సాక్షి, ముంబై: పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బంద్‌కు మద్దతుగా గురువారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ అంబేద్కర్ నగర్‌లో ముంబై టీ జాక్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ చేపట్టిన రాష్ట్ర బంద్‌కు ముంబైకర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని టీఆర్‌ఎస్ ముంబై శాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బోల్లె వెల్లడించారు.
ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని జాక్ కన్వీనర్ బి. ద్ర విడ్ మాదిగ డిమాండ్ చేశాడు. ఈ ప్రదర్శనలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులుగా నిజామాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి తో పాటు భివండీ నుంచి బోగ సుదర్శన్ పద్మశాలి, గాది లక్ష్మణ్, జి. ఏసుదాస్, జి. లక్ష్మణ్ మాదిగ, కె. శేఖర్ మాదిగ, రామగిరి శంకర్, కె. సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక నాయకుల ఖండన
ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్‌ను ముంబై మిల్లు కార్మిక నాయకుడు గన్నారపు శంకర్ ఖండించారు. వెంటనే ఆర్డినెన్స్‌ను తిరిగి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ బంద్‌కు ముంబైకర్ల మద్దతు
Published Thu, May 29 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement
Advertisement