T.congress
-
కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్
-
టీఆర్ఎస్ను టార్గెట్ చేయడంలో వ్యూహం లేదా
-
టీడీపీలో చేరనున్న జయసుధ!
-
టీడీపీలో చేరనున్న జయసుధ!
హైదరాబాద్: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీలో ఆమె చేరనున్నారని సమాచారం. శనివారం సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జయసుధ భేటీ అయ్యారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా జయసుధ ఉంటున్నారు. టీఆర్ఎస్లో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారని అంతకుముందు ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు బుజ్జగించడంతో ఆమె వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జయసుధ అప్పట్లో ప్రకటించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జయసుధ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నిజాయితీ వుంటే ప్రశంసించండి కానీ...
-
టీకాంగ్రెస్ ఇంకా గాడిన పడలేదా ?
-
కాంగ్రెస్‌కు సవాల్‌గా మారిన GHMC ఎన్నికలు
-
డైలమాలో ’హస్తం’
-
నేడు బంద్
- టీజేఏసీ, వామపక్షాల పిలుపు - సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ - పార్లమెంట్లో పోలవరం ఆర్డినెన్స్ - ఆమోదంపై ఎగిసిన నిరసన జ్వాల వరంగల్ : పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర ప్రాంతంలో కలుపుతూ పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్విజన బిల్లులో చేసిన సవరణలకు ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ తెలంగాణ జేఏసీ, వామపక్షాలు శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను తీవ్రంగావ్యతిరేకించాలని కోరారు. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం తెలంగాణవాదులు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్డీయే ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని పలు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత దొడ్డిదారిలో సవరణకు ఆర్డినెన్స్ తెచ్చి కుట్రలు చేసిందని దుయ్యబట్టారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, పోరుబాట పట్టి కేంద్ర మెడలు వంచుతామన్నారు. నేటి బంద్‌కు ఆర్టీసీ, వ్యాపార వాణిజ్యవర్గాలు, విద్యాసంస్థలు, ప్రజలు సహకరించాలని కోరారు. బంద్‌ను జయప్రదం చేసి కేంద్రానికి కనువిప్పు కలిగించాలని తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్, ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శులు చంద్రన్న, మండల వెంకన్న, సీపీఎం నగర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ పంచాయత్‌రాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సాదుల ప్రసాద్ తదితరులు బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేతలు వైఖరి స్పష్టం చేయాలి : తక్కళ్లపల్లి పోలవరం ఆరినెన్స్పై తెలంగాణ తెలుగుదేశం నాయకులు తమ వైఖరిని స్పష్టం చేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడి ఒత్తిడితోనే కేంద్రప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిందన్నారు. ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ కేంద్రం తెచ్చిన అక్రమ ఆర్డినెన్స్‌పై టీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందన్నారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్న చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతారో... తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తారో స్పష్టం చేయాలని టీ టీడీపీ నేతలను నిలదీశారు. అదేవిధంగా బీజేపీ నాయకులు తమ పార్టీపై ఒత్తిడి చేసి ఆర్డినెన్స్‌ను రద్దు చేయించి గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాలని ఆయన కోరారు. చంద్రబాబు ఏం చెబుతారు.. ఆంధ్ర ప్రాంతానికి ఎన్డీయే ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తోందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. హన్మకొండలోని ఆమె నివాసంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ ఎంపీలు అడ్డుకున్నా టీ టీడీపీ, బీజేపీ ఎంపీలు అడ్డుకోకుండా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ విప్‌జారీ చేసి మరీ బిల్లుకు మద్దతు ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు తనకు సమానమంటూ చెప్పే చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. 14, 15న కోర్టు విధుల బహిష్కరణ వరంగల్ లీగల్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీపై యథాతథ స్థితి (స్టెటస్కో) కొనసాగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా, పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 14,15న విధులు బహిష్కరించనున్నట్లు బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుడిమల్ల రవికుమార్ తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర్ర పభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తూ గిరిజన ప్రజలపై కక్షసాధించే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముంపు గ్రామాలను కల్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. 14న జిల్లా కోర్టు ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని, 15న జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదుల ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. -
నేడు తెలంగాణ బంద్
- టీజేఏసీ, సీపీఐ, సీపీఎం,న్యూడెమోక్రసీ మద్దతు - కుల, ప్రజా సంఘాల మద్దతు కరీంనగర్ : పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం బిల్లు ఆమోదాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు టీజేఏసీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడం అప్రజాస్వామికమని ఆయూ పార్టీల నాయకులు విమర్శించారు. లక్షలాది మంది గిరిజనులను నిరాశ్రయుల్ని చేసేలా వ్యవహరించిన కేంద్రం తీరును నిరసిస్తూ జరిగే బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు బంద్‌కు బాసటగా నిలవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జేవీ చలపతిరావు, టీజేఏసీ జిల్లా కన్వీనర్ జె.రవీందర్, కోఆర్డినేటర్ జక్కోజి వెంకటేశ్వర్లు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుర్రాల రవీందర్, దళిత లిబరేషన్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు మార్వాడీ సుదర్శన్, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు వేర్వేరు ప్రకటనల్లో బంద్‌కు పిలుపునిచ్చారు. -
నేడు తెలంగాణ బంద్
పోలవరం బిల్లుకు నిరసనగా టీజేఏసీ పిలుపు టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా మద్దతు బోనాల నేపథ్యంలో సికింద్రాబాద్‌కు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: పోలవరం బిల్లు ఆమోదానికి నిరసనగా శనివారం తెలంగాణ బంద్‌కు టీ-జే ఏసీ పిలుపునిచ్చింది. ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే సవరణ బిల్లుకు శుక్రవారం లోక్‌సభలో ఆమోదం లభించిన నేపథ్యంలో టీ-జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కార్యాలయంలో అత్యవసర భేటీ జరిగింది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాల సరిహద్దులను కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మార్చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. నీటి లభ్యత, పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణ వంటి కీలక అంశాలను పట్టించుకోకుండా ఏడు మండలాల గిరిజనులను పోలవరంలో ముంచేయాలని కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇందుకు నిరసనగా శనివారం తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. బోనాల దృష్ట్యా ఈ బంద్ నుంచి సికింద్రాబాద్‌ను మినహాయించారు. కాగా, బంద్‌కు మద్దతిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యపై అన్ని రకాలుగా పోరాడుతామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్ తెలిపారు. బంద్‌లో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవరంపై కేంద్రం తొందరపాటు చర్య తీసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా టీ-జేఏసీ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. కాగా, పార్లమెంట్లో పోలవరం బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న తరుణంలో అఖిలపక్ష బృందంతో సీఎం కేసీఆర్ ఢిల్లీకి రాకపోవడం బాధాకరమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఒంటెద్దు పోకడతో తెలంగాణకు కేంద్రం అన్ని విధాలా అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఇక లోక్‌సత్తా కూడా కేంద్రాన్ని తప్పుబట్టింది. ఎన్డీయే ప్రభుత్వం తప్పటడుగులు వేయడం ప్రారంభించిందని పార్టీ అధ్యక్షుడు కె.ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం చర్య దుర్మార్గమని, గిరిజనులకు శాపమని సీపీఎం, సీపీఐ నేతలు ధ్వజమెత్తాయి. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. అంతకుముందు న్యూడెమొక్రసీ కార్యాలయంలో లెఫ్ట్ పార్టీల నేతలు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. బంద్‌కు తాము కూడా మద్దతిస్తున్నట్లు న్యూ డెమొక్రసీ నేతలు సాధినేని వెంకటేశ్వర్రావు, కె.గోవర్ధన్ తెలిపారు. -
రేపు తెలంగాణ బంద్!
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ (టీజేఏసీ), సీపీఐ పిలుపునిచ్చాయి. రేపటి బంద్ కు అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష టి.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీల ఆందోళనల మధ్య పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కలపడాన్ని నిరసిస్తూ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. -
ఎర్రబెల్లిని తిడితే నాలుక్కోస్తాం
టీడీపీ ఎంపీ సి.ఎం.రమేష్‌కు టీ కాంగ్రెస్ ఎంపీల హెచ్చరిక సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు బాసటగా నిలిచారు. ఎర్రబెల్లిని తిడితే ఊరుకునేది లేదని, నాలుక కోస్తామని టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్‌ను హెచ్చరించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు లేకపోతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి జీరో అవుతుందని ఎద్దేవా చేశారు. శనివారం తన నివాసంలో ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలిపిన ఎర్రబెల్లికి అక్షరజ్ఞానం లేదని అంటావా? రాజకీయ విజ్ఞత లేని నీవు ఎంపీ సీటు సహా దేన్నైనా డబ్బుతో కొనుక్కోవచ్చనే విధంగా మాట్లాడుతావా? ఇంకోసారి ఇట్లాగే మాట్లాడితే నీ నాలుకకు ఉప్పు, పసుపు పెట్టి పలుచగా చేస్తాం’’అని హెచ్చరించారు. టీడీపీలో ఉన్న తెలంగాణ నేతలకు చీమూ నెత్తురూ ఉంటే వెంటనే పార్టీ నుంచి బయటకు రావాలన్నారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సీఎం కిరణ్ ఫొటోలు, ఫ్లెక్సీలను ఇకపై ఏ కార్యక్రమాలకూ తెలంగాణ నాయకులు ఉపయోగించవద్దని పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలో 371(డి) అధికరణ అడ్డంకి కాదని పేర్కొంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ కేంద్ర హోంమంత్రి షిండేకు పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.