
సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర ప్రజలను ఎన్టీఆర్ ఆత్మ ఆవరించి చంద్రబాబును ఓడించిందని, ఇప్పుడు ఆయన ఆత్మ నిజంగా శాంతిస్తుందని టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు వల్లనే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయాయని మండిపడ్డారు.
తనను నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు తన ఉసురే తగిలిందని చెప్పిన మోత్కుపల్లి.. చంద్రబాబును ఓడించిన ఆంధ్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment