Telugu Desam Party Mahanadu
-
విషవృష్టి యాగం..!
చెప్పాలని ఉంది... గొంతు విప్పాలని ఉంది. తెలుగుదేశం పార్టీ నలభయ్యేళ్ల ప్రస్థానం గురించీ, ఆ ప్రయాణంలోని మలుపుల గురించీ ఇప్పుడు క్లుప్తంగానైనా మాట్లాడుకోవాలి. తాజాగా ఆ పార్టీ ‘మహానాడు’ పేరుతో ఓ విషవృష్టి యాగాన్ని నిర్వహిం చింది. ఆ విబూదిని రాష్ట్రమంతటా చల్లక ముందే... తొలకరి వర్షాలతో కలిపి అది విషపు చుక్కల్ని కురిపించకముందే... విస్తృతంగా మాట్లాడుకోవాలి. ఆ పార్టీని పెట్టిన ఎన్టీ రామా రావుకు ఇది శతజయంతి సంవత్సరం. పార్టీ వయసు 40 సంవత్సరాలు. అందువల్ల కూడా ఇది మాట్లాడుకోవలసిన సందర్భం. పదేళ్ల కింద వెల్లడించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో నూటికి 70 మంది నలభయ్యేళ్ల లోపువారే. కనుక తెలుగు రాష్ట్రాల్లోని నూటికి డెబ్బయ్ మందికి తెలుగుదేశం పార్టీ ప్రయాణంలోని పదనిసల గురించిన లోతైన అవగాహన ఉండే అవకాశం తక్కువ. ఆ పార్టీని స్థాపించి అధికారంలోకి తీసు కొచ్చిన ఎన్టీ రామారావును పదవీచ్యుతుణ్ణి చేసి చంద్రబాబు 27 సంవత్సరాల క్రితం గద్దెనెక్కాడు. ఇప్పుడు నలభయ్యేళ్లున్న వారు కూడా అప్పటికింకా బాల్యావస్థలోనే ఉన్నారు. ‘మహా నాడు’ హంగామాలను చూసి తెలుగుదేశం నాయకులంతా ఎన్టీ రామారావు శిష్యులనీ, భక్తులనీ, అనుచరులనీ వారు భ్రమించే అవకాశం ఉన్నది. అనారోగ్య కారణాలతో ఎన్టీ రామారావు తప్పుకొని స్వయంగా ఆయనే చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించాడని యెల్లో మీడియా కథలల్లడానికి ఇంకెంతో కాలం పట్టదు. అందువల్ల ఈ నలభయ్యేళ్ల కథను ఖుల్లం ఖుల్లా చెప్పుకోవాలి. రెక్కల గుర్రంపై ఎగిరొచ్చే కలల రాకుమారుడి కథలాంటిది ఎన్టీ రామారావు సినీ జీవితం. జానపదుల జనరంజక కథా నాయకుడు. దేవతామూర్తుల పాత్రల్లో ఒదిగిపోయిన స్ఫుర ద్రూపం. అద్భుతమైన నటపాండిత్యం. వెరసి తెలుగు నిఘంటు వులో హీరో అనే మాటకు అర్థం అతను. ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు’ అనే బిరుదును ఆయన అభిమానులు ఇవ్వలేదు. భజన బృందం తగిలించింది కాదు. శృంగేరీ పీఠానికి సంబంధించిన యతీశ్వరులు స్వయంగా చేసిన ప్రశంస అది. ద్రవ్యోల్బణం లెక్కల ప్రకారం చూస్తే ఎన్టీఆర్ సినిమాలు రాబట్టిన కలెక్షన్లు ఇప్పటికీ రికార్డులే! ఒక డజన్ సూపర్ డూపర్ హిట్స్‌తో ఆయన తన 60వ ఏట సినీరంగం ఇన్నింగ్స్‌ను ముగించారు. ఇంతటి ప్రజాదరణ ఉన్నది కనుకనే తన సెకండ్ ఇన్నింగ్స్‌ను రాజకీయాల్లో పరీక్షించుకోదలుచుకున్నారు. రాజకీయాల్లో నెగ్గుకురావడానికి ప్రజాదరణ ఒక్కటే సరిపోదు. పరిస్థితులు కూడా కలిసిరావాలి. ఎన్టీఆర్‌ను అదృష్టం వరించింది. ఆ సమయానికి పాలకపక్షంపై జనంలో వ్యతిరేకత ఏర్పడుతున్నది. బలమైన ప్రతిపక్షం లేని రాజకీయ శూన్యత ఆవరించి ఉన్నది. అప్పటి పత్రికా రంగం నుంచి సంపూర్ణ సహకారం లభించింది. అసలే ఎన్టీఆర్. ఆపై రోడ్డెక్కారు. ప్రచారం కొత్త పుంతలు తొక్కింది. పదజాలం కత్తులు దూసింది. రాజకీయాల్లోకి కొత్త నరేటివ్ వచ్చి చేరింది. ఈ మార్పు జనానికి కూడా నచ్చింది. ఫలితంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సూపర్‌హిట్ ఎన్టీఆర్ ఖాతాలో వచ్చిపడింది. స్వాతంత్య్రోద్యమ కాలంలో చదువుకున్నవాడు కాబట్టి ఎన్టీ రామారావుపై జాతీయ భావాలు, ఆదర్శాల ప్రభావం కొంత ఉన్నది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (ఎన్ఏటి) పేరుతో నాటక సమాజాన్ని స్థాపించి ప్రదర్శనలిచ్చేవారు. విద్యార్థి రోజుల నుంచే కష్టపడి సంపాదించుకునే తత్వం. సినిమాల్లో కూడా రేయింబవళ్లు పనిచేశారు. ఏటా పది పన్నెండు సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి హీరో ఎన్టీఆర్ తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. ఆయన పోషించిన వందలాది ఉదాత్త, జనోద్ధారక పాత్రల ప్రభావం కూడా ఉండేది. ముఖ్యమంత్రిగా పరిపాలనలో పేదలకు, కష్టజీవులకు అనుకూలమైన సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారు. చౌకబియ్యం ఇవ్వడంతోపాటు రైతుల విద్యుత్ ఛార్జీలను తగ్గించారు. పాలనా సంస్కరణలను ప్రారంభించారు. మండల వ్యవస్థ ఏర్పాటు, పటేల్ – పట్వారీ లేదా కరణం – మునసబుల వ్యవస్థ రద్దు – ఈ సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఎన్టీ రామారావు అనుసరించిన పేదల అనుకూల విధా నాలపై తెలుగుదేశం పార్టీలోనే కొందరు ముఖ్యులకూ, పార్టీకి అండగా నిలబడిన మీడియా మొగల్స్కూ సదభిప్రాయం లేదన్న సంగతి తదనంతర కాలంలో బయటపడింది. సదరు మీడియా మొగల్స్, బిజినెస్ మౌర్యాస్, సంపన్న నిజామ్స్.... అంతా కలిసి చంద్రబాబు రింగ్ లీడర్‌గా ఒక ముఠాను తెలుగుదేశం పార్టీలో తయారుచేసుకున్నారు. ’89 ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీపై ఈ ముఠా పట్టు బిగిసింది. పార్టీ కార్యకర్తలతో, ప్రజలతో ఉండే అన్ని కమ్యూనికేషన్ చానల్స్ ఈ ముఠా అధీనంలోకి వచ్చాయి. వయోధిక దశలో ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్‌కు సహాయ కురాలిగా ఉన్న లక్ష్మీపార్వతి మరో కమ్యూనికేషన్ చానల్‌గా మారవచ్చని ముఠా శంకించింది. ఆమెపై దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. ఆమెకు వ్యతిరేకంగా మెదళ్లలో విష బీజాలు నాటి కన్నబిడ్డల్ని సైతం ఎన్టీఆర్‌కు దూరం చేశారు. తనకు తోడుగా ఉన్నందుకు నిందలు మోస్తున్న మహిళకు అండగా నిలవడమే తన తక్షణ ధర్మంగా ఎన్టీఆర్ భావించారు. తిరుపతి బహిరంగ సభలో వేలాదిమంది సమక్షంలో ఆమెను అర్ధాంగిగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉండగానే చంద్రబాబు ముఠా పార్టీపై ఎందుకు పట్టు బిగించిందో, నాయకుని కమ్యూనికేషన్ ఛానల్స్‌ను ఎందుకు అదుపులోకి తీసుకున్నదో, లక్ష్మీపార్వతిని వెళ్లగొట్టడానికి ఎందుకు ప్రయత్నించిందో... 94 ఎన్నికల తర్వాత అర్థమైంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే తమకు కొంతమేరకే ఉపయోగం తప్ప ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం సాధ్యపడదని బాబు అండ్ మొగల్స్ ముఠాకు అవగాహన ఉన్నది. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన వెంటనే చంద్రబాబును సీఎంగా ఎన్నుకోవాలి. అందుకోసం టిక్కెట్లలో సింహభాగం తమ నమ్మకస్థులకే దక్కాలి. ఇదీ కుట్ర. అయితే చివరి దశలో ఎన్టీఆర్ అప్రమత్తం కావడంతో కొంతమేరకు మాత్రమే వారి ఎత్తుగడ ఫలించింది. పైగా అరకొర మెజారిటీ కాకుండా ఎన్టీఆర్‌కు అఖండ విజయం సిద్ధించింది. కుట్ర అమలుకు కొన్ని నెలలు ఎదురు చూడవలసి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాలు నమోదు చేసిన నెలరోజులకే యెల్లో మీడియా ఎజెండాను పైకి తీసింది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్టు, కార్యకర్తలతో దూరం పెరిగినట్టు ప్రచారం మొదలుపెట్టింది. స్థానిక ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే వ్యతిరేకత ఎట్లా వచ్చిందనే ప్రశ్నకు ఇక్కడ తావుండదు. యెల్లో మీడియా వార్తలకు తర్కంతోగానీ, హేతువుతోగానీ, వాస్తవికతతో గానీ సంబంధం ఉండదు. వేడివేడి బజ్జీలు వేయడం మార్కెట్లోకి వదలడం మాత్రమే దానికి తెలిసిన విద్య. ప్రచారం పీక్స్‌కు చేరగానే తాము టిక్కెట్లి ప్పించగా ఎన్టీఆర్ వేవ్‌లో గెలిచిన ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలను ఈ ముఠా వైస్రాయ్ హోటల్‌కు పంపించేసింది. ఆ వెంటనే ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా 70 మంది ఎమ్మెల్యేలు ఆ హోటల్లో సమావేశమయ్యారని ప్రచారం మొదలుపెట్టారు. గంటగంటకూ ఆ స్కోర్ పెంచుతూపోయారు. ఏం జరుగుతోందో చూసి వెళ్దామని వచ్చిన ఎమ్మెల్యేలను అక్కడే బంధించారు. కొందర్ని బెదిరించి పిలిపించారు. మీడియా సహకారంతో తెల్లారేసరికల్లా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నట్లు బిల్డప్ ఇచ్చారు. గవర్నర్ సహకారంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్టిచ్చి ఎమ్మెల్యేను చేసి, మంత్రిని చేసి, స్పీకర్‌ను చేసిన యనమల ఎన్టీఆర్‌కు మాట్లాడే హక్కును సైతం తృణీకరించారు. సైకిల్ గుర్తు, టీడీపీ జెండా, బ్యాంక్ డిపాజిట్లతో ఎన్టీఆర్‌కు సంబంధం లేదనీ, అవన్నీ బాబు పార్టీకి చెందుతాయనీ హైకోర్టు కూడా చెప్పేసింది. ఎదురుగా వెళ్లే ధైర్యం లేక వృద్ధసింహాన్ని మోసపూరితంగా బంధించి బోనులో పెట్టారు. తనవాళ్లే తనకు ద్రోహం చేయడాన్ని ఊహించలేకపోయిన ఎన్టీఆర్ షాక్‌కు గురయ్యారు. మనోవేదనతో కృశించి అనతికాలంలోనే ఆయన చనిపోయారు. ఆయన ఇంకొంతకాలం జీవించి ఉంటే ఈ ముఠాకు గుణపాఠం చెప్పి ఉండేవారు. ’94 ఎన్నికల్లో ఎన్టీఆర్ అండతో రెండు కమ్యూనిస్టు పార్టీలూ కలిసి 32 సీట్లు గెలుచుకున్నాయి. 1962 తర్వాత కమ్యూనిస్టులు ఇన్ని సీట్లు గెలిచిన సందర్భం మొదటి సారి, చివరిసారి కూడా ఇదే! అయినా ఆ పార్టీలు కృతజ్ఞత చూపెట్టలేదు. టీడీపీ ఆంతరంగిక వ్యవహారమని ముఖం చాటేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయనకు మద్దతు ప్రకటించాయి. కమ్యూనిస్టులు తన సహజ మిత్రులనీ, తనకు బావగార్ల వరసవుతారనీ ఎన్టీఆర్ ఆప్యాయంగా చెప్పు కున్నారు. ఆ బావల నిర్వాకం చూసి ఆయన అవాక్కయ్యారు. కృత్రిమ సంక్షోభం తలెత్తిన వెంటనే కమ్యూనిస్టులు ఎన్టీఆర్‌కు మద్దతు ప్రకటించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికావాళ్లు జపాన్‌పై వేసిన ఆటమ్ బాంబ్‌తో పోలిస్తే వెయ్యి రెట్లు ఎక్కువ విధ్వంసక శక్తి కలిగిన హైడ్రోజన్ బాంబులు ఇప్పుడున్నాయి. ఎన్టీఆర్ మీద యెల్లో ముఠా చేసిన కుట్రను ఆటమ్ బాంబుతో పోల్చితే, అదే ముఠా సరిగ్గా 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం మీద అమలుచేస్తున్న కుట్రను హైడ్రోజన్ బాంబుతో పోల్చ వచ్చు. 27 ఏళ్ల కిందట కుట్రపూరితంగా అధికారం చేపట్టిన ఈ ముఠా ఆ కుట్రలూ కుహకాల్లో ఆరితేరి హైడ్రోజన్ బాంబులు ప్రయోగించే స్థాయికి ఎదిగింది. ప్రజాసంక్షేమం, ప్రజల వద్దకు పాలన, బలహీన వర్గాల సాధికారత అనే అంశాల్లో ఎన్టీఆర్ నలభయ్యేళ్ల కింద ఒక అడుగువేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 40 అడుగులు వేశారు. ఈ విధానాలకూ, యెల్లో ముఠాకూ అస్సలు పొసగదు. ఈ ముఠాకు తన వర్గ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన బాబు అండ్ కో వైఎస్ రాజశేఖర రెడ్డిపై యుద్ధాన్ని ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ఈ ముఠాకు ఎనిమీ నెంబర్ వన్. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, సామర్థ్యాన్ని, కమిట్ మెంట్‌నూ అందరికంటే ముందుగానే ఈ ముఠా గుర్తించింది. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పుకోవడానికి ముందే ఆ పార్టీ అధిష్ఠానంతో చేతులు కలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో షరీకై తప్పుడు కేసులు మోపడానికి రంగం సిద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయగానే కేసుల కుట్రను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన గులామ్ నబీ ఆజాద్ ఒక బహిరంగ సభలోనే అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మేము జగన్మోహన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఆఫర్ చేశాము. కొంతకాలం తర్వాత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పాము. మాట వినకపోతే జైలుకు పోవలసి వస్తుందని కూడా చెప్పాము. అయినా మాట వినలేదని ఆజాద్ అన్నారు. మాట వింటే అందలమెక్కిస్తాం, వినకపోతే జైలుకి పంపిస్తామని సాక్షాత్తూ ఢిల్లీ సామ్రాజ్ఞి చెప్పినా జగన్మోహన్ రెడ్డి వినకపోవడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కావలసింది సమాచారం కాదు. కామన్సెన్స్! జైలుకు పంపించే తప్పేమీ తాను చేయలేదని తన అంతరాత్మకు తెలుసు గనుక ఆయన పెద్దల బెదిరింపులకు జంకలేదు. తన ప్రయాణాన్ని తాను ఎంచుకున్నారు. ఆనాటి నుంచీ గడిచిన పదకొండేళ్లుగా యెల్లో ముఠా తన సర్వశక్తుల్నీ జగన్మోహన్ రెడ్డి పైనే కేంద్రీకరించింది. ఈ కాలంలో ఆయన మీద విష ప్రచారానికి కేటాయించిన న్యూస్ ప్రింట్నంతా ఒక పక్కన పడేసి వుంటే ఆ రెండు పత్రికలకు ఇంకో ఏడాదిపాటు ఆ న్యూస్ ప్రింట్ సరిపోయేది. విష ప్రచారాలతో, పొత్తుల ఎత్తులతో, నెరవేర్చని హామీలతో 2014 ఎన్నికల్లో జగన్ పార్టీని ఈ కూటమి ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడించగలిగింది. దీనికి సమాధానంగా వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల్లో 10 శాతం ఓట్ల తేడాతో టీడీపీని ఓడించింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒంటి చేత్తో 50 శాతం ఓట్లను సంపాదించి సాధించిన విజయం. ఈ విజయంతో పోల్చదగిన విజయాలు తెలుగు రాష్ట్రాల చరిత్రలో రెండే రెండున్నాయి. ఒకటి కమ్యూ నిస్టులతో పొత్తు పెట్టుకొని 1994లో ఎన్టీఆర్ సాధించిన గెలుపు. రెండోది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో సాధించిన గెలుపులో ఇందిరమ్మ ప్రభంజనం వీస్తున్న సమయంలో 1972లో కాంగ్రెస్ సాధించిన అసెంబ్లీ విజయం. అప్పుడు కాంగ్రెస్‌కు బలమైన ప్రతిపక్షం కూడా లేదు. ఇండిపెండెంట్లే ప్రతిపక్షం. మూడేళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి సాధిం చిన కళ్లు చెదిరే విజయం కంటే కూడా ఆయన పరిపాలనా దక్షత యెల్లో కూటమికి ఎక్కువ కలవరపాటును కలిగిస్తున్నది. సామాజిక ఆర్థిక మార్పు సాధనంగా ఆయన రాజ్య యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్న తీరుకు దేశవిదేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు ప్రారంభమయ్యాయి. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైంది. మహిళలూ, బలహీన వర్గాల సాధికారత విషయంలో జగన్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలబడింది. రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొన్న తీరు ఒక అధ్యయనాంశంగా మారింది. ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని, ఆర్బీకేల పనితీరును పరిశీలించడానికి ఇతర రాష్ట్రాల నుంచి బృందాలు బృందాలుగా ప్రతినిధులు వచ్చిపోతున్నారు. ఊరి స్వరూపం మారుతున్నది. ప్రతి పల్లె పట్టణ సొబగులను అద్దుకుంటున్నది. ఈ నేపథ్యంలో సహజంగానే వైఎస్సార్సీపీ బలం గత ఎన్నికల కంటే ఇప్పుడు పెరిగింది. యథాతథంగా ఎన్నికలు జరిగితే వైసీపీని ఓడించడం తెలుగుదేశం పార్టీ వల్ల కాదు. ఇతర పార్టీలతో జట్టు కట్టినా సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీకి యాభై శాతం కంటే ఎక్కువ ఓటింగ్ బలం ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం లోకి రావడం జీవన్మరణ సమస్యగా మారింది. అందుకే అడ్డదారులు తొక్కడానికి సిద్ధపడింది. పాతమిత్రుల ప్రత్యక్ష, పరోక్ష సహకారాలతో సామాజిక విభజన కార్యక్రమానికి చాలాకాలం కిందనే శ్రీకారం చుట్టింది. పేద వర్గాల ప్రజ లందరూ ఒకవైపున సంఘటితం కాకుండా కులాల పేరున, మతాల పేరున విడిపోయి విద్వేషాలను విరజిమ్ముకొనేలా రెచ్చగొట్టే పథకానికి తెరతీసింది. ఎక్కడెక్కడ అటువంటి అవకాశాలుంటాయో పరిశీలించడానికి గతంలోనే కొన్ని రెక్కీలను నిర్వహించారు. కోనసీమలోని అంతర్వేదితో ఒక రెక్కీ ఆపరేషన్ జరిగింది. రామతీర్థంలో రెక్కీ జరిగింది. గుంటూరులో జిన్నా టవర్స్ పేరుతో ఒక రెక్కీ జరిగింది. ఇప్పుడు కోనసీమలో ఒక యాక్షన్ అమలుచేశారు. కోనసీమలో దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజలు, అగ్రకులాల వాళ్లు తరతరాలుగా శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. వ్యావసాయికంగానే కాక విద్యాపరంగా కూడా మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన ప్రాంతం. ఈ అభివృద్ధి అన్ని వర్గాల్లోనూ కనిపిస్తున్నది. చిన్న చిన్న తగాదాలు, వ్యక్తిగత పంచాయతీలు, పంతాలు పట్టింపుల వంటివి మాత్రమే వివిధ వర్గాల మధ్య పొడసూపుతున్నాయి. అప్పుడప్పుడు స్వల్ప ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఇవేమీ పరిష్కరించ లేనంత తీవ్రమైన సమస్యలు కావు. కానీ వీటినే ఆసరా చేసుకొని ఇక్కడ విషం చిమ్మే క్రీడను ఈ కూటమి ప్రారంభించింది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో వేళ్లన్నీ అటువైపే చూపు తున్నాయి. ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి దళితులకూ – ఇతర కులాలకూ మధ్య, బీసీలకూ – ఇతరులకూ మధ్య, మైనారిటీలకూ – ఇతరులకూ మధ్య కృత్రిమ సమస్యలు సృష్టించి చిచ్చుపెట్టే వికృత క్రీడను ప్రారంభించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా, వినాశకరంగా పరిణ మించబోతున్న ఈ పాపాన్ని ప్రజలంతా ఉమ్మడిగా ఎదుర్కోవలసిన అవసరం ఉన్నది. శనివారం నాడు ఒంగోలులో జరిగిన ‘మహానాడు’లో పాలక పార్టీపై విద్వేషాన్ని రెచ్చ గొట్టడం తప్ప పేదవర్గాలను సాధికారం చేయగల ఒక్క కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయారు. కోనసీమకు అంబేడ్కర్ పేరుపై తన వైఖరేమిటో చెప్పకుండా నిజస్వరూపాన్ని చూపెట్టారు. ఇదొక హెచ్చరిక. సాధించిన విజయాలను నిలబెట్టుకోవడానికి పేద వర్గాలు సంఘటితం కావలసిన అవసరం ఉన్నది. బలహీన వర్గాల నాయకుల బస్సు యాత్రలు ఆహ్వానించవలసిందే! కానీ అదే చాలదు. పేదవర్గాల ప్రజ లందరూ ఐకమత్యంగా గ్రామగ్రామానా చైతన్య యాత్రలు జరపవలసిన అవసరం ఉన్నది. ఆర్థిక – సామాజిక విప్లవాన్ని విజయవంతం చేయవలసి ఉన్నది. అన్ని కులాలు, వర్గాల మధ్య సమైక్యతనూ, సౌభ్రాతృత్వాన్నీ నిలబెట్టవలసి ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
జేసీ దివాకర్ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలి
సాక్షి, కర్నూలు : తెలుగు దేశం పార్టీ ‘‘మహానాడు’’ కార్యక్రమంలో ఎరుకలి కులస్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఎంపీ పదవి నుంచి తొలగించాలని ‘‘ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్’’ సభ్యులు డిమాండ్ చేశారు. జేసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలో జేసీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు బిర్లాగేట్ సర్కిల్ వద్ద ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జేసీ దివాకర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. -
నారా లోకేష్ అలా అనడం దుర్మార్గం..
విశాఖపట్నం : బీజేపీ నేతలు తమ శత్రువులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ అనడం దుర్మార్గమని బీజేపీ ఏపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ఆయన మంగళవారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ..మహానాడుపై ఎవరైనా విమర్శలు చేస్తే తెలుగుదేశం నాయకులు సహించలేకపోతున్నారని అన్నారు. రమణ దీక్షితులు చేసే ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగుతున్నారని వ్యాఖ్యానించారు. గుజరాత్ పారిశ్రామిక ప్రాంతంలో దలైలా నగరం అభివృద్ధి చేస్తుంటే.. కేంద్ర నిధులు మళ్లించారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని, అది ప్రజల భాగస్వామ్యంతోనే నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. కేంద్ర నిధుల నుంచి ఒక్క పైసా కూడా ఈ నగరంలో పెట్టడం లేదని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తాను సీనియర్ అని చెప్పుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గించాలని అధికారులకు సూచించడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలలో చంద్రబాబుకి ఓటేస్తే తెలుగు జాతిని అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణాలపై చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయని, సిట్ దర్యాప్తు పూర్తిచేసి నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినా ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఇందులో మంత్రి గంటా శ్రీనివాస్ అనుచరుల పేర్లు ఉన్నాయనే భయపడుతున్నారని, వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
ఓ ద్రోహి.. లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తోన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ను చంపేసి, జెండాను దొంగతం చేసిన ద్రోహి చంద్రబాబు. అలాంటి నిన్ను నేను పదవులు అడిగిన మాట నిజమే అయితే... నీ కొడుకు లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?’’ అని సవాలు విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి... టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘చంద్రబాబు విశ్వాస ఘాతకుడని నేను కాదు.. ఎన్టీఆరే చెప్పారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి, శరణుశరణంటూ టీడీపీలోకి వచ్చి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నరహంతకుడివి. చివరికి పార్టీ జెండాను లాక్కున్న దొంగవి. రాజకీయాల్లో నీఅంత నీతిమాలిన వ్యక్తి లేడు. నీ జీవితమే అవినీతికి కుట్రలకు, మోసాలకు నిలయం. పార్టీ పెట్టిననాడు ఎన్టీఆర్ వెంట ఉన్న నాలాంటి పేదలను టార్చర్ చేసిన క్రూరుడివి. సీనియారిటీకి విలువ లేదన్న బాధతోనేకదా గాలి ముద్దుకృష్ణమ లాంటి 20 మందిదాకా చనిపోయింది. జెండాను నమ్ముకున్న మాలాంటి వాళ్లను కాదని, నీలాంటి దొంగలను పార్టీలో చేర్చుకున్నావ్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా జెండా కోసం మాత్రమే వెంట ఉన్నాను తప్ప, పదవుల కోసం కాదు.... చంపేస్తారని భయపడ్డావే.. ఇప్పుడు ఫోన్ ఎత్తవెందుకు?: 2009-12 మధ్య కాలంలో నీ దగ్గరికి రావడానికే అందరూ భయపడుతుంటే నేను పక్కనున్నా. నాకు ప్రాణభయం ఉందని గజగజలాడిన ఆ రోజులు గుర్తులేవా, చంపేస్తారు.. కాపాడమని బతిమాలితేనేకదా నీ వెంట కాపలా కుక్కలా తిరిగింది. ఏం, ఇప్పుడేమైంది? 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తవెందుకు, మీటింగ్‌కి ఎందుకు పిలవలేదనేకదా నేను అడిగింది.. ఫలానా కారణంతో పిలవలేదని చెబితే సరిపోయేదికదా, పనికిరాని మనుషుల చేత నన్ను తిట్టించడందేనికి? ఏ కులపోడు మాట్లడితే ఆ కులపోడితో తిట్టించడమేనా రాజకీయమంటే! 29 సార్లు మోదీని కలిసింది అందుకేగా: నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నావే, మరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆయన కొడుకులది కాదా, నీ దగ్గర పనిచేసిన కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేక, ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడానికి కుట్రలు చేయలేదా, కేసీఆర్‌కు దొంగలాగా దొరికిపోలేదా, అందుకుకాదా 10 ఏళ్ల హక్కును వదిలేసి హైదరాబాద్ నుంచి పారిపోయింది! ఇగ అమరావతి వెళ్లి అక్కడ పెద్ద డ్రామా. 29 సార్లు మోదీని ఎందుకు కలిశావ్? కేసీఆర్ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావే తప్ప హోదా కోసం కాదు కదా.. అయినా హోదా నువ్వు తెచ్చేదేంది? జగనే తెచ్చుకుంటాడు, లేకుంటే ఇంకెవరో పోరాడితే అదే వస్తుంది. నీ అబద్ధాలను జనం నమ్ముతారనుకుంటున్నావా... టీడీపీని బ్రోతల్ హౌస్లా..: 10 ఏళ్లూ ఇక్కడే ఉంటా, పార్టీని కాపాడుకుంటా అని అన్నావ్, దొంగలాగా రాత్రికిరాత్రే పారిపోయావ్. రేవంత్ రెడ్డితో నువ్వు చేయించిన కుట్రతో పార్టీ పరువు గంగలో కలిసింది. ఆ తర్వాతైనా రేవంత్‌ని కట్టడిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ల నుంచి విమర్శలు రాకూడదనేకదా రేవంత్‌ను ఆ పార్టీలోకి పంపింది. ఇప్పుడు నేను అడుతున్నా... ఆ ఆడియోలో వాయిస్ నీది కాదని చెప్పగలవా? ఆ గొంతు విన్న ప్రతిఒక్కడూ టీడీపీ నాయకుల నోట్లో ఉమ్మి ఊశారు. బ్రోకర్ పనులు చేస్తూ టీడీపీని బ్రోతల్ హౌస్లా నడిపిస్తున్నావ్.. థూ.. నీ మీద మన్నుపడ! ఎన్టీఆర్ ఆశయాల కోసం పార్టీలో చేరిన నాలాంటి పేదల జీవితాలను నాశనం చేశావుకదా.. ఈ పాపం ఊరికే పోదు. నోరుతెరిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలాగా ఉపన్యాసాలు ఇస్తావ్.. మనస్సాక్షిలేని మూర్ఖుడివి నువ్వు.. తిరుమల మెట్లమీదే ప్రాణాలు వదిలేస్తా: పేదల వ్యతిరేక విధానమే చంద్రబాబు పాలసి. అలాంటివాడిని ఓడగొట్టాలని ఏపీ ప్రజల్ని కోరుతున్నా. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో నుంచి ప్రతి నియోజవకర్గానికి 25 కోట్లు ముందస్తుగా పంపాడు. అసలు ఈయనవల్లే కదా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నది. ఎన్నికల్లో చంద్రబాబు పెట్టిన ఖర్చు దేశంలో ఎవడూ పెట్టడు. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫొటోలు కావాలి. దేశంలో అన్ని కంపెనీలు దివాళా తీస్తుంటే ఈయన హెరిటేజ్ ఒక్కటే లాభాల్లో ఎలా ఉంటుంది? దొంగసొమ్మును దుబాయ్, అమెరికాల్లో దాస్తున్నది నిజం కాదా! ఈ దొంగను ఈ సారి ఓడించాల్సిందే. చంద్రబాబును నాశనం చేయమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకుంటా. మోకాళ్లమీద తిరుమలకు నడుచుకుంటూ వెళతా. మెట్లమీద నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. దేవుడు నా ప్రార్థన వింటేచాలు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబును బొందపెట్టాల్సిందే....’’ అని మోత్కుపల్లి అన్నారు. -
మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు
-
టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం మహానాడులో ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, తమ నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అయితే పట్టపగలే అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించిన విషయం విదితమే. పార్టీ ధిక్కారానికి పాల్పడిన మోత్కుపల్లిను టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎల్.రమణ తెలిపారు. ‘మోత్కుపల్లి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవ మొదలుపెట్టారు. కేసీఆర్...ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని నరసింహులు ఎలా చెపుతారు. నేరెళ్ల బాధితుల విషయంలో మోత్కుపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెబుతారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదు. అందుకే మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని పేర్కొన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు
సాక్షి, విజయవాడ : తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎన్టీఆర్ జయంతి.. నారా లోకేశ్ ట్వీట్
సాక్షి, విజయవాడ: విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, ప్రార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబీకుల్లో అధికులు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి శ్రద్ధాంజలిఘటించారు. విజయవాడలో సీఎం చంద్రబాబు.. రెండో రోజు మహానాడుకు వెళుతూ.. దారిమధ్యలో పటమట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి సరిపెట్టారు. కాగా, ఎన్టీఆర్ జయంతి నాడు కూడా మహానాడులో చంద్రబాబు భజనే వినిపించడం గమనార్హం. లోకేశ్ ట్వీట్.. ఆసక్తికర వ్యాఖ్యలు: ‘జయంతి శుభాకాంక్షలు’ చెప్పడంలో (గతంలో)సంచలనాలు సృష్టించిన నారా లోకేశ్.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒకింత జాగ్రత్త వహించారు. ‘‘సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక మహానాడులో ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో నాన్నగారు ఏమనేవారంటే..: ‘‘చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా నాన్న నన్ను ఊరికి పంపేవారు. అలా పంపేటప్పుడు.. ‘పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే..’ అని పదేపదే గుర్తుచేసేవారు. ఆ విధంగా చిన్నవయసులోనే నాకు పంచాయితీరాజ్ మంత్రిగా పల్లెలకు సేవచేసే అవకాశం దక్కింది. స్వాతంత్ర్యం తరువాత 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ గడిచిన 4ఏళ్లలో పూర్తిచేశాం. మేము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న నాపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్లకు దమ్ము,ధైర్యం ఉంటే.. నేను ఎక్కడ, ఎలా తప్పు చేశానో ఆధారాలతో సహా నిరూపించాలి. తన సొంత నియోజకవర్గంలో కట్టాల్సిన సుజల స్రవంతి పథకాన్ని ఉద్దానంకు తరలించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది. ఆయన 68 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారు. 32 ఏళ్ల యువకుడినైన నేనే ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నాను.. ’’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు. సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం. — Lokesh Nara (@naralokesh) 28 May 2018 -
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో కలకలంరేపాయి. ఆ వెంటనే చంద్రబాబు.. తెలంగాణ నేతలచేత మోత్కుపల్లిని తిట్టించారు. నట చక్రవర్తి చంద్రబాబు: ‘‘ఎన్టీఆర్ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు. తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పు.. నాకు గవర్నర్ పదవి ఇస్తానని..: యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు హోదా పేరెత్తడానికి కొంచమైనా సిగ్గుపడాలి. చరిత్రలో చంద్రబాబుకంటూ ఓక నల్లపేజీ ఉంటుంది. ఈ దుర్మార్గుడిని పాతళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు గవర్నర్ పదవి లేదంటే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తానని మాటిచ్చాడు. కానీ రాజ్యసభ సీట్లను వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, జెండాను దొంగిలించిన బాబుతో పోల్చితే.. సొంతగా పార్టీలు పెట్టుకున్న వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లు నిజమైన మగాళ్లు. ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబును ఓడించాలి.. పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చెయ్: ఎన్టీఆర్‌తోపాటు ఆయన కుటుంబీకులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా దగ్గుబాటి దంపతులను పక్కన ఉంచుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కుట్రలు చేశారు. నందమూరి హరికృష్ణనూ పార్టీ నుంచి గెంటేశారు. చివరికి బాలకృష్ణను తన పక్కన పెట్టుకున్నాడు. మోసకారి చంద్రబాబు తక్షణమే టీడీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి...’’ అంటూ మోత్కుపల్లి గర్జించారు. మహానాడులో కలకలం: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలతో మహానాడులో కలకలం రేగింది. సభా ప్రాంగణమంతా దీని గురించే చర్చ జరిగింది. ఎన్టీఆర జయంతినాడే తనపై ఇంత తీవ్రస్థాయిలో దాడిజరడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను రంగంలోకి దించి.. మోత్కుపల్లిని తిట్టించేప్రయత్నం చేశారు. బాబు ఆదేశాలతో మహానాడు ప్రాంగణంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మోత్కుపల్లికి తగదని, ఇష్టముంటే టీఆర్ఎస్లోకి వెళ్లిపోవచ్చని సండ్ర అన్నారు. ‘మరి మోత్కుపల్లిపై చర్యలు తీసుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం సండ్ర సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘చాలా సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి.. అన్నింటిపైనా చర్యలు తీస్కోలేము’’ అని వ్యాఖ్యానించారు. -
ప్రపంచంలో ఏ కొడుకూ చేయలేదు: బాలకృష్ణ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ తర్వాత టీడీపీని ఘనమైన శైలిలో నడుపుతున్నది చంద్రబాబేనని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు ఇప్పుడు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారని, 68ఏళ్ల వయసులోనూ రాష్ట్రం కోసం అహర్నిషలూ పాటుపడుతున్నారని కీర్తించారు. విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడు రెండో రోజైన సోమవారం ఆయన ప్రసంగించారు. సహజశైలికి భిన్నంగా బాలయ్య ప్రసంగం చప్పగా, సాదాసీదాగా సాగడం గమనార్హం. ఏ కొడుకుకూ దక్కని అదృష్టం నాది: ‘‘ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జ్ఞాపకార్థం మహానాడును జరుపుకొంటున్నాం. భావితరాలకు ఎన్టీఆర్ గుర్తుండేలా ఆయన జీవితచరిత్రను సినిమాగా రూపొందిస్తున్నాం. ఏ కొడుకూ ఇంతవరకు తండ్రి పాత్రను చేయలేదు. అలా చేసే అదృష్టం నాకే దక్కింది. సామాన్యుడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబుగారు ఘనమైన శైలిలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. హామీల సాధన కోసమే చంద్రబాబు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారు. దగ్గర్లోనే ఎన్నికలున్నాయి.. నమ్మకద్రోహులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది’’ అని బాలకృష్ణ అన్నారు. -
బ్రాహ్మణులంటే నాకు గౌరవం
-
నా సైన్యం 70 లక్షలు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి పెద్ద సైన్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 60 లక్షల మంది, తెలంగాణలో 10 లక్షల మంది కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ప్రపంచంలోని వందల దేశాల్లో టీడీపీ మహానాడు జరుపుకునే రోజు వస్తుందన్నారు. విజయవాడ సమీపంలోని కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంలో ఏ పనీ అయ్యే పరిస్థితి లేదని, మాటలు ఎక్కువ చెబు తున్నారు తప్ప పనులు మాత్రం జరగడం లేదని విమర్శించారు. అంతా ప్రచార అర్భాటమేనని, నరేంద్ర మోదీ ప్రచార ప్రధానమంత్రి మాత్రమేనని అన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, జనధన్, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని తేల్చిచెప్పారు. బీజేపీ హయాంలో బ్యాంకులన్నీ దివాలా తీస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో బ్యాంకుల్లో రూ.29,916 కోట్ల అవినీతి జరగ్గా, నాలుగేళ్ల బీజేపీ పాలనలో రూ.1.11 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు భారీగా పెరిగిపోయాయని, పరిపాలన గాడి తప్పే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. కేంద్రం తీరు వల్ల అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహానాడులో చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘వ్యవసాయం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో బీజేపీ ఆటలు సాగలేదు. అక్కడ ఆ పార్టీ నాయకుల టేపులు దొరికాయి. ఇక బీజేపీ ఏ విధంగా నీతివంతమైన పార్టీ? దక్షిణ భారతదేశంలో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చూస్తోంది. బీజేపీకి అధికారంపైన ఉన్న ప్రేమ అభివృద్ధిపై లేదు. దేశంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ అసలే రాదు. మళ్లీ ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పుతాయి. ఆ పార్టీల నాయకులను దెబ్బ తీయాలనుకుంటే బొబ్బిలి పులుల్లా తిరిగొస్తారు, కొండవీటి సింహాల్లా గర్జిస్తారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్ నగరాన్ని నిర్మించా. నా కష్టార్జితాన్ని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తోంది. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మళ్లీ టీడీపీ అధికారం రావాలి. టీడీపీ గెలవడం ఒక చారిత్రిక అవసరం. 25 ఎంపీ సీట్లు సాధించాలి. కేంద్ర ప్రభుత్వంలో 61 శాతం అవినీతి ఉందని ఒక సర్వేలో తేలింది. వాళ్లు(కేంద్రం) చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరు. నాలుగేళ్లలో బీజేపీ ఏమైనా చేసిందా? నేను సవాల్ చేసి అడుగుతున్నా. బీజేపీ వాళ్లు ఈ నాలుగేళ్లలో చేసింది ఏమైనా ఉందా? బీజేపీ మాకు నమ్మకద్రోహం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏదోవిధంగా తప్పించుకునేలా అడ్డదారులు వెతుకుతున్నారు. గట్టిగా అడిగితే మాపై కుట్రపూరితమైన రాజకీయాలు చేశారు. అవసరమైతే దేశ రాజకీయాలను మార్చే శక్తి టీడీపీకి ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. విభేదించిన వారిని ఇబ్బంది పెట్టే అలవాటు బీజేపీకి ఉంది. అందులో భాగంగానే కర్నూలు జిల్లాలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. టీటీడీని కబ్జా చేయాలనుకున్నారు రాష్ట్రంలోని వెంకటేశ్వరస్వామిని కేంద్రంలోని నరేంద్ర మోదీ కబ్జా చేయాలనుకున్నారు. వెంకటేశ్వరస్వామి జోలికి ఎవరు వచ్చినా ఊరుకోం.. ఖబడ్దార్. తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఎప్పుడో నగలు దొంగతనం జరిగాయని, లేని వజ్రాలున్నాయని బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది బీజేపీ కుట్రలో భాగమే. నవ్యాంధ్రలో సమస్యలను పరిష్కరించడం కోసమే క్లెమోర్ మైన్ల దాడి నుంచి 2003లో వెంకటేశ్వరస్వామి నన్ను కాపాడారు’’ అని చంద్రబాబు తెలియజేశారు. మహానాడులో చంద్రబాబు తొలుత డ్వాక్రా బజార్, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతి చెందిన టీడీపీ కార్యకర్తలకు సంతాపం తెలిపారు. ఏపీ, తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, బుచ్చిలింగం పార్టీ పరిస్థితులపై తమ నివేదికలు సమర్పించారు. -
నరేంద్ర మోదీపై నిప్పులుచెరిగిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: ‘కూరిమి గల దినములలో...’ అంటూ అవకాశవాద స్నేహాలను గురించి బద్దెన చెప్పిన పద్యం గుర్తుందిగా! ‘పెద్ద నోట్లు రద్దు చేయమని ప్రధాని మోదీకి సలహా ఇచ్చి, జీఎస్టీతో దేశం బాగుపడుతుందని చెప్పి, ఏపీకి కేంద్రం ఎక్కువే ఇచ్చిందని పలికి, ‘బ్రీఫ్డ్ మీ’ ఆడియోతో తనకు సంబంధంలేదన్న నారా చంద్రబాబు నాయుడు అలవాటైన పద్ధతిలోనే మళ్లీ మాట మార్చారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ప్రసంగించిన ఆయన.. తన తాజా మాజీ స్నేహితుడు మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేయలేని చంద్రబాబు.. బీజేపీని వీడిన తర్వాత కాంగ్రెస్‌తో కాపురానికి సిద్ధపడుతుండటం తెలిసిందే. పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా?: ‘‘మోదీకి మాటలెక్కువ.. చేతలు తక్కువ. బీజేపీ పథకాలతో ఎవరైనా బాగుపడ్డారా? నోట్ల రద్దుతో వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.. జనం బ్యాంకుల చుట్టూ తిరిగే దౌర్భాగ్యం దాపురించింది. జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడింది. మొత్తంగా మోదీ చర్యలతో పాలన గాడితప్పింది. కలుషిత రాజకీయాలు చేస్తోన్న బీజేపీ.. కర్ణాటకలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బేరాలాడుతూ ఆడియో టేపులద్వారా అడ్డంగా దొరికిపోయింది. 2019లో బీజేపీ అధికారంలోకి రానేరాదు’’ అని చంద్రబాబు అన్నారు. తద్వారా బద్దెన పద్యాన్ని మరోసారి రుజువుచేశారు. వెంకన్న జోలికెళ్తే ఈ జన్మలోనే శిక్ష: సుదీర్ఘంగా సాగిన చంద్రబాబు ప్రసంగంలో శ్రీవారి ఆభరణాల మాయం అంశాన్ని కూడా తట్టారు. వెంకన్న జోలికి వెళితే ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి ఉంటుందని సీఎం గుర్తుచేసుకున్నారు. మహానాడు అంటే తెలుగు జాతికే పండుగ అని, అలాంటి టీడీపీని బీజేపీ కబ్జా చేయాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించానని, ఎన్నడూ లేనంతగా మైనారిటీలకు నిధులు పెంచానని, అగ్రవర్ణ పేదలనూ ఆదుకుంటున్నామని చెప్పుకొచ్చారు. 2022నాటికి ఏపీ అగ్రగామి: ‘‘హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టింది. ఇచ్చిన హామీలను అమలుచేయలేదు. అయినాసరే నేను కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళుతున్నాను. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్ లోటును అధిగమించాం. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆ విధంగా ముందుకు వెళుతూ 2022 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలుపుతాం..’’ అని చంద్రబాబు అన్నారు. -
‘టీడీపీని భూస్థాపితం చేసారు’
సాక్షి, శ్రీకాకుళం: కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు స్థాపించిన టీడీపీని చంద్రబాబు భూస్థాపితం చేసారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నిర్వహిస్తుంది మహానాడు కాదు మాయనాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ కోవర్టుగా చంద్రబాబు పనిచేసారని ఆరోపించారు. ఇప్పుడు రాహుల్ గాంధీతో చేతులు కలిపి టీడీపీకి భస్మాసుర హస్తాన్ని చూపిస్తున్నారని అన్నారు. నిజమైన ఎన్టీఆర్ వారసులు టీడీపీలో ఉంటే కాంగ్రెస్ పార్టీతో దోస్తిని వ్యతిరేకించి ఉండేవారని పేర్కొన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నట్టుగా స్వాతంత్ర్యం పేరు చెప్పి దేశాన్ని కాంగ్రెస్ పార్టీ దగా చేస్తోందని ధ్వజమెత్తారు. -
తప్పైపోయింది క్షమించండి: మంత్రి సోమిరెడ్డి
సాక్షి, విజయవాడ: తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంలో టీడీపీ పెద్దల ప్రమేయంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం భయపడుతున్నట్లు తేటతెల్లమైంది. ‘‘రమణదీక్షితులుని బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి..’’అన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 24 గంటలు తిరక్కముందే.. ‘‘తప్పుగా మాట్లాడాను క్షమించండి..’’ అని వేడుకున్నారు. ఆదివారం విజయవాడలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. అదే తెలంగాణలో అయితే ఇంటరాగేషన్ చేసేవారే: ‘‘రమణదీక్షితులు గారిని ఉద్దేశించి అన్న మాటలకు క్షమాపణలు చెబుతున్నాను. బ్రాహ్మణుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. అందుకే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. నిజానికి నేను ప్రతిపక్షం వారిని విమర్శించాలనుకుని రమణదీక్షితులును అనేశాను. అయినా, ముఖ్యమంత్రి ఇంట్లో శ్రీవారి నగలు ఉన్నాయని ఎవరైనా ఆరోపిస్తే.. తెలంగాణలో అయితే ఖచ్చితంగా బొక్కలోవేసి ఇంటరాగేషన్ చేసేవారు. అసలు వేంకటేశ్వర స్వామి నగల గురించి మాట్లాడినందుకు శిక్షించేవారు..’’ అని సోమిరెడ్డి అన్నారు. తద్వారా ఈ వ్యవహారంలో దర్యాప్తు ఉండబోదని టీడీపీ మరోసారి వెల్లడించింది. వెంకన్న చౌదరి.. రమణదీక్షితులు ఎవరు?: శ్రీవారి ఆభరణాల మాయం వ్యవహారం గుట్టురట్టైన దగ్గర్నుంచి టీడీపీ నేతల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరడం చూస్తూనేఉన్నాం. టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఏకంగా దేవుడికి కులాన్ని ఆపదిస్తూ ‘వెంకన్న చౌదరి’ అని, ఆ తర్వాత నోరుజారానని చెప్పుకొచ్చారు. అంతలోనే మంత్రి సోమిరెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘ఎవరా రమణదీక్షితులు.. బొక్కలోవేసి నాలుగు తగిలిస్తే నిజాలు బయటికొస్తాయి’అని అన్నారు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. -
చంద్రబాబు మళ్లీ వేసేశారు..
సాక్షి, హైదరాబాద్: చరిత్రంటే నారా వారిదేనని మరోసారి రుజువుచేశారు చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలోనైనా, భరింపశక్యంకాని గప్పాలు కొట్టడంలోనైనా తమను మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టడం.. విశిష్టులకు నోబెల్, ఆస్కార్లు ఇప్పించడం.. సత్య నాదెళ్లకు ఇంజనీరింగ్ సలహా ఇవ్వడం.. పీవీ సింధుచేత షటిల్ రాకెట్ పట్టించడంలాటి ఘనకార్యాలెన్నో చేసిన ఆయన హైటెక్ సిటీ కాకుండా ఓ బ్రహ్మాండ నిర్మాణాన్ని తాజాగా తన ఖాతాలో వేసేసుకున్నారు. అదే బేగంపేట్ ఎయిర్పోర్ట్! కట్టింది నేనే: తెలంగాణ టీడీపీ గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మహానాడుకు సంబంధించి చంద్రబాబు ఒక ట్వీట్ చేశారు. ‘‘ఒకప్పుడు తాగునీరు లేని పరిస్థితి నుంచి హైదరాబాద్ నేడు మహానగరంగా మారిందంటే దాని వెనుక టీడీపీ ప్రభుత్వ శ్రమ, కష్టం ఎంతో ఉంది. దేశంలోనే నంబర్ వన్‌గా పేరొందిన బేంగంపేట విమానాశ్రయమూ టీడీపీ హయాంలోనే నెలకొల్పాం. భావితరాల భవిష్యత్తు కోసం హైటెక్ సిటీని నిర్మించాం’’ అని రాసుకొచ్చారు. అంతే, నెటిజన్లు ఒక్కసారిగా ఘొల్లున నవ్వుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ 1930లోనే నిజాం రాజు కట్టించారు. అప్పటికి మన సారు ఇంకా పుట్టనేలేదు! ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ కొందరు ‘అవునవును.. నిజాం రాజు మీ దోస్తే కదా..’’ అంటూ సెటైర్లు వేశారు. తప్పును గ్రహించిన చంద్రాలు సారు కొద్ది నిమిషాలకు ఆ ట్వీట్‌ను డిలిట్‌చేసి, ‘బేగంపేట’ ప్రస్తావన లేకుండా మరో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే ఆ స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి... (డిలిట్ చేసిన బాబు ట్వీట్ స్ర్కీన్‌షాట్) బ్రీఫ్‌గా బేగంపేట చరిత్ర: 1930లో తొలుత హైదరాబాద్ ఎయిరో క్లబ్ పేరుతో నిజాం ప్రభువు బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. అనంతరం దక్కన్ ఎయిర్వేస్ లిమిటెడ్ పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయంగా వర్ధిల్లింది. 1937లో తొలి టెర్మినల్, 1972లో కొత్త టెర్మినల్ భవనాలను నిర్మించారు. 2008లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యేనాటికి బేగంపేట ఎయిర్పోర్ట్ దేశంలోనే అత్యంత రద్దీగల ఆరో విమానాశ్రయంగా ఉండింది. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌గా పిలుస్తోన్న బేగంపేట విమానాశ్రయంను ఏవియేషన్, మిలటరీ ట్రైనింగ్ కోసం, అప్పుడప్పుడూ వీవీఐపీల రాకపోకల కోసం కూడా వినియోగిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ పాతఫొటోలు కొన్ని.. తప్పు తెలుసుకున్న తర్వాత సవరించిన ట్వీట్ ఇది.. -
టీడీపీతో పెట్టుకుంటే షాకే
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. ‘‘అప్పుడు దేశ రాజకీయాల్లో టీడీపీదే కీలకపాత్ర. దేశంలో టీడీపీ గెలవడం చారిత్రక అవసరం’’అన్నారు. టీడీపీతో పెట్టుకున్న ఎవరికై నా కరెంట్‌షాక్ కొడుతుందని హెచ్చరించారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణ టీడీపీ మహానాడు జరిగింది. బాబు ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ, ఏపీలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు చేసిందేమీ లేదంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘అవినీతిని కేంద్రం నియంత్రించలేకపోయింది. జీఎస్టీ అమల్లోనూ విఫలమైంది. నోట్ల రద్దుతో ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు పెరిగాయి. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన వర్సిటీ, స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఏమీ చేయలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు’’అని అన్నారు. తెలుగు ప్రజలంటే బీజేపీకి ఎందుకంత కోపమని ప్రశ్నించారు. తెలంగాణలోనూ ‘కర్ణాటక’ పునరావృతం ‘‘నేనెక్కడున్నా నా మనసు తెలంగాణ కార్యకర్తలపైనే ఉంటుంది. వారికి సమయం కేటాయిం చలేకపోతున్న బాధ నాకుంది. అయినా కార్యకర్తలు ధైర్యంగా ఉంటున్నారు. కార్యకర్తలు ఎన్నికల దాకా నిద్రపోకుండా పని చేయాలి. కొండవీటి సింహంలా, బొబ్బిలిపులిలా, సైనికుడిలా కష్టపడి చరిత్ర సృష్టించాలి. ఆర్నెల్లలో టీడీపీ బలం పుంజుకుని తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. కర్ణాటకలో జరి గిందే తెలంగాణలో పునరావృతమవుతుంది’’అని బాబు వ్యాఖ్యానించారు. కాగా, మహానాడులో 8 తీర్మానాలను ఆమోదించారు. మహానాడుకు సీనియర్ తెలంగాణ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఆర్.కృష్ణయ్య హాజరుకాలేదు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అధ్యక్షతన జరిగిన మహానాడులో దేవేం దర్‌గౌడ్, వెంకటవీరయ్య, నామా, గరికపాటి, రావుల, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా నా వల్లే! బాబు స్వోత్కర్షకు మహానాడు వేదికైంది. ‘‘40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. దేశంలోకెల్లా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిని నేనే. తెలంగాణలో సేవా రంగం ద్వారా రూ. 3.21 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంటే నేను దూరదృష్టితో చేసిన అభివృద్ధి వల్లే. సైబరాబాద్ ఏర్పాటు చేసింది నేనే. మెట్రో రైలు తెచ్చిందీ నేనే. హైదరాబాద్‌లో మతకల్లోలాలు నిర్మూలించిందీ నేనే. రోడ్డు వెడల్పు కార్యక్రమం నా సృష్టే. ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చా. నన్ను ప్రధాని కావాలని 22 ఏళ్ల క్రితమే అడిగారు. కానీ నాకే కావాలని లేదు. తెలుగు ప్రజలకు సేవచేసే భాగ్యం శాశ్వతంగా ఉంటే చాలు. నేను ఏర్పాటు చేసిన నాలెడ్జ్ అకాడమీ వల్లే జేఈఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు 20 శాతం సీట్లు సాధించారు. మెట్పల్లి విద్యార్థి సివిల్స్ టాపర్ కావడం, శ్రీకాకుళం విద్యార్థి జేఈఈ టాపర్ కావడం, అమెరికా సహా విదేశాల్లో తెలుగు వారు ఎక్కువ ఉండటానికి కారణమూ టీడీపీ దూరదృష్టితో చేసిన కృషి, అభివృద్ధి ఫలితమే’’అని చెప్పుకొచ్చారు. నన్ను ఆహ్వానించరా?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘‘నన్నింత చిన్న చూపు చూస్తరా? ఒక సీనియర్ దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’’అని ప్రశ్నించారు. ‘‘నేను వాస్తవాలు మాట్లాడా. తర్వాత క్షమాపణలూ చెప్పా. అయినా నన్ను పార్టీపరంగా పట్టించుకోకపోవడం దారుణం’’అని అన్నారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. ఎన్టీఆర్‌తో కలిసి పని చేశా. అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్‌గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు’అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. టీడీపీ అధికారంలోకి రాదని, టీఆర్ఎస్ వస్తుందని బాబు, నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాకు రాజ్యసభ ఇస్తనన్నరు. అధికారం కోసం, టికెట్ కోసం టీడీపీలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేసిండ్రు. అతను పార్టీని భ్రష్టు పట్టించి, మొత్తంగా కాంగ్రెస్‌లో కలుపుతానన్నా మందలించలేదు. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యమని, టీఆర్ఎస్తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? నా నేరమేందో, ఏం పాపం చేసిన్నో అర్థం కాలే. మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు? చెప్పుకుంటే సిగ్గుపోతది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడతది. మూడేళ్ల నుంచి అడుగుతున్నా ఐదు నిమిషాలు టైం ఇవ్వలేదు. నన్ను అవమానించడం భావ్యం కాదు. నన్ను పిలవండి. మీ ప్రేమ అందించండి. పార్టీని బతికించుకుందాం’’అన్నారు. -
18న మిర్యాలగూడలో టీడీపీ మినీమహానాడు
నల్లగొండ రూరల్ : మిర్యాలగూడలో ఈనెల 18న టీడీపీ మినీ మహానాడు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యు డు సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో నల్లగొండ పార్లమెంట్‌స్థాయి మినీ మçహానాడు సన్నద్ధ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమస్యలపై పలు తీర్మానాలు చేశా రు. సభ నిర్వహణకు 11కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభకు 3వేల మంది నాయకులు, కార్యకర్తలు రానున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ హామీలు, సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టుల వైపల్యాలపైన, విద్యా, వైద్యరంగం నిర్లక్ష్యంపై మహనాడులో చర్చిస్తామన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీడీపీ గట్టిపోరాటం చేయాలన్నారు. రైతుబంధు పథ కం కింద ఎకరానికి 4వేలు ఇచ్చినా రైతులు టీఆర్ఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపారు. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీకి గల్లీ నుంచి బలమైన కేడర్ ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. సమావెశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజు, నియోజకవర్గ ఇన్చార్జులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సాదినేని శ్రీని వాస్‌రావు, కడారి అంజయ్య, చావా కిరణ్మయి, రాంరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, బాబురావునాయక్, అరున్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌బాబు, ఎల్‌వీయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ మహా(మాయ)నాడు
► చర్చకు రాని ప్రజా సమస్యలు ► కేంద్రాన్ని ప్రశ్నించడంలో అదే వెనకడుగు ► సొంత డబ్బా, ప్రతిపక్షాలపై ఆరోపణలకే పరిమితం ►బాబు ప్రసంగాలతో విసిగిపోయిన తమ్ముళ్లు ► సంక్షేమంలో ఆంధ్రాకన్నా తెలంగాణే బెటర్ విశాఖ వేదికగా ఆంధ్రాయూనివర్సిటీలో టీడీపీ నిర్వహించిన మహానాడు ఎంత ఆడంబరంగా ప్రారంభమైందో.. అంతకంటే నీరసంగా ముగిసింది. దాదాపు 26 వేల మందికి పైగా మహానాడు పండక్కి వస్తున్నారని డప్పేసిన తెలుగు నాయకులు తీరా కార్యక్రమం ముగిశాక మీడియాకు ముఖం చాటేశారు. ప్రతి సంవత్సరం వచ్చే పార్టీ పండగ్గా చెప్పుకునే మహానాడు ప్రెస్మీట్ల కాంబోగానే మిగిలింది. షరామామూలుగానే చంద్రబాబు తన ప్రసంగంలో ప్రతిపక్ష వైయస్సార్సీపీని, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌ని తిట్టిపోయడంలోనే మునిగిపోయారు. సాధారణంగా పార్టీ పరంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు ఏదొక సందేశం ఇస్తారు. దిశా నిర్దేశం చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. పైగా టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రంపై ఎంతో బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే మహానాడుకు ముందు ఉత్తరాంధ్ర నాయకులు చాలా ఆశలే పెట్టుకున్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏదో ఒరగబెడతారని ఆశించారు. పార్టీకి కూడా గట్టి పట్టున్న ప్రాంతంకావడంతోపాటు పార్టీ అధికారంలో కూడా ఉండటంతో మేలు జరుగుతుందని ఊహించిన నాయకులు భంగపాటు తప్పలేదు. సమస్యల ప్రస్తావనే లేదు గత ఏడాది చెప్పినట్టుగా విశాఖకు రైల్వే జోన్ తీసుకొస్తానని ముక్తసరిగా చెప్పేసి చంద్రబాబు ముగించేశారు. రాష్ట్ర విస్తీర్ణంలో 15 శాతంగా దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఉత్తరాంధ్రను మహానాడు సాక్షిగా చంద్రబాబు విస్మరించారు. విశాఖ రైల్వేజోన్ సహా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య, వంశధార ప్రాజెక్టు బాధితులకు నష్ట పరిహారం, మూత పడే స్థితిలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి ఎన్నో సమస్యలను ప్రస్తావించకుండానే మహానాడును మమ అనిపించేశారు. మహానాడు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్‌కు భారతరతన్న ఇవ్వాలని తీర్మానం.. ఆనక ఉట్టికెక్కించేయడం మామూలే. ఈసారీ అదే జరిగింది. కాకపోతే కేంద్రమంత్రి సుజన చౌదరి మరో అడుగు ముందుకేసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఫైలు ప్రధాని టేబుల్ మీదే ఉందన్నారు. కార్యకర్తలు విసిగిపోయి బాబు మాటలమీద విశ్వాసం కోల్పోతున్నారని గుర్తించినట్టున్నారు. గొప్పల కుప్పగా బాబు ప్రసంగం మహానాడు ముగిసిన అనంతరం చివరి రోజున చంద్రబాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. మూడు రోజులు .. 27గంటలు.. 94 మంది ప్రసంగం.. 34 తీర్మాణాలు చేశామని గర్వంగా చెప్పారు. అయితే చేసిన తీర్మానాలన్నీ రాజకీయ తీర్మాణాలే కావడం విశేషం. మూడేళ్లలో రెండు మూడు తాత్కాలిక భవనాలకే పరిమితమైన అమరావతిని భవిష్యత్ తరాలకు కానుకగా ఇస్తానని చెప్పుకొచ్చారు. 2050 వరకు కూడా ఆంధ్రాలో టీడీపీ అధికారంలోనే కొనసాగాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని నెరవేరని కోరికలు కోరారు. గతేడాది కార్యకర్తల పిల్లలకు స్కూళ్లు కట్టిస్తానని చెప్పిన హామీ నెరవేరనే లేదు. ఈసారి పేద కార్యకర్తలకు రాయితీపై స్మార్ట్ ఫోన్లు ఇస్తానని ప్రకటించారు. జనానికి కనీస అవసరాలైన నీరు, విద్య, వైద్యం అందిస్తానని చెప్పడం మాని టెక్నాలజీ కా బాప్ నేనే అన్నట్టుగా ఈ ఏడాది చివరికి 40 లక్షల మందికి ఫైబర్ నెట్ ఇస్తానని ప్రగల్భాలు పోయారు. కరువుతో తాగడానికే నీళ్లు లేక అల్లాడుతున్నాం మహాప్రభో అని జనం మొత్తుకుంటుంటే నీటికి, కరెంటుకు మీటర్లు బిగిస్తానని జనం నెత్తిన శఠగోపం పెట్టే వచనాలు చెప్పారు. మహానాడు వేదికపైనే ఒకవైపు పోలవరం.. మరోవైపు హైటెక్ సిటీ బొమ్మలను ఏర్పాటు చేయడంలోనే తెలుస్తుంది బాబుకి ఇంకా హైదరాబాద్‌పై మనసు చావలేదని. నిజానికి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే పోలవరం పూర్తి కావాల్సి ఉన్నా చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే మరుగున పడిందని సడుగుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు దాదాపు 90 శాతం వరకు పూర్తయితే కోర్టుకెళ్లి స్టేలు తీసుకొచ్చి కాలయాపన చేసింది కూడా బాబే. ఇప్పుడు అదే ఎడమ కాలువను పట్టిసీమ అని, కుడి కాలువను పురుషోత్తమ పట్నం అని పేరు పెట్టి వాటిమీద కాఫర్ డ్యామ్‌లు కట్టి ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పడం.. ఒక్కోదానికి నాలుగైదు సార్లు శంకుస్థాపనలు చేయడం బాబుకే తెలిసిన విద్య. కేంద్రం పూర్తిచేస్తానన్న పోలవరం ప్రాజెక్టును రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఇచ్చి నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేసిన ఘనతా ఆయనదే. తానే మేధావిలా ప్రజెంట్ చేసుకోవడం బాబుకు అలవాటు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి జనానికి అర్థంకాని పర్ క్యాపిటా ఇన్‌కం, జీడీపీ, జీఎస్‌డీపీల ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.. ఈవీఎంల మీద అనుమానం అక్కర్లేదు.. ఓటేస్తే స్లిప్పురావాలి వంటి సందర్భం కాని విషయాలను ప్రస్తావించి ప్రజా సమస్యలను దారి మళ్లించారు. ఇవన్నీ వినలేకనే ఏమో బాబు స్పీచ్‌లో ఉంటే.. తమ్ముళ్లు బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ గడిపేశారట. తండ్రిని మించిపోయిన లోకేష్ పనితీరును పక్కన పెడితే నారా లోకేష్ నాయుడు గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబును మించిపోయారు. రాబోయే రెండేళ్లలో విశాఖను ఐటీ హబ్‌గా మార్చేస్తానని ప్రతినబూనారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబే ఇప్పటికీ ఒక్క ఐటీ పరిశ్రమ విశాఖకు తీసుకురాలేకపోతే ఈయనొచ్చి ఎకాఎకిన ఐటీ హబ్‌గా మార్చేస్తానని చెప్పుకొచ్చారు. తాము ఏపని చేద్దామన్నా జగన్ అడ్డుపడుతున్నాడని వీరి అసమర్థతను ప్రతిపక్ష నాయకుడి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు బాబుకే తెలిసిన విద్యను లోకేష్ కూడా బాగానే వంట పట్టించుకున్నాడని అనిపిస్తుంది. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడంలో బాబు కన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడనిపిస్తుంది. అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ సాధించారు. ఇప్పటివరకు మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక తప్పు చదివి విమర్శకులకు ఆయుధంగా మారే లోకేష్ నాయుడు ఈసారి మాత్రం తేలిగ్గానే బయటపడ్డారు. రాసిచ్చిన ప్రసంగమే అయినా తప్పులు లేకుండా చదివేయడంతో తెలుగు తమ్ముళ్లందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు. వివాదాలతో మొదలెట్టి... మహానాడు ప్రారంభమే వివాదాలతో మొదలైంది. గీతం కాలేజీ అధినేత ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంపతో పోల్చి నిప్పు రాజేస్తే.. యూనివర్సిటీలో ఏర్పాట్ల కోసమని ఏయూ స్వాగత ద్వారం కూల్చివేత మరింత మంట రాజేసింది. ఒక పెద్ద కాలేజీకి యజమాని అయ్యుండి కూడా యూనివర్సిటీని ఛీత్కారంగా మాట్లాడటంపై ఏయా ఉద్యోగ, విద్యార్థి, నాన్‌టీచింగ్ స్టాఫ్ నుంచి భారీగానే నిరసన వ్యక్తం కావడంతో మూర్తిచేత మహానాడు వేదికపై చంద్రబాబు క్షమాపణలు చెప్పించాల్సి వచ్చింది. లేదంటే ఈ నిరసనలు మరింత రాజుకుని మహానాడు జరగకుండా చేస్తాయని బాబు అనుకున్నట్టున్నాడు. మొత్తానికి ఆ వివాదాన్ని అలా ముగించారు. గత 35 సంవత్సరాలుగా సాగుతున్న మహానాడు ఈసారీ అంతే ఆడంబరంగా మొదలై పేలవంగా సాగడంతో బాబు స్పీచ్‌లో ఉంటే తమ్ముళ్లు బీచ్‌లో సందడి చేశారు. ఎప్పుడైనా చంద్రబాబు ఏదైనా కార్యక్రమం చేపడితే అనుకూల మీడియా మొదటిగా రాసేది వంటకాల గురించే. ఇప్పుడూ అదే జరిగింది. వంటకాల విషయంలోనూ బాబు ఆరంభశూరుడని నిరూపించుకున్నాడు. మొదటి రోజు 40 వంటలకాలతో మెనూ తయారు చేస్తే రెండో రోజు ఆ సంఖ్య 34కి పడిపోయింది.. చివరి రోజు కేవలం 21 వంటకాలతోనే మమ అనిపించారు. తెలంగాణలో అలా.. ఆంధ్రాలో ఇలా.. మహానాడు వేదికపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో రుణమాఫీ, సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్‌ను మహానాడు వేదికగా రేవంత్ నిలదీశారు. ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికి 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ను ఆడిపోసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్‌ను కడిగిపారేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ అదే వేదికపై ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ మాత్రమైనా ఏపీలో అమలు చేస్తున్నారో లేదో ముందుగా రేవంత్ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిజానికి సంక్షే మ పథకాల అమల్లో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ముందంజలో ఉంది. అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 15 వేలు ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం రూ. 7 వేలే ఇస్తున్నారు. ఆశావర్కర్లకు అక్కడ రూ. 6 వేలు ఇస్తుంటే.. ఇక్కడ రూ. 1500 ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంటే ఆంధ్రాలో మాత్రం తొలగించేశారు. తెలంగాణలో 24 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మావల్ల కాదని చేతులెత్తేసింది. ప్రతిసారీ మహానాడులో ఒకతంతులా మారిన ఆత్మస్తుతి – పరనింద అన్న విమర్శల నుంచి ఈసారి కూడా చంద్రబాబు మహానాడు బయటకు రాలేదన్నది రూఢీ అయ్యింది. – షేక్ కాలీషావలీ (వలీ) -
సవాల్‌కు రెడీ.. ఎంక్వైరీ వేయండి
- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు - వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు సాక్షి, హైదరాబాద్: లోకేష్ వేల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ వేయాలని తాము సవాల్ చేసి 24 గంటలైనా చంద్రబాబు, ఆయన పుత్రరత్నం దాన్ని స్వీకరించకుండా పారిపోతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ మాట్లాడుతున్నారని, చర్చ కాదని ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. లోకేష్ కు దమ్ము, ధైర్యం ఉంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల రవి హత్య కేసు, ఒౌటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్లో స్కాంలు జరిగా యంటూ చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ కోరితే.... విచారణకు ఆదేశించి నిగ్గుతేల్చిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు , ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంక్వైరీ వేసే దమ్ము, ధైర్యం లేక ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు పుత్ర భయోత్పాతం.. చంద్రబాబుకు పుత్ర భయోత్పాతం పట్టుకుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేష్ మైక్ దగ్గరకు వచ్చేసరికి... పుత్రరత్నం ఏం మాట్లా డతాడోనన్న భయం బాబులో కన్పించిందన్నారు. మాట్లాడడమే సరిగా రాని వ్యక్తి జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు, మొద్దబ్బాయి, పనికిమాలిన వ్యక్తి అని గూగుల్ లో కొట్టినా చెబుతుందని చలోక్తులు విసిరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమని, అభివృద్ధికి కాదని అంబటి స్పష్టంచేశారు. విశాఖలో 6వేల ఎకరాల్లో భూ కుంభకోణం జరుగుతోంది, భూముల రికార్డులు మార్చేసి వేలకోట్లు కాజేసే పరిస్థితికి అధికారులు, పోలీసులు వస్తున్నారు.. పోలీసులే సెటిల్ మెంట్లు చేస్తున్నారని స్వయంగా మంత్రివర్గ సహచరుడు అయ్యన్నపాత్రుడే చెబుతుంటే...ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. జగన్ ఎక్కడ అభివృద్ధికి అడ్డుపడ్డట్లు సహజంగా రాష్ట్రాలు, దేశాల అభివృద్ధికి జీడీపీనే గీటురాయి అని రాంబాబు తెలిపారు. అలాంటిది ఏపీలో 12.7 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటే ఇంకా ఎక్కడ వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డట్లని ప్రశ్నించారు. జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా చూపటం కేవలం రాష్ట్రానికి రుణాలు పొందేందుకేనని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని రాంబాబు చెప్పారు. -
లోకేశ్ ..జగన్‌కు సవాల్ విసరడమా?
హైదరాబాద్ : చెప్పిన అబద్ధం చెప్పకుండా టీడీపీ మహానాడులో అబద్ధాలు చెప్పారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. మహానాడులో ప్రజా సమస్యలపై చర్చించలేదని, ఓ దశాదిశ నిర్దేశించింది ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 42 వంటకాలతో మహానాడు బ్రహ్మాండంగా జరిగిందని, తినడానికి అందరూ ఉన్నా.. వినడానికి ఎవరూ లేరని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని, నాడు వెన్నుపోటు పొడిచి నేడు మహానాడులో కీర్తించమా అని అన్నారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ పంచ ఊడదీసి చెప్పులు వేశారని అన్నారు. చంద్రబాబు క్యారెక్టర్ గురించి గతంలో ఎన్టీఆరే చెప్పారని, అల్లుడి మానసిక క్షోభతో ఆయన చనిపోయారని అంబటి వ్యాఖ్యానించారు. టీడీపీ అవినీతిపై సీబీఐ విచారణ అడిగితే పారిపోతునఆనరని, చర్చలతో సమస్యలు తేలవని, విచారణ చేయించాలని చెప్పి 24 గంటలు గడిచినా సవాల్‌ను స్వీకరించే నాథుడే లేడని అంబటి అన్నారు. దమ్ము,ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రిగా ప్రమోట్ అయిన లోకేశ్ మైక్ పట్టుకుంటే చంద్రబాబు వణికిపోతున్నారని, సూట్‌కేసులు మోయడానికి మాత్రమే లోకేశ్ రాజకీయాల్లోకి వచ్చారని అంబటి ఆరోపించారు. మహానాడులో లోకేశ్ మాట్లాడుతున్నప్పడు చంద్రబాబు మొహంలో టెన్షన్ కనిపించిందన్నారు. ఇక మాట్లాడటమే సరిగా రాని లోకేశ్... వైఎస్ జగన్‌కు సవాల్ విసరడమా అని ప్రశ్నించారు. అభివృద్ధికి వైఎస్ జగన్ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలని అన్నారు. టీడీపీ అవినీతి, అన్యాయాలు, అక్రమాలకు అడ్డుపడుతున్నది జగన్ మాత్రమే అని అన్నారు. -
లోకేశ్ ..జగన్‌కు సవాల్ విసరడమా?
-
ఆత్మస్తుతి-పరనిందగా మారిన మహానాడు
-
కళతప్పిన టీడీపీ మహానాడు
-
‘టీడీపీ మహానాడు దయ్యాల సభ’
శ్రీకాకుళం: టీడీపీ మహానాడును కేవలం చంద్రబాబు నాయుడు, లోకేశ్ భజన కోసమే ఏర్పాటు చేశారని వైఎస్ఆర్ సీపీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఆంధ్రా యూనివర్శిటీని దెయ్యాల కొంప అని టీడీపీ ఎమ్మెల్సీ అన్నట్లు... ఏయూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు ఓ దెయ్యాల సమావేశం అని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ జరిగిందిన మహానాడు కాదని, మాయనాడు అని తమ్మినేని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని విధంగా మహానాడు సాగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిలో ఏపీ బ్రహ్మాండంగా దూసుకుపోతుందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. -
హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్ :చంద్రబాబు
విశాఖ : మహానాడు సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హైదరాబాద్ తన సృష్టేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ తన బ్రెయిన్ చైల్డ్ అని, భాగ్యనగరి తన ఘనతే అని గొప్పలు చెప్పారు. మహానాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... ‘ రెండు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా ఉండాలి. మహానాడులో 34 తీర్మానాలను ఆమోదించాం. గతంలో ఎన్నుడూ లేనివిధంగా మహానాడు జరిగింది. టీడీపీకి 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉక్కు పరిశ్రమ కోసం విశాఖ వాసులు ఎంతగానో పోరాడారు. విశాఖను నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దుతాం. గోదావరి నీటిని విశాఖకు తీసుకొస్తాం. ముఠా రాజకీయాలు, హత్యా రాజకీయాలకు టీడీపీ వ్యతిరేకం. తెలుగువారు ఎక్కడున్నా అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. టీడీపీని దెబ్బ తీసేందుకే విభజన వాదాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. రాష్ట్ర విభజనతో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తున్నాం. రైతు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం ఏపీనే. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాదే పూర్తి చేస్తాం. పోలవరానికి కావాల్సిన నిధులన్నీ నాబార్డ్ ద్వారా ఇస్తామని కేంద్రం చెప్పింది. 2018 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అంతే మొత్తంలో ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించాం. రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు సేకరించాం. ఉత్తరాంధ్రకు రైల్వే జోన్ రావాలని అడిగాం, తప్పకుండా తెస్తాం. వెనుకబడిన జిల్లాలకు నిధులు రావాలి. పొత్తు పెట్టుకున్న తర్వాత ఒకరినొకరు విమర్శించుకోవడం మంచిది కాదు. బీజేపీ నేతలు విమర్శించినా టీడీపీ నేతలు విమర్శించొద్దు. రాష్ట్రంలో కాంగ్రెస్ తిరిగి కోలుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ సీపీకి దేనిపైనా స్పష్టత లేదు. అనుభవం లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతంరం శ్రమిస్తా. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీడీపీనే’ అన్నారు. -
టీడీపీ మహానాడుతో ఒరిగిందేమీ లేదు
విశాఖ : టీడీపీ మహానాడు వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందే తప్ప, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మహానాడులో మంచి తీర్మానాలు వస్తాయని ఆశించామని, అయితే అలాంటివేమీ జరగలేదని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. మహానాడు పెద్ద జాతరను తలపించిందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... రూ.5వేల కోట్ల స్థిరీకరణ నిధిపై ఈ మహానాడులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రైతు సమస్యలు, కరవు, నిరుద్యోగ సమస్యపై చర్చేలేదని, తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చర్చించి, ఏపీని విస్మరించారని బొత్స ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిర్చి రైతులు కుదేలైపోయారని అన్నారు. ప్రతిపక్షంపై నిందలు వేయడం తప్ప... ఏం ప్రయోజనం జరగలేదని బొత్స మండిపడ్డారు. ఇక నారా లోకేశ్ వ్యాఖ్యలు పిల్ల కాకి అరుపుల్లా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు లోకేశ్ పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిపై విచారణ చేయించుకున్నాక విచారణకు రావాలని, ఆ విషయం కూడా లోకేశ్‌కు తెలియకపోవడం దారుణమన్నారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణలపై వైఎస్ఆర్ సీబీఐ విచారణ వేశారని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ అవినీతిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం సిగ్గు చేటు అని అన్నారు. -
ఏకగ్రీవంగా చంద్రబాబు మళ్లీ ఎన్నిక
-
టీడీపీ మహానాడుతో ఒరిగిందేమీ లేదు
-
ఏకగ్రీవంగా చంద్రబాబు మళ్లీ ఎన్నిక
విశాఖ: టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కన్వీనర్ పెద్దిరెడ్డి ప్రకటించారు. చంద్రబాబుకు అనుకూలంగా 30సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పార్టీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానంపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. కేంద్రంలో ఏర్పడ్డ అన్ని కాంగ్రెస్సేతర ప్రభుత్వాల్లో టీడీపీ భాగస్వామి అయిందని తెలిపారు. ఈవీఎంలపై ప్రజలు సందేహాలు పెట్టుకోవాల్సిన పనిలేదన్నారు. ప్రధానమంత్రి ప్రకటించిన ఒకే సారి ఎన్నికపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. టీడీపీ ఒకే సారి ఎన్నికలను బలపరుస్తుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను త్వరగా ఆములు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల తో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఆదుకోవాలని తెలిపారు.కేంద్రంలోని బీజేపీతో విడిపోవాలని కొందరు కోరుకుంటున్నారని అయితే, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. మహానాడుకు ఇప్పటి వరకు రూ.7.51కోట్లు వరకు విరాళాల రూపంలో పోగయ్యాయని నేతలు ప్రకటించారు. -
నాపై ఆరోపణలను రుజువు చేయాలి: లోకేశ్
విశాఖ : దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తే తనను ఇబ్బంది పెట్టేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ మహానాడులో ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...విపక్షాలు తనపై చేసే ఆరోపణలను రుజువు చేయాలని అన్నారు. తనపై అవినీతి ఆరోపణలను చేస్తున్న వారికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తాను పుట్టిన నాటికే తన తాతగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, అలాగే తన కొడుకు దేవాన్ష్ పుట్టిననాటికే వాళ్ల తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. తన తాతగారు, తండ్రి అంత గొప్పపేరు తనకు వస్తుందో రాదో తెలియదని, అయితే వారికి మాత్రం చెడ్డపేరు తీసుకు రానని లోకేశ్ అన్నారు. అలాగే ఏపీని ఐటీ హబ్ చేసే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. -
తమ్ముళ్లపై చంద్రబాబు ఫైర్
విశాఖపట్నం: మహానాడు వేదికగా టీడీపీ నాయకులకు అధినేత చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమంలో ప్రసంగాలు వినకుండా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. ‘టీడీపీ సమస్య కార్యకర్తలతో కాదు, నాయకులతోనే. వేదికపైనే గ్రూప్ మీటింగులు పెడుతున్నారు. కూర్చుని ప్రసంగాలు వినడానికి ఇబ్బందేమిటి? అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాల’ని తెలుగు తమ్ముళ్లకు సూచించారు. చాలా ప్రాంతాల్లో నాయకులు వర్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారని, అలా చేసిన వారందరి జాబితా తన దగ్గర ఉందని చెప్పారు. నాయకుల మధ్య వైరం ఉంటే కార్యకర్తలు ప్రత్యమ్నాయం చూసుకుంటారని, అలాంటి పరిస్థితి తీసుకురావద్దని ఆయన హితవు పలికారు. మహానాడు మొదటి రోజు చంద్రబాబు ప్రసంగిస్తుండగా చాలా మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు విశాఖ బీచ్‌లో షికార్లు చేయడంపై మీడియాలో వార్తలు వచ్చాయి. మూడు రోజులుగా జరుగుతున్న టీడీపీ మహానాడు నేటితో ముగియనుంది. సాయంత్రం మహానాడు రాజకీయ తీర్మానం చేయనున్నారు. -
కేసీఆర్‌వన్నీ తప్పుడు సర్వేలు
► విశాఖ మహానాడులో రేవంత్, సండ్ర విశాఖ: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్.. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతున్నారని టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. టీడీపీ మహానాడులో పాల్గొనేందుకు ఏపీలోని విశాఖపట్నానికి వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీకి వచ్చిన స్పందన చూసి కేసీఆర్‌కు చెమటలు పట్టాయని రేవంత్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా సడలిపోయిందని, దాన్ని పెంపొందించేందుకే వచ్చే ఎన్నికల్లో 111 సీట్లు వస్తాయంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది హాస్యాస్పదమన్నారు. అంతర్గత విశ్లేషణ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేయించుకుంటుందని.. అయితే సర్వే ఫలితాలు కేసీఆర్‌కు షాకివ్వడంతో తప్పుడు నివేదికలు ప్రకటిస్తున్నారని సండ్ర విమర్శించారు. కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. ఆ సర్వేలు నిజమైతే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలని సవాలు చేశారు. -
‘చంద్రబాబు, లోకేశ్ భజనకే పరిమితం’
-
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
-
నందమూరి కుటుంబం దూరం
-
‘చంద్రబాబు, లోకేశ్ భజనకే పరిమితం’
విజయవాడ: చంద్రబాబు, లోకేశ్ భజనకే టీడీపీ మహానాడు పరిమితమైందని విజయవాడ నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు.. అది మయనాడు, మోసనాడు, వెన్నుపోటు నాడు అని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 10 శాతం హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బెల్టు షాపులను రద్దు చేస్తామన్నారు.. ఎక్కడైనా రద్దు చేశారా అని నిలదీశారు. రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ వాగ్దానం ఏమైందని అడిగారు. -
రాజ్‌నాథ్‌ను కలిసిన ఏయూ విద్యార్థులు
న్యూఢిల్లీ: టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని తెలిపారు. యూనివర్సిటీలో మహానాడు నిర్వహించొద్దని అన్నందుకు తమపై కక్ష కట్టారని వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తలను చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తోందని, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను టీడీపీ సర్కారు కాలరాస్తోందని రాజ్‌నాథ్‌తో చెప్పారు. ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహించాన్ని వ్యతిరేకిస్తూ పలు విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యాలయాల్లో రాజకీయ కార్యక్రమాలు వద్దంటూ ధర్నాలు, నిరసనలు చేశాయి. -
లోకేశ్ ఆస్తులు 22 రేట్లు ఎలా పెరిగాయి?
తిరుపతి: టీడీపీ మహానాడు వెన్నుపోటు మహానాడుగా మారిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహానాడు అబద్దాలకు వేదికైందని.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానక్షోభకు గురయ్యారో చర్చించివుంటే బాగుండేదన్నారు. ఎన్టీఆర్ ఆశయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, పెద్దాయనకు భారతరత్న ఇప్పించడంలో టీటీడీ కృషి చేయడం లేదని అన్నారు. ఏ ఒక్క పథకాన్ని చంద్రబాబు సరిగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. సిగ్గులేకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని దుయ్యబట్టారు. మహానాడులో చేసిన తీర్మానాలు ఏ ఒక్కటి అమలు కావడం లేదని తెలిపారు. ఓట్లు కోసమే చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, ఇప్పటివరకు రాజధానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదని విమర్శించారు. అవినీతిరహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆరోపించారు. అవినీతిలో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉందని ఎన్‌సీఈఆర్సీ సర్వే తేల్చిందని గుర్తు చేశారు. ఐదు నెలల్లో నారా లోకేశ్ ఆస్తులు 22 రేట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. చంద్రబాబు హత్యారాజకీయాలకు తెర లేపారని, హత్యలను అడ్డుకోవడంలో టీడీపీ సర్కారు విఫలమైందని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. -
లోకేశ్ ఆస్తులు 22 రెట్లు ఎలా పెరిగాయి?
-
నందమూరి కుటుంబం దూరం
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. విశాఖలో శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా పిలిచినప్పుడు ఆయన పేరు ప్రస్తావించినప్పటికీ తొలిరోజు మహానాడుకు రాలేదు. ముఖ్యమంత్రి చంద్ర బాబు వియ్యంకుడు, ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తొలిరోజు వేదికపై కనిపించలేదు. వీరే కాదు నందమూరి కుటుం బానికి చెందిన ఏ ఒక్కరూ మహానాడు ప్రాంగణంలో కన్పించక పోవడం చర్చనీయాంశమైంది. సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే బాలకృష్ణ రాలేదని తెలియడంతో మహానాడు కంటే సినిమా షూటింగ్‌లు ముఖ్యమా అని పలువురు నేతలు చర్చించుకున్నారు. హరికృష్ణను సరిగ్గా ఆహ్వానించి ఉండరని.. అందువల్లే ఆయన రాలేదని కొందరు నాయకులు వ్యాఖ్యానించడం వినిపించింది. హరికృష్ణ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం అంది ఉండదన్న వ్యాఖ్యలు వినిపించాయి. -
అప్పటి నుంచే నన్ను దూరంగా పెట్టారు
సినీ నటి కవిత కన్నీటి పర్యంతం మహానాడు వేదికపైకి తనను పిలవకపోవడంపై తీవ్ర ఆవేదన కరివేపాకులా తీసిపడేశారని ఆక్రోశం సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలుగుదేశం పార్టీలో మహిళలకు కనీస గౌరవం లేదు.. సినిమా వాళ్లంటే మరీ చిన్నచూపు.. గడిచిన మూడేళ్లుగా ఎన్నో అవమానాలకు గురిచేశారు.. చేస్తున్నారు.. చాలా క్షోభపెట్టారు. ఇలాంటి పార్టీలో ఎందుకు కొనసాగాలో మీరే చెప్పండి’’ అని టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, సినీ నటి కవిత కన్నీటి పర్యంతమయ్యారు చేశారు. మహానాడు వేదికపైకి తనను పిలవకుండా అవమానించడం పట్ల మీడియా వద్ద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘అపోజిషన్‌లో ఉన్నప్పుడు నన్ను డయాస్‌పైకి పిలిచేవారు. పార్టీ పవర్లోకి వచ్చిన రోజు నుంచే నన్ను దూరంగా పెట్టారు. డయాస్‌పై కూర్చోడానికి వీల్లేదన్నారు. 2015 మహానాడులోనే ఇలాంటి అవమానం జరిగింది. గతేడాది తిరుపతి మహానాడుకు రాలేదు. ఇప్పుడూ రాకూడదనే అనుకున్నా. ఎమ్మెల్యే అనిత రమ్మని ఆహ్వానించారు. స్టేజీపైన వాళ్లంతా కవిత కిందనే కూర్చోవాలని.. పైకి పిలవడానికి వీల్లేదని కరాఖండీగా చెప్పారు. చంద్రబాబు సీఎం కావాలని ఫ్యామిలీని, పిల్లల్ని వదిలేసి నెలల తరబడి రేయింబవళ్లు పార్టీకోసం పనిచేశా. కానీ ఈరోజు కరివేపాకు కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. ఇంటికెళ్లి నా అనుచరులు, కార్యకర్తలతో చర్చించి భవిష్యత్‌పై నిర్ణయం తీసుకుంటా’’ అని కవిత చెప్పారు. -
మాహానాడులో పార్టీ సీనియర్లకు అవమానం
-
శ్వేతపత్రం ప్రకటించాలి
రూ.1.75 లక్షల కోట్ల నిధులు ఏమయ్యాయో వెల్లడించాలి: బొత్స సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.1.75 లక్షల కోట్ల మేర నిధులు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నారని, ఆయన చెబుతున్నది వాస్తవమా? నిజమైతే దేనికి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడైనా ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఎందుకు కోరలేక పోయారని, కనీసం ఒత్తిడి కూడా ఎందుకు చేయలేక పోయారని ప్రశ్నించారు. ‘సేవ్ బీజేపీ – లీవ్ టీడీపీ’ (బీజేపీని రక్షించండి – టీడీపీని వదలి వేయండి)అని మిత్రపక్షమైన బీజేపీ కార్యకర్తలే నినదించారంటే చంద్రబాబు ప్రభుత్వానికి ఇంతకంటే అవమానం ఏముంటుందన్నారు. మహానాడులో ఆత్మస్తుతి, పరనింద విశాఖపట్టణంలో జరుగుతున్న టీడీపీ మహానాడు ఆత్మస్తుతి–పరనింద మాదిరిగా సాగుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలు–సమీక్ష అంటూ మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తున్నారన్నారు.గతంలో బీహార్‌లో నెలకొన్న పరిస్థితులే ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని, నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఒక్క డీజీపీకి తప్ప మరెవరికీ రక్షణ లేదని ఎద్దేవా చేశారు. -
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త మెలిక
-
కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు కొత్త మెలిక
విశాఖపట్నం: కాపు రిజర్వేషన్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పిల్లిమొగ్గ వేశారు. ‘కాకులకు మందుపెట్టి కట్టమీద కూర్చున్న’ చందంగా రిజర్వేషన్ అంశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. మంజునాథన్ కమిటీ రిపోర్టు రాగానే కాపులను బీసీలో చేర్చుతామని గతంలో ప్రకటించిన ఆయన తాజాగా స్వరం మార్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు.. ‘త్వరలోనే మంజునాథన్ కమిటీ రిపోర్టు వస్తుంది. దానిపై తొలుత తెలుగుదేశం పార్టీలో చర్చ చేపడతాం. అటుపై ప్రజల్లోకి వెళతాం. ప్రతిస్పందనను బట్టి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం..’ అని ప్రకటించారు. సిద్ధాంతాలు లేవన్న బాబు తనను తాను రాజకీయ ధురంధరుడిగా చెప్పుకునే చంద్రబాబు రాజకీయ సిద్ధాంతాలపై ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో ఒకప్పుడు సిద్ధాంతాలు ఉండేవి. ఇప్పుడు లేవు. కాబట్టి సమయానుకూలంగా వాస్తవ రాజకీయాలనే నెరపాలి’ అని బాబు అన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో ఏ ఒక్కరు తప్పుచేసినా క్షమించబోనని పేర్కొన్నారు. -
అవినీతిరహిత పాలన ఓ బూతు: బొత్స విమర్శ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా చంద్రబాబు మాత్రం అవినీతిరహిత పాలన అందిస్తున్నామనడం విడ్డూరమని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘అసలు అవినీతిరహిత పాలన అనేది పచ్చి బూతు’ అని టీడీపీ సర్కారును విమర్శించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పరిపాలనతో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ‘టీడీపీ మహానాడు జరుగుతోన్న విశాఖపట్నంలోనే చంద్రబాబు కుటుంబం భూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి, ధరల స్థిరీకరణ తదితర నిధులు ఎటు మళ్లుతున్నాయో తెయని పరిస్థితి. కేంద్రం ఇచ్చానని చెప్పిన రూ. 1.75కోట్లు ఎటు వెళ్లాయి? ఎక్కడికక్కడ కాకి లెక్కలు చెప్పడమేనా అవినీతిరహిత పాలన అంటే?’ అని బొత్స మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నవన్నీ ప్రభుత్వ హత్యలేనన్న బొత్స.. తగిన మూల్యం తప్పదని టీడీపీని హెచ్చరించారు. విశాఖలో జరుగుతున్న మహానాడులో ఆత్మస్తుతి, పరనింద తప్ప వాస్తవాలు మాట్లాడటంలేదని విమర్శించారు. మహానాడు ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ బొత్స సత్యనారాయణ చేశారు. -
మహానాడుకు టూరిజం బస్సులు
నంద్యాల: రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవ లేదన్నట్లు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతో విశాఖపట్నంలో ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి రెండు టూరిజం బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వర్గీయులు శుక్రవారం భూమా కార్యాలయం, రాజ్‌థియేటర్ జంక్షన్ నుండి విశాఖపట్నంకు బయల్దేరారు. నంద్యాల నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియ ఆ నియోజకవర్గంపై అమితాసక్తి కనపరుస్తున్నారు. ఈ విషయమై జిల్లా టూరిజం అధికారి బాపూజీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పరిధిలో టూరిజం శాఖకు బస్సులు లేవని.. మహానాడుకు బయల్దేరిన టూరిజం బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదన్నారు. -
టీడీపీ మహానాడుపై హైకోర్టులో పిల్
హైదరాబాద్: ఆంధ్ర యూనివర్సిటీలో టీడీపీ మహానాడు నిర్వహించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. రీసెర్చ్ స్కాలర్ ఒకరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరపనుంది. మరోవైపు ఏయూలో మహానాడు నిర్వహణపై వివాదం ముదురుతోంది. విద్యాసంస్థల్లో రాజకీయ సభలు నిర్వహించొద్దని గతంలో ఆదేశాలున్నాయి. చంద్రబాబు సర్కారు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ఏయూలో మహానాడు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహానాడు నిర్వహణపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం తెల్పుతున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. కాగా, ఏయూ దెయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి, అధ్యాపక, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర, రాజకీయవర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. -
వర్సిటీ ప్రాంగణంలో రాజకీయ సమావేశమా?
ఏయూలో టీడీపీ మహానాడు నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయం(ఏయూ)లో నిర్వహించుకునేందుకు ఉన్నత విద్యాశాఖ అధికారులు అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం అత్యవసరంగా దాఖలైన ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని శుక్రవారానికి వాయిదా వేసింది. వర్సిటీ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ప్రభుత్వ ఉత్తర్వులున్నా, అందుకు విరుద్ధంగా మహానాడుకు అనుమతి ఇచ్చారని పేర్కొంటూ ఏయూలో రీసెర్చిస్కాలర్ ఆర్.జానకీరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ శంకర నారాయణ గురువారం విచారణ జరిపారు. -
మినీ రణమేనా..?
♦ నేడు ఒంగోలులో టీడీపీ మినీ మహానాడు ♦ వేమవరం హత్యలతో రగిలిపోతున్న కరణం బలరాం వర్గం ♦ గొట్టిపాటి వర్గంతో ఢీ అంటే ఢీ ♦ బలప్రదర్శనకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు ♦ మహానాడుకు తరలిరావాలని కార్యకర్తలకు పిలుపు ♦ మరోసారి పగలు రగిలే అవకాశం ♦ మంత్రులు, జిల్లా అధ్యక్షుడికి సాధ్యం కాని సర్దుబాటు ♦ నేటి సభకు భారీ బందోబస్తు ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ ఎన్.సంజయ్ జిల్లా కేంద్రంలో గురువారం జరిగే టీడీపీ మినీ మహానాడు సభ రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది. కరణం, గొట్టిపాటి వర్గాలు ఈ సమావేశానికి హాజరైతే మరోమారు గొడవలు తప్పవని ఆ పార్టీ వర్గాలే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ హాలులో గురువారం జరిగే సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలోని తన అనుచరులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. కరణం వర్గీయులు సైతం సమావేశానికి భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇరువర్గాలు సభకు హాజరైతే గొడవలు ఖాయం. వాటిని ఆపే శక్తి పార్టీ జిల్లా అధ్యక్షుడు, లేదా పార్టీ పరిశీలకులు, మంత్రులకు లేదు. ఇక పోలీసులు ఆది నుంచి చేష్టలుడిగి చూస్తుండటం తప్ప స్పందిస్తున్న దాఖలాల్లేవు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వేమవరం జంట హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌పై ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యలకు కారణం గొట్టిపాటేనని బలరాం వర్గం ఆరోపణ. మంగళవారం ఒంగోలులో జరిగిన పార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక సమావేశంలో కరణం, గొట్టిపాటి వర్గాలు బాహాబాహీకి సిద్ధపడిన విషయం తెలిసిందే. గన్మేన్లతో వచ్చిన గొడవ ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు పరస్పర దాడులకు దిగే వరకు వచ్చింది. ఏకంగా కరణం, గొట్టిపాటిలు కలియబడ్డారు. పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఘర్షణలో గొట్టిపాటి చొక్కా చినిగి కిందపడిపోయాడు. గొట్టిపాటి గన్‌మేన్ తోయడంతోనే గొడవ మొదలైందని కరణం బలరాం పేర్కొన్నారు. మొత్తంగా మంగళవారం జరిగిన సమావేశం ఇరువర్గాల ఘర్షణతో రసాభాసగా మారింది. గొట్టిపాటి కనపడగానే ఆగ్రహంతో ఉన్న కరణం వర్గం దాడులకు తెగపడుతోంది. గొట్టిపాటి వర్గం సైతం ప్రతిదాడులకు సిద్ధమంటూ సవాల్ విసురుతోంది. ఆధిపత్య పోరుకు వేదిక.. గురువారం జరిగే మినీ మహానాడు మరోమారు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం గొడవ నేపథ్యంలో కరణం వర్గంతో పాటు గొట్టిపాటి వర్గీయులు సైతం పెద్ద ఎత్తున మినీ మహానాడుకు హాజరయ్యేందుకు సిద్ధమవుతోంది. చిన్నపాటి గొడవ జరిగినా అమీతుమీ తేల్చుకోవాలని కరణం వర్గం సైతం సన్నద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆది నుంచి ఇరువర్గాల గొడవలను ఏ మాత్రం పట్టించుకోక జిల్లా పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తోంది. మంగళవారం నాటి ఘర్షణలోనూ ఇదే జరిగింది. గురువారం నాడు పరిస్థితి ఇలాగే ఉంటే మినీ మహానాడు ఇటు కరణం, అటు గొట్టిపాటి వర్గాలు అధిపత్య పోరుకు వేదికగా మారుతుందనడంలో సందేహం లేదు. ఘర్షణ ఏ స్థాయికి దారి తీసిన ఆశ్చర్యపడనక్కర్లేదు. గొడవలు పెంచింది.. చంద్రబాబే కరణం వ్యతిరేకించినా.. గొట్టిపాటిని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు ఇరువర్గాల గొడవల విషయం పట్టించుకోవడం లేదు. దీంతో కరణం, గొట్టిపాటి వర్గాల అధిపత్యపోరు పతాకస్థాయికి చేరింది. అధికారుల బదిలీలు మొదలుకొని పింఛన్లు, బ్యాంక్ రుణాలు, అభివృద్ధి పనుల విషయంలో ఇరువురు పోటీ పడుతూ వచ్చారు. పంతం నెగ్గించుకునేందుకు అధికారులపై ఒత్తిడులు పెంచారు. వీరి గొడవలతో అద్దంకి నియోజకవర్గంలో జన్మభూమి–మా ఊరు కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. జనచైతన్యయాత్రల ఊసే లేదు. పార్టీ సభ్యత్వ కార్యక్రమం మూలనపడింది. ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు జోక్యం చేసుకోలేదు. ఇద్దరిని ఒకే గూటికి చేర్చి తాంబూలాలిచ్చాం.. తన్నుకుచావండి.. అన్న రీతిలో వ్యవహరించారు. ఇరువురు నేతలను కూర్చోబెట్టి మాట్లాడింది లేదు. సర్దుబాటు చేసే ప్రయత్నం చేయలేదు. ఇదే విషయాన్ని ఇటీవల కరణం బలరాం సైతం పేర్కొనడం గమనార్హం. దీంతో అద్దంకి నియోజకవర్గంలో ఇరువురు నేతల గొడవలు మరింత పెరిగాయి. పదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ హత్యారాజకీయాలు మొదలయ్యాయి. బాబు వైఖరి వేమవరం జంట హత్యలకు కారణమైందన్న విమర్శలున్నాయి. సీఎం ఆదేశాలు అమలయ్యేనా..? మంగళవారం ఒంగోలులో కరణం, గొట్టిపాటి వర్గాలు గొడవకు దిగడం, బుధవారం జరగాల్సిన మినీ మహానాడు వాయిదా పడిన నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు రొటీన్‌గా పత్రికల్లో వార్తలొచ్చాయి. గొట్టిపాటి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినా.. ఆయన నిరాకరించినట్లు సమాచారం. గొడవల నేపథ్యంలో ఇరువర్గాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోవడం లేదు. అయితే బుధవారం ఉదయం పార్టీ అంతర్గత గొడవలపై ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నుండి పార్టీ సమావేశాల్లో ఏ ఒక్క నేత గొడవకు దిగినా.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. అక్కడికక్కడే సస్పెండ్ చేయాలని కమిటీ నేతలను సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఇది ఎంత వరకు అమలు జరుగుతుందో వేచి చూడాలి. మినీ మహానాడుకు భారీ బందోబస్తు ఒంగోలు క్రైం : ఒంగోలులో గురువారం నిర్వహించనున్న టీడీపీ మినీ మహానాడుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. టీడీపీ మినీ మహానాడును పురస్కరించుకొని గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రస్తుతం జిల్లా టీడీపీలో చోటు చేసుకున్న సంఘటనలను దృష్ట్యా ఐజీ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం.త్రివిక్రమ వర్మ, ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో జరిగిన జంట హత్యలు, తదనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ల మధ్య, వారి అనుచరుల మధ్య ఏ–1 కన్వెన్షన్ హాలు చోటు చేసుకున్న ఘర్షణలు, తోపులాటలు, దూషణలను పురస్కరించుకొని పూర్తి స్థాయి పోలీస్ నిఘాలో మినీ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం జిల్లాలోని అందరు డీఎస్పీలను ఇక్కడే మోహరింపచేయనున్నారు. ఎస్పీతోపాటు దాదాపు పది మందికి పైగా డీఎస్పీలు 25 మందికి పైగా సీఐలు వందల సంఖ్యలో ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులను మోహరింజేస్తున్నారు. నిఘా విభాగాల ముందస్తు సమాచారం మేరకు మినీ మహానాడు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మూడు, నాలుగు వేల మంది హాజరయ్యే సభకు కేవలం వెయ్యి మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఇందుకోసం పార్టీ ముఖ్యులకు పోలీస్ అధికారులు పాస్‌లు కూడా జారీచేసినట్టు సమాచారం. పాత గుంటూరు రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఏర్పాట్లపై జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌తో పోలీసులు సమీక్షించారు. -
విశాఖ వాసులకు ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారనుంది విశాఖ వాసుల పరిస్థితి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం మహానాడు నగరాన్ని ట్రాఫిక్ దిగ్బంధంలోకి నెట్టనుంది. నగరానికి నడిబొడ్డున ఉన్న ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహానాడును నిర్వహించడాన్ని విద్యార్థి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మహానాడు వేదిక జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)కు చేరువలో ఉంది. హైవేలో ఉన్న మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఏయూ, ఓల్డ్ సీబీఐ, పెదవాల్తేరు, చినవాల్తేరు, లాసన్స్‌బే కాలనీ, వుడా పార్క్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే మహానాడు జరిగే మైదానం పక్కన ఉన్న డబుల్ రోడ్ మీదుగానే వెళ్లాలి. నిత్యం ఆ రోడ్డులో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇలాంటి స్థితిలో మహానాడు జరిగే మూడు రోజులే కాకుండా రెండు రోజుల ముందుగానే ఆ రోడ్డును బ్లాక్ చేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే రద్దీతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పడరానిపాట్లు పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన చెందుతున్నారు. -
ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగల అరెస్టు
తిరుపతి క్రైం: బద్వేల్ ఎమ్మెల్యే జేబు కట్ చేసిన దొంగలను మంగళవారం క్రైం పోలీసులు అరెస్టు చేసినట్టు క్రైం ఏఏస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మే 27 నుంచి 29వతేదీ వరకు నిర్వహించిన మహానాడులో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, గుంటూరుకు చెందిన పూనం శ్రీనివాసరెడ్డి పర్సులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అందులో రూ.95 వేలు ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కొండారెడ్డి, సీసీఎస్ స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రకాశం జిల్లా విజిలిపేట చీరాలకు చెందిన గరికప్రసాద్ (38), గుంటూరు జిల్లా తాడేపల్లి కొత్తూరుకు చెందిన సముద్రాల కృష్ణారావును కరకంబాడి రోడ్డులోని లెప్రసీ ఆస్పత్రి వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో అరెస్టు చేశారు. విచారణలో వారు మహానాడులో కార్యకర్తల్లా తిరుగుతూ పిట్పాకెట్ చేసినట్టు అంగీకరించినట్టు ఏఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.95 వేల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు పాతనేరస్తులని పేర్కొన్నారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలు ప్రభాకర్‌రెడ్డి, ఆశీర్వాదం, రామ్మూర్తి, సిబ్బంది సుధాకర్, మునిరాజ, కత్తుల గోపికృష్ణ, బారుషా, మురళికి ఏఎస్పీ రివార్డులు అందజేశారు. -
జగన్ వ్యక్తిత్వమే మా ఆస్తి
- వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన - వైఎస్ జగన్‌ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు కుట్ర సాక్షి, హైదరాబాద్: మహానాడులో టీడీపీ నేతలుజగన్ వ్యక్తిత్వంపై దాడి చేస్తూ మాట్లాడారని, అయితే ఆ వ్యక్తిత్వమే తమకు ఆస్తి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబులా గా అధికారం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే అమీబాలాంటి వ్యక్తి తమ జగన్ కాదని చెప్పారు. ‘మా జగన్‌లో నిబద్ధత ఉంది. పోరాటపటిమ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నాయి. ఎవరికీ తలవంచని నైజం మా నాయకుడిది. చంద్రబాబులాగా అమీబా కాదు మా నేత. ఒళ్లంతా వెన్నెముక, ధైర్యం, దేహమంతా గుండె కలిగినవాడు మా జగన్ అని’ భూమన అన్నారు. చంద్రబాబును తాను విద్యార్థి దశ నుంచీ ఎరుగుదునని.. ఆయనకున్నంత కులగ జ్జి, డబ్బు మీద వ్యామోహం మరొకరికి లేవని అన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో టేపులతో అడ్డంగా దొరికిపోయి, తనపై చార్జిషీటు దాఖలు చేసినా.. కేసీఆర్, మోదీ కాళ్లు పట్టుకొని జైలుకు పోకుండా తప్పించుకున్న సమర్థత చంద్రబాబుదని ఆయన మండిపడ్డారు. ఆటవిక జాతరలా సాగిన మహానాడు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహానాడులో మాట్లాడిన తీరు చూస్తుంటే తమ నాయకుడు ైవె ఎస్ జగన్మోహన్రెడ్డిని భౌతికంగా నిర్మూలించే కుట్ర జరుగుతోంద నే అనుమానం ప్రజలకు కలుగుతోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఒక రాజకీయ పార్టీ మహాసభలాగా కాకుండా ఆదిమానవులు ఆటవిక జాతరలాగా సాగిన ఈ మహానాడులో వైఎస్సార్సీపీ తొందరలోనే ఖాళీ అయిపోతుందని చంద్రబాబు చెప్పడాన్ని బట్టి ఈ అనుమానం బలపడుతోందని చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హెలికాప్టర్ ప్రమాదంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించడానికి ఒక్క రోజు ముందు కూడా ఎవరు ఫినిష్ అవుతారో త్వరలో తెలుస్తుందని చంద్రబాబు అన్న మాటలు తమకింకా గింగురుమంటున్నాయని ఆయన తెలిపారు. చంద్రబాబు అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నందునే జగన్‌పై మహానాడులో సీఎం విమర్శలు చేయించారని భూమన అన్నారు. దీన్ని బట్టి ప్రతిపక్ష నేతగా నూటికి నూరు శాతం జగన్మోహన్రెడ్డి విజయవంతం అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. లోకేశ్‌ను సూట్‌కేసు బాబు అంటున్నారు చంద్రబాబు తనయుడు లోకేశ్‌బాబు అవినీతి కార్యకలాపాలను చూసి ఆయన్ను సూట్‌కేస్ బాబుగా ప్రజలు పిలుచుకుంటున్నారని భూమన ఎద్దేవా చేశారు. కలియుగదైవానికి వైభవం తెచ్చింది నువ్వా కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి వైభవాన్ని తెచ్చింది తామేనని టీడీపీ పీఠాధిపతి, పరమపూజ్య, పరమహంస, పరివ్రాజక శ్రీశ్రీశ్రీ నారా చంద్రబాబా స్వామి వారు చెప్పుకోవడం ఆయన స్వోత్కర్ష శృతి మించినదనడానికి నిదర్శనమని భూమన ఎద్దేవా చేశారు.ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే నని అన్నారు. -
'చంద్రబాబు మాటల వెనుక ఏదో కుట్ర'
హైదరాబాద్: మూడు రోజుల పాటు జరిగిన టీడీపీ మహానాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామస్మరణతో మారుమోగిందని వైఎస్సార్ సీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నయవంచన, అవినీతి బయటపడుతుందనే జగన్ పై విమర్శలు చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భూమన విలేకరులతో మాట్లాడారు. వేంకటేశ్వరస్వామికి వైభవం తెచ్చింది తానే అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడారని, ఆయన మాటలతో అన్నమయ్య మరగుజ్జుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధార్మికతపై చంద్రబాబు చావు దెబ్బ కొట్టారన్నారు. భగవంతుడి పట్ల దారుణమైన అపచారం తెచ్చేలా వ్యాఖ్యలు చేశారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసి ఆయన చావుకు కారణమైన చంద్రబాబు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం పెడతామనడం విడ్డూరంగా ఉందన్నారు. అవినీతిని నిరూపిస్తే జైలుకు వెళ్తానని చెబుతున్న లోకేశ్ కు తన తండ్రి ఓటుకు కోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన విషయం తెలియదా అని ప్రశ్నించారు. లోకేశ్ బాబును సూట్ కేసు బాబుగా రాష్ట్రం పిలుచుకుంటోందని చెప్పారు. చంద్రబాబు కార్యాలయం, ఇంట్లో సీసీ కెమెరాలు పెడితే ఆయన బాగోతాలు ప్రజలందరికీ తెలుస్తాయన్నారు. మహానాడులో మూడు రోజుల పాటు పచ్చి బూతులు మాట్లాడారని అన్నారు. వంగవీటి రంగా హత్యకు కారకుడైన చంద్రబాబు హత్యారాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబే హంతకుడని రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కుల రాజకీయాలు, కులపిచ్చితో చంద్రబాబు పైకి వచ్చారన్నారు. తనకున్న కులపిచ్చిని ఎస్వీయూ అంతకీ వ్యాపింపచేశారని దుయ్యబట్టారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పే దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరన్నారు. అవసరమైతే ఎవరి కాళైన పట్టుకునే అమీబా జాతి వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. త్వరలో వైఎస్సార్ సీపీ ఖాళీ అవుతుందన్న ఆయన మాటల వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ను భౌతికంగా నిర్మూలించడానికి చంద్రబాబు కుట్ర పన్నినట్టు అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్సార్ చనిపోవడానికి ఒకరోజు ముందు చంద్రబాబు అన్నమాటలు మనకు ఇంకా గుర్తు ఉన్నాయని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల కోసం ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లు ఇస్తారట అని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. -
'విజయసాయిరెడ్డి విజయం ఖాయం'
నెల్లూరు: రాజ్యసభ ఎన్నికకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా...తమ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి విజయం ఖాయమని వైస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరాచకపాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ మహానాడులో ప్రతిపక్ష వైస్సార్సీపీని విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారో చెప్పలేదన్నారు. బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెబుతారని మేకపాటి చెప్పారు. -
మహానాడు నుంచి తిరిగొస్తూ...
గుంటూరు: తిరుపతి టీడీపీ మహానాడు ముగించుకుని విజయవాడకు వస్తుండగా ఓ టీడీపీ నాయకుడు కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయవాడ 44వ డివిజన్ కార్పొరేటర్ కాకు మల్లికార్జునరావు, అతని కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం విజయవాడలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా దెబ్బతింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. -
బాబుది వెన్నుపోటు.. అబద్దాల మూట!
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పోరాట స్పూర్తిని టీడీపీ మహానాడు పాతరేసిందంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో మూడు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడుపైనా, చేసిన తీర్మానాలపైన ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘీవీరారెడ్డి, మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు శైలజనాధ్ తదితరులు ఆదివారం ఇందిరాభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఇంటిపేరు వెన్నుపోటుగా.. మాట అబద్దాల మూటగా.. చంద్రబాబు జమానా అవినీతి ఖజానాగా మారిందని టీడీపీ మహానాడు మరోసారి రుజువు చేసిందన్నారు. టీడీపీ మహానాడు ఆత్మస్తుత్తి-పరనిందలకు వేదిక అయ్యిందంటూ దుయ్యబట్టారు. టీడీపీ మహానాడు సందర్భంగా మందు, మద్యాలను వినియోగించి పవిత్ర స్థలమైన తిరుపతి ప్రాంతాన్ని అపవిత్రంగా మార్చడాన్ని ఏపీసీసీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం టీడీపీ తొలిసారి చేపట్టిన మహానాడులో రాష్ట్రప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దిశానిర్థేశం కరువైందంటూ మండిపడ్డారు. టీడీపీ చేసిన తీర్మానాలన్నీ తూతూ మంత్రంగా ప్రజలను మభ్యపెట్టే విధంగానే ఉన్నాయన్నారు. టీడీపీ తీర్మానాలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈ కింది విధంగా పేర్కొంది. ప్రత్యేక తరగతి హోదాపై తీర్మానం రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై టీడీపీ తీర్మానం రెండుసార్లు చేసింది. అయినా ప్రధాని నరేంద్ర మోదీ హోదాను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. మోదీ చేసినా మోసాన్ని, అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల తరపున ఖండించలేని స్థితిలో మహానాడు ఉండటం ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచింది. ఏపీకి ప్రత్యేక హోదాను పోరాడి అమలు చేయించే బాధ్యత తనేదనని చంద్రబాబు చెప్పలేకపోవడం, మోడీకి చంద్రబాబు మోకరిల్లిన వాస్తవం మరోసారి మహానాడు వేదిక తీర్మానం రుజువుచేసింది. జాతీయ స్థాయిలో టీడీపీ క్రియాశీలం తీర్మానం జాతీయ స్థాయిలో ఇకపై టీడీపీ క్రియాశీలంగా ఉంటుందని తీర్మానించడంపై చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామినా, జాతీయ స్థాయిలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోనేందుకు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా? అనే అనుమానం టీడీపీ తీర్మానం కలుగజేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు వద్దంటూ తీర్మానం తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టుల వలన ఏపీకి ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుంటే.. ఓటుకు నోటు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యాడని ఈ తీర్మానం తెలియజేస్తోంది. అవినీతి- పారదర్శక పాలనపై తీర్మానం గత రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరింది. టీడీపీ టోటల్ దోపిడీ పార్టీగా మారింది. టీడీపీ ఎన్నికల్లో హామీల కంటే ఎక్కువే చేశామని తీర్మానం ఏ ఒక్క హామీని అమలు చేయకుండానే అన్నీ అమలు చేసామని మహానాడులో తీర్మానం చేయడం ఆ మహానాడు పచ్చి అబద్దాల నాడుగా చరిత్రలో మిగులుతుంది. సామాజిక న్యాయం, తెలంగాణ రైతాంగంపై తీర్మానాలు తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరగలేదని, కరువు సాయం అందించలేదని, తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించడం లేదని తీర్మానం చేయడం నిజంగా సిగ్గుచేటు. ఎన్టీఆర్ జపం, తీర్మానం తన నిరంతర వెన్నుపోటులను కప్పిపుచ్చుకునేందుకే.. అధికారం కోసం అక్రమ మార్గాలను ప్రవేశపెట్టిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుతం బాలకృష్ణను వియ్యంకున్ని చేసుకుని హరికృష్ణ కుటుంబానికి వెన్నుపోటుకి పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీ చరిత్రని, తెలుగు జాతి చరిత్రగా చెప్పడం చంద్రబాబు అజ్ఞానికి నిదర్శనమన్నారు. -
చంద్రబాబుకు చెప్పు చూపించిన మహిళ
తిరుపతి: టీడీపీ మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో ఆదివారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ మహిళ చెప్పు చూపించింది. ఈ హఠాత్పరిణామంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు బిత్తరపోయారు. చంద్రబాబు అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. -
పోటీ పడి మరీ నేతలు కునుకేశారు...
తిరుపతి : టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడులో నేతలు దర్జాగా కునుకేశారు. ఆవులింత అంటువ్యాధి అన్నట్లుగా తిరుపతి మహానాడులో నేతలు కూడా ఒకరి తర్వాత ఒకరు నిద్రలో జోగుతూ కెమెరాకు చిక్కారు. నిద్రాదేవి కరుణించడంతో వేదికపైనే నిద్రమత్తులోకి జారుకున్నారు. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు..... రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ సహ మరో నేత ముందున్నారు. ఓవైపు నేతలు ప్రసంగిస్తుండగానే మరోవైపు వీరు మాత్రం హాయిగా నిద్రపోయారు. ఇక ఇదే సీన్ శుక్రవారం నాటి మహానాడులో జరిగింది. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప కూడా కునుకేశారు. వీరి వెనకే కూర్చున్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో మీడియా ప్రతినిధులు పోటీపడి మరీ చిత్రీకరించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
మహానాడులో ఫిరాయింపు నేతలకు అవమానం
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన నేతలకు టీడీపీ మహానాడులో కూడా అవమానం తప్పలేదు. శనివారం తిరుపతి మహానాడుకు హాజరైందుకు వచ్చిన విశాఖ జిల్లా ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారు పట్టించుకోలేదు. పోలీసుల తీరుపై బాబ్జీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందటే వారు టీడీపీలో చేరారు. జిల్లాల్లో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడుల్లో ఫిరాయింపు నేతలకు ఘోర అవమానం జరిగిన విషయం తెలిసిందే. -
ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది.. హరికృష్ణ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. నందమూరి వంశ వీరాభిమానులు, తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆనాడు ఇస్తామని మోసం చేశారు, తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, అందరం కలిసి పోరాడి హోదా తెస్తేనే మనం సిసలైన తెలుగు బిడ్డలం అవుతామని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున బయటకు వచ్చి సమరం చేయాలన్నారు. తెలుగువాడన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి పూనుకోవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పించడమే గొప్ప కార్యక్రమమని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగు జాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని.. తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానుభావుడని కొనియడారు. తిరుపతిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి హరికృష్ణ గైర్హాజరైన విషయం తెలిసిందే. -
ఆత్మస్తుతి.. పరనింద
- మహానాడులో చంద్రబాబు ప్రసంగం తీరు - పదేళ్ల ప్రత్యేక హోదా హామీ ఊసే లేదు - చేయని పనులన్నీ చేసేసినట్లు తనకు తానే సర్టిఫికెట్ - రెండేళ్ల పాలనలోని వైఫల్యాలను దాచుకునేందుకు విపక్ష నేత జగన్‌పై విమర్శలు - బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యమని వెల్లడి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ మహానాడు ఆద్యంతం ఆత్మస్తుతి, పరనిందలకే పరిమితమైంది. రెండు గంటలకు పైగా సాగిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రారంభోపన్యాసంలో అబద్ధాలు గుప్పించారు. ఐదేళ్లు కాదు పదేళ్ల ప్రత్యేక హోదా సాధిస్తామంటూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చకపోయినా, చేయని పనులన్నీ చేసేసినట్లు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. పోలవరం పురోగతి గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదు. రెండు గంటల ఉపన్యాసం ఆసాంతం స్వోత్కర్షలతో నిండిపోయింది. తన రెండేళ్ల పాలనలోని వైఫల్యాలను దాచుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేశారు. చంద్రబాబు టాకింగ్ పాయింట్స్ కింద సుమారు 50 పేజీల ఉపన్యాసం ఆద్యంతం అబద్ధాలతోనే నిండిపోయింది. రవ్వంత చేసిన దానికి కొండంత చెప్పుకున్నారు. ఉదాహరణకు... రైతులకు షరతుల్లేకుండా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చేనాటికి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలున్నాయి. దీనిపై 14 శాతం వడ్డీ చొప్పున ఈ ఆర్థిక సంవత్సరం వడ్డీ రూ. 36 వేల కోట్లు కలిపి రూ.1,23,612 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ కేవలం రూ.8,444 కోట్లు మాత్రమే ఇచ్చిన చంద్రబాబు.. మొత్తం రుణ మాఫీ చేసేసినట్లు గొప్పలు చెప్పుకున్నారు. తాను రేయనకా పగలనగా దేశ విదేశాలు తిరిగి, పెట్టుబడులను ఆహ్వానించి, ఉద్యోగావకాశాలను పెంచుతున్నానని ఘనంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి... ఇంటికో ఉద్యోగం ఇస్తానని, లేదంటే రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయని విషయం గుర్తుచేసుకోలేదు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాల్సిన మహానాడులో ఆ దిశగా ఉపన్యసించకుండా.. అధినేత సొంత డబ్బా కొట్టుకోవడం, ఎలాంటి జంకూ లేకుండా పచ్చి అబద్ధాలు చెప్పడంపై తెలుగుతమ్ముళ్లే ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. తిరుపతి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ప్రారంభమైన మహానాడులో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకలాంటి వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం రూ.8600 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను అభివృద్ధి పరచడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 20 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అర్హతగల పేదలకు ఈ ఏడాది వంటగ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లన్నీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని, అమరావతిలో 125 అడుగుల ఎత్తున్న బీఆర్ అంబేడ్కర్ విగ్ర హం ఏర్పాటు చేస్తామని, ఎర్రచందనం ఆదాయంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు. జూన్ 15 నుంచి రాష్ట్రంలో పల్స్ సర్వే నిర్వహించిన అనంతరం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించే ఆలోచన ఉందన్నారు. ప్రజాహితం దృష్ట్యా అధికారం చాలా ముఖ్యమని, ఇకపై ఎన్నడూ టీడీపీ ఓడిపోకూడదని చెప్పారు. తుని విధ్వంసం ఘటనలో వైఎస్ జగన్ పాత్ర ఉందంటూ.. అంతగా విధ్వంసం చేసే తత్వం ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు లేదన్నారు. రాష్ట్రంలో హింస సృష్టించేది వైఎస్ కుటుంబమేనని, ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే అలా చేస్తారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం.. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు మహానాడు ప్రాంగణంలోకి ప్రవేశించిన సీఎం చంద్రబాబునాయుడు తొలుత ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన త్రీడీ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని సందర్శించి.. మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులతో కలిసి మహానాడు వేదికపైకి చేరుకుని పార్టీ జెండాను ఎగుర వేశారు. నివేదిక పొగడ్తలమయం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య.. చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూ వార్షిక నివేదికను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరనాథ్ నివేదికను సమర్పిస్తూ.. టీడీపీ జెండాలను పీకేస్తామని పదేపదే బెదిరిస్తోన్న టీఆర్ఎస్కు తమ పార్టీ బలమేంటో త్వరలోనే తెలుస్తుందన్నారు. తొలి రోజు ఆరు తీర్మానాలు మహానాడు తొలి రోజు శుక్రవారం ఆరు తీర్మానాలను ఆమోదించింది. వీటిపై పార్టీ నాయకులు చర్చించి వాటిని ఆమోదించారు. వీటికి సీఎం చంద్రబాబు తగిన సూచనలిచ్చారు. -
ముఖం చాటేసిన తమ్ముళ్లు!
అధికార తెలుగుదేశం పార్టీ తిరుపతిలో అట్టహాసంగా మహానాడును ప్రారంభించింది. ఈ కార్యక్రమం అంటే ఎంతో ఉత్సాహంగా హాజరయ్యే తెలుగు తమ్ముళ్లు జిల్లా నుంచి నామమాత్రంగానే తరలివెళ్లారు. దీనికి ప్రధాన కారణం గ్రూపు తగాదాలేననేది బహిరంగ రహస్యం. పాస్‌లు వచ్చినవారంతా వెళ్లారని జిల్లా నాయకులు చెబుతున్నా ద్వితీయ శ్రేణిలో చాలామంది డుమ్మాకొట్టినట్లు సమాచారం. టీడీపీ మహానాడుకు డుమ్మా! * ఇచ్ఛాపురంలో ఏఎంసీ చిచ్చు * మిగతాచోట్ల గ్రూపుల గొడవ * జిల్లా నుంచి నామమాత్ర హాజరు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తొలినుంచి టీడీపీకి కంచుకోట అని పేరొందిన ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కార్యకర్తలు మహానాడు కార్యక్రమానికి వెళ్లేవారు. ఇచ్ఛాపురం పట్టణం నుంచి కూడా 50 మందికి తక్కువ కాకుండా హాజరయ్యేవారు. ఈసారి మాత్రం స్థానికంగా పదవుల కేటాయింపులతో తలెత్తిన వివాదాలు, గ్రూపు రాజకీయాలతో తమ్ముళ్లు చాలామంది అలకపాన్పు ఎక్కారు. ఇచ్ఛాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవిని పట్టణానికి చెందిన నేతలకు కాకుండా రూరల్ ప్రాంతానికి చెందిన సాడి సహదేవ్రెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యక్రమాలకు పట్టణ క్యాడర్ కొన్నాళ్లుగా దూరం పాటిస్తోంది. దాదాపుగా ముఖ్య నాయకులు చాలామంది మహానాడు కార్యక్రమానికి సైతం హాజరుకాలేదని తెలిసింది. వారిలో ఇచ్ఛాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె.ధర్మారావు, మరో ముఖ్యనేత జగన్నాథరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు అంబటి లింగరాజు, జిల్లా పార్టీ నాయకుడు చాట్ల తులసీదాస్‌రెడ్డి ఉన్నారు. ఈ విషయమై స్థానిక టీడీపీ కార్యకర్తలు ఆరా తీస్తే... శనివారం నాటి కార్యక్రమానికి హాజరవుతున్నారని కొంతమంది సర్దిచెబుతున్నట్లు సమాచారం. అలాగే నరసన్నపేట నియోజకవర్గం నుంచి గతంలో క్రమం తప్పక మహానాడుకు హాజరైన కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఈసారి వెళ్లలేదు. నరసన్నపేట మండలాధ్యక్షురాలు పార్వతమ్మ, సర్పంచ్ జి.చిట్టిబాబు కూడా ఉండటం చర్చనీయాంశమైంది. పలాస నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించిన మద్దిల చిన్నయ్య కూడా ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. గ్రూపులుగా విడిపోయి టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, ఇతర ఎమ్మెల్యేల మధ్యనున్న గ్రూపు తగాదాలు మహానాడు కార్యక్రమంలోనూ కనిపించాయి. నియోజకవర్గంలో అంతా ఒక్కరిగా గాకుండా గ్రూపులుగా విడిపోయి తిరుపతి ప్రయాణమయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అచ్చెన్న గ్రూపు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు వేర్వేరుగానే వెళ్లారు. అయితే ఈ రెండు గ్రూపుల్లోనూ ఉన్న కళింగ కోమటి సామాజికవర్గం నేతలు మాత్రం ఒకే బృందంగా వెళ్లడం మారుతున్న రాజకీయ పరిణామాలకు అద్దం పట్టింది. గుండ లక్ష్మీదేవి భర్త, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రెండ్రోజుల క్రితం పార్టీ సమావేశానికి హాజరుకావడం, రాబోయే శ్రీకాకుళం నగరపాలకసంస్థ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో కళింగ కోమటి సామాజిక వర్గం నాయకులు ఏకతాటిపైకి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రాజాం నియోజకవర్గంలో కూడా కళావెంకటరావు గ్రూపు, ఎమ్మెల్సీ ప్రతిభాభారతి గ్రూపులను మహానాడు ఏకం చేయలేకపోయింది. పాతపట్నంలోనూ మూడు గ్రూపులదీ అదే పరిస్థితి. ఎంపీ రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడుల గ్రూపు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గ్రూపులకు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపు తోడయ్యింది. ఎంపీ, మంత్రిల గ్రూపు, ఎమ్మెల్యే కలమట గ్రూపు ఒకే మాటపై ఉండటంతో అసహనంతో ఉన్న శత్రుచర్ల గ్రూపు ఈసారి మహానాడుకు వెళ్లరనే ప్రచారం జరిగింది. అయితే ఆఖరి నిమిషంలో కొంతమంది బయల్దేరి వెళ్లారని తెలిసింది. -
తిరుమలకు క్యూ కట్టిన మంత్రులు
తిరుపతి టీడీపీ మహానాడు నేపథ్యంలో ఏపీ మంత్రులు తిరుమలకు క్యూ కట్టారు. అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు శ్రీవారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితోపాటు మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, కె. మృణాళిని శుక్రవారం ఉదయంవీఐపీ విరామ సమయంలో స్వామి దర్శనం చేసుకున్నారు. అలాగే, ఎంపీలు ఎం.శ్రీనివాస్, రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, జ్యోతుల నెహ్రూ, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డోల వీరాంజనేయస్వామి తదితరులు కూడా స్వామి దర్శనం చేసుకున్నారు. -
మహానాడులో నేనూ ఓ కార్యకర్తనే: చంద్రబాబు
తిరుపతి : టీడీపీ మహానాడులో తాను కూడా ఓ సాధారణ కార్యకర్తనే అని ఆపార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు తెలుగు జాతికి పండుగ రోజు అని ఆయన పేర్కొన్నారు. తెలుగు జాతి గుండెల్లో ఉన్న ఏకైక నేత ఎన్టీఆరే అని అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రసంగిస్తూ... 'పార్టీలో నేనే మొట్టమొదటి క్రమశిక్షణ గల కార్యకర్తను. సొంత కుటుంబం కంటే ఎక్కువగా పార్టీ చూసుకుంటున్నాను. పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ పాదాభివందనం. టీడీపీ కార్యకర్తలు చేసుకునే ఏకైక పండుగ మహానాడు. టీడీపీ అంటేనే త్యాగాలకు మారుపేరు. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు, మహిళల అభ్యున్నతికి టీడీపీ కృషి చేస్తోంది. 35 సంవత్సరాలుగా తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తున్నారంటే ఎన్టీఆర్ వల్లే. ఎన్నో జెండాలు, పార్టీలు వచ్చాయి. జెండాలు పీకేశారు. పార్టీలు చరిత్రలో కలిసిపోయాయి. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే. దేశంలో మొదటిగా కిలో రెండు రూపాయలకు బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే. ప్రపంచ పటంలో హైదరాబాద్‌ను పెట్టిందే టీడీపీ. హైదరాబాద్‌ను ఉద్యోగాలు కల్పించే నగరంగా తీర్చిదిద్దాం. ఏపీని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నా. విభజన ఇబ్బందులు ఎదుర్కొనేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. విద్యాపరంగా ముందుకు వెళితేనే బ్రహ్మాండమైన అభివృద్ధి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసుకోవాలి. రాయలసీమను రతనాల సీమగా మార్చుతాం. పట్టిసీమను సకాలంలో పూర్తి చేస్తాం.' అని తెలిపారు. -
తిరుపతితో టీడీపీ మహానాడు ప్రారంభం
తిరుపతితో టీడీపీ మహానాడు ప్రారంభం తిరుపతి : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో మహానాడును ప్రారంభించారు. పార్టీ జెండను ఆవిష్కరించి, ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి మహానాడును ఆరంభించారు. తిరుపతిలోని పురపాలక మైదానంలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. అంతకు ముందు చంద్రబాబు మహానాడు ప్రాంగణంలో త్రీడీ షోతో పాటు, ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మహానాడుకు ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి.. దుబాయ్, అమెరికా, యూకే తదితర దేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. కాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, తమ పాలన అద్భుతంగా ఉందని గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
అభివృద్ధి మంత్రం.. కనికట్టు తంత్రం!
తిరుపతి వేదికగా నేటి నుంచి టీడీపీ మహానాడు సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల సభ ‘మహానాడు’ను శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలోని పురపాలక మైదానంలో నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి.. దుబాయ్, అమెరికా, యూకే తదితర దేశాల నుంచి సుమారు 30 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన వంటి ఎన్నో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతున్నామని, తమ పాలన అద్భుతంగా ఉందని గొప్పలు చెప్పుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు.. 20 మార్లు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని, తాము రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగడుగునా అడ్డం పడుతున్నారని నొక్కి చెప్పనున్నట్లు సమాచారం. వివిధ అంశాలపై మొత్తం 28 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులకు అభివృద్ధి ముసుగు 2014 జూన్‌లో చంద్రబాబు అధికారం చేపట్టింది మొదలు ఇప్పటి వరకు జరిగిన 1.35 కోట్ల రూపాయల కుంభకోణాలను అభివృద్ధిగా చెప్పుకునేందుకు మహానాడు వేదికను ఉపయోగించుకోనున్నారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని వాపోయిన చంద్రబాబు.. ఇపుడు ఏపీలో ఆయన అదే పనిచేస్తూ దానికి అభివృద్ధి ముసుగు తగిలించి తన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదంతా తాను సాధించిన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని చెబుతూ.. తెలంగాణాలో మాత్రం తాము ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నామని చెబుతూనే ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాత్రం ఆచితూచి మాట్లాడనున్నట్లు సమాచారం. లోకేశ్‌ను కీర్తిస్తూ స్క్రిప్ట్ రెడీ!...: మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు, కుమారుడు లోకేశ్‌లను పొగడ్తలతో ముంచెత్తేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు. లోకేశ్‌కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు గట్టిగా మాట్లాడేలా పార్టీ ముఖ్య నేతలు త ర్ఫీదునిచ్చినట్లు సమాచారం. -
కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం
నల్లగొండ మినీ మహానాడులో రేవంత్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సీఎం కేసీఆర్‌ను కుర్చీ నుంచి దింపడమే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం తన చెమటనంతా ధారపోస్తానని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై కలబడతానని, నిలబడతానని, పడగొడతానని ఆయన శపథం చేశారు. నల్లగొండలో బుధవారం జరిగిన పార్టీ మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌ను కర్కోటక సీఎంగా అభివర్ణించారు. తెలంగాణలో ఒక్కరోజులోనే సర్వే చేయించానని చెబుతున్న కేసీఆర్.. తొలిదశ ఉద్యమంలో చనిపోయిన 369 మంది, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది వివరాలు మాత్రం సేకరించలేకపోయారని, కేవలం 588 మంది అమరవీరులను గుర్తించామని చెపుతున్నారని, అందులోనూ 250 మంది అడ్రస్‌లు లేవంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తానే టికెట్లు ఇప్పిస్తానని, కార్యకర్తలకు కేసులుంటే కోర్టు ఫీజులు కడతానని, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని రేవంత్ అన్నారు. -
హామీలు నెరవేర్చకపోతే మహానాడును అడ్డుకుంటాం
ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య చిత్తూరు : మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను నెరవేర్చకుంటే మహనాడును అడ్డుకుంటామని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జన్ని రమణయ్య మాదిగ హెచ్చరించారు. మంగళవారం ఆయన చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై మాదిగల్లో వ్యతిరేకత ఏర్పడుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మరచిపోయారని ఆరోపించారు. 33 లక్షల మంది మాదిగల ఓట్లతో గద్దెనెక్కి ఇప్పుడు వారికే తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీ రామారావు ప్రవేశ పెట్టిన శాశ్వత మేనిఫెస్టోలో మాదిగలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి అప్పట్లో మాదిగ వర్గానికి చెందిన వ్యక్తిని ఆర్థిక మంత్రిగా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే మాటలతో మాదిగలను నమ్మించి అధికారం చేపట్టి కనీసం అర్హులకు పింఛన్లు కూడా పంపిణీ చేయలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ అందజేయాలని చంద్రబాబును రమణయ్య మాదిగ డిమాండ్ చేశారు. తమ సమస్యలపై వెంటనే స్పందించకపోతే జూన్ 27వ తేదీన మహనాడులో వినతిపత్రం అందజేసి, 28న రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన చేపడతామని... అలాగే 29న మహానాడు ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు అనీల్ తదితరులు పాల్గొన్నారు. -
జన్మభూమి కమిటీలు శుద్ధదండగ
- తీవ్ర విమర్శలు చేసిన మంత్రి అయ్యన్నపాత్రుడు నక్కపల్లి/ఎస్.రాయవరం: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కమిటీలు శుద్ధదండగన్నారు. అసలు ఈ విధానమే సరికాదని తప్పుబట్టారు. కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని, తాము జన్మభూమి కమిటీ సభ్యులమని గొప్పలు చెప్పుకోవడానికి, మెడలో ట్యాగ్లు వేసుకుని తిరుగుతూ పెత్తనం చెలాయించడానికే పరిమితమయ్యారని విమర్శించారు. విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో శనివారం జరిగిన టీడీపీ మినీ మహానాడులో మంత్రి మాట్లాడారు. పథకాలు అర్హులకు అందుతున్నాయా లేదా.. వాటి అమలులో అక్రమాలు జరుగుతున్నాయా.. పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారా లేదా అనేది పరిశీలించాలని కమిటీలకు సూచించారు. -
'మహానాడులో ఎస్సీ వర్గీకరణపై చర్చించాలి'
ఏలూరు: తిరుపతిలో నిర్వహించే టీడీపీ మహానాడులో ఎస్సీ వర్గీకరణపై చర్చించి తగు తీర్మానం చేయకపోతే మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఏపీ ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. శుక్రవారం ఏలూరులో నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. మహానాడు తొలిరోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తామన్నారు. రెండో రోజున ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన దీక్షలు చేస్తామని, అప్పటికీ వర్గీకరణపై తీర్మానం చేయకపోతే ఛలో తిరుపతి కార్యక్రమం నిర్వహించి మహానాడు వేదిక వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎటువంటి ఘటనలు జరిగినా అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణపై ఇంకా అలసత్వం వహిస్తే జూన్ 30న అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో లక్ష మందితో దండయాత్ర మహాసభ నిర్వహిస్తామన్నారు. ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు జన్ని రమణయ్య మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణపై చర్చించి తీర్మానం చేయకపోతే 2019 ఎన్నికల అనంతరం చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెడతామన్నారు. వర్గీకరణకు బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా వర్గీకరణపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీరామ దేవమణి, రాష్ట్ర యువసేన అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, జాతీయ కో కన్వీనర్ కలివెల ఎలీషా, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బుంగా సంజయ్, ఏపీఎంఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె లాజరస్, రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ఉందుర్తి సుబ్బారావు పాల్గొన్నారు. -
ప్రత్యేక దగా
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కప్పదాటు వైఖరి అవలంబిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఊకదంపుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టిన నేతలు.. అధికారంలోకొచ్చాక ఆ మాటే మరిచారు. విభజన అనంతరం లోటు బడ్జెట్లో పడిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో కొంత ఊరట దక్కుతుందని ఆశపడిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. ఏడాది గడిచినా దీని ఊసే పట్టించుకోకపోవడంపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టీడీపీ మహానాడులో కనీసం ఆ అంశాన్నే ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అప్పుడలా.. ఇప్పుడిలా.. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఐదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్సింగ్ లోక్‌సభ సాక్షిగా ప్రకటించారు. ఐదేళ్లు చాలదు.. పదేళ్లు కావాలంటూ అప్పుడు ప్రతిపక్షంలోనూ, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. తాను లోక్‌సభలో పట్టుబట్టడం వల్లనే మన్మోహన్ ప్రభుత్వం ఐదేళ్లయినా ప్రత్యేక హోదాను ఇచ్చిందని వెంకయ్య నాయుడు చెప్పుకొన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా అంశంపై చేతులెత్తేసింది. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన టీడీపీ ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదు. కేంద్రంలో బీజేపీకి మిత్రపక్షంగా తన మంత్రులను కొనసాగిస్తోంది. దీంతో టీడీపీ తీరుపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రోడ్డెక్కుతున్న జనం... రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ నాయకుడు, సినీనటుడు శివాజీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని విజయవాడ వద్ద కృష్ణానదిలో జలదీక్ష చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వామపక్ష పార్టీల నేతలు శనివారం ఏకంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడలో సమావేశం నిర్వహిస్తున్న హోటల్‌నే ముట్టడి చేశారు. బాధ్యత గుర్తించాలి రాష్ట్రాన్ని విభజించడంలో చూపించిన శ్రద్ధ నూతన రాష్ట్రానికి సహాయం చేయడంలో చూపడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన నేతలు, విభజన జరిగి ఏడాది పూర్తి కావస్తున్నా ఒక హామీ కూడా అమలు చేయలేదు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్, సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా అతి ముఖ్యమైనది. ఇప్పుడు ఆ హామీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడటం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పరిష్కరించి ఇవ్వవచ్చు. - డాక్టర్ ఎం.సి.దాస్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్, విశ్రాంత ఆచార్యులు హామీ నిలుపుకొంటేనే విలువ ప్రత్యేక హోదా రావడం వల్ల మన రాష్ట్రంలోకి వచ్చే పరిశ్రమలకు అనేక రాయితీలు వస్తాయి. దీనివల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదాకు సరిపడా సహాయం ఇతర విధాలుగా చేసేకంటే ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటేనే విలువ ఉంటుంది. రాష్ట్ర విభజన వల్ల ఈ ప్రాంతం ఎంతో నష్టపోయింది. బడ్జెట్ లోటు ఏర్పడింది. ఎంతో ఆదాయం వచ్చే పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉండిపోయాయి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలూ కల్పించాలి. రాష్ట్ర విభజన జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ప్రజలు అసహనంతో ఉన్నారు. - ముత్తవరపు మురళీకృష్ణ, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ అవసరం తీరాక పక్కన పడేశారు రాష్ట్ర విభజన సమయంలో నాటి పాలకులు, ప్రతిపక్ష నాయకులు పోటీలు పడి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అవసరం తీరాక పక్కన పడేశారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రజావసరాల కార్యక్రమాల నిర్వహణకు అవకాశం చిక్కుతుంది. గతంలో ప్రత్యేక హోదా ఇచ్నిన రాష్ట్రాల పరిస్థితి ఆశాజనకంగా లేదు. నూతన రాష్ట్రంలో నిధుల కొరత కనిపిస్తోంది. ఆ లోటు తీర్చటానికి భూముల విలువ పెంచి రిజిస్ట్రేషన్ ద్వారా అధిక పన్నుల భారం మోపటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు పన్ను రాయితీ ఇచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి. - గోళ్ల నారాయణరావు, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి -
అబద్ధాల వర్షం కురిపించారు
♦ టీడీపీ మహానాడు తీరుపై అంబటి ధ్వజం ♦ భూముల్ని సింగపూర్‌కు ఇవ్వాలనుకుంటున్న బాబు రాక్షసుడా? ♦ ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతలు రాక్షసులా? అని నిలదీత సాక్షి, హైదరాబాద్: టీడీపీ మహానాడులో సీఎం చంద్రబాబునాయుడు, ఇతర నేతలు అబద్ధాల వర్షం కురిపించి ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీలో అధికారంలోకొచ్చాక జరిగిన రెండో మహానాడులో తొలి ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను ఎంతమేరకు నెరవేర్చామనే విషయం చెప్పలేదని విమర్శించారు. ‘‘రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కానేకాదు. విజయవాడ-గుంటూరు పరిసరాల్లో రాజధాని నిర్మాణాన్ని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతించారు. అయితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా వాటిని విస్మరించి రైతులనుంచి పచ్చటి పొలాల్ని బలవంతంగా లాక్కోవడాన్నే మేం తీవ్రంగా వ్యతిరేకించాం. రాజధానికోసం అటవీ భూములనైనా సరే డీనోటిఫై చేసి ఇస్తామని కేంద్రం విభజన చట్టంలో పొందుపరిస్తే దాన్ని పట్టించుకోకపోవడాన్నే ప్రశ్నించాం’’ అని తెలిపారు. వెనకటికి హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్ని చాపలా చుట్టి సముద్రంలో ముంచేయాలని చూస్తే ఆదివిష్ణువు వరాహావతారం ఎత్తి భూమి మునిగిపోకుండా కాపాడారని, ఇపుడూ చంద్రబాబు హిరణ్యాక్షుడిలాగా పచ్చటి పంటపొలాల్ని చాపచుట్టి సింగపూర్‌కు ఇచ్చేయాలని చూస్తూంటే తమతోపాటుగా రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రతిఘటిస్తున్నాయని అన్నారు. భూమిని సింగపూర్‌కు ఇవ్వాలనుకుంటున్న చంద్రబాబు రాక్షసుడా? లేక ప్రజల తరపున పోరాడుతున్న వైఎస్సార్సీపీ నేతలు రాక్షసులా? అనేది ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాను ఎందరినో చేరదీసి పదవులిచ్చి పెద్దవారిని చేస్తే విశ్వాసం లేకుండా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారని, గడ్డి తినే గొర్రెకున్నంత విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారని బాబు మహానాడులో చెప్పిన కథను ఆయనకే అన్వయించుకోవాలన్నారు. తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ఓటేయాలని తమ పార్టీ నిర్ణయించడం సరైన నిర్ణయమని అంబటి చెప్పారు. -
'పోకిరీల ఆటలు ఇక చెల్లవు'
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అరాచక శక్తుల ఆట కట్టిస్తామన్నారు. మహానాడులో మూడో రోజు శాంతి భద్రతలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... హైదరాబాద్ లో శాంతిభద్రతలు పరిరక్షించి మతసామరస్యాన్ని కాపాడింది టీడీపీ అని చెప్పారు. శాంతిభత్రలు నాగరికతకు చిహ్నమన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. పోకిరీల పట్ల కఠినంగా వ్యహరిస్తామన్నారు. ర్యాగింగ్ జోలికి వెళ్లొద్దని, చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. -
'చంద్రబాబూ ఓ సారి అద్దంలో ముఖం చూసుకో'
హైదరాబాద్: మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధి తన ఘనతేనంటున్న చంద్రబాబు ఓ సారి అద్దంలో ముఖం చూసుకోవాలని తలసాని సూచించారు. ఏపీకి సంపద మీరు సృష్టించుకోండని... పట్టిసీమ ప్రాజెక్ట్‌లో అయ్యా, బాబులు ఎంత కొట్టేస్తున్నారో నాకు తెలుసునని తలసాని ఈ సందర్భంగా వెల్లడించారు. జూన్ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 7వ తేదీన ట్యాంక్ బండపై ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామని తలసాని సూచించారు. -
'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం'
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుష్కరాల కోసం 248 పుష్కర ఘాట్ లను సిద్ధం చేసినట్టు చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మహానాడులో మూడో రోజు గోదావరి పుష్కరాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పవిత్ర గోదావరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. గోదావరి జలాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. గోదావరి ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టిస్తామని చంద్రబాబు ప్రకటించారు. -
'భారతరత్న ఇచ్చేవరకు పోరాడతా'
-
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేవరకు పోరాడతా: చంద్రబాబు
హైదరాబాద్: దివంగత నందమూరి తారక రామారావుకు 'భారతరత్న' పురస్కారం ఇచ్చేవరకు పోరాడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ శివారు గండిపేటలో జరుగుతున్న మహానాడు రెండో రోజున ఆయన మాట్లాడారు. పేదలకు అనేక పథకాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ పేరు మీద చీర - ధోవతి పథకాన్ని ప్రవేశపెడతానని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 92వ జయంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ చంద్రబాబు తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని మహానాడు ఆమోదించింది. టీడీపీ కేంద్రకమిటీ అధ్యక్ష పదవికి సీఎం చంద్రబాబు తరఫున ఆరు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. త్వరలోనే రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు అధ్యక్షులను ఎన్నుకుంటారు. జూన్ 5 నుంచి గుంటూరు పర్యటన చంద్రబాబునాయుడు జూన్ 5 నుంచి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోజు గుంటూరులో రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆ మర్నాడు మందడం - తాళ్లాయపాలెం మధ్య రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. జూన్ 8న నవ నిర్మాణ దీక్షలో పాల్గొంటారని సమాచారం. -
'మహిళలు తిరగబడతారనే ఇక్కడ పెట్టారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కూడా బాధిస్తోందని... వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు.