motkupalli narasimhulu
-
కాంగ్రెస్‌లోకి మోత్కుపల్లి?
సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ టికెట్ ఇస్తానని తనకు హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆరు నెలలుగా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో హస్తం గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు. శుక్రవారం ఆయన బెంగళూరులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. తుంగతుర్తి టికెట్ ఇవ్వాలని కోరగా అందుకు డీకే సానుకూలత వ్యక్తం చేయడంతో త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నట్ల్లు తెలుస్తోంది. ఏ పదవీ దక్కని మోత్కుపల్లి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడో ఒక చోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని మోత్కుపల్లి పర్సింహులు తన అభిప్రాయాన్ని పలుమార్లు వెల్లడించారు. అయితే సీఎం కేసీఆర్ సిట్టింగులకే సీట్లు కేటాయించడంతో ఆ అవకాశం లేకుండాపోయింది. కాగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మోత్కుపల్లి.. కేసీఆర్‌ను నేరుగా కలిసి మాట్లాడాలని ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నా అవకాశం ఇవ్వడంలేదని ఆయన మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం తీసుకువచ్చిన దళితబంధు పథకం చైర్మన్ లేదా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్న మోత్కుపల్లికి ఏ అవకాశం కేసీఆర్ కల్పించలేదు. తుంగతుర్తి నుంచి పోటీకి సంసిద్ధత ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మోత్కుపల్లి వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నియోజకవర్గంతో పాటు పలు చోట్ల మీడియా సమావేశాల్లో మోత్కుపల్లి అనుచరులు ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా సిట్టింగ్ కోటాలో తుంగతుర్తి నుంచి గాదరి కిషోర్‌కుమార్‌కు మూడవ సారి టికెట్ లభించింది. ఆలేరులో ఐదు సార్లు (టీడీపీ, ఇండిపెండెంట్, కాంగ్రెస్), తుంగతుర్తి నుంచి టీడీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి అనంతరం టీడీపీలో చేరారు.అయితే తాజా పరిస్థితుల నేపధ్యంలో మరోసారి కాంగ్రెస్ నుంచి తుంగతుర్తిలో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి? ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సహ జిల్లాలోని ముఖ్యనేతలంతా కొంత కాలంగా మోత్కుపల్లితో టచ్‌లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి జిల్లాలో పార్టీకి సీనియర్ నేతగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతల సూచన మేరకు బెంగళూరులో డీకే శివకుమార్‌ను కలిశారు. మాజీ ఉప ముఖ్య మంత్రి దామోదర రాజనర్సింహ హైదారాబాద్‌లోని మోత్కుపల్లి ఇంటికి వచ్చి సుదీర్ఘంగా చర్చించడంతోపాటు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. అలాగే జిల్లాలో సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు మోత్కుపల్లిని పార్టీలోకి రావాలని కోరినట్లు సమచారం. అయితే ఉమ్మడి జిల్లాలో పేరున్న మోత్కుపల్లి కాంగ్రెస్‌లో చేరిక బీఆర్ఎస్కు నష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. -
‘నాడు అవినీతి పరుడు అన్న నోటితోనే నేడు పొగడ్తలు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు అవినీతీ పరుడు, నయవంచకుడు అని గతంలో విమర్శించిన సీనియర్ నేత మోత్కపల్లి నర్సింహులు.. నేడు అదే నోటితో పొగడటంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. ‘చంద్రబాబు అవినీతి పరుడు, నయవంచకుడు అని మోత్కుపల్లి గతంలో చెప్పాడు. ‘ఎన్టీఆర్‌ని చంపించింది చంద్రబాబు నాయుడే అని మోత్కుపల్లి అన్నాడు. ఇప్పుడు డబ్బు, ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద మనిషి అంటూ పొగుడుతున్నాడు. మోత్కుపల్లి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించం. అవినీతిని కనిపెట్టిందే చంద్రబాబు.. స్కిల్ స్కామ్‌లో కోట్లు కొల్లగొట్టాడు. పురందేశ్వరి టీడీపీ అధ్యక్షురాలా? బీజేపీ అధ్యక్షురాలా?, డబ్బు కోసం, పదవి కోసం ఎన్టీఆర్‌ని పురందేశ్వరి వెన్నుపోటు పొడిచింది. ప్రధాని మోదీనే చంద్రబాబు అవినీతి పరుడని చెప్తే పురందేశ్వరి మద్దతిస్తోంది’ అంటూ నారాయణస్వామి ధ్వజమెత్తారు. -
అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం..
సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు. అవమానంగా భావించి దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. చదవండి: అసంతృప్తులకు గాలం నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు: వైరా: ‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్ కేటాయించిన మదన్‌లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు. -
‘కేసీఆర్ ఆదేశిస్తే.. ఎన్నికల్లో పోటీ చేస్తా’.. సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు
సాక్షి, యాదగిరిగుట్ట: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలోని నేతలు సీట్ల వేటలో ఉన్నారు. ఈ క్రమంలో కొందరికి ఇప్పటికే సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర కామెంట్స్ చేశారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఏ స్థానం నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో తలసాని విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో తలసాని మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్నా.. నాకు సీఎం కావాలనే ఆశ లేదు, ఆశకు కూడా ఓ హద్దు ఉండాలి. ఇప్పుడున్న దాంతో సంతోషంగా ఉన్నా’ అని అన్నారు. కాంగ్రెస్‌లో గిరిజన ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి కావొచ్చనే వ్యాఖ్యలు వచ్చాయని, మీ పార్టీలో బీసీ సీఎం అనే ఆలోచన వస్తే మీరు పోటీలో ముందుంటారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తలసాని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మంత్రి కేటీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ -
TS: ఎత్తుకుంటే ఎందాకైనా..
దళితబంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో అమలు చేస్తాం. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా అందరికీ వర్తింప చేస్తాం. తద్వారా బలమైన అంతరాలు లేని సమాజాన్ని నిర్మిస్తాం. ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారు: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయం ఒక క్రీడ, టీఆర్ఎస్కు మాత్రం ఇది ఒక టాస్క్ (లక్ష్యం). ఎత్తుకుంటే ఎందాకైనా వెళ్లాలి, పట్టుబట్టి పనిచేయాలి. నాకు రాజకీయం కొత్తకాదు. కావాల్సింది రాజకీయాలు కాదు, ఫలితాలు సాధిం చడమే ముఖ్యం. పదవులు వస్తాయి పోతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నేను పదవులు చేపట్టకుండా పక్కన ఉందామనుకున్నా. ఎవరికి అప్పజెపితే ఏమవుతుందో అని చాలామంది ఆందో ళన వ్యక్తం చేయడంతో బాధ్యత ఎత్తుకున్నా’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. దళిత బంధు పథకం తమాషా కోసం చేపట్టిన పథకం కాదని, దళిత సమాజ ఉద్ధరణ కోసం చేపట్టామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు సోమవారం తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సంద ర్భంగా తరలివచ్చిన మోత్కుపల్లి అనుచరులు, పార్టీ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. దళితబంధు ఓ దిక్సూచి ‘పరిపాలన చేస్తున్న వారికి ఫలితాలు కావాలి. ప్రతీప శక్తులను ఎందుర్కొంటూ ముందుకు సాగాలి. అందరూ ఆర్థికంగా ఎదిగితేనే అది బంగారు తెలంగాణ అవుతుంది. తెలంగాణ దళిత సమాజానికి దళితబంధు పథకం ఒక దిక్సూచి. దళితబంధును విజయవంతం చేస్తే ఇతర వర్గాల అభివృద్ధికి కూడా మార్గం దొరుకుతుంది. రాష్ట్రంలో జనాభా పరంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న దళితుల చేతుల్లో భూమి అతి తక్కువగా ఉంది. అంబేడ్కర్ చూపిన బాటలో తెలంగాణ పయనించాలి. వెనుకబాటుకు అన్యాయానికి గురైన వారిని మొత్తం తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చి బాగు చేసుకోవాలి. విద్యుత్, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, రైతు సంక్షేమం వంటి ఎన్నో అంశాలు క్రమంగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ‘బంగారు వాసం’ పెట్టామని చెప్పడం లేదు. కానీ చేనేత కార్మికులు, గొర్రెల కాపరులు, గీత కార్మికులు తదితర వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రం వచ్చిన తర్వాత కొంతమేర అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సి ఉంది..’ అని కేసీఆర్ చెప్పారు. వారికెందుకు దళితబంధు ఆలోచన రాలేదు ‘యజ్ఞంలా చేపట్టిన దళితబంధు పథకం ఆగదు, క్రమంగా గిరిజనులు, బీసీలు, ఈబీసీలకు కూడా ఈ పథకం చేరుతుంది. కరోనా మూలంగా దళితబంధు పథకం ప్రారంభం కొంత ఆలస్యమైంది. ఇంట్లో రోగం వచ్చిన వాడికి టానిక్ పోసినట్లే రాష్ట్ర ఖజానాకు వచ్చిన సంపదను ఏదో ఒక రూపంలో తిరిగి ప్రజలకు చేరవేస్తాం. అవకాశం లేని బలహీనులు, బాధలో ఉన్న వారిని చేరుకుని, వారిని ఆర్థికంగా నిలబెడతాం. గతంలో అధికారంలో ఉన్న వారికి దళితబంధు అమలు చేయాలనే అలోచన ఎందుకు రాలేదు. బలమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల కలిగిన నాయకుడు తెలంగాణకు అవసరం. సాధించుకున్న రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, చెడగొట్టాలన్నా మన చేతుల్లోనే ఉంది. దళితబంధు పథకానికి వెచ్చించే రూ.1.70 లక్షల కోట్లు.. రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తాయి. ఈ పథకం అమలు చేసేందుకు దమ్మూ ధైర్యం కావాలి. వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే అధికారం..’ అని సీఎం అన్నారు. జరగాల్సిన కృషి ఎంతో ఉంది ‘ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితికి దిగజారి అనేక బాధలు పడుతూ చెదిరిపోయింది. తెలంగాణకు పెట్టుబడులు రావంటూ ఆనాటి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధించాయి. తెలంగాణ ఒక ప్రయోగశాల, ప్రత్యేక రాష్ట్రం వస్తే నక్సలైట్లు ఏకే 47లు పట్టుకుని తిరుగుతారని అపోహలు చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అలాంటి సమస్యలు, భయాల నడుమ నేను ఉద్యమం ప్రారంభిస్తే.. చంపుతారంటూ అనేకమంది భయపెట్టి వెనక్కిలాగాలని చూశారు. కానీ ప్రత్యేక రాష్ట్రం అయితేనే బాగుపడతామని, ఏనాటికైనా తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వస్తుందనే ధైర్యంతో ముందుకు సాగి జాతీయ పార్టీలను ఒప్పించి ప్రత్యేక తెలంగాణ సాధించాం. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో తాగునీరు, రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం ఇలా ఎన్నో సమస్యలు ఎదురైనా దారి వేసుకుంటూ ముందుకు సాగాం. ఇప్పుడు చెరువులు, కుంటల్లో జలకళ, పచ్చదనంతో గ్రామాలు క్రమంగా ఓ రేవుకు వస్తున్నా ఇంకా జరగాల్సిన కృషి ఎంతో ఉంది..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. మోత్కుపల్లి సేవలు వాడుకుంటాం ‘మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అట్టడుగు వర్గాలకు సేవ చేయాలని తపించే వ్యక్తి, నాకు సన్నిహితుడు. ఆయన సేవలను కేవలం ఆలేరు, నల్లగొండ జిల్లాలకే పరిమితం చేయకుండా ఏ స్థాయిలో అవసరమో ఆ స్థాయిలో వాడుకుంటాం. దళితబంధు పథకంపై నేను మొదటగా మాట్లాడింది మోత్కుపల్లితోనే. ఆయన కరోనా బారిన పడినప్పుడు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించా. రాజకీయాలు వేరు, స్నేహం వేరు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోత్కుపల్లికి డబుల్ ధమాకా.. నేడు గులాబీ గూటికి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్ దళిత నాయకుడికి టీఆర్ఎస్ అధిష్టానం డబుల్ ధమాకా ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను మోత్కుపల్లిని శాసనమండలికి పంపుతారని సమాచారం. ఇందుకు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగిందని, ఈ చర్చలో వచ్చిన ఎమ్మెల్సీ ప్రతిపాదనకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లికి ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని, అయితే పార్టీలో చేరిన వెంటనే ఇస్తారా..? సమయం చూసి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద మోత్కుపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖరారయిందని, అయితే ఎప్పుడిస్తారన్నది మాత్రమే సస్పెన్స్ అని జిల్లా టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. గవర్నర్ పోటీదారు.. వాస్తవానికి, మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాకాలం పాటు ఆ పార్టీలోనే కొనసాగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పి తనకు గవర్నర్ హోదా ఇప్పిస్తారని ఆశించారు. కానీ, ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు మార్కు రాజకీయానికి బలయిన మోత్కుపల్లి అక్కడి నుంచి కాషాయ గూటికి చేరారు. బీజేపీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దళితబంధు పథకం ప్రకటన తర్వాత ఆయన టీఆర్ఎస్ పక్షం వహించారు. దళిత వర్గాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గులాబీ సేనకు దగ్గరయిన మోత్కుపల్లి తన మలిదశ రాజకీయ ప్రస్థానాన్ని గులాబీ గూటి నుంచి ప్రారంభిస్తున్నారు. మరి మోత్కుపల్లి మలిదశ ప్రస్థానం ఏ మలుపులు తిరుగుతుంది.. ఆయనకు ఎలాంటి పదవులు కట్టబెడుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నేడు టీఆర్ఎస్లోకి .. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ సమక్షంలో ఈనెల 18వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట లీలానగర్‌లోని మోత్కుపల్లి నివాసం నుంచి బైక్‌ర్యాలీతో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లేముందు ట్యాంక్‌బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడినుంచి గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ప్రగతి భవన్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతారు. ఈ కార్యక్రమానికి ఆయన అనుచరులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. ఆయనతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. మూడు వేల మందితో.. సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు రానున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్యఅనుచరులు 3 వేల నుంచి 4 వేల మంది వరకు హాజరవుతారని మోత్కుపల్లి ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లే అవకాశం ఉంది. ఆయన అభిమానులు, ముఖ్య నాయకులు మోత్కుపల్లి వెంట టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంతకాలంగా మోత్కుపల్లి వెంట నడిచిన పలువురు ద్వితీయ శ్రేణి సీనియర్ నాయకులు పార్టీలో చేరనున్నారు. చేరిక సందర్భంగా ప్రత్యేకంగా వాహనాలు ఏమీ ఏర్పాటు చేయనప్పటికీ ఎవరికి వారే హైదరాబాద్ వెళ్తారని అనుచరులు చెబుతున్నారు. చర్చనీయాంశంగా మోత్కుపల్లి చేరిక మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లి అప్పట్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్ టీడీపీనీ వీడి బయటకు రాగా మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందని టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేయాలని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీడీపీని వీడిన అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం అందులో కొనసాగారు. సీఎం దళితబంధు పథకంపై మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారు. దీంతో కేసీఆర్ స్వయంగా మోత్కుపల్లిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. -
టీఆర్ఎస్ దూకుడు.. 27న ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు సంస్థాగత కార్యక్రమాలకు సిద్ధమవుతూనే మరోవైపు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్ఎస్ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను అధినేత కేసీఆర్ ప్రస్తావించే అవకాశముంది. రేపు టీఆర్ఎస్లోకి మాజీ మంత్రి మోత్కుపల్లి సుమారు మూడు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 5న దళితబంధు పథకంపై చర్చ సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన మోత్కుపల్లి... సీఎం కేసీఆర్‌ను కలసి పార్టీలో చేరిక ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. మోత్కుపల్లి అనుచరులతోపాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు కూడా టీఆర్ఎస్లో చేరతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 27న ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్... హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా ఈ నెల 27న ప్రచారం ముగియనుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రచార సభ ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వచ్చే నెల 15న వరంగల్‌లో టీఆర్ఎస్ నిర్వహించే ‘తెలంగాణ విజయ గర్జన’ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 27న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉన్న హుస్నాబాద్ లేదా ముల్కనూరులో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభ ద్వారానే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశాలను ప్రస్తావించే అవకాశముందని సమాచారం. ప్లీనరీ, విజయగర్జనకు సన్నాహాలు షురూ... హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను టీఆర్ఎస్ ప్రారంభించింది. ఆహ్వానితులకు మాత్రమే ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో సుమారు 14 వేల మంది ప్రతినిధుల పేరిట ఆహ్వాన లేఖలను పార్టీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం చేస్తోంది. మరోవైపు వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు అనువైన చోటు కోసం పార్టీ నేతలు అన్వేషణ ప్రారంభించారు. వరంగల్ నగరానికి సమీపంలోని మామునూరును మంత్రి ఎర్రబెల్లి నేతృత్వంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది. సభా వేదిక నిర్మాణం, సభాస్థలి, పార్కింగ్ తదితరాలకు అనువైన ప్రదేశాన్ని ప్రాథమికంగా ఎంపిక చేశారు. -
‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా
అమీర్‌పేట(హైదరాబాద్): దళితులపాలిట వరంగా మారనున్న దళితబంధు పథకాన్ని విపక్షాలు అడ్డుకుంటే యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఒకరోజు నిరసనదీక్ష చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మోత్కుపల్లికి పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు. నర్సింహులు మాట్లాడుతూ అగ్రవర్ణాలకు దీటుగా దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సాహసోపేత నిర్ణయం తీసుకుని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను పెట్టి అమలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారనే అపార నమ్మకం తనకుందని తెలిపారు. రేవంత్‌రెడ్డివి బ్లాక్మెయిల్ రాజకీయాలు ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్లి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ‘రేవంత్‌రెడ్డిది ఐరన్ లెగ్, టీటీడీపీని పత్తాలేకుండా చేయించి కాంగ్రెస్ పార్టీలో దూకిన వ్యక్తికి టీపీసీసీ కట్టబెట్టడం సిగ్గుచేట’న్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అర్థం లేదని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవటానికే యాత్రను చేపట్టారని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కు దళితులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. -
ముగిసిన మోత్కుపల్లి దీక్ష.. రేవంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై విపక్షాల కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని రాజకీయ బ్రోకర్‌గా అభివర్ణించారు. రేవంత్‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ‘‘కుల వివక్షకు గురై దళితులు మానసిక క్షోభకు గురయ్యారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవి. గ్రామాల్లో తల రుమాలు చేత పట్టుకొని, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సీఎం కేసీఆర్ ఒక మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారు తప్ప.. ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదు’ అని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మోత్కుపల్లి.. వందకు వంద శాతం ఈ పథకం అమలు చేస్తాం. ఈ పథకం అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ’’ వ్యాఖ్యానించారు. -
ప్రారంభమైన మోత్కుపల్లి దళిత బంధు దీక్ష
-
మమ్మల్ని ఇప్పటికీ బానిసలుగానే చూస్తున్నారు: మాజీ మంత్రి
సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవని మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వివక్ష గురై దళితులు ఎంతో మానసిక క్షోభ అనుభివించారని తెలిపారు. గ్రామాల్లో తల రుమాలు, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి ఉందని పేర్కొన్నారు. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. దళిత బంధు వంటి మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారే తప్ప ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపారు. కాగా గత జూలైలో బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం మోత్కుపల్లి బేగంపేటలోని తన నివాసంలో మాట్లాడుతూ.. ‘ఒక పార్టీకి రాజీనామా చేసి వచ్చిన తరువాత కేసీఆర్ తీసుకొచ్చిన దళిత బందుకు మద్దతు ఇవ్వడం అంటే సాహసోపేతమైన నిర్ణయం. ఎంత ఖర్చైన భరిస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. అది చాలా గొప్ప నిర్ణయం. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది సీఎంలుగా చేశారు. కానీ ఎవ్వరూ కూడా దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. మమ్మల్ని ఇప్పటికి బానిసలుగానే చూస్తున్నారు. ఇన్ని రోజులు సీఎం కేసీఆర్ గురించి మాట్లాడని మోత్కుపల్లి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటున్నారు. మంచి పని చేస్తే ఎవరికైనా మద్దతిస్తాం. దళిత బంధుకు కాంగ్రెస్ బీజేపీ ఎందుకు అడ్డుపడుతుంది. టీడీపీని నిలువునా ముంచింది రేవంత్ రెడ్డి. అతని వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం. రేవంత్ రెడ్డి జీవితం అంత మోసమే, బ్లాక్ మెయిలింగే. ఆర్టీఐని వాడుకుంది మొత్తం రేవంత్ రెడ్డే’ అని మండిపడ్డారు. చదవండి: బురదలో కూరుకుపోయిన మంత్రి అజయ్ కారు ఈ ఏడాది ఘనంగా గణేష్ ఉత్సవాలు.. ముస్తాబవుతున్న ఖైరతాబాద్ -
అంబేద్కర్‌లా సీఎం కేసీఆర్‌కు చరిత్రలో స్థానం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితబంధు పథకం అమలు చేయడంపై మరో అంబేడ్కర్‌గా పోల్చి చెప్పారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దళితబంధులాంటి పథకం ఎవరు తీసుకురాలేదని.. అంత ధైర్యం ఎవరూ చేయలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. దళితబంధును బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడగలరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి దేశమంతా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని ఆపాలని చాలా మంది చూస్తున్నారు, మన మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం బయటికి వచ్చినట్లు తెలిపారు. డబ్బు తీసుకుని వస్తా అని చెప్పి తీసుకుని వచ్చిన మొగాడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దళితులు ఇంకా బలహీన వర్గాలుగా ఉంచాలని చాలా మంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లా సీఎం కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. మరియమ్మ ఘటన అయిన తరువాత కేసీఆర్ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. అలానే వరంగల్‌లో ఎస్సైపై అత్యాచారం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. -
‘ఈటల ఆక్రమించిన భూముల్లో జెండాలు పాతుతాం’
హైదరాబాద్: మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ దళితులకు క్షమాపణ చెప్పాలని.. సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ.. ఇప్పటికైన ఈటల దళితుల నుంచి అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని లేకుంటే ఆ భూముల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకానికి మద్దతుగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈటల చేస్తున్న మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీన ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. అయినా దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు
సాక్షి, యాదాద్రి: సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేయడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చజరుగుతోంది. 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా వేసుకున్న వెత్కుపల్లి.. సంవత్సరంన్నర కాలంలోనే బయటకు వచ్చారు. ఆ పార్టీ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు పంపించారు. అయితే, నర్సింహులు టీఆర్ఎస్లో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారని, ఆ నేపథ్యంలో ఆయన బీజేపీకి రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. త్వరలో టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. కేసీఆర్ మోత్కుపల్లిని పార్టీలో చేర్చుకొని ఎస్సీ సాధికారిత కార్యక్రమంలో భాగస్వామిని చేసే అవకాశాలున్నాయంటున్నారు. మోత్కుపల్లి, కేసీఆర్ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కాలంలో మంచి మిత్రులు కావడం గమనార్హం. రాజకీయ విభేదాలతో ఇంతకాలం దూరంగా ఉన్నారు. అంతేకాదు.. పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. కలిసి పనిచేసే సమయం వచ్చిందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని మోత్కుపల్లి అనుచరులు చెబుతున్నారు. మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయన అనుచరులు ఇప్పటికే మెజార్టీగా టీఆర్ఎస్లో ఉన్నారు. కొందరు స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా కొనసాగుతున్నారు. మోత్కుపల్లి టీఆర్ఎస్లోకి వస్తున్నారన్న సంకేతాలతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్కని గవర్నర్, రాజ్యసభ పదవులు మోత్కుపల్లి నర్సింహులు రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ నేత. టీడీపీ, బీజేపీ పొత్తులో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్‌గా అవకాశం కోసం ఎదురు చూశారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో తనకు గవర్నర్ పదవి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే, చంద్రబాబునాయుడు వల్లే తనకు గవర్నర్ పదవి రాలేదని అలాగే.. ఇస్తామన్న రాజ్యసభ పదవి కూడా ఇవ్వకుండా డబ్బున్న వాళ్లకు అమ్ముకున్నాడని మోత్కుపల్లి చంద్రబాబు పై అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనకు ఏ పదవీ దక్కకుండాపోయింది. తాజా బీజేపీలో చేరిన ఆయనకు జాతీయ స్థాయిలో ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి వస్తుందన్న ప్రచారం జరిగింది. అలాగే గవర్నర్ పదవుల్లో కూడా అవకాశం ఉందన్న నమ్మకం ఆయన అనుచరుల్లో వ్యక్తమైంది. అవేవీ రాకపోవడంతో మోత్కుపల్లి అసంతృప్తితో ఉన్నారు. సీనియర్ నేతనైన తన సేవలను పార్టీ సరిగా వినియోగించుకోవడం లేదన్న కారణంతో రాజీనామా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి ఆయన రికార్డు విజయాలను నమోదు చేసుకున్నారు. 1982లో ఎన్టీఆర్ స్థాపింన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుం టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుం, 1989 ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుం గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ నుంచి ఆలేరులో గెలుపొందిన ఆయన 2004లో టీడీపీ తరపున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 2008లో జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయ్యారు. ఆ తర్వాత 2009లో తుంగతుర్తి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిర నుంచి పోటీచేసి ఓటమి చెందారు. అంతేకాకుండా నర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి బహిష్కరణ అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి ముందస్తు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓటమిని చవిచూశారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో గనులు, విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. -
కేసీఆర్ అంబేడ్కర్ వారసుడు.. త్వరలో టీఆర్ఎస్లోకి మోత్కుపల్లి..?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, యాదాద్రి: దళితుల సంక్షే మం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసించారు. దళితుల గుండెల్లో కేసీఆర్ అంబేడ్కర్ వారసుడిగా మిగిలిపోతారని కొనియాడారు. దళితబంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు, దళితులంతా కేసీఆర్‌కు అండగా నిలబడి హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేసినట్లు మోత్కుపల్లి ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలిపారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అవినీతిపరుడని తీవ్రంగా ఆరోపించారు. ఎవరినైనా పార్టీలో చేర్చుకునే ముందు వారి క్రెడిబిలిటీ చూడాలని, ఈటలను బీజేపీ నెత్తిమీద మోయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. బీజేపీలో తనకు పని చేసే అవకాశం ఇవ్వలేదని తాను ఎప్పుడు వెళ్లినా కింద కూర్చునే పరిస్థితి ఉందని ఆరోపణలు చేశారు. పార్టీ తనను, తన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూరం పెట్టడం వల్లే బాధతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సంజయ్‌కు పంపిన లేఖలో మోత్కుపల్లి తెలిపారు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత సమావేశానికి బండి సంజయ్‌కు తెలిపిన తర్వాతే వెళ్లినా కూడా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం బాధాకరమని చెప్పారు. కాగా, మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరుతారని, త్వరలోనే సీఎం కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన ముఖ్య అనుచరులు కూడా చెబుతున్నారు. బీజేపీలో దళిత నేతలు ఇమడలేరు: పల్లా పంజగుట్ట: బీజేపీ మనువాద సిద్ధాంత పార్టీ అని, అందులో మైనార్టీలు, క్రిస్టియన్లతో పాటు దళిత జాతి నేతలను ఏనాడూ ముందుకు రానివ్వరని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దళిత జాతి ప్రజలను ఎప్పుడూ బీజేపీ పేదవారిగానే ఉంచేలా చేస్తుందన్నారు. -
నన్ను ఒక్క మాట కూడా అడగలేదు: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మోత్కుపల్లి నర్పింహులు శుక్రవారం బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుడిని అయిన తనకు బీజేపీలో సముచిత స్థానం దక్కలేదని తెలిపారు. అవినీతిపరుడైన ఈటలను బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందిన్నారు. ఈటల చేరిక గురించి పార్టీ నేతలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మోత్కుపల్లి ఆరోపించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. ‘‘సీఎం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పా. దళిత సాధికారత కోసమే కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు. అవినీతిపరుడైన ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం నన్ను బాధించింది. ఈటల చేరికపై నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. దళిత భూములను ఈటల ఆక్రమించారు.. హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు ఆయన అనర్హుడు. హుజురాబాద్ ప్రజలు ఈటలను బహిష్కరించాలి’’ అని కోరారు. -
బీజేపీకి మోత్కుపల్లి రాజీనామా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. బీజేపీని వీడిన తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిచ్చుపెట్టిన దళిత సాధికారత పథకం సీనియర్ నేత అయిన తనకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత పదవి దక్కకపోవడంపై అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన దళిత సాధికారత పథకం సమావేశానికి హాజరవ్వడంతో వివాదం మరింత ముదిరింది. పార్టీ ఆదేశాలు కాదని మోత్కుపల్లి.. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కావడం పట్ల బీజేపీ పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరై వచ్చిన తర్వాత మోత్కుపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను దళిత ప్రజాప్రతినిధిగా బీజేపీ తరుఫున ఆ సమావేశానికి హాజరుకావడం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లయిందని అన్నారు. అంతేకాక దళిత సాధికారత పథకాన్ని, ముఖ్యమంత్రిని ప్రశంసించారు. దళితులకు మేలు జరుగుతుంటే ఆ వర్గానికి చెందిన నేతగా తాను వెళ్లకపోతే ఎలా అని పార్టీని నిలదీశారు. పైగా పార్టీ నాయకత్వానికి చెప్పే తాను వెళ్లానని... ఎక్కడా పార్టీ లైన్‌ను దాటలేదని తెలిపారు. అయితే మోత్కుపల్లి కేసీఆర్‌ను, ఆయన తీసుకొచ్చిన పథకాన్ని ప్రశంసించడం బీజేపీకి మింగుడుపడలేదు. -
బీజేపీని రక్షించా.. మోత్కుపల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మీటింగ్‌కు వెళ్లకుంటే యాంటీ దళిత ముద్ర పడేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లడం వల్లనే బీజేపీ బతికిందన్నారు. ఏనాడు ఇంత సమయం వెచ్చించి ఇలాంటి సమావేశం జరగలేదని.. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా, నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరవడమే కాకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి. చదవండి: టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుంది.. అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై బీజేపీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 'సీఎం దళిత్ ఎంపవర్మెంట్' పథకం విధి విధానాలపై అఖిలపక్షం చర్చించింది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఈ భేటీకి హాజరయ్యారు. మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ ఇదిలా ఉండగా, అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. అదే సమయంలో బీజేపీ కార్యాలయంలో దళిత నేతల భేటీకి ఆయన డుమ్మా కొట్టారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయినట్లు తెలిసింది. వద్దన్నా వినకుండా అఖిపక్ష భేటీకి హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ పెద్దలు వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్ Balka Suman: ఈటల ‘లేఖ’ నిజమే! -
కేసీఆర్‌పై మోత్కుపల్లి ఘాటు విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ : కేసీఆర్ పతనం చూడటమే లక్ష్యమని మాజీమంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత ఆయన మెదటిసారిగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నరసింహులు తీవ్ర విమర్శలు చేశారు. కేసీర్‌ను ఎనిమిదో నిజాంతో పోల్చారు. ‘కేసీఆర్‌ను పదవి నుంచి దించేయాలని లక్ష్మీనరసింహ స్వామిని మొక్కుకున్నాను. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలకు బానిసలుగా బతికే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో దళితుల అభివృద్ధే నాకు ముఖ్యం. కేసీఆర్ సీఎం అయ్యాక.. నిరుద్యోగ సమస్య పెరిగింది. ఫీజు రీయింబుర్స్ మెంట్ అమలుచేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి కీర్తిప్రతిష్టలు పెరిగాయి. గతంలో 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచినందుకు.. దళితుడిగా గర్విస్తున్నాను’ అని అన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు చమరగీతం పాడటామికే మోత్కుపల్లి బీజేపీలో చేరారని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘రాష్ట్రంలోనే సీనియర్ నాయకుల్లో మోత్కుపల్లి ఒకరు. మోత్కుపల్లి సేవలు తెలంగాణ బీజేపీకి అవసరం. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటమే మా లక్ష్యం. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ హయాంలో మున్సిపాల్టీలు అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచాయి. రాష్ట్రం నిధులతో పాటు.. కేంద్ర నిధులను సైతం గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేట మున్సిపాలిటీలకు తరలించారు. టీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మజ్లిస్ కు ఓటు వేసినట్లే. ఎంఐఎం కోసమే ముగ్గురు పిల్లల నిబంధనను ఎత్తివేశారు.’ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ మోత్కుపల్లికి బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యంమని వ్యాఖ్యానించారు. బీజేపీ బలోపేతానికి మోత్కుపల్లి సేవలను ఉపయోగించుకుంటామన్నారు. -
బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇరువురు 15 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను షాకు మోత్కుపల్లి వివరించినట్టు సమాచారం. ఈ నెల 9న హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు. నియంతపాలనకు ముగింపు పలకండి బీజేపీలో చేరే విషయమై ముందుగా అమిత్ షాతో మాట్లాడాలన్న యోచన మేరకు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్టు మోత్కుపల్లి మీడియాకు తెలిపారు.ఈ భేటీ సందర్భంగా తాను చెప్పిన విషయాలను సాంతం విన్న అమిత్ షా తీరు సంతోషకరమన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకాలని షాను కోరినట్టు తెలిపారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని, అందుకే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పదవులపై తనకు ఆశలేదని, ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బదులి చ్చారు. బడుగు, బలహీన వర్గాలు, దళితుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మోత్కుపల్లి బీజేపీలో చేరిక పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
బీజేపీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి
న్యూఢిల్లీ : మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన మోత్కుపల్లి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. మోత్కుపల్లితో పాటు అమిత్ షాను కలిసిన వారిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ నాయకులు వివేక్ వెంకటస్వామి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, వీరెందర్ గౌడ్లు ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పరిస్థితులను లక్ష్మణ్ అమిత్ షాకు వివరించారు. కాగా, మరికాసేపట్లో మోత్కుపల్లి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కలవనున్నారు. గతంలో టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి.. ఆ పార్టీని వీడిన తరువాత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో సామాజిక న్యాయం లేదని కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్ఎస్లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన ఆ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిలు ఆయన ఇంటికి వెళ్లి.. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆయన నేడు బీజేపీలో చేరారు. పార్టీలో మంచి గౌరవం దుక్కతుందనే హామీ మేరకే ఆయన బీజేపీలో చేరినట్టుగా సమాచారం. -
నియంతలా వ్యవహరిస్తే పతనమే..!
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రవర్తన నిజాంను తలపిస్తోందని మాజీ మంత్రి మోత్కుపల్లి అన్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఆర్టీసీ కార్మికుల ఐకాస, విపక్షనేతల సమావేశం జరిగింది. కార్యక్రమం అనంతరం మాజీ మంత్రి మోత్కుపల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఇప్పటికే మోసం చేశాడని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనడానికి కేసీఆర్‌కు అర్హత లేదన్నారు. ఆర్టీసీ కార్మికులపట్ల కేసీఆర్ వ్యవహరిస్తున తీరు దుర్మార్గమరైనదన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మి సొంత ఆస్తులు పెంచుకొనే పనిలో కేసీఆర్ పడ్డాడని ఆరోపించారు. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎదుర్కొనేందుకు రాజకీయపార్టీలనీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై స్పందించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును సీఎం కేసీఆర్ గౌరవించి ఆర్టీసీ కార్మికులను వెంటనే చర్చలకు పిలవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అండగా విపక్షాలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొని, ఆర్టీసీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రేపటి నుంచి సమ్మెను మరింత ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు, జేఏసీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని తెలిపారు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ.. 65 నెలల కేసీఆర్ పాలనలో లక్షల కోట్లు అప్పులు తెచ్చుకున్నా.. ఆర్టీసీ అప్పులు మాత్రం చెల్లించలేక పోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని రమణ ఆరోపించారు. 65 నెలల కేసీఆర్ పాలనలో అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ అధ్యక్షుడు రమణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌నేత వీహెచ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే చివరి క్షణం వరకు కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
సమ్మెకు పూర్తి మద్దతు.. కేసీఆర్ గద్దె దిగాలి
-
‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్ సీఎం అయ్యేవాడా’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి తండ్రి లాంటి వారని.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా సీఎం గద్దె దిగి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాల్సింది పోయి.. వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హై కోర్టు చురకలంటించినా.. కేసీఆర్ తీరు మారకపోవడం బాధకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ చర్యలను గమనిస్తుందని.. అదును చూసి ఆయన పని పడుతుందని మోత్కుపల్లి హెచ్చరించారు. గవర్నర్ ఆర్టీసీ సమ్మెపై ఆరా తీస్తున్నారంటే.. కేసీఆర్ ప్రభుత్వానికి ఇబ్బంది మొదలయినట్లే అని తెలిపారు మోత్కుపల్లి. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను కూడా ఇలానే ఇబ్బంది పెట్టి ఉంటే.. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా అని ప్రశ్నించారు. పరిస్థితులు చేయి దాటకముందే.. మేల్కొంటే మంచిదని సూచించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మంచి పని చేశారని ప్రశంసించారు మోత్కుపల్లి. (చదవండి: ఆర్టీసీని నాకివ్వండి.. లాభాల్లో నడిపిస్తా!) -
కమలం గూటికి మోత్కుపల్లి?
సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాషాయం కండువా కప్పుకోబోతున్నారా.. అందుకు ముహూర్తం కూడా ఖరారైందా.. అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిస్థితులు. బీజేపీ రాష్ట్ర నాయకులు రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో మోత్కుపల్లి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం, మోత్కుపల్లి సుముఖత వ్యక్తం చేయడం, వెంటనే తన అనుచరులతో మంతనాలు జరపడం అందుకు బలా న్ని చేకూరుస్తున్నాయి. సాక్షి, యాదాద్రి : తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇతర పార్టీల్లో మంచి పేరుండి, జనబలం కలిగిన రాష్ట్ర స్థాయి నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును బీజేపీలోకి తీసుకురావడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని మోత్కుపల్లి నర్సింహులు ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై పరస్పరం చర్చించిన అనంతరం మోత్కుపల్లి బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నెల 25న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మోత్కుపల్లి ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా భారీ అనుచరగణంతో పార్టీలో చేరడానికి మోత్కుపల్లి సిద్ధం అవుతున్నారు. కార్యకర్తలు, తన అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. బీజేపీకి పెరగనున్న బలం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి ఆ«ంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన మోత్కుపల్లి నర్సింహులు.. తమ పార్టీలో చేరడం వల్ల లాభిస్తుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలు స్తోంది. మోత్కుపల్లి బీజేపీలో చేరితే మరో మారు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల కం అయ్యే అవకాశం లేకపోలేదు. మోత్కుపల్లి చేరికతో రాష్ట్రంలో బీజేపీకి అదనపు బలం చేకూరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబుపై ధ్వజం టీటీడీపీలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు తనకు గవర్నర్ పదవి వస్తుందని చంద్రబాబుహామీతో అప్పట్లో మూడేళ్లుకు పైగా ఎదురుచూశారు. గవర్నర్ పదవి ఇప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. పేదవాడిని కావడం వల్లే పదవులు రావడం లేదని ఆయన చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు.టీడీపీలో సామాజిక న్యాయం లేదని కోట్ల రూపాయలకు ఎంపీ టికెట్లు అమ్ముకున్నాడని ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, టీఆర్ఎస్లో విలీనం చేయాలని ఒకానొక సమయంలో సంచలన ప్రకటన చేశా డు. దీంతో గత ఎన్నికల ముందు మోత్కుపల్లిని టీడీపీ నాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించిం ది. అనంతరం మోత్కుపల్లి ప్రజావేదికను పునరుద్ధరించి చంద్రబాబు ఓటమి లక్ష్యంగా తనదైన శైలిలో పని చేశారు. అయితే ఒకానొక దశలో టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ప్రచారం ఎన్నికల ముందు జోరుగా సాగింది. అయితే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ మద్దతుతో ఆలేరులో పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలంగా మౌనంగా ఉన్నారు. మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశంను స్థాపించినప్పుడు మోత్కుపల్లి విద్యార్థి దశలోనే పార్టీలో చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రత్యేక కారణాలతో టీడీపీనుంచి టికెట్ రాకపోవడంతో 1989లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు, 1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుం చి బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అ నంతరం చోటు చేసుకున్న పరిణామాలతో 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004లో టీడీపీ తరఫున ఆలేరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2008లో మరోసారి ఆలేరులో జరిగిన ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2009లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓడిపోయారు. విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి.. మోత్కుపల్లి నర్సింహులు విద్యార్థి దశలోనే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరా రు. సుధీర్ఘకాలం పాటు ప్రజాప్రతినిధిగా పని చేశారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గనులు, వి ద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమం, టూరిజం శా ఖ మంత్రిగా వేర్వేరు సమయాల్లో పని చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ మోత్కుపల్లి నర్సింహులు ఓ వెలుగు వెలిగారు. -
చంద్రబాబు ఓడినందుకు శ్రీవారికి మొక్కులు చెల్లించా
-
‘చంద్రబాబు ఓడిపోవడమే ఎన్టీఆర్ లక్ష్యం’
సాక్షి, తిరుమల : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడమే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న మోత్కుపల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరాలని గతంలో అలిపిరి నుంచి మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. తను మొక్కును నెరవేర్చిన శ్రీవారికి ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా గురువారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కావలి అభివృద్ధికి మరింత శ్రమిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రం ఉన్నత స్థాయిలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయింది
-
ఎన్టీఆర్ ఘోష నెరవేరింది: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘోష నెరవేరిందని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి, నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ కూడా లాక్కున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఘోష ఇప్పుడు నెరవేరిందని, నిశ్చయ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్నారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఎలా చిత్తు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయిందన్నారు. ఏమాత్రం మనస్సాక్షి ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలన్నారు. జగన్ దేవుని దయతో గెలిచానని చెప్పడం ఎంతో సంతోషమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పేదలు, ఎస్సీ లు, బీసీ లకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ రాజకీయాలకు పోకుండా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తనకు కేసీఆర్‌కు ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆరేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎన్టీఆర్ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుంది
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రజలను ఎన్టీఆర్ ఆత్మ ఆవరించి చంద్రబాబును ఓడించిందని, ఇప్పుడు ఆయన ఆత్మ నిజంగా శాంతిస్తుందని టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వల్లనే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాయని మండిపడ్డారు. తనను నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు తన ఉసురే తగిలిందని చెప్పిన మోత్కుపల్లి.. చంద్రబాబును ఓడించిన ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. -
నువ్వు పెద్ద కొడుకువి కాదు .. పెద్ద తాతవి
హైదరాబాద్: ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుంటానంటూ సీఎం చంద్రబాబు ఏపీ ప్రజల్ని మరోసారి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నాడని, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు పెద్ద కొడుకెలా అవుతాడని, పెద్ద తాతవుతాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. అణగారినవర్గాల ప్రజలకోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంపార్టీని దొడ్డిదారిన హస్తగతం చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు. టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ప్రకటించిన సమయంలో చంద్రబాబు లేడని, కనీసం పార్టీ సభ్యుడు కూడా కాదని, పార్టీ జెండా మోయకుండానే అదే పార్టీని అడ్డం పెట్టుకుని అధికారం అనుభవిస్తున్నాడని దుయ్యబట్టారు. కాళ్లు మొక్కి గాంధీని చంపిన గాడ్సే కంటే నీతి మాలిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. నాలుగున్నరేళ్లు మోదీతో అంటకాగి, హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అని లేఖ కూడా ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదాకోసం తానే పోరాడుతున్నట్లు కలరింగ్ ఇస్తున్నాడని దుయ్యబట్టారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే తప్పేంటని, 30 ఏళ్ల రాజకీయ అనుభవమున్న దళితనేతగా తాను చెబుతున్నానని, కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏకమై జగన్‌ను గెలిపించి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. లక్షల కోట్లు సంపాదించుకున్న దొరకని దొంగ చంద్రబాబు అని, ఆయన నిజాయతీపరుడైతే 29 కేసుల్లో విచారణపై స్టే ఎందుకు తెచ్చుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణ నుంచి పోవడంతో తెలంగాణకు శని పోయిందని, ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా చంద్రబాబును ఓడించి శని వదిలించుకోవాలన్నారు. అధికారం చేజిక్కించుకోవడానికి ఎటువంటి పనులకైనా వెనకాడని దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు ఓటమి కోసం 3700 మెట్లు ఎక్కి తిరుమల శ్రీవారికి దండం పెట్టుకున్నానని, ఏప్రిల్‌లో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్నానని, అమ్మవారి చేతిలోని ఖడ్గంతో ఈ రాక్షసుడికి రాజకీయ సమాధి కట్టాలని వేడుకుంటానన్నారు. చంద్రబాబు ఓడిపోవడమే ఎన్టీఆర్ ఆశయమని, ఆ ఆశయం కోసమే బతుకుతున్నానన్నారు. -
మోత్కుపల్లికి తీవ్ర అస్వస్థత
సాక్షి, ఆలేరు: టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని తట్టుకోలేక ఇటీవల టీడీపీ నుంచి మోత్కుపల్లి బయటకు వచ్చారు. పలు సందర్భాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. చంద్రబాబు మోసకారి, దుర్మార్గుడు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దొంగతనాలను బయటపెడతాననే తనపై కక్ష కట్టారని, తనకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారు
-
నా పైనే దాడి చేస్తారా?
సాక్షి, యాదాద్రి: ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు, డీసీసీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్‌ల ప్రచారంలో తలెత్తిన ఘర్షణ వివాదాస్పదమైంది. అసలు ఏం జరిగింది? బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి తన అనుచరులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ యాదగిరిగుట్ట మండలంలో చేపట్టిన బైక్ ర్యాలీ మల్లాపురంలో మోత్కుపల్లి ప్రచారానికి ఎదురుపడింది. ఈ సమయంలో ఇరువురు పరస్పరం అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే టవేరా వాహనం మోత్కుపల్లి ప్రచార వాహనాన్ని తాకడంతో అక్కడ వివాదం తలెత్తింది. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు తన ప్రచారాన్ని అడ్డుకుని తనపై దాడి చేశారని మోత్కుపల్లి రోడ్డుపై బైఠాయించారు. నాపై దాడి చేస్తారా అంటూ మోత్కుపల్లి కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నాయకుడు కర్ర వెంకటయ్య తన అనుచరులతో వచ్చి మోత్కుపల్లికి సంఘీభావం తెలిపారు. రాస్తారోకో చేస్తున్న మోత్కుపల్లిని ఆందోళన విరమించాలని యాదగిరిగుట్ట ఏసీపీ మనోహర్‌రెడ్డి కోరారు. భిక్షమయ్యగౌడ్‌ను అరెస్టు చేస్తేనే ఆందోళన విరమిస్తానని భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు మోత్కుపల్లిని అరెస్టు చేసి తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తుర్కపల్లి పీఎస్‌లోనూ మోత్కు పల్లి దీక్ష కొనసాగించారు. భిక్షమయ్యగౌడ్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కుపల్లిపై జరిగిన దాడిని నిరసిస్తూ గోదావరి నదీ జలాల సాధన సమితి బుధవారం ఆలేరు బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్ తెలిపారు. దాడి జరగలేదని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ స్పష్టం చేశారు. భిక్షమయ్యను అరెస్ట్ చేయాలి: మోత్కుపల్లి ‘‘ఎన్నికల ప్రచారంలో ఉన్న నాపై దాడికి కారకుడైన భిక్షమయ్యగౌడ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి. నాపై కావాలనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ అండ చూసుకుని మల్లాపురంలో ప్రచారాన్ని అడ్డుకున్నారు. నా వాహనాన్ని ఢీ కొట్టారు. చేయి చేసుకున్నారు. నియోజకవర్గంలో నాకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భిక్షమ య్యగౌడ్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు’’. ఒప్పందం బయటపడింది: భిక్షమయ్యగౌడ్ ‘‘టీఆర్ఎస్ పార్టీతో మోత్కుపల్లి నర్సింహులు కుదుర్చుకున్న ఒప్పందం బయటపడింది. నా వాహనం మోత్కుపల్లి వాహనానికి తాకినా, నేను ఆయనను తిట్టినట్లు తేలినా రాజకీయాలను వదిలిపెడతా. నేను అనుమతి తీసుకుని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాను. ప్రచారంలో భాగంగా ఇద్దరం మల్లాపురంలో ఎదురుపడ్డాం.. పరస్పరం అభివాదం చేసుకున్నాం. నాపై ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.’’ భిక్షమయ్యగౌడ్‌పై అట్రాసిటీ కేసు తుర్కపల్లి: మోత్కుపల్లి ఫిర్యాదు మేరకు భిక్షమయ్య గౌడ్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 279, 504, 506, 143 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐ ఆంజనేయులు తెలిపారు. దాడిని ఖండిస్తున్నాం: బీఎల్ఎఫ్ సాక్షి,హైదరాబాద్: బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ప్రచార యాత్రపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ నల్లా సూర్యప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం అన్నారు. -
మోత్కుపల్లి శంఖారావం
సాక్షి, యాదాద్రి : జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘట్టానికి నేడు తెరలేవబోతోంది. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై, మంత్రిగా పని చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు రానున్న ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ని లిచేందుకు సన్నద్ధం అవుతున్నాడు. అందులో భాగంగా ‘మోత్కుపల్లి శంఖారావం’ పేరుతో గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తుండడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించడమే ప్రధాన ఎజెండాగా మోత్కుపల్లి నిర్వహించనున్న బహిరంగసభను అన్ని రాజకీయ పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. యాదాద్రీశుడి చెంతనుంచి ఎన్నికల నగారా ఎన్నికల ముందు భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా నియోజకవర్గంలో తన సత్తా చాటాలనే పట్టుదలతో మోత్కుపల్లి ఉన్నారు. శాసనసభకు జరగనున్న ముందస్తు ఎన్నికల బరిలో తాను ఉం టానని ఇప్పటికే మోత్కుపల్లి ప్రకటించారు. యాదాద్రీశుడి చెంతనుంచి ఎన్నికల నగారా మోగించబోతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మోత్కుపల్లి.. శంఖారావం సభతో సత్తా చాటా లని సంకల్పంతో ఉన్నారు. 10వేల మందితో సభ సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రజలతో మమేకం.. రాజ్యసభ, గవర్నర్ పదవుల పేరుతో టీడీపీ అధి నేత చంద్రబాబునాయుడు తనను మోసం చేశాడని ఆయనపై తిరుగుబాటు జెండాను ఎగురవేసి సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించాలన్న తపనతో ఉన్నారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, మరోమారు ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఆలేరు అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ఇవే నా చివరి ఎన్నికలని మోత్కుపల్లి కొంత కాలంగా నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి ఐదు పర్యాయాలు, తుంగతుర్తి నుంచి ఒక దఫా మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను మరోసారి ఆలేరు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న ధీమాతో మోత్కుపల్లి ఉన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు కోరుతున్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసిన ఆలేరు ప్రజలు తనను ఐదు సార్లు గతంలో ఆశీర్వదించారని మరో మారు ఆశీర్వదించే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. గ్రామగ్రామాన పర్యటనలు నెల రోజులుగా ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మోత్కుపల్లి పర్యటిస్తున్నారు. తపాస్‌పల్లి జలాలు ఆలేరు నియోజకవర్గానికి అందించా లని టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర, ఆ లేరు పట్టణంలో మూసిన రైల్వేగేట్ తెరిపించడంలో తాను చేసిన పోరాటం, యాదాద్రి జిల్లా ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు,మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధిలో తన పాత్రను వివిరిస్తున్నాడు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇందుకోసం గుట్టలో నేడు నిర్వహించే శం ఖారావం సభద్వారా ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నానన్న సంకేతాలు పంపనున్నారు. చంద్రబాబునాయుడు మోసం చేశాడు చంద్రబాబునాయడు నన్ను అన్ని విధాలుగా మోసం చేశాడు. రాజకీయంగా నాశనం చేయడానికి ప్రయత్నించాడు. కానీ, ఆలేరు నియోజకవర్గ ప్రజలు తనను ఇండిపెండెట్‌గా గెలిపించుకుంటా మని ప్రతిజ్ఞ చేస్తున్నారు. రాజ్యసభ, గవర్నర్ ఇవ్వాలని ఏనాడూ ఏ నాయకుడిని నేను వేడుకోలేదంటున్నాడు మోత్కుపల్లి. ఆ రెండు పదవుల్లో ఏ పదవి వచ్చినా ఆలేరు, భువనగిరి ప్రాంతా లను బ్రహ్మాండగా అభివృద్ధి జరిగేది. ఆలేరు అసెంబ్లీ స్థానంనుంచి పోటీ చేయాలని వేలాది మంది తరలివచ్చి గుట్టలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి. గోదావరి జలాల సాధనే నా జీవితాశయం. -
చంద్రబాబు నాకు ద్రోహం చేశారు
యాదగిరిగుట్ట (ఆలేరు): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనకు తీరని ద్రోహం చేశారని, ఓ వ్యక్తిని రాజకీయంగా వాడుకొని వదిలేయడంలో బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గతంలో తనకు గవర్నర్, రాజ్యసభ అభ్యర్థి పదవి ఇస్తానని మాటలు చెప్పి ప్రజల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తన బతుకుని బజారులో పడేసి, ఆయన మాత్రం సుఖంగా ఉన్నారని, చంద్రబాబును నమ్మినందుకు గొంతు కోసినంత పని చేశారని ఉద్వేగంగా పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఆలేరు ప్రజలు అండగా ఉన్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ సీటు నుంచి పోటీలో ఉంటానని తెలిపారు. -
గుండె బద్దలవుతోంది: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో తన గుండె బద్దలవుతోందని టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కన్నీటి పర్యంతమయ్యారు. హరికృష్ణ నివాసంలో ఆయన భౌతికకాయనికి నివాళులర్పించిన అనంతరం ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని మోత్కుపల్లి మీడియాతో పంచుకున్నారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు 1982లో హరికృష్ణను తొలిసారి కలిసానని గుర్తు చేసుకున్నారు. దివంగత నేత ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లినపుడు హరికృష్ణ అక్కడే ఉన్నారని, ఆ సందర్భంగా కలిసానన్నారు. ఆనాడు నీతికి అవినీతికి జరిగిన ప్రజాసంరక్షణ పోరులో ఎన్టీఆర్ మార్పు కోసం తలపెట్టినటువంటి యుద్దంలో రథసారధిగా ఉన్న మహానాయకుడు హరికృష్ణ అని మోత్కుపల్లి కొనియాడారు. రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్న అప్పటి పరిస్థితుల్లో కొన్ని వేల కిలోమీటర్లు రథాన్ని నడిపించి ఎన్టీఆర్‌గారి విజయానికి కృషి చేశారన్నారు. ఏ యుద్దానికైనా రథసారధి కావాలని, అలాంటి రథసారధి హరికృష్ణేనని తెలిపారు. తమంతా ఎమ్మెల్యేలు, మంత్రులు కావడానికి కారణం ఎన్టీఆర్ అని, ఆయనకు మద్దతుగా నిలిచింది మాత్రం హరికృష్ణ అని తెలిపారు. అన్ని రకాలుగా ఎన్టీఆర్‌ను మెప్పించారన్నారు. అలాంటి నేత మరణం బాధను కలిగిస్తోందన్నారు. వాహనం నడపాల్సింది కాదు.. ఈ వయసులో ఆయన వాహనం నడపాల్సింది కాదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ఏ మానసిక ఒత్తిడికి లోనయ్యాడో.. ఏ దురదృష్టం వెంటాడిందో పాపం అంటూ మోత్కుపల్లి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇటీవల కుమారుడు కూడా మరణించాడని, అదే బాధతో ఉండి ఉంటాడని చెప్పారు. రాజకీయాల్లో కూడా కొంచెం వెనకకు జరిగినట్లు తెలుస్తోందని, దీంతోనే ఆయనకు మానసిక ఒత్తిడి నెలకున్నట్లు అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, శోకసంధ్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘రాజకీయం అస్సలు వంటబట్టేది కాదతనికి’ -
దొరకని దొంగ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నమ్మకద్రోహి అనే అభిప్రాయం బలపడిపోయిందని, 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ చేతిలో టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం నూటికి రెండువందల శాతం ఖాయమని టీడీపీ మాజీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రజల హృదయాల్లో చంద్రబాబుకు స్థానం లేకుండా పోయిందని, ఎన్టీఆర్ తాను చనిపోయేముందు బాబు మోసగాడు, నమ్మొద్దు అని ఎలాగయితే చెప్పారో అది ఇవ్వాళ కూడా ఏపీలో నిజం కాబోతోందని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనే దొరకని దొంగ చంద్రబాబే అంటున్న నరసింహులు అభిప్రాయం ఆయన మాటల్లోనే... తెలంగాణకు బాబు మద్దతు నేపథ్యం ఏమిటి? 2004లో 2009లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. 2009 నాటికి తెలంగాణ ఉద్యమం బలం పుంజు కుంది. దాన్ని గ్రహించే బాబు తెలంగాణ ట్రంప్ కార్డు తీశారు. తెలంగాణపై మీరు తీర్మానం పెట్టండి నేను సపోర్టు చేస్తాను. తీర్మానం చేసే దమ్ము మీకుందా అని బాబు కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ చేశాడు. బాబు ఇలా దమ్ముందా అని ఎప్పుడైతే సవాల్ చేశాడో సోనియాగాంధీ అదే అదునుగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించేసింది. కానీ లోపల మాత్రం తెలంగాణ రాదని బాబుకు బలంగా ఉండేది. మనమెన్ని సవాళ్లు చేసినా వాళ్లు తెలంగాణ ఇవ్వడం జరిగేది కాదని బాబు నమ్మకం. తెలంగాణ ఎక్కడొస్తుంది, కానీ మనం పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిం చాలి అని బాబు చెబుతుండేవాడు. కానీ సోనియా అక్కడ ప్రకటించగానే ఒక్కసారిగా బాబు యూటర్న్ తీసుకున్నాడు. ఇదెలా ఇస్తారు మధ్యరాత్రి ఎలా ఇస్తారు అంటూ రివర్స్ అయ్యాడు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొత్తంగా బాబు వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది. టీడీపీ వ్యతిరేక ఉద్యమమే తెలం గాణ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమని టీడీపీ డిమాండ్ చేసినా జనం నమ్మలేదు. బాబు వైఖరి గమనించే టీడీపీ ప్రభుత్వంలో గతంలో పనిచేసిన ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మేల్యే కానీ, నాయకులు కాని తెలంగాణ ఉద్యమకాలంలో బాబు దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోలేదు. బాబే స్వయంగా నాతో చెప్పాడు. తెలంగాణలో ఏ ఒక్క టీడీపీ నేతా నావద్దకు రాలేదు చూశావా నర్సింహులూ అని బాధపడ్డాడు బాబు. దానికి నేను ఒకే మాట చెప్పా. ‘బయట మిమ్మల్ని ఎవరూ నమ్మలేదండి’ అనేశాను. ఆత్మను అమ్ముకుని బతికే దొంగ బాబు. తనను నమ్మకండి అని ఎన్టీఆరే చివరిదశలో లోకానికి చెప్పారు. అందుకే బాబు ముందు డేర్‌గా అనేశాను. మిమ్మల్ని ఎవరూ నమ్మటం లేదు. ఒకవేళ నమ్మటం అంటూ జరిగితే వారి గొంతు కోసేంతవరకు మీరు ఊరుకోరు అని కూడా అనేశాను. బాబు మాట ఇస్తే నిలబడతాడు అనే విశ్వసనీయతను నా విషయంలో కూడా కోల్పోయాడు. నా విషయంలో బాబు చేసిందానికి నష్టం నాకు కాదు, బాబు విశ్వసనీయతే గంగలో కలిసింది. ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్ర? బాబులో ఏమూలైనా విశ్వసనీయత అనేది ఉండి ఉంటే ఓటుకు కోట్లు కేసుతో అది పూర్తిగా పోయింది. ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తారా, డబ్బులతో కొంటారా, ఇంత అన్యాయమా అని బాబును సామాన్యుడి నుంచి మేధావుల దాకా అందరూ ఏవగించుకున్నారు. ఆ ఘటనలో టీడీపీ పరువు మొత్తం పోయింది. ఏంపీలు, ఎమ్మెల్యేలు, కేడర్, ప్రజలు బాబు నిర్వాకంపై దుమ్మెత్తి పోశారు. అంత నిరనస, వ్యతిరేకత వచ్చింది కాబట్టే దొంగలాగా ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయాడు. తెలంగాణలో ఏ ఒక్కరికీ అంటే నాయకులకూ, కేడరుకు, ప్రజలకు చెప్పకుండా అమరావతికి పారిపోయాడు. పైగా మోదీ దగ్గరకు పరుగెత్తాడు. తిరుపతి లడ్డు, శాలువా పట్టుకెళ్లి కప్పి కాపాడు అంటూ మోదీ కాళ్లమీద పడ్డాడు. బ్రహ్మదేవుడు కూడా నిన్నిక కాపాడలేడు బాబూ అని కేసీఆర్ ఎప్పుడయితే దేవరకొండలో ప్రకటించాడో అప్పుడే బాబులో భయం పట్టుకుంది. రక్షకుడు మోదీనే అని ఢిల్లీ పరుగెత్తాడు. ఆ తర్వాత తప్పయిపోయిందని కేసీఆర్ ముందు సాగిలబడితే అప్పుడు కేసీఆర్ క్షమించాడు. ఇదీ బాబు బతుకు. ఓటుకు కోట్లు కేసుతో నా జీవితంలో రెండు రాత్రులు నిద్రపోలేదు అని బాబు పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలు మీడియాలోనూ వచ్చేశాయి. బాబును చివరిదాకా మీరు సమర్థిస్తూ వచ్చారే? దొంగయినా, లంగయనా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాయకుడిని ఎంతో కొంత కాపాడాలి కదా. అందుకే ప్రెస్ కాన్ఫరెన్సులు బంద్ చేశాను. ఇక రేవంత్ కేసు విషయంలో బాబునే నేరుగా అడిగేశాను. తప్పో రైటో కానివ్వండి. ఆ వాయిస్ మీదే కదా.. మా అభ్యర్థి గెలవాలి. అందుకే అలా మాట్లాడాను. తప్పేముంది, ఆ వాయిస్ నాదే అని చెప్పి ఉంటే బాగుం డేది కదా అని అడిగాను. ‘నాదే అని చెబితే వేరే పరిణామాలు ఉంటాయి నరసింహులూ’ అన్నాడు బాబు. తప్పు రేవంత్ రెడ్డిది మాత్రమే అయితే బాబు మరుక్షణంలో రేవంత్‌ను సస్పెండ్ చేసేవాడు. కానీ ఈయన కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి కిమ్మనకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత తెలంగాణ కాబోయే సీఎంగా రేవంత్‌ని పైకి లేపాడు బాబు. మా పార్టీ మొత్తానికి అదే మెసేజ్ వెళ్లిపోయింది. రేవంత్ ఓటుకు కోట్లకేసులో ఎక్కడ అప్రూవర్ అయిపోతాడేమో అనే భయంతో బాబు రేవంత్‌కి లొంగిపోయాడు. రేవంత్ స్టీఫెన్సన్ ముందర డబ్బు పేరుస్తూ మా బాస్ అనే మాట ప్రస్తావించాడు కదా. ఎవరండీ ఆ బాస్. బాబు కాదా. ఈరోజుకీ లోకేశ్ పొద్దున నిద్రలేచింది మొదలు పదిసార్లు రేవంత్ రెడ్డికి పోన్ చేస్తాడు. ఇక బాబు ఏదో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు ఇప్పటికీ. ఈ కేసును పైకి తీస్తే ఏమవుతుందో, రేవంత్ ఏం మాట్లాడతాడో అనే భయం ఇప్పటికీ బాబును వెంటాడుతోంది. ఈసారి ఏపీలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు? ఆంధ్రప్రజలకు నిజంగా ఏమాత్రం అలోచన ఉన్నా, చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలి. ఊర్లలోకి రానీయవద్దు. నాలుగేళ్లు బీజేపీ పార్టీతో అంట కాగిన బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజేపీ అంటున్నాడు. ప్రత్యేకహోదా వద్దు అన్న బాబుకు ఇవాళ ప్రత్యేకహోదా గురించి మాట్లాడే హక్కే లేదు. పైగా బాబు సీఎంగా ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేకహోదా రాదు. ఏపీ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకహోదా తీసుకొచ్చే దమ్ము వైఎస్ జగన్‌కి మాత్రమే ఉంది. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2AdOL2a https://bit.ly/2Oa7hLU -
మోత్కుపల్లి నర్సింహూలుతో మనసులో మాట
-
ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకూ బాబు వెన్నుపోటు!
సాక్షి, హైదరాబాద్ : పత్ర్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కానని, చంద్రబాబు పతనం కోసం కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. మెట్టు మెట్టుకి చంద్రబాబు ఓడిపోవాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా కపటం, నాటకం, దగా మోసాలేనని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో ఏపీకీ హోదా ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా అని, టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై ఎవరైనా కలిసొచ్చారా అని ప్రశ్నించారు. దివంగత నేత ఎన్టీఆర్ జెండాను చంద్రబాబు దొంగతనం చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పారని మోత్కుపల్లి గుర్తు చేశారు. బాబు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఆయన ఎన్టీఆర్కే కాదు.. ఆంధ్రులకు వెన్నుపోటు పోడిచారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చాలా సార్లు హోదాపై బాబును ప్రశ్నించారని, హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు. అవినీతి కప్పిపుచ్చుకోవడానికే.. చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన అవినీతిని, దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. బాబు మోసాలపై అందరూ తిరగబడాలని, ప్రజల కోసం రాజకీయాలు చేయడం లేదని, తన కోసం, తన కుటుంబం కోసం రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఫైర్ అయ్యారు. మోసగాడు, అబద్దాల కోరు చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలన్నారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని ఆ జాతినే అవమానించారని, అంబేడ్కర్ ఆలోచనా విధానాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా బాబు ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు. అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వెన్నపోటు పొడవడంలో, మోసాలు చేయడంలో ఆయనను మించిన సీనియర్ లేరని తెలిపారు. కులాలరహితంగా ఏకమై చంద్రబాబుపై పోరాటం చేయాలని, తగిన గుణపాఠం చెప్పాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. -
‘ఆయన గాడ్సే కంటే దుర్మార్గుడు’
సాక్షి, తిరుపతి : మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదంటూ ఆరోపించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న మోత్కుపల్లి తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మహానేత ఎన్టీఆర్ గుర్తురారని, నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకుండా చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు బతికిపోయాడు.. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బతికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాలుపెట్టిన ప్రాంతం నాశనమేనని చెప్పారు. తాను పెద్ద మాదిగ అని చెప్పిన చంద్రబాబు నోటివెంట దళితుల మాటే లేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జీలు ఎందుకు కాకుడదో చెప్పాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. దళితుడ్ని కాబట్టే నన్ను అవమాన పరిచాడని.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ మండిపడ్డారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి రేవంత్‌ను సస్పెండ్ చేయలేదని అభిప్రాయపడ్డారు. జీవితం అంతా నీ కోసం త్యాగం చేశాను, మరి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశావ్ అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే చెప్పాలని, ముక్కును నేలకు రాసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. -
నా ప్రాణం పోయినా బాగుండేది: మోత్కుపల్లి
సాక్షి, తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న మాటలకు తన ప్రాణం పోయినా బాగుండేదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి ఆయన కాలిబాటలో పాదయాత్రగా బయలు దేరారు. కొద్దిసేపటి తర్వాత కాలిబాటలో ఆయన స్వల్ప అస్వస్థకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం కోలుకున్న ఆయన పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనను అవమాన పరిచారని, ప్రజల ముందు అవహేళన చేశారని వాపోయారు. దళితులకు సేవ చేయటానికే తప్ప.. తనకు వేరే ఆలోచన లేదని మోత్కుపల్లి తెలిపారు. కానీ చంద్రబాబు కులాన్ని అడ్డుపెట్టుకుని దూషించారని పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన దానికి దేవుని వద్ద తన గోడును వినిపించుకుంటానని అన్నారు. తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాలిబాటలో అనారోగ్యానికి గురై బీపీ పెరిగి.. గుండె నొప్పిగా ఉన్న పాదయాత్ర ఆపలేదని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. -
బాబు నమ్మక ద్రోహి.. కేసీఆర్ నా మిత్రుడు
-
చంద్రబాబుపై మోత్కుపల్లి మరోసారి ఫైర్
సాక్షి, తిరుపతి : తెలంగాణ తెలుగుదేశం మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు మరోసారి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్టీ రామారావు తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన దయతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గుడని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయంలో తాను అండగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్నేహితుడని అయినా కూడా చంద్రబాబును వెనుకేసుకొచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున తనను బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మొదటి ముద్దాయి అని అన్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన రాజకీయ అసమర్ధుడు బాబు అని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలను దోచుకోవడం చంద్రబాబుకు అలవాటని, అందుకే సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లకు ఎంపీ పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు. పదవులు ఇస్తానని మభ్యపెట్టడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని, గాలి ముద్దుకృష్ణమ నాయుడును మానసిక క్షోభకు గురిచేసి చంపారని విమర్శించారు. ఏపీ ప్రజలు కష్టాలు పడుతుంటే, చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్, కుటుంబం మాత్రమే సంతోషంగా ఉన్నారని దుయ్యబట్టారు. తనకు ఎదురు తిరిగిన వారిని బెదిరిస్తాడని లేకపోతే వారిని అంతమొందిచే వరకూ నిద్రపోడని విమర్శించారు. తనను కూడా పోలీసులు ద్వారా బెదిరించారని, అయినా తాను ఏమాత్రం భయపడనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని స్వామిని కోరుకుంటానని చెప్పారు. -
నా ప్రాణాలకు ముప్పు ఉంది: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని ఏపీ సీఎం చంద్రబాబు సర్వనాశనాలకు నిలయంగా మార్చారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తక్కువ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని అని మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని విమర్శించారు. దళిత తేజం పేరుతో దళితుల ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్నారని, దళితులను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. నెల్లూరు దళిత తేజం సభలో దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు. ముద్దు కృష్ణమనాయుడిని తాను ముఖ్యమంత్రి అయ్యే వరకు చంద్రబాబు వాడుకున్నారని, కానీ సీఎం అయ్యాక గాలికొదిలేశారని విమర్శించారు. నేనేంటో చంద్రబాబుకు తెలుసు. దారినపోయే దానయ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాల్సిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కోరుతున్నాను. చంద్రబాబు ముఖం చూసి ఓటేసిన వాళ్లు లేరు. చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా.. జూలై 11వ తేదీన నా జన్మదినం. ఆ రోజున తిరుపతి వెళ్తా. చంద్రబాబు ఓడిపోవాలని వెంకన్నకు మొక్కుతా. చంద్రబాబు దళితుల ద్రోహి. సీఎం రమేష్‌లా దీక్ష చేస్తే ఏడాదిపాటు చేయొచ్చు. 11 రోజులైనా అలసిపోకుండా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నాడు. దొంగ దీక్ష చేస్తున్నాడు కాబట్టే.. టీడీపీ ఎంపీలు చులకనగా మాట్లాడారు. ఉక్కు రాదు.. తుక్కు రాదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కరెక్ట్‌గా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఘోరీ కట్టడం ఖాయం. చంద్రబాబు మోసగాళ్లకే మోసగాడు. చంద్రబాబు ఓడిపోతే నాకు అన్ని పదవులు వచ్చినట్లే. చంద్రబాబుకు తప్పకుండా దళితుల ఉసురు తగులుతుందన్నారు. చంద్రబాబు ఏనాడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని అడగలేదు. హోదా కావాలని అడిగే నైతికహక్కు చంద్రబాబు కోల్పోయారు. హోదా కోసం పోరాడుతుంది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వామపక్షాలు. నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబులాంటి నీచ రాజకీయ నేతలను చూడలేదు. చంద్రబాబు లాంటి నీచుడు రాజకీయాల్లో ఉండొద్దని దివంగత నేత ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. టీడీపీలో చంద్రబాబు కంటే నేనే సీనియర్. చంద్రబాబు హృదయం లేదని బండరాయి. నేను ఏడిస్తే ఒక్కసారైనా వచ్చి ఓదార్చారా.. ? నన్ను విజయసాయిరెడ్డి సహా అన్ని పార్టీల వాళ్లు ఓదార్చారు. చంద్రబాబుకు ధైర్యముంటే కేసులన్నింటినీ రీ ఓపెన్ చేసుకోవాలి. చంద్రబాబు దొరకని దొంగ అంటూ తీవ్రస్థాయిలో ఏపీ సీఎంపై మోత్కుపల్లి విమర్శలు చేశారు. మాల-మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు.. రాజకీయాల్లో చంద్రబాబులాంటి చీడపురుగులను తరిమేయాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నా. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు. ప్రజల డబ్బును భోగభాగ్యాల కోసం వాడుకుంటున్నావ్. చంద్రబాబు నన్ను మానసికంగా చంపేశాడు. చంద్రబాబుకు మతిమరుపు, పిచ్చి రోగం వచ్చింది. సీఎంగా ఉండే అర్హత ఆయనకు లేదు. చంద్రబాబును ఓడించాలని ఎన్టీఆర్‌గారి కోరికతో పాటు నా కోరిక కూడా. గుమ్మి కింద పందికొక్కుల్లాగా రాష్ట్రాన్ని తండ్రీకొడుకులు దోచుకుతింటున్నారు. పెద్ద మాదిగను అని చెప్పుకుని ఏబీసీడీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఎమ్మార్పీఎస్ జెండా కప్పుకున్నా కూడా విభజన ఎందుకు చేయలేదు. ఒకసారి మాలను అంటావు.. మరోసారి మాదిగనంటావు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టావ్. నాయీ బ్రాహ్మణులపై మీరు ఎందుకు కక్షకట్టారు. వాళ్లు చేసిన పనిలో వచ్చిన ఆదాయంలో 25 శాతం ఎందుకివ్వవు. బీసీలు జడ్జీలుగా పనికిరారని రిపోర్ట్లు పంపిస్తావ్. రాజకీయ అవసరాలకు వాడుకుని ఎవరినీ ఎదగనీయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదు వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. చంద్రబాబు 100 రూపాయల పనిచేసి వెయ్యి రూపాయల ప్రచారం చేసుకుంటున్నారు. దళితులను పార్టీలోంచి తీసేస్తున్నారు. చింతమనేని మహిళా ఎమ్మార్వోను కొట్టినా చర్యలు లేదు. వేలకోట్ల రూపాయాల ఇసుక అక్రమ రవాణా చేసినా చింతమనేనిని చంద్రబాబు ఏమనరు. మాలమాదిగలు ఉద్యమాలు చేస్తే గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది. తప్పు చేయకున్నా తనను పార్టీకి దూరం చేసిన దొంగ చంద్రబాబు. ఆయన దళిత తేజం కాదు.. దళితులకు వ్యతిరేకంగా ఆలోచిస్తూ దొంగమాటలు మాట్లాడే వ్యక్తి చంద్రబాబు. నన్ను బహిష్కరించే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు. చంద్రబాబును వదిలిపెట్టేది లేదు. నువ్వు, ఈన కొడుకూ తప్ప రాష్ట్రంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా. గతంలో తెలంగాణ ప్రజలు చంద్రబాబును తన్ని తరిమేశారు. ఇప్పుడు ఏపీ ప్రజలు తన్ని తరియేయడానికి సిద్ధంగా ఉన్నారు. దళితులను దుర్భాషలాడిన ఆదినారాయణరెడ్డిని తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలని’ మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుతా..
-
చంద్రబాబును చిత్తుగా ఓడించాలి
సాక్షి, హైదరాబాద్: దళితులకు పదవులు రాకుండా అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి, తెలంగాణలో టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. నమ్మిన వాళ్ల గొంతు కోసే నమ్మక ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో దళితులు, అన్ని రాజకీయ పక్షాలు కలిసి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో మోత్కుపల్లి నర్సింహులును ఆయన నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని నర్సింహులు ఈ సందర్భంగా వివరించారు. ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నావ్ ‘‘చంద్రబాబూ.. నీకు చేతనైతే సొంతంగా పార్టీ స్థాపించి, ఎన్నికల్లో గెలిచి చూపించు. కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు. ఎవరబ్బ సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు పెట్టావ్. పార్క్ హయత్ హోటల్లో రూ.7 లక్షల బిల్లు కట్టావు, ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్తున్నావు. ఇదంతా ఎవరి సొమ్మని ఖర్చు చేస్తున్నావ్? రూ.లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా సంపాదించావు. ఇది నిజం కాదా? నారా లోకేశ్ కూడా అక్రమంగా సంపాదిస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం సహించను. నన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తే పరామర్శించడానికి కొందరు వైఎస్సార్సీపీ నేతలు వస్తున్నారు. వీలైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి పాదయాత్రలో పాల్గొంటా. జగన్ వెంట నడుస్తా. వీలైతే సభల్లో ప్రసంగించి, చంద్రబాబును ఓడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతా. ఈ వారంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తా. చంద్రబాబును ఓడించాలని, అతడు రాజకీయాల్లో ఉండకుండా చూడాలని వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తా. తర్వాత జగన్మోహన్రెడ్డిని కలుస్తా’’అని మోత్కుపల్లి చెప్పారు. అన్ని కులాలపై జగన్ కుటుంబానికి ప్రేమ ‘‘దళితులంటే వైఎస్ జగన్ కుటుంబానికి ఎనలేని ప్రేమ, గౌరవం. ఈ కులం, ఆ కులం అనే తేడా లేకుండా అన్ని కులాల వారిని వైఎస్ కుటుంబీకులు గౌరవిస్తారు, అక్కున చేర్చుకుంటారు. చంద్రబాబు పతనం కోసం అన్ని పార్టీలూ ఏకమై పోరాడాలి. పవన్ కల్యాణ్‌ను వాడుకొని వదిలేశాడు. ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశాడు. ఓటుకు కోట్లు కేసులో ఫోన్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదే. బాబుకు నిజంగా ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి. చంద్రబాబుకు పిచ్చి రోగం వచ్చింది. లోకేశ్‌ను తప్ప పార్టీలో ఇంకెవరినీ గుర్తుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. ఇతరులు అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం. దళితుల మధ్య విద్వేషాలు సృష్టించింది చంద్రబాబు కాదా? దళిత సోదరులంతా ఏకమై బాబును ఓడించాలి’’అని నర్సింహులు పిలుపునిచ్చారు. బాబు నైజం అదే: విజయసాయిరెడ్డి దళిత నేత మోత్కుపల్లిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయడం దారుణమని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన మోత్కుపల్లి నర్సింహులును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవసరానికి ఉపయోగించుకొని, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అదే ఆయన నైజమని పేర్కొన్నారు. దళితుల పట్ల వివక్ష ఉన్న నేత చంద్రబాబు అని మరోసారి రుజువైందని అన్నారు. -
కమ్మ కులంలో చెడపుట్టావు
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబును గద్దె దించటమే ధ్యేయంగా ఇకపై తాను పని చేస్తానని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఉధ్ఘాటించారు. అవసరమైతే ఏపీలోని విపక్షాలన్నింటితో కలిసి తాను పని చేస్తానని ఆయన ప్రకటించారు. మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఆయన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత జెండా లేనోడివి... ‘రాజకీయాల్లో చీడపురుగులా తయారయ్యావు. అల్లుడి వేషంలో ఎన్టీఆర్‌ను చంపి టీడీపీ జెండా ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు. ఆ జెండా చూసే జనాలు ఓట్లేశారు తప్ప.. నీ ముఖం చూసి కాదు. చంద్రబాబును నమ్మొద్దని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు. అంతేకాదు టీడీపీ నుంచి చంద్రబాబును ఎన్టీఆర్ బహిష్కరించారు. బాబు కారణంగా ఎన్టీఆర్ శిష్యులు చనిపోయారు. ఎన్టీఆర్ లాంటి మహానీయుడిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కేసీఆర్, వైఎస్ జగన్, పవన్‌లది సొంత జెండా. టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది. వాళ్లను మోసం చేసి ఆ పదవి అనుభవిస్తున్నావ్. దమ్ముంటే ఆ జెండాను వాళ్లకిచ్చేయ్. సొంత జెండాతో పోటీ చేసి గెలువు. కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి’ అని మోత్కుపల్లి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబు కాదు.. నమ్మకద్రోహి... ‘చంద్రబాబును నాయకుడని ఎవరూ అనరు. ఓ బ్రోకర్.. ఓ దొంగ. జెండా దొంగవని స్వయానా ఎన్టీఆరే అన్నారు. బ్రోతల్ హౌజ్ కన్నా దారుణంగా టీడీపీని నడుపుతున్నావ్. తెలంగాణలో పార్టీ దుస్థితికి కారణం నువ్వు కాదా?.. కులాల మధ్య చిచ్చు పెట్టినవ్. డబ్బున్నోడికే, పాపాలు చేసినోడికే టికెట్లు ఇస్తున్నవ్.. ఇది మోసం కాదా? రాజ్యసభ సీట్లను అమ్ముకోలేదా? టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ సీటు అమ్మలేదా?.. పైసల్ పెట్టి ఓట్లు కొంటావ్.. అసలు ఆ సాంప్రదాయం నేర్పిందే చంద్రబాబు. అందరినీ వాడుకుని వదిలేస్తావ్. స్వయానా నరేంద్ర మోదీని మోసం చేసినవ్.. నువ్వేం మిత్రుడివి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను వాడుకున్నావ్. ఓటుకు కోట్లు కేసులో గొంతు నీదే అని ప్రజలతో చెప్పిస్తా.. రాజీనామా చేసే దమ్ముందా?’ అని మోత్కుపల్లి చంద్రబాబుకు సవాల్ విసిరారు. కరివేపాకులా వాడుకున్నావ్.. ‘ఎన్టీఆర్ మీద అభిమానంతోనే పార్టీలో కొనసాగా. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న నన్ను చంద్రబాబు పార్టీకి దూరం చేశారు. వేరే పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఏనాడూ వాటి గురించి ఆలోచించలేదు. ఇన్నేళ్లలో నేను ఏ పదవినీ ఆశించలేదు. రాజకీయాల కోసం నన్ను కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నాడు. బాబు కారణంగానే ఎన్టీఆర్ శిష్యులు చనిపోయారు. నీచ కులాల్లో ఎవరు పుడతారని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల్లో దళిత వర్గాల ప్రజలు బాబుకి గట్టిగా బుద్ధి చెప్తారు. వంద గజాల లోతులో చంద్రబాబు రాజకీయాల్ని బొందపెడతారు’ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా.. ‘ఎప్పుడైతే నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేసిండో అప్పుడే నీ పతనం ప్రారంభమైంది. నీతిమంతులపై నిందలేస్తే పుట్టగతులు లేకుండా పోతావ్. ప్రజా సమస్యల కోసం వైఎస్ జగన్ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ రోజు పాదయాత్ర చేస్తా. పవన్ యాత్రలోనూ పాల్గొంటా. వామపక్ష ర్యాలీలకూ హాజరవుతా. నమ్మేవాడి గొంతు కోసే నమ్మకద్రోహివి. పోనీలే అని గమ్మున ఉంటే కిరాయికి అమ్ముడుపోయానని నాపై తప్పుడు మెసేజ్‌లతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తావా? పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు పెడితే ఊరుకోను. నువ్వేమైనా దొరవా? సుద్ద పుసవా? నరహంతకుడివి.. దొంగవి... ఎన్టీఆర్ స్పిరిట్ నాలో ఎంతకాలం ఉంటే అంతకాలం పని చేస్తా’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు. బాబు ఉంటే హోదా రానేరాదు... ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అడ్డుతగులుతుంది చంద్రబాబేనని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ప్యాకేజ్ ముద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని, రైతుల భూముల విషయంలోనూ అడ్డగోలు అవినీతి జరిగిందని మోత్కుపల్లి ఆక్షేపించారు. సింగపూర్, అమెరికా అంటూ కథలు చెబుతూ ఈ ఐదేళ్లలో సాధించిందేంటని చంద్రబాబును నిలదీశారు. పదవి కోసం దిగజారుడు రాజకీయ చేసావ్. బలహీన వర్గాల అన్నదమ్ములు బొందపెట్టడం ఖాయమని చెప్పుతున్నా. అందుకే తిరుమల యాత్ర... ఎన్టీఆర్ ఆశయం.. దుర్మార్గుడ్ని గద్దె దించటం. ఆ ఆశయ సాధన కోసమే తిరుమల మెట్లు ఎక్కుతున్నా అని మోత్కుపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబును ఓడించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా మోత్కుపల్లి మరోసారి పిలుపునిచ్చారు. యాత్రకు వైఎస్సార్సీపీ సంఘీభావం... మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మోత్కుపల్లిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యాత్రకు వైఎస్సార్సీపీ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన కూడా ప్రెస్మీట్లో మోత్కుపల్లి పక్కన కూర్చున్నారు. -
చంద్రబాబు ఉంటే ప్రత్యేక హోదా రానేరాదు
-
తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!
సాక్షి, యాదాద్రి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు నడిపే టీడీపీ దుర్మార్గపు పార్టీ అని నిప్పులు చెరిగారు. ఆంద్రప్రదేశ్‌ను చంద్రబాబు అవినీతి ప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి లేనని, వాళ్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతోంది వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ అని, చంద్రబాబు కాదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కాపులకు, బీసీలకు, బ్రాహ్మణులకు చంద్రబాబు గొడవ పెట్టారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. ఈ వ్యవస్థలోని చీడ పురుగు చంద్రబాబు అని మండిపడ్డారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ‘నాకు మోకాళ్ళ నొప్పి ఉంది. అయినా కూడా తిరుపతి మెట్లు ఎక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటా’ అని మోత్కుపల్లి అన్నారు. -
హాట్ టాపిక్‌గా మారిన ముద్రగడ,మోత్కుపల్లి భేటీ
-
ఆత్మను అమ్ముకొని బతికే నీచుడు చంద్రబాబు
-
చంద్రబాబు నరహంతకుడు
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వరుసగా రెండోరోజు మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు నరహంతకుడని, ఆయన అంతటి నీతిమాలిన రాజకీయ నాయకుడు ప్రపంచంలో లేడని మండిపడ్డారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడంపై మంగళవారం బేగంపేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై కోర్టుల్లో స్టే ఉన్న కేసులను మళ్లీ తెరవాలని, ఆయనపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం విచారణ జరిపిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడినని చెప్పుకునే బాబు బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. నీ జీవితం కుట్రల నిలయం ‘నిన్న నా గొంతు కోసేశారు. ఎన్టీఆర్ గొంతు కోసినట్టే ఆయన శిష్యుడినయిన నా గొంతు కూడా చంద్రబాబు కోసేశాడు. కనీసం ఉరితీసే ముందయినా చివరి కోరిక అడుగుతారు. ఆ అవకాశం కూడా నాకు చంద్రబాబు ఇవ్వలేదు’’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘నువ్వు ఎన్టీఆర్‌పై కుట్ర చేసి గద్దె దింపావ్... నరహంతకుడివి నువ్వు. రాజకీయాల్లో నీ అంత నీతిమాలిన వ్యక్తి ఈ దునియాలో లేడు. నీ జీవితమే కుట్రలకు, మోసాలకు నిలయం. ఎన్టీఆర్ మనుషులు 20 మంది నీ బాధకు చనిపోయారు. చంద్రబాబు వేధించడం వల్లే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయాడు. నేనాయన్ని పదవి అడిగిన్నా.. ప్రమాణం చేయి. నా మాటలు బంద్ చేస్తా. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటా. నిన్ను నేను ఏ పదవి అడిగిన? నీ దగ్గర నేను ఆశించింది ఏంటి? గవర్నర్ పదవి ఇవ్వమని నేనడిగానా? నువ్వేమైనా ప్రధానివా? రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి బంధువైన గరికపాటి మోహన్‌రావుకు అమ్ముకున్నవ్. ఆత్మను అమ్ముకుని బతికే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ చెప్పారు. గవర్నర్ ఎలాగూ రాదు కాబట్టి ఆ పదవి ఇస్తానని చెప్పాడు. నేను లేకపోతే ఇంట్లోంచి బయటకు రాని పిరికిపందవు నువ్వు. పనికిమాలిన నాయకులతో నన్ను తిట్టిస్తున్నవ్. మగాడివైతే నాతో నువ్వు మాట్లాడు. మోదీ దగ్గరికెళ్లి అరుణ్‌జైట్లీ, కేసీఆర్ కాళ్లు పట్టుకోలేదా? కేసీఆర్ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నవ్. పదేళ్లు ఇక్కడే ఉండి పార్టీని కాపాడతానని చెప్పిన నువ్వు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా సర్దుకుని పోయినవ్. నువ్వు పోయింది అమరావతి కోసం కాదు. కేసీఆర్ ఒక్క లాత్ కొడితే అక్కడ పడ్డవ్. తెలంగాణలో పార్టీని సర్వనాశం చేసినవ్. నా మీద ఏమైనా మాట్లాడితే పురుగులు పడి చస్తవ్. నేనెవరికీ అన్యాయం చేయలే. నువ్వు నాకు అన్యాయం చేసినవ్. సిగ్గు లేదా నీకు. నువ్వు కులగజ్జి ఉన్నోడివి. రేవంత్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు నేను మాదిగ వ్యక్తినని నా మీద చర్యలు తీసుకుంటవా?’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేదేంది? ‘దుర్మార్గుడివి, పాపాత్ముడివి, దుష్టుడివి అయినా నీతోనే ఉండాలనుకున్నా. ఎన్టీఆర్‌ని చంపినా ఆయన పెట్టిన జెండా కోసం నీతోనే ఉండాలనుకున్నా. నీ కోసం నన్ను వాడుకుని ప్రపంచమంతా నన్ను చెడ్డోడిని చేసిండు. నువ్వు నన్ను సస్పెండ్ చేసేదేంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిన్ను సస్పెండ్ చేశారు’’అని బాబును మోత్కుపల్లి దుయ్యబట్టారు. ‘‘ఆంధ్ర ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నిన్ను పాతాళంలో బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నరు. నువ్వొక చవటవి. నువ్వొక దిగజారిన నాయకుడివి. బ్రోతల్ హౌజ్ నడిపినట్టు నడుపుతున్న రాజకీయ విధానం నీది. నేను పార్టీని విలీనం చేయమన్ననా? నువ్వే పార్టీని ఓటుకు కోట్లు కేసప్పుడే టీఆర్ఎస్లో విలీనం చేసినవ్. నీ మనస్సాక్షే నీకు ఏదో ఒకరోజు గుణపాఠం చెపుతుంది’’అని అన్నారు. నీ వల్లే రాజకీయ వ్యవస్థ దెబ్బతింది ‘‘చంద్రబాబూ.. నీకు స్నేహానికి విలువే తెలియదు. నువ్వు లేకపోయినా జగన్ ప్రత్యేక హోదా తెస్తాడు. వేరే పార్టీ వాళ్లు తెస్తరు. నాలుగేళ్లు నువ్వు ఏం పొడిచినవని నీకు 25 సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు’’అని మోత్కుపల్లి ప్రశ్నించారు. ‘‘ఇప్పటికే ఎన్నికల కోసం నియోజకవర్గానికి రూ.25 కోట్లు పంపినవ్. నీ వల్లనే డబ్బు ప్రభావం వచ్చింది. రాజకీయ వ్యవస్థ దెబ్బతిన్నది నీ వల్లే. ఎన్నికలలో చంద్రబాబు నాయకత్వంలో పెట్టినంత ఖర్చు ఏ నాయకుడి ఆధ్వర్యంలో పెట్టలేదు. వాజ్‌పేయిని ప్రధాని నేనే చేసిన అంటడు. మోదీని నేనే చేసిన అంటడు. అబ్దుల్‌కలాంను రాష్ట్రపతిని నేనే చేసినా అంటడు. సిగ్గు లేదా నీకు? ఇన్ని చేసినోడివి ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేదు’’అని నిలదీశారు. సింగపూర్, దుబాయ్‌లో దాస్తున్నవ్ ‘నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నవో తెలియదా? సింగపూర్, దుబాయ్‌లో, అమెరికాలో దాస్తున్నావ్’అని మోత్కుపల్లి అన్నారు. ‘‘కాపులు, బీసీలు, దళితులు, బ్రాహ్మణులు, ఎన్టీఆర్ కుటుంబంలో పంచాయతీలు పెట్టినవ్. అన్ని కులాల్లో పంచాయతీలు పెట్టినవ్. కొద్దిరోజుల్లోనే నేను వెంకటేశ్వరస్వామి మెట్లెక్కుతా. బాబును ఓడించి వస్తా. నేనెన్నడూ నా గురించి అడగలేదు. ఈ దొంగ చంద్రబాబును రాజకీయంగా బొందపెట్టమని ప్రార్థిస్తున్నా.. నాకు మోకాళ్ల నొప్పులున్నా ఏడుకొండల మెట్లెక్కి వస్తా. ఒక్క మెట్టు మీద నేను చచ్చినా ఫర్వాలేదు. వెంకటేశ్వరస్వామీ.. అతడిని ఓడించు. నీ భక్తుడయిన ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలిగించు’’అని వ్యాఖ్యానించారు. కమ్మ కులస్తులారా.. బాబును ఓడించండి! ‘‘కమ్మ కులస్తులారా.. ఒక్కసారి చంద్రబాబును ఓడించండి. మరోసారి నందమూరి కుటుంబీకులను గెలిపిద్దాం. దళితులు, ఎన్టీఆర్ అభిమానులు ఎవరూ చంద్రబాబుకు ఓటేయొద్దు. ఎన్టీరామారావు అల్లుడు కావడంతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అదృష్టం. ఆ రోజు సంబంధం కుదిరించింది ఎవరో. వాడి బొంద కాలా. ఆ పెళ్లి కుదిర్చి మమ్మల్ని, ప్రజల్ని చంపారు. నన్ను ఏ రాత్రి ఏం చేస్తాడోనని భయముంది. చంద్రబాబుతో నాకు భయముంది. కేంద్రం ఈ మొనగాడిపై సీబీఐ విచారణ చేయాలె. మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ ఏమన్నా మంత్రా, ముఖ్యమంత్రా? ఆయన తీసుకునేటప్పుడు నువ్వు ఏమైనా చూశావా? నీ కొడుకు చేసేది ఎవరైనా చూస్తున్నారా. మీ ఇద్దరు కలిసి అమెరికా, సింగపూర్, దుబాయ్ పోతుంటే ఎవరైనా పట్టుకున్నారా? అందుకే కేంద్రాన్ని అడుగుతున్నా. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వైరీ వేయండి. స్టేలున్న 29 కేసులను రీఓపెన్ చేయండి. ఈయన బండారం బయటపడుతుంది. నా జీవితమంతా ధారపోసినా ఈ భ్రష్టుడి కోసం. ఈ వెధవ కోసం. నీకు దిక్కు లేకపోతే దిక్కు నిలబడ్డా. సిగ్గుమాలినోడా. విశ్వాస ఘాతకుడా? నీతిమంతుల ముందు ఈ పాపాల భైరవుడు నిలబడలేడు’’అని మోత్కుపల్లి అన్నారు. -
సాక్షి ఉర్దూ న్యూస్ 29th May 2018
-
కేసీఆర్ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావు
-
ఓ ద్రోహి.. లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు భక్తుడిగా ఆయన పెట్టిన జెండా కోసం పరితపించానే తప్ప ఏనాడూ పదవులు ఆశించలేదని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. పదవులు ఇవ్వనందుకే విమర్శలు చేస్తున్నాడంటూ చంద్రబాబు చేయిస్తోన్న ప్రచారంలో నిజంలేదని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ను చంపేసి, జెండాను దొంగతం చేసిన ద్రోహి చంద్రబాబు. అలాంటి నిన్ను నేను పదవులు అడిగిన మాట నిజమే అయితే... నీ కొడుకు లోకేశ్ మీద ప్రమాణం చేస్తావా?’’ అని సవాలు విసిరారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి... టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘చంద్రబాబు విశ్వాస ఘాతకుడని నేను కాదు.. ఎన్టీఆరే చెప్పారు. కాంగ్రెస్‌లో ఓడిపోయి, శరణుశరణంటూ టీడీపీలోకి వచ్చి, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన నరహంతకుడివి. చివరికి పార్టీ జెండాను లాక్కున్న దొంగవి. రాజకీయాల్లో నీఅంత నీతిమాలిన వ్యక్తి లేడు. నీ జీవితమే అవినీతికి కుట్రలకు, మోసాలకు నిలయం. పార్టీ పెట్టిననాడు ఎన్టీఆర్ వెంట ఉన్న నాలాంటి పేదలను టార్చర్ చేసిన క్రూరుడివి. సీనియారిటీకి విలువ లేదన్న బాధతోనేకదా గాలి ముద్దుకృష్ణమ లాంటి 20 మందిదాకా చనిపోయింది. జెండాను నమ్ముకున్న మాలాంటి వాళ్లను కాదని, నీలాంటి దొంగలను పార్టీలో చేర్చుకున్నావ్. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా జెండా కోసం మాత్రమే వెంట ఉన్నాను తప్ప, పదవుల కోసం కాదు.... చంపేస్తారని భయపడ్డావే.. ఇప్పుడు ఫోన్ ఎత్తవెందుకు?: 2009-12 మధ్య కాలంలో నీ దగ్గరికి రావడానికే అందరూ భయపడుతుంటే నేను పక్కనున్నా. నాకు ప్రాణభయం ఉందని గజగజలాడిన ఆ రోజులు గుర్తులేవా, చంపేస్తారు.. కాపాడమని బతిమాలితేనేకదా నీ వెంట కాపలా కుక్కలా తిరిగింది. ఏం, ఇప్పుడేమైంది? 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తవెందుకు, మీటింగ్‌కి ఎందుకు పిలవలేదనేకదా నేను అడిగింది.. ఫలానా కారణంతో పిలవలేదని చెబితే సరిపోయేదికదా, పనికిరాని మనుషుల చేత నన్ను తిట్టించడందేనికి? ఏ కులపోడు మాట్లడితే ఆ కులపోడితో తిట్టించడమేనా రాజకీయమంటే! 29 సార్లు మోదీని కలిసింది అందుకేగా: నీ కొడుకును ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నావే, మరి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆయన కొడుకులది కాదా, నీ దగ్గర పనిచేసిన కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే ఓర్వలేక, ప్రభుత్వాన్ని కూలగొట్టి రేవంత్‌రెడ్డిని సీఎం చేయడానికి కుట్రలు చేయలేదా, కేసీఆర్‌కు దొంగలాగా దొరికిపోలేదా, అందుకుకాదా 10 ఏళ్ల హక్కును వదిలేసి హైదరాబాద్ నుంచి పారిపోయింది! ఇగ అమరావతి వెళ్లి అక్కడ పెద్ద డ్రామా. 29 సార్లు మోదీని ఎందుకు కలిశావ్? కేసీఆర్ నుంచి కాపాడమని మోదీ కాళ్లమీద పడ్డావే తప్ప హోదా కోసం కాదు కదా.. అయినా హోదా నువ్వు తెచ్చేదేంది? జగనే తెచ్చుకుంటాడు, లేకుంటే ఇంకెవరో పోరాడితే అదే వస్తుంది. నీ అబద్ధాలను జనం నమ్ముతారనుకుంటున్నావా... టీడీపీని బ్రోతల్ హౌస్లా..: 10 ఏళ్లూ ఇక్కడే ఉంటా, పార్టీని కాపాడుకుంటా అని అన్నావ్, దొంగలాగా రాత్రికిరాత్రే పారిపోయావ్. రేవంత్ రెడ్డితో నువ్వు చేయించిన కుట్రతో పార్టీ పరువు గంగలో కలిసింది. ఆ తర్వాతైనా రేవంత్‌ని కట్టడిచేయలేదు. కాంగ్రెస్ వాళ్ల నుంచి విమర్శలు రాకూడదనేకదా రేవంత్‌ను ఆ పార్టీలోకి పంపింది. ఇప్పుడు నేను అడుతున్నా... ఆ ఆడియోలో వాయిస్ నీది కాదని చెప్పగలవా? ఆ గొంతు విన్న ప్రతిఒక్కడూ టీడీపీ నాయకుల నోట్లో ఉమ్మి ఊశారు. బ్రోకర్ పనులు చేస్తూ టీడీపీని బ్రోతల్ హౌస్లా నడిపిస్తున్నావ్.. థూ.. నీ మీద మన్నుపడ! ఎన్టీఆర్ ఆశయాల కోసం పార్టీలో చేరిన నాలాంటి పేదల జీవితాలను నాశనం చేశావుకదా.. ఈ పాపం ఊరికే పోదు. నోరుతెరిస్తే సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలాగా ఉపన్యాసాలు ఇస్తావ్.. మనస్సాక్షిలేని మూర్ఖుడివి నువ్వు.. తిరుమల మెట్లమీదే ప్రాణాలు వదిలేస్తా: పేదల వ్యతిరేక విధానమే చంద్రబాబు పాలసి. అలాంటివాడిని ఓడగొట్టాలని ఏపీ ప్రజల్ని కోరుతున్నా. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో నుంచి ప్రతి నియోజవకర్గానికి 25 కోట్లు ముందస్తుగా పంపాడు. అసలు ఈయనవల్లే కదా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నది. ఎన్నికల్లో చంద్రబాబు పెట్టిన ఖర్చు దేశంలో ఎవడూ పెట్టడు. ఎన్నికలప్పుడు మాత్రం ఎన్టీఆర్ ఫొటోలు కావాలి. దేశంలో అన్ని కంపెనీలు దివాళా తీస్తుంటే ఈయన హెరిటేజ్ ఒక్కటే లాభాల్లో ఎలా ఉంటుంది? దొంగసొమ్మును దుబాయ్, అమెరికాల్లో దాస్తున్నది నిజం కాదా! ఈ దొంగను ఈ సారి ఓడించాల్సిందే. చంద్రబాబును నాశనం చేయమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకుంటా. మోకాళ్లమీద తిరుమలకు నడుచుకుంటూ వెళతా. మెట్లమీద నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. దేవుడు నా ప్రార్థన వింటేచాలు. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబును బొందపెట్టాల్సిందే....’’ అని మోత్కుపల్లి అన్నారు. -
మోసాల చరిత్ర నీది
సాక్షి, హైదరాబాద్ : ‘‘నమ్మి వెంట ఉన్నందుకు చంద్రబాబు నన్ను మోసం చేశాడు. పార్టీకి దూరం చేసి బలి చేశాడు. నాకు గవర్నర్ పదవి ఇప్పిస్తానని మాట తప్పాడు. ఒక్కో రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నాడు’’అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. టీడీపీ జెండాను ఎన్టీఆర్ నుంచి గుంజుకున్న దొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు. పేదోళ్ల జెండాను పెత్తందారులకు అప్పగించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ పగ్గాలను నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. పేదోళ్లంతా నందమూరి కుటుంబానికి అండగా ఉంటారే తప్ప చంద్రబాబుకు కాదని అన్నారు. సోమవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీవల్లే ఎన్టీఆర్ చనిపోయారు చంద్రబాబు చేసిన కుట్రల వల్లే ఎన్టీఆర్ చనిపోయారని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఎన్టీరామారావు గారి దయ, ఆశీర్వాదం వల్ల నాలాంటి పేదవాడు రాజకీయాల్లో ఉండగలుగుతున్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పేదోళ్ల కోసమే కానీ, పెత్తందార్ల కోసం కాదని చెప్పాడు. అలాంటి పార్టీకి నన్ను దూరం చేశారు. ఇప్పుడు నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకున్నారు. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్ బలైపోయారు. ఆయన పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరోటి లేదు. చివరి వరకు నేను ఎన్టీఆర్తోనే ఉన్నా. ఆయన చేయి పట్టుకుని ఉన్నా.. చనిపోయేటప్పుడు రాత్రి 8 గంటల వరకు కూడా నేనున్నా. నాతోపాటు ఇంద్రారెడ్డి, దామోదర్‌రెడ్డి, బుచ్చయ్య చౌదరి, ముద్దుకృష్ణమ నాయుడు ఉన్నారు. ‘తమ్ముళ్లూ నా జెండా గుంజుకున్నాడు. నా పార్టీని గుంజుకున్నాడు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేనేం చేయాలి’ అని ఎన్టీఆర్ ఆవేదన చెందారు. నేను ఇవి రాజకీయాల కోసం చెప్పడం లేదు. నేను పైరవీకారుడిని కాను. ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే బతుకుతున్నా. నా బిడ్డనిచ్చిన పాపానికి ప్రజలు బలైపోతున్నారని ఎన్టీఆర్ చెప్పిన నిజాన్ని గుర్తు చేస్తున్నా. చంద్రబాబుకు కావాల్సింది అధికారమే.. ఎన్టీరామారావు గిలగిల కొట్టుకుని చనిపోయింది నీవల్లే..’’ అని అన్నారు. అడుగడుగునా మోసాలే.. చంద్రబాబు అడుగడుగునా మోసం చేస్తూ నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. ‘‘వెంకటేశ్వరస్వామి నిన్ను పదేళ్లు అధికారానికి దూరం పెట్టినా.. దురదృష్టమేంటో మళ్లీ అధికారంలోకి వచ్చినవ్. నాడు అధికారం కోసం, సీఎం పదవి కోసం దగ్గుబాటి పురంధేశ్వరి, వెంకటేశ్వరరావులను దగ్గర పెట్టుకున్నవ్. తర్వాత మోసం చేసి బయటకు పంపినవ్. హరికృష్ణని మంత్రిగా చేశాడు. అవసరం కోసం కొన్నాళ్లు ఉంచి ఆయన్ను కూడా పక్కన పెట్టాడు. అడుగడుగునా మోసం చేసి నందమూరి వంశాన్ని లేకుండా చేస్తున్నాడు. బాలకృష్ణను ఏదోలా వాడుకుని ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఉన్నారని అనిపించుకునేందుకే తప్ప ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. వీటన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు’’అని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు చంద్రబాబును ఓడించాలని, ఎన్టీఆర్‌పై అభిమానం ఉన్నవాళ్లెవరూ ఆయనకు ఓటేయవద్దని రెండు చేతులు జోడించి వేడుకున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి.. ‘‘చంద్రబాబుకు మాల మాదిగల ఓట్లు కావాలి. ఓసారి మాదిగోళ్లు, ఇంకోసారి మాలోళ్లు కావాలి. చెండాలపు కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పిన ఈయన పేదల కోసం పనిచేస్తున్నానని చెప్పుకునే నటనా చక్రవర్తి’’ అని మోత్కుపల్లి అన్నారు. ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ఏ సీఎం అయినా ఈ దేశంలో మాట్లాడిండా? బీసీలకు, కాపులకు మధ్య కుట్ర చేస్తుండు. కాపులను ఓ పక్క, బీసీలను మరో పక్క ఎగేస్తున్నాడు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యమా? ఈయన చేతుల్లో ఉందా..? చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడు. చంద్రబాబు ఈ వ్యవస్థకు ముప్పు. చీడ పురుగులా తయారయ్యాడు. అది ఎన్టీఆర్ ఇచ్చిన జెండా.. అది నీ సొత్తు కాదు.. నువ్వు చేసుకుంది కాదు. అది మా అందరి జెండా.. పేదోళ్ల జెండా. ఆ జెండాను ఇవ్వాళ పెత్తందారులకు అప్పగించాలని చూస్తున్నాడు. జగన్ ఓ జెండా పెట్టుకున్నడు మొగోడు.. పవన్ కల్యాణ్ ఓ జెండా పెట్టుకున్నాడు మొగోడు.. కానీ నువ్వు గుంజుకున్నవ్ ఈ జెండా. ఎన్టీఆర్ జెండా దొంగతనం చేసిన దొంగవు నువ్వు. మహానాడులో ఎన్టీఆర్ పేరు ఉచ్ఛరించడానికీ నీకు అర్హత లేదు. జగన్.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతా అన్నడు. నీకు సిగ్గులేదా? పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ చరిత్ర పెట్టాలని అడిగినా పెట్టవు. నీకు ఎన్టీఆర్ అంటే ఈర్ష్య, ద్వేషం. ఆయన బొమ్మ ఎక్కడా ఉండొద్దు. మాసిపోయిన బాబు మొహం తప్ప.. ఎవరి మొహం కనిపించొద్దు’’అని అన్నారు. నాడు ఆయనపై.. నేడు టీఆర్ఎస్పై.. నాడు ఎన్టీరామారావుపై కుట్ర పన్నినట్టే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయిన టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా చంద్రబాబు కుట్ర పన్నారని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేశాడు. ఇందులో రేవంత్‌రెడ్డి, చంద్రబాబులిద్దరూ ముద్దాయిలు. ఎన్టీఆర్‌ను ఎలా పతనం చేశారో, కేసీఆర్‌ను అలా బలి చేయాలనుకున్నారు. కానీ కేసీఆర్ తెలివైన వాడు కాబట్టి పట్టుకున్నాడు. పట్టపగలు పట్టుకుని వాళ్ల సంగతి తేల్చాడు. రాజ్యాధికారంకోసం పిల్లనిచ్చిన మామను చంపాడు.. అధికారం కోసం ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా కూలదోసే ప్రయత్నం చేశాడంటే ఈయన మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవాలి’’అని అన్నారు. ఎంపీ సీట్లను కోట్లకు అమ్ముకున్నాడు ‘‘చంద్రబాబు 2009–13 వరకు నేను లేనిదే తిండి తినలేదు.. నిద్రపోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో నీ దగ్గర పురుగు లేకపోయినా నేనున్నా. తోడుగా ఉంటా అన్నవ్.. గవర్నర్ ఇస్తానన్నవ్.. రాజ్యసభ అన్నవ్.. చివరికి అమ్ముకున్నవ్’’అని మోత్కుపల్లి చెప్పారు. ‘‘కేసీఆర్ ఇద్దరు పేదోళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చాడు. గంజి గట్క లేనోళ్లకు ఇచ్చాడు. నువ్వేమో వేల కోట్ల రూపా యల కాంట్రాక్టర్లకు ఒక్కో సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నవ్. నువ్వు చేసిన పాపాలన్నింటికీ పరిహారం కావాలంటే క్షమాపణ చెప్పు. పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబానికి అప్పగించు. బాలకృష్ణ, హరికృష్ణ లేదంటే జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించు’’అని డిమాండ్ చేశారు. ‘‘జగన్ మోహన్‌రెడ్డి, పవన్ కల్యాణ్ కలిస్తే నీకు డిపాజిట్లు రావు. జగనేదో పాపాత్ముడు అయినట్టు. ఈయన మాత్రం ఉన్నదంతా అందరికీ పంచినట్టు. ఉన్నది మీరు నలుగురు. మీకు రూ.100 కోట్ల ఇల్లా? హైదరాబాద్ వచ్చినప్పుడు పార్క్ హోటల్లో ఉండి ఎన్ని కోట్లు కిరాయి కట్టినవ్? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నవ్. ఈ డబ్బులతో ఓ పోలవరం ప్రాజెక్టు వచ్చేది. ఓటుకు రూ.5 వేలు, నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నవ్. ఇవన్నీ ఏపీ ప్రజలు గమనించాలి. ఈసారి చంద్రబాబును గెలిపించొద్దు. ఓసారి జగన్‌ను గెలిపించండి. పవన్‌కల్యాణ్‌ను, కమ్యూనిస్టులను గెలిపించండి. ఎన్టీఆర్ బలమేంటో నీకు చూపిస్తా. ఆంధ్రాలో నిన్ను ఓడించాలని రథయాత్ర చేస్తా’’అని మోత్కుపల్లి తెలిపారు. మోదీ కాళ్లపై పడి బతకలేదా? ‘‘సిగ్గు లేదా నీకు.. నాలుగేళ్లు మోదీతో జతకడితివి. అడుగడుగునా టీటీడీ లడ్డూ తీసుకెళ్లి, శాలువా కప్పి ఆయన కాళ్ల మీద పడి బతకలేదా’’అని చంద్రబాబును మోత్కుపల్లి ప్రశ్నించారు. ‘నాలుగేళ్లు స్నేహం చేసి హోదా కావాల్నా, ప్యాకేజీ కావాల్నా అంటే ప్యాకేజీ కావాలంటివి. నీ 40 ఏళ్ల అనుభవం ఏమైంది? ప్రత్యేక ప్యాకేజీ కావాలని మోదీని ఎందుకు పొగిడినవ్? అసెంబ్లీలో తీర్మానం ఎలా చేశావ్? సిగ్గు లేదా? పౌరుషం ఉన్న నాయకుడివి అయితే రాజీనామా చేయాలి. సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అంటున్నావు. జగన్, పవన్, కమ్యూనిస్టులూ అందరూ అడుగుతుంటే ఓట్లు ఎక్కడ పోతాయోమోనని యూటర్న్ తీసుకున్నడు. మాట మీద నిలబడే వాడే నాయకుడు. చరిత్రలో ఓ నల్లటి పేజీ మాత్రమే నీ కోసం ఉంటుంది. సూర్యచంద్రులున్నంత వరకు ఎన్టీఆర్ పేరుంటుంది’’ అని పేర్కొన్నారు. -
మోత్కుపల్లి కేక
-
మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు
-
టీడీపీ నుంచి మోత్కుపల్లి బహిష్కరణ
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై బహిష్కరణ వేటు పడింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మోత్కుపల్లి నర్సింహులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సోమవారం మహానాడులో ప్రకటించారు. కాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఆయన ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించారని, తమ నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారని, అయితే పట్టపగలే అడ్డంగా దొరికిపోయారని విమర్శలు గుప్పించిన విషయం విదితమే. పార్టీ ధిక్కారానికి పాల్పడిన మోత్కుపల్లిను టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎల్.రమణ తెలిపారు. ‘మోత్కుపల్లి విపరీత ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఆయనకు గవర్నర్ పదవి రాదని తెలిసి గొడవ మొదలుపెట్టారు. కేసీఆర్...ఎన్టీఆర్‌కు ప్రతిరూపం అని నరసింహులు ఎలా చెపుతారు. నేరెళ్ల బాధితుల విషయంలో మోత్కుపల్లి తాను చేసిన వ్యాఖ్యలకు ఏమి సమాధానం చెబుతారు. ఆయన ద్రోహానికి క్షమాపణ లేదు. అందుకే మోత్కుపల్లిని పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని పేర్కొన్నారు. -
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో కలకలంరేపాయి. ఆ వెంటనే చంద్రబాబు.. తెలంగాణ నేతలచేత మోత్కుపల్లిని తిట్టించారు. నట చక్రవర్తి చంద్రబాబు: ‘‘ఎన్టీఆర్ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు. తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పు.. నాకు గవర్నర్ పదవి ఇస్తానని..: యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు హోదా పేరెత్తడానికి కొంచమైనా సిగ్గుపడాలి. చరిత్రలో చంద్రబాబుకంటూ ఓక నల్లపేజీ ఉంటుంది. ఈ దుర్మార్గుడిని పాతళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు గవర్నర్ పదవి లేదంటే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తానని మాటిచ్చాడు. కానీ రాజ్యసభ సీట్లను వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, జెండాను దొంగిలించిన బాబుతో పోల్చితే.. సొంతగా పార్టీలు పెట్టుకున్న వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లు నిజమైన మగాళ్లు. ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబును ఓడించాలి.. పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చెయ్: ఎన్టీఆర్‌తోపాటు ఆయన కుటుంబీకులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా దగ్గుబాటి దంపతులను పక్కన ఉంచుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కుట్రలు చేశారు. నందమూరి హరికృష్ణనూ పార్టీ నుంచి గెంటేశారు. చివరికి బాలకృష్ణను తన పక్కన పెట్టుకున్నాడు. మోసకారి చంద్రబాబు తక్షణమే టీడీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి...’’ అంటూ మోత్కుపల్లి గర్జించారు. మహానాడులో కలకలం: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలతో మహానాడులో కలకలం రేగింది. సభా ప్రాంగణమంతా దీని గురించే చర్చ జరిగింది. ఎన్టీఆర జయంతినాడే తనపై ఇంత తీవ్రస్థాయిలో దాడిజరడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను రంగంలోకి దించి.. మోత్కుపల్లిని తిట్టించేప్రయత్నం చేశారు. బాబు ఆదేశాలతో మహానాడు ప్రాంగణంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మోత్కుపల్లికి తగదని, ఇష్టముంటే టీఆర్ఎస్లోకి వెళ్లిపోవచ్చని సండ్ర అన్నారు. ‘మరి మోత్కుపల్లిపై చర్యలు తీసుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం సండ్ర సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘చాలా సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి.. అన్నింటిపైనా చర్యలు తీస్కోలేము’’ అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు
-
తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైంది..
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దళితులను మోసం చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ లేదని పేర్కొన్నారు. మహానాడుకు తనను పిలవకుండా మాదిగలను, దళితులను అవమానపరిచారని విమర్శించారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గురువారం జరిగిన మహానాడుకు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పార్టీకి 30 ఏళ్లుగా సేవ చేస్తున్న నన్ను మహానాడుకు పిలవలేదు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సీనియర్ లీడర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? ఎస్సీ వర్గీకరణ సభ కోసం నిజామాబాద్ వెళ్తుండగా ఇద్దరు బిడ్డలున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోతే చంద్రబాబు ఆదుకోలేదు. పెద్ద మాదిగ అని చెప్పుకునే బాబుకు దళితులపై ఉన్న ప్రేమ ఇదా? ఆంధ్రాలోనూ దళితులున్నారు జాగ్రత్త! పెద్ద మాదిగ అన్న మీరు వర్గీకరణపై ఎందుకు తీర్మానం చెయ్యలేదు. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపినా మీరెందుకు చెయ్యలేదో చెప్పాలి’’అని నిలదీశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు కనీసం చాయ్‌కి కూడా సమయం ఇవ్వలేదని, ఆయనా దళితులకు న్యాయం చేసేది అని ప్రశ్నించారు. తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా బాబు చెప్పాలని, తప్పుంటే ముక్కు నేలకు రాస్తానని, లేదంటే ఆంధ్రాలో అన్ని జిల్లాలు తిరిగి నా తప్పేంటని అడుగుతానని స్పష్టంచేశారు. ‘‘రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి పోయావ్.. ఎంగేజ్మెంట్కు కేబినెట్ అంతా తీసుకొని వెళ్లావ్.. కానీ నా బిడ్డ పెళ్లికి పిలవంగా పిలవంగా సాయంత్రం వచ్చారు. అదే కేసీఆర్ ఇంటికి వెళ్లి.. నా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉందనగానే ఆత్మీయంగా స్వాగతం పలికారు. పెళ్లికి కూడా వచ్చారు’’అని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ శ్మశానంలా తయారైంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ శ్మశానంలా తయారైందని, ఆంధ్రప్రదేశ్‌లోనూ వస్తదో, రాదో అన్న పరిస్థితి ఉందని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డిలాంటి మూర్ఖులను ప్రోత్సహించి, నిబద్ధత గల తన వంటి నాయకులను చిన్నచూపు చూడటంతోనే పార్టీ సర్వనాశనం అయిందన్నారు. పార్టీలో నీతి లేని నాయకులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, దళితులను ముఖ్యంగా మాదిగలను విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘పార్టీలో డబ్బు, కులానికే ప్రాధాన్యత పెరిగింది. అందుకే పార్టీ పతనావస్థకు చేరుతోంది. దీనిపై ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’అని వ్యాఖ్యానించారు. మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్‌తో కలిసిపోదాం.. కేసీఆర్‌తో కలిసి పోదాం అన్నందుకే తనను పక్కన పెడుతున్నారని మోత్కుపల్లి వాపోయారు. ‘‘మళ్లీ చెబుతున్నా.. కేసీఆర్ మన మిత్రుడే. ఆయన కేబినెట్లో ఉన్నవారు మనవారే. వారితో జతకట్టడం మనకు మంచిదే. టీఆర్ఎస్లో పార్టీని విలీనం చేయాలన్న వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నా’’అని చెప్పారు. ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని, బాబు తనను పిలిచి మాట్లాడాలని అన్నారు. తనను పిలవకుంటే రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే చెప్పుతో కొట్టేవారు ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి అప్రూవర్‌గా మారతాడని చంద్రబాబు భయపడ్డారని, అందుకే బ్లాక్ మెయిల్ చేసినా ఆయనపై చర్యలు తీసుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. ఒకవేళ కుట్రతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసుంటే ప్రజలు టీడీపీని చెప్పుతో కొట్టేవారని, నాదెండ్ల భాస్కర్‌రావు మాదిరే తిరుగుబాటు చేసేవారని వ్యాఖ్యానించారు. రాజ్యసభ ఎన్నికల్లో పైసా, పరపతి లేనివారికి సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారని, ఆ పని మీరెందుకు చేయలేకపోయారని బాబు ను నిలదీశారు. పార్టీ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. -
బాబే అవమాన పరిస్తే దిక్కెవరు : మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అవమానపరచడం బాధగా ఉందన్నారు. ‘నన్నింత చిన్నచూపు చూస్తరా? ఒక దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా?’ అని ప్రశ్నించారు. ‘‘మహానాడుకు వెళ్లే అదృష్టం నాకు లేదు. అధికారం లేకపోయినా, బాబు దగ్గర పని చేసిన మంత్రులంతా పరారైనా, 15 ఏళ్లు ఆయన కోసం, పార్టీ కోసం పని చేశా. నేను ఏ బ్యాక్‌గ్రౌండూ లేనివాడిని. ‘నర్సింహులూ... నువ్వు నాకు తోడుగా ఉండు..’ అన్నందుకు ఆయనకు అండగా ఉన్నా. సిద్ధాంతపరంగా కాంగ్రెస్‌తో పొత్తు అసాధ్యమని, టీఆర్ఎస్తోనే అయితదని చెప్పిన. ఇప్పుడూ చెబుతున్నా. తప్పా? మా నాయకుడు కూడా నన్ను అవమాన పరిస్తే దిక్కెవరు?’ అన్నారు. -
మహానాడుకు నన్ను పిలువలేదు: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం టీటీడీపీ మహానాడును నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షడు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. అయితే ఈ మహానాడుకు పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులతో పాటు మరో నేత ,ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గైర్హాజరు అయ్యారు. కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న మోత్కుపల్లి, కృష్ణయ్య మహానాడుకు హాజరుకాకపోవడంపై పార్టీ వర్గాలు విస్తృతంగా చర్చించుకుంటున్నాయి. కాగా తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్ఎస్లో విలీనం చేయాలని గత మార్చి 18న మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో కూడా మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్ నేత అయిన మోత్కుపల్లిని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే ఆయన దూరంగా ఉన్నారని సమాచారం. మరో వైపు మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్ఎస్లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్ఎస్లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్ఎస్లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నన్ను పిలువలేదు: మోత్కుపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ టీడీపీ మహానాడుకు హాజరుకాకపోవడంపై సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురువారం జరుగుతున్న టీటీడీపీ మహానాడులో మోత్కుపల్లితో పాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పాల్గొనలేదు. ఈ అంశంపై మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘ టీటీడీపీ మహానాడుకు నాకు ఆహ్వానం అందలేదు. చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తారనుకున్నా.. అది జరుగులేదు.. అందుకే దూరంగా ఉన్నాను. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నా వ్యాఖ్యలు టీటీడీపీ తప్పుగా అర్ధం చేసుకుంది. అధినేత చంద్రబాబుకే వివరణ ఇస్తానని చెప్పా. ఆరోజు నుంచి ఇప్పటివరకు అపాయింట్మెంట్ కోరినా కలిసేందుకు అవకాశం దొరకటం లేదు’ అని వెల్లడించారు. -
‘ఉరితాడు వేసుకుని చంద్రబాబుకు సహకరించా’
సాక్షి, హైదరాబాద్ : సమున్నత ఆశయాలతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భ్రష్టుపట్టిపోయిందని టీటీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ప్రస్తుతం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో ఉందని, నాయకత్వలోపంతో కొట్టుమిట్టాడుతున్నదని, ఓటుకు కోట్లు కేసు వల్లే ఈ దుస్థితి దాపురించిందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన.. గత ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా, తర్వాతి కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీని వీడినా అడిగే దిక్కులేకుండాపోయిందని, పరిస్థితి మారాలంటే చంద్రబాబు నాయుడే స్వయంగా తెలంగానలో తిరగాలని సూచించారు. ఉరితాడు వేసుకుని బాబుకు సహకరించా : తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడిచిన సమయంలో టీడీపీ రెండు నాల్కల విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా, నాయకులు సైతం తిట్టిపోసినా పట్టించుకోకుండా చంద్రబాబు వెంటే నడిచానని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఉద్యమానికి మద్దతు ఇవ్వనికారణంగా నన్ను చంపడానికి కొందరు నన్ను చంపాలనుకున్నారు. మా ఇంటిని రెక్కీ కూడా చేశారు. అయినాసరే నేను భయపడలేదు. నా జీవితాన్ని బలిచేసి, ఉరితాడు వేసుకుని మరీ చంద్రబాబుకు అండగానిలబడ్డాను. కానీ.. నా త్యాగాలకు విలువలేకుండా పోయిందిప్పుడు. అసమర్థులు, ద్రోహుల చేతికి చంద్రబాబు పార్టీని అప్పగించారు. ఆ నీతిమాలిన, బజారు మనుషుల పక్కనే నేనూ కూర్చోవాల్సి వచ్చింది. అయినాసరే, చంద్రబాబు నాయకత్వాన్నే సమర్థించాను. కానీ ఆయనేం చేశారు? నన్ను పిలవకుండా హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టారు. ఇది నన్ను దారుణంగా బాధించింది.. ఓటుకు కోట్లు కేసే కారణం : గడ్డు పరిస్థితుల్లోనూ టీడీపీ గత ఎన్నికల్లో 24 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. అయితే, ఓటుకు కోట్లు కేసు తర్వాత అంతా తలకిందులైంది. డబ్బు సంచులతో పట్టుపడ్డ రేవంత్ రెడ్డిని ఆనాడే పార్టీ నుంచి బహిష్కరించేదుంటే పార్టీ బతికుండేది. అలా జరగకపోవడం వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జారుకున్నారు. పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు దిక్కులేకుండా పోయింది. స్వయంగా చంద్రబాబు తిరిగితేగానీ తెలంగాణలో మేం బాగుపడం’’ అని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్తోనే టీడీపీ : ‘తెలంగాణలో పార్టీ బతకాలంటే పొత్తులు తప్పనిసరి. ఏ పార్టీతో అన్నది సమయం వచ్చినప్పుడు నిర్ణయిస్తాం’అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలవబోము కాబట్టి టీఆర్ఎస్తోనే టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని, చాలా కాలం నుంచే తానీ ప్రతిపాదన చేస్తున్నానని ఆయన గుర్తుచేశారు. -
మోత్కుపల్లిపై ‘సండ్ర’ నిప్పులు..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ పనైపోయిందని వ్యాఖ్యానించిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరోక్షంగా మండిపడ్డారు. కొంత మంది స్వార్ధపరుల కోసమో, పదవుల కోసమో, అవకాశవాదుల కోసమో టీడీపీని స్థాపించలేదని అన్నారు. కొంతమంది నాయకులు అవకాశం కోసం పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృతనిశ్చయంతో ఉండటమే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందని, పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిదని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఎమ్మెల్యే వీరయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీని మోత్కుపల్లి బ్లాక్మెయిల్ చేస్తున్నారని వీరయ్య పరోక్షంగా పేర్కొనడంతో టీటీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడినట్టయింది. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించలేదు. మోత్కుపల్లి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని నారా లోకేశ్ ప్రకటించారు. -
బాబు డైరెక్షన్లోనే ‘టీఆర్ఎస్లో టీడీపీ విలీనం’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందంటూ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయడం మంచిదన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు టీటీడీపీని పట్టించుకోవడం మానేశారు. హైదరాబాద్ నుంచి మకాం విజయవాడకు మార్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బులు ముట్టజెప్తూ టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడుతూ చంద్రబాబు కూడా దొరికిపోయారు. ఫోన్లో చంద్రబాబు పేర్కొన్న ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బలంగా ఉన్న ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే మోత్కుపల్లితో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయించి ఉంటారని టీటీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ కేసుకు ముందు కేసీఆర్ అంటే నిప్పులు చెరిగిన చంద్రబాబు.. కేసు తర్వాత కేసీఆర్‌కు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు నచ్చక ఇటీవలే రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదేమాటలో మరికొందరు టీటీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలివే..! ‘ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్‌లోనే ఉంది. ఎన్ని పనులున్నా చంద్రబాబు హైదరాబాద్‌కు రావాల్సిందే. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందన్న వాతావరణం నెలకొంది. భుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరు. తెలంగాణలో పార్టీ అంతరించిపోయి.. మనుగడే లేదనడం కన్నా టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిది. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరు. గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కోసం, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్ఎస్లో విలీనమే మంచిది’ అని మోత్కుపల్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. -
టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిది
-
మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..
సాక్షి, హైదరాబాద్ : ‘‘టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయడమే మంచిది’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎన్ని పనులున్నా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతికి హాజరు కావాల్సిందన్నారు. ‘‘ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్‌లోనే ఉంది. అక్కడికి బాబు రాకపోవడం సరికాదు’’ అని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందనే వాతావరణం నెలకొందన్నారు. భుజాన ఎత్తుకొని పార్టీని కాపాడుకుందామన్నా తనకు సహకరించే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ అంతరించిపోయిందని, మనుగడే లేదని అనుకోవడం కంటే టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిది. టీఆర్ఎస్ కూడా టీడీపీకి చెందిన పార్టీయే. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ టీడీపీ నుంచి వెళ్లిన వ్యక్తే. టీఆర్ఎస్లో విలీనం చేయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు’’ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి చంద్రబాబు సమయం కేటాయించలేరని మోత్కుపల్లి చెప్పారు. ‘‘సమయం కేటాయించకపోతే పార్టీ బలోపేతం కాదు. క్రమంగా ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోంది. టీడీపీకి తెలంగాణలో గౌరవంగా ఉండాలంటే, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్ఎస్లో విలీనం చేయడమే మంచిది’’ అని మోత్కుపల్లి పునరుద్ఘాటించారు. -
రేవంత్‌రెడ్డికి టీటీడీపీ ఝలక్
సాక్షి, హైదరాబాద్ : పార్టీ విధానాలపై అసమ్మతి గళం విప్పిన కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడుకు తెలంగాణ తెలుగుదేశం కళ్లెం వేసే ప్రయత్నం చేసింది. ‘ఆయనతో పాటు ఇంకొందరు కీలక నేతలు పార్టీని వీడబోతున్నారు’ అన్నది కేవలం ప్రచారమేనని, అలాంటి వార్తలు చూసి కింది స్థాయి నేతలెవ్వరూ గందరగోళానికి గురికావద్దని పిలుపునిచ్చింది. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి శనివారం మీడియా సమావేశంలో ఉమ్మడి ప్రకటన చేశారు. ఆధినాయకుడు చెప్పిందే వేదం : క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశం పార్టీలో తప్పిదాలకు పాల్పడే ఎంతటి నాయకుడినైనా సహించబోమని టీటీడీపీ చీఫ్ రమణ అన్నారు. ‘‘రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని కలిశారని, తనతోపాటు పార్టీని వీడే నాయకుల జాబితా ఇచ్చారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన వివరణ ఇవ్వాలి. అసలు ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయాన్ని టీడీపీ శ్రేణులే ప్రజలకు తెలియజెప్పాలి. అక్టోబర్ 8న పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ముఖ్యనాయకులంతా కట్టుబడి ఉండాలి’’ అని రమణ తెలిపారు. పొత్తులపై ఏమన్నారంటే.. : టీటీడీపీలో తాజా వివాదానికి అసలు కారణమైన పొత్తుల వ్యవహారంపై నేతలు ఆచితూచి స్పందించారు. 2019 ఎన్నికల్లో.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, టీడీపీతో భావసారూప్యం కలిగిన పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అధినేత చంద్రబాబు యోచిస్తున్నారని రమణ తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే దిశగా టీడీపీ ఏనాడూ ఆలోచన చేయలేదని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి అడుగుపెట్టిన నాటి నుంచే టీడీపీ దెబ్బతింటూ వచ్చిందని, సంచలనాత్మక ‘ఓటుకు కోట్లు’ కేసు బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డేనని నర్సింహులు ఆరోపించారు. టీటీడీపీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు అతనే : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో బాధ్యుడు ‘ఎవరో’ కాదని, రేవంత్‌రెడ్డేనని మోత్కుపల్లి చెప్పారు. ‘‘రేవంత్ అడుగుపెట్టిన నాటి నుంచి టీడీపీ బలహీన పడింది. ఎకాఎకి ముఖ్యమంత్రి కావాలనేది ఆయన ఆలోచన. ఆ దూకుడు భరించలేకే ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్లు పార్టీ నుంచి వెళ్లిపోయారు. తన సొంత లబ్ధికోసం పార్టీని భ్రష్టుపట్టించేవాళ్లను చూస్తూ ఊరుకోబోం’’ అని నర్సింహులు వ్యాఖ్యానించారు. యనమల, పరిటాలను తిట్టే హక్కు ఎవడిచ్చాడు? : ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలకు తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులతో ఆర్థిక సంబంధాలున్నాయంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మోత్కుపల్లి ఫైరయ్యారు. ‘యనమల, పరిటాలను తిట్టే హక్కు రేవంత్‌కు ఎవరిచ్చారు?’ అని ప్రశ్నించారు. యనమల దగ్గరి బంధువుకు రూ.2వేల కోట్ల కాంట్రాక్టు. పరిటాల సునీతకు బీర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో సీఎం కేసీఆర్ సహకరించారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అడిగే రాహుల్‌ని కలిశాడా? : ఇటీవల ఢిల్లీ వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అక్కడ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారన్న వార్తలపై మోత్కుపల్లి స్పందిస్తూ.. ‘మేం ఏది అడిగినా చంద్రబాబుతోనే మాట్లాడుతానని రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పిండు. ఏం, చంద్రబాబును అడిగే ఆయన రాహుల్ గాంధీని కలిసిండా? ఢిల్లీలో ఎవరెవరితోనో మాట్లాడి, ఇక్కడికొచ్చి మా పార్టీకే చెందిన ఏపీ మంత్రులపై విమర్శలు చేస్తడా? అందుకే, సమాధానం చెప్పమని గట్టిగా అడిగాం’’ అని మోత్కుపల్లి వివరించారు. టీఆర్ఎస్తో పొత్తు ఆలోచన ఎవరిది? : టీడీపీలో ప్రస్తుత సంక్షోభానికి అసలు కారణమైన ‘టీఆర్ఎస్తో పొత్తు’ పైనా మోత్కుపల్లి స్పందించారు. ‘‘అసలు టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు పెత్తుకుంటుందని నేనేదో అన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ మొదట పొత్తు మాటెత్తింది నేను కాదు రేవంతే. ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ- బీజేపీ అలయెన్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ కలిస్తే గిలిస్తే, టీఆర్ఎస్తో కలిసే అవకాశం ఉంటుందన్నాను. రేవంత్ తన లబ్ధికోసం ప్రార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు’’ అని నర్సింహులు అన్నారు. -
‘ఓటుకు కోట్లు’ బాధ్యుడు ఆయనే!!
-
సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలి : మోత్కుపల్లి
ఆలేరు : బస్వాపూర్, గంధమల్ల జలాశయాల నీళ్లను సూర్యాపేటకు తరలిస్తామని సూర్యాపేట సభలో పేర్కొన్న సీఎం కేసీఆర్ ఆలేరు, భువనగిరి నియోజకవర్గ ప్రజలకు వివరణ ఇవ్వాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బలహీనమైన ప్రజా ప్రతినిధులు ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ విషయమై భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఓ వైపు మంత్రి హరీశ్‌రావు తపాసుపల్లి రిజర్వాయర్ ద్వారా సిద్దిపేటకు నీటిని తరలిస్తుంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి, చామకూర అమరేందర్‌రెడ్డి, ఆరె రాములు, ఎండీ.సలీం, గ్యాదపాక దానయ్య, మల్రెడ్డి సాంబిరెడ్డి, ఎండీ.రఫీ, భోగ సంతోష్, జెట్ట సిద్దులు, బండ శ్రీను, బస్తం ఆంజనేయులు, అంకిరెడ్డి శ్రీను పాల్గొన్నారు. -
..ఎక్కుదామా? కారెక్కుదామా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్తో కలసి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోందా? అందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పొత్తు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారా? పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహం మేరకే మోత్కుపల్లి ఈ ప్రకటన చేశారా? తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలలో ఇప్పుడీ అంశాలే హాట్ టాపిక్‌గా మారాయి. టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవడానికి వచ్చే ఎన్నికల నాటికి విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్తో టీడీపీ పొత్తు ప్రతిపాదన రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి చెబుతున్న తరుణంలోనే.. టీఆర్ఎస్తో పొత్తుపై మోత్కుపల్లి బాంబు పేల్చారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహం మేరకే మోత్కుపల్లి ఈ ప్రకటన చేసి ఉంటారని టీటీడీపీ సీనియర్ నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో విపక్షాల ఐక్యతను దెబ్బకొట్టేందుకు టీడీపీని బయటకు లాగాలన్న టీఆర్ఎస్ కీలక నేతల ప్రయత్నం కూడా దీనికి కారణమని చెబుతున్నారు. రేవంత్ మాటలు పట్టించుకోవద్దు? రేవంత్‌రెడ్డి ఎంత ఘాటుగా మాట్లాడినా.. టీఆర్ఎస్ను ఎంతగా దూషించినా చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే అంతిమమని టీఆర్ఎస్తో పొత్తు అవసరమని భావిస్తున్న టీటీడీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అందువల్ల రేవంత్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడి పెళ్లికి వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌తో రహస్య మంతనాలు ఎందుకు జరపాల్సి వచ్చిందని రేవంత్ బహిరంగంగా విమర్శించారు. కానీ ఈ మొత్తం తతంగం వెనుక ఇరు పార్టీల రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని మోత్కుపల్లి, ఎల్.రమణ సహా కొందరు సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలహీనమైనందున టీఆర్ఎస్తో పొత్తు ద్వారా కొన్ని సీట్లయినా గెలవొచ్చని సీనియర్లు పార్టీ అధినేత చంద్రబాబుకు కొంతకాలంగా చెబుతూ వస్తున్నట్లు సమాచారం. రెండు రకాల ముచ్చట్లు..! తెలంగాణలో టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఇటీవల విజయవాడలో రేవంత్‌రెడ్డికి చెప్పిన చంద్రబాబు.. తర్వాత రెండు రోజులకే ఇద్దరు ముగ్గురు సీనియర్లను పిలిపించుకుని పొత్తు ఉంటే ఎలా ఉంటుందని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కే విజయావకాశాలు ఉన్నాయని.. అందువల్ల ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని 15–20 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను తీసుకోవడం ద్వారా పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చని సీనియర్లు పేర్కొన్నట్లు తెలిసింది. ముందుగా ఈ ప్రతిపాదన టీఆర్ఎస్ నుంచే వచ్చిందని చంద్రబాబు ఆ నేతలకు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ చర్చ సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని దూరంగా పెట్టారు. టీఆర్ఎస్తో పొత్తు రేవంత్‌కు ఇష్టం ఉండదని కావాలనే ఆయనను దూరం పెట్టారని అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు కూడా టీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన వచ్చిన సమావేశంలో ఉన్నారు. పొత్తు విషయంలో తన వైఖరి చెప్పని ఆ మాజీ ఎమ్మెల్యే.. హైదరాబాద్ తిరిగొచ్చాక ఈ విషయాన్ని రేవంత్‌కు చెప్పినట్లు సమాచారం. దాంతో టీఆర్ఎస్తో పొత్తు ఉండదని చంద్రబాబు స్వయంగా తనకు చెప్పారని.. అందువల్ల ఆ ప్రతిపాదన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేవంత్ పేర్కొన్నట్లు తెలిసింది. ఇలా పొత్తు ఉండదని ఒకరితో, పొత్తు ఉంటే ఎలా ఉంటుందని మరికొందరితో చంద్రబాబు చెబుతుండడంతో టీటీడీపీ వర్గాలు అయోమయంలో పడిపోయాయి. మా దారి మేం చూసుకుంటాం? టీఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదన ఉంటే ఎన్నికలకు ముందే తమ దారి తాము చూసుకుంటామని రేవంత్‌రెడ్డి, ఆయనను అనుసరిస్తున్న ఇతర నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా నిరూపించుకోవాలని ఆరాటపడుతున్న జూనియర్ నేతలంతా రేవంత్‌తో కలసి గ్రూపుగా ఏర్పడ్డారు. వీరితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, పలువురు జూనియర్లు పొత్తు ఉండకూడదని గట్టిగా కోరుకుంటున్నారు. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే 10 స్థానాలకు మించి ఇవ్వకపోవచ్చని.. అదే జరిగితే టీడీపీలో ఉండి ప్రయోజనమేమిటన్నది వారి వాదన. ‘నాకు తెలిసి టీఆర్ఎస్తో పొత్తు ఉండదు. కొద్దిమంది టీడీపీ రాజకీయ నిరుద్యోగులు మాత్రం ఐదారు సీట్లు అయినా సాధించుకుని పొత్తులో భాగంగా పోటీచేసి గెలవాలని భావిస్తున్నారు..’అని మాజీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. మోత్కుపల్లి ‘పొత్తు’వ్యాఖ్యల నేపథ్యంలో.. పార్టీ అధినేత చంద్రబాబును కలసి విషయం తేల్చుకోవాలని పొత్తు ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న వారు భావిస్తున్నట్లు తెలిసింది. -
'మోదీ నిర్ణయం హర్షణీయం'
యాదాద్రి : నల్లకుబేరుల వద్ద పేరుకుపోయిన ధనాన్ని వెలికితీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం హర్షణీయమని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదాద్రిలోమంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సామాన్యుల ఇబ్బందులు తాత్కాలికమేనన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా వెంటనే రూ.2000, రూ.500 నోట్లను చెలామణీలోకి తేవాలని మోత్కుపల్లి ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభారాణి ఉన్నారు. -
మోత్కుపల్లి గైర్హాజరు.. బిల్యా అలక
సాక్షి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీ గ్రూపు తగాదాలు మరోమారు బహిర్గతమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మోత్కుపల్లి, ఉమా మాధవరెడ్డి వర్గాలుగా చీలిపోయి వ్యవహరించిన తెలు గు తమ్ముళ్ల మధ్య వైరం జిల్లాలు విడిపోయిన కూడా ఇంకా సమసిపోలేదని.. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభ ద్వారా మరోసారి నిరూపితమైంది. ఈ బహిరంగ సభకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హాజరు కాకపోవడం, ఆయన వర్గానికి చెందిన నేతలంతా మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. వాస్తవానికి పా ర్టీ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు పాల్గొనే సభకు జిల్లా పార్టీలో పెద్దన్న పాత్ర పోషించే మోత్కుపల్లి హాజరు కావాల్సి ఉంది. కానీ, ఉమామాధవరెడ్డి వర్గానికి చెందిన భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహిస్తుండడంతో ఆయన మొహం చాటేసినట్టు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బిల్యానాయక్ కూడా బహిరంగ సభలో పాల్గొనకపోవడం విశేషం. ఉదయం నుంచి రేవంత్ వెంట పాదయాత్రలో ఉన్న బిల్యా అకస్మాత్తుగా బహిరంగసభకు రాకుండానే వెళ్లిపోయారు. ఇందుకు తనకు అధ్యక్షస్థానం ఇవ్వకపోవడమే కారణమని తెలుస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ బహిరంగసభల్లో జిల్లా అధ్యక్షుడికే అధ్యక్ష స్థానం ఇచ్చే అలవాటున్నా... ఈ సభలో మాత్రం కార్యక్రమాన్ని భుజాన మోసిన కంచర్ల భూపాల్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన తాను ఉండలేనని చెప్పి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇక, మోత్కుపల్లి రాకపోవడం, బిల్యా అలిగి వెళ్లిపోవడంతో నర్సింహులు వ ర్గీయులంతా మొక్కుబడిగా కూర్చుని వెళ్లిపోయారు. ఆ వర్గానికి చెందిన నేతలు కేవలం వేదిక మీద కూర్చునేందుకే పరిమితం కాగా, ఉమావర్గం నేతలంతా ప్రసంగాలు చేశారు. మొత్తానికి కంచర్ల వన్మ్యాన్షోలాగా సాగిన ఈ బహిరంగసభ, పాదయాత్ర కార్యక్రమాల్లో టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు జిల్లాకు చెందిన నేతలు జగదీశ్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్‌ల మీద దుమ్మెత్తిపోయడం విశేషం. -
నీటి కోసం మోత్కుపల్లి పాదయాత్ర
చేర్యాల : గోదావరి జలాల కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నరసింహులు మంగళవారం వరంగల్ జిల్లా చేర్యాల మండలం నాగపూరి నుంచి ప్రారంభించారు. ఆయన వెంట టీడీపీ మహిళా అధ్యక్షురాలు దండు శోభారాణి కూడా యాత్రలో పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు వరకు పాదయాత్ర కొనసాగనుంది. పక్కనే ఉన్న తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరు నియోజకవర్గానికి నీరు ఇవ్వాలని మోత్కుపల్లి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రిజర్వాయర్ నుంచి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్, హరీష్‌రావు నియోజకవర్గమైన సిద్ధిపేటకు నీరు ఇస్తున్నారని... రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమంగా చూడాలని డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌ది, మీదీ ఒకే విధానం: మోత్కుపల్లి
విజయవాడ: పార్టీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్‌ది, మీది ఒకే విధానమని టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఏపీ సీఏం చంద్రబాబును ఉద్దేశించి తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్పందించకుండా నవ్వి ఊరుకున్నారు. పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు కొత్త కాదని, ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయని ఆ తర్వాత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుందని, అయితే అభివృద్ధికి ఆకర్షితులై ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని చెప్పాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై, స్పీకర్‌పై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయంగా ఎదురుదాడి చేయాలని నిర్ణయించారు. -
నన్నెందుకు పక్కన పెట్టారో: మోత్కుపల్లి
హైదరాబాద్ : చూడబోతే మరో తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా త్వరలోనే సైకిల్ దిగే పనిలో ఉన్నట్లున్నారు. గురువారం హైదరాబాద్‌లో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంటూ తెలంగాణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. 'మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు.మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు. పార్టీలో ఉపన్యాసాలకు తావులేదు. నాయకత్వం అవసరం. సీఎంగా బాధ్యతల కోసం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. చంద్రబాబు తెలంగాణను వదిలేశారు. తెలంగాణకు చంద్రబాబు రావడం లేదన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. వారానికి ఒకరోజు సమయం కేటాయించాలి. తప్పకుండా అన్ని జిల్లాల్లో తిరగాలి. లేకుంటే పార్టీకి పూర్వ వైభవం రాదు. పార్టీపై నన్ను మాట్లాడనీయకుండా నా ఎనర్జీని కాపాడారు ఇన్నాళ్లు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో కూడా నన్ను ఎక్కడా ఉపయోగించుకోలేదు. నన్ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా? గ్రేటర్ ఎన్నికల్లో నా ప్రమేయం లేదు' అని మోత్కుపల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గతంలో మోత్కుపల్లి నర్సింహులుకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనకు గవర్నర్ గిరీ ఖాయం అనుకున్న ఆయనకు... ఆ తర్వాత పదవి ఊసే లేకపోవడంతో అప్పటి నుంచి మోత్కుపల్లి కినుకగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
తెలుగు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతిని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వం టీడీపీ నేతలను ఎన్టీఆర్ ఘాట్ వద్ద అడ్డుకున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌ను, తెలుగు ప్రజలను అవమానించేలా వ్యవహరించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో దివంగత ప్రధానుల జయంతి, వర్ధంతులను లాంఛనంగా నిర్వహిస్తారని గుర్తు చేశారు. కాని ఎన్టీఆర్ వర్ధంతిని కేసీఆర్ నిర్వహించకుండా అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. -
మోత్కుపల్లిపై పార్టీ శ్రేణుల ఆరోపణలు
అసలే అంపశయ్యపై ఉన్న తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకాస్త కుదిపేశాయి. అన్ని జిల్లాల్లాగే నల్లగొండలోనూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుని, 'కారు' ఎక్కడంతో.. అరకొరగా ఉన్న పార్టీ వీరవిధేయుల్లో ఆందోళన చెలరేగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాదినేని శ్రీనివాసరావు నామినేషన్ ఉపసంహరణ వ్యవహారం.. పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు తెలిసే జరిగిందని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో మోత్కుపల్లి టచ్‌లో ఉన్నారని, ఉద్దేశపూర్వకంగానే టీడీపీ అభ్యర్థిని పోటీ నుంచి ఉపసంహరింపజేశారని ఈ మేరకు లక్షల రూపాయల సొమ్ముకూడా తీసుకున్నారని ప్రత్యర్థి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోటీ ఉపసంహరణ విషయం కనీసం పార్టీలో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి వెనుకడుగుతో నల్లగొండ ఎమ్మెల్సీ బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నపురెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు పీసీసీ మాజీ అధ్యక్షుడు సుంకరి మల్లేశ్‌గౌడ్, ఎంపీపీల ఫోరం నుంచి మిట్ట పురుషోత్తం రెడ్డి బరిలో నిలిచారు. ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే నెలకొననుంది. కాగా, తిరుగుబాటుదారులను బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తిరుమలగిరి ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్న మిట్ట పురుషోత్తంరెడ్డిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పీసీసీ కార్యదర్శిగా ఉన్న సుంకరి మల్లేశ్‌గౌడ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండరెడ్డికి డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్ సిఫారసు చేశారు. మల్లేశ్‌గౌడ్ బహిష్కరణ అంశాన్ని పీసీసీ తేల్చాల్సి ఉంది. -
టీడీపీకి మరో షాక్?
-
టీడీపీకి మరో షాక్?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ టీడీపీకి మరో షాక్ తగల నుంది. టీటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ (ఎస్సీ) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న తరుణంలో ఆయన పార్టీకి గుడ్‌బై చెబుతున్నారని, గులాబీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 20 రోజులుగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి మోత్కుపల్లితోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మోత్కుపల్లి ఖమ్మం జిల్లా మధిర స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని, ఈశాన్య రాష్ట్రాలకు గవర్నర్‌గా పంపిస్తారని ప్రచారం జరిగినా అతీగతీ లేదు. తనను పట్టిం చుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్న మోత్కుపల్లి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని ఆశపడుతున్నారని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఈసారి కూడా బరిలోకి దిగనుందని తెలియడంతో తనకు పోటీ చే సే అవకాశం రాదని మోత్కుపల్లి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ ఎంపీ స్థానానికి టికెట్ ఆశిస్తూ తనకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని టీఆర్ఎస్ నాయకత్వానికి మోత్కుపల్లి సమాచారం పంపించారని తెలుస్తోంది. -
కేసీఆర్ రూపంలో నిజాం బతికొచ్చినట్టున్నాడు
దళితులను అణచివేస్తూ ఎవరి కోసం ప్లీనరీ?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: నిరంకుశత్వ పాలనతో ప్రజలకు నరకం చూపిన నిజాం నవాబు కేసీఆర్ రూపంలో బతికొచ్చినట్టున్నాడని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎద్దేవా చేశారు. ఎవరు మెచ్చుకోని నిజాంను గొప్పవాడిగా కీర్తించిన కేసీఆర్ అదే తరహాలో దళితులు, ఇతర వర్గాలను అణచివేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో దళితులకు, మహిళలకు స్థానం కల్పించకుండా నిరంకుశ ధోరణితో కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, ప్లీనరీ ద్వారా వారికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. -
'టీ- కేబినెట్లో దళితుడికి మంత్రి పదవి ఇవ్వాలి'
హైదరాబాద్: దళితుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... కేసీఆర్ తన కేబినెట్లో ఒక్క దళితుడిని చోటు కల్పించలేదని ఆరోపించారు. ఈ నెల 14 అంబేద్కర్ జయంతి... ఈ నేపథ్యంలో ఆ తేదీలోపు టీ - కేబినెట్లో దళితుడికి మంత్రిగా అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్‌ను మోత్కుపల్లి డిమాండ్ చేశారు. -
‘2019లో టీడీపీదే అధికారం’
నకిరేకల్ : 2019 ఎన్నికలలో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. నకిరేకల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత టీఆర్ఎస్ పాలనను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని పేర్కొన్నారు. మాదిగ, మాలలు కోటిమందిపైనే ఉండగా తెలంగాణ మంత్రి వర్గంలో ఒక్కరికి కూడా ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. మహిళలకు కూడా కాబినేట్‌లో అవకాశం లేకపోవడం విచారకరం అన్నారు. త్వరలోనే టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తిరగబడాల్సిన సమయం దెగ్గరలో ఉందన్నారు. ఈ సమావేశంలో నర్సిరెడ్డి, బీజేపీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి చంద్రశేఖర్, బిల్యానాయక్, నాయకులు దైద సుధాకర్, పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, వెంకన్నగౌడ్, యాదయ్య ఉన్నారు. -
సచివాలయాన్నే అమ్మేస్తానని ఎలా అంటారు?
ఖమ్మం: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. ఆయన పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని మోత్కుపల్లి విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సచివాలయాన్నే అమ్మేస్తానని కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అసలు సచివాలయాన్ని అమ్మకానికి పెట్టాలనే యోచన ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించి దళితుల మనోభావాలను కేసీఆర్ దెబ్బతీశారన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఉన్నవారంతా ఉత్సవ విగ్రహాలేనని మోత్కుపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛను కోల్పోయిందన్నారు. -
వాస్తవాలు వదిలి సొల్లు మాట్లాడొద్దు
తన కుల ప్రస్తావనపై కడియం మండిపాటు నేను ఎస్సీ కాకపోతే ఎవరికైనా ఫిర్యాదు చేయండి సాక్షి, హైదరాబాద్: ‘నేను ఎస్సీనే.. మాదిగను కాను.. బైండ్ల కులస్తున్ని, రాష్ట్రపతి ఎస్సీ కేటగిరీ కింద గుర్తించిన 56 కులాల్లో మాది ఒకటి. బడిలో చేరినప్పడు, ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ బైండ్ల కులస్తుడిగానే రాసుకున్నాను.. ఇందులో ఏదైనా పొరపాటు ఉన్నట్లు గుర్తిస్తే.. ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయండి.. హైకోర్టులో కేసు వేయండి.. అనర్హత వేటు వేయించండి.. అంతే తప్ప సొల్లు మాట్లాడొద్దు. దిగజారుడుతనంతో ఇంత హీనమైన విమర్శలు చేయవద్దు.. మా అమ్మ చాలా బాధ పడింది.. రాజకీయాల్లో ఇంత నీచంగా మాట్లాడతారా? అని అడిగింది. అందుకే స్పందిస్తున్నా.. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు సమావేశం పెట్టాను’ అని మంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదు.. బీసీ అని పేర్కొంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన విమర్శలపై తీవ్రంగా స్పందించారు. వారుచేసే చౌకబారు విమర్శలను రికార్డు చేస్తున్నా.. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు విమర్శలు చేసినందున, ఆ మాటలపై పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే చట్టపరంగా తీసుకోబోయే చర్యల్లో టీడీపీని, చంద్రబాబునాయుడిని భాగస్వామి చేస్తానని పేర్కొన్నారు. పార్టీపరంగా, రాజకీయంగా, సిద్ధాంతపరంగా, జరిగిన సంఘటనలపైనా మాట్లాడవచ్చు కానీ, ఇంత హీనంగా వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. వారెంత నీచంగా మాట్లాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి ఎవరి వల్ల నష్టమో, ఎవరి వల్ల ఆదరణ కోల్పోతుందో ప్రజలకు తెలుసునన్నారు. ‘ఒకాయన అధికార పార్టీలోకి వచ్చి మంత్రి కావాలనుకున్నారని, మరొకాయన తెలంగాణ ప్రజల చేతిలో దెబ్బలు తిన్న కోపంతో మాట్లాడుతున్నారని’ విమర్శించారు. మంద కృష్ణ నన్ను మాదిగ కాదు అని అంటే.. మోత్కుపల్లి ఎస్సీనే కాదని అంటారు... తాను మాదిగ అని ఎక్కడా కై్లమ్ చేయలేదని, బైండ్ల అని మాత్రమే కై్లమ్ చేశానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ఏనుగంతటి వాడిని చేశారని, అది తట్టుకోలేకే టీడీపీ నాయకులు కుక్కల్లా మొరుగుతూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. నేడు బాధ్యత ల స్వీకరణ.. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తానని కడియం శ్రీహరి తెలిపారు. డీఎస్సీ, ఇతర విద్యా సంబంధ అంశాలపై ఇప్పుడే స్పందించలేనని, శాఖాపరంగా సోమ లేదా మంగళవారం సమీక్ష నిర్వహించిన తరువాత ఆయా అంశాలపై స్పందిస్తానన్నారు. మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శిగా (విద్యాశాఖ) సతీష్‌కుమార్ కూడా శుక్రవారమే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. -
... అందుకే రాజయ్యపై వేటు వేశారు
హైదరాబాద్: టి.రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ద్వారా మాదిగల ఆత్మగౌరవాన్ని తెలంగణ సీఎం కేసీఆర్ దెబ్బతీశారని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాల చేసుకుంది దళితులు కాదా ?.... మాదిక కులస్థులకు కేబినెట్లో ఎందుకు అవకాశం కల్పించలేదని ఆయన కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీపై ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు వేశారిని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి తీరు కనబరిచారంటూ రాజయ్యకు మోత్కుపల్లి కితాబు ఇచ్చారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంతవరకు న్యాయం చేశారో వెల్లడించాలని సీఎం కేసీఆర్‌కు మోత్కుపల్లి సవాల్ ఇచ్చారు. -
'అవి' కేసీఆర్ హత్యలే
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు అన్నీ సీఎం కేసీఆర్ చేసిన హత్యలేనని టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైఖరిపై వారు మండిపడ్డారు. ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంట్ తెప్పిస్తామన్న గతంలో కేసీఆర్ చెప్పి... మాట తప్పారని వారు విమర్శించారు. అందువ్లలే రైతుల ఆత్మహత్యలు జరిగాయిని విమర్శించారు. కరెంట్ లేక పంటలు ఎండిపోవడం, లేదా పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎర్రబెల్లి, మోత్కుపల్లి వివరించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో రాష్ట్రంలో 325 మంది రైతులు చనిపోయినట్లు జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చారని... కాని ఆ సంఖ్యను కేసీఆర్ 69కి కుదించారని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ. లక్షన్నర నష్టపరిహారం అందించారన్నారు. కేసీఆర్ సర్కార్ కనీసం ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి, మోత్కుపల్లి కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆపరేషన్ మోత్కుపల్లి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా తెలుగుదేశం పార్టీలో కొత్త సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. మొన్నటివరకు సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అండగా ఉండి ఆయన గ్రూపులో పనిచేసిన నాయకులు కూడా ఇప్పుడు జిల్లా పార్టీలో ఆయన జోక్యం వద్దని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తన గెలుపుకోసం జిల్లాను వీడివెళ్లి, ఇక్కడి నేతల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన మోత్కుపల్లిని జిల్లా పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా నియంత్రించాలని పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేసినట్టు పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ బలోపేతం దృష్ట్యా గ్రూపులకతీతంగా జిల్లా నేతలమంతా ఐక్యంగా పనిచేస్తామని, అయితే మోత్కుపల్లిని మాత్రం పార్టీ వ్యవహారాల్లో వేలుపెట్టనీయమని వారంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా తనకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఉన్నా, తను కావాలన్న స్థానాన్ని ఇచ్చేందుకు పార్టీ సిద్ధంగా ఉన్నా, కేవలం గెలుపే ధ్యేయం గా ఖమ్మం జిల్లాలో పోటీ చేసిన మోత్కుపల్లి వైఖరే గత ఎన్నికల్లో తమ ఓటమికి ప్రధాన కారణమైందనే వాదన జిల్లా పార్టీ నేతల్లో వినిపిస్తోంది. తెలంగాణవాదం జిల్లాలో బలంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తన గెలుపు అసాధ్యమనే భావనతోనే ఆయన ఆంధ్రప్రాంతానికి సమీపంలోని మధిర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని, టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా గట్టిగా పనిచేసిన మోత్కుపల్లే జిల్లాను వీడివెళ్లడంతో ఇక్కడ పోటీచేసిన నేతలు కూడా గెలవలేరనే భావనకు ప్రజలు వచ్చినందునే తమను ఆదరించలేదని, తమ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇదొకటని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు మధిరకు వెళ్లిన మోత్కుపల్లికి ఆ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి ఇచ్చి, ఆ జిల్లా పార్టీలోనే పనిచేయించాలని చంద్రబాబును కోరినట్టు తెలిసింది. మోత్కుపల్లిని తప్పిస్తే జిల్లాలో మిగిలిన పార్టీ నేతలమంతా కలిసి పనిచేసుకుంటామని, గ్రూపులు లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వివరించారని సమాచారం. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాస్’ ఏం నిర్ణయం తీసుకుం టారు? మోత్కుపల్లిని జిల్లా పార్టీ వ్యవహారాలకు దూరంగా పెడతారా?యథావిధిగా కొనసాగుతారా అన్నది ఇప్పుడు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సభ్యత్వ నమోదుపై సమీక్ష జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుపై గురువారం నేరేడుచర్లలో జిల్లా నాయకులు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న ల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జ్, మాజీ మంత్రి పి.రాములు కూడా హాజరయ్యారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు ఉమామాధవరెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్చార్జులు వంగాల స్వామిగౌడ్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారి, బంటు వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూడా మోత్కుపల్లి వ్యవహారంపై చర్చ జరిగినట్టు సమాచారం. -
'సిగ్గుంటే ముందు నీ కొడుకు పేరు మార్చుకో'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతుడని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ పేరుపై రాజకీయాలు చేయడం తగదని ఆయన కాంగ్రెస్, టీఆర్ఎస్లకు హితవు పలికారు. తెలంగాణ సీఎం కేసీఆర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎల్పీ నాయకుడు జానారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ అన్న సంగతి మోత్కుపల్లి ఈ సందర్బంగా గుర్తు చేశారు. మందు నీకు సిగ్గుంటే నీ కొడుకు పేరు మార్చుకోవాలంటూ తీవ్ర ఆగ్రహాంతో మోత్కుపల్లి ...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణలో బడుగు, బలహీన వర్గాలవారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరే అన్న సంగతి మరువరాదని అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు మోత్కుపల్లి హితవు పలికారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... మోత్కుపల్లి శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్బంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మోత్కుపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీఆర్
టీడీపీనేత మోత్కుపల్లి నర్సింహులు సాక్షి, హైదరాబాద్: పటేల్, పట్వారీ పెత్తందారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన విప్లవకారుడు ఎన్టీ రామారావు అని తెలుగుదేశం నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం హేయమైన చర్య అని ఆయన ధ్వజమెత్తారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించిన ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడంపై ప్రధాని మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, కొత్త ప్రాజెక్టులకు పేర్లు పెట్టే విషయమై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకోవచ్చు గానీ, ఇది వరకే ఉన్న పేరును కొనసాగించేందుకు అవసరం లేదని అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం సబబే: తీగల మహేశ్వరం: శంషాబాద్ విమానాశ్రయంలో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నానని ఇటీవల టీఆర్ఎస్లో చేరిన మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. కాగా.. తెలంగాణ జన జీవనానికి వైతాళికుడైన మాజీ సీఎం ఎన్టీ రామారావు సీమాంధ్రకు పరిమితమనడం తెలంగాణ సీఎం కేసీఆర్ విచక్షణకు, సంస్కారానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. సాయిబాబు అన్నారు. తెలుగు వ్యక్తి పేరు పునరుద్ధరిస్తే రాజకీయం చేయడమా తెలంగాణ సంస్కృతి అని శుక్రవారం విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో నిలదీశారు. శంషాబాద్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. -
కేసీఆర్ పై మోత్కుపల్లి తీవ్రారోపణలు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రారోపణలు చేశారు. తమను చంపిచేందుకు కేసీఆర్ పథకం వేస్తున్నట్టు సమాచారం అందుతోందని ఆరోపించారు. ఇందులోభాగంగా తమ గన్మెన్లను తొలగించారని అన్నారు. అధికారంలో లేనప్పుడు కేసీఆర్ ఎందుకు గన్మెన్లను పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తప్పులను ప్రశ్నిస్తున్నారనే టీడీపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయించారని విమర్శించారు. -
టీఆర్ఎస్పై తెలంగాణ టీడీపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతలు శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ దాడిపై వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ దాడులు చేస్తోందని వారు ఆరోపించారు. ఈ అంశంతో పాటు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేలా చూడాలని, ఇరు రాష్ట్రాల సీఎంలను సమావేశపరిచి విద్యుత్‌తో పాటు నీటి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ టీడీపీ నేతలు... గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ ముందు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. దాడులతో సమస్యలు పరిష్కారం కావని మోత్కుపల్లి అన్నారు. -
'తప్పని తేలితే క్షమాపణలు చెబుతాం'
హైదరాబాద్: కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే విద్యుత్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ డిమాండ్ చేశారు. అఖిలపక్షంతో చంద్రబాబుది తప్పని తేలితే క్షమాపణలు చెబుతామన్నారు. నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని వీరు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరెంట్ అడితే పార్టీ కార్యలయాన్ని ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగానితనం వల్లే తెలంగాణలో కరెంట్ కోతలు పెరిగాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ తడాఖా చూపిస్తామన్నారు. తెలంగాణలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశవాదిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. -
‘మోత్కుపల్లి’.. మానసిన వికలాంగుడు
నల్లగొండ :టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మానసిక వికలాంగుడిగా మారారని, తెలంగాణ రాష్ట్రంలో ఉంటూనే తెలంగాణ ద్రోహిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రాజ్యసభ సీటు కోసం.. ప్రస్తుతం ఏపీలో నామినేటెడ్ పదవి కోసం చాలా రోజుల తర్వాత చంద్రబాబు మెప్పుపొందేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని అన్నారు. లోయర్ సీలేరులో పీపీఎ రద్దు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణా రైతులపై ప్రేమ ఉంటే చంద్రబాబుతో మాట్లాడి విద్యుత్ ఇప్పించే విధంగా ప్రయత్నించాలని హితవు పలికారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే చేయడం లేదని, ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తుంటే మోత్కుప ల్లికి కానరావట్లేదా.. అన్ని ప్రశ్నించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు మైనం శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, ఆ పార్టీ నాయకులు బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, శివరామకృష్ణ, జమాల్‌ఖాద్రి తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్ స్వయంగా ఆహ్వనిస్తే బాగుండేది'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ స్వయంగా ఆహ్వనిస్తే బాగుండేదని వీరు అభిప్రాయపడ్డారు. ఆయన ప్రమాణ స్వీకారానికి వెల్లాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. -
'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బంద్‌లతో ప్రజలను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌పై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి అన్నారు. ఆర్డినెన్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తగదని మోత్కుపల్లి హితవు పలికారు. -
మోత్కుపల్లి.. ఇదేం లొల్లి
మధిర, న్యూస్‌లైన్: మధిర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మిత్రభేదానికి తెరతీసింది. సార్వత్రిక ఎన్నికల్లో జట్టుకట్టిన బీజేపీ, టీడీపీలు ఎడ్డెం అంటే తెడ్డెం అంటున్నాయి. స్వయాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లావ్యాప్తంగా ఆ పార్టీల పొత్తు ఏవిధంగా ఉందో చెప్పక్కర్లేదు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నియోజకవర్గంలో టీడీపీ నేతల వైఖరిపై కమలనాథులు మండిపడుతున్నారు. మధిర అసెంబ్లీ అభ్యర్థిగా చివరినిమిషంలో ఖరారైన వలసనేత మోత్కుపల్లి నర్సింహులు ఇరుపార్టీలను సమన్వయ పరచడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ స్థానిక నేతలు ఎవరో కూడా తెలియని ఆయనకు బీజేపీ నేతలు ఎలా తెలుస్తారులే..! అనే విమర్శలు వస్తున్నాయి. నర్సింహులకు స్థానిక నేతల బలాబలాల గురించి తెలియపోవడంతో అసమర్థులకు పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేతను ఇక్కడకు డంప్ చేయడం, జిల్లాలోని ఖమ్మం పార్లమెంట్, అసెంబ్లీ జనరల్ స్థానాలు మూడింటిలోనూ ఒకే సామాజిక వర్గానికి టిక్కెట్లు ఇవ్వడంతో స్థానిక నేతలు చంద్రబాబుపైనా ఆగ్రహంతో ఉన్నారు. బీసీ నేత బాలసాని లక్ష్మీనారాయణకు కొత్తగూడెం టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి చివరి నిమిషంలో రద్దుచేయడంపై ఆ పార్టీ నియోజకవర్గ బీసీ నాయకులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మద్దతుతో దూసుకుపోతున్న కమల్‌రాజ్.. వైఎస్ఆర్సీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానికంగా సుపరిచితుడు కావడంతో ఆయనకు కార్యకర్తలపై అవగాహన ఉంది. ఏ గ్రామానికి వెళ్లిన కనీసం ఓ పదిమందినైనా పేరుపెట్టి పిలుస్తారు. ఆయనకు స్థానికంగా ఉన్న పరిచయాలు ప్లస్ పాయింట్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు తుమ్మల, నామా వర్గపోరు ప్రభావం నియోజకవర్గంలోనూ ఉంది. డిప్యూటీ స్పీకర్ భట్టి కూడా బలమైన ప్రత్యర్థికావడంతో నియోజకవర్గంలో తెలుగుదేశానిది మూడోస్థానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రచారంలో భాగంగా మోత్కుపల్లి మాట్లాడే తీరు కూడా స్థానిక నేతలు, కార్యకర్తలకు నచ్చడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను మాటవరసకైనా ప్రస్తావించకుండా ఆయన ప్రసంగం కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో నామమాత్రంగా ఉన్న టీఆర్ఎస్ను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం వల్ల వచ్చే ప్రయోజనమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్న మోత్కుపల్లి మధిరకు వస్తే బావుంటుందని అనుకున్న ఆపార్టీ నేతలు ప్రస్తుతం అయోమయానికి గురవుతున్నారు. -
'టీఆర్ఎస్ పునర్నిర్మాణమందంటే దొరల పాలనే'
తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మాట తప్పారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఆదివారం నల్గొండలో మోత్కుపల్లి మాట్లాడుతూ కేసీఆర్ వైఖరిపై మండిపడ్డారు. టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణమని టీఆర్ఎస్ అంటుందని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పునర్నిర్మాణమంటే దొరల పాలనను మళ్లీ నిర్మించడమేనని మోత్కుపల్లి పేర్కొన్నారు. -
అయ్యో... మోత్కుపల్లి
సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. సీనియర్లు అనుకున్న నేతలే కొత్తదారులు వెదుక్కుంటున్నారు. ఆ పార్టీకి జిల్లా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది అనడానికి కొత్త పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆ పార్టీ తరఫున ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు మూడుసార్లు.. ఆపైన గెలిచిన వారే. అయినా, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పక్షాన పోటీ చేయడానికి ఒకరిద్దరు జంకి ప్రత్యామ్నాయం వెదికారని సమాచారం. ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎవరూ పార్టీ మారలేదని ప్రచారం జరుగుతోంది. కాగా, తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఇటీవల కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. రాజ్యసభ సీటు ఆశించిన ఆయనకు చంద్రబాబు షరామామూలుగానే మొండిచేయి చూపడంతో కాంగ్రెస్ గడప తొక్కుతారని వెలువడ్డాయి. ఇప్పటికిప్పుడు ఆయన పార్టీ మారే సూచనలేవీ కనిపించకున్నా, సొంతపార్టీలోనూ సంతృప్తిగా ఏమీ లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన ఈసారి ఎక్కడి నుంచి బరి లోకి దిగాలనే అంశంపైనా ఓ స్పష్టత లేకుండా రకరకాల ప్రకటనలు ఇస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఆలేరు సీటు జనరల్‌గా మారడంతో ఎస్సీ రిజర్వుడు స్థానమైన తుంగతుర్తికి వలసపోయిన మోత్కుపల్లి, అక్కడి మాజీ ఎమ్మెల్యే సంకినేని అండతో 2009 ఎన్నికల్లో విజయం సాధించాడు. ఆ తర్వాత జరిగిన పరిణమాల్లో సంకినేని టీడీపీ గుడ్‌బై చెప్పడంతో నర్సింహులుకు సహకరించే పార్టీ కేడర్ లేకుండా అయ్యింది. దీంతో ఆయన తిరిగి తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి వెనకా ముందవుతున్నారు. ఈ కారణంగానే పూటకో ప్రకటన చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. నిన్నటికి నిన్న మోత్కుపల్లి నర్సింహులు ‘పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తా’ అని ప్రకటిం చారు. గతంలో ఆలేరు నుం చిమళ్లీ పోటీచేస్తానని కార్యకర్తల సమావేశాల్లో, విలేకరుల సమావేశాల్లో ప్రకటిం చిన ఆయన తాజాగా మల్కాజిగిరి నుంచి పోటీ అన్న అం శాన్ని తెరపైకి తెచ్చి కొత్త చర్చకు కారణమయ్యారు. ఒక దశలో ఆయన నకిరేకల్ ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి బరిలోకి ది గుతారన్న ప్రచారమూ జరగింది. గడిచిన మూ డు నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ ప్రచారం తో ఆయన అనుచరవర్గం కొంత అయోమయంలోనే ఉంది. ఇప్పటి దాకా, ఆలేరు నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌చార్జ్‌ను నియమించలేదు.ఇన్చార్జ్ నియామకం కాకుండా అధినేత ముందరి కాళ్లకు బంధం వేసింది కూడా ఆయనేనని పార్టీ వర్గాల్లో నిరసన వ్యక్తం అ య్యింది. ఆలేరు నియోజకవర్గానికి చెందిన కొందరు టీడీపీ నేతలు పార్టీ కూడా మారారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 45 రోజుల్లోనే పూర్తి కానున్న నేపథ్యంలో మోత్కుపల్లి ‘బెర్తు’ ఎక్కడ అన్న అంశంపై తమ్ముళ్లలో రక రకాల ప్రచారం జరుగుతోంది. -
విలపించిన మోత్కుపల్లి
రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బాధను దిగమింగుకోలేక బుధవారం శాసన సభ లాబీల్లో సహచర నేతల వద్ద బోరున విలపించారు. పార్టీ అధినేత చంద్రబాబు తనను మోసం చేశారని ఆరోపించారు. ‘‘నేను అడగకపోయినా, రాజ్యసభ సీటు ఇస్తానని అధినేతే వంద సార్లు హామీ ఇచ్చారు. రాజ్యసభకు వెళ్తానన్న ఆశతో నియోజకవర్గంలో తిరగకుండా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కే పరిమితమయ్యా. చివరకు చేయిచ్చారన్నా. అభ్యర్ధుల ఎంపిక సమయంలో నాతో చర్చించనే లేదు. నేను అక్కడ ఉండగానే అభ్యర్థుల పేర్లు టీవీ ఛానళ్లలో వచ్చాయి. దళితుడిని కాబట్టే నన్ను అవమానించారు. అదే స్థితిమంతుడినైతే ఇలా చేసేవారా’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. బాధను దింగమింగుకోలేక బోరున విలపించారు. అంతటి సీనియర్ నేత తమ ముందు విలపించటంతో ఎర్రబెల్లి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అవాక్కయ్యారు. ఆ వెంటనే తేరుకున్న ఎర్రబెల్లి ఆయన్ని అనునయించారు. లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ (జేపీ), టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు తదితరులు కూడా మోత్కుపల్లిని ఓదార్చారు. -
కంటతడి పెట్టిన మోత్కుపల్లి
హైదరాబాద్ : రాజ్యసభ సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు బుధవారం అసెంబ్లీ లాబీలో కంటతడి పెట్టారు. తెలంగాణ టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాజ్యసభ సీటు ఖాయమని అందరు అనుకున్నారని మోత్కుపల్లి అన్నారు. రాజ్యసభ సీటు విషయంలో తాను అవమానానికి గురయ్యానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు తలదించుకోకూడదనే కష్టపడి పనిచేశానని అన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లిని మరో నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బుజ్జగించారు. కాగా ఈరోజు ఉదయం మోత్కుపల్లిని ...పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిరాకరించిన విషయం తెలిసిందే. -
'ఆంధ్రావాళ్లకే ఇచ్చినా అడగలేని దౌర్భాగ్యం'
హైదరాబాద్ : ఎంతో ఆశపడి, ప్రయత్నించినా చేతికి దక్కకుండా పోయిన రాజ్యసభ టికెట్ వ్యవహారం విషయంలో మోత్కుపల్లి నర్సింహులు పట్టు వీడటం లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయన ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు....మోత్కుపల్లిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి టీ.టీడీపీ నేతలపై మండిపడ్డారు. రాజ్యసభ రెండు సీట్లు ఆంధ్రావాళ్లకే ఇచ్చినా... అడగలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని ధ్వజమెత్తారు. కాగా తాను అనుకున్నట్లు అధినేతను ఆడించేందుకు.. తన పనులు చేయించుకునేందుకు.. ఎదుటి వర్గంపై పైచేయి సాధించేందుకు అలకబూనడం మోత్కుపల్లికి కొత్తేం కాదు, ఇది మొదటిసారి కూడా కాదని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు. గతంలో తెలంగాణ ఎమ్మెల్యేలంతా టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి నేతత్వంలో బస్సు యాత్ర చేసిన సమయంలో కూడా ఇదే తరహాలో చెట్టెక్కి కూర్చున్నారు. గతంలో ఓ మారు ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లారు. తిరిగి, టీడీపీకి గూటికి చేరారు. ‘.. ఏమో, ఏమైనా జరగవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పార్టీ అధినేత ఏమైనా దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? లేదా అన్నది తేలాల్సి ఉంది. -
టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయం
రాజ్యసభ సీటు దక్కకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన కట్టలు తెంచుకుంది. మంగళవారం హైదరాబాద్‌లో మోత్కుపల్లిను సముదాయించేందుకు వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేతల ఎర్రబెల్లి, ఎల్. రమణ, విజయరమణారావు, ఊకే అబ్బయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు మోత్కుపల్లి నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారి వద్ద మోత్కుపల్లి తన ఆక్రోశాన్ని ఆయన వెళ్లకక్కారు. టీడీపీలో ఉండే కంటే కట్టెలు కొట్టుకోవడం నయమని మోత్కుపల్లి వాపోయారు. పార్టీని నమ్ముకుంటే ఇంత అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. సంవత్సరం నుంచి నీకే రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను మభ్యపెట్టారని తోటి ఎమ్మెల్యే వద్ద మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరితో మోత్కుపల్లి తీవ్ర కలత చెందారు. దీంతో ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కాంగ్రెస్ వైపు మోత్కుపల్లి చూపు?
హైదరాబాద్: రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి జానారెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి ఎంట్రీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దళిత నేతను ఆహ్వానిస్తే ఇమేజ్ పెరుగుతుందని జానారెడ్డి వాదనలతో అధిష్టానం కూడా ఏకీభవించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి రాకతో జిల్లాలో తనకూ కలిసి వస్తుందని జానారెడ్డి భావిస్తున్నారు. మరోవైపు మోత్కుపల్లికి రాజ్యసభ సీటు దక్కకపోవడంపై నల్గొండ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడుతున్న మోత్కుపల్లిని కాదని మరొకరికి రాజ్యసభ సీటు ఇవ్వడం మంచిది కాదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాజ్యసభ సీటు దక్కకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం నల్గొండ జిల్లా టీడీపీ నేతలు మోత్కుపల్లి నివాసానికి చర్చలు జరిపారు. మరి మోత్కుపల్లి సైకిల్ దిగి 'చేయి'అందుకుంటారో లేదో అనేది ప్రస్తుతానికి ఉత్కంఠే. -
'డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా' బాబుపై మోత్కుపల్లి ఫైర్!
తెలుగు దేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికలు ఆపార్టీ నేతల్లో అసహనాన్ని, ఆగ్రహాన్ని నింపాయి. రాజ్యసభ టికెట్ పై గంపెడాశలు పెట్టుకున్న నేతలు నందమూరి హరికృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశం నుంచి హరికృష్ణ, సోమిరెడ్డి, మోత్కుపల్లిలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకొచ్చారు. ఓ దశలో డబ్బున్నవారికే టికెట్లు ఇస్తారా అని చంద్రబాబుపై మోత్కుపల్లి విరుచుకుపడినట్టు సమాచారం. గతంలో కూడా ఇలాగే చేశారని బాబుపై మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్ని కష్టాలెదురైనా పార్టీలోనే ఉన్నాం అయినా గుర్తించారా? అంటూ మోత్కుపల్లి నిలదీశారు. తన ఆగ్రహాన్ని మీడియాతో పంచుకునేందుకు సమావేశం హాలునుంచి బయటకొచ్చేసిన మోత్కుపల్లిని సీనియర్ నేతలు నామా నాగేశ్వర్ రావు,ఎర్రబెల్లి దయాకర్ రావు సముదాయించి లోనికితీసుకెళ్లారు. పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభైన కాసేపటికే హరికృష్ణ, సోమిరెడ్డిలు బయటకు వచ్చారు. -
రాజ్యసభ టికెట్ దక్కుతుందనే ఆశలో మోత్కుపల్లి!
హైదరాబాద్: టీడీపీ రాజ్యసభ సీట్ల ఎంపిక దాదాపు ఖరారయ్యింది. సీట్ల ఎంపికపై టీడీపీ పొలిట్ బ్యూరో సోమవారం సమావేశమైంది. ఈ అంశంపై పలు దఫాలు చర్చించిన పిదప టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీట్ల ఎంపిక పై తుది నివేదికను సిద్ధం చేశారు. సీమాంధ్ర ప్రాంతం నుండి సీతారామలక్ష్మిని, తెలంగాణ ప్రాంతం నుంచి గరికపాటి మోహన్ రావులను రాజ్యసభకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, తెలంగాణా నుంచి రాజ్యసభ సీటు తనకే దక్కుతుందనే ఆశలో మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది. -
సీఎం నోటీసివ్వడం దుర్మార్గం:పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: విభజన బిల్లుపై తిరిగి పంపే విధంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నోటీసివ్వడం దుర్మార్గమైన చర్య అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. సీఎం ఏకపక్ష నిర్ణయాన్ని తెలంగాణ ప్రజా ప్రతినిధులమంతా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రపతిని, కేంద్రాన్ని ధిక్కరించే విధంగా సీఎం వ్యవహరించడాన్ని పొన్నాల తప్పుబట్టారు. ఈ అంశంపై శాసన సభాపతికి, మంత్రి మండలకి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఎన్ని ఇబ్బందులెదురైనా తెలంగాణ తథ్యమని పొన్నాల స్పష్టం చేశారు. టి.బిల్లుపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీకీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరైయ్యారు. స్పీకర్ కు కిరణ్ ఇచ్చిన నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు. -
తెలంగాణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత
హైదరాబాద్:తెలంగాణ బిల్లు అంశానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. బిల్లును అసెంబ్లీ చర్చించినట్లు భావించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టమని కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు. టి.బిల్లుపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీకీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరైయ్యారు. స్పీకర్ కు కిరణ్ ఇచ్చిన నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ,, అసెంబ్లీకి బిల్లు వస్తే సపోర్ట్ చేస్తానన్న సీఎం.. ఇప్పుడు స్పీకర్ కు నోటీసు పంపడం బాధాకరమన్నారు. సీమాంధ్ర ప్రజల అవసరాలు తెలియజేయాలే గాని..బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయకూడదన్నారు. ఈ పరిణమాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బిల్లును అసెంబ్లీలో చర్చించనట్లు భావించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా ముందుకెళుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
-
మోత్కుపల్లికి టిక్కెట్ దక్కేనా?
హైదరాబాద్ : టీడీపీలో నేతల మధ్య రాజ్యసభ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఆశావహులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పార్టీ అధినేతపై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రం నుంచి టిడిపికి దక్కనున్న రెండు సీట్లలో ఒక సీటును తెలంగాణకు ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుండగా ఆ సీటును ఆశిస్తున్న తెలంగాణ టీడీపీ నేతల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. టిడిఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి, జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ నుండి సీనియర్ నేతగా తనకు ఈ దఫా రాజ్యసభకు ఎంపిక చేయాలని ఇప్పటికే పార్టీ చంద్రబాబునాయుడును గట్టిగా కోరడం జరిగింది. అయితే దీనిపై బాబునుంచి సరైన హామీ రాకపోవటంతో మోత్కుపల్లికి రాజ్యసభ టిక్కెట్ దక్కడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో బాబు వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆయన రెండు రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. కాగా తాజాగా జిల్లాకు చెందిన పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ మంత్రి, భువనగిరి ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి సైతం రాజ్యసభ సీటు కోరుతు ఇటీవలే చంద్రబాబు ఇంటికి వెళ్లి మరి అభ్యర్థించారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ భువనగిరి అసెంబ్లీ సీటు నుండి దివంగత మాధవరెడ్డి, తదుపరి తాను పార్టీని గెలిపించి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించామని తమ కుటుంబం పార్టీకి చేసిన సేవలు, త్యాగంను గుర్తించి రాజ్యసభకు తనకు అవకాశం కల్పించాలని ఉమా విన్నవించుకోవడం విశేషం. పార్టీలో మహిళలకు తగిన గౌరవం కల్పించే దిశగా సైతం సీనియర్ నేతగా తనకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని ఉమామాధవరెడ్డి అభ్యర్ధించారు. ఇక జిల్లా టిడిపిలో మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి ఉమామాధవరెడ్డికి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు రాజ్యసభ సీటు పంచాయతీతో మరోసారి బహిర్గతమైంది. మధ్యలో టిడిపిని వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి సొంతగూటికి చేరిన మోత్కుపల్లి కంటే టిడిపి ఆవిర్భావం నుండి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన భర్త మాధవరెడ్డితో పాటు తాను చేసిన సేవలే మిన్నయని తనకే రాజ్యసభ సీటు ఇవ్వాలని ఉమా కోరుతు పార్టీలో మోత్కుపల్లి ఆధిపత్యానికి మరోసారి ఆమె సవాల్ విసిరారు. ఉమా, మోత్కుపల్లిలతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి రాజ్యసభ సీటును ఆశిస్తున్న వారిలో గరికపాటి రాంమోహన్‌రావు కూడా ఉన్నారు. మరి తెలంగాణ నుంచి వీరిలో ఎవరికి రాజ్యసభ టిక్కెట్ వరిస్తుందో వేచి చూడాలి. -
కీలక దశలో కేసీఆర్ ఫాంహౌస్లోనా?
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరిన తరుణంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో గడపుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. రోమ్ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారంటూ మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగెత్తిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను కేసీఆర్ ఒక్కసారి కూడా తలవలేదని మోత్కుపల్లి అన్నారు. -
మోత్కుపల్లీ.. నోరు జాగ్రత్త
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విభజన వాదా? లేక సమైక్యవాదా? అనే విషయాన్ని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చెప్పగలరా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు. నోరుంది కదా అని వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు. గట్టు శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ, మోత్కుపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సమాజంలో దేనికీ పనికిరాని చంద్రబాబు గురించి మోత్కుపల్లి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు అవినీతిపరుడు కావటంవల్లే ప్రతి ఎన్నికల్లోనూ ఆయనను ప్రజలు ఓడిస్తున్నారని చెప్పారు. జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నందునే 5.45 లక్షల మెజారిటీతో లోక్‌సభకు గెలిపించారని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధపడాలని సవాల్ చేశారు. తప్పుడు కూతలు కూయడంలో తర్ఫీదు పొందిన మోత్కుపల్లి గతంలో చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. -
కేసీఆర్ వల్లే తెలంగాణ జాప్యం
రాష్ట్రపతికి జగన్ అఫిడవిట్లు ఇవ్వడమేంటి?: మోత్కుపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు బాధ్యత వహించాలని తెలంగాణ టీడీపీ ఫోరం నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న హామీని కేసీఆర్ ఎందుకు నిలబెట్టుకోవడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాట తప్పడం వల్లే రాష్ట్ర విభజన ఆలస్యమవుతోందని, శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. తెలంగాణవాదం ముసుగులో కేసీఆర్ సమైక్యవాదం వినిపిస్తున్నారని, ఆయన తెలంగాణ ద్రోహి అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రకటన చేసినపుడు కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ కూడా టీఆర్ఎస్ విలీనాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు అమ్ముకోవాలనే ఎత్తుగడలో భాగంగానే కేసీఆర్ తన పార్టీని విలీనం చేయడంలేదన్నారు. కేసీఆర్ మనసులో రాష్ర్టం సమైక్యంగా ఉండాలని, వైఎస్సార్సీపీ జగన్మోహన్రెడ్డి మదిలో వెంటనే విభజన జరగాలనే భావన ఉందన్నారు. రాష్ట్రపతిని కలిసి జగన్ అఫిడవిట్లు ఇవ్వడం ఏమిటని మోత్కుపల్లి ప్రశ్నించారు. తెలంగాణవాదుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ఎర్రబెల్లి, మోత్కుపల్లి ద్రోహులు: కడియం
వరంగల్: తెలంగాణ టీడీపీ ఫోరం నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు ద్రోహులుగా మారారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి విమర్శించారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య ఒప్పందాలంటూ ఇష్టమొచ్చిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హన్మకొండలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఆమోదంపై దృష్టి పెట్టకుండా టీడీపీ నాయకులు టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. సమన్యాయం పేరుతో చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక విలీనమా, పొత్తా, స్వతంత్రంగా పోటీ చేస్తుందా అనే అంశాలను టీఆర్ఎస్ నిర్ణయించుకుంటుందని, తమ పార్టీ రాజకీయ వ్యవహారాలు మీకెందుకంటూ నిలదీశారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం కావద్దని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆపార్టీ నాయకులు వద్దంటున్నా సిగ్గులేకుండా పొత్తులంటూ వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పొత్తులేకుంటే పుట్టగతులుండవనే ఈ ప్రయత్నమన్నారు. టీఆర్ఎస్కు ఆ అవసరంలేదని, ఎవరికైనా తమ పార్టీ అవసరమే ఉందని కడియం పేర్కొన్నారు. -
ఇప్పటికైన KCR డ్రామాలు ఆపాలి
-
టీడీపీలో...ఫిర్యాదుల ముసలం
సాక్షిప్రతినిధి, నల్లగొండ: తెలుగుదేశానికి జిల్లాలో ఏదీ కలిసొచ్చేలా కనిపించడం లేదు. 2009 ఎన్నికల నాటి నుంచి మొన్నటి దాకా నియోజకవర్గా లకు కనీసం ఇన్చార్జులను కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆ పార్టీ కొట్టుమిట్టాడింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాగోలా కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించింది. గతేడాది చివరి దాకా జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన వంగాల స్వామిగౌడ్‌ను హుజూర్నగర్ ఇన్చార్జిగా ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అధినేతపై ఒత్తిడి చేయడం వల్లే ఆయన పేరు ప్రకటించి, బలవంతంగా తమ నెత్తిన రుద్దారన్నది హుజూర్నగర్ దేశం నేతల బలమైన అభిప్రాయం. ఇన్చార్జిగా నియమితుడయ్యాక కూడా స్వామిగౌడ్ పనితీరు మెరుగు పడలేదని, తమకు అందుబాటులో ఉండడం లేదని, ఏకపక్షంగా మండల అధ్యక్షులను నియమించుకుంటున్నారన్న ఆగ్రహం అక్కడి ద్వితీయశ్రేణి నేతల్లో ఉంది. దీని ప్రభావం సహకార, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. నియోజకవర్గంలో గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న పార్టీని అథమ స్థాయికి తీసుకువచ్చారని వీరు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా, స్వామిగౌడ్, అధికార కాంగ్రెస్ పార్టీ నేతతో అంటకాగుతున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో మండలాల వారీగా మెజారిటీ గురించి కూడా ప్రస్తావిస్తున్నారని, తమ పార్టీ నేతలు లోపాయికారిగా ఒప్పందం చేసుకుని సహకరిస్తున్నందు వల్లే అంత ధీమాగా ప్రకటనలు ఇస్తున్నారని, దీనికి తగినట్టే స్వామిగౌడ్ పార్టీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ అంశాలన్నింటిపైనా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం హైదరాబాద్‌కు పలు వాహనాల్లో తరలి వెళ్లిన నియోజకవర్గ టీడీపీ నాయకులు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. ఆయనను ఇన్చార్జిగా తొలగించి, కొత్తవారిని నియమించాలని, లేదంటే నియోజకవర్గంలో పార్టీని కాపాడుకోలేమని మొరపెట్టుకున్నారు. వైఎస్ఆర్ సీపీ గురించి... చర్చ అధికార పార్టీకి ధీటుగా నిలవాల్సింది పోయి, పార్టీ నేతలు కోవర్టుగా మారడంతో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారిందని అధినేతకు ఫిర్యాదు చేసిన పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి బాబు వద్ద చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. అధికార కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారైందని, ముందు నుంచీ ఉన్న టీడీపీ మాత్రం చతికిల పడేలా తయారైందని వీరు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. మండలాల వారీగా, ఇటీవలి సహకార, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు, తెచ్చుకున్న ఓట్లు, తదితరాలపై కూడా వీరు వివరించారని సమాచారం. ఇక, నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తేరా చిన్నపురెడ్డిపైనా ఆ నియోజకవర్గ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలకు చిన్నపురెడ్డి ఏ మాత్రం అందుబాటులో ఉండడం లేదని, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల ఊసు లేకుండా అయ్యిందని ఆ పార్టీ నాయకుడు కటారి అంజయ్య తేరాపై అధినేతకు ఫిర్యాదు చేశారు. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీలో ఫిర్యాదుల ముసలం మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది.