ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన నేతలకు టీడీపీ మహానాడులో కూడా అవమానం తప్పలేదు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన నేతలకు టీడీపీ మహానాడులో కూడా అవమానం తప్పలేదు. శనివారం తిరుపతి మహానాడుకు హాజరైందుకు వచ్చిన విశాఖ జిల్లా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారు పట్టించుకోలేదు. పోలీసుల తీరుపై బాబ్జీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందటే వారు టీడీపీలో చేరారు. జిల్లాల్లో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడుల్లో ఫిరాయింపు నేతలకు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే.