gandi babji
-
అనకాపల్లి జిల్లా టీడీపీలో బయటపడ్డ విభేదాలు..
-
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. -
సౌత్ నియోజకవర్గం నుంచి మారాలని బాజ్జిపై ఒత్తిడి
-
బాలకృష్ణ అల్లుడి పాదయాత్ర.. టీడీపీలో చిచ్చు రాజేస్తోందా?
తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు క్రమంగా పెరుగుతున్నాయి. గంటా–అయ్యన్నతో మొదలైన ఈ విభేదాలు కాస్తా తాజాగా విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాలకూ పాకాయి. విశాఖ దక్షిణ సీటుపై భరత్ కన్నేయగా.. గండి బాబ్జీ చూపు కాస్తా పెందుర్తిపై పడింది. పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి బండారు అవినీతిపరుడంటూ ఆయన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. మరోవైపు పాయకరావుపేటలో గంటా, చిరంజీవి ఫొటోలు లేకుండానే అనిత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించడంతో ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నారు. అయినా అయ్యన్న అండతో అనిత తగ్గేదేలే అని అంటున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో విభేదాల పర్వం క్రమంగా అన్ని నియోజకవర్గాలకూ పాకుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీలో విశాఖ దక్షిణ సీటు కాస్తా హీటు పుట్టిస్తోంది. విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసేందుకు భరత్ ఆసక్తి చూపుతుండటం.. పెందుర్తి నియోజకవర్గంలోనూ సెగలు రేపుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీచేసి ఓటమి పాలైన భరత్ ఇప్పుడు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా ‘మీ కోసం– మీ భరత్’ పేరుతో పాదయాత్రలు చేస్తున్నారు. ఈ పాదయాత్రలు కూడా కేవలం దక్షిణ నియోజకవర్గానికే పరిమితం కావడం చర్చనీయాంశమవుతోంది. విచిత్రంగా ఈ పాదయాత్రలో నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న గండి బాబ్జీ కూడా పాల్గొంటుండటం గమనార్హం. ఇది కాస్తా ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీలుగా గండి బాబ్జీ పావులు కదుపుతున్నారన్న చర్చ నడుస్తోంది. ఇదే అదునుగా గత ఎన్నికల్లో తనకు సీటు ఇస్తే గెలిచేవాడినని.. అవినీతి వ్యవహారంలో కూరుకుపోయిన బండారు ఓడిపోతారని తాను ముందే పార్టీ పెద్దలకు చెప్పినట్టు గండి బాబ్జీ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరలేపింది. మరోవైపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో గంటా శ్రీనివాసరావు, చిరంజీవి వంటి నేతల ఫొటోలు లేకుండా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నారు. తమను చిన్నచూపు చూస్తున్న అనిత తీరు మార్చుకోకపోతే అంతిమంగా తామంతా టీడీపీకి దూరమవుతామని కూడా నియోజకవర్గ కాపు నేతలు హెచ్చరించారు. ఇక ఇప్పటికే గంటాకు అయ్యన్నకు మధ్య పచ్చగడ్డి వేయకపోయినా మండుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య రేగుతున్న విభేదాలు క్రమంగా అన్ని నియోజకవర్గాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నేత లేకపోవడంతో.. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి టీడీపీకి నాయకుడు లేని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్‌కుమార్ కాస్తా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులయ్యారు. అనంతరం తెలుగుదేశం పార్టీని కాదని దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కాస్తా దక్షిణ నియోజకవర్గంలో నాయకుడు లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గండి బాబ్జీని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయిష్టంగానే ఈ బాధ్యతలను స్వీకరించిన గండి బాబ్జీ.. నామమాత్రంగా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తెరపైకి భరత్ రావడంతో.. తన కన్ను కాస్తా పెందుర్తిపై పడింది. ఇదే అదనుగా బండారుతో పాటు ఆయన కుమారుడుపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మరోసారి ఆయనకు సీటు ఇచ్చినా ఓటమి తథ్యమని కూడా తన సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. గంటా–అయ్యన్న మధ్య మరింత గ్యాప్! గంటా శ్రీనివాసరావుకు, అయ్యన్న పాత్రుడుకు మధ్య రోజురోజుకీ గ్యాప్ మరింత పెరుగుతోంది. ఇప్పటికే తన నియోజకవర్గంలో గంటా తలదూరుస్తున్నారన్న అనిత... తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఫొటో లేకుండానే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర సమీక్ష కోసం విశాఖ వచ్చిన చంద్రబాబుకు ముందురోజే అయ్యన్న ఝలక్ ఇచ్చారు. తాను సమీక్షకు రానని భీష్మించుకూర్చున్నారు. నర్సీపట్నంతో పాటు అనకాపల్లి ఎంపీ సీటు వ్యవహారంలో గంటా తలదూర్చడంతో పాటు ఇన్ని రోజులుగా మిన్నకుండి ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తూ తమను పార్టీకి దూరం చేస్తున్నారని అయ్యన్న మండిపడ్డారు. ఈ నేపథ్యంలో చివరకు చంద్రబాబు దిగివచ్చి సమీక్ష సందర్భంగా అయ్యన్నకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గంటాను దూరంగా ఉంచారు. ఇదే అదనుగా అనిత కూడా గంటా ఫొటో లేకుండానే తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై ఆ పార్టీ కాపు నేతలు మండిపడుతున్నప్పటికీ తగ్గేదేలే అని ముందకు వెళుతున్నారు. మొత్తంగా టీడీపీలో ఈ అసమ్మతి వ్యవహారం క్రమంగా అన్ని నియోజకవర్గాలకు పాకుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గండి బాబ్జీ ఇదేం పని.. ఇలా చేశావేంటీ?
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా ఎన్ని గొడవలున్నా శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు అన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటిగా కలుసుకుంటాం. అందుకు భిన్నంగా ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడంలో సిద్ధహస్తులుగా మారుతున్నారు టీడీపీ నగర నేతలు. ప్రతి విషయంలోనూ విలువలకు ‘గండి’ కొట్టే సదరు టీడీపీ నేత... ఎమ్మెల్యే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యంలోనూ రాజకీయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలే భగ్గుమంటున్నారు. శుభకార్యాల్ని కూడా రాజకీయం చేస్తే పార్టీ మనుగడ కష్టమవుతుందంటూ పంచాయితీని పెద్దల ముందుకు తీసుకెళ్లడంతో మరోసారి పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. చదవండి: గ్రూప్‌హౌస్‌లో వ్యభిచారం.. మేడపైకి ఇద్దరేసి యువతులను తీసుకొచ్చి.. శుభకార్యానికి వెళ్లొద్దనడంతో... రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ కుమారుడి రిసెప్షన్ జరిగింది. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన వాసుపల్లికి ఆ పార్టీలోని అన్ని వర్గాల వారితో సత్సంబంధాలున్నాయి. దీంతో అందరికీ ఈ వేడుకకు ఆహ్వానం అందించారు. విషయం తెలుసుకున్న టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జీ వాసుపల్లి కుమారుడి రిసెప్షన్‌కు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. ఎవరైనా ఈ వేడుకకు హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే మండిపడ్డారు. రాజకీయాలు రాజకీయాలే.. శుభకార్యాలు శుభకార్యాలే.. ఆయనెవరు మమ్మల్ని వెళ్లనివ్వొద్దని చెప్పడానికంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చూద్దామంటూ వేడుకలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న బాబ్జీ.. ఎవరైతే వాసుపల్లి ఇంట జరిగిన శుభకార్యానికి హాజరయ్యారో వాళ్లని పార్టీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా గ్రూపుల నుంచి తొలగించారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎక్కడా లేని విధంగా ఇలాంటి కుటిల రాజకీయాలకు గండి బాబ్జీ ఆద్యుడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. లేనిపోని వ్యవహారాలపై ఆంక్షలు విధిస్తే.. పార్టీ గెలవడం మాట అటుంచితే మనుగడ కూడా కోల్పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది నేతలతో కలిసి పనిచేసినా.. ఈ తరహా నీఛమైన అనుభవం ఎదురవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భరత్ దృష్టికి పంచాయితీ గండి బాబ్జీ వ్యవహారాన్ని పార్టీ పెద్దల ముందుకు తీసుకెళ్లాలంటూ పంచాయితీని పార్టీ సీనియర్ నేత భరత్ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్జీ వైఖరిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. గండి బాబ్జీ వ్యవహారంపై ఆ పార్టీ మహిళ ఆవేదనకు సంబంధించిన ఆడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. దాని సారాంశాన్ని ఓసారి పరిశీలిస్తే... ‘‘బాబూ.. భరత్.. మీ తాత గారు మమ్మల్ని నియమించారు. అందరూ సమానమేననే ధోరణితో వెళ్లాం ఇన్నాళ్లూ. అన్ని పార్టీలూ సమానమేనని అనుకున్నాం. ఎన్నికల సమయంలో ఎలా గెలవాలనే ఆలోచనతో నిత్యం బాధలు పడి పనిచేసేవాళ్లం. కానీ ఏనాడూ ఇబ్బంది పడలేదు. కానీ ఇప్పుడు గండి బాబ్జీ వచ్చాక చుట్టాల దగ్గరికి వెళ్లొద్దంటారు.. పట్టాల దగ్గరికెళ్లొద్దంటున్నారు. వాసుపల్లి గణేష్‌కుమార్ మా బంధువు. ఆ పెళ్లికి వెళ్తున్నాననీ.. ఎవరైనా వస్తున్నారా అని 34వ వార్డు గ్రూపులో మెసేజ్ పెట్టాను. అది తప్పు అని.. ఎవరూ పెళ్లికి వెళ్లొద్దని పీఏతో బాబ్జీ వార్నింగ్ ఇచ్చారు. అన్ని గ్రూపుల నుంచి నన్ను తొలగించేశారు. ఇది ఎంతవరకూ కరెక్ట్.? ఇలాంటి విలువల్లేని మనుషులా అనేది అర్థం కావడం లేదు. నేను చేసిన తప్పేమీ లేదు. పెళ్లిళ్లకు వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మా వ్యక్తిగతం. దాన్ని ఇలా రాజకీయం చేస్తారని అనుకోలేదు. గెలిచే వ్యక్తులైతే ఇలా విడదీసి పాలించరు. ఇతను వచ్చాక కనీసం 50 మంది ముఖ్య కారకర్తలు పార్టీకి దూరమయ్యారు. పార్టీ గెలవాలనుకుంటున్నారో..? ఓడిపోవాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇదే విషయాన్ని నడిరోడ్డుపై ప్రెస్‌మీట్ పెట్టి నిలదీయాలని అనుకుంటున్నాను.’’ ఇలా.. ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గండి బాబ్జీ వ్యవహారంపై దక్షిణ నియోజకవర్గం టీడీపీ నేతల్లో ఇప్పటికే పూర్తి వ్యతిరేకత ఉంది. నియంతలా వ్యవహరిస్తూ కేడర్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పార్టీ నుంచి చాలా మంది దూరమైపోతారన్న సంకేతాల్ని ఇప్పటికే పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్ధా వెంకన్న బుధవారం నగరానికి వచ్చారు. గండి బాబ్జీ వ్యవహారాన్ని ఆయన దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
ఆయన గతమంతా బెదిరింపులు, వేధింపులే..!
నేరాలే ఆయన చరిత్ర.. దౌర్జన్యాలు, బెదిరింపులు, సెటిల్మెంట్లే దినచర్య.. రౌడీ మూకలను వెంటేసుకొని కనిపించిన స్థలాలు, భూములను కబ్జా చేసే అతగాడు ఖద్దరు ముసుగేసుకొని రాజకీయ నేతగా చెలామణీ అయిపోతున్నాడు. ఒకప్పడు ఖాకీలను చూస్తే వణికిపోయే.. ఈ ఖద్దరు ముసుగు నేత ఇప్పుడు పచ్చ కండువా వేసుకొని పెచ్చరిల్లిపోతున్నాడు. నగరంలో జరిగిన ఒకానొక ఉప ఎన్నికల్లో రివాల్వర్‌తో వీరంగం చేయడం.. సాక్షాత్తు మహిళా పోలీసు అధికారిని వేధింపులకు గురి చేయడం, భూకబ్జాలకు తెగబడటం వంటి కేసులతోపాటు హత్య కేసులోనూ ప్రమేయముందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు నేతను.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నెత్తికెక్కించుకోవడమే కాకుండా.. తాజాగా అతన్ని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఎటువంటి నేరచరిత్ర, వివాదాలు లేని వ్యక్తులుగా ఎన్నికల్లో పోటీ చేయించాలన్న నిబంధనలు, నైతిక విలువలకు వలువలూడ్చే రీతిలో తెలుగుదేశం ప్రవర్తిస్తోంది. ఎప్పుడో ఎందుకు.. రెండు రోజుల క్రితమే ఓ భూకబ్జా కేసు కూడా నమోదైన సదరు నేత.. గండి బాబ్జీని ప్రస్తుత జీవీఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా.. గెలిస్తే తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాదిస్తున్న సదరు గండి బాబ్జీ.. కేసుల చిట్టా దండిగానే ఉంది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగరంలో రౌడీయిజం, నేరాలు, దౌర్జన్యాలతో రాజకీయాన్ని కలుషితం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. వంగవీటి రంగా హత్య కేసులో మూడో ముద్దాయిగా ఉండి.. విజయవాడ నుంచి విశాఖకు పారిపోయి వచ్చి తలదాచుకున్న వెలగపూడి రామకృష్ణకు రాజకీయ ఆశ్రయం కల్పించి.. ఎమ్మెల్యేగా ప్రజలపై రుద్దిన చరిత్ర ఆ పార్టీదే. అలా ఎదిగిన ఆయనగారు కోడి పందాలు, లిక్కర్ సిండికేట్, రౌడీ గ్యాంగులు సెటిల్మెంట్ దందాలతో చెలరేగిపోతున్న వెలగపూడికి తోడు పెందుర్తి నియోజకవర్గానికి చెందిన గండి బాబ్జీని ప్రజాప్రతినిధిగా నగర ప్రజలపై రుద్దేందుకు తెలుగుదేశం నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు జీవీఎంసీ పాలకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో 95వ వార్డు నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గండి బాబ్జీ నామినేషన్ వేశారు. తెలుగుదేశం అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించకపోయినా.. వార్డు అభ్యర్థిగా బాబ్జీ పేరును ఖరారు చేయడమే కాకుండా.. తమ పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగానూ ఆయన్ను తెరపైకి తెస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సదరు బాబ్జీగారి నేరచరిత్రను నగర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి: 'నా టైమ్ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా' రివాల్వర్‌తో వీరంగం 2006 ఫిబ్రవరి 19న విశాఖ–1 నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పాతపోస్టాఫీస్ వద్ద గండి బాబ్జీ రివాల్వర్‌తో బెదిరింపులకు పాల్పడటం పెద్ద సంచలనం రేపింది. దీనిపై క్రైమ్ నంబర్ 47తో కేసు నమోదైంది. అదే ఏడాది మార్చి 2వ తేదీన సిటీ కోర్టులో బాబ్జీ లొంగిపోయారు. రెండేళ్ల క్రితం ఈ కేసు క్లోజ్ అయ్యింది. 2019లో నగరానికి చెందిన మహిళ పోలీస్ అధికారి గండి బాబ్జీపై వేధింపులు, మోసం కేసు పెట్టడం సంచలనంగా మారింది. కబ్జాల బాబ్జీ పెందుర్తిలో సుమారు ఏడున్నర ఎకరాల చెరువును తప్పుడు పత్రాలతో గండి బాబ్జీ చెరబట్టారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. మొగలిపురం రెవెన్యూ పరిధిలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశారు. దేవిపురం సమీపంలో దాదాపు 40 ఎకరాల డీ ఫారం, ఇనాం భూముల కబ్జా వ్యవహారంలో గండి బాబ్జీ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. స్వార్థ రాజకీయ బంధం 2017లో చంద్రబాబు సమక్షంలో గండి బాబ్జీ టీడీపీలో చేరారు. అయితే తన చిరకాల ప్రత్యర్థి అయిన టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తితో ఇమడలేక చాలాకాలం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అనూహ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో బండారు–బాబ్జీ జతకట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఒకే పార్టీలో ఉంటూ చాలాకాలం పాటు కత్తులు దూసుకున్న ఈ ఇద్దరూ స్వార్థం కోసం ఏకమయ్యారని ప్రజలు బహిరంగంగానే దుమ్మెత్తి పోశారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఎమ్మెల్యే బండారు కొడుకు అప్పలనాయుడు, బాబ్జీ తమ్ముడు రవి ఇద్దరూ ఒకే కోవకు చెందిన వ్యక్తులు. సెటిల్మెంట్లు, దౌర్జన్యాలకు పెట్టింది పేరు. రెండు రోజుల క్రితం గండిపై కబ్జా కేసు.. గండి బాబ్జీపై తాజాగా మరో కబ్జా కేసు నమోదైంది. నరసింహనగర్‌కు చెందిన లివింగ్‌స్టోన్ అనే వ్యక్తి ఈనెల 13న బాబ్జీపై ఫిర్యాదు చేశారు. లివింగ్‌స్టోన్ క్రిష్టియన్ ఫెలో షిప్ సొసైటీ అనే సంస్థను నడిపిస్తున్నారు. 1990లో బాలయ్యశాస్త్రి లేఅవుట్లో తాము కొనుగోలు చేసిన 200 చదరపు అడుగుల స్థలాన్ని గండిబాబ్జీ కబ్జా చేశారని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బాబ్జీపై ఈ నెల 13న క్రైమ్ నంబర్ 82/20తో సెక్షన్ 447, 427లతో కేసు నమోదు చేశారు. వెంట నలుగురు రౌడీషీటర్లు.. బాబ్జీ వెంట నిరంతరం నలుగురైదుగురు రౌడీ షీటర్లు ఉంటారు. బాబ్జీ ఎక్కడికి వెళ్లినా నీడలా అనుసరిస్తుంటారు. అలాంటి వ్యక్తిని మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించడంతో నగర ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసే వ్యక్తులకు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టాలనుకోవడం సరికాదంటున్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న బాబ్జీ నేరాల చిట్టా ఇదీ.. •మొత్తం కేసులు– 04 •సీరియస్ ఐపీసీ సెక్షన్లు– 03 •ఇతర ఐపీసీ సెక్షన్లు– 07 కేసులు.. సెక్షన్లు.. •ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు పంపిణీ చేస్తున్నందుకు ఐపీసీ సెక్షన్ 171 హెచ్ •సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో ఐపీసీ సెక్షన్ 201 • క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 506 • విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించిన కేసులో సెక్షన్ 186 • ప్రభుత్వ ఉద్యోగి వి«ధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 188 •ఉద్దేశ పూర్వకంగా విధులకు ఆటంకం కలిగించిన కేసులో సెక్షన్ 34 • ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఎర వేసిన కేసులో సెక్షన్ 171 •మహిళ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన కేసులో సెక్షన్ 509 అప్పట్లోనే ఆరోపణలు గండి బాబ్జీ స్వగ్రామం సబ్బవరం మండలం మొగలిపురం. బీఎల్ చదివారు. అయితే స్కాలర్ షిప్ కోసం కళాశాలకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చారన్న ఆరోపణలతో అప్పట్లో కేసు నమోదైంది. నాడు పెద్దలు జోక్యం చేసుకుని ఆ కేసును మాఫీ చేసినట్లు చెప్పుకుంటారు. కొన్నాళ్లు లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన కాంగ్రెస్ పంచన చేరి రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009లో హైదరాబాద్‌కు చెందిన మంజులారెడ్డి అనే మహిళ హత్య వెనుక బాబ్జీ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2004 వరకు కాంగ్రెస్‌లో సాధారణ నాయకుడిగా ఉన్న బాబ్జీ.. ఆ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి పరవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 63వ వార్డు టీడీపీ అభ్యర్థిదీ అదే దారి 63వ వార్డులో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్ది గల్లా పోలిపల్లి (గల్లా చిన్నా)దీ నేరచరిత్రే. ఈయనపై 2015 డిసెంబర్ 4న కేసు నమోదైంది. డాబాగార్డెన్స్‌కు చెందిన గూడెల బాలజీ అనే వ్యక్తి నుంచి కొంత నగదును గల్లా చిన్నా అప్పుగా తీసుకున్నాడు. తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిన బాలాజీపై గల్లా చిన్నా, అతని అనుచరులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. దీనిపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గల్లా చిన్నాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
చంద్రబాబు బిస్కెట్‌తో ఇద్దరూ చెట్టాపట్టాల్..
పెందుర్తి: ‘అదిగో మూడు నల్లకార్లు వస్తున్నాయి. అందులో అన్న పెద్ద దొంగ.. తమ్ముడు చిన్న దొంగతో పాటు వాళ్ల కుడిఎడమల్లో ఉన్న వాళ్లూ దొంగలే. మా చంద్రబాబుకు బుద్ధి లేక అతడ్ని మా పార్టీలోకి రానిచ్చారు. అలాంటి వాళ్లకు నా పక్కన ఎన్నటికీ స్థానం లేదు’కొన్నాళ్ల కిందట సబ్బవరం మండల పరిషత్ మధ్యంతర ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, అతడి తమ్ముడు రవిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఘాటు విమర్శలు ఇవి. ‘మావి నల్లకార్లు అయితే అతడిది.. అతడి కొడుకుది తెల్లకార్లు.. నియోజకవర్గంలో చేసేవన్నీ వైట్‌కాలర్ నేరాలే. ఇద్దరూ కలిపి దోపిడీలు తప్ప పాలన ఎక్కడా చేయడం లేదు.. చంద్రబాబు ఈసారి ఈ దగాకోర్లకు టికెట్ ఇవ్వడు. పెందుర్తి నుంచి ఈసారి టీడీపీ టికెట్ నాదే.. తప్పితే రెబల్ అవతారం ఎత్తైనా బండారును మట్టి కరిపిస్తాను’అదే సమయంలో ఎమ్మెల్యే బండారు, అతడి కొడుకుని ఉద్దేశించి గండి బాబ్జీ కౌంటర్ ఎటాక్. అప్పట్లో ఈ ఇద్దరి టీడీపీ నేతల ‘స్ట్రీట్ ఫైట్’చూసిన ఇరువురి అనుచరులు కూడా ‘సై’అంటూ కాలుదువ్వుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనించసాగారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ప్రత్యర్థి పార్టీ నుంచి తొలి జాబితా లోనే ఉత్సాహవంతుడైన యువకుడి పేరును ప్రతిపక్ష నేత ప్రకటించారు. కానీ అధికార పక్షంలో మాత్రం టికెట్ కోసం గండి–బండారు మధ్య పోరు సాగింది. చివరకు చచ్చీచెడీ.. బెదిరించో.. బుకాయించో.. సాగిలాపడో బండారే టికెట్‌ను ఎత్తుకొచ్చేశాడు. దీంతో అవమాన భారంతో రగిలిపోయిన బాబ్జీ వర్గీయులు ‘ఇన్నాళ్లు బండారు మమ్మల్ని చిత్రహింసలు పెట్టాడు.. తమను కంటికి రెప్పలా చూసుకునే మా గురువు సత్తా చూపుతాడు.. బండారుకు ఇక చుక్కలే’అంటూ బీరాలు పోయారు. మళ్లీ సీన్ కట్ చేస్తే.. మొగలిపురంలోని బాబ్జీ ఇంటికి బండారు, కొడుకు వెళ్లడం.. అన్న బాబ్జీ.. తమ్ముడు రవి చేతిలో చెయ్యివేసి ఆహ్వానించడం.. భోజనాలు చేయడం.. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం.. గండి బాబ్జీ వీధుల్లో తిరుగుతూ బండారుకు దాసోహం కావడం చూస్తున్న జనం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. పెందుర్తి వీధుల్లో పౌరుష రసం పొంగుతుందని భావించిన ఒకరికి ఒకరు లొంగిపోయి ఓట్ల కోసం ఒకరు.. నామినేటెడ్ పదవి కోసం ‘రాజీ’రసాన్ని విరజిమ్మడాన్ని బాబ్జీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లూ బాబ్జీ మనుషులుగా బండారు, అతడి కొడుకు చేతిలో చావుదెబ్బలు తిన్న మాకు ఏంట్రా ఈ ఖర్మ అంటూ తలలు పట్టుకుంటున్నా రు. మరోవైపు బండారు–బాబ్జీ ‘స్ట్రీట్ డ్రామా’ ను చూస్తున్న ప్రజలు మాత్రం మా వద్ద దోచుకున్న సొమ్ము పట్టుకెళ్లడానికి ‘నల్లకార్లు–తెల్లకార్లు’ఒక్కటైపోయాయంటూ నిట్టూరుస్తున్నారు. బాబ్జీ ఈ అవమానాలను మరిచిపోయావా? ♦ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీలో చేరడాన్ని బండారు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో చేరిన కొత్తలో బాబ్జీని, ఆయన అనుచరులను హీనంగా చూసేవారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు కూడా రానివ్వకుండా అంటరానితనం చూపేవారు. ♦ 2016 చివర్లో సబ్బవరం ఎంపీపీ మధ్యంతర ఎన్నిక సమయంలో బండారు–బాబ్జీ వర్గీయుల మధ్య పోటీ ఏర్పడింది. ఒకే పార్టీకి చెందిన వీరు తమ వర్గం వారికి ఎంపీపీ పదవి కట్టబెట్టాలన్న పంతంతో ఎంపీటీసీలకు ‘ప్రత్యేక క్యాంప్’లు కూడా నిర్వహించారు. చివరకు హైవోల్టేజ్ డ్రామాలో బాబ్జీ వర్గానికి చెందిన వ్యక్తి ఉమామహేశ్వరరావుకే ఆ పదవి దక్కింది. దీంతో బండారు తీవ్ర అవమాన భారంతో రగిలిపోయారు. ఎంతలా అంటే బాబ్జీ మనిషి అయిన ఎంపీపీ పాల్గొన్న ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి కూడా బండారు నేటికీ హాజరు కాలేదు. అంతేకాదు ఎంపీపీపై భూఆక్రమణ కేసులు కూడా పెట్టించారు. ♦ వంగలి సమీపంలో పెట్రో వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు కూడా వచ్చారు. అయితే ఆ కార్యక్రమానికి బాబ్జీని రాకుండా అడ్డుకున్నారు బండారు. ఆ సమయంలో బాబ్జీ వేదిక వద్దే ఆందోళన చేయడం పెద్ద దుమారమే రేగింది. ♦ బండారుకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ బాబ్జీ మనుషులపై కక్షసాధింపు చర్యలకు దిగారు. అనేక సందర్భాల్లో బండారు నేరుగానే విమర్శలు చేయడం, కేసులు పెట్టించడం వంటివి చేశారు. బండబూతులతో తూలనాడిన సందర్భాలూ కోకొల్లలు. -
బాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్..!
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ నేతలు బాహాబాహీకీ దిగారు. ఈ ఘర్షణకు విశాఖ జిల్లా సబ్బవరం వేదికైంది. విశాఖ జిల్లాలో గురువారం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన భాగంలో సబ్బవరంలో పెట్రోల్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో గండి బాబ్జి, బండారు వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా గండి బాబ్జిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాబ్జి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మహానాడులో ఫిరాయింపు నేతలకు అవమానం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన నేతలకు టీడీపీ మహానాడులో కూడా అవమానం తప్పలేదు. శనివారం తిరుపతి మహానాడుకు హాజరైందుకు వచ్చిన విశాఖ జిల్లా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారు పట్టించుకోలేదు. పోలీసుల తీరుపై బాబ్జీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందటే వారు టీడీపీలో చేరారు. జిల్లాల్లో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడుల్లో ఫిరాయింపు నేతలకు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. -
పెందుర్తి ఒరలో రెండో కత్తి
ఇటు బండారు.. అటు బాబ్జీ పార్టీ నిర్ణయంతో ఎమ్మెల్యే కినుక పెత్తనం కోసం బాబ్జీ పావులు ఇరకాటంలో అధికారులు, కార్యకర్తలు విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ బృందం టీడీపీలో చేరడంతో పెందుర్తి నియోజకవర్గ పార్టీలో ముసలం పుట్టింది. మొదటి నుంచి బాబ్జీ చేరికను వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పార్టీ తీరుతో కినుక వహించారు. ఎవరితోనూ మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు. దీనిపై ఎవరు కదిపినా నో కామెంట్ అంటూ దాట వేస్తున్నారు. తాను ఎంత చెప్పినా పట్టించుకోకుండా బాబ్జీని పార్టీలో చేర్చుకోవడాన్ని బండారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పార్టీ నగర మాజీ అధ్యక్షుడు పల్లా శ్రీను వర్గం పక్కలో బల్లెంలా ఉండగా ఇప్పుడు బాబ్జీ రాక బండారుకు మరింత ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బండారు పుత్రరత్నం అప్పలనాయుడు చేష్టలతో గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్లను, ఆయన వ్యతిరేక వర్గీయులను తనవైపు తిప్పుకునేందుకు బాబ్జీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొందరు బాబ్జీ పంచన చేరేందుకు సిద్ధమయ్యారు. పరవాడ, పెందుర్తి, సబ్బవరంలలో బండారుతో విభేదించిన నేతలంతా ఇప్పటి వరకు ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పీలాశ్రీను వెంటనడుస్తున్నారు. వీరందర్ని తన వైపు తిప్పుకొని బాబ్జీమూడో కుంపటి పెడుతున్నారని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆధిపత్యం కోసం పోటీ బండారు ఆధిపత్యానికి చెక్ పెట్టాలని బాబ్జీ అనుచరులు చాపకింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలో చేరకముందు నుంచే వారు అధికారులపై పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు. ఇప్పుడు పార్టీలో చేరడంతో ఈ రెండువర్గాల మధ్య అధికారులు నలిగిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఎమ్మెల్యేను కాబట్టి నా మాటే వినాలని బండారు.. రానున్న ఎన్నికల్లో టికెట్ నాదే కాబట్టి నా మాట వినాలంటూ బాబ్జీ పెత్తనం విషయంలో పోటీపడుతున్నారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడి ఉప్పు నిప్పులా ఉన్న ఈ ఇరువురు నేతలు ఇప్పుడు ఒకేపార్టీలో ఉండడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. అసలే పీలా శ్రీనివాస్ వర్గంతో చచ్చిపోతున్నాం..ఇప్పుడు గండి బాబ్జీ వర్గంతో వేగలేమని ఎమ్మెల్యే బండారు తన ముఖ్య అనుచరుల వద్ద వాపోయినట్టు సమాచారం. ఈ విషయంలో బండారును బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ చేరిక సమావేశానికి మాత్రం బండారును రప్పించలేకపోయారు. బండారే కాదు..గంటా వర్గానికి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సీటు దగ్గరే తేడా: వాస్తవానికి గ్రామస్థాయిలో ఉన్న టీడీపీ నాయకులు అధికారంతో పనిలేకుండా స్థానికంగా అజమాయిషీ చెలాయిస్తున్నారు. జన్మభూమి కమిటీలతో పాటు కమిటీయేతర టీడీపీ నాయకులు కూడా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల కంటే ముందు వారికే సీట్లు కేటాయించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు టీడీపీలో గండి బాబ్జీ చేరిక తరువాత అదే గ్రామాల్లో మరో టీడీపీ వర్గం తయారైంది. అంటే అదే వేదికలపై వారికి కూడా సీట్లు కేటాయించాలి. అయితే ఎవరి సీటు వెనుక వేయాలో ఎవరిది ముందు వేయాలో అధికారులకు కత్తిమీద సామే. సీటు దగ్గరే ఇంత ఉంటే ఇక పనులు విషయంతో ఎంత రాద్దాంతం జరుగుతుందో అని అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. -
అలిగిన మరో టీడీపీ ఎమ్మెల్యే
విజయవాడ: పార్టీ ఫిరాయింపులపై మరో టీడీపీ ఎమ్మెల్యే అలకపాన్పు ఎక్కారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని టీడీపీలోకి చేర్చుకోవడాన్ని విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తనపై ఓడిపోయిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే గండి బాబ్జీ చేరిక కార్యక్రమానికి బండారు గైర్హాజరు అయినట్టు తెలుస్తోంది. గండి బాబ్జీ అవినీతిపరుడని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బండారు ఫిర్యాదు చేశారు. కాగా, బాబ్జీ టీడీపీలో చేరికను మొదట్నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గం ఎమ్మెల్యేలు ఇదే చేరిక కార్యక్రమానికి గైర్హాజరు అయ్యినట్టు తెలిసింది. -
'నాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది'
విశాఖ: తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విశాఖ జిల్లా పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండి బాబ్జీ ఆరోపించారు. ఓటర్లను అర్థిస్తాం ...తప్ప తెలుగుదేశం పార్టీ నేతల్లా బెదిరించమని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ, ఎల్లో మీడియా మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకున్నారని గండి బాబ్జీ తెలిపారు.