Telangana Bandh
-
Telangana Bandh: జనవరి 10న రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌తో వాతావరణం మొత్తం మారిపోయింది. రాష్ట్రంలో అక్రమ కేసులను నిరసిస్తూ, 317 జీవోను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతాపార్టీ జనవరి 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవలే 317 జీవోను పునఃసమీక్షించాలని కరీంనగర్లో బండి సంజయ్ జాగరణ దీక్షచేపట్టారు. కోవిడ్ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్‌కు బుధవారం హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా.. జైలు నుంచి విడుదలయ్యారు. చదవండి: (పంజాబ్ పర్యటన రద్దు.. ప్రధాని మోదీ తీవ్ర అసహనం) -
ఆర్టీసీ సమ్మె : 23న ఓయూలో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బంద్‌నకు పిలుపునిచ్చి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను మరింత ఉధృతం చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు శనివారం బంద్‌లో పాల్గొన్నాయి. చాలా చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి ఇతర జేఏసీ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయ జేసీతో భేటీ.. రేపు (ఆదివారం) ఉదయం 11 గంటలకు రాజకీయ జేఏసీ నాయకులను కలవాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఎంఐఎం నేతలనూ కలవాలని నిశ్చయించారు. అక్టోబర్ 23న ఉస్మానియా యూనివర్సీటీలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జేఏసీ తీర్మానించింది. ఇక ధర్నా కార్యక్రమంలో గాయపడ్డ పోటు రంగారావుని ఆర్టీసీ జేఏసీ నేతలు కలిసి పరామర్శించనున్నారు. నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 15 వరోజుకు చేరిన సంగతి తెలిసిందే. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం : అశ్వత్థామ రెడ్డి ‘ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సంపూర్ణం అయ్యింది. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలి. బంద్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడింది. కాలయాపన మంచిది కాదు. ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతోంది. తెలంగాణ ఉద్యమం తరువాత జరిగిన ఉద్యమాల్లో ఇదే పెద్ద ఉద్యమం. ఆర్టీసీని రక్షించండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళతాం. మళ్లీ గవర్నర్ ను కలుస్తాం ఎంఐఎం నేతలను కూడా కలుస్తాం. రేపు రాజకీయ జేఏసీతో సమావేశమవుతాం. ఉద్యమ నాయకుల వేళ్లు తీసినా, తలలు నరికినా ఉద్యమం ఆగదు. తెలంగాణ ఉద్యమంలో కూడా పెట్టని కేసులు ఆర్టీసీ సమ్మెలో మా కార్మికుల పై పెడుతున్నారు’ అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. డబ్బులన్నీ ఎక్కిడికి పోతున్నాయ్.. రేపు అన్ని చౌరస్తాల్లో పువ్వులు ఇచ్చి ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరతామని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీ నేతలతో ఆదివారం సమావేశమైన అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 15 రోజుల నుంచి ఆర్టీసీకి వస్తున్న డబ్బులు ఎక్కడకు పోతున్నాయని జేఏసీ కో కన్వీనర్ వీఎస్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్మికుల వల్లే రూ.155 కోట్లు నష్టమొచ్చిందని.. ఆర్టీసీ దగ్గర కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం ఎలా చెబుతోందని నిలదీశారు. ప్రభుత్వం కచ్చితంగా తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోంది
-
కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్
-
తెలంగాణ బంద్
-
తెలంగాణ బంద్; అందరికీ కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈరోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్‌ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంద్‌కు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిందన్నారు. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్నవారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. అరెస్ట్ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె యథావిథిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరగాలి : భట్టి పోలీసులతో బంద్‌ను అణచివేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రజానికం మొత్తం అండగా ఉందన్నారు. శనివారం ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడారు. న్యాయస్థానం మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలు లేకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మెల్కొని ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు ఎందుకు మాట్లాడడం లేదు ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. 48 గంటల అధికారులతో చర్చించేబదులు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపితే సమస్య పరిష్కారం అయ్యేదన్నారు. ఉద్యమంలో ఉన్న మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్ సమ్మెపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో మాట్లాడి వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లక్ష్మణ్, బీజేపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో అబిడ్స్ లో జరిగిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఆందోళకారులతో పాటు వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ మండిపడ్డారు. ఇది నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి జరుగుతున్న పోరు అని.. ఆర్టీసీ కార్మికుల సమ్మె సకల జనుల సమ్మెగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒయూలో ఆందోళనలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎన్సీసీ గేటు వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను విద్యార్థి సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎన్సీసీ గేటు నుంచి బయటకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జంపాల రాజేశ్ రాజేశ్ నేతృత్వంలో తెలంగాణ విద్యార్థి ఫెడరేషన్(టీఎస్ఎస్) సభ్యులు ఆర్ట్స్ కాలేజీ ముందు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఓయూ ఉద్యోగుల సంఘాలు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించి బంద్‌లో పాల్గొంటున్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉద్రిక్తత ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఆందోళన చేపట్టిన వామపక్ష, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ్మినేని వీరభద్రం విమలక్క, చెరుకు సుధాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు నిరసనలు, పోలీసులు అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డ్రైవర్‌ను చితకబాదారు హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉద్రికత పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకారులు బస్సు డీజిల్ ట్యాంకర్‌కు, టైర్లకు మేకులు కొట్టారు. ఓ ప్రైవేటు డ్రైవర్‌ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. పోలీసులు వారిని అడ్డుకుని ప్రైవేటు డ్రైవర్‌ను కాపాడారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడుగురు ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గరా కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుపై రాళ్ల దాడి నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. బంద్ నేపథ్యంలో ఆర్మూర్‌లో డిపోకే బస్సులు పరిమితయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. పరకాలలో అరెస్ట్‌ల పర్వం వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మొహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఉదయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోదండరామ్, టీడీపీ నేతల అరెస్ట్ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదండరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసుల పర్యవేక్షణలో... ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. పోలీసుల పర్యవేక్షణలో డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను అధికారులు బయటకు పంపుతున్నారు. ప్రతీ బస్సులో పోలీస్ సిబ్బంది ఉన్నారు. డిపో నుంచి బస్సులు బయటకు రాగానే ఆర్టీసీ కార్మిక నేతలు, కార్మికులు వాటిని అడ్డుకుంటున్నారు. పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. జిల్లాలోని అన్ని డిపోలు, బస్టాండ్లు, వాటి పరిసరాల్లో భారీగా పోలీస్ బలగాలను మొహరించారు. ఆర్టీసీ బంద్‌కు వాణిజ్య, వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ బంద్ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోల వద్ద భారీగా పోలీస్ బలగాలన మొహరించారు. బీజేపీ, వామపక్షాల నేతల అరెస్ట్ రాష్ట్ర బంద్ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 14 మంది బీజేపీ, సీపీఐ, ఆర్టీసీ నాయకులను తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ బస్ డిపో ముందు ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షణలో పోలీసులు మొహరించారు. ఆసిఫాబాద్ బస్సు డిపో ముందు డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మతో ఎక్కడికక్కడే బస్సు లు నిలిచిపోయాయి. భారీగా పోలీసుల మొహరింపు నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల ఎదుట భారీగా పోలీసులను మొహరించారు. అర్ధరాత్రి నుంచి కార్మిక సంఘాల నేతలు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో 6 డిపోల పరిధిలో 670 బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రోడ్డు ఎక్కని బస్సులతో ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. బోధన్ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ బస్ డిపో ముందు ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ బంద్: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకుమద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ బంద్’ కారణంగా నగరంలో ప్రజారవాణా స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. ఇప్పటి వరకు ప్రైవేట్ సిబ్బంది సహాయంతోఅరకొరగా నడుస్తున్న సిటీ బస్సులూ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ స్టేట్ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ ‘తెలంగాణ బంద్’కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలన్నీ ఆర్టీసీ మద్దతు తెలిపాయి. 14 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె, తెలంగాణ బంద్, సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన, ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రవాణా అధికారులు బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిసారించారు. ‘ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలను ముమ్మరం చేశాం. చర్చలు సఫలమై కార్మికులు విధుల్లో చేరితే మంచిదే.. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణం కష్టమే... గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం సుమారు 3,750 బస్సులు 32 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. సమ్మె కారణంగా 14 రోజులుగా 1200–1400 బస్సులు మాత్రమే రోడ్డెక్కుతున్నాయి. ఈ బస్సులను సైతం కేవలం పగటిపూట మాత్రమే నడుపుతున్నారు. శనివారం నిర్వహించనున్న బంద్ దృష్ట్యా ఇవి కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. దీంతో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికానున్నారు. మరోవైపు నగరం నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. దూరప్రాంతాల బస్సులు నిలిచిపోతే మరో లక్ష మంది వరకు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. నగరంలో నివాసం ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు విధులకు హాజరుకావడం కష్టమే. బీజేపీ, ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్‌పల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్మికులు ఆటోలకు బ్రేక్... గ్రేటర్లో సుమారు 1.4 లక్షల ఆటోలు ఉన్నాయి. 5 లక్షల మందికి పైగా ఆటోరిక్షాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. బంద్ వల్ల వీటికీ బ్రేక్ పడనుంది.ఆటో డ్రైవర్లు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్తిరెడ్డి పిలుపునిచ్చారు. దీంతో ప్రత్యేకించి అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు తదితరులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే సమ్మె కారణంగా సిటీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రధాన ఆసుపత్రులకు వచ్చే బయటి రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. బంద్ కారణంగా తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లాల్సిన రోగులకు అసౌకర్యం కలగనుంది. అలాగే పాలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల రవాణాకు కూడా తీవ్ర అంతరాయం కలగనుంది. క్యాబ్‌లు బంద్... నగరంలో 50వేలకు పైగా ఉబర్, ఓలా తదితర క్యాబ్‌లు బంద్‌లో పాల్గొనున్న నేపథ్యంలో మరో 5 లక్షల మందికి పైగా ప్రయాణికులకు రవాణా సదుపాయం స్తంభించనుంది. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 5వేలకు పైగా క్యాబ్‌లు కూడా నిలిచిపోనుండడంతో డోమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. వైద్య సేవలు యథాతథం బంద్ నేపథ్యంలో శనివారం వైద్యసేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. 108 అత్యవసర సర్వీసులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. రైళ్లు.. రయ్ రయ్ బంద్ నేపథ్యంలో మెట్రో రైళ్లను ప్రతి 3నిమిషాలకు ఒకటి చొప్పున నడపనున్నట్లు అధికారులు తెలిపారు. నాగోల్–అమీర్‌పేట్–హైటెక్‌సిటీ, ఎల్బీనగర్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో సుమారు 4లక్షల మంది మెట్రో సేవలు వినియోగించుకునే అవకాశముంది. అలాగే ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి–లింగంపల్లి మార్గాల్లో 121ఎంఎటీఎస్ సర్వీసులు యథావిధిగానడుస్తాయి. 1.5 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకోనున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్–బొల్లారం మధ్య నడిచే డెమూ రైలునుశనివారం మేడ్చల్ వరకు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ఓప్రకటనలో పేర్కొన్నారు. అలాగే కాచిగూడ–నిజామాబాద్, కాచిగూడ–కర్నూల్ సిటీ మధ్య మరో రెండు జన సాధారణ రైళ్లుఅదనంగా నడవనున్నాయి. -
నేడే తెలంగాణ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేసే చర్యల్లో భాగంగా శనివారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జేఏసీ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను తీవ్రతరం చేయనుంది. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సిద్ధమని ప్రకటిస్తూనే సమ్మెను మాత్రం ఆపేది లేదని ప్రకటించింది. బంద్ లో భాగంగా శుక్రవారం 14వ రోజున సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలతో ఆర్టీసీ జేఏసీ హోరెత్తించింది. అన్ని డిపోల వద్ద కార్మికులతో గేట్ మీటింగ్‌లు నిర్వహించింది. వ్యాపారులు కూడా బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని, ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్న బంద్ అయినందున ప్రజలు కూడా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసింది. బంద్‌కు టీఆర్ఎస్, మజ్లిస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, ప్రజాసంఘాలు, ఆటో, క్యాబ్ సంఘాలు మద్దతు ఇప్పటికే పలి కాయి. బంద్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ శనివారం మధ్యాహ్నం లంచ్ అవర్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీల్లో బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నాయి. హైదరాబాద్‌లోని రామ్ నగర్ కూడలి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, పార్టీ కార్యకర్తలు, òకార్మికులు జేఏసీ–1 కన్వీనర్ హన్మంతు ఆధ్వర్యంలో పాల్గొన్నారు. అంతకుముందు బాగ్‌లింగంపల్లి వద్ద ర్యాలీకి హాజరయ్యేందుకు వచ్చిన జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. ఇబ్రహీంపట్నం డిపో ఎదుట కార్మికులు బస్సులను బయటకు రాకుండా అడ్డుకోగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. షాద్‌నగర్‌లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఆర్టీసీ కార్మికులు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బైక్ ర్యాలీకి కేవీసీఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మాదిగ దండోరా నాయకులు మద్దతు పలికారు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ తాత్కాలిక డ్రైవర్ గురువారం రాత్రి‡ అదే బస్సులోని తాత్కాలిక మహిళా కండక్టర్‌పై అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్షించారు. బస్సులు తిప్పేలా సర్కారు ఏర్పాట్లు ఆర్టీసీ జేఏసీ శనివారం తెలంగాణ బంద్ చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంద్ ప్రభావం పడకుండా వీలైనన్ని ఎక్కువ బస్సులు తిప్పేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో శుక్రవారం చాలా బస్సుల్లో కండక్టర్లకు టికెట్ల జారీ యంత్రాల వాడకంపై శిక్షణ ఇచ్చి అందించినా చాలా మంది కండక్టర్లు వాటిని ఆపరేట్ చేయలేక సంప్రదాయ టికెట్ ట్రేలు అడిగి తీసుకెళ్లారు. సమ్మె యథాతథం: అశ్వత్థామరెడ్డి కోర్టు ఆదేశం మేరకు ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్ రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వమే స్పందించలేదని, కోర్టు ఆదేశంతోనైనా సర్కారు చర్చలకు సిద్ధం కావాలన్నారు. తాము ప్రభుత్వం ముందుంచిన 26 డిమాం డ్లపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చలకు సిద్ధం కావాలని కోర్టు చెప్పినంత మాత్రాన సమ్మెను విరమించాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ప్రకటించినట్టుగా శనివారం రాష్ట్ర బంద్ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల కడుపు మండి ఉద్యమం చేస్తున్నామని, రాజకీయ లబ్ధి కోసం మాత్రం కాదని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా జరిగిన సదస్సులో అశ్వత్థామరెడ్డి పాల్గొని మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చర్చలపై ప్రతిష్టంభన! ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని శుక్రవారం హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆ శాఖ కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఈడీలు సీఎంతో భేటీ కోసం ప్రగతి భవన్ వెళ్లారు. అయితే ఓ వివాహ కార్యక్రమం, మరో వివాహ నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ వెళ్లడంతో ఈ భేటీ సాధ్యం కాలేదు. శనివారం ఉదయం చర్చిద్దామని సీఎం చెప్పడంతో వారు అక్కడి నుంచి వెనుతిరిగారు. చర్చల ప్రక్రియను ఆర్టీసీ యాజమాన్యం ప్రారంభించాలంటూ హైకోర్టు స్పష్టం చేయడంతో ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్‌శర్మ అందుకు సమాయత్తమవుతున్నారు. చర్చలు ప్రారంభిస్తే అనుసరించాల్సిన వ్యూహం కోసం ఆర్టీసీ ఈడీలతో శనివారం ఉదయం 10 గంటలకు ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మంత్రులతో కలసి సీఎంతో భేటీ అయ్యే అవకాశముంది. -
ఆర్టీసీ సమ్మెపై పవన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలిపింది. జనసేన పార్టీ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. సమ్మె చేపట్టిన 48 వేల మంది కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అభిప్రాయపడ్డారు. సమ్మెకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె, తాజా పరిస్థితులపై ఆయన సోమవారం పార్టీ నాయకులతో హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికుల జేఏసీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి హింసకు తావులేకుండా.. శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. ఖమ్మంలో శ్రీనివాస్‌రెడ్డి, రాణిగంజ్ డిపోకు చెందిన సురేందర్ గౌడ్లు బలవన్మరణానికి పాల్పడటం సమ్మె తీవ్రతను తెలియజేస్తుందని అన్నారు. కార్మికుల డిమాండ్లు ఎంతవరకు ఆమోదయోగ్యం అనే అంశాన్ని పక్కనబెట్టి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ఒకే సారి 48వేల మంది ఉద్యోగులను తొలగించడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఇలా చేయడం ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తుందన్నారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపి.. వారి డిమాండ్లను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థుల అరెస్ట్.. రేపు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేటు యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నంచిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు చేశారంటూ విద్యార్థి సంఘాలు గురువారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రముఖ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎస్ఓ, టీఎస్‌ఎఫ్‌ల ఆధ్యర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడించేందుకు బుధవారం ఉదయం నిజాం కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసు లాఠీ చార్జ్ చేయడానకి యత్నించడంతో తోపులాట జరిగింది. చివరకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులని కూడా చూడకుండా.. ముట్టడిలో పాల్గొన్న విద్యార్థినులను సైతం మగ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు. అరెస్ట్ అయి పోలీసు స్టేషన్లో ఉన్న నాయకులు అక్కడే మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘ నాయకులు కోట రమేష్, శివరామకృష్ణ, జూపాక శ్రీనివాస్, గంగాధర్, సందీప్, శోభన్ నాయక్‌లు మాట్లాడుతూ.. విద్యను అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి అని, ప్రభుత్వం తన భాద్యతను మరిచి ప్రైవేట్‌కు దాసోహమవుంతోందని విమర్శించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల వల్ల విద్య వ్యాపారంగా మారుతుందని, ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. ఫీజులు, పాఠ్యాంశాలు, ప్రవేశ విధానాలను అవే నిర్ణయించడం వల్ల దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాతంత్ర హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. -
రేపు తెలంగాణ బంద్‌కు దళిత జేఏసీ పిలుపు
నాగోలు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ మృతికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ దళిత సంఘాల జేఏసీ రేపు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దళిత సంఘ నాయకులు బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రోహిత్ మృతికి ఏబీవీపీ నాయకులు, కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వీసీ అప్పారావుల వేధింపులే కారణమని ఆరోపించారు. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో దళిత సంఘాల జేఏసీ ఛైర్మన్ ఈదుల పరశురాం, నాయకులు శ్రీధర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ బంద్ ప్రశాంతం
-
తెలంగాణ బంద్ ప్రశాంతం
* రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించిన విపక్షాలు * రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ * అక్కడక్కడా స్వల్ప ఉద్రిక్తత.. ఏడు ఆర్టీసీ బస్సులు ధ్వంసం * 228 కేసులు నమోదు.. దాదాపు 8,048 మంది అరెస్టు * హైదరాబాద్‌లో బంద్ పాక్షికం * కేసీఆర్ ఒక నియంత: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సహా విపక్షాలు పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ శనివారం ప్రశాంతంగా జరిగింది. బంద్ నేపథ్యంలో ఉదయం నుంచే వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి.. దుకాణాలను మూయించారు. ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల దుకాణాలు, స్కూళ్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలను కార్యకర్తలు మూయించగా... మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా బంద్ పాటించారు. బంద్ సందర్భంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,048 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడక్కడ చోటు చేసుకున్న స్వల్ప ఉద్రిక్తతలు, దాడుల వంటి ఘటనలపై 228 కేసులు నమోదయ్యాయి. ఏడు ఆర్టీసీ బస్సులకు నష్టం వాటిల్లింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీసీ బస్సులను నడిపించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిలను హైదరాబాద్‌లో బస్సు డిపోల వద్ద ధర్నా చేస్తుండగా... టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డిలను సికింద్రాబాద్‌లో అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా...: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మహేశ్వరంలో మాజీ మంత్రి సబితారెడ్డి, పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పి.చంద్రయ్య, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి యాదయ్య, కమ్యూనిస్టు పార్టీ నేతలు బస్‌డిపోల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో దుకాణాలు, హోటళ్లు, పాఠశాలలను మూసివేశారు. పలుచోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలు, వాగ్వాదాలు జరిగాయి. ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, కోదండరాంరెడ్డి, జగ్గారెడ్డి బంద్ నిరసనల్లో పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో విపక్షాల నేతలు కార్యకర్తలు ఆర్టీసీ బస్సులను అడ్డగించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేయించారు. బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జిన్నారెడ్డి మహేందర్‌రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. విపక్షాలన్నీ కలసి.. నిజామాబాద్ జిల్లాలో విపక్షాల నేతలంతా కలసి నిరసనలు తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కల్వకుర్తిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌లో ఆందోళన చేస్తున్న మాజీ మంత్రి డీకే అరుణ, టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. కల్వకుర్తిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి తదితరులు బంద్‌లో పాల్గొన్నారు. ఇక నల్లగొండ జిల్లాలో భువనగిరి, మునుగోడు, దేవరకొండ, హాలియా, గుర్రంపోడు, త్రిపురారం, నిడమనూరులలో రాస్తారోకో చేస్తున్న 150 మంది నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేశారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ర్యాలీ నిర్వహించారు. సత్తుపల్లిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా దయానంద్‌ను, మణుగూరులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బస్సులు పాక్షికంగా నడిచాయి. భైంసాలో అఖిలపక్ష నాయకులు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రాజధానిలో.. హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. కొద్దిసేపు బస్సుల రాకపోకలు నిలిచిపోయినా.. ఆ తరువాత యథావిధిగా కొనసాగాయి. పెట్రోల్ బంకులు, దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను కొద్దిసేపు మూసి ఉంచారు. అబిడ్స్ వద్ద ఆందోళనకారులు రెండు బస్సుల అద్దాలు పగులగొట్టారు. స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు కావడంతో బంద్ ప్రభావం తక్కువగానే కనిపించింది. విపక్షాలు నిర్వహించిన ఈ బంద్‌లో తెలుగుదేశం పార్టీ ముఖ్య భూమిక పోషించింది. కానీ ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ మాల్స్ మాత్రం యథావిధిగా పనిచేయడం గమనార్హం. పోటీలు పడి దుకాణాలను మూయించిన టీడీపీ, బీజేపీ నాయకులు వీటి జోలికి మాత్రం వెళ్లలేదు. కేసీఆర్ నియంత రాష్ట్రాన్ని కేసీఆర్ నియంతలా పాలిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వరి, పత్తి, మొక్కజొన్న రైతులకు అదనంగా బోనస్ ఇవ్వాలని... ఆత్మహత్య చేసుకున్న రైతులందరికీ పెంచిన ఎక్స్‌గ్రేషియా అందజేయాలని కోరారు. రైతులకు సంఘీభావంగా ప్రతిపక్షాలు చేపట్టిన బంద్‌ను అడ్డుకొనేందుకు సీఎం కేసీఆర్ ఎంతగా ప్రయత్నించినా... అన్ని జిల్లాల్లో విజయవంతమైందని చెప్పారు. -
రెండో శనివారం బంద్ చేసినా సక్సెస్ కాలేదు..
హైదరాబాద్ : విపక్షాలు రెండో శనివారం బంద్‌కు పిలుపునిచ్చినా విజయవంతం కాలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బంద్‌కు ప్రయత్నించిన చోట ప్రజలే తిరగబడ్డారని ఆయన అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ...అలాగే ఏకకాలంగా రుణాలు మాఫీ చేయాలంటూ విపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. రేస్ కోర్స్పై వాణిజ్య పన్నులశాఖ దాడులు జరిపిందని తలసాని తెలిపారు. రేస్ కోర్స్ స్థలంపై కొన్ని అవకతవకలు బయటపడ్డాయని, ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే యోచనలో ఉందని ఆయన పేర్కొన్నారు. రేస్ కోర్సు ప్రాంతంలో ఐటీ పార్క్, సైబర్ టవర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కరీంనగర్లో బస్‌డిపోల వద్ద ధర్నా
-
బంద్‌ను ఆపాలని చూస్తోంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం మాని బంద్‌ను ఆపాలని చూస్తోంది తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే శనివారం రాష్ట్రంలోని వివిధ బస్సు డిపోల వద్ద బంద్ నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు పార్టీల నేతలు స్పందించారు. నేతల అరెస్ట్ అప్రజాస్వామికమని వారు ఆరోపించారు. తాము పిలుపు నిచ్చిన బంద్‌కి అన్ని వర్గాల మద్దతు ఉందన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు రుణాలు ఒకే దఫాలో మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము పిలుపు నిచ్చిన బంద్‌ను టీఆర్ఎస్ ముఖ్యనేతలు మినహా ఎవరూ వ్యతిరేకించడం లేదని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల నాయకులు స్పష్టం చేశారు. -
తెలంగాణ బంద్ ఉద్రిక్తం
-
దానం, అంజన్న అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని ఆపివేశారు. ఆగ్రహించిన దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్యాదవ్లతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపై బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఒకే దఫా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలోని కాంగ్రెస్‌తోపాటు వివిధ రాజకీయ పక్షాలు అక్టోబర్ 10వ తేదీన తెలంగాణలో బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం చార్మినార్ నుంచి సికింద్రాబాద్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామంటే ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. అనంతరం రహదారిపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో నాగేందర్, అంజన్ కుమార్ యాదవ్‌లతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. -
10న బంద్‌కు పిలుపునిచ్చిన నేతలు
-
ఈనెల 9వరకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒకరోజు కోత పడింది. ఈ నెల 9వ తేదీ వరకే సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఒకరోజు ముందుగానే సమావేశాలు ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రైతు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఈనెల 9 వరకు గడువు ఇస్తున్నామని, ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా స్పందించకపోతే 10వ తేదీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కుదింపు ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు తెలంగాణ బంద్
-
నేడు తెలంగాణ బంద్
* మున్సిపల్ సమ్మెపై సర్కారు తీరుకు నిరసనగా వామపక్షాల పిలుపు * మద్దతు పలికిన కాంగ్రెస్, టీటీడీపీ, తెలంగాణ వైఎస్సార్సీపీ * 11వ రోజుకు చేరిన సమ్మె.. జిల్లాల్లో 83% మంది విధులకు దూరం * కార్మిక సంఘాలతో సర్కారు చర్చలు మళ్లీ విఫలం... * 18, 19 తేదీల్లో మున్సిపల్ అధికారులకు సెలవులు రద్దు చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు కాంగ్రెస్, టీటీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ సహా అన్ని విపక్ష పార్టీలు, పలు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. మున్సిపల్ కార్మికులకు సంఘీభావంగా బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొని నిరసనలు తెలుపుతామని వివిధ పార్టీల నేతలు తెలిపారు. బంద్‌కు విపక్షాలు, సంఘాలు మద్దతిస్తుండడంతో.. రాష్ట్రవ్యాప్తంగా జన జీవనంపై ప్రభావం పడనుంది. దుకాణాలు, ఇతర సేవలు నిలిచిపోనున్నాయి. మరోవైపు మున్సిపల్ కార్మికుల సమ్మెపై గురువారం జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా 11వ రోజూ సమ్మె కొనసాగింది. కాగా, గురువారం నాటికి సమ్మె విరమించిన జీహెచ్ఎంసీ కార్మికులకే వేతనాల పెంపు వర్తిస్తుందనే షరతులతో పాటు విధుల్లో చేరని కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశించడంపై కార్మిక సంఘాల జేఏసీతో పాటు వామపక్షాలు మండిపడ్డాయి. జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలను పెంపుపై సీఎం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి గురువారం రాత్రి సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేశారు. దీనిపై వామపక్షాల నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, జానకి రాములు తదితరులు చర్చించుకుని శుక్రవారం నాటి బంద్‌కు కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. వేతనాల పెంపు నిర్ణయం అస్పష్టంగా ఉందని, ఇతర మున్సిపాలిటీల కార్మికుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఉద్ఘాటించారు. వేతనాల పెంపు సహా 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 6 నుంచి మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమ్మెకు మద్దతుగా వామపక్షాలు బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం రాష్ట్ర బంద్‌కు వామపక్షాలు, కార్మిక సంఘాలు, మున్సిపల్ కార్మిక జేఏసీ పిలుపునిచ్చాయి. ప్రభుత్వ తీరు సరి కాదు: నేతలు పారిశుధ్య కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ తీరు సరికాదని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. సమ్మెపై అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ మండిపడింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కార్మికుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్‌లో చెత్తగుట్టలు పేరుకుపోతుంటే ఎంఐఎం పార్టీకి కనిపించడం లేదా అని వి.హనుమంతరావు ప్రశ్నించారు. చెత్తకంపులో రంజాన్ ఎలా జరుపుకుంటారన్నారు. కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, అందుకే బంద్‌కు మద్దతిస్తున్నామని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసులు ఎత్తేయాలని డీజీపీకి వినతి మున్సిపల్ సమ్మె సందర్భంగా నిరసనల్లో పాల్గొన్న కార్మికులు, వామపక్ష కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మకు లెఫ్ట్ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం వారు డీజీపీకి ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. తగ్గని సమ్మె ఉధృతి మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమ్మె ఉధృతి తగ్గలేదు. హైదరాబాద్‌లో సమ్మె ప్రభావం క్రమంగా తగ్గుతోందని జీహెచ్ఎంసీ చెబుతున్నా.. రాష్ట్రంలోని ఇతర 67 నగరాలు, పట్టణాల్లో మాత్రం సమ్మె కొనసాగుతోంది. జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 83 శాతం కార్మికులు విధులకు దూరంగా ఉంటున్నారు. మొత్తం 15,345 మంది పారిశుధ్య, పారిశుధ్యేతర కార్మికులు పనిచేస్తుండగా.. గురువారం వారిలో 12,578 మంది సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 2,587 మందే విధులకు హాజరయ్యారు. మరోవైపు రంజాన్ నేపథ్యంలో పురపాలక శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈనెల 18(రంజాన్ సెలవు), 19న సెలవును రద్దు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు బి.జనార్దన్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీచేశారు. పారిశుధ్య నిర్వహణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, పోలీసుల సాయం తీసు కోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బంద్‌కు సహకరించాలి వామపక్షాలు శుక్రవారం నాటి బంద్‌కు సహకరించాలని ఆర్టీసీ యాజమాన్యం, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రజలకు పది వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. పుష్కరాలు, రంజాన్ సందర్భంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ, మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి మద్దతు పలకాలని కోరాయి. గురువారం ఎంబీ భవన్లో చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ-రాయల), జానకిరాములు (ఆర్ఎస్పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ) తదితర పార్టీల నాయకులు సమావేశమై బంద్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటలకు ఎంజీబీఎస్ బస్ డిపో వద్ద పది వామపక్షాల నాయకులు బస్ రోకోలో పాల్గొంటారని తెలిపాయి. -
తెలంగాణ బంద్ యథాతథం
హైదరాబాద్: ఎంబీభవన్‌లో గురువారం మున్సిపల్ కార్మిక సంఘాల సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం కార్మిక సంఘాలు శుక్రవారం తెలంగాణ బంద్‌ను యథాతథంగా జరగనున్నట్టు వెల్లడించాయి. సమ్మె యథాతథంగా జరుగుతుందని, బంద్‌కు ప్రజలు సహకరించాలని కార్మిక సంఘాలు కోరాయి. తెలంగాణ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘16న తెలంగాణ బంద్’
హైదరాబాద్: దళితులను మోసం చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వ తీరుకు నిరసన గా ఫిబ్రవరి 16వ తేదీని విద్రోహ దినంగా తెలంగాణ బంద్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ మాలల జేఏసీ చైర్మన్ బి.దీపక్‌కుమార్, వైస్ చైర్మన్ పి.అనిల్‌కుమార్ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ తెలిపారు. -
ఆర్టీసీపై ‘తెలంగాణ’ బంద్ ఎఫెక్ట్
కర్నూలు(రాజ్‌విహార్): తెలంగాణ బంద్ రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులు తెల్లవారు జామున ఉదయం 5గంటల నుంచే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టారు వైపు వెళ్లే బస్సులన్నీ నిలిపివేశారు. బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి నుంచి వచ్చిన సర్వీసులన్నీ కర్నూలు నుంచే వెనక్కి పంపారు. మధ్యాహ్నం 2గంటల తరువాత క్రమంగా బస్సులు కదిలాయి. దీంతో ఆర్టీసీకి రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి. రామం పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు కర్నూలు మీదుగా ప్రతి రోజు 180 బస్సులు తెలంగాణ సెక్టారుకు వెళ్లి వస్తుంటాయి. ఇందులో హైదరాబాద్‌కే 115 బస్సులు తిరుగుతున్నాయి. కర్నూలు-1 డిపో చెందిన 10 బస్సులతో పాటు ఎమ్మిగనూరు-8, ఆళ్లగడ్డ-10, కర్నూలు-2 డిపో 14, కోవెలకుంట్ల 6, బనగానపల్లె 9, నంద్యాల 22, డోన్ 12, నందికొట్కూరు 5, ఆదోని 11, ఆత్మకూరు డిపోకు చెందిన 8 బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేగాక గద్వాల, అలంపూర్, మహబూబ్ నగర్, ఐజ, శాంతినగర్, కోరాడ, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే కర్నూలు-1, ఆత్మకూరు, కర్నూలు-2 డిపోలకు చెందిన మరో 65 బస్సులు కూడా రద్దయ్యాయి. ఇటు ఇతర జిల్లాల నుంచి వచ్చే మరో 15 బస్సులు కూడా కదల్లేదు. బంద్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
బంద్ ప్రశాంతం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగి సింది. ఖమ్మం జిల్లాలో పోలవరం వద్ద ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ చేయడాన్ని వివిధ రాజకీయపార్టీలు తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. నల్లగొండలో ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారుజామునే టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ జిల్లా నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, రసూల్, రేఖల భద్రాద్రి, జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం వద్ద ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. తిప్పర్తిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ైబైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో హైవేపై నిరసన ప్రదర్శన చేశారు. మునుగోడు, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం, చండూరులో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. కోదాడ పట్టణంలో టీజేఏసీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు బంద్ నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. కోదాడ బస్‌డిపో ఎదుట నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తిరుమలగిరిలో టీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. శాలిగౌరారం, మోత్కూరులో టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో జరిగింది. నూతనకల్, తుంగతుర్తి, అర్వపల్లిలో టీఆర్ఎస్, పీడీఎస్‌యూ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. నకిరేకల్‌లో వ్యాపార, వాణి జ్య సంస్థలు తెరుచుకోలేదు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి మండల కేంద్రాల్లో టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిట్యాలలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. నార్కట్‌పల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన అనతంరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హాలియా, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, నాగార్జునసాగర్‌లలో టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు నిరసన ర్యాలీలు, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలో బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ాల్గొన్నారు. టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దామరచర్ల మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దేవరకొండ బస్టాండ్ ఎదుట ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, జేఏసీల ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే పట్టణంలో బంద్ చేయించారు. భువనగిరిలో టీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. బీబీనగర్‌లో బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. వలిగొండ, పోచంపల్లిలో కాంగ్రెస్ సీపీఎం, టీఆర్ఎస్ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూర్నగర్, గరిడేపల్లిలలో సీపీఎం, సీపీఐ, మఠంపల్లిలో టీఆర్ఎస్, నేరేడుచర్లలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్, మేళ్లచెరువులో టీఆర్ఎస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. పోలవరం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కదలని బస్సులు నల్లగొండ అర్బన్ : ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ శనివారం జరిగిన బంద్‌తో మధ్యాహ్నం దాకా ఒక్కబస్సు కూడా డిపోలనుంచి బయటికి రాలేదు. విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, జేఏసీ ప్రతినిధులు తెల్లవారుజామునే డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం 12గంటల వరకు బస్సులు డిపోల గేట్లు దాటలేదు. ఆ తర్వాత బస్సులను నడిపారు. జిల్లాలోని ఏడు డిపోల్లో మొత్తం 732 బస్సులుండగా రోజూ 685 షెడ్యూల్లు నడుస్తాయి. కానీ బంద్ వల్ల 362 రూట్లలో మాత్రమే బస్సులు మధ్యాహ్నం తరువాత నడిపారు. బంద్ వల్ల ప్రయాణికులు రాకపోకలు మానేయడంతో పలు రూట్లలో బస్సులు ఖాళీగా నడిపారు. బంద్ కారణంగా రూ.40లక్షల మేర నష్టం వాటిల్లినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
బంద్...
- 300 మందికి పైగా అరెస్ట్.. విడుదల - బస్సు సర్వీసులకు ఆటంకం - పలుచోట్ల దిష్టిబొమ్మల దహనం సాక్షి, సిటీబ్యూరో: ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజకీయ జేఏసీ, టీఆర్ఎస్, వామపక్ష పార్టీలు శనివారం చేపట్టిన తెలంగాణ బంద్ నగరంలో స్వల్ప ఉద్రిక్తల నడుమ ప్రశాంతంగా ముగిసింది. బంద్ వ ల్ల ఆర్టీసీ ముందస్తుగా 250 బస్సులను రద్దు చేసింది. 500 సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంఎంటీఎస్ రైలే సర్వీసులు యధావిధిగా నడిచాయి. ఆందోళనకారులు ఉదయం ఏడు గంటలకే రోడ్డు పైకి వచ్చి విద్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోలు బంక్‌లను బలవంతంగా బంద్ చేయించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల, జేఎన్టీయూ క్యాంపస్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీ నగర్, చందా నగర్, ఫలక్‌నుమా స్టేషన్, ముసారంబాగ్, కొత్తపేట్, చాదర్‌ఘాట్, సైదాబాద్, మాదన్నపేట, సరూర్‌నగర్, మల్కజ్గిరి, బాలాపూర్ చౌరస్తాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలనూ దహనం చేశారు. హస్తినాపురం చౌరస్తాలో ఏపీ సీఏం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బంద్ వల్ల మెజంజాహీ మార్కెట్, కోఠి, అబిడ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమయత్‌నగర్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాలు బోసిపోయాయి. జంట నగర కమిషనరేట్ల పరిధిలో సుమారు 300 మంది ఆందోళనకారులను అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అట్టుడికిన ఆర్టీసీ క్రాస్ రోడ్డు నిరసనలు, నినాదాలు, దిష్టిబొమ్మల దహనం, బైఠాయింపులు, అరెస్ట్‌లతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు అట్టుడికింది. కొంత మంది ఆందోళనకారులు రోడ్డు పైకి వచ్చిన ఆర్టీసీ బస్సులను ఆపి, టైర్లలో గాలి తీశారు. అవి రోడ్డుపైనే నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో పలువును తెలంగాణ వాదులు చిక్కడపల్లి వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించగా, స్వరాజ్ హోటల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయగా, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ సహా సీపీఎం నాయకుడు వీరయ్య, డీజీ న రసింహారావు, సీపీఐ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజిజ్ పాషా, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్క, సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు గోవర్థన్, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పద్మ, సత్య తదితర నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నం తెలంగాణ జాగృతికి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో పోలీసులు ముందస్తుగా తెలంగాణ జాగృతి నేతలను అరెస్టు చేశారు. బువ్వ తెలంగాణ కావాలి... తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉపాధ్యక్షుడు వేదకుమార్ నిరసన తెలిపారు. ప్రజా కళాకారులు ధూం ధాం ఆటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ, ఎన్నికలు, రాజకీయ పార్టీల ద్వారా తెలంగాణ రాలేదని, కేవలం ఉద్యమాలతోనే సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అలా వచ్చిందని ఎవరైనా భ్రమపడితే భవిష్యత్తే వారికి సరైన సమాధానం ఇస్తుందని చెప్పారు. బంగారు తెలంగాణ కంటే ముందు బువ్వ తెలంగాణ కావాలని కోరారు. గిరిజనులపై దాడి లాంటిదే:? - ప్రొఫెసర్ కోదండరామ్ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అమాయక గిరిజనులపై దాడి చేయడం లాంటిదేనని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. గత యూపీఏ ప్రభుత్వ విధానాలనే తాము అనుసరిస్తున్నామని బీజేపీ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. యూపీఏ ప్రభుత్వ విధానాలు కొనసాగించేందుకే మీరు అధికారంలోకి వచ్చారా? అని ఘటుగా ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఏకపక్షంగా బిల్లును ఆమోదించే వారు కాదని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్‌ను లోకసభలో ఆమోదించి ఖమ్మంలోని రెండు లక్షల మంది గిరిజనులకు తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. బిల్లు ఉపసంహరించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ (రాయల వర్గం) కేంద్ర కమిటీ సభ్యుడు పి.సూర్యం మాట్లాడుతూ పోలవరం ఆర్డినెన్స్‌ను అప్రజాస్వామికంగా ఆమోదించారని ధ్వజమెత్తారు.సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ (చంద్రన్న వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు కె.గోవర్థన్ మాట్లాడుతూ బడాపారిశ్రామికవేత్తలకు మేలు చేయడానికే పోలవరం నిర్మిస్తున్నారని ఆరోపించారు. 300 గ్రామాలను ముంచేసి 2 లక్షలకు పైగా గిరిజనుల అస్థిత్వాన్ని దెబ్బ తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్: పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దాంతో తెలంగాణ జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లో బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో బంద్ ప్రభావం కనిపించటం లేదు. బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కాగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. సీపీఐ, సీపీఎం, సీపీఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. వర్తక, వాణిజ్య, విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. జిల్లాలోని ఆరు డిపోల్లో 625 బస్సులు నిలిచిపోయాయి. డిపోల ఎదుట నిరసన తెలుపుతూ బస్సులను అడ్డుకుంటున్న పలువురు వామపక్ష కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ బంద్ సందర్భంగా జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. 9 డిపోల్లో 850 బస్సులను నిలిపివేశారు. డిపోల ఎదుట టీఆర్ఎస్, వామపక్షాల నిరసన తెలుపుతున్నాయి నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. బంద్ కారణంగా మొత్తం 650 బస్సులు నిలిచిపోయాయి. బస్టాండ్ వద్ద ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత పాల్గొని బంద్ కు మద్దతు తెలిపారు. నల్గొండ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, నల్గొండ, నార్కెట్‌పల్లి, యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోల ముందు శనివారం తెల్లవారుజాము నుంచే వివిధ పార్టీల శ్రేణులు, సంఘాలు బైటాయించి నిరసన తెలుపుతున్నారు. కరీంనగర్ పోలవరం బిల్లుకు నిరసనగా కరీంనగర్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్ బస్టాండ్ ఎదుట టీఆర్ఎస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. వరంగల్ వరంగల్ జిల్లాలో బంద్ కొనసాగుతోంది. అన్నివర్గాల ప్రజలు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జనగామ బస్సు డిపో ఎదుట వామపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని వారు నినాదాలు చేశారు. In English : Polavaram Bill: Telangana bandh underway -
బంద్...బంద్...
-
నేడు బంద్
- టీజేఏసీ, వామపక్షాల పిలుపు - సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ - పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ - ఆమోదంపై ఎగిసిన నిరసన జ్వాల వరంగల్ : పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర ప్రాంతంలో కలుపుతూ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగావ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పోరుబాట పట్టి కేంద్ర మెడలు వంచుతామన్నారు. నేటి బంద్‌కు ఆర్టీసీ, వ్యాపార వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు. బంద్‌ను జయప్రదం చేసి కేంద్రానికి కనువిప్పు కలిగించాలని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు చంద్రన్న, మండల వెంకన్న, సీపీఎం నగర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ పంచాయత్‌రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాదుల ప్రసాద్ తదితరులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు వైఖరి స్పష్టం చేయాలి : తక్కళ్లపల్లి పోలవరం ఆరినెన్స్పై తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడి ఒత్తిడితోనే కేంద్రప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిందన్నారు. ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం తెచ్చిన అక్రమ ఆర్డినెన్స్‌పై టీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతారో... తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తారో స్పష్టం చేయాలని టీ టీడీపీ నేతలను నిలదీశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు తమ పార్టీపై ఒత్తిడి చేసి ఆర్డినెన్స్‌ను రద్దు చేయించి గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు. చంద్రబాబు ఏం చెబుతారు.. ఆంధ్ర ప్రాంతానికి ఎన్డీయే ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. హన్మకొండలోని ఆమె నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు అడ్డుకున్నా టీ టీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకోకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ విప్‌జారీ చేసి మరీ బిల్లుకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు తనకు సమానమంటూ చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. 14, 15న కోర్టు విధుల బహిష్కరణ వరంగల్ లీగల్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై యథాతథ స్థితి (స్టెటస్కో) కొనసాగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 14,15న విధులు బహిష్కరించనున్నట్లు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర్ర పభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ గిరిజన ప్రజలపై కక్షసాధించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముంపు గ్రామాలను కల్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 14న జిల్లా కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, 15న జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. -
నేడు తెలంగాణ బంద్
- టీజేఏసీ, సీపీఐ, సీపీఎం,న్యూడెమోక్రసీ మద్దతు - కుల, ప్రజా సంఘాల మద్దతు కరీంనగర్ : పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు టీజేఏసీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని ఆయూ పార్టీల నాయకులు విమర్శించారు. లక్షలాది మంది గిరిజనులను నిరాశ్రయుల్ని చేసేలా వ్యవహరించిన కేంద్రం తీరును నిరసిస్తూ జరిగే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు బంద్‌కు బాసటగా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జేవీ చలపతిరావు, టీజేఏసీ జిల్లా కన్వీనర్ జె.రవీందర్, కోఆర్డినేటర్ జక్కోజి వెంకటేశ్వర్లు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుర్రాల రవీందర్, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడీ సుదర్శన్, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు వేర్వేరు ప్రకటనల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. -
నేడు తెలంగాణ బంద్
పోలవరం బిల్లుకు నిరసనగా టీజేఏసీ పిలుపు టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా మద్దతు బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్‌కు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం తెలంగాణ బంద్‌కు టీ-జే ఏసీ పిలుపునిచ్చింది. ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే సవరణ బిల్లుకు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కార్యాలయంలో అత్యవసర భేటీ జరిగింది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. నీటి లభ్యత, పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి కీలక అంశాలను పట్టించుకోకుండా ఏడు మండలాల గిరిజనులను పోలవరంలో ముంచేయాలని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా శనివారం తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. బోనాల దృష్ట్యా ఈ బంద్ నుంచి సికింద్రాబాద్‌ను మినహాయించారు. కాగా, బంద్‌కు మద్దతిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యపై అన్ని రకాలుగా పోరాడుతామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ తెలిపారు. బంద్‌లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవరంపై కేంద్రం తొందరపాటు చర్య తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా టీ-జేఏసీ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా, పార్లమెంట్లో పోలవరం బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న తరుణంలో అఖిలపక్ష బృందంతో సీఎం కేసీఆర్ ఢిల్లీకి రాకపోవడం బాధాకరమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇక లోక్‌సత్తా కూడా కేంద్రాన్ని తప్పుబట్టింది. ఎన్డీయే ప్రభుత్వం తప్పటడుగులు వేయడం ప్రారంభించిందని పార్టీ అధ్యక్షుడు కె.ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం చర్య దుర్మార్గమని, గిరిజనులకు శాపమని సీపీఎం, సీపీఐ నేతలు ధ్వజమెత్తాయి. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు న్యూడెమొక్రసీ కార్యాలయంలో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. బంద్‌కు తాము కూడా మద్దతిస్తున్నట్లు న్యూ డెమొక్రసీ నేతలు సాధినేని వెంకటేశ్వర్రావు, కె.గోవర్ధన్ తెలిపారు. -
రేపు తెలంగాణ బంద్!
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ (టీజేఏసీ), సీపీఐ పిలుపునిచ్చాయి. రేపటి బంద్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష టి.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీల ఆందోళనల మధ్య పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కలపడాన్ని నిరసిస్తూ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. -
తెలంగాణ బంద్ సంపూర్ణం
* స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు, సంస్థలు * మూతపడిన బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య సముదాయాలు.. డిపోలు దాటని బస్సులు * అన్ని జిల్లాల్లోనూ భారీగా నిరసనలు, ధర్నాలు * పోలవరం ముంపు మండలాలపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు * మోడీ, బాబు, వెంకయ్య దిష్టిబొమ్మల దహనం * ఆందోళనల్లో పాల్గొన్న టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, టీజేఏసీ శ్రేణులు * బంద్ ప్రశాంతం: డీజీపీ సాక్షి నెట్వర్క్: తెలంగాణ బంద్ విజయవంతమైంది. పోలవరం ముంపు ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ గురువారం ఇచ్చిన బంద్ పిలుపునకు అన్ని వర్గాలు భారీగా స్పందించాయి. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అంతటా ఆందోళనలు జరిగాయి. టీఆర్ఎస్తో పాటు సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల శ్రేణులు బంద్‌లో భాగస్వాములయ్యాయి. జేఏసీ కూడా మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణమైంది. అన్ని జిల్లాల్లోనూ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు పనిచేయలేదు. ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు డిపోల నుంచి బయటకు రాలేదు. ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను ద హనం చేశారు. ఖమ్మం జిల్లాలో భారీగా నిరసనలు ఖమ్మంలో ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడులో ఆదివాసీలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనతోపాటు మరో 15 మంది దీక్షలో కూర్చున్నారు. వీరికి అశ్వారావుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నేత డాక్టర్ తెల్లం వెంకట్రావు సంఘీభావం ప్రకటించారు. వీఆర్‌పురంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ముత్యాల రామారావు, కాంగ్రెస్ నాయకుడు కడుపు రమేష్, ఎంపీటీసీ గూటాల శ్రీనివాస్‌లు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక ఖమ్మంలో టీఆర్ఎస్, సీపీఎం, ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద వేర్వేరుగా ఆందోళనలు జరిగాయి. కొత్తగూడెంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. కేటీపీఎస్ ముందు విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. టేకులపల్లి మండలంలో బొగ్గు లారీలను బోడు రోడ్డు సెంటర్లో ఆందోళనకారులు నిలిపివేశారు. వీరికి మద్దతుగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వేలేరుపాడు, అశ్వారావుపేటలలో టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఇతర జిల్లాల్లోనూ.. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీఎస్పీ నాయకులు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిర్వహించిన ధర్నాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, పీడీఎస్‌యూ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో అన్నివర్గాల వారు స్వచ్చందంగా బంద్ పాటించారు. బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. నల్లగొండ జిల్లాలో జాతీయు రహదారిపై పలుచోట్ల టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద రోడ్డును దిగ్బంధించి ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, వెంకయ్యల దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు వేర్వేరుగా ర్యాలీల్లో పాల్గొన్నాయి. వుహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగాయి. రాజధానిలో ప్రశాంతం హైదరాబాద్‌లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాంకులు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకులు, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కొన్ని చోట్ల టీఆర్ఎస్ శ్రే ణులు బలవంతంగా మూయించారు. నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఎంజీబీఎస్, జూబ్లీ బస్స్టేషన్లకే పరిమితం కావడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణుల బైక్ ర్యాలీలు, ముఖ్య కూడళ్ల వద్ద బైఠాయింపులు, మిన్నంటిన తెలంగాణ నినాదాలతో నగరం మార్మోగింది. నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే ప్రధాన రహదారులు బోసిపోయి కనిపించాయి. పలు చోట్ల ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతరం విడుదల చేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు సర్వశక్తులూ ఒడ్డారు. రంగారెడ్డిలోనూ బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తాండూరులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. శంషాబాద్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్, మేడ్చల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. కలెక్టరేట్లో టీఎన్జీఓ జిల్లా కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా, జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఉదయం 10 గంటలకే కోర్టుల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. భద్రతా చర్యల్లో ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్ బలగాలను కూడా వినియోగించామని చెప్పారు. రాజీలేని పోరాటం చేస్తాం: టీఆర్ఎస్ పోలవరం ముంపు పేరిట ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్యెల్యే హరీష్ రావు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఇద్దరు కలిసి తెలంగాణ ప్రజల గొంతుకోసి మోసం చేశారన్నారు. ఆర్డినెన్స్‌తో రెండు లక్షల మంది గిరిజనుల బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి గోస ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు అది మరణశాసనం వంటిదని, దీనికి నిరసనగానే వారు ఎన్నికలను కూడా బహిష్కరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు తెలంగాణలోనే ఉంటూ గోతులు తీస్తున్నారని, ఇది అమానుషమని దుయ్యబట్టారు. ఈ ఏడు మండలాల్లో ఉన్న ఖనిజ, అటవీ సంపద, చింతూర్ లోయలోని 460 మెగావాట్ల సీలేర్ విద్యుత్ ప్రాజెక్ట్‌ని సీమాంధ్రలో కలపడం వల్ల ఏడాదికి రూ. వెయ్యి కోట్ల నష్ట జరుగుతుందన్నారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ టీడీపీ నేతలు చీమూనెత్తురు లేకుండా మౌనంగా ఉంటున్నారని విమర్శించారు. పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా టీ-టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బాబును ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. దీనిపై రాజీలేని పోరాటం చేస్తామని హరీష్‌రావు చెప్పారు. ఇక కేంద్రం చర్య అప్రజాస్వామికమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్‌లో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోకుంటే టీఆర్ఎస్ నేతృత్వంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆర్డినెన్స్ తేవడం రాజకీయ కుట్ర: న్యూడెమోక్రసీ పోలవరం ముంపు ప్రాంతాలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పెద్ద రాజకీయ కుట్రగా సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ అభివర్ణించింది. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత డిజైన్ ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదె దివాకర్ పేర్కొన్నారు. మరోవైపు పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని గిరిజన ఐక్య వేదిక డిమాండ్ చేసింది. కేంద్రం చర్యకు నిరసనగా నగరంలోని ట్యాంక్‌బండ్‌పైనున్న కొమరం భీం విగ్రహం వద్ద గురువారం పలు సంఘాల గిరిజన నేతలు నిరసన తెలి పారు. ఆర్డినెన్స్‌పై న్యాయ పోరాటంతో పాటు, ఉద్యమాలు చేస్తామని వేదిక అధ్యక్షుడు వివేక్ వినాయక్ తెలిపారు. టీ-కాంగ్రెస్ నేతల ఆగ్రహం పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును తెలంగాణ కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. ఇరు రాష్ట్రాలతో చర్చించకుండా హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయడం సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇలాంటి తొందరపాటు నిర్ణయం వల్ల ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఇందిరాసాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టు, 400 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు ముంపు మండలాల్లోనే ఉన్నాయని, వాటిని కూడా ఆంధ్రప్రదేశ్‌కు తరలించే కుట్రతోనే ఆర్డినెన్స్‌ను తెచ్చారని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రులు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి గురువారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ ఆర్డినెన్స్ న్యాయ సమీక్షకు నిలబడదని, రాష్ర్ట అసెంబ్లీ అభిప్రాయం కోరకుండా సరిహద్దులు మార్చే అధికారం కేంద్రానికి లేద ని జీవన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశమైన వెంటనే ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. -
బంద్ సక్సెస్
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ పిలుపు మేరకు గురువారం చేపట్టిన తెలంగాణ బంద్ జిల్లాలో విజయవంతమైంది. ఉదయం నుంచే వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు. వివిధ కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, టీఆర్ఎస్ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు సాయంత్రం 6 గంటల వరకు నడవలేదు. ఆరు డిపోలోని 536 బస్సులు నిలిచిపోవడంతో రీజియన్‌కు రూ. 70 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. వ్యాపారులు, ఇతర సంఘాల నాయకులు బంద్‌లో భాగంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బిగాల గణేశ్ గుప్త ఆర్టీసీ బస్టాండు ప్రవేశ మార్గం వద్ద ధర్నా చేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని వ్యతిరేకించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటలకు తలొగ్గి కేంద్రం మొండిగా వ్యవహరించి ఆర్డినెన్స్ జారీ చేయడం తగదన్నారు. మోడీ తెలంగాణకు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... వెంటనే ఆర్డినెన్స్‌ను వాపస్ తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి కేంద్రంతో కుమ్మక్కై ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర వేయించారన్నారు. కలెక్టరేట్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ చైర్మన్ గైనిగంగారాం మాట్లాడుతూ.. చంద్రబాబు, వెంకయ్య నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. జిల్లాకేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు 100 బైకులతో ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. వేల్పూరు, కమ్మర్పల్లి, నిజామాబాద్ మండలం పాల్దా గ్రామాల్లో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎల్లారెడ్డి, మాక్లూర్ మానిక్‌భండార్, ఎడపల్లి మండల కేంద్రంలో, కామారెడ్డి, మోర్తాడ్, పిట్లం, బిచ్కుందలలో రోడ్లపై రాస్తారోకోలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌లో భాగంగా విధులకు వెళ్లలేదు. బస్సులు నడవలేదు. కమ్యూనిస్టు పార్టీలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉద్యోగులు బంద్‌లో భాగంగా నిరసన తెలిపారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే గంపగోవర్ధన్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, సీపీఐ, సీపీఎం నాయకులు బైక్‌ర్యాలీలో పాల్గొన్నారు. కామారెడ్డిలోని మున్సిపల్ ఉద్యోగులు కూడా బంద్‌లో పాల్గొని నిరసన తెలిపారు. భిక్కనూరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాచారెడ్డిలో టీఆర్ఎస్ నేతలు ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఆరు మండలాలకు చెందిన జడ్పీటీసీలు, టీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో రైల్వేగేటు వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. దీంతో నిజామాబాద్, బోధన్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. రెంజల్, ఎడపల్లి మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఆర్మూర్‌లో టీఆర్ఎస్,సీపీఐ(ఎంఎల్), ఉద్యోగ సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘల నాయకులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాక్లూర్ మండలం మానిక్‌భండార్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు గంటపాటు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాన్సువాడలో చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. పోలవరం డిజైన్ మార్చకుంటే ఉరుకునేది లేదని హెచ్చరించారు. బిచ్కుంద, బీర్కూరు, జుక్కల్, మద్నూరులలో టీఆర్ఎస్ నాయకులు బైకు ర్యాలీ తీశారు. ప్రధాన కూడళ్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. పిట్లం, మద్నూరులలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. -
రోడ్డెక్కని బస్సులు
- డిపోల్లో నిలిచిపోయిన 728 బస్సులు - రూ.70లక్షల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ గురువారం తెలంగాణ బంద్ నిర్వహించిన నేపథ్యం లో జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. నల్లగొండ రీజియన్‌లో 728 బస్సులు ఆయా డిపోల్లోనే నిలిచి పోయాయి. జిల్లాలోని నల్లగొండ, దేవరకొండ, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల పరిధిలో బస్సులు నిత్యం 2.85 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాయి. బంద్ వల్ల బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఆర్టీసీ దాదా పు రూ. 70లక్షల రోజువారీ ఆదాయం కోల్పోయింది. బంద్‌కు పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించడంతో డిపోల నుంచి బస్సులను బయటికి తీయాలనే ప్రయత్నం కూడా జరగలేదు. బంద్ నిర్వాహకులు తెల్లవారుజామునే డిపోలకు చేరుకుని ప్రధాన గేట్ల ఎదుట ఆందోళనకు దిగారు. రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్ల కార్యాలయాల సిబ్బంది, ఆర్టీసీ ఇతర కార్యాలయాల ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్లన్నీ వెలవెలబోయాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో అన్ని రూట్లలో రాకపోకలకు ఆటంకమేర్పడింది. -
తెలంగాణ బంద్‌కు ముంబైకర్ల మద్దతు
సాక్షి, ముంబై: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా గురువారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ అంబేద్కర్ నగర్లో ముంబై టీ జాక్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్ఎస్ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ముంబైకర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని టీఆర్ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బోల్లె వెల్లడించారు. ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని జాక్ కన్వీనర్ బి. ద్ర విడ్ మాదిగ డిమాండ్ చేశాడు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులుగా నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి తో పాటు భివండీ నుంచి బోగ సుదర్శన్ పద్మశాలి, గాది లక్ష్మణ్, జి. ఏసుదాస్, జి. లక్ష్మణ్ మాదిగ, కె. శేఖర్ మాదిగ, రామగిరి శంకర్, కె. సాయిలు తదితరులు పాల్గొన్నారు. కార్మిక నాయకుల ఖండన ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను ముంబై మిల్లు కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ ఖండించారు. వెంటనే ఆర్డినెన్స్‌ను తిరిగి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
'సీఎం అవుతున్నా కేసీఆర్ వైఖరిలో మార్పురాలేదు'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కాబోతున్నా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బంద్‌లతో ప్రజలను మళ్లీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. పోలవరం ఆర్డినెన్స్‌పై ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని మోత్కుపల్లి అన్నారు. ఆర్డినెన్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం తగదని మోత్కుపల్లి హితవు పలికారు. -
తెలంగాణలో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : తెలంగాణావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను నిరసిస్తూ టీఆర్ఎస్ తెలంగాణలో బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే ఆధ్వర్యంలో వివిధ శ్రేణులు ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో తెలంగాణ పది జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు వర్తక, వ్యాపార, వాణిజ్య, ప్రైవేట్ సంస్థలు, ఆర్టీసీ యూనియన్లు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అత్యసవసర సేవలకు ఈ బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే బస్సులు నిలిచిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందట్లో సడేమియాలా బంద్ నేపథ్యంలో ఆటోలు, ప్రయివేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. -
నేడు తెలంగాణ బంద్
-
బంద్ కారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా
-
నేడు బంద్
కరీంనగర్, న్యూస్‌లైన్ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ప్రజల మనోభావాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నందున అన్ని వర్గాలప్రజలు బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి కోరారు. పోలవరం ముంపు ప్రాంతంలోని మండలాల విలీనం ముమ్మాటికి కవ్వింపు చర్యేనని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు రాజకీయాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం తెలంగాణ ప్రజలను దగా చేయడమేనని అన్నారు. బంద్‌లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలతోపాటు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ నాయకులు వెలిచాల రాజేందర్ ఒక ప్రకటనలో కోరారు. సీపీఐ మద్దతు ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గురువారం నిర్వహించనున్న తెలంగాణ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. నారాయణ తెలిపారు. బంద్‌లో సీపీఐ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల మద్దతు తెలంగాణ బంద్‌కు తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జనగామ నాగరాజు, ఎ.సత్యనారాయణరెడ్డి మద్దతు ప్రకటించారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ సంఘాల మద్దతు టవర్‌సర్కిల్ : తెలంగాణ బంద్‌కు పీఆర్టీయూ మద్దతు తెలుపుతున్నట్లు ఆ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జాలి మహేందర్‌రెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఫయాజ్‌అలీ, ఉపాధ్యక్షుడు రామన్నాయక్ కూడా మద్దతు ప్రకటించారు. తెలంగాణ బంద్‌కు టీయూడబ్ల్యూజే సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షడు గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తాడూరి కరుణాకర్, రవీందర్, ప్రభుదాస్, ప్రవీణ్‌కుమార్, ఎన్ఎస్ రావు తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎన్డీయే తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం మద్దతు తెలంగాణ బంద్‌కు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి తెలిపారు. కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
నేడు తెలంగాణ బంద్
* పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు నిరసనగా టీఆర్ఎస్ పిలుపు * ఆమోదించవద్దని రాష్ట్రపతికి కేసీఆర్ విజ్ఞప్తి * ఆంధ్రా నేతల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందంటూ టీఆర్ఎస్ అధినేత ధ్వజం * బిడ్డనూ చంపేందుకు మోడీ కుట్ర: ఈటెల * ఇంచు భూమి కూడా వదులుకోబోమని ప్రకటన * టీటీడీపీ నేతలకు చీమూనెత్తురుందా: హరీశ్ * బంద్‌కు పార్టీలు, ప్రజాసంఘాల మద్దతు * ఓయూలో నేటి పరీక్షలు వాయిదా సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని ఏడు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ చేయ తలపెట్టిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఇందుకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్‌కు పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి, బంద్ పిలుపునకు దారితీసిన తమ ఆందోళనను గురించి వివరించారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణలోని అన్నివర్గాలూ సహకరించాలని కోరారు. ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడానికి ఆర్డినెన్స్ పాస్ చేసిందంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఈ అప్రజాస్వామిక ఆర్డినెన్సును ఆమోదించొద్దని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. టీఆర్ఎస్ బంద్ పిలుపు తెలిసిన వెంటనే సీపీఐ, న్యూ డెమొక్రసీ, ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీలతో పాటు తెలంగాణ జేఏసీ, పలు ఉద్యోగ, విద్యార్థి, న్యాయవాద, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో గురువారం జరగాల్సిన పలు కోర్సుల వార్షిక, సెమిస్టర్ పరీక్షలను బంద్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. బిడ్డను కూడా చంపే కుట్ర: ఈటెల ఆర్డినెన్స్ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు కూడా తీవ్రంగా మండిపడ్డారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చినట్టుగా యూపీఏ ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ఇచ్చిందన్న ప్రధాని నరేంద్రమోడీ మాటలను పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ గుర్తు చేశారు. ఇప్పుడు బిడ్డను కూడా చంపడానికి మోడీ కుట్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సహచర ఎమ్మెల్యే ఎ.చందూలాల్, ఎమ్మెల్సీ కె.స్వామి గౌడ్, పొలిట్‌బ్యూరో సభ్యులు కె.రాజయ్య యాదవ్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతో కలసి ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు భయపడ్డట్టుగానే ఈ ప్రాంతంపై ఆంక్షలు పెట్టే, దోపిడీని కొనసాగించే కుట్రలకు పాల్పడుతూనే ఉన్నారని విమర్శించారు. ‘‘ఖమ్మం జిల్లాలోని ఆ 7 మండలాలను తెలంగాణ నుంచి విడదీయొద్దని మోడీకి ఆయన ప్రమాణస్వీకారం సందర్భంగానే కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కానీ కేంద్రం దాన్ని పెడచెవిన పెట్టింది. ఆంధ్రా నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ తెస్తోంది. దానిపై మోడీ సంతకం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపినట్టుగా సమాచారముంది. దాన్ని ఆమోదించొద్దని రాష్ట్రపతిని మేం కోరుతున్నాం’’ అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించకుండా, అక్కడి ప్రజల అభిప్రాయాలను వినకుండా హడావుడిగా ఇలా ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ‘‘తెలంగాణలోని ఇంచు భూమిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. దీనిపై న్యాయపోరాటం, ప్రజాపోరాటం చేస్తాం’’ అని హెచ్చరించారు. అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తెలంగాణలోనే ఉంటూ గోతులు తీస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ‘‘ఇది అమానుషం, దారుణం. ఖమ్మంలోని 7 మండలాలను ఆంధ్రాలో కలపడానికి బాబు కుట్రలు చేస్తుంటే తెలంగాణ టీడీపీ నేతలు చీమూనెత్తురు లేకుండా మౌనంగా పడి ఉంటున్నారేం? పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబు తెలంగాణ ప్రజల గొంతు కోస్తున్నా మాట్లాడటం లేదేం? తెలంగాణ బిడ్డలుగా వారికి చీమూ నెత్తురూ, పౌరుషం లేవా? దీనిపై మహానాడులో బాబును ఎందుకు ప్రశ్నించలేదు’’ అంటూ విమర్శించారు. స్వామి గౌడ్, ఎమ్మెల్యేలు టి.రాజయ్య, జి.కమలాకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజులతో కలసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలసి తెలంగాణకు ద్రోహం చేయడానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. ‘‘గిరిజనులకు పోలవరం మరణశాసనం. దానికి నిరసనగానే వారు ఎన్నికలను కూడా బహిష్కరించారు’’ అన్నారు. పోలవరం నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే దాని డిజైన్ మార్చాలని కోరారు. ‘తెలంగాణ గడ్డపైనే ఉంటా, గిరిజనులకు మరణశాసనం రాస్తా’నంటే తెలంగాణ ప్రజలు బాబును ఎలా క్షమిస్తారని ప్రశ్నించారు. దీనిపై రాజీ లేని పోరాటం చేస్తామన్నారు. మరోవైపు, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరుతూ టీడీపీ, బీజేపీ ప్రధాన కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీల నేతలను కోరతామని తెలంగాణ న్యాయవాదులు ప్రకటించారు. సంఘాల మద్దతు టీఆర్ఎస్ బంద్ పిలుపునకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆర్డినెన్స్‌ను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్రం దాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. సీపీఐ (ఎంఎల్-న్యూడెమోక్రసీ) నేత న్యూ డెమొక్రసీ నేత కె.గోవర్ధన్, తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం, కన్వీనర్ దేవీప్రసాద్, తెలంగాణ అడ్వకేట్స్ జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో కన్వీనర్లు శ్రీరంగారావు, గోవర్ధన్‌రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కొండారెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వి.మమత, ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.శివశంకర్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ఫార్వర్డ్ బ్లాక్ తెలంగాణ కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డి, తెలంగాణ అధికారులు, ఉద్యోగ, కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి, తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవిలతో పాటు తెలంగాణ టీచర్స్ జేఏసీ, డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, యూటీఎఫ్ (రంగారెడ్డి) కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. ఓయూ విద్యార్థుల మండిపాటు పోలవరం ఆర్డినెన్స్‌పై ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, విద్యార్థి నేతలు మండిపడ్డారు. బుధవారం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్ఎస్ బంద్‌కు ఓయూలోని సుమారు 25 విద్యార్థి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఓయూలోని మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు, తెలంగాణ తీన్మార్ అధ్యక్షుడు వరంగల్ రవి, అంసా అధ్యక్షుడు మాందాల భాస్కర్, ఓయూ పరిశోధన విద్యార్థి సంఘం అధ్యక్షుడు రవితేజ, పీడీఎస్‌యూ నాయకుడు కోట రాజేశ్, టీఆర్ఎస్వీ నేతలు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పెరిక శ్యామ్, ఏఐఎస్ఎఫ్ నేతలు శ్రీనివాస్, టీజీవీఎస్ అధ్యక్షుడు నె్రహూ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌నాయక్, పీడీఎస్‌యూ (విజృంభణ) నాయకులు దయాకర్, పాలడుగు శ్రీనివాస్, టీవీఎస్ నేత కోట శ్రీనివాస్‌గౌడ్, టీవీవీ నేతలు విజయ్, ఆజాద్ తదితరులు బంద్‌కు మద్దతు ప్రకటించారు. -
తెలంగాణ బంద్‌కు మద్దతు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తేవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీజేఏసీ జిల్లా చైర్మన్ జి. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. అని వర్గాల ప్రజలు, తెలంగాణ వాదులు బంద్‌లో పాల్గొనాలని కోరారు. తెలంగాణ జాగృతి.. తెలంగాణ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు ఇస్తున్నట్లు జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీటీఎఫ్... కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు నిరసన గా జరిగే బంద్‌కు ఏపీటీఎఫ్ మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పన్నాల గోపాల్‌రెడ్డి, ఆర్. రామనర్సయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. నూతన రా ష్ట్రంలో తమ సంఘం కూడా తెలంగా ణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తుందని వారు పేర్కొన్నారు. టీజాక్ట్... బంద్‌కు టీ-జాక్ట్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా చైర్మన్ వి.లక్ష్మీనారాయణ యాదవ్, కో-చైర్మన్లు ఘనపురం భీమయ్య, ఎస్. శేఖర్, ఎన్. సోమలింగం, నర్సిరెడ్డి, మోతీలాల్నాయక్లు ఒక ప్రకటనలో తెలిపారు. కేం ద్రం తెలంగాణపై వివక్షను విడనాడాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ నోరుమెదపని కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇప్పు డు హఠాత్తుగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి విరాళాలు అందజేస్తామని ముందుకు రావడం పెద్ద నాటకమని ఎద్దేవా చేశారు. బంద్‌ను విజయవంతం చేయాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి నల్లగొండ రూరల్ : ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వా దులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, వర్తక, కర్షకులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు. -
తెలంగాణ బంద్‌కు మద్దతు: సీపీఐ
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న ఖమ్మం జిల్లాలోని 136 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఆర్డినెన్స్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ శాఖ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేంద్రప్రభుత్వ చర్యకు నిరసనగా గురువారం బంద్ పాటించాలన్నారు. పార్లమెంట్ ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లు తడి ఆరకముందే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సరవణలతో ఆర్డినెన్స్ జారీ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్యగా వెంటకరెడ్డి అభిప్రాయపడ్డారు. బంద్‌కు సీపీఐ(ఎంఎల్- న్యూడెమోక్రసి) సంపూర్ణ మద్దతు పోలవరం ముంపు సంబంధించి కేంద్రం తీసుకున్న చర్యకు నిరసనగా గురువారం జరిగే బంద్‌కు సీపీఐ(ఎంఎల్- న్యూడెమోక్రసి) నేత జి.గోవర్దన్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, పార్వర్డ్ బ్లాక్ తెలంగాణ శాఖ కార్యదర్శి బి.సురేందర్‌రెడ్డిలు సంపూర్ణ మద్దతు తెలిపారు. అలాగే తెలంగాణ అధికారులు- ఉద్యోగ-కార్మిక సంఘాల సంయుక్త పోరాట సమితి కూడా మద్దతు పలికింది. -
నేడు కూడా తూ.గో.జిల్లాలో సమైక్య బంద్
-
రేపు తెలంగాణ బంద్
ఉస్మానియా విద్యార్థి సంఘాల పిలుపు సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 11వ తేదీ మంగళవారం తెలంగాణ బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని అధికారాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో 20 విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, తెలంగాణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కోట శ్రీనివాస్‌గౌడ్, ఆజాద్, సయ్య ద్ సలీంపాషా తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’లో ఎన్నో చిల్లులున్నాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే.. బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పోల వరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో చేర్చడం కాదని, అసలు ఈ ప్రాజెక్టునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏమైనా తేడాలు వస్తే.. తెలంగాణలో ఈ ప్రాంత ఎంపీలను అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఆంక్షల్లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కూడా 11న బంద్‌కు పిలుపునిచ్చారు. ఫ్రంట్ రాష్ట్ర నేతలు జయ, నర్సింగరావు, రాజా నర్సింహ, సంధ్యలు బంద్ విషయాన్ని వెల్లడించారు. టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వం పూట కో షరతు పెడుతోందని, హైదరాబాద్ ఆదాయాన్ని సీమాం ధ్రకు పంచుతామంటే సహించేది లేదని అన్నారు. -
జిల్లావ్యాప్తంగా సంపూర్ణ బంద్
-
తెలంగాణ బంద్ సంపూర్ణం
బోసిపోయిన పది జిల్లాలు.. హోరెత్తిన నిరసనలు సాక్షి, నెట్వర్క్: రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెలంగాణ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాలన్నీ తెలంగాణవాదుల ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన హోరెత్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంకులు, సినిమాహాళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆటో యూనియన్లు కూడా బంద్ పాటించడంతో ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపించాయి. రైల్వేస్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ తగ్గింది. టీజేఏసీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, విద్యార్థి, ప్రజా, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద జేఏసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. బొగ్గు గనుల్లో కార్మికులు విధులకు గైర్హాజరవడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. తెలంగాణ వైద్యుల జేఏసీ నిరసనలతో ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. కరీంనగర్లో సోనియా ఫ్లెక్సీలతో గుడిని ఏర్పాటు చేయగా, తెలంగాణవాదులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జహంగీర్ పీర్ దర్గాలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యేకప్రార్థనలు చేసి బయటకు వస్తుండగా.. టీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుకుని ‘జై తెలంగాణ’ నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గన్‌పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైన విద్యార్ధులను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్ధులు పోలీసులపైకి రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువును ప్రయోగించడంతో వర్సిటీ ఉద్రిక్తంగా మారింది. -
తెలంగాణ అంతటా బస్సుల బంద్
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా తెలంగాణ రాజకీయ జెఎసి, టిఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ అంతటా బంద్ జరుగుతోంది. బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా 94 డిపోల్లో 15 వేల బస్సులు నిలిచిపోయాయి. ఈ కారణంగా ఆర్టీసికి 12 కోట్ల రూపాయల ఆదాయానికి గండనుంది. 70 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 59 వేల మంది ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్, కాచీగూడ బర్కత్‌పుర డిపోల్లో 350 బస్సులు నిలిచిపోయాయి. జీడిమెట్ల బస్ డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 300 బస్సులు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. బండ్లగూడ, హయత్‌నగర్ ఆర్టీసీ డిపోల్లో 245 బస్సులు నిలిచిపోయాయి. ఈ రెండు డిపోల ఎదుట టిఎంయు నేతలు బైఠాయించారు. కూకట్పల్లి డిపో నుంచి 131 బస్సులు బయటకు రాలేదు. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపో ఎదుట తెలంగాణవాదుల బైఠాయించారు. టీఆర్ఎస్ నేతలు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిగి డిపో ఎదుట తెలంగావాదులు బైఠాయించారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 7 డిపోలలో బస్సులు కదలలేదు. సిద్ధిపేట బస్సు డిపో, దుబ్బాక బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పాల్గొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపో ఎదుట తెలంగాణ వాదుల బైఠాయించారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 8 డిపోల్లో 800 బస్సులు నిలిచిపోయాయి. నాగర్‌కర్నూలు బస్‌డిపో ఎదుట టిఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్సు డిపో ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. జిల్లాలోని 11 డిపోల్లో 989 బస్సులు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల్లో 596 బస్సులు నిలిచిపోయాయి. వ్యాపార, విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌కు బొగ్గు కార్మికులు మద్దతు తెలిపారు. శ్రీరామ్‌పూర్, బెల్లంపల్లి, మందమర్రిలోని 14 బొగ్గుగనుల్లో కార్మికులు విధుల బహిష్కరించారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికులు విధులకు హాజరుకాలేదు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణవాదులు బైఠాయించారు. 7 డిపోల్లో 720 బస్సులు నిల్చిపోయాయి. -
బంద్‌కు సిద్ధం
చంద్రశేఖర్ కాలనీ : రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా గురువారం చేపట్టిన బంద్‌కు జి ల్లా సిద్ధమైంది. టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపునకు జేఏసీతో సహా అన్నిసంఘాలు, వర్గాలు మద్దతు పలికాయి. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం అనుసరిస్తు న్న వైఖరికి నిరసనగా బంద్‌ను విజయవంతం చేయాలని, పదిజిల్లాల తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా ఇన్చార్జి కె.బాపూరావు కోరారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పి, సీమాంధ్రుల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ అంటూ నాటకాలాడుతోందన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం కిరికిరి చేస్తే మహోద్యమాన్ని సృష్టిస్తామని వారు హెచ్చరించారు. జిల్లాబంద్‌కు అన్నివర్గాలు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, లక్ష్మణ్‌రావు, విఠల్‌రావు, భాస్కర్, బస్వా లక్ష్మీనర్సయ్య, కిషన్, రాజు, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరి కోసం రాయల తెలంగానం!?
తెలంగాణ బంద్‌కు వెల్లువెత్తిన సంఘీభావం సాక్షి, హైదరాబాద్: కేంద్రం రాజకీయ లబ్ధికోసం పాకులాడకుండా పదిజిల్లాల సంపూర్ణ తెలంగాణ మాత్రమే ఇవ్వాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనలపై వారు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు అన్నివర్గాల వరకూ పెద్దఎత్తన సంఘీభావం ప్రకటించారు. టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికేనా?: సీపీఐ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎంఐఎంను సంతృప్తిపరిచి మైనారిటీ ఓట్లు రాబ ట్టడానికా లేక టీఆర్ఎస్ను బ్లాక్మెయిల్ చేయడానికా? అని సీపీఐ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదన ఎవరి మనసులో పుట్టిందో చెప్పాలని డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ గుండా మల్లేష్, చాడా వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, రామనరసింహారావుతో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఎవర్నీ సంతృప్తి పరచని రాయల తెలంగాణ ప్రతిపాదనతోనే ముందుకు వెళితే కాంగ్రెస్ వేళ్లు తెగడం ఖాయమన్నారు. కాగా, టీఆర్ఎస్, టీజేఏసీ గురువారం తలపెట్టిన తెలంగాణ బంద్‌కు సీపీఐ సంఘీభావం ప్రకటించింది. ఎంఐఎం అడిగిందని ప్రజల ఆకాంక్షను బలిపెడతారా?: బీజేపీ ఎంఐఎం పార్టీ రాయల తెలంగాణను అడిగిందని తెలంగాణ ప్రజల ఆకాంక్షను బలిపెడతారా? అంటూ కాంగ్రెస్ అధిష్టానంపై రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. పూటకో డ్రామా ఆడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, నేతలు బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ తదితరులు బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా గురువారం నాటి బంద్‌కు మద్దతిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ బంద్‌కు ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా రాయల తెలంగాణ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పిలుపు మేరకు.. గురువారం తెలంగాణ బంద్ పాటిస్తున్నట్టు పీఆర్టీయూ-తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.హర్షవర్దన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తాము కూడా బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నారాయణరెడ్డి, ఎం.ఎన్.కిష్టప్ప, తెలంగాణ రీజనల్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మణిపాల్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ‘రాయల’ వెనుక కుట్ర: పొన్నం, సారయ్య సాక్షి, న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తామంతా వ్యతిరేకమని ఎంపీ పొన్నం ప్రభాకర్, మంత్రి బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అడగని రాయల తెలంగాణ ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై గట్టిగా ఒత్తిడి తెస్తామని, మిగతా రాజకీయ పార్టీలు సైతం ముందుకొచ్చి దీన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమను విడదీయకూడదు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నామో రాయలసీమను విడదీయకూడదని కూడా అంతే బలంగా కోరుకుంటున్నామని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో.. తెలంగాణ ప్రాంతీయ సమస్య కాదని, సామాజిక ఉద్యమ ఫలితమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. గురువారం బంద్‌కు విప్లవ రచయితల సంఘం సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తుందని వరవరరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, అల్లం నారాయణ, ర చయిత జూలూరి గౌరీశంకర్, వేదకుమార్, ప్రొ.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేస్తాం: ఆమోస్ రాయల తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని.. అందుకే టీఆర్ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ ను విజయవంతం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆమోస్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయల తెలంగాణ అవసరంలేదని, పది జిల్లాల తెలంగాణే తమకు కావాలని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మరో సమావేశంలో పేర్కొన్నారు. -
బస్సులకు ‘టీ’బ్రేక్
కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్: రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ గురువారం టీఆర్ఎస్ తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వడంతో అటువైపు వెళ్లే బస్సులకు బ్రేక్ పడింది. ఆర్టీసీ అధికారులు ముందుజాగ్రత్తగా దాదాపు 185 సర్వీసులను నిలుపుదల చేసేందుకు నిర్ణయించారు. దీంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని గద్వాల, అలంపూర్, మహబూబ్‌నగర్, ఐజ, శాంతినగర్, కోదాడ, రాజోలి, కొత్తకోట, రాయచూర్, కొల్లాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలుపుదల చేస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ వెల్లడించారు. అదేవిధంగా బెంగళూరు, చిత్తూరు, కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ సర్వీసులు, లారీలు, ఇతర వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేయడం.. లేదా కర్నూలు నుంచి వెనక్కు పంపేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ కారణంగా రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు మీదుగా రాజధానికి చేరుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. మరీ అత్యవసరం కాకపోతే ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలాఉండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రతి రోజు దాదాపు 600 మందికి పైగా ఆన్లైన్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు బస్సు సర్వీసుల నిలుపుదల కారణంగా డబ్బును వెనక్కి ఇవ్వనున్నట్లు ఆర్ఎం తెలిపారు. గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినా.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. వీటి ద్వారా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ సెక్టార్‌లోని ఆయా ప్రాంతాలకు చేరుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నెల 5 (గురువారం)న ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలను www.smania.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. నేటి పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలు 30కి వాయిదా తెలంగాణ బంద్ నేపథ్యంలో నేడు జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా పరీక్షలను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డీ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంద్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వివరించారు. బీఎస్సీ నర్సింగ్, ఎంఎల్టీ పరీక్షలు వాయిదా విజయవాడ: తెలంగాణ బంద్ నేపథ్యంలో గురువారం జరగాల్సిన బీఎస్సీ (ఎంఎల్టీ), బీఎస్సీ (నర్సింగ్) పరీక్షలు వాయిదా వేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. విజయ్‌కుమార్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. 6వ తేదీ శుక్రవారం నుంచి జరుగాల్సిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. -
నేడు తెలంగాణ బంద్
* మద్దతు ప్రకటించిన పలు జేఏసీలు * బంద్ ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్ * అన్ని వర్గాలూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు.. * విజయవంతం చేయాలన్న కోదండరాం * ఏ కార్యాచరణకైనా సిద్ధపడాలని పిలుపు * రాయల వద్దు.. సంపూర్ణ తెలంగాణే లక్ష్యం * తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఢిల్లీకి తెలియాలి సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: రాయల తెలంగాణ ప్రతిపాదనలకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్ జరుగనుంది. పది తెలంగాణ జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయకుండా రాయలసీమలోని రెండు జిల్లాలను అదనంగా కలపాలన్న ప్రతిపాదనలను నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చిన ఈ బంద్‌కు తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు పలు తెలంగాణ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ బంద్‌లో పాల్గొంటామని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మరోవైపు బంద్ ఏర్పాట్లను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులతో కేసీఆర్ బుధవారం సమీక్షించారు. మండల స్థాయిలోని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సముదాయాలు, పాఠశాలలను బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాయల తెలంగాణకు నిరసనగా, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలనే డిమాండ్‌తో బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రజల ఆంక్షలు ఢిల్లీకి తెలిసేలా బంద్‌ను విజయంతం చేయాలని జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం కోరారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేదాకా ప్రజలు మెలకువగా ఉండాలన్నారు. సంపూర్ణ తెలంగాణ బిల్లులో ఏ తేడా వచ్చినా తేడా వస్తే అందుకు బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలది, రాష్ట్ర, కేంద్ర మంత్రులదేనన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో బుధవారం టీజేఏసీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాయల తెలంగాణ వద్దని, సంపూర్ణ తెలంగాణ ఇవ్వాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఆమోదం పొందాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘రెండు రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలిపితే ప్రజలు కోరుకున్న రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం కాదు. గవర్నర్‌కు అధికారాలివ్వడం, హైదరాబాద్‌పై తెలంగాణకుండే హక్కును నీరుగార్చే ప్రయత్నాలను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తుంది. సంపూర్ణ తెలంగాణలో ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర పరిణామాలకు జేఏసీ పిలుపునిస్తుంది. అవసరమైతే మళ్లీ చలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. భావి కార్యచరణపై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటాం. ఏ కార్యచరణకైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి’’ అని కోరారు. 371డి, యూటీ, గవర్నర్ పాలన వంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షను అణిచివేసే ఎత్తుగడలను నిరసిస్తున్నట్టు టీజేఏసీ నేత దేవీప్రసాద్ చెప్పారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ సాధనకు ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణపై రాబందుల్లా కన్నేసి, రాయల తెలంగాణ అంటూ ఉద్యమాన్ని నీరుగార్చజూస్తున్న వారికి చెంపపెట్టులా బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మె వంటి ఆందోళనలకు వంద రెట్లు భారీగా ఉద్యమం చేపట్టి పార్టీలను భూస్థాపితం చేస్తామని టీ.జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. భేటీలో తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, న్యాయవాదుల జేఏసీ నేతలు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలపై జేఏసీ చర్చ రాయల తెలంగాణ ప్రచారంలో ఉన్నా బిల్లు మాత్రం స్పష్టంగా తెలంగాణ ఏర్పాటుపైనే ఉంటుందని జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాయల తెలంగాణ, నిరసన కార్యక్రమాలపై ఢిల్లీలో కమిటీ చర్చించింది. తెలంగాణకు సానుకూల వాతావరణమే ఉందని, రాయల తెలంగాణ ఉండకపోవచ్చని నేతలు అభిప్రాయపడ్డారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ అధ్యక్షులు శరద్‌యాదవ్, కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిలను ఇప్పటికే జేఏసీ నేతలు కలిశారు. లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను గురువారం కలవనున్నారు. బీఎస్సీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ తదితరులనూ కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. భేటీలో మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, దేవీప్రసాద్, కె.రఘు, పిట్టల రవీందర్ పాల్గొన్నారు. -
రాయల తెలంగాణకు పూర్తి వ్యతిరేకం: గుత్తా
రేపట్టి తెలంగాణ బంద్‌కు టి.కాంగ్రెస్ నేతల మద్దతుండదని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన నల్గొండలో మాట్లాడుతూ... 10 జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయల తెలంగాణకు తాను పూర్తి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం ప్రభుత్వం మొదటి నుంచి హైదరాబాద్‌తో పాటు 10 జిల్లాలతో కూడిన తెలంగాణానే ఇస్తామని చెబుతుందన్న విషయాన్ని గుత్తా ఈ సందర్బంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం నిమషానికో మాట మార్చడం పట్ల ఆయన ఓ కింత అసహానం వ్యక్తం చేశారు. -
రాయల తెలంగాణ అంటే యుద్ధమే
* రేపు బంద్‌కు కేసీఆర్ పిలుపు * తల తెగిపడ్డా.. అందుకు అంగీకరించనని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్య * మరో రెండు రోజులు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు * 6న పార్టీ పొలిట్ బ్యూరో భేటీలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం * సీడబ్ల్యూసీ, కేబినెట్లు నిర్ణయించింది 10 జిల్లాల తెలంగాణనే * తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణ వారి కోసమా? లేక * అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారి కోసమా? * దీనిపై నేను పార్లమెంటుకు హాజరై నిరసన గళం వినిపిస్తా సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే యుద్ధం తప్పదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను తెలంగాణ వాదుల తరఫున కరాఖండిగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ తాజా ప్రతిపాదనకు నిరసనగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజైన ఈనెల 5వ తేదీ (గురువారం) తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. ‘రాయల తెలంగాణ వద్దు - సంపూర్ణ తెలంగాణ ముద్దు’ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ చర్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసనలు తెలపాలని సూచించారు. కేసీఆర్ మంగళవారం తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ నేతలు కె.కేశవరావు, మందా జగన్నాథం, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఎస్.మధుసూదనాచారి, కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చినయ్... ‘‘ఏం జరుగుతుందో తెలియనపుడు మాట్లాడుడు మంచిదికాదని ఇప్పటివరకు ఆగినం. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉందని నాకు ఢిల్లీలోని వర్గాల నుంచి ఫోన్లు వచ్చినయ్. సరైన సమయంలో స్పందించడం నా విధ్యుక్త ధర్మంగా భావించి ఇప్పుడు మాట్లాడుతున్న. ఇది తెలంగాణ ప్రజల ఆశ, భాష. తెలంగాణ ప్రజల ఆశను సరైన సమయంలో తెలుపకపోతే నాది తప్పు అయితది. అందుకే ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి, జీవోఎంకు తెలుపుతున్నం. ప్రాణాలు పోయినా, ఆరు నూరైనా, తూర్పున ఉదయించే సూర్యుడు పడమర ఉదయించినా రాయల తెలంగాణకు అంగీకరించం. అట్లాంటిదే జరిగితే మరో ఉద్యమానికి తెరతీస్తం’’ అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రజల తరఫున నిరసనలు తెలిపేందుకు మేం కార్యాచరణ రూపొందించినం. బుధవారం విద్యార్థులు, యువకులు రాయల తెలంగాణ వ్యతిరేక నిరసన ర్యాలీని గ్రామం నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు చేపట్టాలె. టీఆర్ఎస్ తరఫున గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నం. తెలంగాణకు ఇది పరీక్షా సమయం. ఈ బంద్ వేరే ఎవరి కోసమో కాదు కాబట్టి ఇందులో వ్యాపారస్తులు మొదలుకొని విద్యా సంస్థల దాకా అంతా స్వచ్ఛందంగా వంద శాతం పాల్గొనాలె. బంద్‌లో పాల్గొనాలని ఎవ్వరూ ఒత్తిడి చేయరు. స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్‌లో పాల్గొని కేంద్రానికి తెలంగాణ సత్తా చాటాలె. అందుకోసం ఒక్కొక్కరూ ఒక్కో కేసీఆర్ కావాలి. ఉద్యోగులు విధులను బిహ ష్కరించాలి, ఆర్టీసీ వారు, పరిశ్రమలు, ఐటీ వారు అందరూ ఇందుకు సహకరించాలె’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆరో తేదీన టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని.. కేంద్ర కేబినెట్లో తెలంగాణ బిల్లును బట్టి తమ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తామని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ శిక్షణా కార్యక్రమలను మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. బలిదానాలు సంపూర్ణ తెలంగాణ కోసమే ‘‘13 ఏళ్ల తర్జనభర్జనల తర్వాత సీడబ్ల్యూసీ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తీర్మానించింది. దాన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇపుడు దాన్ని అటు ఇటు తిప్పడం, వేరే ఏవో చేర్చడం అనేది సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఖండించటమే. ఇతర ప్రాంతాల వారితో కలిసేందుకే మా పిల్లలు బలిదానం చేసుకున్నారా? ఇవాళ తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి. ఆయన అమరుడు అయింది రాయల తెలంగాణ కోసమేనా? తెలంగాణ కోసం ప్రాణత్యాగ ం చేసుకున్న వారంతా హైదరాబాద్ రాజ ధానిగా పది జిల్లాలతో కూడిన సంపూర్ణ తెలంగాణ కావాలనే. అదే కొందరు లేఖల రూపంలోనూ తెలిపారు. ఇవన్నీ జీవోఎంకు సుమారు గంటన్నర పాటు వివరించినయన్ని అరణ్యరోదనే అయితయ? తెలంగాణ ఏర్పాటు చేస్తోంది తెలంగాణవారి కోసమా లేదా అన్యాయం చేసేందుకు ఇంకా కలిసి ఉందామనే వారికోసమా? అని జీవోఎం భేటీలో మేం ప్రశ్నించినం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌పై ఆంక్షలు విధిస్తారా ‘‘రాష్ట్రం విడిపోతే గతంలో తెలంగాణతో కలిసి లేని సీమాంధ్రులు తిరిగి వారి ప్రాంతానికి హ్యాపీగా వెళ్లిపోతరు. మాక్కుడా కొద్దో గొప్పో రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగంలో ఎక్కడా కామన్ కాపిటల్ అనే పదం లేకున్నా.. సీమాంధ్రులను తెల్లారే తరుముడు తెలివి తక్కువ తనం అయితదని ఒప్పుకున్నదాన్ని అలుసుగా తీసుకొని హైదరాబాద్‌పై, శాంతిభద్రతలు ఇతర అంశాలపై ఆంక్షలు విధిస్తర? ఇట్లాంటి చర్యలు మమ్మల్ని అవమానించుడే అయితది. మద్రాసు నుంచి విడిపోయినపుడు తెలుగువారికి రాని సమస్యలు ఇపుడు తెలంగాణ విడిపోతే హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కలుగుతయి అనడం వితండవాదమె. కేంద్రం కట్టడి చేయడం అనే చర్య మొదలుపెడితే దేశంలో ఏ పెద్ద నగరాల్లోకి ఇతరులను రానివ్వరు. ఇప్పటికే ఉన్న 28 రాష్ట్రాలకు లేని ఆంక్షలు ఏర్పడ బోయే తెలంగాణకు మాత్రమే ఎందుకు విధిస్తరు?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో టీ ఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోవటం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదనలు చేస్తున్నారంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘సొల్లుగాళ్ల మాటలకు నేను జవాబివ్వాలా?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ అంగీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందనే అభిప్రాయాలను విలేకరులు పేర్కొనగా.. ‘‘కేసీఆర్ రాయల తెలంగాణకు ఒప్పుకుంటడ? నా జీవితంలో ఏనాడైనా ఆ మాట అడిగినన?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రాయల తెలంగాణ నష్టాలను రోజుల తరబడి చె ప్పుకోవచ్చు. ఫ్లోరైడ్ నీళ్లు తాగి 1.5 లక్షల మంది బంగారు బతుకులు నాశనం అయినయి. రాయల తెలంగాణ ప్రకటించిన తర్వాత పది రోజుల పాటు ఉద్యమించి ఊరుకుంటారని కొందరు సన్నాసులే భావిస్తరు. కేసీఆర్ అట్ల ఊరుకుంటడ? నా తల తెగిపడ్డా అందుకు అంగీకరించను. ఇన్నాళ్ల ఉద్యమంలో మధ్యలో ఎందరో బుడ్డర్‌ఖాన్‌లు వచ్చిపోయారు తప్ప కేసీఆర్ ఒక్కడే పోరాడుతున్నడు. ఎవరి గొంతెమ్మ కోరికల కోసమో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి మా నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి బిడ్డలను చంపుకోవాల్నా? ఆ రెండు జిల్లాలను కలిపి అక్కడి గాలేరు-నగరి వంటి అక్రమ ప్రాజెక్టులను ఓకే చేసుకోవాల్నా? దీనికి ఏ తెలంగాణ బిడ్డనైనా ఒప్పుకుంటడ? అసలు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకొచ్చిందో అది బయటపెట్టిన వారే చెప్పాలి. కాకి లెక్కలు చెప్పి సీమ జిల్లాలు కలుపుకుంటే కరెంటు కష్టాలుండవని చెప్తే వినేందుకు మేం పిచ్చోళ్లమా? నీటి ఆధారంగా జరిగే విద్యుత్ ఉత్పత్తి ఎల్లకాలం ఉండదు. బొగ్గుతో తయారయ్యేదే ఎప్పటికీ శాశ్వతం. ఆ బొగ్గు మా తెలంగాణలో పుష్కలంగా ఉంది. దానితో కరెంటు తయారు చేసుకుంటం’’ అని పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిస్తే యుద్ధం గ్యారంటీ అని కేసీఆర్ హెచ్చరించారు. ‘‘సంపూర్ణ తెలంగాణ ప్రకటించేదాకా యుద్ధం కొనసాగిస్తం. పార్లమెంటు సమావేశాలకు తప్పక హాజరవుత. రాయల తెలంగాణ ఏర్పాటు లేదా ఇతర ఆంక్షలేమైనా ఉంటే తప్పక నిరసన తెలుపుత. తెలపకుండా నేనెట్ల ఊరుకుంటా? ఈ సారి ఇంగ్లిష్‌లో కాదు హిందిలో మాట్లాడుత’’ అని చెప్పారు. బంద్‌కు టీజేఎఫ్, ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా డిసెంబర్ 5న చేపట్టిన తెలంగాణ బంద్‌కు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్), తెలంగాణ విద్యార్థి, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. -
సకలం బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ బంద్ నేపథ్యంలో ఓరుగల్లు సమరశంఖం పూరించింది. తెలంగాణవాదులు స్వచ్ఛంద బంద్‌తో తమ గుండెల్లో గూడుకట్టుకున్న ఆకాం క్షను మరోసారి చాటిచెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే పరిష్కారమని తేల్చిచెప్పారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిరంకుశ వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ విజయవంతమైంది. తెలంగాణవాదుల ప్రచారం, పలు సం ఘాల పిలుపునకు స్పందించిన వివిధ వర్గాలు బంద్‌కు పూర్తిగా సహకరిం చాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో స్తంభించాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, బ్యాంకులు, పెట్రోల్ పంపులు, థియేటర్లు తెరుచుకోలేదు. వరంగల్ వ్యవసాయ, కూరగాయల మార్కెట్లలో లావాదేవీలు నిలిచిపోయాయి. నిరసనకారులతో జిల్లా, మండల కేంద్రాలతోపాటు, ప్రధాన సెంటర్లు తెలం‘గానం’తో మార్మోగాయి. డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యా యి. ప్రయూణికులతో ఎప్పుడూ కిటకిటలాడే బస్స్టేషన్లు బోసిపోయాయి. బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన టీఎంయూ, ఎంప్లాయూస్ యూనియన్, ఇతర కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. హన్మకొండ, నర్సంపేట, పరకాల, తొర్రూరు డిపోల వద్ద రాస్తారోకోలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి ర్యాలీలు చేపట్టారు. హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, పరకాల, నర్సంపేట, ములుగులో సీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జనగాం, నర్సంపేట, పరకాల, ములుగు, హన్మకొండ, వరంగల్, వర్ధన్నపేట, తొర్రూరు ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎల్డీ, న్యూడెమోక్రసీ, ప్రజాసంఘాలు, జేఏసీలు, న్యాయవాదులు, డాక్టర్లు, ఉద్యోగులు, టీఎన్ఎస్, తెలంగాణవాదులు ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. నెక్కొండ వుండలంలోని పెద్ద కొర్పోలు సమీపంలో రైల్వేలేన్కు సంబంధించిన ఫిష్‌ప్లేట్లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. భూపాలపల్లిలో తెరిచి ఉన్న రావు చిట్‌ఫండ్ కార్యాలయం అద్దాలను తెలంగాణవాదులు పగులగొట్టారు. కాగా, బంద్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. వరంగల్, కాజీపేటతోపాటు ప్రధాన రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్ల వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ పాపిరెడ్డి, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, మొలుగూరి బిక్షపతి, డాక్టర్ రాజయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీజేపీ నాయకులు మార్తినేని ధర్మారావు, చింతాకుల సునీల్, సీపీఐ నాయకులు సదానందం, న్యూడెమోక్రసీ నాయకులు దయాకర్, అప్పారావు, ఉద్యోగ సంఘాల నాయకులు పరిటాల సుబ్బారావు, రాజేష్‌గౌడ్, రత్నవీరాచారి, న్యాయవాద సంఘాల నాయకులు అంబరీష్, గుడిమల్ల రవికుమార్ పాల్గొన్నారు. నగరంలో నిరసనల వెల్లువ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, విద్యాశాఖ, జెడ్పీ, మెడికల్, ఇతర విభాగాలకు చెందిన ఉద్యోగులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అమరవీరుల స్థూపం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అక్కడ బైఠాయించి నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఎంజీఎంలో మెడికల్ జేఏసీ ధర్నా నిర్వహిం చింది. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. హన్మకొండలో టీఆర్ఎస్, వరంగల్‌లో తూర్పు జేఏసీ, టీఆర్ఎస్, టీఎన్ఎస్, సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండ, వరంగల్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. వరంగల్ సెంట్రల్ జైలులో నక్సల్స్ ఖైదీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లో జర్నలిస్టులపై దాడులకు నిరసనగా అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. కేయూలో ఉద్యోగులు విధులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులపై దాడులకు నిరసనగా కేయూ జేఏసీ, టీజీవీపీ, టీఆర్ఎస్వీ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో హన్మకొండ అమరవీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ ఆటోయూని యన్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్, మార్కెట్ ఉద్యోగులు, గుమస్తాలు తదితరులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
ఖమ్మం జిల్లాలో బంద్ సంపూర్ణం
ఖమ్మం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేక చర్యలకు నిరసనగా... తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేశారు. ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై సంతకాలు చేసి బంద్‌లో పాల్గొన్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోయాయి. పెట్రోలు బంక్‌లు, సినిమా థియేటర్లు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, సీపీఐ, భారతీయ జనతాపార్టీలకు చెందిన నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలవారు ఉదయం నుంచే రోడ్డుపైకి వచ్చి బంద్ నిర్వహించారు. డిపోల వద్దకు వెళ్లి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం బస్‌డిపో వద్ద పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్ సందర్భంగా జిల్లాలో పలుచోట్ల జేఏసీ, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. తెలంగాణ కళాకారులు ప్రధాన కూడళ్ల వద్ద ఆటాపాటా నిర్వహించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఫైళ్లకు నిప్పంటించారు. సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు బంద్‌కు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు తెలంగాణ వాదులు దహనం చేశారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 28 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఖమ్మంలో సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి బంద్‌లో పాల్గొన్నారు. బస్సులు బయటకు తీయవద్దని డిపో ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ నాయకులకు డిపో మేనేజర్‌కు మధ్య వాగ్వివాదం జరిగింది. టీచర్స్ జేఏసీ, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా వస్తున్న తెలంగాణ ఉద్యోగులను పోలీసులు కలెక్టరేట్ గేట్లను మూసివేసి అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి కిరణ్ ఫ్లెక్సీని దహనం చేశారు. న్యాయవాదులు ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. మెడికల్, సంక్షేమభవన్, పంచాయతీరాజ్‌శాఖ ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగజేఏసీ, పొలిటికల్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను అవమానించడానికి ముఖ్యమంత్రి ఎపీ ఎన్జీవోల సభకు అనుమతించారని అన్నారు. సీమాంధ్ర గుండాలతో తెలంగాణను అడ్డుకోలేరన్నారు. ముఖ్యమంత్రి అండతో జిల్లాలో సీమాంధ్ర అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ పాటించారు. ఆర్టీసీ బస్‌లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం 7 గంటల వరకు బస్సులు యథావిధిగా నడిచినప్పటికీ అనంతరం జేఏసీ నాయకులు వాటిని నిలిపివేయించారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణంలో పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. పాల్వంచ పట్టణంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఉపాధ్యాయులు ఆంధ్రా ఉద్యోగులకు పూలు ఇచ్చి నిరసన తెలిపారు. కేటీపీఎస్ ఓఅండ్ఎం, ఐదు, ఆరోదశ కార్యాలయాల ఎదుట తెలంగాణ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఉదయం విధులకు వెళ్లే కార్మికులను అడ్డుకున్నారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో బంద్ ప్రశాం తంగా జరిగింది. పట్టణంలో హోటళ్లు,సినిమా హాళ్లు, షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. బంద్‌ను పురస్కరించుకుని టీజేఏసీ ఆధ్వర్యం లో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి బంద్ విజయవంతం చేయాలని కోరారు. బయ్యారం, గార్ల మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాజకీయ జేఏసీ, న్యూడెమోక్రసీ వేర్వేరుగా మోటర్‌సైకిల్ ర్యాలీ లు నిర్వహించాయి. రాజకీయ జేఏసీ నాయకులు రహదారిపై కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. బంద్‌కు టీఆర్ఎస్, న్యూడెమోక్రసీ, పార్టీల నాయకులు నాయకత్వం వహించారు. టేకులపల్లిలో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఆర్పీఎస్ , న్యూడెమోక్రసీ (చంద్రన్న) జేఏసీ ఒక వర్గంగా న్యూడెమోక్రసీ (రాయల) వర్గం మరో వర్గంగా బంద్ నిర్వహించాయి. పోటాపోటీగా ప్రదర్శనలు చేశారు. కామేపల్లిలో ఎన్డీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో శనివారం తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్తక, వాణిజ్య సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధిర నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సులు, ఆటోలు నిలుపుదలచేయించారు. పలు పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, బ్యాంకు కార్యాలయాలను బంద్చేయించారు. ముదిగొండ మండలంలోని టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్, తెలంగాణ బీసీసంక్షేమసంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బోనకల్ మండలంలో బీజెపీ, టీఆర్ఎస్, ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండల పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలు, కళాశాలలు బంద్‌చేశారు. ముష్టికుంట్ల గ్రామంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బోనకల్-ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనంచేశారు. ఎర్రుపాలెం, చింతకాని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను, కళాశాలలు మూతబడ్డాయి. పోలీసులు జిల్లా సరిహద్దుల్లో, రైల్వేస్టేషన్లో అధిక సంఖ్యలో మోహరించారు. పినపాక నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, గుండాల, పినపాక మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. బూర్గంపాడు మండలంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అశ్వాపురం మండలంలో టీఆర్ఎస్, సీపీఐ, ఎన్డీ, బీజేపీల సంయుక్త ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మణుగూరు మండలంలోని జేఏసీ సారధ్యంలో బంద్ సంపూర్ణంగా నిర్వహించారు. డీపో నుంచి ఒక్క ఆర్టీసీ బస్సుకుడా బయటకు రాలేదు. విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ పాటించినాయి. జేఏసీ ఆధ్వర్యంలో సీమాంధ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. అదే విధంగా ఆర్టీసీ డీపో ఎదుట వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. పినపాక మండలంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. గుండాల మండలంలో ప్రజలే స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని వ్యాపార సంస్థలు మూసివేశారు. భద్రాచలం డివిజన్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ, టీఆర్ఎల్డి, కులసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. దుకాణాలు,పెట్రోల్ బంక్‌లు, హోటల్ వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటించారు. వాజేడులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. కూనవరం మండలంలో ప్రభుత్వ కళాశాల, పాఠశాలల విద్యార్థులు ప్రదర్శన చేసారు. వీఆర్‌పురం మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో టీజేఏసీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు తరగతులు బహిష్కరించి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దమ్మపేట మండలం మందలపల్లి రింగ్ సెంటర్లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్, సీపీఐ, ఎంఎల్ ఎన్డీ, బీజే పీ ఆధ్వర్యంలో దహనం చేశారు. వేలేరుపాడు, కుక్కునూరు, ముల్కలపల్లి, చంద్రుగొండ మండలాల్లో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలంలోని పెదతండాలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి, ఎంపీడీఓ కారాలయానికి తాళం వేసి తెలంగాణ వాదులు నిరసన తెలిపారు. జలగంనగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి వేశారు. అనంతరం పెదతండా వద్ద ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో న్యూడెమోక్రసీ, తిరుమలాయపాలెంలో ఉద్యోగ జేఏసీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. నేలకొండపల్లి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. రాస్తారోకో చేస్తున్న తెలంగాణ వాదులు పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూసుమంచి మండల కేంద్రంలో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేసి బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారు. టీఆర్ఎస్, ఎన్డీల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది తెలంగాణ వాదులను పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. వైరా నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. వైరాలో ఉదయాన్నే సత్తుపల్లి ఆర్టీసీ బస్సును అడ్డుకునేందుకు ప్రయత్నించిన 13 మంది తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వైరా, కొణిజర్ల, జూలురుపాడు, కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్యబ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రైవేటు కార్యాలయాలు మూసివేశారు. మండల కేంద్రాలలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి తమ నిరసనను తెలిపారు. -
సమైక్యవాదాన్ని బలంగా వినిపించాం: ఏపీఎన్జీవోలు
హైదరాబాద్: ఏపిఎన్జీఓల ఆధ్వర్యంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్‌లోని ఎల్బి స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సమైక్య సభ విజయవంతం అయిందని ఏపీఎన్జీవోలు పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో తాము సమైక్యవాదాన్ని బలంగా వినిపించామని చెప్పారు. తాము ఏర్పాటుచేసిన ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. విభనపై గత కొన్నిరోజులుగా సాగుతున్న సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. విభజన విషయమై టీఎన్జీవోలతో చర్చలు జరిపేందుకు ఏపీఎన్జీవోలు సిద్ధమేనని చెప్పారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోనూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో సదస్సు నిర్వహిస్తే స్వాగతిస్తామని ఏపీఎన్జీవోలు స్పష్టం చేశారు. కాగా, ఏపి ఎన్జీఓల సమైక్య సభకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ కూడా విజయవంతమైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావులేకుండా ఒక పక్క తెలంగాణ బంద్, మరో పక్క సమైక్యాంధ్ర బహిరంగ సభ ప్రశాంతంగా జరిగిపోయాయి. పోలీసులకు టెన్షన్ తగ్గింది. బహిరంగ సభ మూడు గంటల 20 నిమిషాల సేపు సాగింది. ఉదయం 10 గంటల నుంచి స్టేడియం దగ్గర సందడి మొదలైంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు సీమాంధ్ర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. మహిళా ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
ఆంధ్రా బస్సుపై తెలంగావాదుల దాడి, ఒకరికి గాయాలు
హైదరాబాద్ : తెలంగాణ బంద్ పలుచోట్ల ఉద్రిక్తతలకు దారి తీసింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన మూడు బస్సులను తెలంగాణవాదులు శనివారం అడ్డుకున్నారు. హయత్‌నగర్ వద్ద బస్సులను ఆపి ప్రయాణికులు అల్పాహారం చేస్తున్న సమయంలో తెలంగాణవాదులు అక్కడకు చేరుకుని బస్సు టైర్లలో గాలి తీసివేశారు. మరోవైపు దిల్సుఖ్నగర్ వద్ద ఆంధ్రా ప్రాంతానికి చెందిన బస్సుపై తెలంగాణవాదులు దాడి చేశారు. బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఒకరు గాయపడ్డారు. ఇక నల్గొండ జిల్లా చర్లపల్లి బైపాస్ రోడ్డుపై తెలంగాణ జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. దాంతో జిల్లా జేఏసీ ఛైర్మన్ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. -
ఓవైపు సమైక్య సభ.. మరోవైపు ‘టి’ బంద్
-
తెలంగాణ జిల్లాల్లో కొనసాగుతున్న బంద్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపుతో శనివారం తెలంగాణ జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. అర్థరాత్రి నుంచే తెలంగాణ వాదులు రోడ్లెక్కారు. బస్సుల రాకపోకల్ని అడ్డుకున్నారు. ఇక తెలంగాణలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దాంతో బస్సులు లేక ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సందట్లో సడేమియాలా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. రాజధానిని కలిపే అన్నిదారులను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. -
హైదరాబాద్ పరిణామాలపై కేంద్రం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో ఏపీఎన్జీవోలు శనివారం హైదరాబాద్‌లో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో సమైక్య సభ నిర్వహిస్తుండటం.. మరోవైపు దానికి ప్రతిగా అన్నట్లు తెలంగాణ జేఏసీ అదే రోజు తెలంగాణ బంద్‌కు పిలుపునివ్వటం వంటి పరిణామాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. శనివారం రాష్ట్ర రాజధానిలో చోటుచేసుకోగల పరిణామాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు చేపట్టే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. -
తెలంగాణ బంద్‌కు సై..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, డీజీపీ దినేశ్‌రెడ్డి వైఖరికి నిరసనగా తెలంగాణ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు ప్రభావం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచే కనిపించింది. బంద్ పిలుపు నేపథ్యంలో ఆర్టీసీ డిపోలు, బస్సుస్టేషన్లు, రైల్వే స్టేషన్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ విజయకుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. బంద్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు టీఎంయూ, ఈయూ పిలుపునిచ్చాయి. దీంతో తిరుపతి, బెంగళూరుకు వెళ్లే దూ ర ప్రాంత సర్వీసులను డిపోల నుంచి బయటకు తీసేందుకు సిబ్బంది నిరాకరించారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ జిల్లావ్యాప్తంగా టీజేఏసీ, టీఆర్ఎస్, ఇతర సంఘాలు పలుచోట్ల ర్యాలీలు నిర్వహించాయి. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ర్యాలీ తీసేందుకు ప్రయత్నించిన టీజేఏసీ నేతలను పోలీసు యాక్టు-30 ఉల్లంఘించారంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. బంద్‌ను విజయవంతం చేయాలంటూ సంగారెడ్డిలో టీజేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. టీజేఏసీ, టీఎన్జీఓస్ యూనియన్, టీఆర్ఎస్, సీపీఐతో పాటు ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరసన ప్రదర్శనలకు పిలుపు బంద్ సందర్భంగా శాంతియుత నిరసన తెలపాల్సిందిగా టీజేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. ఉద్యోగులు విధులు బహిష్కరించి సంగారెడ్డి కలెక్టరేట్ నుంచి బస్టాండు వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేందర్, అసోసియేట్ అధ్యక్షుడు శ్యాంరావు వెల్లడించారు. తాలూకా, మండల కేంద్రాల్లో ఉద్యోగులు నిరసన తె లపాల్సిందిగా పిలుపునిచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి జరిగే బంద్‌లో పాల్గొనాల్సిందిగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మంద పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. -
ఓయూ, జేఎన్టీయూహెచ్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బంద్ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్, ఉస్మానియా వర్సిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తె లిపారు. జేఎన్టీయూహెచ్ పరిధిలో వాయిదా వేసిన సీసీసీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు వాయిదా పడిన ఉస్మానియా వర్సిటీ దూరవిద్య ఎంబీఏ పరీక్షలు ఈ నెల 26న, ఎంసీఈ పరీక్షలు అక్టోబర్ 13న నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. -
చీమ చిటుక్కుమనొద్దు: టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జేఏసీ బంద్ పిలుపు సందర్భంగా హైదరాబాద్‌లో చీమ చిటుక్కుమనకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ ఇన్‌చార్జీలతో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ ముఖ్యనేతలు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, టి.హరీష్‌రావు, కె.స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ సమావేశమయ్యారు. బంద్ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా, క్రియాశీలంగా ఉండాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు సాకారమవుతున్న ఈ కీలక సమయంలో రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతాయని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ సమయంలో హింస జరిగితే తెలంగాణ ఏర్పాటుపై ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందన్నారు. విధ్వంసాలు, హింసకు తావు ఇవ్వకుండా శాంతియుతంగా బంద్‌ను, సంపూర్ణంగా నిర్వహించడానికి టీఆర్ఎస్ పెద్దన్న పాత్రను పోషించాలని ఇన్‌చార్జీలకు పార్టీ నేతలు సూచించారు. ఏం జరిగినా సీఎందే బాధ్యత: నాయిని నర్సింహారెడ్డి ఏపీఎన్జీఓ సభ, తెలంగాణ బంద్ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ముఖ్యమంత్రి కిరణ్‌దే బాధ్యతని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ సభలకు అనుమతినివ్వకుండా, తెలంగాణకు వ్యతిరేకంగా జరుగుతున్న సభకు సీఎం, డీజీపీ అనుమతినిచ్చినందుకు నిరసనగా తెలంగాణ బంద్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. ఎల్బీ స్టేడియం నిండిపోయిన తర్వాత బయట ఏమైనా సమస్యలు తలెత్తినా, రెచ్చగొట్టే చర్యలకు దిగి ఏమైనా జరిగితే సీఎం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని నాయిని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు దాసోజు శ్రవణ్ అన్నారు. బంద్ వ్యూహంపై జీహెచ్ఎంసీ పార్టీ ఇన్‌చార్జీలతో వ్యూహంపై చర్చించామని శ్రవణ్ వివరించారు. తెలంగాణకు హక్కులే లేవా...? : ఈటెల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యక్తీకరించే సభలపై ఆంక్షలు విధిస్తూ, తెలంగాణను వ్యతిరేకించే సభలకు హైదరాబాద్‌లోనే అనుమతిస్తూ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతున్నారని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆయున శుక్రవారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు హక్కుల్లేవా?, తెలంగాణ ప్రజలవి జీవితాలే కావా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెలంగాణ గడ్డమీద పెట్టుకునే సభకు తావుు వ్యతిరేకమేనని ప్రకటించారు. శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వనందకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. -
నేడు తెలంగాణ బంద్
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి వైఖరికి నిరసనగా, పార్లమెంట్లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం చేపట్టనున్న బంద్‌కు పలు సంఘాలతోపాటు టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పక్షాలు సంపూర్ణ మదతు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జేఏసీ, విద్యార్థి, న్యాయవాద, డాక్టర్ల సంఘాలు బంద్ విజయవంతానికి ప్రచారం నిర్వహించాయి. బంద్‌ను విజయవంతం చేయూలని శాంతి ర్యాలీలతో కదం తొక్కారుు. తెలంగాణ సభకు అనుమతినివ్వకుండా హైదరాబాద్‌లో సీమాంధ్ర సభలకు అనుమతినిస్తున్న సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి తీరును ఎండగట్టారుు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థల యజమానులు, ఆటోయూనియన్లు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారుు. ఈ సందర్భంగా టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వాములు కావాలని కోరారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, మొలుగూరి బిక్షపతి బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చంద్రన్న, ఆర్టీసీ ఎన్ఎంయూ రిజినల్ కార్యదర్శి సీహెచ్.యాకస్వామి, టీఎంయూ రాష్ట్ర చైర్మన్ తిరుపతయ్య, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నల్లెల రాజయ్య, జనగామ కుమారస్వామి బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌కు ప్రైవేట్ పాఠశాలల యజమానులు మద్దతు ప్రకటించారు. బంద్‌లో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా, బంద్ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా బస్స్టేషన్లు, రైల్లేస్టేషన్లు, ప్రధాన సెంటర్లలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సెంట్రల్ జైలులో నక్సలైట్ ఖైదీలు కూడా తెలంగాణకు మద్దతుగా దీక్షలు చేపట్టారు. -
కిరణ్ డెరైక్షన్లోనే ‘సమైక్యాంధ్ర’
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి దర్శక నిర్మాతగా మారా రని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న ఆయన.. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత మాటమార్చి సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నారని మర్శించారు. మరోసారి అడ్డుకునే కుట్ర గతంలో కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రకటన చేస్తే అడ్డుకున్న సీమాంధ్ర నాయకులు ప్రస్తుతం మరోసారి అదే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖరాశారని, ఇప్పుడు మాట మా ర్చి ప్రజల ఆకాంక్షను అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్రుల సభకు అనుమతి ఇవ్వడం వెనుక సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డీజీపీ దినేశ్‌రెడ్డిల కుట్ర దాగుందన్నారు. హైదరాబాద్ తెలంగాణదే అని, కేంద్ర పాలిత ప్రాంతానికి ఒప్పుకునేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ బంద్ విషయమై జేఏసీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అయినా పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు. పదవినుంచి తొలగించాలి తెలంగాణకు ద్రోహం చేస్తున్న ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యు డు పల్ల వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యక్రమా ల్లో భాగంగా ఈనెల 23వ తేదీన జిల్లాలో సైకిల్‌యాత్ర నిర్వహించనున్నామన్నారు. వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో కలెక్టరేట్ ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వేల్పూర్ భూమయ్య, నాయకులు ఓమయ్య, ఎనుగందుల మురళి, రాజు గౌడ్, సుధాకర్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు -
ఓవైపు సమైక్య సభ.. మరోవైపు ‘టి’ బంద్
ఒకవైపు ‘సమైక్య’ సభ... మరోవైపు ‘విభజన’ బంద్... రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో శనివారం ఏం జరుగుతుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీఎన్జీవోలు తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరగటానికి ముందు రోజు శుక్రవారం.. సీమాంధ్ర, తెలంగాణవాద న్యాయవాదుల మధ్య ఘర్షణతో రాష్ట్ర హైకోర్టు రణరంగంగా మారటంతో.. టెన్షన్ తారస్థాయికి చేరింది. రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం చేపట్టగా.. శాంతిర్యాలీకి అనుమతి నిరాకరించటానికి నిరసనగా తెలంగాణ న్యాయవాదులు చలో హైకోర్టు కార్యక్రమం చేపట్టటం సీమాంధ్ర న్యాయవాదులు, తెలంగాణ న్యాయవాదుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు సీమాంధ్ర న్యాయవాదులు గాయాలపాలయ్యారు. శనివారం ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోల సభ జరగనుండటం.. అదే రోజు తెలంగాణ జేఏసీ హైదరాబాద్ సహా తెలంగాణ బంద్ పాటిస్తుండటంతో.. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసుశాఖ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్న ఏపీఎన్జీవోల సభను సాయంత్రం ఐదు గంటలకల్లా ముగించాలని స్పష్టంచేసింది. స్టేడియాన్ని పారా మిలటరీ బలగాలు అధీనంలోకి తీసుకోగా.. అక్కడికి రెండు కిలోమీటర్ల పరిధిలో పెద్ద ఎత్తున బారికేడ్లు, ముళ్లకంచెలతో నాలుగంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యోగులను మాత్రమే వారి గుర్తింపు కార్డులను తనిఖీచేసి స్టేడియంలోకి అనుమతించనున్నారు. సమైక్య సభను వ్యతిరేకిస్తున్న తెలంగాణవాద సంఘాలు కొన్ని.. సీమాంధ్రులపై దాడులు చేసైనా సభను అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో.. విజయవాడ, కర్నూలు, మహబూబ్‌నగర్ వైపు నుంచి హైదరాబాద్ వచ్చే జాతీయ రహదారుల్లో గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు, రహదారులపై మొబైల్ పార్టీలతో నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్లలో కూడా బందోబస్తు పటిష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఏపీఎన్జీవోల సభకు సీమాంధ్ర నుంచి ఉద్యోగులు భారీగా తరలివస్తున్నారు. రైలు, రోడ్డు మార్గాల్లో వేల సంఖ్యలో ప్రయాణమయ్యారు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ వచ్చే అన్ని రైళ్లూ శుక్రవారం ఆ ప్రాంత ఉద్యోగులతో నిండిపోయాయి. -
నిలిచిపోయిన రవాణా వ్యవస్ధ
-
ప్రకాశం జిల్లాలో బంద్ ప్రశాంతం