ఈనెల 9వరకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | One day before the end of telangana assembly session | Sakshi
Sakshi News home page

ఈనెల 9వరకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published Tue, Oct 6 2015 11:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

One day before the end of telangana assembly session

హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఒకరోజు కోత పడింది. ఈ నెల 9వ తేదీ వరకే సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఒకరోజు ముందుగానే సమావేశాలు ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అక్టోబర్ 10 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

 

అయితే రైతు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఈనెల 9 వరకు గడువు ఇస్తున్నామని, ఆలోపు ప్రభుత్వం అనుకూలంగా స్పందించకపోతే 10వ తేదీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కుదింపు ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement