హుజూరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలన రాష్ట్రానికే అరిష్టమని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తోందని, రేపటి తెలంగాణకు తొలికేక అని, బీజేపీ గెలుపులో ఇక్కడి నాయకులే పునాదిగా నిలిచారని తెలి పారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని మధువని గార్డెన్స్‌లో శనివారం పార్టీ బూత్ సభ్యుల సమ్మేళనంలో మాట్లాడారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించారన్న అక్కసుతో సీఎం కేసీఆర్ మానేరు నదిని చెరపట్టి ఇసుక తవ్వి...ఎడారి చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా టెంటు వేసి కొట్లాడుదామన్నారు. ధరణితో నష్టపోయిన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని, వారి తరఫున పోరాడుదామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment