కీలక దశలో కేసీఆర్ ఫాంహౌస్లోనా? | What does KCR do at his farmhouse, questioned Motkupalli narasimhulu | Sakshi
Sakshi News home page

కీలక దశలో కేసీఆర్ ఫాంహౌస్లోనా?

Published Sat, Jan 4 2014 1:53 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కీలక దశలో కేసీఆర్ ఫాంహౌస్లోనా? - Sakshi

కీలక దశలో కేసీఆర్ ఫాంహౌస్లోనా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మరోసారి విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ అంశం కీలకదశకు చేరిన తరుణంలో కేసీఆర్ ఫాంహౌస్‌లో గడపుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. రోమ్‌ తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా కేసీఆర్‌ ప్రవర్తిస్తున్నారంటూ మోత్కుపల్లి విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ కుటుంబం కోట్లకు పడగెత్తిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను కేసీఆర్ ఒక్కసారి కూడా తలవలేదని మోత్కుపల్లి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement