![టీడీపీలో చేరనున్న జయసుధ! - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41435011307_625x300_2.jpg.webp?itok=It6fH8hl)
టీడీపీలో చేరనున్న జయసుధ!
హైదరాబాద్: సినీ నటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. టీడీపీలో ఆమె చేరనున్నారని సమాచారం. శనివారం సాయంత్రం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో జయసుధ భేటీ అయ్యారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ తో అంటీముట్టనట్టుగా జయసుధ ఉంటున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరడానికి ఆమె రంగం సిద్ధం చేసుకున్నారని అంతకుముందు ప్రచారం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా సీనియర్ నేతలు బుజ్జగించడంతో ఆమె వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతానని జయసుధ అప్పట్లో ప్రకటించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జయసుధ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.