ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి కోరినట్లు టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ చెప్పారు. ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్న ఆయనను ఇదే విషయంలో కలిశామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అనర్హత వేటుపై హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగిసిన విషయాన్ని స్పీకర్కు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో న్యాయ సలహా తీసుకుని నిర్ణయం చెబుతామని చెప్పారని తెలిపారు. హైదరాబాద్ పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ చర్యలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, ఆయన తీరుతో హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని చెప్పారు.