తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అదే పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీలోకి అడుగుపెట్టిన నాటి నుంచే టీడీపీ దెబ్బతింటూ వచ్చిందని, సంచలనాత్మక ‘ఓటుకు కోట్లు’ కేసు బాధ్యుడు కూడా రేవంత్ రెడ్డేనని నర్సింహులు ఆరోపించారు.