సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తోన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ను చంపేసి, జెండాను దొంగతం చేసిన ద్రోహి చంద్రబాబు. అలాంటి నిన్ను నేను పదవులు అడిగిన మాట నిజమే అయితే... నీ కొడుకు లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?’’ అని సవాలు విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి... టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
‘‘చంద్రబాబు విశ్వాస ఘాతకుడని నేను కాదు.. ఎన్టీఆరే చెప్పారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి, శరణుశరణంటూ టీడీపీలోకి వచ్చి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నరహంతకుడివి. చివరికి పార్టీ జెండాను లాక్కున్న దొంగవి. రాజకీయాల్లో నీఅంత నీతిమాలిన వ్యక్తి లేడు. నీ జీవితమే అవినీతికి కుట్రలకు, మోసాలకు నిలయం. పార్టీ పెట్టిననాడు ఎన్టీఆర్ వెంట ఉన్న నాలాంటి పేదలను టార్చర్ చేసిన క్రూరుడివి. సీనియారిటీకి విలువ లేదన్న బాధతోనేకదా గాలి ముద్దుకృష్ణమ లాంటి 20 మందిదాకా చనిపోయింది. జెండాను నమ్ముకున్న మాలాంటి వాళ్లను కాదని, నీలాంటి దొంగలను పార్టీలో చేర్చుకున్నావ్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా జెండా కోసం మాత్రమే వెంట ఉన్నాను తప్ప, పదవుల కోసం కాదు....
చంపేస్తారని భయపడ్డావే.. ఇప్పుడు ఫోన్ ఎత్తవెందుకు?: 2009-12 మధ్య కాలంలో నీ దగ్గరికి రావడానికే అందరూ భయపడుతుంటే నేను పక్కనున్నా. నాకు ప్రాణభయం ఉందని గజగజలాడిన ఆ రోజులు గుర్తులేవా, చంపేస్తారు.. కాపాడమని బతిమాలితేనేకదా నీ వెంట కాపలా కుక్కలా తిరిగింది. ఏం, ఇప్పుడేమైంది? 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తవెందుకు, మీటింగ్‌కి ఎందుకు పిలవలేదనేకదా నేను అడిగింది.. ఫలానా కారణంతో పిలవలేదని చెబితే సరిపోయేదికదా, పనికిరాని మనుషుల చేత నన్ను తిట్టించడందేనికి? ఏ కులపోడు మాట్లడితే ఆ కులపోడితో తిట్టించడమేనా రాజకీయమంటే!
29 సార్లు మోదీని కలిసింది అందుకేగా: నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నావే, మరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆయన కొడుకులది కాదా, నీ దగ్గర పనిచేసిన కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేక, ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడానికి కుట్రలు చేయలేదా, కేసీఆర్‌కు దొంగలాగా దొరికిపోలేదా, అందుకుకాదా 10 ఏళ్ల హక్కును వదిలేసి హైదరాబాద్ నుంచి పారిపోయింది! ఇగ అమరావతి వెళ్లి అక్కడ పెద్ద డ్రామా. 29 సార్లు మోదీని ఎందుకు కలిశావ్? కేసీఆర్ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావే తప్ప హోదా కోసం కాదు కదా.. అయినా హోదా నువ్వు తెచ్చేదేంది? జగనే తెచ్చుకుంటాడు, లేకుంటే ఇంకెవరో పోరాడితే అదే వస్తుంది. నీ అబద్ధాలను జనం నమ్ముతారనుకుంటున్నావా...
టీడీపీని బ్రోతల్ హౌస్‌లా..: 10 ఏళ్లూ ఇక్కడే ఉంటా, పార్టీని కాపాడుకుంటా అని అన్నావ్, దొంగలాగా రాత్రికిరాత్రే పారిపోయావ్. రేవంత్ రెడ్డితో నువ్వు చేయించిన కుట్రతో పార్టీ పరువు గంగలో కలిసింది. ఆ తర్వాతైనా రేవంత్‌ని కట్టడిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ల నుంచి విమర్శలు రాకూడదనేకదా రేవంత్‌ను ఆ పార్టీలోకి పంపింది. ఇప్పుడు నేను అడుతున్నా... ఆ ఆడియోలో వాయిస్ నీది కాదని చెప్పగలవా? ఆ గొంతు విన్న ప్రతిఒక్కడూ టీడీపీ నాయకుల నోట్లో ఉమ్మి ఊశారు. బ్రోకర్ పనులు చేస్తూ టీడీపీని బ్రోతల్ హౌస్‌లా నడిపిస్తున్నావ్.. థూ.. నీ మీద మన్నుపడ! ఎన్టీఆర్ ఆశయాల కోసం పార్టీలో చేరిన నాలాంటి పేదల జీవితాలను నాశనం చేశావుకదా.. ఈ పాపం ఊరికే పోదు. నోరుతెరిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలాగా ఉపన్యాసాలు ఇస్తావ్.. మనస్సాక్షిలేని మూర్ఖుడివి నువ్వు..
తిరుమల మెట్లమీదే ప్రాణాలు వదిలేస్తా: పేదల వ్యతిరేక విధానమే చంద్రబాబు పాలసి. అలాంటివాడిని ఓడగొట్టాలని ఏపీ ప్రజల్ని కోరుతున్నా. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో నుంచి ప్రతి నియోజవకర్గానికి 25 కోట్లు ముందస్తుగా పంపాడు. అసలు ఈయనవల్లే కదా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నది. ఎన్నికల్లో చంద్రబాబు పెట్టిన ఖర్చు దేశంలో ఎవడూ పెట్టడు. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫొటోలు కావాలి. దేశంలో అన్ని కంపెనీలు దివాళా తీస్తుంటే ఈయన హెరిటేజ్ ఒక్కటే లాభాల్లో ఎలా ఉంటుంది? దొంగసొమ్మును దుబాయ్, అమెరికాల్లో దాస్తున్నది నిజం కాదా! ఈ దొంగను ఈ సారి ఓడించాల్సిందే. చంద్రబాబును నాశనం చేయమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకుంటా. మోకాళ్లమీద తిరుమలకు నడుచుకుంటూ వెళతా. మెట్లమీద నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. దేవుడు నా ప్రార్థన వింటేచాలు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబును బొందపెట్టాల్సిందే....’’ అని మోత్కుపల్లి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment