నేడు తెలంగాణ బంద్
- టీజేఏసీ, సీపీఐ, సీపీఎం,న్యూడెమోక్రసీ మద్దతు
- కుల, ప్రజా సంఘాల మద్దతు
కరీంనగర్ : పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు టీజేఏసీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని ఆయూ పార్టీల నాయకులు విమర్శించారు. లక్షలాది మంది గిరిజనులను నిరాశ్రయుల్ని చేసేలా వ్యవహరించిన కేంద్రం తీరును నిరసిస్తూ జరిగే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు బంద్‌కు బాసటగా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జేవీ చలపతిరావు, టీజేఏసీ జిల్లా కన్వీనర్ జె.రవీందర్, కోఆర్డినేటర్ జక్కోజి వెంకటేశ్వర్లు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుర్రాల రవీందర్, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడీ సుదర్శన్, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు వేర్వేరు ప్రకటనల్లో బంద్‌కు పిలుపునిచ్చారు.