
సాక్షి, తిరుమల : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడమే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. అందుకే చంద్రబాబు ఈ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించారు. గురువారం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న మోత్కుపల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరాలని గతంలో అలిపిరి నుంచి మెట్లు ఎక్కానని గుర్తుచేశారు. తను మొక్కును నెరవేర్చిన శ్రీవారికి ఇప్పుడు మొక్కు చెల్లించుకున్నానని ఆయన తెలిపారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా గురువారం శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కావలి అభివృద్ధికి మరింత శ్రమిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్రం ఉన్నత స్థాయిలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment