మహానాడుకు టూరిజం బస్సులు | tourism buses for mahanadu | Sakshi
Sakshi News home page

మహానాడుకు టూరిజం బస్సులు

May 26 2017 11:38 PM | Updated on Aug 11 2018 4:28 PM

మహానాడుకు టూరిజం బస్సులు - Sakshi

మహానాడుకు టూరిజం బస్సులు

రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవ లేదన్నట్లు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతో విశాఖపట్నంలో ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి రెండు టూరిజం బస్సులను ఏర్పాటు చేశారు.

నంద్యాల: రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవ లేదన్నట్లు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతో విశాఖపట్నంలో ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి రెండు టూరిజం బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ వర్గీయులు శుక్రవారం భూమా కార్యాలయం, రాజ్‌థియేటర్‌ జంక్షన్‌ నుండి విశాఖపట్నంకు బయల్దేరారు. నంద్యాల నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియ ఆ నియోజకవర్గంపై అమితాసక్తి కనపరుస్తున్నారు. ఈ విషయమై జిల్లా టూరిజం అధికారి బాపూజీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పరిధిలో టూరిజం శాఖకు బస్సులు లేవని.. మహానాడుకు బయల్దేరిన టూరిజం బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement