tourism buses
-
బస్సు ప్రమాదంలో 11 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించారు. మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న బస్సు ఉడుపి– చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్కళ తాలూకా మాళె సమీపంలో శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పి కుడివైపు బండరాళ్లను అతివేగంతో బలంగా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. బస్సు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఉడుపి జిల్లాలోని మణిపాల్, కార్కళలోని ఆస్పత్రులకు తరలించారు. మైసూరు జిల్లాకు చెందిన ఈ టూరిజం బస్సులో మొత్తం 35 మంది పర్యాటకులు ఉన్నారు. మైసూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగులను విహార యాత్రకు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
మహానాడుకు టూరిజం బస్సులు
నంద్యాల: రాజు తలుచుకుంటే.. దెబ్బలకు కొదవ లేదన్నట్లు టూరిజం శాఖ మంత్రి అఖిలప్రియ ఆదేశాలతో విశాఖపట్నంలో ప్రారంభమయ్యే టీడీపీ మహానాడుకు కర్నూలు జిల్లా నంద్యాల నుంచి రెండు టూరిజం బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వర్గీయులు శుక్రవారం భూమా కార్యాలయం, రాజ్థియేటర్ జంక్షన్ నుండి విశాఖపట్నంకు బయల్దేరారు. నంద్యాల నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భూమా అఖిలప్రియ ఆ నియోజకవర్గంపై అమితాసక్తి కనపరుస్తున్నారు. ఈ విషయమై జిల్లా టూరిజం అధికారి బాపూజీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పరిధిలో టూరిజం శాఖకు బస్సులు లేవని.. మహానాడుకు బయల్దేరిన టూరిజం బస్సులు ఎక్కడి నుంచి వచ్చాయో తమకు తెలియదన్నారు.