సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మీటింగ్‌కు వెళ్లకుంటే యాంటీ దళిత ముద్ర పడేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. తాను కేసీఆర్ మీటింగ్‌కు వెళ్లడం వల్లనే బీజేపీ బతికిందన్నారు. ఏనాడు ఇంత సమయం వెచ్చించి ఇలాంటి సమావేశం జరగలేదని.. నిరుద్యోగ సమస్య పైన ఎక్కువ సేపు మాట్లాడారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ సమావేశం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా, నిన్న ప్రగతిభవన్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించగా, ఆ ఆదేశాలు పట్టించుకోకుండా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరవడమే కాకుండా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దళితుల అభివృద్ధిపై అఖిలపక్షం నిర్వహించడం అభినందనీయమన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశంలో చర్యలు తీసుకోవడం ద్వారా.. ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందంటూ ఆయన అభినందించారు. దీంతో మోత్కుపల్లి వ్యవహారంపై బీజేపీ సీరియస్ అయినట్లు వార్తలు వినిపించాయి.
చదవండి: టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుంది..
అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్!
Comments
Please login to add a commentAdd a comment