రేపు తెలంగాణ బంద్!
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ జేఏసీ (టీజేఏసీ), సీపీఐ పిలుపునిచ్చాయి. రేపటి బంద్ కు అధికార టీఆర్‌ఎస్ పార్టీ, ప్రతిపక్ష టి.కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాయి.
తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ఎంపీల ఆందోళనల మధ్య పోలవరం ఆర్డినెన్స్ బిల్లుకు శుక్రవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదంతో ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఏపీలో విలీనం కానున్నాయి. ఖమ్మం జిల్లాలోని ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ కలపడాన్ని నిరసిస్తూ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు.