అలిగిన మరో టీడీపీ ఎమ్మెల్యే
విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై మరో టీడీపీ ఎమ్మెల్యే అలకపాన్పు ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని టీడీపీలోకి చేర్చుకోవడాన్ని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనపై ఓడిపోయిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే గండి బాబ్జీ చేరిక కార్యక్రమానికి బండారు గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది.
గండి బాబ్జీ అవినీతిపరుడని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బండారు ఫిర్యాదు చేశారు. కాగా, బాబ్జీ టీడీపీలో చేరికను మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం ఎమ్మెల్యేలు ఇదే చేరిక కార్యక్రమానికి గైర్హాజరు అయ్యినట్టు తెలిసింది.