
'తప్పని తేలితే క్షమాపణలు చెబుతాం'
కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే విద్యుత్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కేసీఆర్ కు దమ్ము ధైర్యం ఉంటే విద్యుత్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ డిమాండ్ చేశారు. అఖిలపక్షంతో చంద్రబాబుది తప్పని తేలితే క్షమాపణలు చెబుతామన్నారు.
నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని వీరు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరెంట్ అడితే పార్టీ కార్యలయాన్ని ధ్వంసం చేస్తారా అని ప్రశ్నించారు.
కేసీఆర్ చేతగానితనం వల్లే తెలంగాణలో కరెంట్ కోతలు పెరిగాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ తడాఖా చూపిస్తామన్నారు. తెలంగాణలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నా కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేకపోతున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశవాదిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.