సాక్షి, హైదరాబాద్: మోత్కుపల్లి నర్పింహులు శుక్రవారం బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీనియర్ నాయకుడిని అయిన తనకు బీజేపీలో సముచిత స్థానం దక్కలేదని తెలిపారు. అవినీతిపరుడైన ఈటలను బీజేపీలో చేర్చుకోవడం తనను బాధించిందిన్నారు. ఈటల చేరిక గురించి పార్టీ నేతలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మోత్కుపల్లి ఆరోపించారు.
ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ.. ‘‘సీఎం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పా. దళిత సాధికారత కోసమే కేసీఆర్ దళిత బంధు పథకం తెచ్చారు. అవినీతిపరుడైన ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకోవడం నన్ను బాధించింది. ఈటల చేరికపై నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. దళిత భూములను ఈటల ఆక్రమించారు.. హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు ఆయన అనర్హుడు. హుజురాబాద్ ప్రజలు ఈటలను బహిష్కరించాలి’’ అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment