murthy
-
ఎవడబ్బ సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు?
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): పుష్ప2 సినిమాతో రికార్డులు బద్దలు కొట్టిన అల్లు అర్జునే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారని సినీ విశ్లేషకులు అంటున్నారు. గత కొంతకాలంగా టీడీపీ, జనసేన నేతలు అల్లు అర్జున్‌పై చేస్తున్న వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. తాజాగా మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు దీన్నే ధ్రువీకరిస్తున్నాయని అంటున్నారు. ఎవడబ్బ సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారని సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు ప్రశ్నించారు.ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులివ్వాలా అని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ.. సినిమాల బెనిఫిట్ షోలు, హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీ కోసం వేసేవారని, ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసమో, డబ్బులున్న వాళ్ల కోసమో వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వాలని ఆక్షేపించారు.సినిమాలకు రూ.వేల కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంతకు ముందు బ్లాక్‌లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజా శ్రేయస్సు కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతులివ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలడుగుతున్నారని, సినిమాలకు ఇన్ని వేల కోట్లు కలెక్షన్స్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతోందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు.బాబు కుట్రే.. నిదర్శనమిదే..హీరో అల్లు అర్జున్‌పై చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందనడానికి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ప్రబల నిదర్శనం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను అరెస్టు చేసినా, ఆయన ఇంటిపైన దాడి జరిగినా ఇంతవరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం ఖండించలేదు. పైగా, ఇటీవల టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు పలువురు అల్లు అర్జున్‌పై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా’ అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. పుష్ప2 సినిమా విడుదలకు ముందు గన్నవరం జనసేన పార్టీ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్‌బాబు ‘నువ్వు హీరో అనుకుంటున్నావా..? నువ్వొక కమెడియన్.చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు. పుష్ప సినిమా మా నియోజకవర్గంలో ఎలా ఆడుతుందో చూస్తా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక నంద్యాల టీడీపీ ఎంపీ శబరి ‘ఎక్స్’లో అర్జున్‌పై ఎగతాళి వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడి ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది. నంద్యాలలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది. ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప 2 చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం’ అంటూ శబరి ఎద్దేవా చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పరోక్షంగా అల్లు అర్జున్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. -
"బయటికి పో..!" బండారు పై బాబు ఫైర్
-
43 ఏళ్ల సీనియర్‌కు అవమానాలు
పెందుర్తి: జగమంతా కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది అన్నట్లు తయారైంది 43 ఈయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, టీడీపీలో రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందిన బండారు ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రాలేని దుస్థితి నెలకొంది. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థిగా పెందుర్తి బరిలో ఉన్న పంచకర్ల రమేష్‌బాబు తన చిరకాల ప్రత్యర్థి బండారు సత్యనారాయణమూర్తిని క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకునేలా చేశారు. కూటమి అభ్యర్థిగా ఉన్న రమేష్‌బాబు ప్రధాన పార్టీ టీడీపీని కలుపుకుని వెళ్లాల్సింది పోయి.. దొడ్డిదారిలో టీడీపీలో బండారు వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో అడుగడుగునా బండారు వర్గానికి జనసేన క్యాడర్ నుంచి తీవ్రస్థాయిలో అవమానాలు ఎదురవుతున్నాయి. ‘మాకు మీ అవసరం లేదు’అంటూ బండారు వర్గాన్ని మరింత రగిలిపోయేలా చేస్తున్నారు. అధినేత నుంచే అవమానం జనసేన–టీడీపీ జత కట్టిన దగ్గర నుంచి సీనియర్, స్థానికుడైన బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. చంద్రబాబు, లోకేష్ కూడా పలు బహిరంగ వేదికల్లో బండారుకే టికెట్ అన్నట్లు సంకేతాలిచ్చారు. తీరా ఆఖరి నిమిషంలో బండారును కాదని కొద్ది రోజుల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్న స్థానికేతరుడు పంచకర్లకు పెందుర్తి టికెట్ కేటాయించారు. బండారుకు టికెట్ ఇవ్వకపోగా.. కనీసం ఆయన అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవైపు టికెట్ నిరాకరించడం.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి అయిన రమేష్‌బాబుకు టికెట్ ఇవ్వడంతో బండారు రగిలిపోతున్నారు. నిద్రాహారాలు కూడా సరిగా లేకపోవడంతో కొద్ది రోజుల కిందట అనారోగ్యం పాలయ్యారు. అయినా కూడా టీడీపీ అధిష్టానం నుంచి కనీసం పరామర్శ లేదని బండారు వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బండారా.. డోంట్ కేర్ : ఇదిలా ఉండగా జనసేన నుంచి కూడా బండారుకు తొలి నుంచి అవమానాలే ఎదురవుతున్నాయి. ఇరు పార్టీలు జతకట్టిన తర్వాత తప్పదన్నట్లు అప్పుడప్పుడు కలసి తిరిగినా.. బండారు–పంచకర్ల బంధం టికెట్ కేటాయించిన తర్వాత అతుక్కునే ప్రయత్నమే జరగలేదు. బెర్త్ ఖాయం చేసుకొని పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టిన పంచకర్ల రమేష్‌బాబు మర్యాద కోసమైన బండారును పలకరించలేదు. ఇంటికే పరిమితమైన బండారు లేకపోతే మాకెంటి అనే రీతిలోనే జనసేన తీరు ఉంది తప్పితే.. పొత్తు ధర్మం కోసం పంచకర్ల వర్గం బండారును కలుపుకునే ప్రయత్నం చేయలేదు. కాగా.. కొద్ది రోజులుగా బండారుపై కాస్తోకూస్తో అసంతృప్తిగా ఉన్న కిందిస్థాయి నాయకులతో పంచకర్ల టచ్‌లోకి వెళ్లడంతో.. బండారు వర్గం తీవ్రస్థాయిలో రగిలిపోతోంది. నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోసిన బండారు సత్యనారాయణమూర్తికి జనసేన నుంచి ఇన్ని అవమానాలా? అంటూ టీడీపీ పాత కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
‘బండారు’ చెంత అసంతృప్తుల చింత..!
విశాఖ సిటీ: జిల్లా తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. అధినేత చంద్రబాబుపై తెలుగు తమ్ముళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారిని పక్కన పెట్టి.. ఆర్థిక పరిపుష్టి ఉన్న వారికే టికెట్లు ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రెండో జాబితా ప్రకటించిన తరువాత జిల్లా టీడీపీలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నిన్న మొన్నటి వరకు అధినేతపై ఈగ వాలనివ్వని నేతలంతా జాబితాలో చోటు దక్కకపోవడంతో.. చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. అసంతృప్తి నేతలంతా ఒక చోట చేరడం ఇపుడు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. బండారుకు బుజ్జగింపులు పెందుర్తి టికెట్‌ను తెలుగుదేశం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పంచకర్ల రమేష్‌బాబు ఎన్నికల బరిలో దిగనున్నారు. దీంతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన తనను పక్కనపెట్డడంపై జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే బండారుకు, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు గత కొద్ది కాలంగా పొసగడం లేదు. పంచకర్లకు టికెట్ ఇస్తే తాను సహకరించనని గతంలోనే టీడీపీ అధినాయకత్వానికి తేల్చి చెప్పారు. పెందుర్తి టికెట్ కోసం బండారు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినప్పటికీ బండారుకు ప్రత్యామ్నాయం చూపించకపోవడంపై రగిలిపోతున్నారు. గురువారం రెండో జాబితా ప్రకటించినప్పటి నుంచి బండారు పరవాడలో ఉన్న తన ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదు. జిల్లా నాయకులు ఫోన్ చేసినప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో టీడీపీ జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు.. బండారు ఇంటికి వెళ్లి సర్ది చెప్పే ప్రయత్నం చేసి వెళ్లిపోయారు. బండారు నివాసానికి అసంతృప్తివాదులు టికెట్ ఆశించి భంగపడిన టీడీపీ అసంతృప్తివాదులు బండారు నివాసంలో సమావేశమయ్యారు. అనకాపల్లి ఇంచార్జ్ పీలా గోవింద్, చోడవరం ఇంచార్జ్ తాతాయ్యబాబు, మాడుగుల టీడీపీ నేత పీవీజీ కుమార్, ఇతర నాయకులు బండారు నివాసానికి వెళ్లి తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన తమను అధినాయకత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొంతమంది పార్టీ సీనియర్లతో పాటు చంద్రబాబు కూడా ఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. జనసేన పార్టీ నేతలతో కలిసి పనిచేయాలని, పార్టీ నిర్ణయించిన, జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. దీనిపై అసంతృప్తి నేతలు మరింత రగిలిపోతున్నారు. పొత్తుల పేరుతో టికెట్లు ఇవ్వకపోగా.. పక్క పార్టీల విజయానికి కష్టపడాలని చెప్పడంపై మండిపడుతున్నారు. వీరిలో కొంత మంది పార్టీ మార్పుపై చర్చించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలు.. సినీనటుడు సుమన్ రియాక్షన్
సాక్షి, విశాఖపట్నం: మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను సినీ నటుడు సుమన్ తప్పుబట్టారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ‘‘రోజాను వ్యక్తిగతంగా ఎదుర్కోనలేకే ఆరోపణలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే మంత్రి రోజాను రాజకీయంగా ఎదుర్కోవాలి. ఎన్నో కష్టాలు పడి మంత్రి రోజా ఈ స్థాయికి వచ్చింది బండారు ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. వారి గురించి కూడా ఇదే విధంగా మాట్లాడితే బండారు ఊరుకుంటారా’’ అంటూ మండిపడ్డారు. చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు, మహారాష్ట్ర ఎంపీ, మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సాక్షి తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్‌ను ఫాలో అవ్వండి -
ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు. -
బండారు.. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా?: ఎంపీ నవనీత్ కౌర్
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండిస్తోంది మహిళా లోకం. ఈ క్రమంలో మాజీ నటికి మద్దతుగా పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర ఎంపీ(అమరావతి నియోజకవర్గం), మాజీ సినీ నటి నవనీత్ కౌర్ రాణా సైతం రోజా అండగా నిలిచారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బండారుపై ఆమె ఆగ్రహం వెల్లగక్కారు. ‘‘బండారు.. అసలు సిగ్గు ఉందా?. మంత్రి రోజా పై ఇంత దిగజారి మాట్లాడతావా?. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా?. తెలుగు రాష్ట్రాల్లో మహిళల్ని చాలా గౌరవిస్తారు. కానీ, ఈ బండారు మహిళల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారు. నీకు రాజకీయాలు ముఖ్యమా?.. లేకుంటే మహిళల గౌరవం ముఖ్యమా?.. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి’’ అని నవనీత్ కౌర్ ఫైర్ అయ్యారు. ఒక ఎంపీగా, నటిగా, మహిళగా నేను ఏపీ మంత్రి రోజాకు అండగా ఉంటా. నేనే కాదు.. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటుందని నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘‘రోజా సినీ పరిశ్రమకు సేవలందించారు. స్టార్ హీరోల సరసన నటించారు. ఆమెను ఇంతలా కించపర్చడం సరికాదు. రాజకీయాల్లో ఇంతలా దిగజారి మాట్లాడటమూ మంచిది కాద’’ని నవనీత్ కౌర్ హితవు పలికారు. ఇప్పటికే సీనియర్ నటులు కుష్బూ సుందర్, రాధికా శరత్‌కుమార్ రోజాకు మద్దతు ప్రకటించగా.. ఇప్పుడు నవనీత్ కౌర్ రాణా సైతం మద్దతుగా నిలిచారు. pic.twitter.com/QqzVrG5V5t — Navnit Ravi Rana (@navneetravirana) October 7, 2023 -
టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారామె. రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని అన్నారామె. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారామె. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
బండారు సత్యనారాయణ అరెస్ట్ పై వరుదు కళ్యాణి కామెంట్స్
-
సీఎం జగన్, మంత్రి రోజాలను దూషించిన కేసులో బండారుకు బెయిల్
గుంటూరు లీగల్/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, మంత్రి రోజా పైన అనుచిత వ్యాఖ్యలు చేసి, దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విశాఖపట్నం సమీపంలోని వెన్నలపాలెంలో సోమవారం రాత్రి అరెస్టు చేసిన బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు మంగళవారం ఉదయం గుంటూరు నగరంపాలెం స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణమూర్తిని కలిసేందుకు విశాఖపట్నానికి చెందిన న్యాయవాదులు పి.ఎస్.నాయుడు, బి.వి.రమణ, గుంటూరు న్యాయవాది ముప్పాళ్ల రవిశంకర్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక ఎస్ఐ తన తండ్రిపై ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సత్యనారాయణమూర్తిని పోలీసులు బందోబస్తు మధ్య మధ్యాహ్నం జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఆస్పత్రిలోనే ఉంచాలని సత్యనారాయణమూర్తి కోరారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ నిర్ధారించారు. తరువాత సత్యనారాయణమూర్తిని పోలీసులు కోర్టుకు తరలించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్లు బెయిల్ ఇవ్వదగినవి అయినప్పటికీ నేర తీవ్రతను, వ్యక్తి చరిత్రను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి జి.స్రవంతి.. బండారు సత్యనారాయణమూర్తిని రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. చట్టప్రకారమే వ్యవహరించాం.. సీఎం జగన్, మంత్రి రోజాలపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసే విషయంలో చట్టప్రకారమే వ్యవహరించామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. తన సోదరుడు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ బండారు సింహాద్రిరావు హైకోర్టులో సోమవారం హౌస్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. సత్యనారాయణమూర్తిపై గుంటూరు అరండల్‌పేట, నగరంపాలెం స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. నరగంపాలెం స్టేషన్లో నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సత్యనారాయణమూర్తికి నోటీసులు ఇవ్వలేదన్నారు. అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో నోటీసు జారీచేస్తే.. దాన్ని తీసుకోవడానికి సత్యనారాయణమూర్తి నిరాకరించారని, దీంతో చట్ట నిబంధనల మేరకు ఆయన్ని అరెస్ట్ చేశామని వివరించారు. ఒకవైపు నోటీసు తీసుకోవడానికి నిరాకరించి, మరోవైపు హైకోర్టులో నోటీసు తీసుకున్నట్లు చెబుతున్నారని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. 41ఏ నోటీసును తీసుకున్నట్లు పెట్టిన సంతకం సత్యనారాయణమూర్తిది కాదన్నారు. అరెస్ట్ తరువాత సత్యనారాయణమూర్తిని గుంటూరు కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. పిటిషనర్ న్యాయవాది వి.వి.సతీష్ వాదనలు వినిపిస్తూ.. 41ఏ నోటీసు ఇచ్చి దానిపై పోలీసులు సంతకం కూడా తీసుకున్నారని తెలిపారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి, ఆ వెంటనే అరెస్ట్ చేశారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సత్యనారాయణమూర్తి అరెస్ట్ విషయంలో చట్టనిబంధనలను పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ ఈ నెల 5కి వాయిదా వేసింది. -
రోజాపై అనుచిత వ్యాఖ్యలపై బండారును ప్రశ్నించిన పోలీసులు
-
గుంటూరు పీఎస్‌లో బండారు.. ఓవరాక్షన్ చేస్తోన్న పచ్చ బ్యాచ్
సాక్షి, విశాఖపట్న/గుంటూరు: ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. గుంటూరు జైలుకు తరలించే టైంలో.. ఆఖరికి ఇవాళ పీఎస్ బయట టీడీపీ శ్రేణులు చేసిన ఓవరాక్షన్ మామూలుగా లేదు. అంతేకాదు పోలీసులు ఆయన్ని ఏదో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నట్లు పచ్చ మీడియా వరుస కథనాలతో నానా రభస చేస్తోంది. సోమవారం రాత్రి వెన్నెలపాలెంలో ఆయన్ని అరెస్ట్ చేసే క్రమంలో.. అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు శతవిధాల యత్నించాయి. ఆపై ఆయన్ని గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఆపై ఈ(మంగళవారం) ఉదయం నుంచే ఆయన్ని విచారించే అవకాశం కనిపిస్తోంది. మంత్రి రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరులో బడి మంజుల చేసిన ఫిర్యాదుపై నమోదైన కేసులో బండారును అరెస్టు చేశారు. విచారణ కోసం స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు మంత్రి రోజాను ఉద్దేశించి జుగుప్సాకరంగా మాట్లాడిన బండారును అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సైతం డీజీపీని కోరారు. ఇదీ చదవండి: బండారు వ్యాఖ్యలపై రోజా రియాక్షన్ ఇది ఇక ఆయన్ని నగరంపాలెం పీఎస్ తరలించారనే సమాచారంతో పీఎస్ వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి టీడీపీ శ్రేణులు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నా.. పట్టించుకోకుండా అతి చేష్టలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు బందోబస్తులో ఉన్న పోలీసులపై టీడీపీ నేతలు చిందులు తొక్కుతున్నారు. ‘‘మా గవర్నమెంట్ వచ్చాక ఏం చేస్తామో చూడు.. నీ అంతు చూస్తా’’ అంటూ వెస్ట్ డీఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు బెదిరించిన దృశ్యాలు కనిపించాయి. -
మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. డీజీపీకి వాసిరెడ్డి పద్మ లేఖ
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన టీడీపీ నేత బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. డీజీపీని కోరారు. మంత్రి రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఆమె డీజీపీకి లేఖ రాస్తూ బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు మాట్లాడుతున్నారని వీటిని ఎంత మాత్రం సహించరాదని కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు న్యాయవాదులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారని పద్మ తెలిపారు. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్‌గా స్పందించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. మంత్రులుగా ఉన్న మహిళల పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్న బండారు సత్యనారాయణ వంటి మాజీ మంత్రుల బండారాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకు వెళ్తూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. మహిళా కమిషన్ సభ్యులు కె.జయశ్రీ, గజ్జల లక్ష్మి, గెడ్డం ఉమ, బూసి వినీత, రోఖయా బేగం మంత్రి రోజాకు సంఘీభావంగా మాట్లాడారు. -
బండారూ.. తప్పుడు ప్రచారం మానుకో..
సాక్షి, అనకాపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ మండిపడ్డారు. బండారు సోషల్ మీడియాలో చేసిన తప్పుడు పోస్టులపై సోమవారం ఆమె ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. పరవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన తన సోదరిపై సంతోష్‌కుమార్ అనే ఈవ్ టీజింగ్‌కి పాల్పడ్డాడు. ఆమె ధైర్యంగా స్థానిక పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేసింది. ఆ మరుక్షణమే పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన గుంటూరుకు చెందిన సంతోష్‌కుమార్ పరవాడ ఫైలాన్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. మహిళ గౌరవ భంగానికి చెందిన అంశాన్ని బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తులు రాజకీయం చేయడం సరికాదని ఆమె హితవుపలికారు. కుమార్తె సమానురాలైన ఆడపిల్లపై ఈవ్‌టీజింగ్‌కి పాల్పడితే.. దాన్ని అత్యాచారయత్నమని.. ఆ కుటుంబ గౌరవాన్ని బయటకు తీసేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంస్కారమా..? బండారు అని ప్రశ్నించారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అని మండిపడ్డారు. మహిళా భద్రత కోసం దిశ పోలీస్స్టేషన్లు, దిశ యాప్‌లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తప్పుడు పోస్టులపై ఎస్పీకి ఫిర్యాదు సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ కోరారు. సోమవారం ఈమేరకు ఆమె అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా తనపై వివిధ మాధ్యమాలలో అసత్య పోస్టులు పెడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మహిళలపై తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి.. పట్టపగలు మద్యం సేవించి మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా వాగుతున్నారని వైఎస్సార్ సీపీ అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక చీరేస్తానని హెచ్చరించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి దురదృష్టవశాత్తు గుండెపోటుతో మరణించారని, ఇంతటి మహా విషాదాన్ని తమ పార్టీయే కాక రాష్ట్రమంతా భరించలేకపోతోందని... ఈ దశలో ఇంతకు దిగజారి తాగుబోతు మాటలు మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు తమ నాయకులను మరీ ఇంత నీచంగా మద్యం తాగించి మాట్లాడించటం బాధాకరమన్నారు. టీడీపీ దిగజారుడుతనానికి ఇంతకన్నా పరాకాష్ట ఏం ఉంటుందని ప్రశ్నించారు. వారం రోజుల పాటు దుబాయ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోలో పాల్గొన్న మంత్రి ఏపీలో రూ.5 వేల కోట్లు పైచిలుకు ఒప్పందాలు చేసుకొని విజయవంతంగా వచ్చారని, అసలైన ఎంవోయూలు ఎలా ఉంటాయో చూపిద్దామని తన సన్నిహితులతో కూడా వ్యాఖ్యానించారని, ఇలా సంతోషంగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించటం బాధాకరమన్నారు. ఈ ఘటనపై నోటికొచ్చినట్లు మాట్లాడిన బండారు... తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఆ కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు!
పెందుర్తి: ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే జనం ప్రతిఘటన ఎలా ఉంటుందో విశాఖ ప్రజలు టీడీపీ నేతలకు రుచి చూపించారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పి, అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయనతోపాటు వచ్చిన వారికి విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంలో సోమవారం ఎదురైన భంగపాటిది. నిరుపేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కుట్రపూరితంగా అడ్డుకోవాలన్న వారి దుర్మార్గపు ఆలోచనకు ప్రజలు తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. ప్రజలంతా తిరగబడ్డంతో ›‘40’ ఏళ్ల అనుభవం అక్కడి నుంచి పారిపోయింది. పారని ‘పచ్చ’ పాచిక ఇప్పిలివానిపాలెం సర్వే నెంబర్ 81/2లో ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు కేటాయించింది. మొత్తం 90 మంది లబ్ధిదారులు ఈ లేఅవుట్లో స్థలాలు పొందారు. వారిలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదులు నింపేందుకు çసమీపంలోని కొండవాలు ప్రాంతం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాలన్న కుట్రతో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే బండారు సత్యనారాయణమూర్తి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తమ అనుచరులను వెంటేసుకుని లేఅవుట్ వద్దకు వచ్చారు. ఇక్కడి మట్టిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని, ఎవరూ తవ్వడానికి వీల్లేదని అంటూ వీరంగం వేశారు. ఇళ్ల కోసం మట్టిని తవ్వుకుంటున్నామని పేదలు చెప్పినా వినలేదు. తీవ్రస్థాయిలో అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెక్కిన పేదలు టీడీపీ మూకపై తిరగబడ్డారు. మట్టిని ఎవరు అమ్ముకుంటున్నారో నిరూపించాలని నిలదీశారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేదకైనా ఇళ్లు ఇచ్చారా? జగన్‌బాబు (సీఎం వైఎస్ జగన్) వచ్చిన తరువాత మాకందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టిస్తున్నాడు. మా బతుకులు మేం బతుకుతుంటే మీరెందుకు మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తారు? మీ రాజకీయాల కోసం మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడతారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘మీరు పేదల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మంచి పనిని కూడా ఇలా చెడగొడతారా? మీకు సిగ్గూ శరం లేదా?’ అంటూ మహిళలు మండిపడ్డారు. పేదల ఆగ్రహావేశాలను చూసిన బండారు బృందానికి నోట మాట రాలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని పేదలు మరోసారి హెచ్చరించడంతో బండారు, పీలా తదితరులు వెనక్కి మళ్లారు. ఏం చేయాలో పాలుపోని బండారు లే అవుట్ సమీపంలో ఓ చెట్టు కిందకు వెళ్లి కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి తర్వాత తేరుకొని, యథావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇంటి దారి పట్టారు. బండారు, టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మాజీ మంత్రి ‘బండారు’కు ఘోర పరాభవం
సాక్షి, విశాఖపట్నం: మరో టీడీపీ నాయకుడికి ‘కుప్పం’ అనుభవం ఎదురైంది. విశాఖ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్న మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తికి సొంత గ్రామంలోనే తీవ్ర పరాభవం ఎదురైంది. పరవాడ మండలం వెన్నెలపాలెంలో గతంలో రెండు దఫాలు సర్పంచ్‌గా పనిచేసిన తన భార్య మాధవీలతను ఈసారి కూడా పోటీకి నిలిపారు. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు వెన్నెల అప్పారావు.. ఆమెపై 464 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గ్రామంలోని మొత్తం 10 వార్డులనూ వైఎస్సార్సీపీ మద్దతుదారులే గెలవడం మరో విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ పెందుర్తి నియోజకవర్గంలో యువకుడైన అన్నంరెడ్డి అదీప్‌రాజ్ (వైఎస్సార్సీపీ) చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. మరోవైపు వైఎస్సార్సీపీ మద్దతుతో పెందుర్తి మండలంలోని రాంపురం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసిన ఎమ్మెల్యే అదీప్‌రాజ్ సతీమణి శిరీష ఘన విజయం సాధించారు -
విష ప్రచారం చేయబోయి..అభాసుపాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రసాయన చర్య వికటించి వెలువడిన విషవాయువుల కంటే తెలుగుదేశం నేతల విష ప్రచారమే పెను ప్రమాదంగా కనిపిస్తోంది. పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ ఫార్మా కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన సాకుగా టీడీపీ నేత బండారు చేసిన నానాయాగీ అందరికీ ఏవగింపు కలిగించింది. సాయినార్ కంపెనీలో రెండు రియాక్టర్లలో ఉన్న వేర్వేరు బల్్కడ్రగ్ల మిశ్రమం వల్ల రసాయన చర్య వికటించి ప్రమాదవశాత్తూ వెలువడిన విషవాయువుతో ఇద్దరు మృత్యువాత పడటం, నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన తోటి ఉద్యోగులు వెంటనే యూనిట్‌ను షట్‌డౌన్ చేయడం, జిల్లా ఉన్నతాధికారులు అర్ధరాత్రి వేళ కూడా హుటాహుటిన ఘటనాస్థలికి చేరి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ ఘటనను కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు చీప్ ట్రిక్స్‌కు పాల్పడటమే విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేతగా చెలామణీ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తి రాజకీయ జీవితం మసకబారుతుండడంతో తన ఉనికిని చాటుకునేందుకు దిజజారుడు రాజకీయాలు చేస్తున్నారన్న వాదనలకు సాయినార్ ఫార్మా వద్ద ఆయన చేసిన నానాయాగీ బలం చేకూరుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడి వయసు ఉన్న అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన బండారు ఏడాదిగా అనేక సందర్భాల్లో ఇష్టారాజ్యంగా నోటికొచి్చనట్టు మాట్లాడుతూ వస్తున్నారు. బండారు బలవంతపు వసూళ్లు బండారు గతంలో ప్రజాప్రతినిధిగా చెలామణీ అయినప్పుడు.. పరవాడలోని ఫార్మా సిటీలోని కంపెనీల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. కంపెనీల్లో ఉన్న చిన్నపాటి లొసుగులను ఆసరాగా చేసుకుని యాజమాన్యాలను బెదిరించి దందాలు చేసేవారన్న వాదనలున్నాయి. మరోవైపు ఫార్మా, ఎన్టీపీసీ కంపెనీలోనూ, ఆర్ఈసీఎస్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని తమ కుమారుడి ద్వారా నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటని్నంటినీ కప్పిపుచ్చుకోవడానికే ఏదైనా ఘటన జరిగేతే చాలు... పోరాటం ముసుగులో బండారు అధికారపక్షంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న వాదనలున్నాయి. అనుచరుల ముసుగులో భూ కబ్జాలు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో అనుచరుల ముసుగులో బండారు లెక్కలేనన్ని భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములతో పాటు దళితులు, బీసీల వద్ద ఉన్న అసైన్డ్, డీ–ఫారం భూములను సైతం చెరబట్టారు. జెర్రిపోతులపాలెంలో దళితుల భూములను లాక్కునేందుకు ఓ మహిళను స్వయంగా బండారు కుమారుడు డైరెక్షన్లో వివస్త్రను చేసిన ఘటన అప్పట్లో రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది. అందులో ప్రధాన నిందితురాలు అయిన టీడీపీ నాయకురాలు, మాజీ వైస్ ఎంపీపీ మడక పార్వతికి తాజా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెందుర్తి జెడ్పీటీసీ టికెట్ కేటాయించారు. లాక్‌డౌన్‌కు ముందు ఆమె తరపున బండారు, ఆయన కుమారుడు అప్పలనాయుడు ప్రచారం కూడా చేశారు. ఇక 2014లో ముదపాక అసైన్డ్ భూముల కుంభకోణంలో ప్రధాన సూత్రదారి బండారు, అప్పలనాయుడు అనుచరులు స్థానికంగా ఉన్న పట్టాదారులను బెదిరించి వారికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్‌లు ఇచ్చి రూ.కోటి భూమిని అప్పనంగా కొట్టేయడానికి యత్నించారు. అలాగే పినగాడి సమీపంలో పెంటవాని చెరువుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ గయాళు భూమిని ఎన్టీఆర్ హౌసింగ్‌కు కేటాయించేందుకు బండారు 2017లో ప్రతిపాదించారు. కానీ సాంకేతిక కారణాల వలన ఆ ప్రయత్నం ఆగిపోయింది. అయితే అప్పట్లో వైఎస్సార్సీపీ కారణంగానే పేదలకు ఇళ్లు ఇవ్వడం కుదరలేదని బండారు అప్పట్లో ఆరోపించారు. కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అదే భూమిని పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధపడితే.. బండారు స్థానిక రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయించారు. హైకోర్టులో కేసులు వేయించి ఆ భూమిపై తాత్కాలికంగా స్టే తెచ్చారు. బండారు.. రెండు నాల్కల తీరు పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నం చేసిన బండారు 2015లో ఇదే కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అప్పుడు కనీసం కంపెనీపై ఈగ వాలనివ్వలేదు సరికదా.. ప్రభుత్వానికి, ప్రమాదానికి ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో వాదించారు. అదే బండారు ఇప్పుడు సోమవారం రాత్రి జరిగిన ప్రమాదాన్ని రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రమాదానికి ప్రభుత్వమే కారణమంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'ఆయన శవరాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్ ఫార్మా కంపెనీలో మంగళవారం తెల్లవారుజామున విష వాయువు లీకైన సంగతి తెలిసిందే. కాగా గ్యాస్ లీకేజీ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ సందర్భంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ గాజవాక ఆర్ కె ఆసుపత్రికి చేరుకొని ప్రమాద ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.(విశాఖలో విషాదం.. మరో గ్యాస్ లీక్) అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ ఘటనపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే నష్టపరిహారంగా 12 లక్షలు ఇచ్చి చేతలు దులుపుకోలేదా అని ప్రశ్నించారు. అప్పట్లో 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మా వైఎస్సార్సీపీ తరపున డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా ఇపుడు కోటి రూపాయిలు డిమాండ్ చేసే అర్హత వారికి ఎక్కడిదన్నారు. మీరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉండి బాధితులకి నష్టపరిహారం ఎంత ఇప్పించారో గుర్తు లేదా అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీరును ప్రశ్నించారు. పెద్ద మనిషినని చెప్పుకునే మీకు మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదన్నారు.ఇప్పటికైనా టీడీపీ నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించినట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటన తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారన్నారు.(విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై సీఎం ఆరా) ముఖ్యమంత్రి ఆదేశాలతో ఫ్యాక్టరీని ప్రస్తుతం షట్ డౌన్ చేస్తున్నామని, ఈ ప్రమాదంపై కలెక్టర్ విచారణకి ఆదేశించారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, ఒకవేళ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాది యాజమాన్యాలకి కొమ్ముకాసే ప్రభుత్వం కాదని...ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమన్నారు. ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అనిపిస్తున్నట్లు ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. -
బండారు తనయుడి బరితెగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు తాగిన మత్తులో రెచ్చిపోయాడు. మితిమీరిన వేగంతో ఇష్టారాజ్యంగా కారు నడుపుతూ మెడికో విద్యార్థుల బైక్‌ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆంధ్ర మెడికల్ కళాశాల(ఏఎంసీ)లో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్ తన స్నేహితుడు గౌతమ్‌తో కలిసి బైక్‌పై బీచ్‌రోడ్డులో వెళ్తున్నారు. గౌతమ్ బైక్ నడుపుతుండగా, వెనక చంద్రకిరణ్ కుర్చొన్నాడు. బీచ్‌రోడ్డులో ఓ ప్రైవేట్ హోటల్లో రాత్రి ఒంటి గంట సమయం వరకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తనయుడు అప్పలనాయుడు తప్పతాగాడు. ఆ మత్తులోనే తన స్నేహితులిద్దరితో కలిసి కారులో బయలుదేరాడు. బీచ్‌రోడ్డులో మితిమీరిన వేగంతో వెళ్తూ చంద్రకిరణ్ బైక్‌ని ఢీకొట్టి.. సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డివైడర్‌పైకి దూసుకుపోయాడు. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. బైక్ మీద నుంచి పడిపోయిన చంద్రకిరణ్ తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు హుటాహుటిన కేజీహెచ్‌కి తరలించారు. తలకు బలమైన గాయంకాగా ముక్కు నుంచి తీవ్రంగా రక్తం కారుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్నాడు. నెంబరు ప్లేటు మార్చేందుకు యత్నం.. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెళ్లి ప్రశ్నించగా అప్పలనాయుడు దురుసుగా సమాధానం చెప్పడంతో వారంతా కలిసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకుని పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సమయానికి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి అప్పలనాయుడు పరారయ్యాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అప్పలనాయుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన కారు నెంబర్ బోర్డుని తొలగించేందుకు అప్పలనాయుడు ప్రయతి్నంచాడని స్థానికులు తెలుపుతున్నారు. ప్రమాద సమయంలో ఆ కారుకి ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు ఉండగా దాన్ని తొలగించేశారు. దాని స్థానంలో ఏపీ 37 సీవీ 0780 నంబరు ప్లేటు అమర్చేందుకు యతి్నంచగా సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఆదివారం పోలీసులు వాహనాన్ని తరలించే సమయానికి మళ్లీ ఏపీ 31డీపీ 6666 నంబరు ప్లేటు దర్శనమిచ్చింది. మరోవైపు కారు ముందుసీటులో బండరాయి కనిపించడంతోపాటు అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు చంద్రకిరణ్ ఎవరితోనూ మాట్లాడకపోవడం... అతని స్నేహితుడు గౌతమ్ అనే యువకుడు అక్కడ లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. తప్పు చేస్తే చర్యలు తప్పవు తప్పు చేస్తే ఎలాంటి వారిపైనైనా చర్యలు తప్పవని ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి అన్నారు. బీచ్‌రోడ్డులో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు సత్యానారాయణ కుమారుడు అప్పలనాయుడు తప్పతాగి చేసిన రోడ్డు ప్రమాద ఘటనపై ఆయన స్పందించారు. బీచ్‌రోడ్డులో అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రేవ్ పారీ్టలు, డ్రగ్స్ విక్రయాలు ఎక్కువగా జరిగేవని... ప్రస్తుతం వాటన్నింటినీ పోలీసులు పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నాం మాకు సమాచారం రావడంతో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లాం. మేము వెళ్లే సరికే ప్రమాదానికి కారణమైన వారు పరారయ్యారు. వారిపై ఐపీసీ సెక్షన్ 337 ప్రకారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. దర్యాప్తులో భాగంగా నిందితుల కోసం గాలిస్తున్నాం. – కోరాడ రామారావు, త్రీ టౌన్ సీఐ -
ఎమ్మెల్యే ప్రొగ్రెస్ రిపోర్ట్ - బండారు సత్యనారాయణ మూర్తి
-
పొట్ట కొట్టొద్దంటే.. తిట్ల భోజనం పెట్టారు!
ప్రజాప్రతినిధులుగా ఉన్న వారు.. తన పరిధిలోని ప్రజలతో మేమకమవ్వాలి.. వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి.. సమస్యలపై ఆరా తీయాలి.. వాటి పరిష్కారానికి తన శక్తి మేరకు కృషి చేయాలి.. కానీ ఆ ప్రజాప్రతినిధి దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు.. కష్టాలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని కసురుకున్నారు.. పరుష పదజాలంతో రెచ్చిపోయారు.. నోర్మూసుకొని వెళ్లండి.. అని గద్దించారు.. ఆయన ఉగ్ర తాండవం చూసి.. పాపం ఆ మహిళలు హతాశులయ్యారు.. అందరిలో అలా తిట్టడంతో మనస్తాపానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు.. ఆడకూతుళ్లను అంత క్షోభకు గురి చేసిన ఆ ప్రజాప్రతినిధి ఎవరంటారా?.. ఇంకెవరు.. పెందుర్తి తెలుగుదేశం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తే..మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు కట్టబెట్టిన నేపథ్యంలో.. ఏళ్ల తరబడి పథకాన్ని నిర్వహిస్తున్న తమ పొట్టకొట్టవద్దని వేడుకునేందుకు సోమవారం పెందుర్తి సామాజిక ఆస్పత్రి వద్ద ఉన్న ఎమ్మెల్యే బండారు వద్దకు వెళ్లిన ఎండీఎం నిర్వాహకులపై ఆయన చిందులు తొక్కారు..కనీసం వారు చెప్పేది పూర్తిగా వినకుండానే.. తోక తొక్కిన తాచులా లేచిన ఎమ్మెల్యే తీరుతో మనస్తాపానికి గురైన మహిళలు..కాసేపటికి తేరుకొని మండల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెందుర్తి: ‘అయ్యా.. అనేక సంవత్సరాల నుంచి వచ్చీరాని బిల్లులు... కడుపు నింపని వేతనం... ఇప్పుడేమో ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్ట్‌లు ఇచ్చేస్తే మేం ఎలా బతుకుతాము సార్... పెద్దోళ్లు మీరే మా కష్టాలు గట్టెక్కించాలి’ అంటూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఎదుట పెందుర్తి, చినగదిలి మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆవేదనతో చేసుకున్న వినతి. ఒక్క నిమిషం విని ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే బండారు... ‘ఏయ్.. ఎవరు మీరంతా.. నాకే అడ్డంగా వచ్చి మాట్లాడుతారా.. నోర్మూసుకుని ఇక్కడి నుంచి పోండి.. పిచ్చిపిచ్చిగా ఉందా ఒక్కొక్కళ్లకి’... అంటూ నోరు పారేసుకున్నారు. ఏ మూలకూ రాని వేతనాలు.. ఎప్పుడు మంజూరవుతాయో తెలియని బిల్లులతో పోరాటం చేస్తూ తమ కడుపులు మాడ్చుకుని బడి పిల్లల కడుపు నింపుతున్న బడుగులపై చిందులు తొక్కారు. అసలేం జరిగిందంటే... తమ సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం ఉదయం ధర్నా చేసేందుకు పెందుర్తి, చినగదిలి మండలాలకు చెందిన పాఠశాలల మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు పెందుర్తి విద్యాశాఖ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో పెందుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్దకు ఎమ్మెల్యే బండారు వచ్చారన్న సమాచారంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎండీఎం నిర్వాహకులంతా అక్కడికి వెళ్లారు. ఎమ్మెల్యే ఆస్పత్రి నుంచి బయటకు రావడంతో వీరంతా ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక్క నిమిషం పాటు సమస్యలు విన్న బండారు క్షణాల్లో తీవ్ర ఆగ్రహానికి లోనై వారిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఏం.. ఏం మాట్లాడుతున్నారు.. పిచ్చిపిచ్చిగా ఉందా.. నోర్మూసుకొని ఇక్కడి నుంచి పోండి’ అంటూ తీవ్రస్వరంతో దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం వేదికగా మహిళలు అని చూడకుండా చుట్టూ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రోగులు ఉన్నారన్న ఇంగితం కూడా మర్చిపోయి తీవ్రంగా గద్దించారు. ఏన్నో ఏళ్లుగా తాము పడుతున్న కష్టాలను తీర్చమనడమే ఆ మహిళలు చేసుకున్న నేరంగా తన నోటి దురుసుతనాన్ని ప్రదర్శించారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే తీరుతో హతాసులైన ఎండీఎం నిర్వాహకులు అక్కడి నుంచి ఆవేదనగా వెనుదిరిగారు. ఎమ్మెల్యే దూషణలకు గురైన బాధిత మహిళలు భోరున విలపించారు. వారిని చూసి మిగిలిన వారు కూడా కన్నీటిపర్యంతమయ్యారు. తేరుకున్నాక స్థానిక విద్యాశాఖ భవనాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరును కడిగేశారు. తమ కష్టాలు తీరుస్తాడని ఓట్లేస్తే ఇలా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మనసు కకావికలమైపోయింది ఎమ్మెల్యే పెద్ద మనిషి అని మా బాధలు చెప్పుకుందామని వెళ్లాం. మా కష్టాలు చెప్పుకుంటుంటుండాగానే మాపై విరుచుకుపడ్డారు. నన్ను వేలు చూపించి నోర్ముయ్.. ఇక్కడి నుంచి పో అని ఆగ్రహంతో ఊగిపోవడంతో గుండె ఆగినంత పనయింది. కొంతసేపు మనిషిని కాలేకపోయాను. ఓట్లు కోసం మా ఇంటికి వచ్చి అభ్యర్థిస్తే మంచి మనిషి అని ఓటు వేశాను. ఇప్పుడు నాకు తగిన శాస్తి జరిగింది. మనసు బాధతో రగిలిపోతుంది.(విలపిస్తూ).– టి.రాజు(రాజమ్మ), జంగాలపాలెం, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకురాలు బండారు క్షమాపణ చెప్పాలి నిరుపేదలు, మహిళలు అని చూడకుండా ఎమ్మెల్యే బండారు ఎండీఎం నిర్వాహకులను దూషించడం హేయమైన చర్య అని సీఐటీయూ రాష్ట్ర కమిటీ ప్రతినిధి జి.అప్పలరాజు మండిపడ్డారు. కార్మికులకు జరిగిన అవమానం తెలుసుకున్న సీఐటీయూ నేతలు వారిని పరామర్శించి... వారి పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై వివక్ష చూపుతూ ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తుండగా.. అదే ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మెల్యే బండారు కార్మికులపై చిందులు తొక్కడం టీడీపీ ప్రభుత్వ ఆగడాలకు పరాకాష్ట అన్నారు. ఎమ్మెల్యేకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వినాలి... లేదంటే వెళ్లిపోమని చెప్పాలి గానీ.. ఇలా ఇష్టారీతిన దూషించడం సరికాదన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ఎమ్మెల్యే వ్యవహారశైలి మార్చుకోవాలని హితవు పలికారు. తక్షణమే బండారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
తులసి వనంలో బాబు గంజాయి మొక్క
-
తులసి వనంలో బాబు గంజాయి మొక్క
సాక్షి, పెందుర్తి : వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర శనివారం పెందుర్తిలోని 46, 49 వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తిపై విమర్శలు గుప్పించారు. బండారు ముదుపాక గ్రామంలో దళితులకు చెందిన వందలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. వామపక్షలతో కలిసి వాటిని అడ్డుకున్నామని, వైఎస్సార్ సీపీ ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. నియోజక వర్గంలో ఎమ్మెల్యే, ఆయన కుమారుడు, అనుచరుల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. జెర్రిపోతుల పాలెం గ్రామంలో మహిళను వివస్త్రనుచేసి దారుణాలకు పాల్పడ్డారని, బాధితురాలికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇప్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించారని విమర్శించారు. దళితులపై దౌర్జన్య కాండకు పాల్పడే బండారుకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత ఏమాత్రం లేదని విజయ సాయిరెడ్డి అన్నారు. హిందూజా పవర్, ఫార్మాసిటీ, ఎన్టీపీసీల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేక పోయారని విమర్శించారు. గతంలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించారని గుర్తు చేశారు. డిగ్రీ చదివే విద్యార్థుల కోసం పెందుర్తిలో డిగ్రీ కాలేజీ ఎందుకు నిర్మించలేక పోయారని నిలదీశారు. సీఎం చంద్రబాబు నాయుడు నాలుగేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్క అని విజయ సాయి రెడ్డి విమర్శించారు. ఏప్రిల్‌లో బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే, దాదా సాహెబ్ అంబేడ్కర్ లాంటి గొప్ప మహానుభావులు పుడితే, అదే నెలలో చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి నాయకుడు పుట్టారంటూ విమర్శించారు. అందుకే తులసి వనంలో చంద్రబాబు గంజాయి మొక్క అని ఎద్దేవా చేశారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకొనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటూ అది చంద్రబాబే అంటూ దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా చంద్రాబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరిని మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేక పోయిన నీతిమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చెప్పింది వినాల్సిందే..
సాక్షి, విశాఖపట్నం: ఈ మధ్య కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తనయులు, కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేల మాదిరిగా అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. అసలై ఒత్తిడితో పనిచేస్తున్న అధికారులు వీరు తీరుతో మనోవేదనకు గురవుతున్నారు. ఓ పక్క ఎమ్మెల్యేలకు మరో పక్క వారి కుటుంబ సభ్యులకు కూడా జీ హుజూర్ అంటూ భయపడి ఎంతకాలం విధులు నిర్వర్తిస్తామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తనయుడు అప్పలనాయుడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా అధికారులపై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే తనయునిగా పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటే ఎవరు తప్పు పట్టరు కానీ.. అధికారి కార్యక్రమాల్లో పాల్గొంటూ అన్నింటా పెత్తనం వెలగబెట్టడం విమర్శలకు తావిస్తోంది. ముదపాక భూముల వ్యవహారంలో కానీ.. నియోజకవర్గంలో జరిగే భూ కబ్జాలు, దందాలపై ఎవరైనా విమర్శిస్తే చాలు పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఒంటికాలుపై విరుచుకుపడుతుంటారు. మిత్ర పక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేనైనా సరే కడిగిపారేస్తుంటారు. తాజాగా తానేమి తీసిపోలేదన్నట్టుగా ఆయన తనయుడు బండారు అప్పలనాయుడు కూడా షాడో ఎమ్మెల్యే తరహాలో అధికారులపై విరుకుపడుతున్నారు. ఎమ్మెల్యే మాదిరిగా అన్నీ తానై అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాదు... అధికార యంత్రాంగంపై అడుగడుగునా పెత్తనం చలాయిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే చెబితే వింటాం.. ఏదైనా మాట అంటే పడతాం. కానీ ఆయన తనయుడు కూడా చీటికిమాటికి తమపై పెత్తనం చలాయిస్తే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మందు చులకన చేసేలా మమ్మల్ని నిలదీస్తుంటే ఏ విధంగా సమాధానం చెబుతామని వాపోతున్నారు. తాజాగా ఎమ్మెల్యే బండారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే.. శనివారం అధికారులను వెంటేసుకొని ఆయన తనయుడు పలు ప్రాంతాల్లో కలియతిరిగారు. సుజాతనగర్‌లోని పలు కాలనీల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ప్రజల ఎదుటే వారిని కడిగి పారేశారు. స్థానికులు డ్రైనేజీ సమస్యతో చాలా కాలంగా బాధపడుతున్నారు. నిధులు మంజూరు చేయాల్సింది పోయి.. ఇంకా ఎందుకు పనులు చేపట్టలేదంటూ కాలనీ వాసుల ఎదుట ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిన్న బుచ్చుకోవడం అధికారులు వంతైంది. ఇలా ఎమ్మెల్యే బండారు లేని రోజుల్లో ఆయన తనయుడు ఇలా సమావేశాలు, సమీక్షల నిర్వహించేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో సభావేదిక లెక్కేస్తున్నారు. ఎమ్మెల్యేల తరహాలో ఉపన్యాసాలిచ్చేస్తున్నారు. సీఎం పర్యటనల్లోనే కాదు.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సైతం అన్నింటా తానై పెత్తనం చలాయిస్తుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు చేస్తున్న పెత్తనం తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అయితే తాము పని చేయలేమంటూ వాపోతున్నారు. ఎమ్మెల్యే ఊళ్లో లేనప్పుడు జిల్లా స్థాయి అధికారులు, జెడ్సీ స్థాయి అధికారులను ఇంటికి పిలిపించుకొని సమీక్షలు నిర్వహించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెబితే వెళ్లాల్సిన అధికారులు వారు కుమారులు పిలిచినా వెళ్లడం విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంస్కృతికి అధికారులు బ్రేక్ చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఇదిగో బండ బూతుల.. బండారం!
► 18 ఏళ్లకే డిగ్రీ పట్టా ఎలా వచ్చిందో? ► డిగ్రీయే ఉంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటెందుకు లేదు ► సోషల్ మీడియాలో విమర్శల హోరు ► తన వైపు తప్పులుంచుకొని ఎదుటివారిపై అవాకులు చవాకులు ► టీడీపీ ఎమ్మెల్యే బండారు జుగుప్సాకర వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన గురివింద గింజ తన నలుపును మరిచి ఇతరులను వెక్కిరిస్తుందట!.. ఘనత వహించిన పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీరు ఈ గురువింద సామెతనే గుర్తు చేస్తోంది. తన వెనుక వంద తప్పులు పెట్టుకొని.. వాటిని ఎత్తి చూపినవారిపై విరుచుకుపడుతున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధినన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. సహనం, సభ్యత కోల్పోయి.. విచక్షణ మరిచి ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలం రువ్వుతున్నారు.. తానేదో పత్తిత్తునన్నట్లు ఫోజులు కొడుతున్నా.. ఆయన వాడుతున్న పదజాలమే ఆయనగారిలోని సంస్కారం పాలెంతో చెప్పకనే చెబుతోంది.. ఇదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. పనిలోపనిగా ఎమ్మెల్యేగారి విద్యార్హతల బండారం కూడా ఈ మాధ్యమాల్లో బట్టబయలైంది. పత్రికల్లో రాయలేని భాష.. దుర్భాషకు మించి జుగుప్సాకరమైన రీతిలో.. పిచ్చి వాగుడుతో సొంత పార్టీ నేతలకే ఏవగింపు కలిగిస్తున్న మాజీ మంత్రివర్యుడు బండారు సత్యనారాయణమూర్తి విద్యార్హతల లోగుట్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. భూ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా వామపక్ష పార్టీల నేతలు విమర్శలు చేశారు. స్వయంగా తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బీజేపీ శాసనసభాపక్ష నేత పి.విష్ణుకుమార్‌రాజు కూడా బండారు ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాక గ్రామంలో జరిగిన ల్యాండ్ ఫూలింగ్ కుంభకోణంపై పలుమార్లు విమర్శలు సంధించారు. కానీ బండారువారు మాత్రం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి; ఎంపీ విజయసాయిరెడ్డినే టార్గెట్ చేసుకుని గురువారం కువిమర్శలు దిగారు. నోటికొచ్చినట్టు పేట్రేగిపోయారు. అధికారమదంతో ఆయన చేసిన విమర్శలు, వ్యాఖ్యలపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 18 ఏళ్లకే పట్టా పుచ్చుకున్నారట! కాగా, బండబూతుల బండారు విద్యార్హతకు సంబంధించి శుక్రవారం సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సర్టిఫికెట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. 2014 ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో అనకాపల్లి ఎ.ఎం.ఎ.ఎల్ కళాశాల నుంచి 1978లో బీకాం డిగ్రీ పట్టా పొందినట్టు బండారు పేర్కొన్నారు. అదే అఫిడవిట్లో తన వయస్సు 54 ఏళ్లుగా పేర్కొన్నారు. ఈ లెక్కన ఆయన 1960లో పుట్టారన్నమాట. మరి 1978లోనే.. అంటే 18 ఏళ్లకే డిగ్రీ పట్టా ఎలా అందుకున్నారన్నదే ఇప్పుడు ప్రశ్న. పూర్వకాలంలో ఐదేళ్ల వయసు వచ్చిన తర్వాతే స్కూళ్లలో జాయిన్ చేసేవారు. ఆ ప్రకారం చూసుకుంటే సాధారణంగా ఎవరైనా 15–16 ఏళ్ల వయసులో పదో తరగతి, 17–18 ఏళ్లకు ఇంటర్ పూర్తి చేస్తారు. కానీ మన బండారు వారు మాత్రం ఇంటర్ పూర్తి చేసే వయసుకే డిగ్రీ పట్టా అందేసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారంటే దాన్ని ఏమనుకోవాలి?.. ఇక ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఓటు కూడా వేయలేదు. ఇదే విషయాన్ని ఆ సందర్భంలో విలేకరులు అడిగితే.. ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు. ఇప్పు డు బయటపడిన సర్టిఫికెట్ల బండారం చూస్తుంటే.. ఆయన ఎన్నికల సమయంలో డిగ్రీ ఉందని తప్పుడు పత్రాలు సమర్పించినట్టు అర్థమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్హత మొదలు తప్పుడు లెక్కలు చూపించిన బండారు రాజకీయ జీవితంలో ఎంతో అప్రతిష్ట ను, అపకీర్తిని మూటగట్టుకున్నారు. వీట న్నింటినీ విస్మరించి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలపై బాధితుల పక్షాన మాట్లాడినందు కు ఆయన రెచ్చిపోయిన తీరు.. చేసిన వ్యాఖ్యలు.. వ్యవహారశైలి అందరికీ ఏవగింపు కలిగిస్తున్నాయి. -
విపక్ష నేతలపై ఎమ్మెల్యే బండారు దుర్భాషలు
ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా జగన్, విజయసాయిరెడ్డిలపై దూషణలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, మహిళల ముందే తిట్ల దండకం పెందుర్తి: పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తాను ఓ ప్రజాప్రతినిధినన్న విషయం కూడా మరచిపోయి సంస్కారం లేకుండా విపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రభుత్వ పాఠశాలలో బండారు తిట్ల పురాణం చూసి అక్కడున్న విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులతోపాటు సొంత పార్టీ కార్యకర్తలే నివ్వెరపోయారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలను లక్ష్యంగా చేసుకుని బండారు నోరుపారేసుకున్నారు. వేపగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో నిస్సిగ్గుగా రాయడానికి వీలులేని విధంగా ఆయన మాట్లాడారు. తనపై, తన కుమారుడిపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వకుండా ప్రతిపక్ష నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. రెండుసార్లు ఎంపీపీగా చేశా.. నాలుగు సార్లు ఎమ్మెల్యేని.. ఓ సారి మంత్రిని అని అంటూనే దుర్భాషలకు దిగారు. ‘నా కొడకా.. వెధవ.. స్కౌండ్రల్..(పత్రికలో రాయలేని మాటలు) లాంటి పదాలతో సంభోదిస్తూ తిట్ల దండకం చదివారు. దిగజారి మాట్లాడటం బండారుకు అలవాటే బండారు దిగజారి మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. నాలుగేళ్ల క్రితం ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పెందుర్తిలో తన పార్టీకే చెందిన పీలా శ్రీనివాసరావు వర్గీయులపై దాడులకు దిగారు. నడిరోడ్డుపై దూషణలకు దిగారు. ఏడాది క్రితం పెందుర్తి పోలీస్‌స్టేషన్ వద్ద ఆసుపత్రికి స్థల పరిశీలన సందర్భంగా ఓ ట్రాఫిక్ సీఐపై అందరి ముందే చిందులు తొక్కారు. అదే రోజు ఓ రెవెన్యూ అధికారి సైతం బండారు నోటి దురుసుకు బలయ్యారు. -
అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే?
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్లను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులు కట్టబెట్టడంతో టీడీపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారిని కేబినెట్ లోకి తీసుకోవడంతో అలకబూనారు. మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారు. తమ నాయకుడికి మంత్రి పదవి రాలేదన్న విషయం తెలుసుకున్న మద్దతుదారులు సత్యనారాయణమూర్తి స్వగ్రామం వెన్నెలపాలెంకు భారీ సంఖ్యలో చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. -
బాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు బాహాబాహీకీ దిగారు. ఈ ఘర్షణకు విశాఖ జిల్లా సబ్బవరం వేదికైంది. విశాఖ జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన భాగంలో సబ్బవరంలో పెట్రోల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గండి బాబ్జి, బండారు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గండి బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాబ్జి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెందుర్తి ఒరలో రెండో కత్తి
ఇటు బండారు.. అటు బాబ్జీ పార్టీ నిర్ణయంతో ఎమ్మెల్యే కినుక పెత్తనం కోసం బాబ్జీ పావులు ఇరకాటంలో అధికారులు, కార్యకర్తలు విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బృందం టీడీపీలో చేరడంతో పెందుర్తి నియోజకవర్గ పార్టీలో ముసలం పుట్టింది. మొదటి నుంచి బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పార్టీ తీరుతో కినుక వహించారు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీనిపై ఎవరు కదిపినా నో కామెంట్ అంటూ దాట వేస్తున్నారు. తాను ఎంత చెప్పినా పట్టించుకోకుండా బాబ్జీని పార్టీలో చేర్చుకోవడాన్ని బండారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీ నగర మాజీ అధ్యక్షుడు పల్లా శ్రీను వర్గం పక్కలో బల్లెంలా ఉండగా ఇప్పుడు బాబ్జీ రాక బండారుకు మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బండారు పుత్రరత్నం అప్పలనాయుడు చేష్టలతో గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్లను, ఆయన వ్యతిరేక వర్గీయులను తనవైపు తిప్పుకునేందుకు బాబ్జీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొందరు బాబ్జీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. పరవాడ, పెందుర్తి, సబ్బవరంలలో బండారుతో విభేదించిన నేతలంతా ఇప్పటి వరకు ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పీలాశ్రీను వెంటనడుస్తున్నారు. వీరందర్ని తన వైపు తిప్పుకొని బాబ్జీమూడో కుంపటి పెడుతున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆధిపత్యం కోసం పోటీ బండారు ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బాబ్జీ అనుచరులు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలో చేరకముందు నుంచే వారు అధికారులపై పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు. ఇప్పుడు పార్టీలో చేరడంతో ఈ రెండువర్గాల మధ్య అధికారులు నలిగిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేను కాబట్టి నా మాటే వినాలని బండారు.. రానున్న ఎన్నికల్లో టికెట్ నాదే కాబట్టి నా మాట వినాలంటూ బాబ్జీ పెత్తనం విషయంలో పోటీపడుతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడి ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇరువురు నేతలు ఇప్పుడు ఒకేపార్టీలో ఉండడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. అసలే పీలా శ్రీనివాస్ వర్గంతో చచ్చిపోతున్నాం..ఇప్పుడు గండి బాబ్జీ వర్గంతో వేగలేమని ఎమ్మెల్యే బండారు తన ముఖ్య అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఈ విషయంలో బండారును బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చేరిక సమావేశానికి మాత్రం బండారును రప్పించలేకపోయారు. బండారే కాదు..గంటా వర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీటు దగ్గరే తేడా: వాస్తవానికి గ్రామస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు అధికారంతో పనిలేకుండా స్థానికంగా అజమాయిషీ చెలాయిస్తున్నారు. జన్మభూమి కమిటీలతో పాటు కమిటీయేతర టీడీపీ నాయకులు కూడా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల కంటే ముందు వారికే సీట్లు కేటాయించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు టీడీపీలో గండి బాబ్జీ చేరిక తరువాత అదే గ్రామాల్లో మరో టీడీపీ వర్గం తయారైంది. అంటే అదే వేదికలపై వారికి కూడా సీట్లు కేటాయించాలి. అయితే ఎవరి సీటు వెనుక వేయాలో ఎవరిది ముందు వేయాలో అధికారులకు కత్తిమీద సామే. సీటు దగ్గరే ఇంత ఉంటే ఇక పనులు విషయంతో ఎంత రాద్దాంతం జరుగుతుందో అని అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. -
అలిగిన మరో టీడీపీ ఎమ్మెల్యే
విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై మరో టీడీపీ ఎమ్మెల్యే అలకపాన్పు ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని టీడీపీలోకి చేర్చుకోవడాన్ని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనపై ఓడిపోయిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే గండి బాబ్జీ చేరిక కార్యక్రమానికి బండారు గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది. గండి బాబ్జీ అవినీతిపరుడని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బండారు ఫిర్యాదు చేశారు. కాగా, బాబ్జీ టీడీపీలో చేరికను మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం ఎమ్మెల్యేలు ఇదే చేరిక కార్యక్రమానికి గైర్హాజరు అయ్యినట్టు తెలిసింది. -
రాయపాటిపై టీడీపీ ఎమ్మెల్యేలు ఫైర్
విశాఖపట్నం: తుపానొస్తే మునిగిపోయి... గాలేస్తే ఎగిరిపోయే విశాఖలో రైల్వేజోన్ ఎందుకని వ్యాఖ్యలు చేసిన నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ అవసరం గురించి రాయపాటికి ఏం తెలుసునని, రైల్వే జోన్ పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించబోమని అన్నారు. గోపాలపట్నంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాయపాటి వ్యాఖ్యలు ఉత్తరాంధ్ర ప్రజలను బాధపెట్టేవిగా ఉన్నాయన్నారు. భువనేశ్వర్ కేంద్రంగా సౌత్‌సెంట్రల్, ఈస్ట్‌కోస్టు రైల్వేలు ఉన్నా, విశాఖ డివిజన్ నుంచి తొంభై శాతం రైల్వేకి ఆదాయం వస్తోందని గుర్తు చేశారు. విశాఖకే రైల్వే జోన్ ఇవ్వాలి పెందుర్తి: విశాఖకు రైల్యే జోన్ వద్దని ఎంపీ రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఖండించారు. శుక్రవారం ఆయన పెందుర్తిలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖకు ప్రత్యేక జోన్ తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయపాటి ఎందుకు అలాంటి వాఖ్యలు చేశారో తనకు అర్థం కావడంలేదన్నారు. -
మేమంటే లెక్కలేదా?
‘స్థాయీ’ సమావేశంలో ప్రజాప్రతినిధుల ఫైర్ వాడి వేడిగా చివరి సమావేశం విశాఖ రూరల్:‘ప్రజాప్రతినిధులంటే జిల్లా అధికారులకు మర్యాద లేనట్టుంది. ఏ సమాచారం ఇవ్వరు. ఏ శాఖలో ఏ పని జరుగుతోందో చెప్ప రు. పద్ధతి మార్చుకోవాలి’ అంటూ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధికారులపై ఫైర్ అయ్యారు. బుధవారం ఉద యం నుంచి సాయంత్రం వరకు జెడ్పీ చైర్పర్సన్ లాలం భవాని అధ్యక్షతన ఏడు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఒకటి నుంచి ఆరు స్థాయి సంఘం సమావేశాలు ప్రశాం తంగా జరగగా సాయంత్రం జరిగిన చివరి స్థాయి సమావేశంలో ప్రజాప్రతినిధులు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ముత్తంశెట్టి, ఎమ్మెల్యే బండారులు అధికారులను నిలదీశారు. ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించి పనుల ప్రగతిపై చర్చకు రాగా కొన్ని పనులు సక్రమంగా జరగడం లేదంటూ అధికారులను ప్రశ్నిం చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖకు సంబంధిం చి ఎటువంటి సమాచారం అందించడం లేదని, అడిగిన వివరాలు కూ డా సక్రమంగా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఏదైనా ప్రాజెక్టు, పను ల విషయంలో సమస్య తలెత్తితే ప్ర జాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే అవసరమైన వాటిని ప్రభుత్వం దృ ష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. గత మూడేళ్లుగా జిల్లా పరిషత్‌లో చేపట్టిన పను లు, ఖర్చు చేసిన నిధులు వివరాలు చెప్పాలంటూ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులను నిల దీశారు. ఈ స్థాయి సంఘం సమావేశాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పింఛన్లు పునరుద్ధరించాలి ఉదయం జరిగిన 2వ స్థాయి సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖకు సం బంధించిన అంశాలతోపాటు గృహ నిర్మాణం, సహకారం, పొదుపు, చిన్నమొత్తాల పొదుపు, పరిశ్రమల అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా పెన్షన్ల విషయంపై చర్చకు వచ్చింది. చోడవరం ఎమ్మెల్యేల సన్యాసిరాజు మాట్లాడుతూ చాలా ఏళ్లుగా పించన్లు పొందుతున్న వారిని ఇపుడు అనర్హులుగా గుర్తించడం దా రుణమన్నారు. రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరగా ప్రజాప్రతినిధులు ఆ విధంగా తీర్మానించారు. జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమల్లో స్థానికులకే ఉపాధి కల్పించాలని మరో తీర్మానం చేశారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీకి రైవాడ నీటిని నిలిపివేయాలి జిల్లాలోని జలాశయాలకు విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని, జనరేటర్లున్నా డీజిల్ ఇవ్వడం లేదని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు నీటిపారుదల శాఖాధికారులను ప్రశ్నించారు. రైవాడ పరిస్థితి దారుణంగా ఉందని, జనరేటర్ ఉన్నా డీజిల్ లేదనగా నిధులవసరమని అధికారులు చెప్పుకొచ్చారు. రైవాడ నీటిని వినియోగించుకుంటున్న జీవీఎంసీ రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉందని, అవి చెల్లిస్తేగాని నీటిని సరఫరా చేయొద్దని ఎమ్మెల్యే సూచించారు. సుజల స్రవంతి కింద జిల్లాలో 237 యూనిట్లు ఏర్పాటుచేస్తామని నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఏర్పాటుచేయడంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. దాతలు ముందుకు వస్తే మిగిలినవి ఏర్పాటు చేస్తామని వారు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ఆర్టీసీ డీఎం చిన్నచిన్న పొరపాట్లకు చర్యలు తీసుకుంటున్నారని, ఇలా అయితే బస్సులు నడపలేరన్నారు. -
బండారుకు పూర్తి సహకారం
మంత్రి గంటా పరవాడ: పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలు ఉంటాయని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వెన్నలపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండా రు స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి గంటా మాట్లాడారు. ఎమ్మెల్యే బండారుకు మంత్రి పద వి రాలేదని నియోజక వర్గ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే బండారు మాట్లాడు తూ కష్టపడి పనిచేసిన తన లాంటి వారిని అధిష్టానం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల నుంచి తన కుటుంబం రాజకీయాల నుంచి విరమిం చుకుంటుందని చెప్పారు. మంత్రి గంటా అండదండలతో నియోజక వర్గ సమస్యలను పరిష్కరిస్తానన్నారు. అంతకు ముం దు బండారుతో గంటా చర్చలు జరిపారు. -
బండారు భగభగ
మంత్రి పదవి దక్కక మనస్తాపం టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా అయ్యన్నకు అందలంపై గుర్రు సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో మంత్రి పదవుల సెగ రాజుకుంది. చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబికింది. తొలి పందేరంలో తనకు స్థానం దక్కకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రాజీనా మా చేశారు. ఆదివారం రాత్రి గుంటూరులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఆయన తనకు మంత్రివర్గంలో చోటివ్వక పోవడంతో మధ్యలోనే వెనుదిరిగారు. సోమవారం హుటాహుటీన అనుచరులతో సమావేశమై ఆ తర్వాత పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అధ్యక్షుడు చంద్రబాబుకు ఫ్యాక్స్‌లో తన రాజీనామా పంపారు. తనకు 18 వేల ఓట్ల మె జార్టీ వస్తే, అయ్యన్నకు రెండు వేల ఓట్ల ఆధిక్యతే వచ్చిందని, అయ్యన్నతో పోల్చితే వివాద రహితుడినైన తనకు బాబు మొండిచేయి చూపారంటూ ఆవేదనకు గురయినట్టు తెలిసింది. ఇటీవల పార్టీలో చేరిన గంటా కు మంత్రి పదవి ఎలా ఇస్తారని బండారు ప్రశ్నిస్తున్నారు. చాన్నాళ్ల నుంచి అయ్యన్న, బండారుల మధ్య అసలు పొసగడం లేదు. అయ్యన్న జిల్లాలో పార్టీపై పెత్తనం చేస్తున్నారనే నెపంతో ఆయనకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకున్నారన్న వాదన ఉంది. బండారు ప్రయత్నాలతో గంటా పార్టీలో చేరడం అయ్యన్నకు రుచించలేదు. దీంతో చంద్రబాబు సమక్షంలోనే గంటాపై విమర్శలు చేసి తన వైఖరిని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో అయ్యన్నపై చంద్రబాబు గుర్రుగా ఉన్నందున ఆయనకు బదులు తనకు మంత్రి పదవి వస్తుందని బండారు అంచనా వేశారు. కానీ బాబు అయ్యన్న వైపే మొగ్గు చూపడంతో బండారుకు ఆశనిపాతమైంది. మంత్రి పదవి ఇవ్వకపోయినా వచ్చేసారైనా అవకాశం ఇస్తామన్న హామీ కూడా దక్కకపోవడం బండారు మనస్తాపానికి కారణంగా చెబుతున్నారు. అయితే బండారుకు వుడా ఛైర్మన్ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. దీనిపై బండారుతో ‘సాక్షి’ మాట్లాడగా, తనకు వుడా ఛైర్మన్ పదవి వద్దని చెప్పారు. బండారు అలకను పార్టీ అధిష్ఠానం పట్టించుకుంటుందో లేదో చూడాలి. -
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి బండారు గుడ్‌బై
-
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి బండారు గుడ్‌బై
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మంత్రి పదవుల కేటాయింపుపై టీడీపీలో రగడ మొదలయింది. చంద్రబాబు నాయుడు మంత్రివర్గ కూర్పుపై విశాఖ జిల్లా టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారు స్వగ్రామం వెన్నెలపాలెంలో ఆయన అనుచరులు సమావేశమయ్యారు. బండారుకు మంత్రి పదవికి ఇవ్వనందుకు నిరసనగా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు రాజీనామాకు సిద్దపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బండారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పారు. -
బండారం బయటపడుతోంది
కబ్జాలు...వసూళ్లు బండారు అనుచరులదీ ఇదే తీరు భీతిల్లుతున్న ఓటర్లు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రజల సమస్యలపై ఉద్యమాల ముసుగులో బ్లాక్మెయిల్ రాజకీయాలు.. పారిశ్రామిక ప్రాంతాల్లో సమస్యలపై బయట పోరాటాలు.. తెరవెనుక పారిశ్రామికవేత్తలతో లాలూచీలు.. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల కబ్జాలలు. భూబకాసరులకు వంతపాటలు.....పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తిపై ఇలా పలు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్యం, నిరుద్యోగం, ఉపాధి కల్పనల పేరుతో కొద్ది రోజులు ఉద్యమాలు నడిపి హడావుడి చేయడం.. లక్షలకు లక్షలు పిండుకున్నాక ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేయడం ఆయన నైజమన్న వార్తలు గుప్పుమంటున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా భూ కబ్జాదారులను పెంచి పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశ్రామిక వాడలో ఉద్యమాలు చేసిన బండారు అక్కడ పోటీ చేయకుండా పెందుర్తి నుంచి పోటీకి దిగడం వెనుక ఆ పార్టీ కార్యకర్తలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాజువాక, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో బండారు సత్యనారాయణమూర్తి పోరాటాల ముసుగులో ప్రజలను మోసం చేశారన్న అభిప్రాయాలు ఉండడంతో అక్కడ నుంచి గెలవలేరని భావించి, పెందుర్తిని ఎంచుకున్నట్లు చెప్పుకుంటున్నారు. తాజాగా పెందుర్తి నియోజవకర్గంలో ఆయన వెంట ఉండే అనుచరగణాన్ని చూస్తుంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనేక భూ కబ్జాలు బండారు అనుచరులు పెందుర్తిలో అనేక భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూములను దిగమింగారు. రికార్డులను ట్యాంపర్ చేసి భూములను జిరాయితీలుగా మార్చి దర్జాగా అమ్ముకున్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అమృతాపురం గ్రామంలో సర్వే నెంబర్ 394-1లో 4.22 ఎకరాల ప్రభుత్వ భూమిని బండారు ముఖ్య అనుచరుడైన గండి ముత్యాలనాయుడు కబ్జా చేశాడు. ఈయన బండారు ఆశీస్సులతో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా పదేళ్లుగా కొనసాగుతున్నాడు. ముత్యాలనాయుడు అధికారులను ప్రసన్నం చేసుకొని ప్రభుత్వ భూమిని జిరాయితీగా రికార్డుల్లో మార్పించి తన భార్య పేరున గిఫ్ట్‌డీడ్ రాయించి ఇచ్చాడు. సుమారు రూ.3 కోట్లు విలువ చేసే ఆ భూమిని 2007లో కరణం ప్రభావతి, నర్సిపల్లి మల్లేశ్వరి అనే ఇద్దరికి విక్రయించాడు.ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సమాచార హక్కు చట్టం గుర్తించి ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు సబ్బవరం మండలంలో గొల్లలపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 47/2లో 22 ఎకరాల మిగులు భూములను కూడా ముత్యాలనాయుడు కబ్జా చేశారు. అధికారంలోకి వస్తే అంతే.. ప్రస్తుతం ముత్యాలనాయుడు, బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికల ప్రచారాల బాధ్యతలను చూస్తున్నారు. ఎటువంటి అధికారం లేకుండానే అనేక కబ్జాలకు పాల్పడుతున్న వారికి అండదండలు అందిస్తున్న బండారు.. అధికారంలోకి వస్తే పెందుర్తిలో భూబకాసురులకు ఎదురుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.