
'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బంద్లతో ప్రజలను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు.
పోలవరం ఆర్డినెన్స్పై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి అన్నారు. ఆర్డినెన్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తగదని మోత్కుపల్లి హితవు పలికారు.