
సాక్షి, హైదరాబాద్: దళిత బంధుపై విపక్షాల కుట్రలకు నిరసనగా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆదివారం చేపట్టిన ఒక రోజు దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని రాజకీయ బ్రోకర్‌గా అభివర్ణించారు. రేవంత్‌కు వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. తమకు అడ్డమొస్తే రేవంత్‌ను తొక్కేస్తామని మోత్కుపల్లి ధ్వజమెత్తారు.
‘‘కుల వివక్షకు గురై దళితులు మానసిక క్షోభకు గురయ్యారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు దళితులవి. గ్రామాల్లో తల రుమాలు చేత పట్టుకొని, చెప్పులు చేత పట్టుకొని నడవాల్సిన దుస్థితి. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని ప్రయత్నం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. సీఎం కేసీఆర్ ఒక మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో నామమాత్రంగా దళితులకు పథకాలు పెట్టారు తప్ప.. ఇంతటి పెద్ద నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదు’ అని మోత్కుపల్లి అన్నారు.
రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మోత్కుపల్లి.. వందకు వంద శాతం ఈ పథకం అమలు చేస్తాం. ఈ పథకం అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ’’ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment